ఓటీటీకి అవెంజర్స్ ఎండ్‌గేమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Avengers Endgame Encore Streaming On This Ott From This Date | Sakshi
Sakshi News home page

Avengers Endgame Encore: ఓటీటీకి అవెంజర్స్ ఎండ్‌గేమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nov 11 2026 6:20 PM | Updated on Nov 11 2026 6:23 PM

Avengers Endgame Encore  Streaming On This Ott From This Date

గతంలో రిలీజైన మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ పేరుతో మళ్లీ రిలీజ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఈ మూవీ కథేంటంటే..

ఈ ఎండ్‌గేమ్ కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనమవుతుంది. మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతని పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది.  ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. కాగా.. కెవిన్ ఫైజ్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement