‘‘రామాయణం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు చేసి కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. అదే విధంగా సూర్యగారి ‘సీన్’ చిత్రం కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుని, ఆయన కెరీర్‌లోనే హయ్యస్ట్ రెవెన్యూ సాధిస్తోంది. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఇంత గొప్ప సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ రెండు సినిమాల విజయాలు నాకు, శిరీష్‌కి డబుల్ ఎనర్జీని ఇచ్చాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు.
రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామాయణం’. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ఈ నెల 5న విడుదలైంది. అదే విధంగా జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య, నజ్రియా నజీమ్ జంటగా నటించిన ‘సీన్’ ఈ నెల 6న విడుదలైంది. ‘రామాయణం’, ‘సీన్’ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ విడుదల చేశారు.
(చదవండి: సాయిపల్లవి ఫైట్స్.. 'ఓం' ట్రైలర్ చూశారా?)
ఈ రెండు సినిమాలు విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ ప్రెస్‌మీట్‌లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రామాయణం’ని విడుదల చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రాగారికి, యశ్‌గారికి థ్యాంక్స్. అలాగే ‘సీన్’ సినిమా విజయం కూడా మరింత ఆనందాన్నిచ్చింది. తిరుపతి ప్రసాద్‌గారు తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ తీసుకుని, మా ద్వారా నైజాంలో రిలీజ్ చేయించినందుకు ఆయనకు కూడా థ్యాంక్స్. నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లవుతోంది.
(చదవండి: హీరోయిన్ పెళ్లికి రెడీ.. సెలబ్రేషన్ మొదలు)
విజయాలు చూశాను... అపజయాలు చూశాను. ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను, సక్సెస్‌కు పొంగిపోను. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు మంచి చేస్తూ, మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రతి సక్సెస్ కొత్త ఎనర్జీని ఇస్తుంది. సక్సెస్ నుంచి మనం నేర్చుకోవాలి... దాన్నుంచి ఎనర్జీ తెచ్చుకోవాలన్నదే నా ఫార్ములా’’ అని పేర్కొన్నారు.


