భర్తకు హన్సిక విడాకులు.. భరణం ఆశించని హీరోయిన్‌ | Hansika Motwani, Sohael Khaturiya Divorced, Alimony Is? | Sakshi
Sakshi News home page

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం లేకుండానే!

Mar 11 2026 5:27 PM | Updated on Mar 11 2026 6:14 PM

Hansika Motwani, Sohael Khaturiya Divorced, Alimony Is?

హీరోయిన్‌ హన్సిక మొత్వానీ నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. భర్త, వ్యాపారవేత్త సోహెల్‌ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి ఎలాంటి భరణం అడగకుండానే హన్సిక విడాకులు కోరడం గమనార్హం!

రెండేళ్ల నుంచే వేర్వేరుగా
తమ మధ్య చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయని, ఒకే ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉందని హన్సిక పిటిషన్‌లో పేర్కొంది. 2024 జూలై 2 నుంచే వీరు విడివిడిగా జీవిస్తున్నట్లు హన్సిక తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా హన్సిక 2022 డిసెంబర్‌ 4న సోహెల్‌ను పెళ్లాడింది. ఇది హన్సికకు మొదటి పెళ్లి కాగా అతడికి రెండోది కావడం గమనార్హం! హన్సిక - సోహెల్‌ వివాహ వేడుకకు రాజస్థాన్‌లోని జైపూర్‌ ప్యాలెస్‌ వేదికగా నిలిచింది. పెళ్లయి రెండేళ్లు కూడా కాకముందే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చాలాకాలంగా వేర్వేరుగా జీవిస్తున్న వీరు ఇప్పుడు విడాకులతో దూరమయ్యారు.

సినిమా
హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్‌, దేనికైనా రెడీ, పవర్‌.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్‌ చేసింది.

చదవండి: సర్జరీ ఫెయిల్‌, దేవుడి ముందు మోకరిల్లి: కమెడియన్‌

Advertisement
 
Advertisement
Advertisement