'స్పిరిట్' అన్న పేరు వినిపిస్తే చాలు ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎక్కడలేని సంతోషం వస్తుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ ఓ ఫోటో తెగ వైరలయింది. అందులో నటుడి ఫేస్ కనిపించకుండా వెనక నుంచి పిక్ తీశారు. దీంతో ఆయన ప్రభాస్ అని చాలామంది భావించారు.
ఫోటో వైరల్
కానీ ఆయన డార్లింగ్ ప్రభాస్ కాదని, ఆ ఫోటో తనది అంటున్నాడు నటుడు శివ గణేశ్. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శివ గణేశ్ ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్‌లో వెనక నుంచి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా ప్రభాస్ ఫోటో అని వైరల్ అయింది.

ఎందుకు వైరల్ అయిందో..
దీనిపై శివ గణేశ్ స్పందిస్తూ.. నేను చేస్తున్న సినిమాలోని మేకింగ్ ఫోటో అది. మా డైరెక్టర్ ప్రభాస్ ఫ్యాన్. అలా అని నన్ను ప్రభాస్‌లా చూపించాలనుకోలేదు. కానీ, అది అనుకోకుండా కుదిరింది. మూడురోజుల క్రితం నా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేశాడు. ఇది ప్రభాస్ ఫోటో అని ట్విటర్‌లో వైరలవుతోంది, నువ్వే కదా? అని అడిగాడు. నేనే అని బదులిచ్చాను. కానీ, ప్రభాస్ ఫోటో అని ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్థం కాలేదు.
సినిమా
నేను భీమవరంలో పుట్టిపెరిగాను. ప్రభాస్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో నన్ను పోల్చినందుకు సంతోషంగా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చాడు. ఇతడు పుష్ప 2, ఖుషి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల్లోనూ యాక్ట్ చేసినప్పటికీ ఎడిటింగ్‌లో తీసేశారు. ప్రస్తుతం ఇతడు ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తున్నాడు.


