సినిమాల్లో ఐటం సాంగ్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్ అనగానే హీరోయిన్ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్ చేస్తున్నారు.
అవసరం లేకపోయినా..
పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్‌లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్ సాంగ్స్‌ను కావాలని ఇరికిస్తున్నారు.
చిన్నపిల్లలు కూడా..
ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్‌ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు.
సినిమా
ఎవరూ ఆ లిరిక్స్ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్‌లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్, అర్థ్, ఖాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌లో మెరిసింది.
చదవండి: పవన్ కల్యాణ్ డూప్‌గా హరీశ్ శంకర్? డైరెక్టర్ ఏమన్నారంటే?


