ధురందర్‌ 2 టికెట్‌ రేటు రూ. 3100 | Dhurandhar-2: Ranveer Singh movie ticket price above 3000 Rupees | Sakshi
Sakshi News home page

ధురందర్‌ 2 టికెట్‌ రేటు రూ. 3100

Mar 11 2026 11:29 PM | Updated on Mar 12 2026 5:38 AM

Dhurandhar-2: Ranveer Singh movie ticket price above 3000 Rupees

భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లోని ఒక ప్రత్యేక స్క్రీన్‌లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్‌లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్‌లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.  

దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement