పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.


