రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి రామాయణ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. దీపావళి కానుకగా ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. వసూళ్లు పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్త రూ. 934.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ బుధవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 70.65 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ప్రముఖ ట్రేడ్ సైట్ శాక్‌నిల్క్ ప్రకారం వారం రోజుల్లోనే ఇండియావ్యాప్తంగా రూ. 511.10 కోట్ల నెట్.. రూ. 611.05 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్‌సీస్‌లో రూ.323.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
కేరళలో రికార్డ్..
అంతేకాకుండా కేరళ బాక్సాఫీస్ వద్ద రామాయణ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆ రాష్ట్రంలో రూ. 20 కోట్ల గ్రాస్ మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. గతంలో 'ధురందర్: ది రివెంజ్' పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. మంగళవారం రోజే కేరళలో రూ. 20.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేటర్లలో విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది. గతంలోరూ. 19.50 కోట్లు రాబట్టిన 'ధురందర్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో ఆమిర్ ఖాన్ పీకే, దంగల్ చిత్రాలు మాత్రమే కేరళ బాక్సాఫీస్ వద్ద రాణించాయి.
కాగా.. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పార్ట్-1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించారు. ఈ చిత్రంలో రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో.. కాజల్ అగర్వాల్ మండోదరిగా మెప్పించారు.


