13 ఏళ్ల ప్రేమ.. వేర్వేరు వ్యక్తులతో డేటింగ్‌ కూడా చేశాం : కాజల్‌ | Kajal Aggarwal About Her Lovestory | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal Love Story : అదే మా ఇద్దరినీ కలిపింది: కాజల్

Nov 14 2026 3:27 PM | Updated on Nov 14 2026 3:45 PM

Kajal Aggarwal About Her Lovestory

ఇటీవలే ‘రామాయణం’తో ప్రేక్షకులను పలకరించింది కాజల్‌ అగర్వాల్‌. యశ్‌ సతీమణిగా మెప్పించింది. అయితే తాజాగా తన భర్త గౌతమ్‌ కిచ్లుతో తన ప్రయాణం, ప్రేమపై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పుడీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

గుడ్‌బై చెప్పుకోవాలి
‘ ఓ స్నేహితుడి పెళ్లిలో మేము పరిచయం అయ్యాం. దాదాపు 13 ఏళ్లు ప్రేమించుకున్నాం. కొన్ని సమస్యల వల్ల విడిపోయాం. తర్వాత ఎవరి దారి వారు చూసుకుని.. వేర్వేరు వ్యక్తులతో డేటింగ్‌ కూడా చేశాం. అయితే తర్వాత మళ్లీ కలిశాం. ఒకరి విలువ ఒకరికి తెలియడానకే మేము వేరే వాళ్లతో డేటింగ్‌ చేశామేమో. చివరికి మళ్లీ ఒక్కటయ్యాం. అయితే రెండోసారి దగ్గరయ్యాక గౌతమ్‌తో ఒక మాట చెప్పాను.

 ‘ఓకే బాస్‌, ఈసారి మనం కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. లేదంటే శాశ్వతంగా గుడ్‌బై చెప్పుకోవాలి’ అని చెప్పాను. అయితే గౌతమ్‌ కూడా అదే ఆలోచనతో ఉండడంతో మేము వివాహం చేసుకున్నాం’ అని కాజల్‌ చెప్పుకొచ్చారు. కాగా ఇరు కుటుంబాల అంగీకారంతో 2020 అక్టోబర్‌ 20న  కోవిడ్‌-19 నిబంధనల మధ్య ముంబైలో వీరి వివాహం జరిగింది.  వీరికి 2022లో ‘నీల్‌’ అనే అబ్బాయి పుట్టారు. 

(ఇదీ చదవండి: మన జాతిరత్నం ఓ పుస్తకం రాశారు: డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement