విషాదం.. సినీ నటుడు గిరిబాబు కన్నుమూత | Tollywood Actor Giribabu Passed Away | Sakshi
Sakshi News home page

విషాదం.. సినీ నటుడు గిరిబాబు కన్నుమూత

Nov 14 2026 4:04 PM | Updated on Nov 14 2026 4:14 PM

Tollywood Actor Giribabu Passed Away

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం నెలగొంది. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గిరిబాబు(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు.

 చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటిస్తూ తనలోని కళాకారుడిని గుర్తించారు. సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లారు. 1973లో విడుదలైన 'జగమే మాయ' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఏకంగా 600లకు పైగా సినిమాల్లో నటించారు.

విలన్‌గా ప్రత్యేక గుర్తింపు..
ప్రారంభలో హీరోగా తర్వాత ప్రతినాయక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత హస్య, కుటుంబ కథ చిత్రాల్లోనూ విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. 'కురుక్షేత్రం', 'కరుణామయుడు' వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement