ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా మూవీ.. కేవలం 11 నిమిషాలే..! | We Were here Short Film Elected for Oscar Award competetion | Sakshi
Sakshi News home page

We Were here: ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా మూవీ.. కేవలం 11 నిమిషాలే..!

Nov 11 2026 8:42 PM | Updated on Nov 11 2026 8:42 PM

We Were here Short Film Elected for Oscar Award competetion

సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు ఓ లఘు చిత్రం ఎంపికైంది. కేవలం 11 నిమిషాల రన్‌ టైమ్ మాత్రమే గల ఈ సినిమా ఎంపికై ఆశ్చర్యానికు గురిచేసింది. ఈ కామెడీ షార్ట్‌ఫిల్మ్‌ తాజాగా ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఈ సినిమాకు ప్రణవ్ భాసిన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఏఐ రాకతో అనేక రంగాల్లో మనుషుల స్థానాన్ని యంత్రాలు భర్తీ చేస్తున్నాయనే అంశంతో తెరకెక్కిన లఘు చిత్రమే వి వర్‌ హియర్.

ఈ షార్ట్ ఫిల్మ్ ఏకంగా ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడనుంది. ఈ మూవీకి బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ మూవీని ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. 2026లో జరిగిన సౌత్‌ బై సౌత్‌వెస్ట్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఫెస్టివల్‌లో రెడ్‌ బ్రెస్ట్‌ అన్‌హిడెన్‌ అవార్డ్ దక్కించుకుంది. అంతేకాకుండా పామ్‌ స్ప్రింగ్స్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫెస్ట్‌-2026లోనూ సత్తా చాటింది. బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌తోపాటు బెస్ట్‌ కామెడీ షార్ట్‌ విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమా ది న్యూయార్కర్స్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement