టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి లాంటి సినిమాల్లో అల్లరి నరేశ్ సరసన హీరోయిన్‌గా మెప్పించింది. అంతేకాకుండా తెలుగు బిగ్‌బాస్ సీజన్-4లో కంటెస్టెంట్‌గానూ పాల్గొంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. అలా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఈ నటి తన ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియాలో పంచుకుంది. తనకు ఇటీవలే పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించింది. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని.. తానిప్పుడు కోలుకుంటున్నానని ఆమె తెలిపింది. ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అలాగే మహిళలందరూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలని మోనాల్ గజ్జర్ సలహా ఇచ్చింది.
કેન્સરને લઈ અભિનેત્રી મોનલ ગજ્જરનો મોટો ધડાકો #MonalGajjar #CancerAwareness #GujaratiActress #HumDekhengeNews https://t.co/OE6z73TOR0
— Hum Dekhenge News (@humdekhengenews) November 12, 2026


