ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ వారసుడు | Thalapathy Vijay Son Jason Changed his surname | Sakshi
Sakshi News home page

ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ వారసుడు

Mar 12 2026 12:39 PM | Updated on Mar 12 2026 2:06 PM

Thalapathy Vijay Son Jason Changed his surname

నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) అధినేత కుమారుడు జాసన్‌ సంజయ్‌ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నాడు. ఇప్పుడు ఈ అంశం తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌ భార్య సంగీత  విడాకులు కోరుతూ ఇటీవల చెంగలపట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  తనతో పాటు పిల్లలకు జీవన భృతి చెల్లించేలా విజయ్‌ను ఆదేశించాలని కోరారు. కాగా విజయ్, సంగీత దంపతులకు జాసన్‌ సంజయ్, దివ్యషా పిల్లలు ఉన్నారనే విషయం తెలిసిందే.

జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సిగ్మా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం టైటిల్‌ కార్డులో తన తండ్రి విజయ్‌ ఇన్షియల్‌( ఇంటి పేరు)ను తొలగించడంతో పాటూ తన తల్లి పేరు సంగీత ఇన్షియల్‌ వచ్చే విధంగా ఎస్‌ను చేర్చుకున్నారు. ఇంతకు ముందే తన ఇన్‌ స్ట్రాగామ్‌లో తండ్రి విజయ్‌ ఫాలోవర్స్‌ నుంచి వైదొలిగారు. ఇప్పుడీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement