రాజేంద్ర ప్రసాద్‌ గారు.. సారీ చెప్పండి : విశాల్‌ ట్వీట్‌ | Tamil Actor Vishal Reacts To Rajendra Prasad Controversial Comments On MGR, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

రాజేంద్ర ప్రసాద్‌ క్షమాపణలు చెప్పాల్సిందే.. విశాల్‌ ట్వీట్‌ వైరల్‌

Mar 12 2026 11:48 AM | Updated on Mar 12 2026 12:48 PM

Vishal Response About Rajendra Prasad Controversy Comments On MGR

తమిళుల ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. ‘కత్తి కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. కాంతారావు నటనను పొగిడే క్రమంలో ఎంజీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారావుని చూసి ఎంజీఆర్‌ భయపడ్డారంటూ రాయడానికి వీల్లేని ఓ పదాన్ని వాడారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ స్పందించారు. ఎంజీఆర్‌పై రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెబుతూ..వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుతూ ట్వీట్‌ చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమలోని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను చూసి, విని దిగ్భ్రాంతికి గురయ్యాను. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరుగాంచిన దివంగత దిగ్గజ నటుడు ఎంజీఆర్ గురించి మీరు చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ ఈ ట్వీట్ రాస్తున్నాను.

దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం బాగుంది. కానీ ఆయనను పొగిడేందుకు మరొక దిగ్గజ నటుడు ఎంజీ రామచంద్రన్ గారిని కించపరచడం తగదు. ఆయన్ను ఆరాధించే ప్రజల మనోభావాలను గాయపరచడం మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, ముఖ్యమైనదో మీకు బాగా తెలుసు. ఈ వివాదానికి మీరు ముగింపు పలకాలని అభ్యర్థిస్తున్నాను. మీరు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నందుకు మన్నించండి. ఎవరైనా మీ స్థాయి నటుల గురించి భవిష్యత్తులో  చెడుగా మాట్లాడితే... నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను. కాబట్టి మీరు ఈ విషయంపై క్షమాపణ చెబుతున్నారని చెప్పడానికి సారీ చెబుతున్నాను. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను'అని విశాల్‌ ట్వీట్‌ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement