సాయిపల్లవి ఫైట్స్.. 'ఓం' ట్రైలర్ చూశారా? | Dhanush And Sai Pallavi OM Movie Trailer | Sakshi
Sakshi News home page

OM Trailer: పోలీస్‌గా సాయిపల్లవి.. ట్రైలర్‌లో యాక్షన్

Nov 14 2026 8:51 AM | Updated on Nov 14 2026 8:51 AM

Dhanush And Sai Pallavi OM Movie Trailer

ఇప్పటివరకు సాయిపల్లవి.. క్యారెక్టర్ ఓరియెంటెడ్ మూవీస్ చాలానే చేసింది. కానీ తొలిసారి ఈమెతో ఫైట్స్ చేయించిన ఘనత దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామికే దక్కుతుంది. సాధారణంగా హీరోలు ఫైట్స్ చేస్తుంటారు. కానీ రీసెంట్ టైంలో హీరోయిన్లతోనూ డైరెక్టర్స్ డిష్యుం డిష్యుం చేయిస్తున్నారు. ఇప్పుడు 'ఓం'లో అదే జరిగింది. పోలీస్‌గా సాయిపల్లవి అదిరిపోయే యాక్షన్ చేసింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: అదో పీడకల.. దేవుడి దయ వల్ల నేను బతికాను: కాజల్ అగర్వాల్)

ధనుష్ హీరోగా చేస్తూ నిర్మించిన సినిమా 'ఓం'. ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలని పోలీసులు కాల్చేయడం అనే నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్ భార్యగా శ్రీలీల నటించగా.. ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నిర్మూలించడానికి అటు తమిళనాడు నుంచి ధనుష్ అండర్ కవర్ పోలీసుగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి సాయిపల్లవి పనిచేస్తుంది. చివరకు ఎవరు ఏం తెలుసుకున్నారనేదే కథలా ఉన్నట్లు కనిపిస్తుంది.

ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా బాగానే ఉంది. వచ్చే శుక్రవారం(నవంబర్ 20) ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్-‍త్రివిక్రమ్ విడిపోలేదు.. అవన్నీ పుకార్లు మాత్రమే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement