breaking news
Hollywood
-
రూ.2 వేల కోట్ల బడ్జెట్.. రూ.5 లక్షలకు కక్కుర్తి?
ప్రపంచ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ భారీ విజయాన్ని అందుకుంటోంది. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ, హాలీవుడ్లో మరో సంచలన ప్రాజెక్ట్‌గా నిలిచింది. భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు ఓ చిన్న మొత్తానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచింది.సినిమా చిత్రీకరణ కోసం ఉపయోగించిన ఓ వైకింగ్ నౌకకు జరిగిన నష్టానికి సంబంధించి 6,000 డాలర్లు (సుమారు రూ.5.2 లక్షలు) చెల్లించలేదని నౌక యజమానులు ఆరోపిస్తున్నారు. దీంతో "రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసిన సంస్థ.. రూ.5 లక్షల బిల్లు విషయంలో ఎందుకు వివాదంలో పడింది?" అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.ఆరు నెలల షూటింగ్.. దెబ్బతిన్న వైకింగ్ నౌక‘ది ఒడిస్సీ’ చిత్రీకరణలో భాగంగా వైకింగ్ కాలానికి చెందిన ఓ నౌక ప్రతిరూపాన్ని ఉపయోగించారు. ఈ నౌకను దాదాపు ఆరు నెలల పాటు గ్రీస్, ఇటలీ తీర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్లో వినియోగించినట్లు సమాచారం. షూటింగ్ పూర్తయిన తర్వాత నౌక వెనుక భాగం, మస్తు వంటి కీలక భాగాలు దెబ్బతిన్నాయని దాని యజమానులు తెలిపారు. నౌక యజమానుల ప్రకారం.. చిత్రీకరణకు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం నష్టం జరిగితే మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంది. దీంతో నౌకకు అవసరమైన మరమ్మతులు చేసి, వాటికి సంబంధించిన సుమారు 6,000 డాలర్ల బిల్లును పంపించినట్లు తెలిపారు.చిన్న మొత్తం.. పెద్ద వివాదంనౌక యజమానులు చెబుతున్న ప్రకారం, ఈ మొత్తం హాలీవుడ్ స్థాయి నిర్మాణ సంస్థకు పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ చారిత్రక వారసత్వ వస్తువులను సంరక్షించే తమలాంటి సంస్థలకు ఇది ముఖ్యమైన ఖర్చు అని పేర్కొన్నారు. సినిమా కోసం నౌకను అందించడం గర్వంగా ఉన్నప్పటికీ, నష్టం పరిహారం విషయంలో సమస్య ఎదురవడం బాధ కలిగించిందని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై చర్చ మొదలైంది. వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా నిర్మాణంలో కేవలం కొన్ని లక్షల రూపాయల బిల్లు వివాదంగా మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.యూనివర్సల్ స్టూడియోస్ వివరణఅయితే ఈ ఆరోపణలను యూనివర్సల్ స్టూడియోస్ అంగీకరించలేదు. తమ రికార్డుల ప్రకారం నౌకకు సంబంధించిన అవసరమైన చెల్లింపులు పూర్తయ్యాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఏదైనా అపార్థం లేదా పెండింగ్ అంశం ఉంటే సంబంధిత వర్గాలతో చర్చించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం. అందువల్ల ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా? లేక చెల్లింపుల ప్రక్రియలో ఏర్పడిన సమస్యా? అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందించారు. ట్రోజన్ యుద్ధం తర్వాత తన స్వస్థలం ఇథాకాకు చేరేందుకు వీరుడు ఒడిస్సియస్ చేసే సాహస ప్రయాణమే ఈ కథకు ప్రధాన నేపథ్యం. ఈ చిత్రంలో మ్యాట్ డేమన్ ఒడిస్సియస్ పాత్రలో నటించగా, టామ్ హాలండ్, యాన్ హాథవే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నోలన్ దర్శకత్వ శైలి, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. -
ఫస్ట్ డే కలెక్షన్ 1000 కోట్లు
-
హాలీవుడ్ స్టార్ ముందు భారత గౌరవాన్ని నిలబెట్టిన శివాజీ గణేశన్!
దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ నటించిన అనేక చిత్రాలు.. స్వాతంత్య్రం అనంతర భారత నేపథ్యంతో తెరకెక్కాయి. మారుతున్న సమాజం ఎదుర్కొన్న పోరాటాలను ఆ చిత్రాలు చూపించాయి. రాజ్ కపూర్ నటించిన ఆవారా (1951) మాదిరిగానే, శివాజీ తొలి చిత్రం పరాశక్తి (1952) కూడా ఆర్థిక ఇబ్బందులు, భారతదేశంలోని పెద్ద నగరాలకు వలస వచ్చిన కార్మిక వర్గం ఎదుర్కొన్న కష్టాలను చిత్రీకరించింది. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు, ముఖ్యంగా ది అపు ట్రిలజీ, కూడా ఇలాంటి అంశాలను కలిగి ఉన్నాయి.ఆసక్తికర విషయం ఏమిటంటే, 1960లలో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఎంబసీ సంయుక్తంగా నిర్వహించిన పర్యటనలో భాగంగా శివాజీ గణేశన్ హాలీవుడ్‌ను సందర్శించినప్పుడు, ఆయన మార్లన్ బ్రాండోతో చేసిన సంభాషణలో ప్రధాన అంశం భారత్‌లో పేదరికమే. ఈ విషయాన్ని శివాజీ కుమారుడు రామ్‌కుమార్ గణేశన్ ఇటీవల ట్రూలీ రామ్‌తో జరిగిన చర్చలో వెల్లడించారు.రామ్‌కుమార్ మాట్లాడుతూ.. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు చూసిన తర్వాత భారత్‌లో కనిపించిన పేదరిక స్థాయిపై బ్రాండో మాట్లాడారని చెప్పారు. దీనికి ప్రతిగా, రే తన దేశంలోని పేదరికంపై అవగాహన పెంచేందుకు ఆ చిత్రాలు తీశారని, పశ్చిమ దేశాలకు వాటిని మార్కెట్ చేయాలనే ఉద్దేశం కాదని శివాజీ వివరించారని చెప్పారు. అంతేకాదు, తాను ధరించిన సూట్‌ను చూపిస్తూ భారత్‌లో అందరూ పేదలు కాదని ఆయన స్పష్టం చేశారని తెలిపారు."మా నాన్న ఆయనతో ఇలా చెప్పారు. 'మిస్టర్ బ్రాండో, నేను ధరించిన సూట్ చూశారా? ఇది $500 విలువైన సూట్. భారత్‌లో అందరూ పేదలు కాదు. ఇలాంటి సూట్లు కొనగలిగే వారు కూడా ఉన్నారు. పేదలు ఉన్నట్టే అలాంటి వారు కూడా ఉన్నారు'" అని అన్నారు.ఆసక్తికరంగా, శివాజీ గణేశన్, సత్యజిత్ రే ఒక చలనచిత్రోత్సవంలో కలుసుకున్న విషయం తనకు 20 ఏళ్ల క్రితం వరకూ తెలియదని కూడా రామ్‌కుమార్ చెప్పారు. అలాగే, పేదరికంపై శివాజీ గణేశన్ అభిప్రాయం బ్రాండో ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని ఆయన సూచించారు. దాని ఫలితంగానే 1973లో ది గాడ్‌ఫాదర్ చిత్రానికి వచ్చిన ఉత్తమ నటుడు ఆస్కార్‌ను తన తరఫున తిరస్కరించేలా స్థానిక అమెరికన్ ఉద్యమకారిణి సచీన్ లిటిల్ఫెదర్ను అకాడమీ అవార్డుల వేదికపైకి పంపి నిరసన తెలిపి ఉండొచ్చని అన్నారు. -
ఇండియాలో స్పైడర్ మ్యాన్ క్రేజ్.. హాట్ కేకుల్లా టికెట్స్
హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇటీవలే విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఇండియాలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సైతం భారత్‌లో భారీ క్రేజ్ నెలకొంది. ప్రత్యేక ప్రమోషన్స్ లేకుండానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు కొల్లగొడుతోంది.ఇండియాలో ఈ సినిమా తొలి రోజే రూ.30 నుంచి 50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో గంటకు సుమారు 25 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే 1 మిలియన్‌కు పైగా టికెట్లు విక్రయించినట్లు సమాచారం. ఈ జోరు చూస్తుంటే ఇండియన్ మార్కెట్లో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పైడర్ మ్యాన్ క్రేజ్ చూస్తుంటే కొత్తగా విడుదలవుతున్న సినిమాల కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉందనిపిస్తోంది. కాగా.. స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఈ గురువారం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన
పాప్ సాంగ్స్ అనగానే చాలామంది మైఖేల్ జాక్సన్ గుర్తొస్తాడు. 90ల్లో తనదైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 2009లో చనిపోయాడు. ఇకపోతే ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: అఫిషియల్ : నెలలోలోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’)ప్రపంచ ప్రఖ్యాత పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథతో తీసిన సినిమాకు 'మైఖేల్ అని పేరు పెట్టారు. ఇందులో ఇతడి మేనల్లుడు జాఫర్ జాక్సన్.. టైటిల్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న బిగ్ స్క్రీన్స్‌పై రిలీజైంది. కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఏదైతేనేం దాదాపు రూ.10 వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మన దేశంలో అయితే రూ.54 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ మార్క్‌ని దాటిన తొలి హాలీవుడ్ బయోపిక్గానూ రికార్డు సృష్టించింది.ఇకపోతే గత నెల 9నే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ, బుక్ మై షో లాంటి ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. ఆగస్టు 29 నుంచి హాట్‌స్టార్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్ కానుంది. కాకపోతే ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ కానుందని ప్రకటించారు.'మైఖేల్' విషయానికొస్తే.. అమెరికాలోని ఇండియానా గ్యారీలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మైఖేల్ జాక్సన్ (జాఫర్ జాక్సన్) తన తల్లి ప్రోత్సాహంతో, సోదరులతో కలిసి 'జాక్సన్ 5' బ్యాండ్‌తో తన ప్రతిభని చాటుకుంటాడు. అయితే తన తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) కఠినమైన ప్రవర్తన మైకేల్‌ని మానసిక వేదనకు గురిచేస్తుంది. ఆ భయం నీడలోనే ఒంటరిగా కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు? తన బాల్యాన్ని వెతుక్కుంటూ అతడు నిర్మించుకున్న 'నెవర్ ల్యాండ్' వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
వివాదంలో 'ఒడిస్సీ'.. కనీసం రూ.6 లక్షలు చెల్లించలేరా?
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'ది ఒడిస్సీ'.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంచి టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ చిత్ర యూనిట్ అనుకోని ఓ వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ కోసం ఉపయోగించిన ఓ వైకింగ్ నౌకని డ్యామేజీ చేయడంతో పాటు దానికి అయ్యే రిపేర్ ఖర్చులు ఇప్పటికీ చెల్లించలేదని నౌక యజమానులు ఆరోపిస్తున్నారు.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ది గార్డియన్ వెబ్ సైట్ చెప్పిన దాని ప్రకారం.. ఈ వివాదం 'గ్లాడ్ ఆవ్ గిల్బెర్గా' అనే వైకింగ్ లాంగ్‌షిప్ రెప్లికాకు సంబంధించినది. వైకింగాలెడెన్ అసోసియేషన్‌కు చెందిన ఈ నౌకని 'ది ఒడిస్సీ' మూవీలో ప్రాచీన గ్రీకు యుద్ధ నౌకగా ఉపయోగించారు. తమ నౌక, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కనిపించబోతుందనే వార్తతో ఎంతో ఆనందించామని, కానీ షూటింగ్ తర్వాత దెబ్బతిన్న స్థితిలో ఉన్న నౌకను తమకు తిరిగి ఇచ్చారని, మరమ్మతులకు సుమారు 6,000 డాలర్లు(రూ.5.79 లక్షలు) ఖర్చయినా, నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ ఇప్పటివరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదని వైకింగా లెడెన్ అసోసియేషన్ చైర్మన్ పీటర్ ఒలౌసన్ అన్నారు.మేం కార్మికుల ఖర్చు కూడా అడగడం లేదు. కేవలం మరమ్మతులకు ఉపయోగించిన సామగ్రి ఖర్చు మాత్రమే కోరుతున్నాం. యూనివర్సల్ పిక్చర్స్ లాంటి సంస్థకు 6,000 డాలర్లు పెద్ద మొత్తం కాదు. కానీ మమ్మల్ని పూర్తిగా మరిచిపోయినట్లు అనిపిస్తోందని పీటర్ పేర్కొన్నారు. షూటింగ్ మొదలవడానికి ముందే నౌకకు ఏమైనా నష్టం జరిగితే తామే మరమ్మతులు చేసి, తర్వాత ఆ ఖర్చును నిర్మాతలు తిరిగి చెల్లిస్తారని ఒప్పందం కుదిరిందని ఒలౌసన్ వెల్లడించారు. ఇప్పటికే నౌకకు మరమ్మతులు పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినా, ఏడాదికి అయిపోయినా తమకు చెల్లించాల్సిన డబ్బు అందలేదని అసోసియేషన్ వాదిస్తోంది.అయితే ఈ ఆరోపణలను యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ పూర్తిగా ఖండించింది. నౌకకు సంబంధించిన అన్ని బిల్లులు, మరమ్మతుల ఖర్చుతో సహా పూర్తిగా చెల్లించాం. ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం అని నిర్మాణ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. మరి ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో ఏంటో?(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?) -
ఇప్పుడీ సినిమా నిజంగానే అవసరమా?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) చరిత్రను ఒక గీతతో విభజించాలంటే అది "అవెంజర్స్: ఎండ్‌గేమ్" (2019) ముందు, తర్వాత అని చెప్పొచ్చు. పదకొండు ఏళ్లపాటు సాగిన ఇన్ఫినిటీ సాగాకు ఆ చిత్రం ఇచ్చిన ముగింపు కేవలం ఒక సినిమా క్లైమాక్స్ కాదు. కోట్లాది అభిమానుల భావోద్వేగాలకు వీడ్కోలు పలికిన మహా ఘట్టం. ఐరన్‌మ్యాన్ త్యాగం, కెప్టెన్ అమెరికా ప్రయాణానికి ముగింపు, థానోస్‌పై తుది విజయం... ఇవన్నీ ప్రేక్షకుల్లో "ఇక కథ పూర్తైంది" అనే అనుభూతిని కలిగించాయి.కానీ ఆ తర్వాతి ఏడేళ్లలో మార్వెల్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిస్నీ+ కోసం వరుస సిరీస్‌లు, ప్రతి ఏడాది అనేక సినిమాలు, మల్టీవర్స్ అనే అపారమైన కాన్సెప్ట్... ఇవన్నీ మొదట్లో ఆసక్తిని రేకెత్తించినా, క్రమంగా ప్రేక్షకుల్లో అలసటను పెంచాయి. ప్రతి కథ మరో కథతో అనుసంధానమై ఉండటం, కొత్త హీరోలు వరుసగా రావడం, పాత పాత్రల మాయాజాలం తగ్గిపోవడం వంటి కారణాలతో MCUపై ఉన్న ప్రత్యేక ఆకర్షణ తగ్గింది. ఒకప్పుడు ప్రతి మార్వెల్ సినిమా ఒక ఈవెంట్‌గా మారేది. ఇప్పుడు అది సాధారణ విడుదలగా మారిపోయిందనే విమర్శలు పెరిగాయి.ఈ నేపథ్యంలోనే "అవెంజర్స్: డూమ్స్‌డే" ప్రాధాన్యం మొదలవుతుంది. ఇది కేవలం మరో అవెంజర్స్ సినిమా కాదు. ఎండ్‌గేమ్ తర్వాత దారి తప్పిన MCUకి మళ్లీ దిశ చూపించే ప్రయత్నం. ముఖ్యంగా రాబర్ట్ డౌనీ జూనియర్‌ను ఈసారి ఐరన్‌మ్యాన్‌గా కాకుండా విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో తీసుకురావడం ద్వారా మార్వెల్ పెద్ద మానసిక షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని కాపాడిన వ్యక్తే ఇప్పుడు ప్రపంచానికి ముప్పుగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచనే అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.ఎండ్‌గేమ్ తర్వాత నిజంగానే మరో అవెంజర్స్ అవసరమా? వ్యాపార పరంగా చూస్తే సమాధానం "అవును". గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాల వసూళ్లు, విమర్శకుల ప్రశంసలు రెండూ ఆశించిన స్థాయిలో లేవు. "డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్" వంటి కొన్ని విజయాలు మినహా, చాలా చిత్రాలు పాత మ్యాజిక్‌ను తిరిగి తీసుకురాలేకపోయాయి. ఈ పరిస్థితిలో అవెంజర్స్ బ్రాండ్‌ను మళ్లీ రంగంలోకి దింపడం అనేది స్టూడియోకు అత్యంత సహజమైన వ్యూహం.కానీ సృజనాత్మకంగా చూస్తే పరిస్థితి అంత సులభం కాదు. ఎండ్‌గేమ్ ఒక సంపూర్ణ ముగింపు. ఆ భావోద్వేగాలను మళ్లీ పునరావృతం చేయడం దాదాపు అసాధ్యం. ప్రతి పెద్ద సంక్షోభం తర్వాత మరో పెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తూ పోతే, కథల విలువ తగ్గిపోతుంది. ప్రేక్షకులు కూడా "మళ్లీ ఇదేనా?" అనే భావనకు లోనయ్యే ప్రమాదం ఉంది.ఇక్కడే డూమ్స్‌డే విజయాన్ని నిర్ణయించే అంశం దాగి ఉంది. ఈ చిత్రం కేవలం పాత పాత్రలను, నాస్టాల్జియాను ఆధారంగా చేసుకుంటే అది తాత్కాలిక విజయానికే పరిమితం కావచ్చు. కానీ కొత్త కథ, బలమైన భావోద్వేగాలు, స్పష్టమైన భవిష్యత్ దిశను చూపగలిగితే మాత్రం MCUకి రెండో స్వర్ణయుగానికి నాంది పలికే అవకాశం ఉంది.చివరికి చెప్పాలంటే, "అవెంజర్స్: ఎండ్‌గేమ్" ఒక శకానికి ముగింపు. "అవెంజర్స్: డూమ్స్‌డే" మరో శకానికి ప్రారంభం కావాలంటే కేవలం భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ సరిపోవు. ప్రేక్షకులు మళ్లీ ప్రేమించే కథను మార్వెల్ చెప్పగలగాలి. అదే జరిగితే డూమ్స్‌డే అవసరమైంది అని చరిత్ర చెబుతుంది. లేకపోతే, ఎండ్‌గేమ్‌తో ముగిసిన మహోన్నత గాథను అనవసరంగా పొడిగించిన ప్రయత్నంగా మాత్రమే అది మిగిలిపోతుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా
80.90ల్లో పిల్లల్ని ఎంతగానో అలరించిన చాలా యానిమేటెడ్ పాత్రల్ని రీసెంట్ టైంలో లైవ్ యాక్షన్ సినిమాలుగా తీస్తున్నారు. హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్, డోరా, మోగ్లీ లాంటివి ఇలానే వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇదే దారిలో వచ్చిన మరో మూవీ 'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్'. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడిది ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్)ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ కథతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరో పాత్రకు తెలుగులో హీరో నిఖిల్ డబ్బింగ్ చెప్పాడు. డంకన్‌కు రావు రమేశ్, విలన్ పాత్రకు ఆదిత్య మీనన్ గాత్రమందించారు.'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్' విషయానికొస్తే.. విశ్వాన్ని శాసించాలనే కోరికలున్న స్కెలిటార్ అనే రాక్షసుడు.. అద్భుత శక్తులున్న ఓ ఆయుధం కోసం ఎటర్నియా గ్రహంపై దాడి చేస్తాడు. దీంతో ఆ సామ్రాజ్యం చెల్లాచెదురవుతుంది. రాజు, రాణి.. ఆ ఆయుధాన్ని పిల్లాడిగా ఉన్న తన కొడుకు ఆడమ్‌కి ఇచ్చి భూమిపైకి పంపేస్తారు. కానీ ఆ ఆయుధం పిల్లాడి దగ్గర నుంచి మిస్ అవుతుంది. భూమిపై పెరిగి పెద్దవాడైన ఆడమ్.. ఎలాగైనా సరే తన గ్రహానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంగా తన దగ్గర నుంచి మిస్ అయిన ఆయుధం ఆచూకీ లభిస్తుంది. కానీ దాన్ని పొందే క్రమంలో ఇతడిపై ఓ వింత జంతువు దాడి చేస్తుంది.ఈ జంతువు నుంచి తప్పించుకున్న ఆడమ్.. తన చిన్నప్పటి ఫ్రెండ్, సేనాధిపతి కూతురు తీలా సాయంతో తిరిగి తన గ్రహానికి చేరుకుంటాడు. కానీ అప్పటికే ఆ గ్రహం మొత్తం నాశనమైపోయింటుంది. తన తల్లిదండ్రులతో పాటు మరికొందరు.. స్కెలిటార్ దగ్గర బందీగా ఉంటారు. వీళ్లని రక్షించేందుకు ఆడమ్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే ఆడమ్ తన శక్తిని తిరిగి ఎలా పొందగలిగాడు. హీ-మ్యాన్ ఎలా అయ్యాడు? చివరకు శత్రువులని మట్టుబెట్టాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి దుర్మరణం
'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమాలో జియా అనే పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలనటి కేలీ హాటిల్.. 18 ఏళ్లకే దుర్మరణం పాలైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మంగళవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పుట్టుకతో ఈమెకు వినబడదు.(ఇదీ చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను)2021లో వచ్చిన 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమాలో చెవిటి బాలికగా నటించిన ఈమె.. కింగ్ కాంగ్‌తో అమెరికన్ సైగల భాషలో మాట్లాడే పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. తర్వాత 2024లో రిలీజైన 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్' మూవీలోనూ అదే పాత్రను పోషించి మరోసారి మెప్పించింది. వీటితో పాటు 'మాగ్నమ్ పీఐ' అనే వెబ్ సిరీస్‌లోనూ అతిథి పాత్ర చేసింది. అట్లాంటాలోని జార్జియాలో పుట్టిన కేలీ హాటిల్.. తొమ్మిదేళ్ల వయసులోనే చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికి ఉపయోగపడే గ్లైడ్ వీడియో మెసేజింగ్ యాప్‌కి సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించి తన కెరీర్ మొదలుపెట్టింది.ఇకపోతే కూతురు మరణవార్తని ఫేస్బుక్ లైవ్ ద్వారా కేలీ తండ్రి జోషువా హాటిల్ పంచుకున్నారు. అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడిన ఈయన.. ప్రమాదం జరిగిన వెంటనే టెక్సాస్ నుంచి మేరీల్యాండ్‌కు చేరుకున్నానని, తొలుత ప్రమాదంలో తన కుమార్తె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు సమాచారమిచ్చారని, తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా కేలీ గుండె ఆగిపోయిందని అధికారులు చెప్పినట్లు ఈయన పేర్కొన్నారు.(ఇదీ చదవండి: రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?) -
పెళ్లి చేసుకున్న ఫేమస్ యూట్యూబర్.. ఏడాదికి రూ.600 కోట్ల సంపాదన
ప్రపంచంలో ఫేమస్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. రకరకాల గేమ్స్ పెడుతూ దానధర్మాలు చేస్తూ సదరు వీడియోలని పోస్ట్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వీడియోలు, దానికి వచ్చే యాడ్స్ ద్వారా ఏడాదికి రూ.300 కోట్లు, ఇతర బిజినెస్‌లతో మరో రూ.300 కోట్లు సంపాదించే ఈ ఫేమస్ యూట్యూబర్ ఇప్పుడు సింపుల్‌గా తన ప్రేయసి థియాని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్, థియా బూయ్‌సెన్.. గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2022లో దక్షిణాఫ్రికాకి వెళ్లినప్పుడు గేమర్, రైటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన థియాని బీస్ట్ తొలిసారి కలిశాడు. తర్వాత ట్విటర్లో మాట్లాడుకున్నారు. తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే ఏడాది జరిగిన కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమంలో తొలిసారి వీళ్లిద్దరూ జంటగా కనిపించారు. ఇక 2024 క్రిస్మస్ నాడు కుటుంబ సభ్యుల సమక్షంలో జిమ్మీ థియాకు ప్రపోజ్ చేశాడు.వారం క్రితం అంటే జూలై 14న ప్రముఖ బిజినెస్‌మ్యాన్ రిచర్డ్ బ్రాన్సన్‌కి చెందిన నెకర్ ఐలాండ్‌లో జిమ్మీ-థియా పెళ్లి చేసుకున్నారు. బీస్ట్ చాలా పెద్ద యూట్యూబర్ అయినప్పటికీ పెద్దగా హడావుడి లేకుండా దాదాపు 70 మంది కుటుంబ సభ్యులు, బంధవులు, స్నేహితులు సమక్షంలో ఈ వివాహం చేసుకున్నాడు.వారం పాటు ఈ వేడుకలు సాగినట్లు తెలుస్తోంది. తన పెళ్లి ఫొటోలని బీస్ట్ పోస్ట్ చేయగా.. అభిమానులతో పాటు పలువురు ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు, స్నేహితులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రపంచంలోనే చాలా ఫేమస్ యూట్యూబర్లలో ఒకడైన మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్.. తన పెళ్లిని మీడియా హడావుడికి దూరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వ్యక్తిగతంగా జరుపుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు గతంలో పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అలానే చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) -
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సాధారణంగా ఓ వయసొచ్చిన తర్వాత దర్శకులు దాదాపుగా సినిమాలు చేయడం తగ్గించేస్తుంటారు. కానీ రీసెంట్ టైంలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, 94 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' అనే చిత్రం తీసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈయనలానే హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా 79 ఏళ్ల వయసులోనూ ఇంకా చలాకీగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన లేటెస్ట్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)జురాసిక్ పార్క్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, మ్యూనిచ్, ద టెర్మినల్, ఇండియానా జోన్స్ తదితర సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించిన స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డిస్క్లోజర్ డే'. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఓ మేరకు ఆకట్టుకుంది. ఏలియన్స్ కాన్పెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.డిస్క్లోజర్ డే విషయానికొస్తే.. ఓ సైబర్ సెక్యూరిటీ విజిల్ బ్లోయర్ డేనియల్ (జోష్ ఓ కానర్), వాతావరణ శాస్త్రవేత్త మార్గెట్(ఎమిలీ బ్లంట్).. అమెరికా ప్రభుత్వం దాచిపెట్టిన గ్రహాంతరవాసుల రహస్య ఆధారాలని బయటపెట్టాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఏజెన్సీ చీఫ్ నోవా (కోలిన్ ఫెర్త్) నుంచి వీళ్లిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. గ్రహాంతరవాసులు నిజంగానే భూమిపైకి వస్తే మానవాళి ఎలా స్పందిస్తుందనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా) -
ది ఒడిస్సీకి మిస్... వారణాసికి ప్లస్?
క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన దిఒడిస్సీ భారతదేశ వ్యాప్తంగా సంచలన కలెక్షన్లు సాధిస్తూ సాగిపోతోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపొందిన చిత్రంగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ సినిమాను ఐమ్యాక్స్ తెరపై చూడడం ఒక ప్రత్యేక అనుభవంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ ప్రేక్షకులకు మాత్రం అది అందుబాటులో లేకపోవడం అత్యున్నత వీక్షణానుభవాన్ని ఆశించేవారిని నిరుత్సాహ పరుస్తోంది.ఒకప్పుడు ఐమ్యాక్స్ తెరకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత ఆ అనుభవం తెరమరుగు కావడం తెలిసిందే. దాంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ స్క్రీన్ లోటు ఏర్పడింది. మరోవైపు ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో లాగా ది ఒడిస్సీ పూర్తి అనుభవాన్ని ఆస్వాదించే మిస్ అవుతున్నామని సినీ అభిమానులు అంటున్నారు. అల్లు సినిమాస్ తో ఊరట...ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభమైన అల్లు సినిమాస్ ది ఒడిస్సీ అభిమానులను ఆదుకుంటోంది. మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ప్రేక్షకులకు అత్యున్నత శ్రవణ అనుభూతిని అందిస్తోంది. ఇప్పటిదాకా పలు చిత్రాలు ఈ థియేటర్లో ప్రదర్శితమైనప్పటికీ... ధియేటర్ ‘డాల్బీ’ సాంకే తిక సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో అనుభూతించడం ది ఒడిస్సీ ద్వారానే సాధ్యమైందని ప్రేక్షకులు అంటున్నారు.ఈ సినిమాలోని సముద్ర అలల గర్జన, యుద్ధ సన్నివేశాల సందర్భంగా నేపథ్య సంగీతపు పూర్తి అనుభవాన్ని 3డీ ఆడియో ద్వారా సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ముందునుంచే కాకుండా పక్కల నుంచి, వెనుక నుంచి, పై భాగం నుంచి కూడా ప్రవహించే శబ్ధ తరంగాల అనుభూతి ది ఒడిస్సీ ప్రేక్షకులకు వీనుల విందు చేస్తోంది. ఏది ఏమైనా గొప్ప గొప్ప చిత్రాలను ఆస్వాదించడానికి అదే స్థాయి సాంకేతిక సామర్ధ్యం కలిగిన థియేటర్లు కూడా తప్పనిసరి అని ది ఒడిస్సీ మరోసారి స్పష్టం చేస్తోంది.ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శక థీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌బాబుల వారణాసి కోసమైనా ఐమ్యాక్స్‌ను హైదరాబాద్‌లో కొలువుదీర్చాల్సిన అవసరం కనిపిస్తోంది. త్వరలోనే ఐమ్యాక్స్ తెరను హైదరాబాద్‌కు తెస్తామని ఇటీవల ఏషియన్ మూవీస్ ప్రకటించింది. ఆ ప్రకటన కార్యరూపం దాలిస్తే... ది ఒడిస్సీని మిస్సయినా, వచ్చే ఏడాది విడుదల కానున్న వారణాసిని అత్యద్భుతమైన దిగ్గజ తెరపై ఆస్వాదించే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది. -
మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్.. ఆసక్తిగా ట్రైలర్
సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాలీవుడ్ ఫ్రాంచైజీల్లో అవెంజర్స్ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ అవెంజర్స్: డూమ్స్‌డే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్‌గా కాకుండా.. డాక్టర్ డూమ్‌గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి తిరిగి వస్తున్నారు. ఈ చిత్రంలో క్రిస్ హమ్స్‌వర్త్, వెనెస్సా కిర్బీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రైలర్లో యాక్షన్ సీన్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్లో డౌనీ రూపాంతరం, అవెంజర్స్‌తో సంఘర్షణ, ఇవాన్స్ కనిపించడం హైలెట్‌గా నిలిచాయి. అవెంజర్స్: డూమ్స్‌డే మూవీ కోసం దర్శకులు జో, ఆంథోనీ రుస్సోలతో మార్వెల్ మళ్లీ కలిశారు. 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత వీరు మొదటిసారిగా తిరిగి వస్తున్నారు. ఈ చిత్రానికి మైఖేల్ వాల్డ్రాన్, స్టీఫెన్ మెక్‌ఫీలీ రచయితలుగా ఉన్నారు. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబరు 18న విడుదల కానుంది. -
'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిపోయిన సినిమా 'ది ఒడిస్సీ'. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఏకంగా రూ.2500 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అయితే మూవీ చూసిన చాలామంది.. దీనిని నిజమైన లొకేషన్లలో తీశారా? లేదంటే గ్రీన్/బ్లూ స్క్రీన్ ఉపయోగించారా అని అనుకుంటున్నారు. కానీ మీరు మూవీలో చూసిన లొకేషన్లన్నీ నిజమైనవే.(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)నోలన్.. మూడు వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన గ్రీకు మైథాలజీ 'ఒడిస్సీ' అనే పుస్తకం ఆధారంగా సినిమా తీశాడు. అయితే గ్రీన్ స్క్రీన్, గ్రాఫిక్స్ ఉపయోగిస్తే అంత ప్రభావవంతంగా ఉండదనుకున్నాడో ఏమో గానీ గ్రీస్, ఇటలీ, స్కాట్లాండ్, ఐస్ లాండ్ లాంటి దేశాల్లో చిత్రీకరణ జరిపాడు.సినిమాలో ట్రాయ్ యుద్ధం జరిగే లొకేషన్ మొరాకోలో ఉంది. అందులో గుర్రం, చిన్నపాటి భవంతులని సెట్స్ వేసి మిగిలినవి మాత్రం నిజమైన చోటు అయిన ఎట్ బెన్ హద్దు అనే ప్రదేశంలో చిత్రీకరించారు. అలానే ఒంటికన్ను రాక్షసుడు కనిపించే గుహ సీన్స్.. గ్రీస్‌లోని నెస్టర్ గుహలో తెరకెక్కించారు. ఇక ఒడిసియస్ రాజు ప్యాలెస్ సీన్లన్నీ ఇటలీలోని కాస్టలీ డీ శాంటా కేటరినా అనే కొండపై షూటింగ్ చేశారు.ఇక పెద్ద పెద్ద మనుషులు కనిపించే సన్నివేశాన్ని స్కాట్లాండ్లోని సముద్రపు ఒడ్డున ఉన్న కల్బిన్ అడవిలో చిత్రీకరించారు. ఒడిసియస్ ప్రయాణిస్తున్న పడవ ఓ చోట సుడిగుండంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. ఈ సీన్‌ని ఇటలీలోని ఫరగ్లియోనీ ది లిపారీ అనే చోట తీశారు. మూవీకి సంబంధించిన 23 నిమిషాల మేకింగ్ వీడియోని ఇప్పటికే హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. అది చూస్తే షూటింగ్ కోసం నోలన్ అంట్ టీమ్ ఎంతలా కష్టపడ్డారు? ఏయే లొకేషన్లలో సీన్స్ తీశారో చూడొచ్చు.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ది ఒడిస్సీ' తొలిరోజు వసూళ్లు ఎంత?
హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమా 'ది ఒడిస్సీ' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. అయితే విడుదలకు ముందు కొంత నెగిటివిటీ వినిపించింది గానీ రిలీజైన తర్వాత అంతటా పాజిటివ్ టాక్ తప్పితే మరొకటి వినిపించడం లేదు. మరి ఇంతలా సౌండ్ చేస్తున్న ఈ చిత్రానికి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయ్? మొదటిరోజు మన దగ్గర ఎన్ని కోట్లు వచ్చాయ్?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..)మ్యాట్ డామన్, ఆన్ హాత్వే, టామ్ హోలండ్, రాబర్ట్ పాటిన్సర్, జెండాయా ప్రధాన పాత్రల్లో కనిపించిన 'ది ఒడిస్సీ' సినిమాని మూడువేళ్ల ఏళ్ల క్రితం హోమర్ అనే రచయిత రాసిన ఒడిస్సీ నవల ఆధారంగా తీశారు. రూ.2200 కోట్ల బడ్డెట్‌తో నిర్మించారు. విడుదల కావడానికి ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తొలిరోజు అదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.418 కోట్లు) వచ్చాయి. ఇందులో మన దేశం నుంచి రూ.17 కోట్ల మేర నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం టాక్ పాజిటివ్ రావడం, దగ్గరలో మరో సినిమా లేదు కాబట్టి వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర 'ది ఒడిస్సీ' సినిమా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశమైతే ఉంది. తెలుగు, హిందీ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయడం ఈ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.'ది ఒడిస్సీ' విషయానికొస్తే.. ఒడిసియస్(మ్యాట్ డామన్) ట్రోజన్ యుద్ధంలో పదేళ్ల పాటు పోరాడి గెలుస్తాడు. త్వరగా భార్య పెనలోపి(ఆన్ హాత్వే), కొడుకు టెలీమాకస్(టామ్ హాలెండ్) దగ్గరకు వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన సైనికులతో కలిసి పడవ ప్రయాణం చేస్తాడు. అయితే దారిలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. దీంతో పదేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి రాజ్యానికి చేరుకుంటాడు. తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’లో నటించనందుకు చాలా హ్యాపీగా ఉంది!) -
‘ది ఒడిస్సీ’లో నటించనందుకు చాలా హ్యాపీగా ఉంది!
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో సినిమా అంటే ఏ నటుడైనా నటించాలని కోరుకుంటారు. కానీ నటుడు, ఆస్కార్ విన్నర్ సిలియన్ మర్ఫీ మాత్రం ఎలాంటి బాధ లేదని చెబుతున్నాడు. పైగా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని.. దానిని తానొక బహుమతిగా భావిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నోలన్ తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ రిలీజ్ నేపథ్యంలో.. ఆయనతో చిరకాల అనుబంధం ఉన్న మర్ఫీ ఏమన్నాడంటే..సిలియన్ మర్ఫీ, క్రిస్టోఫర్ నోలన్ కాంబినేషన్ హాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరి ప్రయాణం ‘బ్యాట్‌మ్యాన్ బిగిన్స్’ (2005)తో మొదలైంది. ఆ తర్వాత ‘ది డార్క్ నైట్’, ‘ఇన్సెప్షన్’, ‘డంకిర్క్’లోనూ మర్ఫీ నటించారు. ఇక.. 2023లో వచ్చిన ‘ఓపెన్‌హైమర్’లో శాస్త్రవేత్త జే. రాబర్ట్ ఓపెన్‌హైమర్ పాత్రలో మర్ఫీ అద్భుత నటనకు ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఈ సినిమా నోలన్-మర్ఫీ భాగస్వామ్యానికి మరో మైలురాయిగా నిలిచింది.నోలన్‌తో కలిసి ఇప్పటికే ఆరు సినిమాల్లో పనిచేసిన మర్ఫీ.. ‘ది ఒడిస్సీ’లో మాత్రం లేడు. అయితే నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ను ఓ ప్రేక్షకుడిగా ఆస్వాదించడం తనకు ఆనందంగా ఉందన్నారు. సాధారణంగా ఇలాంటి అవకాశం కోల్పోతే వచ్చే ఫోమో (Fear Of Missing Out)కు బదులుగా తనకు ROMO (Relief Of Missing Out) అనిపించిందని సరదాగా వ్యాఖ్యానించాడాయన.“క్రిస్ సినిమాలను చూస్తున్నప్పుడు నా సొంత ముఖాన్ని తెరపై చూడాల్సిన భారం లేకుండా ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతి” అంటూ మర్ఫీ నవ్వుతూ చెప్పారు. నోలన్‌తో తన కెరీర్లో ఎన్నో గొప్ప చిత్రాలు చేసిన మర్ఫీ.. ఈసారి తెరపై కనిపించకుండా, ప్రేక్షకుడిగా ఆ సినిమాను ఆస్వాదించడమే తనకు ప్రత్యేక అనుభూతి అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.భారీ అంచనాల మధ్య ‘ది ఒడిస్సీ’హోమర్ రచించిన ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’లో మ్యాట్ డామన్ ఒడిస్సియస్ పాత్రలో నటించారు. అన్నే హాత్వే, టామ్ హాలండ్, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రాయ్ యుద్ధం తర్వాత స్వదేశం ఇథాకాకు చేరుకునేందుకు ఒడిస్సియస్ చేసిన పదేళ్ల సాహస ప్రయాణమే ఈ కథకు ప్రధాన నేపథ్యం. అలాగే ఐమ్యాక్స్ స్క్రీనింగ్ ఈ సినిమాకు మరో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. -
ది ఒడిస్సీ.. ఈ కథ ఎప్పుడో, ఎక్కడో చూశామే!
కొన్ని కథలు పాతబడవు. కాలంతో పాటు.. తరాలు మారినా మనసులను తాకుతూనే ఉంటాయి. వేల ఏళ్ల క్రితం పుట్టిన అలాంటి కథల్లో గ్రీకు మహాకావ్యం ‘ది ఒడిస్సీ’ ఒకటి. యుద్ధం, వనవాసం, ప్రమాదకర ప్రయాణం, దేవతల జోక్యం, కుటుంబం కోసం సాగిన ఎదురుచూపు.. ఇలా ఎన్నో అంశాలతో నిండిన ఈ గాథ నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఎక్కడో విన్నట్టుగా.. ఎక్కడో చూసినట్టుగా..ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ విడుదలతో మరోసారి ఈ పురాతన గాథ చర్చనీయాంశమైంది. అయితే భారతీయ ప్రేక్షకులకు ఈ కథలోని కొన్ని భావోద్వేగాలు పూర్తిగా కొత్తగా అనిపించకపోవచ్చు. ఎక్కడో విన్నట్టుగా.. ఎక్కడో చూసినట్టుగా అనిపించవచ్చు. కారణం.. మనకు సుపరిచితమైన రామాయణం, మహాభారతాల్లో కనిపించే కొన్ని మూల భావనలు ఈ గ్రీకు గాథలోనూ ప్రతిధ్వనించడం.కొన్ని అనుభూతులు.. ప్రపంచం..అలాగని ఈ మూడు మహాకావ్యాలు ఒకటే కథ అని చెప్పడం సరైంది కాదు. ఇవి వేర్వేరు నాగరికతలు, సంప్రదాయాలు, ఆలోచనా విధానాల్లో పుట్టినవి. గ్రీకు పురాణ ప్రపంచం నుంచి వచ్చిన ‘ది ఒడిస్సీ’కి, భారతీయ ధార్మిక–సాంస్కృతిక సంప్రదాయాల్లో భాగమైన రామాయణం, మహాభారతాలకు తమకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ మానవ జీవితంలోని కొన్ని అనుభూతులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది.. ఇంటికి తిరిగి చేరుకోవాలనే మనిషి తపన.భావోద్వేగం మాత్రం ఒకటే..‘ది ఒడిస్సీ’లో ఇథాకా రాజు ఒడిస్సియస్ ట్రాయ్ యుద్ధం అనంతరం స్వదేశానికి తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. యుద్ధం ముగిసినా అతని కష్టాలు ముగియవు. సముద్ర తుఫాన్లు, వింత జీవులు, దేవతల ఆగ్రహం, ప్రలోభాలు.. ఇలా ఎన్నో పరీక్షలను దాటుకుంటూ దాదాపు 20 ఏళ్ల తర్వాత తన భార్య పెనెలోప్, కుమారుడు టెలిమాకస్ వద్దకు చేరుకుంటాడు. రామాయణంలోనూ రాముడి కథ ఇంటి నుంచి దూరమవడంతోనే మొదలవుతుంది.అయోధ్యను విడిచి 14 ఏళ్ల వనవాసానికి వెళ్లిన రాముడు అనేక కష్టాలను ఎదుర్కొంటాడు. సీత అపహరణ తర్వాత రావణుడితో యుద్ధం చేసి చివరకు తిరిగి స్వస్థలానికి చేరుకుంటాడు. మహాభారతంలో పాండవుల ప్రయాణం కూడా ఇలాంటి విడిపోవడం, పోరాటం, పునరాగమనంతోనే సాగుతుంది. జూదంలో రాజ్యాన్ని కోల్పోయిన వారు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి తమ హక్కుల కోసం పోరాడతారు. ఆ ప్రయాణం కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీస్తుంది.ఇక్కడ కథలు వేరు.. పాత్రలు వేరు.. కానీ భావోద్వేగం మాత్రం ఒకటే. ఈ భావోద్వేగాలే భారతీయ ప్రేక్షకులకు ‘ది ఒడిస్సీ’ని మరింత చేరువ చేస్తాయి. అంతేకాదు.. రామాయణం, మహాభారతంలోని వనవాసం, కుటుంబ బంధాలు, ధర్మం–అధర్మం, రాజ్యాన్ని తిరిగి సాధించుకునే పోరాటం వంటి అంశాలు దశాబ్దాలుగా భారతీయ సినిమాల్లోనూ ఎన్నో రూపాల్లో(కథ, కథనం.. రిఫరెన్స్‌ల రూపంలో..) కనిపిస్తున్నాయి. పౌరాణిక చిత్రాల నుంచి ఆధునిక కమర్షియల్ సినిమాల వరకు అనేక కథలు ఈ ఇతిహాసాల భావనల నుంచే ప్రేరణ పొందాయి. అందుకే ‘ది ఒడిస్సీ’లోని కొన్ని ఘట్టాలు తెరపై కనిపించినప్పుడు.. అవి పూర్తిగా కొత్తగా కాకుండా ఎక్కడో చూసిన భావాల్లా అనిపించడం సహజం.ఇది కథల మధ్య ప్రత్యక్ష సంబంధం కంటే.. ప్రపంచవ్యాప్తంగా మానవ అనుభవాలు, భావోద్వేగాలు ఒకే విధంగా వ్యక్తమవుతాయనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ మూడు మహాకావ్యాల్లోనూ నాయకులకు ఎదురయ్యే సవాళ్లు సాధారణమైనవి కావు. ఒడిస్సియస్ ప్రయాణంలో సైక్లోప్స్, సైరన్స్, సిర్సీ వంటి గ్రీకు పురాణ పాత్రలు కనిపిస్తాయి. అవి అతడి శారీరక బలాన్ని మాత్రమే కాదు.. ఆలోచనా శక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తాయి. రామాయణంలో మారీచుడి బంగారు జింక రూపం కథలో కీలక మలుపుకు కారణమవుతుంది.మహాభారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో అనేక అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక్కడ అతీత శక్తులు కేవలం అద్భుతాల కోసం కాకుండా.. నాయకుల వ్యక్తిత్వాన్ని పరీక్షించే సాధనాలుగా మారతాయి. ప్రలోభాలు కూడా ఈ మూడు కథల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒడిస్సియస్‌ను దారి తప్పించే సైరన్స్ నుంచి.. రామాయణంలోని మాయా ఘటనలు, మహాభారతంలోని అధికారం–ఆకాంక్ష–గర్వం చుట్టూ తిరిగే సంఘర్షణల వరకు.. ప్రతి కథలోనూ ఒకే ప్రశ్న కనిపిస్తుంది.కష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలమా?దేవతల పాత్ర కూడా ఈ కథల్లో ఆసక్తికరమైన అంశం. ‘ది ఒడిస్సీ’లో అథీనా ఒడిస్సియస్కు అండగా నిలిస్తే.. పోసైడన్ అతడి ప్రయాణానికి అడ్డంకిగా మారతాడు. రామాయణంలో దైవ శక్తులు రాముడి జీవనయాత్రలో భాగమవుతాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడి గీతోపదేశం యుద్ధరంగాన్ని దాటి జీవిత తత్వాన్ని వివరిస్తుంది. అయితే, దైవ సహాయం ఉన్నప్పటికీ చివరి పోరాటం మాత్రం నాయకులదే. ఒడిస్సియస్ తన తెలివితో ముందుకు సాగాలి. రాముడు తన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. పాండవులు తమ నిర్ణయాల ఫలితాలను అనుభవించాలి. గెలుపు కాదు.. ఆశలకు సమాధానం కూడా..ఈ కథల్లో మరో బలమైన అంశం.. ఎదురుచూపు. ఒడిస్సియస్ కోసం పెనెలోప్ సంవత్సరాల తరబడి వేచి చూస్తుంది. రాముడి కోసం అయోధ్య ఎదురుచూస్తుంది. పాండవుల కథలో కుటుంబ బంధాలు, విడిపోవడం, సంఘర్షణలు కీలక పాత్ర పోషిస్తాయి. నాయకుడి విజయం కేవలం అతడి వ్యక్తిగత గెలుపు కాదు.. అతడి కోసం ఎదురుచూసిన వారి ఆశలకు సమాధానం కూడా.మనిషి తపన మాత్రం ఎప్పటికీ మారదు..‘ది ఒడిస్సీ’, రామాయణం, మహాభారతం మూడు వేర్వేరు ప్రపంచాల కథలు. వీటిలో హీరోల స్వభావాలు కూడా భిన్నమైనవే. ఒడిస్సియస్ తెలివి, వ్యూహాలతో విజయం సాధించే నాయకుడు. రాముడు ధర్మం, బాధ్యతకు ప్రతీక. పాండవులు నైతిక సంఘర్షణల మధ్య ప్రయాణించే పాత్రలు. కానీ ఈ మూడింటినీ కలిపే ఒకే భావన ఉంది.. విడిపోవడం.. పోరాడటం.. చివరకు తిరిగి చేరుకోవడం. అందుకే మూడు వేల ఏళ్ల నాటి ‘ది ఒడిస్సీ’ నేటి ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినా.. దాని గుండెకాయలో ఉన్న భావోద్వేగాలు మాత్రం ఎక్కడో మనకు తెలిసినవే అనిపిస్తాయి. బహుశా గొప్ప కథల శాశ్వత శక్తి అదే కావచ్చు. కాలం మారుతుంది.. సంస్కృతులు మారుతాయి.. కానీ ఇంటికి చేరుకోవాలనే మనిషి తపన మాత్రం ఎప్పటికీ మారదు. -
ఇలా కూడా చేస్తారా? 'ది ఒడిస్సీ' చూడాలని షాకింగ్ నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులందరి మధ్య డిస్కషన్‌కి కారణమైన మూవీ 'ది ఒడిస్సీ'. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు రూ.2000 కోట్లతో నిర్మించారు. గ్రీకు పురాణాల్లోని ఒడిసియస్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ మూవీని తీశారు. అందరూ మూవీని చూడాలని తెగ ఎగ్జైట్ అవుతుంటే ఓ మహిళ అభిమాని మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది.(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)గతేడాది ఓ సందర్భలో అమెరికా కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల అంబర్ కానగన్కి రెండో బిడ్డ గురించి ఆలోచించమని తన స్నేహితురాలు చెప్పింది. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఐమ్యాక్స్ 70ఎమ్ఎమ్లో తొలిరోజు 'ది ఒడిస్సీ' చూడటం కుదరదని, అందుకే బిడ్డని కనే ప్లాన్ వాయిదా వేసుకుంటానని చెప్పింది. మూవీ రిలీజ్ సందర్భంగా సదరు మహిళాభిమాని, హాలీవుడ్ ప్రముఖ వెబ్సైట్ 'వెరైటీ'తో ఇదంతా చెప్పడంతో ఈ సంగతి బయటపడింది.అంబర్ మాత్రమే కాదు ఈ సినిమా కోసం మరెందరో అభిమానులు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. ఎలాగైనా ఐమ్యాక్స్ థియేటర్లలోనే ఈ మూవీ చూడాలని.. అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు విమాన ప్రయాణాలు చేసి, గంటల తరబడి వర్చువల్ క్యూల్లో ఉండి మరీ 'ది ఒడిస్సీ' చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. ఈ మూవీని పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో తీశారు. ప్రపంచవ్యాప్తంగా 40 మాత్రమే ఐమ్యాక్స్ థియేటర్లలు ఉండటంతో ఆయా థియేటర్లలో టికెట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఏడాది క్రితమే టికెట్ సేల్స్ ప్రారంభించగా, ఎక్కువ శాతం షోలు గంటల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ కావడం విశేషం.ప్రాచీన గ్రీకు కవి హోమర్.. మూడు వేల ఏళ్ల క్రితం రచించిన 'ది ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ట్రోజన్ యుద్ధం తర్వాత తన రాజ్యం ఇథికాకు తిరిగెళ్లే క్రమంలో ఒడిసియస్ రాజు.. సముద్ర ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది స్టోరీ. సినిమాలో ఒడిసియస్ పాత్రలో మ్యాట్ డామన్ నటించగా.. మిగిలిన పాత్రలని ఆన్ హాత్వే, టామ్ హాలండ్ తదితరులు పోషించారు.(ఇదీ చదవండి: 'ది ఒడిస్సీ' సినిమా ట్విటర్ రివ్యూ) -
'ది ఒడిస్సీ' సినిమా ట్విటర్ రివ్యూ
హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ సినిమా 'ది ఒడిస్సీ' ఎట్టకేలకు(జూలై 17 నుంచి) థియేటర్లలోకి వచ్చేసింది. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. అయితే చూసిన ప్రతిఒక్కరూ వావ్, మాస్టర్ పీస్, మూవీ ఆఫ్ ది డెకేడ్ లాంటి మాటలు తప్పితే వేరొకటి అనట్లేదు. ఇంతకీ సోషల్ మీడియాలో ఏమంటున్నారు? ట్విటర్ టాక్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'ది ఒడిస్సీ' అనేది గ్రీకు పురాణాల్లోని ఒడియాసిస్ అనే రాజు కథతో తీసిన సినిమా. పదేళ్ల పాటు ఓ యుద్ధంలో పోరాడి గెలిచిన ఒడియాసిస్.. తన ఇథికా రాజ్యానికి తిరిగెళ్లిపోయి భార్య, కొడుకుని కలవాలనుకుంటాడు. కానీ సముద్ర ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అలా పదేళ్ల పాటు రకరకాల రాజ్యాలు తిరుగుతూ ఎట్టకేలకు సొంత రాజ్యానికి చేరుకుంటాడు.అయితే పేరుకే స్టోరీ సింపుల్‌గా అనిపిస్తున్నప్పటికీ నోలన్.. మూవీని మరో లెవల్లో తీశాడని, ఈ దశాబ్దంలోనే ఇది అత్యుత్తమ సినిమా అని అంటున్నారు. తొలి అరగంట కథలో లీనం కావడానికి కాస్త టైమ్ పడుతుందని, తర్వాత రెండున్నర గంటల పాటు ఒడియాసిస్ రాజుతో మనం కూడా జర్నీ చేస్తామని, ఆయన బాధ, ఆనందం లాంటివి ఫీలవుతామని నెటిజన్లు అంటున్నారు. థియేటర్లలో అస్సలు మిస్ కావొద్దని గుర్తుచేస్తున్నారు.(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)CHRISTOPHER NOLAN CANT MISS. THE ODYSSEY IS MOVIE OF THE DECADE. A SOLID 10/10 !!! https://t.co/n6B1ZcuUb4 pic.twitter.com/H9qBQ90aVw— vids that go hard (@vidsthatgohard) July 17, 2026Christopher Nolans #TheOdyssey is a goddamn masterpiece. The culmination of a career of the greatest filmmaker alive today. I don't even know where exactly to begin when talking about what Nolan has accomplished here. And my god, the performances here are immaculate. Everybody… pic.twitter.com/RVWxh06zGr— Alex Walason (@AlexWalason) July 16, 2026Non mais la performance de Matt Damon dans #TheOdyssey de Christopher Nolan est EXCEPTIONNELLE !!!Vraiment la manière dont il nous transmet autant d'émotions fortes, c'est complètement fou.Je pense vraiment que dans des décennies, on parlera de cette performance comme l'une… pic.twitter.com/P5nHnxEfKW— ✨🎬 QUENTIN 🎬✨ (@QuentWestbrook) July 16, 2026Christopher Nolan’s The Odyssey (🌟🌟🌟🌟🌟) is an unequivocal masterpiece & might be one of the best films I’ve ever seen in a movie theater. Part of an artist’s job is to use the power of past success to take creative swings & push boundaries. That is exactly what Nolan just… pic.twitter.com/0I8U5dJOfH— Cinema Tweets (@CinemaTweets1) July 17, 2026#TheOdyssey Technically Brilliant, A True Cinematic Experience!The first 30 minutes takes time to get going, but once Odysseus’ journey back begins, the film is exhilarating. Some sequences genuinely feel like a horror movie, while others play out like a proper commercial film.…— Venky Reviews (@venkyreviews) July 17, 2026I just came out of seeing The Odyssey. Unfortunately, I only got to watch it in a standard cinema and didn't get to experience it in IMAX in all its glory. Even so, I made sure to see it on day one because my expectations were incredibly high, and I'm happy to say they were… pic.twitter.com/6LF3Zq75oa— BossLogic (@Bosslogic) July 17, 2026 -
క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?
ఒడిస్సీ.. ఒడిస్సీ.. ఒడిస్సీ.. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నిరోజుల నుంచి డిస్కషన్ అంతా ఈ సినిమా గురించే. హాలీవుడ్‌లోనే పలు అద్భుతాలు తీసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ద డార్క్ నైట్, ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్, టెనెట్ లాంటి మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో మెప్పించిన నోలన్.. కెరీర్లోనే తొలిసారి పురాణాల ఆధారంగా 'ద ఒడిస్సీ' తీశాడు. మరి ఈ చిత్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎందుకు చూడాలి?(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)2004లో వచ్చిన 'ట్రాయ్' సినిమా గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. డబ్బింగ్ రూపంలోనూ చూసే ఉంటారు. తొలుత దీనికి దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్నే అనుకున్నారు. కానీ 'బ్యాట్ మ్యాన్' అవకాశం రావడంతో నోలన్ అటువైపు వెళ్లాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే ట్రాయ్ గుర్రం నేపథ్యం చిన్న భాగమైన 'ద ఒడిస్సీ' తీశాడు.మన దేశంలో పురాణాలు, ఇతిహాసాలు ఉన్నట్లే గ్రీకు పురాణాలు కూడా ఎంతో ఫేమస్. దీని ఆధారంగా ఇప్పటికే హాలీవుడ్లో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఫిజిక్స్, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ కథలతో ఆటాడుకునే క్రిస్టోఫర్ నోలన్.. గ్రీకు మైథాలజీలో భాగమైన ఒడిసియస్ రాజు గురించి సినిమాని తీస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎప్పుడైతే 'ద ఒడిస్సీ' ప్రకటన వచ్చిందో మూవీపై మంచి హైప్ వచ్చింది.ఓవైపు షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఏడాది క్రితమే 'ద ఒడిస్సీ' మూవీ టికెట్స్ ఆన్లైన్లో పెడితే నిమిషాల్లో అవి అమ్ముడైపోయాయి. అది నోలన్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్. ముందే చెప్పినట్లు జూలై 17న అంటే ఈ శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా మొత్తాన్ని క్రిస్టోఫర్ నోలన్.. గ్రీస్, స్కాట్లాండ్, ఐస్ ల్యాండ్ లాంటి తొమ్మిది దేశాల్లోని లైవ్ లొకేషన్స్‌లో ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్ చేశాడు. ఈ కెమెరాకి ఓ స్పెషాలిటీ ఉంది. వేరే ఏ కెమెరాలకు అయినా లెంగ్త్ విషయంలో ఎక్కువ, తక్కువ నిడివితో షూటింగ్ చేసుకోవచ్చు. కానీ ఐమ్యాక్స్ కెమెరాలో మూడు నిమిషాల సీన్ మాత్రమే క్యాప్చర్ చేయడానికి కుదురుతుంది.(ఇదీ చదవండి: అమ్మకానికి 'ఐమాక్స్'?)నోలన్ తనకు 16 ఏళ్లున్నప్పుడు ఐమ్యాక్స్ కెమెరాలో ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. అది ఇన్నాళ్లకు అంటే 55 ఏళ్ల వయసులో నెరవేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 40 ఐమ్యాక్స్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. నోలన్ 'ద ఒడిస్సీ' చిత్రాన్ని ఎలా తీశాడు? ఏం చూపించాలనుకున్నాడు? అనేది వీటిలో మాత్రమే కరెక్ట్‌గా కనబడుతుంది. మిగిలిన వాటిలో సినిమా విజువల్స్ పైన, కింద, మూలల్లో కట్ అయ్యే అవకాశముంటుంది.The difference between IMAX 70mm and the regular screen #TheOdyssey pic.twitter.com/nVkgqGPHrU— OTT Trackers (@OTT_Trackers) July 15, 2026 సాధారణంగా హాలీవుడ్ సినిమాలని మన దేశంలో పెద్దగా ప్రమోట్ చేయరు. కానీ నోలన్, తన టీమ్‌తో కలిసి కొన్నిరోజుల క్రితం భారతదేశంలో ల్యాండ్ అయ్యాడు. ముంబైలో జరిగిన ప్రీమియర్ పాల్గొన్నాడు. భరద్వాజ్ రంగన్, అనుపమ్ చోప్రా లాంటి ఫిల్మ్ అనలిస్ట్‌లకు నోలన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం అందరికీ ఆశ్చర్యపరిచింది. మన దేశ మార్కెట్‌పై ఇంతలా నోలన్ దృష్టిపెట్టడం ఆసక్తికర విషయం.(ఇదీ చదవండి: చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!)'ద ఒడిస్సీ' కథ విషయానికొస్తే.. ఇథికా అనే రాజ్యానికి చెందిన ఒడిసియస్ అనే రాజు చాలా బలవంతుడు, తెలివైనవాడు. తన రాజ్యాన్ని వదిలి పదేళ్ల పాటు పోరాడి ఓ యుద్ధాన్ని గెలుస్తాడు. వెంటనే తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయి భార్య పెనలోపి, కొడుకు టెలీమాకస్ని కలవాలనుకుంటాడు. కానీ విధి ఇతడికి సహకరించదు. సముద్రదేవుడు, గాలి దేవుడు, అగ్ని దేవుడు, ఇలా చాలామంది ఒడిసియస్ రాజుపై పగబడతారు. ఒంటి కన్ను రాక్షసుడు, మంత్రగత్తెలు తదితరుల కారణంగా పదేళ్లు పాటు రకరకాల రాజ్యాల్లో తిరుగుతూ చిట్టచివరికి ముసలివాడైన ఓ బిచ్చగాడిలా తన రాజ్యంలో అడుగుపెడతాడు. స్వయంవరంలో గెలిచి మళ్లీ తన భార్య పెనలోపిని దక్కించుకుంటాడు.ఎమోషన్స్, విజువల్స్ ఎఫెక్ట్స్, అడ్వెంచర్, సర్వైవల్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 'ద ఒడిస్సీ'పై హైప్ ఉన్నప్పటికీ నెగిటివిటీ కూడా కొంత ఏర్పడింది. ట్రైలర్‌కి యూట్యూబ్‌లో డిస్ లైక్స్ లాంటివి వచ్చాయి. ఇలా ప్లస్సులు, మైనస్సులు ఉన్నప్పటికీ మూవీ లవర్స్ మాత్రం ఒక్కసారైనా 'ద ఒడిస్సీ'ని చూడాల్సిందే అని ఫిక్సయ్యారు. మరి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఏంటో? తెలుగులోనూ ఇది రిలీజ్ అవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?) -
చిన్నప్పుడు మహేశ్, పవన్ కల్యాణ్ తో అలా...ఇప్పుడు ఇలా! (ఫొటోలు)
-
ముంబయి వీధుల్లో హాలీవుడ్ స్టార్స్ సందడి.. వీడియో వైరల్
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ది ఓడిస్సీ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ది ఒడిస్సీ ప్రీమియర్ షో కోసం ముంబయికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ ముంబయిలోని ఒలింపియా కాఫీ హౌస్‌లో సందడి చేశారు.ముంబయి నగరంలోని స్థానిక కొలాబాలో ఉన్న 108 ఏళ్ల పురాతనమైన ప్రసిద్ధ ఒలింపియా కాఫీ హౌస్‌కు విచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ టీమ్.. అదే కాఫీ హౌస్‌లో టీ తాగి, బన్ మస్కాను రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఈ సందర్భంగా క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్, మాట్ డామన్‌లను కాఫీ హౌస్‌లో చూడగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అందరూ వెంటనే తమ ఫోన్లు తీసి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. ఈ హాలీవుడ్ అగ్రతారలు ముంబయిలో బన్ మస్కా ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా కనిపించారు. View this post on Instagram A post shared by Universal Pictures India (@universalpicturesindia) -
పలు దేశాల్లో నిషేధించిన వివాదాస్పద సినిమా.. తెలుగు రివ్యూ
వివాదాస్పద అంశాల్ని చూపించారనే కారణాలతో కొన్నిసార్లు కొన్ని సినిమాల్ని ప్రభుత్వాలే నిషేధిస్తుంటాయి. రీసెంట్గా మన దేశంలో 'సత్లుజ్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. గత మూడేళ్లుగా సెన్సార్ బోర్డ్ దగ్గర ఇబ్బందులు పడ్డ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ రెండు రోజుల్లోనే దాని నుంచి కూడా తీసేశారు. ఇంతకు మించి ఇబ్బందులు ఎదుర్కొంది 'సిటిజన్ విజిలాంట్' అనే ఇంగ్లీష్ మూవీ. యూరప్‌లోని జర్మనీ, యూకే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో దీనిని అస్సలు విడుదల కానివ్వలేదు. మరి అంతలా ఇందులో కాంటవర్సీ ఏముంది? దీనిని ఎక్కడ చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూశాక ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)కథేంటి?క్రొయేషియాలో స్థిరపడిన అమెరికన్ బిలినీయర్ శాండర్స్ (ఆర్మీ హామర్).. తన దేశంలో అక్రమ వలసదారుల కారణంగా జరుగుతున్న హింస, అత్యాచారాలు, హత్యలు లాంటి దారుణాలు చూసి చలించిపోతాడు. న్యాయవ్యవస్థ, పోలీసులు.. సదరు నేరస్తులని ఎలాంటి శిక్ష విధించకుండా విడిచిపెట్టేయడం లాంటివి చూస్తాడు. దీంతో కోపమొచ్చి విజిలెంట్‌గా మారి సదరు నేరస్తులని, వాళ్లని రక్షిస్తున్న నాయకుల్ని చంపడం మొదలుపెడతాడు. మరి చివరకు ఏమైంది? శాండర్స్ అనుకున్నది సాధించాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతిదేశం 'అక్రమ వలసలు' అనే అతిపెద్ద సమస్యని ఎదుర్కొంటోంది. అయితే చాలా దేశాలు ఇలాంటి వాళ్లని గుర్తించి తిరిగి వారి సొంత ప్రాంతాలకు పంపించేస్తుండగా యూరోప్‌లో మాత్రం వీళ్లని చూసిచూడనట్లు వదిలేస్తున్నారు! పైపెచ్చు సకల సౌకర్యాలు ఇస్తున్నారు. దీంతో వాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఆశ్రయిమిచ్చిన దేశంలోని ఆడపిల్లల్ని, మహిళల్ని లైంగికంగా వేధిస్తూ అశాంతి కలిగిస్తున్నారు. అలాంటి వాళ్లని నిర్ధాక్షిణ్యంగా చంపుకొంటూ, గాయపరుస్తూ వెళ్లే ఓ కడుపు మండిన వ్యక్తి కథే ఈ సినిమా.అంతర్జాతీయ వార్తలు చదివే వాళ్లకు యూరోపియన్ దేశాల్లో పాక్ గ్రూమింగ్ గ్యాంగ్ చేసే అరాచకాల గురించి తెలిసే ఉంటుంది. ఆయా దేశాల్లోని టీనేజీ అమ్మాయిలని కిడ్నాప్ చేసి లేదంటే వల వేసి అత్యాచారాలకు తెగబడటం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్లపై అక్కడి న్యాయస్థానాలు గానీ పోలీసులు గానీ సరైన చర్యలు తీసుకోవడం లేదు. చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ మూవీలోనూ పచ్చిగా చూపించారు. వలసదారుల నేరాలను అరికట్టడంలో తాము విఫలమవుతున్నామని చూపిస్తే ప్రభుత్వం, న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోవు. మూవీని మొత్తానికే నిషేధించారు.నిషేధం అయితే విధించారు కానీ మిగిలిన దేశాలకు చెందిన వాళ్లు చూడకుండా యూరోపియన్ ప్రభుత్వం, న్యాయస్థానాలు ఆపలేకపోయాయి. ప్రస్తుతం అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ట్విటర్లో ఈ సినిమా మొత్తాన్ని వివిధ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేశారు. మన దేశంలోనూ అందుబాటులో ఉంది.యూరోపియన్ దేశాల్లో భద్రత అనేది గాల్లో దీపంలా ఎలా తయారైంది? ఆయా దేశాలకు చెందిన వేలాది మంది అమ్మాయిలు.. పాక్, ఆఫ్రికా నుంచి అక్రమంగా వలస వెళ్లిన యువకుల కారణంగా ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారనేది ఇందులో రా గా చూపించారు. ఇక క్లైమాక్స్‌లో హీరో.. ఓ ఫ్యామిలీతో పాటు కొందరు కుర్రాళ్లని చంపే సీన్ అయితే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. సదరు అత్యాచారాలు చేసే యువకుల మనసులని వాళ్ల కుటుంబాలే ఎలా కలుషితం చేస్తున్నాయనేది కూడా ఇందులో క్లియర్ గా చూపించారు. కేవలం గంటన్నర నిడివితో ఉండే ఈ సినిమా ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపిస్తుంది కానీ కాస్త ఓపికతో చూస్తే యూరోపియన్ దేశాల అసలు స్వరూపం బయటపడుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ) -
ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూపర్ హీరో కాన్సెప్ట్ అనగానే చాలామందికి హాలీవుడ్ సినిమాలే గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్, అవెంజర్ తదితర స్టోరీలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అలా ఈ తరహా కథతో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సూపర్ గర్ల్'. ఇప్పుడీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఇది ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)మిల్లీ ఆల్కాక్ లీడ్ రోల్ చేసిన సినిమా 'సూపర్ గర్ల్'. డీసీ సంస్థ నిర్మించింది. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే 100 మిలియన్ డాలర్లకు పైగా నష్టాలు చవిచూసింది. టాక్ కూడా యావరేజ్ వచ్చింది. విజువల్స్, నటి ఫెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ స్టోరీలో పెద్ద పస లేకపోవడం, ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడంతో జనాలకు పెద్దగా నచ్చలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.'సూపర్ గర్ల్' విషయానికొస్తే.. క్రిప్టన్ గ్రహం నాశనమైన తర్వాత భూమికి చేరిన కరా జోర్ ఎల్ (సూపర్ గర్ల్)కి చెందిన స్పేస్ డాగ్ క్రిప్టో.. విలన్ (క్రిమ్) చేతిలో విషప్రయోగానికి గురవుతుంది. దీంతో అతడిని కాపాడుకోవడానికి సూపర్ గర్ల్.. అంతరిక్ష ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? చివరకు క్రిప్టోని కాపాడిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
లేడీ సింగర్ పెళ్లి.. రూ.191 కోట్ల ఖర్చు.. రూ.248 కోట్ల విరాళం
ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పెళ్లి చేసుకుంది. అమెరికన్ ఫుట్‌బాలర్ ట్రావిస్ కెల్సేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఒక్కటయ్యారు. టేలర్ స్విఫ్ట్ ప్రతినిధి ట్రి పైన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. పెళ్లి తర్వాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్ బయటున్న భారీ డిజిటల్ స్క్రీన్‌పై 'JUST&T MARRIED!' అని ప్రదర్శించారు.(ఇదీ చదవండి: 'నాగబంధం' సినిమా.. ఒక్కరోజులోనే కట్ చేసిపడేశారు)న్యూయార్క్ నగర అనుమతుల విభాగం ప్రత్యేక కార్యక్రమానికి బుధవారం అధికారిక అనుమతి ఇచ్చింది. గురువారం సాయంత్రం 100 మంది అతిథులతో రిహార్సల్ డిన్నర్ నిర్వహించగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రధాన వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. అయితే ఈ వేడుకకు రూ.191 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఈ పెళ్లి వేడుకకు హాలీవుడ్, సంగీత, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హ్యూ గ్రాంట్, ఈథన్ హాక్, బ్రాడ్లీ కూపర్, డకోటా జాన్సన్, బ్రాడ్ పిట్, కింబర్లీ విలియమ్స్-పైస్లీ తదితరులు సందడి చేశారు. అయితే పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా వేదిక దగ్గర మొబైల్ ఫోన్లపై నిషేధం విధించారు.ఇకపోతే పెళ్లికి ముందు టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సే.. దేశవ్యాప్తంగా పలు సేవా సంస్థలకు సుమారు 26 మిలియన్ డాలర్లు(రూ.248 కోట్లు) విరాళంగా అందించినట్లు వారి ప్రతినిధి వెల్లడించారు. ఫుడ్ బ్యాంక్స్, ఆర్ట్స్ కాలేజీలు, చిన్నారుల క్యాన్సర్ చికిత్సా కార్యక్రమాలకు ఈ మొత్తం అందనుంది. డాలీ పార్టన్‌కు చెందిన 'ఇమాజినేషన్ లైబ్రరీ' కూడా రెండు మిలియన్ డాలర్ల విరాళం అందుకోగా, ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కొత్త కారు కొన్న యంగ్ హీరో)Taylor Swift and Travis Kelce are officially got married.#Tranvis #Taylorswift #Tranviswedding pic.twitter.com/XRGGOzOkg9— Nizam Tellawi (@nizamtellawi) July 4, 2026 -
చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే ఊహలకు రెక్కలు తొడిగిన కథలు గుర్తొచ్చేవి. ఎగిరే కార్లు, అంతరిక్ష యుద్ధాలు, భవిష్యత్తు నగరాలు... అలాంటి కలల ప్రపంచమే ఆ తరహా సినిమాల ప్రత్యేకత. కానీ కాలం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సే(AI) ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనతో మాట్లాడుతోంది. మనకోసం రాస్తోంది. చిత్రాలు గీస్తోంది. సంగీతం సృష్టిస్తోంది. మనిషి చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తోంది. అయితే..ఈ అద్భుతాలన్నింటి మధ్య ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది.. ప్రేమను కూడా సృష్టించగలమా?. ఆ ప్రశ్నను ప్రపంచం ముందు పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది A.I. Artificial Intelligence అనే ఆంగ్ల చిత్రం. ఇది యంత్రాల గురించి తీసిన సినిమా కాదు. మనిషిలా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి గురించి చెప్పిన కథ. రక్తమాంసాలు లేని శరీరంలోనూ మనసు ఉంటే ఎలా ఉంటుందో చూపించిన అరుదైన చిత్రం. సాంకేతిక అద్భుతాల కన్నా భావోద్వేగాలకే పెద్దపీట వేసిన సినిమా. ఈ కథ వెనుక కూడా ఒక కథే ఉంది.ఎన్నో ఏళ్ల పాటు ఈ ఆలోచనను తనలో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి ప్రేమ కోసం వెతికే కథ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కథను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు దానిపై పరిశోధన చేశారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురాకముందే ఆయన వెళ్లిపోయారు(1999). ఆ కలను ఆయన సన్నిహితుడు, మరో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ Steven Spielberg తన భుజాలపై వేసుకున్నారు. ఒకరి ఆలోచన, మరొకరి హృదయం కలిసినప్పుడు పుట్టిన చిత్రమే A.I. Artificial Intelligence.2001 జూన్ 29న A.I. Artificial Intelligence రిలీజ్అయ్యింది. జులై మొదటి వారంలో భారత్‌లో విడుదలయ్యింది. విడుదలైన రోజున ఈ చిత్రాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. కొందరికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. మరికొందరికి ముగింపు భారంగా అనిపించింది. కానీ మంచి కళకు కాలమే న్యాయనిర్ణేత. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ సినిమాకు అభిమానులు పెరిగారు. నేడు ప్రపంచ సినీ చరిత్రలో భావోద్వేగానికి కొత్త అర్థం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చాలామంది "కుబ్రిక్ మేధస్సు, స్పీల్బర్గ్ హృదయం కలిసిన చిత్రం" అని అభివర్ణిస్తారు. ఈ కథలో డేవిడ్ అనే చిన్న రోబో ఉంటాడు. చూడటానికి పిల్లాడే. మాట్లాడతాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. కానీ అతడిని మిగతా యంత్రాలన్నింటి నుంచి వేరు చేసింది ఒక్కటే. అదే.. ప్రేమించే గుణం. అయితే ఒక కుటుంబం అతడిని తమ బిడ్డగా అంగీకరిస్తుంది. అతడు కూడా ఆ మహిళను యజమానిగా కాదు... అమ్మగా భావిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. ఎలాంటి లెక్కలు ఉండవు. ఒక చిన్నారి హృదయం మాత్రమే ఉంటుంది. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పరిస్థితులు అతడిని ఆ ఇంటి నుంచి దూరం చేస్తాయి. అయినా అతడు వదిలిపెట్టడు. అమ్మ మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటుందనే ఆశతో ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడే ఈ సినిమా మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణం ఒక రోబోది కాదు. ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి మనిషిది.ఈ చిత్రం విడుదలైనప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కొద్దిమంది శాస్త్రవేత్తల చర్చల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ప్రతి ఇంట్లోకి వచ్చింది. ప్రతి చేతిలోని ఫోన్లో ఉంది. ప్రతి కార్యాలయంలో ఉంది. మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఎంత మారినా... డేవిడ్ అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒక యంత్రం నిజంగా ప్రేమిస్తుందా? లేక ప్రేమిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందా?చాలా సినిమాలు యంత్రాలు ప్రపంచాన్ని జయిస్తాయని ఊహించాయి. ఈ సినిమా మాత్రం ప్రపంచం ఒక చిన్న యంత్రాన్ని ఎలా ఒంటరిగా వదిలేసిందో చూపించింది. అందుకే కాలం గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇది భవిష్యత్తును ఊహించినందుకు గొప్ప సినిమా కాదు. భవిష్యత్తులో మనిషి ఏం కోల్పోవచ్చో ముందే హెచ్చరించిన సినిమా కాబట్టే గొప్పది. -
నెట్‌ఫ్లిక్స్‌నే మోసం చేసిన డైరెక్టర్.. చివరికీ ఏమైందంటే?
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రించ్కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఓ సిరీస్ తీసేందుకు నెట్‌ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అతను దాదాపు 11 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ తీస్తానని నెట్‌ఫ్లిక్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాల కోసం కార్లు, క్రిప్టోకరెన్సీ, ఇతర విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించుకున్నాడు. దీంతో అతనిపై నెట్‌ఫ్లిక్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో దర్శకుడు దోషిగా తేలడంతో న్యాయస్థానం జైలు శిక్షతో పాటు 700 డాలర్ల జరిమానా విధించారు. కాగా.. డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ 2013లో వచ్చిన '47 రోనిన్' చిత్రంతో బాగా ఫేమస్ అయ్యారు. -
‘ఐ విల్ ఫైండ్ యూ’ రివ్యూ : సూపర్ థ్రిల్లింగ్ సిరీస్
ప్రేమానుబంధమనేది మమతానురాగాలతో పెనువేసుకున్న ఓ చిక్కుబంధం. అందులోనూ రక్తసంబంధం అనేది మరింత జటిలమైనది. తామ రక్తసంబంధం ఏ సమయంలోనైనా సరే దూరమైతే ఆ బాధ వర్ణణాతీతం. మళ్ళీ దూరమైన వారితో కలిస్తేనే తమ జీవితానికి అర్ధం అని అనుకునేవారెందరో. ఆ నేపధ్యంతోనే హాలివుడ్ రచయిత హర్లాన్ కోబన్ రాసిన కథే ఐ విల్ ఫైండ్ యూ. ఇప్పుడీ కథను నెట్ ఫ్లిక్స్ 8 ఎపిసోడ్‌ల్ సిరీస్ రూపంలో తీసుకువచ్చింది. కొడుకు హత్యారోపణను ఎదుర్కుంటున్న ఓ తండ్రి చనిపోయిన తన కొడుకును వెతుకుతూ సాగించిన పోరాటమే ఈ ఐ విల్ ఫైండ్ యూ సిరీస్. డేవిడ్ బరోస్ తన కొడుకు మాథ్యూ బరోస్ ను చంపిన కేసులో కౌంటీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. మాధ్యూ బరోస్ తల్లి ఛెరిల్ చెల్లెలైన రేచెల్ మిల్స్ తన బావ డేవిడ్ బరోస్ ను చూడడానికి జైలుకు వస్తుంది. ఆ సమయంలోనే రేచేల్ మాథ్యూ చనిపోలేదని ఓ ఫోటో డేవిడ్ కు చూపుతుంది. తన కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న డేవిడ్, రేచెల్ సహాయంతో జైలు నుండి తప్పించుకుని మాథ్యూని వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రయత్నంలోనే రేచెల్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆడమ్ ఇంట్లో డేవిడ్, రేచెల్ తలదాచుకుంటారు. ఇక అక్కడి నుండి కథ అనూహ్యమైన మలుపులతో ఊహ కందని ట్విస్టులతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చనిపోయిన కొడుకు మాథ్యూ కేసులో నిందితుడైన డేవిడ్ మాథ్యూని రేచెల్ తో కనుక్కోగలడా లేదా అన్నది ఈ థ్రిల్లింగ్ సిరీస్ లోనే చూడాలి. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం చూస్తున్న ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తూ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఎవరూ ఊహించని సస్పెన్స్ తో సాగే ఈ సిరీస్ థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి సరైన ఛాయిస్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో ప్రపంచం మొత్తం ఏదైనా సినిమా గురించి మాట్లాడుకున్నారంటే అది 'అబ్సెషన్' గురించే. కర్రీ బార్కర్ అనే ఓ యూట్యూబర్ దర్శకుడిగా మారి ఈ మూవీ తీశాడు. బడ్జెట్ కూడా రూ.7 కోట్లే. కానీ ఇప్పటివరకు రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదిరిపోయే రికార్డ్ సృష్టించింది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గత నెల ప్రారంభంలో అమెరికాలో రిలీజ్ కాగా.. రెండు మూడు వారాల తర్వాత మన దేశంలోని థియేటర్లలో విడుదలైంది. భారతీయ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఆకట్టుకుంది. మంచి వసూళ్లు అందుకుంది. ఇప్పుడీ చిత్రం రేపటి(జూన్ 30) నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే రానుండగా.. త్వరలో తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ కూడా జోడించనున్నారు.ఆపిల్ టీవీ ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మూవీలో మైకేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే హీరోహీరోయిన్లుగా నటించారు. అతిప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల జీవితాల్ని ఎలా నాశనం చేసిందనే పాయింట్‌తో 'అబ్సెషన్' తీశారు. అయితే కొందరు ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చలేదు కూడా.'అబ్సెషన్' విషయానికొస్తే.. బేర్ (మైకేల్ జాన్స్టన్) కాలేజీ కుర్రాడు. ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్లలో ఒకరైన నిక్కీని(ఇండే నవరెట్టే) ఇతడు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడిపోతుంటాడు. ఓ రోజు 'వన్ విష్' పేరుతో ఉన్న చిన్న వస్తువుని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనని చాలా ప్రేమించేయాలని బలంగా కోరుకుంటాడు. ఊహించని విధంగా ఆ కోరిక నిజమైపోతుంది. నిక్కీ, బేర్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?
ఓటీటీల్లోకి ఈ వారం బ్లాస్ట్, రాజా శివాజీ, అవతార్ 3 లాంటి సినిమాలు వచ్చేశాయి. వీటితో పాటు 'ద షీప్ డిటెక్టివ్స్' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ కూడా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉన్న ఈ సినిమాని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కు కాస్త కామెడీ జోడించి తీశారు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు)కథేంటి?జార్జ్(హ్యూ జాక్మన్) ఓ గొర్రెల కాపరి. డెన్బ్రూక్ అనే చిన్న పల్లెటూరిలో జీవిస్తుంటాడు. అయితే రాత్రి పడుకోవడానికి ముందు గొర్రెలకు తన దగ్గరుండే డిటెక్టివ్ నవలలు చదివి వినిపిస్తుంటాడు. అయితే ఆ గొర్రెలకు ఈ కథలన్నీ అర్థమవుతున్నాయనే సంగతి జార్జ్‌కి తెలియదు. ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి జార్జ్‌ని ఎవరో చంపేస్తారు. ఈ కేసుని ఓ పోలీస్ దర్యాప్తు చేస్తుంటాడు. మరోవైపు గొర్రెలన్నీ డిటెక్టివ్‌గా మారి తన కాపరిని ఎవరో చంపారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. చివరకు హంతకుడు దొరికాడా? లేదా? అసలు జార్జ్‌ని ఎవరు ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు మీరెన్ని మర్డర్ మిస్టర్ థ్రిల్లర్స్ చూసే ఉంటారు. వాటన్నింటిలోనూ పోలీసులు లేదా ప్రైవేట్ డిటెక్టివ్స్, చుట్టూ పక్కన ఉండే వాళ్లలో ఎవరో ఒకరు పరిష్కరించడం లాంటివి చూసుంటారు. కానీ ఇందులో మాత్రం గొర్రెలు.. ఓ హత్య కేసుని పరిష్కరించేందుకు చాలా సహాయపడతాయి. వినడానికి విచిత్రంగా ఉంది కదా! కానీ పెద్దగా హడావుడి లేకుండా సరదాగా మూవీ తీసేశారు.మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఏదేదో ట్విస్టులు ఊహించేసుకుంటాం కదా. ఇందులో హత్య చేసింది ఎవరు? అనే ట్విస్ట్ ఉంటుంది గానీ దానికంటే గొర్రెలు, మనుషుల్లా మాట్లాడుకోవడం.. తమ కాపరి ఇప్పటివరకు చదివి వినిపించిన డిటెక్టివ్ పుస్తకాల్లోని స్టోరీల ఆధారంగా ఈ కేసుని ఛేదించేందుకు ప్రయత్నం చేయడం లాంటివి ఫన్నీగా ఉంటాయి. గ్రాఫిక్స్ కూడా చాలా సహజంగా ఉంది.అలానే అప్పటివరకు ఊరి చివర గడ్డి తిని బతికే గొర్రెలు.. మనుషులు ఉండే ప్రపంచంలోకి వచ్చి గందరగోళానికి గురవడం లాంటివి కూడా ఫన్నీగా చూపించారు. జార్జ్‌తో పాటు అదే ఊరిలోని మరో గొర్రెల కాపరి, కసాయి వాడు, ఓ హోటల్ యజమాని, పోలీసోడు, ఓ న్యూస్ రిపోర్టర్, జార్జ్ కూతురు.. ఇలా చాలా పాత్రలపై అనుమానం వచ్చేలా దర్శకుడు స్టోరీని నడిపించాడు. కానీ క్లైమాక్స్‌లో హంతకుడు/హంతకురాలు ఎవరనేది పెద్దగా హడావుడి లేకుండా చూపించి సినిమా ముగించాడు.సినిమాలోని నటించిన నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలైతే కాదు. కానీ ఆయా పాత్రలకు సెట్ అయిపోయారు. తెలుగు డబ్బింగ్, గొర్రెల గ్రాఫిక్స్ లాంటివి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుదిరితే పిల్లలకు కూడా చూపించండి. వాళ్లు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దాదాపు 100 నిమిషాలుండే ఈ మూవీ ఇలా మొదలుపెడితే అలా అయిపోతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు
-
ఓటీటీకి వచ్చేసిన డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారంలో కొత్త సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ మిస్టరీ కామెడీ మూవీ సడన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ స్టార్ హ్యూ జాక్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన మిస్టరీ కామెడీ చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా జూన్ 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ రచయిత లియోనీ స్వాన్ రాసిన త్రీ బ్యాగ్స్ ఫుల్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కైల్ బాల్డా దర్శకత్వం వహించారు.ఈ మూవీ కథేంటంటే..డెన్బ్రూక్ అనే చిన్న పట్టణంలో గొర్రెల కాపరిగా పనిచేసే హ్యూ జాక్మాన్ అనుకోని పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. అయితే, ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే కోణంలో కథ ఉండనుంది. దీని కోసం ఆయన మందలోని గొర్రెలే రంగంలోకి దిగడం ఈ చిత్రంలో హైలెట్. గొర్రెలు తమ యజమాని మరణానికి కారణమైన వారిని ఎలా వెతికి పట్టుకున్నాయనేదే ది షీప్ డిటెక్టివ్స్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఓటీటీలో చూసేయండి. -
చిన్న వయసులోనే కన్నుమూసిన ప్రముఖ బాలనటి
హాలీవుడ్ ప్రముఖ నటి డేవీ ఛేజ్ చనిపోయింది. 35 ఏళ్ల వయసుకే ఈమె నూరేళ్లు నిండిపోయాయి. లాస్ ఏంజెల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డేవీ మృతి చెందినట్లు ఈమె మేనేజర్ జాన్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. మెనింజైటిస్ కారణంగా వచ్చిన సెప్సిస్‌తో ఈమె చనిపోయినట్లు పేర్కొన్నారు. మరణానికి ముందు పోషకాహార లోపంతో ఆస్పత్రిలో చేరినట్లు ఈయన పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)డేవీ ఛేజ్.. నాలుగేళ్లకే యాక్టర్‌గా మారింది. ఏడేళ్ల వయసులోనే హాలీవుడ్లో తొలి అవకాశం దక్కించుకుంది. అమెరికన్ సిట్కామ్ 'సబ్రినా ది టీనేజ్ విచ్' షోతో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం డోనీ డార్కో, ఎస్ డార్కో చిత్రాల్లో నటించింది. అయితే 2002లో రిలీజైన హారర్ మూవీ 'ద రింగ్' మూవీలో సమారా మోర్గాన్ అనే పాత్రతో భయపెట్టింది. టీవీ నుంచి బయటకొస్తూ భయపెట్టే ఆ పాత్ర చాలామంది ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.2002లో రిలీజైన యానిమేషన్ మూవీ 'లిలో & స్టిచ్'లో లిలో పాత్రకు డబ్బింగ్ చెప్పి డేవీ గుర్తింపు అందుకుంది. పలు అవార్డులు కూడా ఈమెని వరించాయి. తర్వాత కాలంలో చార్మ్డ్, ఈఆర్, టచ్డ్ బై యాన్ ఏంజెల్ తదితర వెబ్ సిరీస్‌ల్లో అతిథి పాత్రలు చేసింది. బిగ్ లవ్ సిరీస్‌లో రొండా వోల్మర్ పాత్రలో 32 ఎపిసోడ్ల పాటు కనిపించింది. 2015 తర్వాత నటనకు పూర్తిగా దూరమైన డేవీ ఛేజ్.. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఇలా అనారోగ్య సమస్యల బారిన పడి చనిపోవడం చాలామందిని షాక్‌కి గురిచేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్) -
స్పైడర్ మ్యాన్ vs హల్క్.. కొత్త తెలుగు ట్రైలర్ రిలీజ్
ఒకప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాలంటే యమ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు చాలావరకు హైప్ తగ్గిందనే చెప్పొచ్చు. అయినా సరే ఎప్పటికప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. వచ్చే నెల 30న థియేటర్లలో రాబోతున్న చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండాయా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్లో నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించడం, స్పైడర్ మ్యాన్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణం లాంటివి చూపించారు. ఈసారి వచ్చిన ట్రైలర్లో మాత్రం హల్క్‌తో పాటు మరికొందరితో స్పైడీ చేసే ఫైట్స్ చూపించారు. ఇకపోతే ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన టామ్, జెండాయా నిజజీవితంలో పెళ్లి చేసుకోవడం విశేషం.స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'బాహుబలి' రమ్యకృష్ణ సెకండ్ లవ్) -
'సూపర్ గర్ల్' రిలీజ్ ఎప్పుడంటే?
డీసీ స్టూడియోస్ నిర్మిస్తున్న హాలీవుడ్ మూవీ సూపర్ గర్ల్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మిల్లీ ఆల్కాక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కొత్త డీసీ సినిమాటిక్ యూనివర్స్‌లో కీలక చిత్రంగా రూపొందింది. ఈ మూవీ వివరాలను నిర్మాత జేమ్స్ గన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. సూపర్ మ్యాన్‌తో పోలిస్తే సూపర్ గర్ల్ జీవితం ఎంతో కఠినమైనదని తెలిపారు. ప్రేమతో కూడిన కుటుంబంలో పెరిగిన సూపర్ మ్యాన్‌కు విశ్వంలోని మంచితనంపై నమ్మకం కలిగుండటం సులభమైంది. కానీ తన గ్రహం నాశనమవడం, తల్లిదండ్రుల మరణాన్ని కళ్లారా చూసిన సూపర్ గర్ల్‌కు అలాంటి నమ్మకం ఏర్పడటం అంత సులభం కాదన్నారు. ముఖ్యంగా సినిమాలో నటి కారా జోర్ ఎల్ వ్యక్తిగత వేదన, మానసిక సంఘర్షణలు, ప్రతీకారం, న్యాయం మధ్య జరిగే పోరాటం ప్రధానాంశాలుగా ఉంటాయన్నారు. తన పెంపుడు కుక్క క్రిప్టోను కాపాడేందుకు సూపర్ గర్ల్ చేసే అంతరిక్ష ప్రయాణం కథలో కీలకంగా మారుతుందన్నారు. ఈ చిత్రాన్ని వార్నర్స్ బ్రదర్స్ సంస్థ 3డీ ఫార్మాట్లలో ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోందని చెప్పారు. -
ఈసారి 11 వేల అడుగుల ఎత్తులో.. ట్రైలర్ రిలీజ్
మన దగ్గర దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ హాలీవుడ్లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం థియేటర్లలో, ఆపై ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకున్న చిత్రం 'ఫాల్'. 2000 వేల అడుగుల ఎత్తు ఉన్న ఓ పాడుబడ్డ టవర్‌పై ఇద్దరమ్మాయిలు చిక్కుకుంటే ఏమైందనేది కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా సిద్ధం చేశారు. ట్రైలర్ వదిలారు.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం)ట్రైలర్ బట్టి చూస్తే ఈసారి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలపై అడ్వెంచర్ కోసం వెళ్లి ఇద్దరు ఆడపిల్లలు చిక్కుకుపోతారు. తర్వాత ఏమైంది? వీళ్లు బతికి బయటపడ్డారా? లేదా అనేది స్టోరీ అనిపిస్తోంది. తొలి పార్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. చూస్తే మాత్రం నరాలు తెగే ఉత్కంఠతో భయపడిపోతారు. మరి ఈ ఏడాది థియేటర్లలో రిలీజయ్యే సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి?(ఇదీ చదవండి: టీవీకే పార్టీలోకి హీరో రాఘవ లారెన్స్? పోస్టుతో క్లారిటీ) -
సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ
రీసెంట్ టైంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'అబ్సెషన్'. ఇదో హాలీవుడ్ సినిమా. తీసింది కూడా ఓ యూట్యూబర్. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటివరకు రూ.1600 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తోంది. మూడు వారాల క్రితం అమెరికాలో రిలీజై, గతవారం మన దేశంలోని థియేటర్లలోకి వచ్చింది. ఈ సెన్సేషనల్ మూవీలో అంతలా ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ)కథేంటి?బేర్ (మైకేల్ జాన్స్టన్) కాలేజీ కుర్రాడు. ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్లలో ఒకరైన నిక్కీని(ఇండే నవరెట్టే) ఇతడు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడిపోతుంటాడు. ఓ రోజు 'వన్ విష్' పేరుతో ఉన్న చిన్న వస్తువుని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనని చాలా ప్రేమించేయాలని బలంగా కోరుకుంటాడు. ఊహించని విధంగా ఆ కోరిక నిజమైపోతుంది. నిక్కీ, బేర్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే? అబ్సెషన్ అంటే తెలుగులో పిచ్చి లేదా యావ అనే అర్థం. అంటే ఒక వ్యక్తిపై లేదా ఒక వస్తువు గురించి విపరీతంగా ఆలోచించడం, ఇష్టపడటం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ సినిమా విషయానికొస్తే సింపుల్ స్టోరీ లైన్. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే వాళ్లలో ఒకరు, ఎదుటి వ్యక్తిని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తే ఏమవుతుందనేది మిగతా స్టోరీ.కేవలం గంట 45 నిమిషాల నిడివితో ఉండే ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్‌లో, థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్స్ ఏం ఉండవు గానీ కొన్నిచోట్ల అంతకు మించి భయపెడుతుంది. కూర్చున్న సీటు నుంచి కదిలిపోయేలా చేస్తుంది. చాలా నిదానంగా స్టోరీ మొదలవుతుంది. ఎప్పుడైతే హీరో.. హీరోయిన్ని తనని ప్రేమించాలని కోరుకుంటాడో అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. చివరివరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు.సాధారణంగా ఇంగ్లీష్ సినిమాల్లో ఇంటర్వెల్ లాంటివి ఉండవు. మన దేశంలో స్క్రీనింగ్ అయ్యే వాటికి సడన్‌గా కట్ చేసి ఇంటర్వెల్ కార్డ్ వేస్తారు. కానీ 'అబ్సెషన్'లో మాత్రం ఫెర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఒక మూవీ వస్తుందంటే దీనిలో సీన్లు గతంలో ఎక్కడో చూశామే అని కచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో అలా ఏం అనిపించదు. స్టోరీ నుంచి సీన్స్ వరకు అన్ని ఫ్రెష్‌గా ఉంటాయి.ఒక సీన్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటారు. అంతా ప్రశాంతంగా ఉందేంటి? సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ అని అనుకునేలోపు అదిరిపోయే బ్యాంగర్ పడుతుంది. క్లైమాక్స్ కూడా అస్సలు ఊహించలేం. ఈ మూవీలో హీరోహీరోయిన్తో పాటు మరో రెండు ఫ్రెండ్ పాత్రలు, అదనంగా మరో నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తారు. ఈ సినిమా తీసిన కర్రీ బార్కర్ స్వతహాగా యూట్యూబర్. దీనికంటే ముందు ఓ మూవీ తీశాడు గానీ అది తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసుకున్నాడు. ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. అయినా సరే కంటెంట్, కలెక్షన్లతో కేక పుట్టించాడు.ప్రధాన పాత్రలు చేసిన మైకేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే జీవించేశారని చెప్పొచ్చు. ఓ సీన్లో హీరోయిన్ కళ్లు మాత్రమే హైలైట్ అయ్యేలా లైటింగ్ ఉంటుంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు హీరోయిన్ పాత్ర దెయ్యంలా అనిపిస్తుంది. ఎలాంటి మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేకుండా అలా చూపించడం క్రేజీగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. కానీ ఇంగ్లీష్ సినిమాలు చూసే ఆసక్తి ఉంటే మాత్రం 'అబ్సెషన్'ని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. టికెట్ డబ్బులకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. అభ్యంతర సీన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో కలిసి చూసే ప్రయత్నాల్లాంటివి చేయొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ) -
ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ (81) దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని టార్జానాలో ఆయన ప్రేయసి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు (జూన్ 4)పోలీసులు ప్రాథమికంగానిర్ధారించారు. టాప్ గన్: మావెరిక్', జుమాంజి వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన హ్యాండీహత్యపై హాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. 911 కాల్ రావడంతో అధికారులు అతని ఇంటికి చేరుకున్నారు. ఛాతీపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న జేమ్స్ హ్యాండీని వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో హ్యాండీ ప్రియురాలి కుమారుడు మైఖేల్ గ్లెడ్‌హిల్ (44) ను అరెస్టు చేశారు. జేమ్స్ హ్యాండీ ప్రేమికురాలిగా భావిస్తున్న మహిళ గురించి ఎటువంటి వివరాలు తెలియవు. ఆయన వృత్తి జీవితం అందరికీ తెలిసినప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.జేమ్స్ హ్యాండీ కరియర్, నెట్‌వర్త్ దశాబ్దాల నటనాజీవితంలో 1977 నుండి అనేక సినిమాల్లో నటించారు. అలాగే పలే టెలివిజన్ షోలలో నటించారు. ముఖ్యంగా టాప్ గన్: మావెరిక్ చిత్రంలో 'జిమ్మీ' పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2017లో, హ్యూ జాక్మన్ ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం లోగాన్‌లో ఆయన నటించారు. జేమ్స్ హ్యాండీ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన నెటవర్త్ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ఉండేది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భారీ ఆస్తులనే కూటబెట్టారు. అప్ టర్న్ బిజినెస్ వారి ఒక నివేదిక ప్రకారం, 2026 నాటికి జేమ్స్ హ్యాండీ నికర ఆస్తి సుమారు 2-3 మిలియన్ డాలర్లు(సుమారు రూ.19-28.8 కోట్లు)గా అంచనా.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్‌తో రోజుకు రూ. 1500 -
ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు
‘‘సినిమా మేకింగ్‌లో సాంకేతికత పెరిగినప్పటికీ మనుషుల భావోద్వేగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రత్యామ్నాయం కాదు... కాలేదు’’ అని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ పేర్కొన్నారు. ఇటీవల స్పీల్బర్గ్ సినిమా మేకింగ్‌లో కృత్రిమ మేధ వినియోగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఏం మాట్లాడారంటే... ‘‘కళలో మానవీయ కోణం అన్నది ఎంతో ముఖ్యం. రచయితల టేబుల్ వద్ద ఒక కుర్చీ ఖాళీగా ఉండి ఆ స్థానాన్ని ఏఐ భర్తీ చేయడాన్ని నేను ఇష్టపడను. సొంతంగా ఆలోచించే లేదా అనుభవించే స్పృహ కంప్యూటర్లకు ఉంటుందని నేను నమ్మను. మానవ ఆత్మకు, వారి అంతర్గత సృజనాత్మకతకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. సినిమా అనేది కొన్ని కమాండ్స్ సమాహారం కాదు. అది మానవ మేధస్సు, హృదయం నుండి వచ్చే అద్భుత సృష్టి. ఏఐని ఒక టూల్‌గా ఉపయోగించుకోవడానికి అభ్యంతరం లేదు. సినిమా షూటింగ్ కోసం అనువైన లొకేషన్లను వెతకడంలో ఏఐ సహాయం తీసుకుంటే ఓకే. అయితే సినిమా రంగంలో సృజనాత్మక ప్రక్రియకు సంబంధించిన ఏ విషయానికైనా ఏఐని తుది నిర్ణయంగా తీసుకోకూడదని హాలీవుడ్‌ని కోరుతున్నాను. భవిష్యత్తులో నేను చేసే సినిమాలకు ఏఐ అనేది విరుద్ధం. నటీనటుల ఎంపిక, కెమెరాను ఏ కోణంలో పెట్టాలి? డైలాగులు ఎలా రాయాలి? వంటి సృజనాత్మక విషయాలను ఏఐ టూల్ నాకు సూచించడానికి నేను పూర్తి వ్యతిరేకం’’ అని స్పీల్బర్గ్ పేర్కొన్నారు. – స్టీవెన్ స్పీల్బర్గ్ -
వాట్ ఏ మూవీ.. రూ.7 కోట్లతో ఏకంగా రూ.950 కోట్లా..!
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ వసూళ్లు రాబట్టడం చాలా కష్టంగా మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలు సైతం డిజాస్టర్స్‌గా మిగిలిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి టైమ్‌లో ఓ చిన్న సినిమా ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 26 ఏళ్ల యూట్యూబర్ రూపొందించిన ఈ హారర్ మూవీ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.2026లో హాలీవుడ్ చరిత్రలో ఊహించని విజయం సాధించిన మూవీ అబ్సెషన్ టేకోవర్. ఈ సినిమాకు కర్రీ బార్కర్ దర్శకత్వం వహించగా.. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 950 కోట్లు వసూలు చేసింది. అంటే తన బడ్జెట్ కంటే వందరెట్లు అధికంగా ఆదాయం రాబట్టింది. 'అబ్సెషన్' ఒక సినిమాటిక్ యూనివర్స్, భారీ విజువల్స్, అతి పెద్ద ఫ్రాంచైజీ, సూపర్‌స్టార్స్ లేకపోయినా ఈ ఘనత సాధించింది.ఈ వసూళ్లతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రశ్నిస్తోంది. బాలీవుడ్లో పెద్దపెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద తేలిపోతున్నాయి. స్టార్స్ ఉన్నప్పటికీ వంద కోట్లు వసూల్లు రావడమే గగనంగా మారిపోయింది. హిందీలో ఒక్క దురంధర్ మినహాయిస్తే ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దీన్ని బట్టి చూస్తుంటే బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్స్ కంటే కంటెంట్ ముఖ్యమని సగటు సినీ ప్రేక్షకుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ
ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని సినీ ప్రేమికులు చూస్తూ ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్ తదితర చిత్రాలు వచ్చేశాయి. ఇప్పుడ వీటికో తోడుగా ఓ హారర్ మూవీ కూడా తెలుగులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: 'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?)90స్లో పుట్టి పెరిగిన వాళ్లలో చాలామంది హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ చిత్రాలు వీళ్లకు అలరించిన వాటిలో కచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పలు భాగాలుగా రిలీజయ్యాయి కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఇదే ఫ్రాంచైజీ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో మూవీ వచ్చింది.లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. రెండు వారాల క్రితం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి రాగా ఇప్పుడు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టేలా ఉన్నాయని చూసినవాళ్లు చెప్పారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
అమ్మ బాబోయ్.. రూ.10 కోట్లు బడ్జెట్ రూ.1000 కోట్ల కలెక్షన్?
'కళామతల్లికి సేవ చేస్తున్నాం' లాంటి మాటలు ఎవరెన్ని చెప్పినా సినిమా అనేది ప్యూర్ వ్యాపారం. ఏ నిర్మాత అయినా పెట్టుబడి ఎంత? లాభం ఎంత? లాంటి విషయాలే అంతిమంగా ఆలోచిస్తాడు. కొందరు నిర్మాతలకు అప్పుడప్పుడు అలాంటి అదృష్టం దక్కుతుంది. ఇప్పుడు హాలీవుడ్ నిర్మాణ సంస్థకు అలాంటి జాక్‌పాట్ తగిలింది. అది కూడా ఓ హారర్ సినిమాతో. ఇంతకీ దీని సంగతేంటి? వసూళ్లు ఎలా ఉన్నాయి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) ఈ నెల 15న అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో 'అబ్సెషన్' అనే సైకో హారర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. దీనికి రూ.7 నుంచి రూ.10 కోట్ల బడ్జెట్ అయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఇది సృష్టిస్తున్న సెన్సేషన్ చూస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే. ఎందుకంటే తొలివారం 16 మిలియన్ డాలర్లు, రెండోవారం 22 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు అమెరికాలో దగ్గర దగ్గర 60 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. మరో వారం పదిరోజుల్లో 100 మిలియన్ డాలర్ల గీత దాటేయడం గ్యారంటీ. ఇదే గనక నిజమైతే పెట్టిన పెట్టుబడి 100 రెట్ల లాభం సంపాదించినట్లే.మరి ఇంతలా ఈ సినిమాలో ఏముందా అని చూస్తే.. బేర్ అనే కుర్రాడు నిక్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమని బయటకు చెప్పడు. ఓసారి చిత్రమైన బొమ్మ ఎదుట నిలబడి నిక్కీ వేరే ఎవరిని ప్రేమించనంత గొప్పగా తనని ఇష్టపడాలని కోరుకుంటాడు. కట్ చేస్తే నిక్కీ లాంటి అమ్మాయి ఇతడి జీవితంలోకి వస్తుంది. ఆమె ఓ సైకో. చిత్రంగా ప్రవర్తిస్తూ ఘోరమైన హత్యలు చేయడం మొదలుపెడతుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. హద్దులు మీరి అతిగా ప్రేమిస్తే ఏమవుతుందనేది ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ చూడాలంటే మీకు కచ్చితంగా గుండె ధైర్యం కావాలి. మన దేశంలో ఈ వీకెండ్ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: చరణ్ బాడీగార్డ్ ప్రొఫెషనల్ ఫైటరా? ఇతడెవరు జీతమెంత?) -
ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులు వెతుకుతూనే ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు తమిళ, మలయాళ, ఇంగ్లీష్ చిత్రాలు డబ్బింగుల రూపంలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే హాలీవుడ్లో హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా 'మార్టీ సుప్రీమ్' వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో మన దగ్గర థియేటర్లలో రిలీజైంది. 70 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తీస్తే 190 మిలియన్ డాలర్ల వసూలు చేసింది. ఈ ఏడాది ఆస్కార్స్‌లో తొమ్మిది విభాగాల్లో నామినేట్ కూడా అయింది. కానీ అవార్డులేం గెలుచుకోలేకపోయింది. ఇప్పుడిది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఇలాంటి టాక్‌తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)కథేంటంటే?అది 1950ల కాలం. అమెరికాలో ఉండే మార్టీ(టిమోతీ చలమెట్) అనే కుర్రాడికి ఓ కల ఉంటుంది. పెద్ద టేబుల్ టెన్నిస్ టోర్నీలో పాల్గొని గెలవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అందుకోసం చాలా డబ్బులు కావాలి. సదరు టోర్నమెంట్ జరగడానికి చాలా తక్కువ సమయముంటుంది. మరి ఇంత తక్కువ టైంలో మార్టీ అంత డబ్బులు ఎలా సంపాదించాడు? టోర్నీలో పాల్గొన్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా స్పోర్ట్ డ్రామాలు అనగానే ఓ అనామక వ్యక్తి.. ఏదో ఒక గేమ్ నేర్చుకోవడం, తర్వాత ప్రాక్టీస్ చేయడం, చివరకు విజేత కావడం.. దాదాపు ఇదే ఫార్మాట్లో ఉంటుంది. కానీ 'మార్టీ సుప్రీమ్' మాత్రం కాస్త డిఫరెంట్. పేరుకే స్పోర్ట్ డ్రామా కానీ సక్సెస్ కోసం ఓ మనిషి ఎంత దూరం వెళ్తాడు? ఫేమ్ కోసం ఎంతలా స్వార్థపరుడు అవుతాడు అనే అంశాలు చాలా పచ్చిగా చూపించారు.రెండున్నర గంటల ఈ మూవీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. టేబుల్ టెన్నిస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అయితే ఈ గేమ్ కంటే మిగతా విషయాల్ని ఎక్కువగా చూపించారు. అంటే మార్టీ జీవితం, చుట్టూ ఉండే మనుషులు, ఎదురైన పరిస్థితులు ఇతడిని ఎలా మార్చేశాయనేది అసలు కథ.ఈ సినిమాని మార్టీ రేస్మన్ అనే అమెరికన్ దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడి జీవితం ఆధారంగా తీశారు. అయితే నిజ జీవిత సంఘటనలకు కాస్త కల్పితం జోడించారు. ఇందులో హీరోకి ఉన్న ప్లస్సులే కాదు మైసస్సుల కూడా చూపించడం విశేషం. సినిమాలో స్టైల్, టెన్షన్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బలంగా ఉంటే నెక్స్ట్ లెవల్ మూవీ అయ్యేది. ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. చెప్పాలంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ప్రతి సీన్లోనూ ఓ టెన్షన్ ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ కంటే స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది. 1950లో అమెరికా వాతావరణాన్ని ఫెర్ఫెక్ట్గా చూపించారు. దానికి తోడు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.ఈ సినిమాలోని హీరో కమ్ ఓ నిర్మాత అయిన టిమోతీ చలమెట్.. మార్టీగా అదరగొట్టేశాడు. అయితే మిగతా వాటిలో కొన్ని పాత్రలని సరిగా ముగించలేదు. వేగంగా ఉండే ఎడిటింగ్ వల్ల కొన్ని సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. చాలామంది ఇది టేబుల్ టెన్నిస్ డ్రామా అనుకుంటారు కానీ మూవీలో గేమ్ అనేది ఓ స్పోర్ట్ కాదు ఇదో యుద్ధంలా ఫీలై ప్రతి మ్యాచులో టెన్షన్ తెప్పించే విధానం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో గేమ్ కంటే మైండ్ గేమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చీటింగ్, మ్యానిపులేషన్, ఈగో క్లాషెస్ లాంటి వాటిని చాలా బాగా చూపించారు. ఈ అంశాలే దీన్ని స్పోర్ట్ డ్రామాలా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ జోన్లోకి తీసుకెళ్తాయి. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు గానీ కొన్ని అసభ్యకర సీన్స్ ఉంటాయి కాబట్టి కుటుంబంతో కలిసి చూడొద్దు. ఏదైనా కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్) -
అమ్మకానికి 'ఐమాక్స్'?
అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే ప్రపంచంలో చాలామందికి గుర్తొచ్చేది 'ఐమాక్స్'. భారత్‌లో ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్లు పెద్దగా లేవు. గుజరాజ్‌లో ఒకటి మాత్రమే ఉంది! దాదాపు 60 ఏళ్ల క్రితం స్థాపించిన ఐమాక్స్ సంస్థ.. ఇప్పుడు అమ్మకానికి సిద్ధమైందనే వార్త సంచలనంగా మారింది. ఇది ప్రపంచ ఎగ్జిబిషన్ రంగంలో భారీ మార్పులకు నాంది పలకనుందని మాట్లాడుకుంటున్నారు. ఈ విక్రయానికి సంబంధించిన విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ప్రముఖ సినిమా టెక్నాలజీ సంస్థ ఐమాక్స్.. అమ్మే అవకాశాలు పరిశీలిస్తోందని.. ఇప్పటికే ప్రారంభ దశ చర్చలు కూడా మొదలైపోయినట్లు టాక్. ఈ క్రమంలోనే పలు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఐమాక్స్ మార్కెట్ విలువ సుమారు 1.85 బిలియన్ డాలర్లుగా ఉంది.కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. కానీ వాటి నుంచి నెమ్మదిగా బయటపడ్డాయి. ఇప్పటికీ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ థియేటర్లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఐమాక్స్ లాంటి ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లలో సినిమా చూసేందుకు ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొనేందుకు ప్రేక్షకులు ఆసక్తిగానే ఉన్నారు. అలాంటిది ఐమాక్స్ ఎందుకు అమ్మకానికి సిద్ధమైందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఐమాక్స్‌కి సంబంధించిన ఈ వార్త బయటకు రాగానే ఈ సంస్థ షేర్లు దాదాపు 17 శాతం వరకు పెరగడం విశేషం.1967లో కెనడాలో ఐమాక్స్ సంస్థని స్థాపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు సొంత టెక్నాలజీ ఫ్లాట్‌ఫార్మ్‌గా కొనసాగుతోంది. ప్రత్యేక కెమెరాలు, అధునాతన ఆడియో వ్యవస్థలు, ప్రత్యేక థియేటర్ డిజైన్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్రయ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, నిజంగానే అమ్మేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉందని నిపుణులు మాట్లాడుకుంటున్నారు. తెలుగులో ప్రస్తుతం మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో తీస్తున్న 'వారణాసి' సినిమాని ఐమాక్స్ ఫార్మాట్లోనే తీస్తున్నారు. ఇదే ఫార్మాట్లో తీసిన క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
90స్ కిడ్స్ అందరూ తమ చిన్నప్పుడు చూసి హాలీవుడ్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'మమ్మీ' ఫ్రాంచైజీ ఉంటుంది. ఇప్పటివరకు మూడు మూవీస్ రాగా అవన్నీ ఆకట్టుకున్నాయి. ఇదే ఫ్రాంచైజలో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'ద మమ్మీ' గత నెలలో థియేటర్లలోకి రాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)గతంలో వచ్చిన 'మమ్మీ' సినిమాలన్నీ అడ్వెంచర్, కామెడీ తరహాలో వచ్చాయి. వాటికి భిన్నంగా పూర్తిగా డార్క్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో లేటెస్ట్ మూవీ తీశారు. 'ద మమ్మీ' పేరుతో తీసిన ఈ చిత్రానికి లీ క్రోనిన్ దర్శకత్వం వహించారు. గత నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని మెప్పించింది. ఇప్పుడీ చిత్రం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు తెలుగు డబ్బింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'ద మమ్మీ' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం ఆనందిస్తుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్ భయపెట్టేలా ఉన్నాయని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందనే కామెంట్స్ వినిపించాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమా బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ మూవీస్ వరకు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలా ప్రపంచవ్యాప్తంగా రూ.3500 కోట్లు సొంతం చేసుకున్న ఓ హిట్ మూవీ.. సైలెంట్‌గా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)మార్చిలో దేశవ్యాప్తంగా 'ధురంధర్ 2' హవా నడిచింది. ఇదొచ్చిన వారానికి రిలీజైన హాలీవుడ్ మూవీనే 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'. అంతరిక్ష నేపథ్యంగా సాగే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. నగరాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. చూసిన చాలామంది మెచ్చుకున్నారు. ఇప్పుడీ చిత్రం నెలన్నర తర్వాత యూట్యూబ్ మూవీస్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్(ర్యాన్ గాస్లింగ్) అనే ఓ వ్యోమగామి ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అసలు స్పేస్‌లోకి ఎందుకెళ్లాడు? ఇతడితో పాటు అంతరిక్ష నౌకలో ఉన్న మిగతా ఇద్దరూ ఎందుకు చనిపోయారు? తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? ఈ క్రమంలోనే ఓ ఏలియన్‌తో ఎలా స్నేహం కుదిరిందనేది మిగతా స్టోరీ.అంతరిక్ష నేపథ్య సినిమాలు ఇష్టముంటే మాత్రం దీన్ని కచ్చితంగా మిస్ అవ్వొద్దు. ప్రస్తుతానికి యూట్యూబ్‌లోకి రెంట్ విధానంలో వచ్చింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ తదితర ఓటీటీల్లోకి కూడా రావొచ్చు.(ఇదీ చదవండి: రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి) -
ఖర్చు రూ.1400 కోట్లు.. వచ్చింది రూ.6 కోట్లు!
ఒకప్పటితో పోలిస్తే సినిమాలకు క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. స్టార్ వాల్యూ ఉన్నాసరే కంటెంట్ అద్భుతంగా ఉందా లేదా అనేది ప్రేక్షకులు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అలాంటిది సౌదీ అరేబియాలో ప్రతిష్ఠాత్మకంగా తీసిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ప్రపంచంలోనే అరివీర భయంకరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ విషయం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)'డిసర్ట్ వారియర్' పేరుతో రూ.1400 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాకు రూపర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించగా.. హాలీవుడ్ నటులైన ఆంటోనీ మాకీ, బెన్ కింగ్స్లే ప్రధాన పాత్రలు పోషించారు. సౌదీ ప్రభుత్వం మద్దతుతో నిర్మించడం అంతర్జాతీయ స్థాయిలో సౌదీ సినిమా ఇండస్ట్రీని నిలబెట్టే ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారు. తీరా చూస్తే రిలీజ్ తర్వాత పూర్తిగా తేలిపోయింది.ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోని ఈ సినిమాలో బలహీనమైన స్టోరీ, గందరగోళమైన స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ సరిగా లేకపోవడం లాంటివి మైనస్ అయ్యాయని విమర్శకులు చెప్పుకొచ్చారు. ఉత్తర అమెరికాలో 1000కి పైగా థియేటర్లలో రిలీజైతే ఒక్కో థియేటర్ నుంచి 500 డాలర్ల కంటే తక్కువ కలెక్షన్ రావడం సినిమా పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పింది. అలా గత నెల 24న థియేటర్లలో రిలీజైతే రూ.6 కోట్ల లోపు వసూళ్లు వచ్చినట్లు సమాచారం.ఈ సినిమా ఫలితం బట్టి అర్థమైంది ఏంటంటే.. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు ఉన్నాంత మాత్రాన మూవీ హిట్ అవ్వదని, వందల కోట్ల రావు అని తేలింది. చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని వరస్ట్ రికార్డ్ ఈ సినిమా సొంతం చేసుకుంది!(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
పాపం.. సౌదీ అరేబియా.. వరల్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ..!
భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటేమన తెలుగులో రాజమౌళికి మాత్రమే సాధ్యం. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ ప్రస్తుతం వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలపై అంతకుమించిన వసూళ్లు వస్తాయనే ఆశ మేకర్స్‌కు ఉంటుంది. దర్శకుడు, నటీనటులు, కథపై వసూళ్లు అనేది ఆధారపడి ఉంటుంది. కేవలం బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే సరిపోదు. మేకింగ్ కూడా ఆ రేంజ్లో ఉంటేనే వర్కవుట్ అవుతుంది. కానీ ఈ విషయంలో మన రాజమౌళికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఆయన తీసిన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.అయితే పులికి చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెత మన వినే ఉంటాం. అలా ఇతర దేశాల్లాగే సినీరంగంలో తాము కూడా ప్రపంచస్థాయికి ఎదగాలని సౌదీ అరేబియా ఆశలు పెట్టుకుంది. అనుకోవడమే కాదు.. భారీ బడ్జెట్‌తో డెజర్ట్ వారియర్ అనే మూవీని నిర్మించింది. ప్రపంచంలోనే ఫేమస్ అయిన స్టార్స్‌ను పెట్టి ఈ సినిమా కోసం ఏకంగా రూ.1400 కోట్ల ఖర్చు చేసింది. కట్ చేస్తే.. సీన్ అంతా రివర్స్ అయింది. అనుకున్నది ఒక్కటీ.. అయిందొక్కటి అన్న తీరుగా మారిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కేవలం రూ.6 కోట్లు మాత్రమే సాధించింది. ఈ వసూళ్లతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డ్ సృష్టించింది. మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం వాటా మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6 శాతం నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే కొవిడ్ కారణంగా ఆలస్యం కావడం, భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో మూవీని తెరకెక్కించడంతో బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది.ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో సౌదీ అరేబియా పేరును తీసుకు రావాలని అనుకోవడం మంచిదే. అయితే భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా కథపై కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేదని సినీ ప్రియులు అంటున్నారు. ఈ డిజాస్టర్ మూవీతో తమ దేశంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సౌదీ అరేబియా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక నుంచైనా సౌదీ అరేబియా మన దర్శకధీరుడు రాజమౌళి సలహాలు తీసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సౌదీ అరేబియా ఏంబీసీ గ్రూప్ ద్వారా 'డెజర్ట్ వారియర్' లాంటి చారిత్రక వార్ మూవీని నిర్మించింది. దాదాపు 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటి చక్రవర్తి కిస్రాకు వ్యతిరేకంగా యువరాణి హింద్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాకు రూపొందించారు. ఈ మూవీకి రూపెర్ట్ వ్యాట్ (రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మార్వెల్ నటుడు ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. -
దేవుళ్లు కూడా నన్ను ఆపలేరు.. విజువల్ వండర్లా కొత్త ట్రైలర్
క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఈ దర్శకుడు తీసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పట్టానా అర్థం కావనే కామెంట్స్ వినిపిస్తాయి గానీ సూపర్ హిట్ అవడంతో పాటు వేల కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ. ఈయన చేసిన లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ కొత్తది రిలీజ్ చేశారు. ఇది విజువల్ వండర్లా ఉంటూ మూవీపై హైప్ పెంచుతోంది.(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)ఒడియన్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒడియన్ పాత్రలో మ్యాట్ డామన్, పెనెలోపీగా అన్నా హాత్వే, టెలిమాకస్‌గా టామ్ హోలండ్ కనిపించనున్నారు. రాబర్ట్ ప్యాటిన్సన్, ఛార్లెజ్ థెరోన్ కూడా కీలక పాత్రలు చేశారు. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ మూవీని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం విశేషం.ట్రైలర్ బట్టి చూస్తే ఒడియన్ అనే రాజు, ఓ యుద్ధంలో పాల్గొనేందుకు తన రాజ్యాన్ని, భార్య కొడుకుని వదిలి మరో చోటకు వెళ్తాడు. యుద్ధం గెలిచి తిరిగొస్తుంటే సముద్రంలో ఇతడి సైన్యం ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురవుతుంది. కానీ ఒడియన్ రాజు ప్రాణాలు దక్కించుకుంటాడు. తర్వాత ఏమైంది? భార్య-కొడుకుని కలిశాడా అనేది మిగతా స్టోరీ. ప్రాచీన కవి హోమర్ రాసిన 'ద ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. (ఇదీ చదవండి: ‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం) -
ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టేస్తున్నాయి. స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు తెగ అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలా అని పేరెంట్స్ చాలానే ఆలోచిస్తున్నారు. అయితే ఓటీటీల్లో పిల్లలని ఎంటర్టైన్ చేస్తూ విలువలు నేర్పించే యానిమేషన్ సినిమాలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి మరొకటి చేరింది. రీసెంట్గా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'హాపర్స్' చిత్రాన్ని పిల్లలతో పాటు పెద్దోళ్లు కూడా చూడొచ్చు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)కథేంటి?బీవర్టన్ అనే ఊరిలో మేబల్ అనే అమ్మాయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పెద్దయి కాలేజీకి వెళ్లినా అది తగ్గదు. ఊరిలో ఫ్లైఓవర్ కడుతున్నారని, కానీ దీనికోసం పెద్ద చెరువుని కూల్చేశారని, అందులో జంతువులని బెదరగొట్టి పంపించేశారని తెలిసి బాధపడుతుంది. ఆ జంతువులని తిరిగి ఇక్కడికి ఎలా తీసుకురావాలా, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ రోజు అనుకోని విధంగా ఈమె ఆత్మ.. బీవర్ అనే జంతువులో ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైంది? బీవర్ శరీరంలో ఉన్న మేబల్.. మిగిలిన జంతువులతో కలిసి ఆ ఫ్లైఓవర్ కట్టడాన్ని అడ్డుకుందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే యానిమేషన్ సినిమాలకు సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. హాలీవుడ్లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఆకట్టుకున్న చిత్రమే 'హాపర్స్'. సరదా సరదాగా సాగిపోతూనే ప్రకృతి ఎంత గొప్పదో చెబుతుంది. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడొచ్చు.ప్రస్తుతం నాగరికత పేరు చెప్పి ఎక్కడపడితే అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. బిల్డింగులు కట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా చెట్లు లేదా అడవులపై ఆధారపడి జీవిస్తున్న జంతువుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. జంతువులు మూగజీవులు కాబట్టి మనుషుల్ని అవేం చేయలేవు. ఒకవేళ వాటికే మనిషిలా ఆలోచించగలిగే శక్తి వస్తే ఏం చేస్తాయి అనే చిత్రమైన కాన్సెప్ట్‌తో తీసిన 'హాపర్స్' అద్భుతంగా ఉంది.పాయింట్ పరంగా కొత్తదేం కాదు కానీ చూపించిన ఎమోషన్స్ గానీ చేసిన కామెడీ గానీ బాగా కుదిరాయి. అడవిలో జంతువుల మధ్య సాగే హంగామా కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారు. పిక్సర్స్ స్టూడియోస్ తీసిన ఈ సినిమాలో నాన్నమ్మ-మనవరాలి ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. మనిషి.. ప్రకృతిని నాశనం చేస్తున్నాడు గానీ ఉపద్రవం వచ్చినప్పుడు ఆ ప్రకృతే మనిషిని కాపాడటం అనే పాయింట్‌ని చూపించిన విధానం బాగుంది.ప్రస్తుతానికి ఈ సినిమా ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో రెంట్ విధానంలో ఉంది. ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. సమ్మర్ హాలీడేస్‌లో మీ పిల్లలకు ఏదైనా మంచి మూవీ చూపిద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే వేల కోట్ల కలెక్షన్స్
ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు దాన్ని చూసేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ మైఖేల్ జాక్సన్ బయోపిక్ విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో జరిగింది. పదో వందో కాదు ఏకంగా మూడు రోజుల్లోనే వేలకోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది చూసి, బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజు అభిమానమా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ 'మైఖేల్' మూవీ సంగతేంటి? తొలి వీకెండ్ వసూళ్లెంత?(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని షేక్ చేసిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా 'మైఖేల్'. ఇందులో మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశాడు. చిన్నాన్న డ్యాన్సుల దగ్గర నుంచి స్టైల్ వరకు ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లు దింపేశాడు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు.. మూడు రోజుల్లోనే $217.4 మిలియన్ల కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.భారతీయ కరెన్సీ ప్రకారం వసూళ్లు మొత్తం రూ.2049 కోట్లు. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్ రికార్డ్ ఇదివరకు 'ఓపెన్ హైమర్' పేరిట 180.4 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు దీన్ని అధిగమించిన 'మైఖేల్'.. గ్లోబల్ వైడ్ సరికొత్త ఘనత సాధించింది. అయితే విడుదల ముందు రోజు ప్రీమియర్లు వేస్తే చూసిన చాలామంది.. 'మైఖేల్' బయోపిక్ అంతేం మెప్పించలేదని పెదవి విరిచారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్ అభిమానులు మాత్రం ఆయన్ని చివరిసారి బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇక్కడ అక్కడ తేడా లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాని చూస్తున్నారు.అయితే 'మైఖేల్' పేరుతో రిలీజైన ఈ సినిమాలో పాజిటివ్ యాంగిల్ మాత్రమే చూపించారు. వివాదాల జోలికి పోలేదు. అలానే కథని మధ్యలోనే ఆపి, సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఈ రెండో భాగం ఎప్పుడొస్తుందనేది చూడాలి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
ఇండియాలో మొదలెన మైఖేల్ జాక్సన్ మూవీ ఫీవర్..
-
షాకింగ్: ర్యాపర్ చెంప చెళ్లుమనిపించిన అభిమాని
హాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ ఐస్ స్పైస్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజిల్స్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఆమెపై ఓ అభిమాని భౌతిక దాడికి పాల్పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.హాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.., ఐస్ స్పైస్ తన స్నేహితురాలితో కలిసి మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడికి ఓ యువతి వచ్చి.. అభిమానిని అని మాట్లాడడం ప్రారంభించిది. మొదట సాధారణంగానే అనిపించినప్పటికీ, ఆ అభిమాని అతిగా ప్రవర్తిస్తూ ఐస్ స్పైస్‌ను అసౌకర్యానికి గురిచేసింది. దీంతో ఐస్ స్పైస్, ఆమె స్నేహితురాలు సదరు యువతిని తమ టేబుల్ వద్ద నుండి వెళ్ళిపోవాలని కోరారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఆ అభిమాని ఒక్కసారిగా ఐస్ స్పైస్ చెంపపై కొట్టింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి గందరగోళంగా మారింది.చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఆ అభిమానిని ఆమె స్నేహితుడు బయటకు లాక్కెళ్తుండగా, ఐస్ స్పైస్ వారిని వెంబడించింది. రెస్టారెంట్‌లోని బల్లలపై దూకుతూ వెళ్లి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించింది. రెస్టారెంట్ డోర్ ముందు కూడా కాసేపు వాగ్వాదం జరిగింది. కోపంలో కింద పడిపోయిన ఒక ఫోన్‌ను ఐస్ స్పైస్ పగలగొట్టింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ దాడి అకారణంగా జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఐస్ స్పైస్ న్యాయవాది తెలిపారు. అయితే సదరు యువతి మాత్రం.. తన తప్పు ఏమి లేదన్నారు. అభిమానిగా కలిసేందుకు వెళ్తే.. ఐస్ స్పైస్ తనతో అమర్యాదగా ప్రవర్తించి, అభ్యంతరకర భాష వాడటం వల్లే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. 😳 EXCLUSIVE: Ice Spice was slapped by a fan inside of an L.A. McDonald's. https://t.co/v9zZmQq05w pic.twitter.com/L1lvzOfGsF— TMZ (@TMZ) April 17, 2026 -
చిన్న వయసులోనే చనిపోయిన నటుడు
ఓటీటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్‌తో చాలామంది నటీనటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులోనే నటించి ఐరిష్ నటుడు ఇప్పుడు చిన్న వయసులోనే కన్నుమూశాడు. ఐర్లాండ్‌కి చెందిన మైకేల్ పాట్రిక్(35) గత మూడేళ్లుగా మోటార్ న్యూరోన్ అనే వ్యాధితో పోరాడుతున్నాడు. పదిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన పాట్రిక్.. చికిత్స పొందుతూ మంగళవారం(ఏప్రిల్ 7) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతడి భార్య ధ్రువీకరించింది.తన ఆరోగ్యం గురించి గత కొన్నాళ్లుగా మాట్లాడుతూనే ఉన్న పాట్రిక్.. ఫిబ్రవరి 6న చివరగా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన పరిస్థితి గురించి వివరంగా చెప్పిన వైద్యులు.. మరో ఏడాది మాత్రమే తనకు మిగిలుందని చెప్పినట్లు రాసుకొచ్చాడు.ట్రాచియోస్టమీ సర్జరీ గురించి ఆలోచించినప్పటికీ, దాని తర్వాత చాన్నాళ్ల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందనే కారణంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపాడు.మోటార్ న్యూరోన్ అనేది శరీర కండరాల పనితీరును నియంత్రించే నాడీ కణాలను దెబ్బతీసే తీవ్రమైన నరాల వ్యాధి. దీని వల్ల నడవడం, మాట్లాడటం, మింగడం, గాలి పీల్చడం లాంటివి క్రమంగా క్షీణిస్తాయి. ఇకపోతే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌తో పాటు బెల్ ఫెస్ట్ సినిమాలోనూ నటించాడు. టీవీ, థియేటర్ రంగంలోనూ ప్రతిభ చాటుకున్నాడు. -
హారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఈ డైరెక్టర్..!
ది మమ్మీ చిత్రం గురించి పేర్కొంటూ ఇది ఒక కుటుంబం చుట్టూ తిరిగే కథా చిత్రం అన్నారు. ఒక జర్నలిస్ట్ కూతురి ఎడారిలో అదృశ్యం అయ్యి.. 8 ఏళ్ల తరువాత దొరుకుతుందన్నారు. అయితే ఆ తరువాత ఆ పాప శరీతంలో, ప్రవర్తనతో చాలా మార్పు కలుగుతుండటంతో ఆ కుటంబం భయభ్రాంతులకు గురౌతుందన్నారు. దానికి కారణాలు ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలతో చిత్రం సాగుతుందన్నారు. ఈ చిత్రంలో మాన్స్టర్ రూపకల్పనను దర్శకుడు లీ క్రొనిన్ చాలా కొత్తగా మలిచారు. సాధారణ హారర్ చిత్రాల మాదిరిగా కాకుండా కొంచెం కొంచెం భయపెట్టే విధంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా మాన్స్టర్ను పగటివేళల్లో చూపుతూ కొత్త అనుభూతికి గురి చేస్తారన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. -
వందేళ్లకు ఆస్కార్‌లో భారీ మార్పులు
ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వేడుక మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)వైభవంగా జరిగింది. ఇది జరిగి ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే వచ్చే ఏడాది ఆపై ఏడాది అవార్డు ఈవెంట్స్‌కి సంబంధించిన తేదీలని ఆస్కార్ అవార్డు కమిటీ ఫిక్స్ చేసింది. ఆ విశేషాలను కమిటీ పంచుకుంది.2027 మార్చి 14న 99వ, 2028 మార్చి 5న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 15, మార్చి 6) 100వ ఆస్కార్ అవార్డు వేడుకలు జరగనున్నాయి. అయితే 2002 నుంచి ఈ అవార్డు వేడుకకు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ ఆతిథ్యమిస్తోంది. మధ్యలో 2021లో మాత్రం యూనియన్ స్టేషన్ వేదికగా జరిగింది. అది కూడా కరోనా నేపథ్యంలో ఆ వేదిక ప్రాంగణం పెద్దగా ఉంటుందని, సీట్స్‌కి మధ్య చాలా గ్యాప్ ఉంచే వీలు ఉంటుందని సేఫ్టీ కోసం ఆ ఏడాది అక్కడ నిర్వహించారు. అది మినహాయిస్తే ఈ ఏడాదితో కలుపుకుని 24 ఏళ్లు డాల్బీ థియేటర్లోనే వేడుక నిర్వహించారు. అయితే మరో రెండేళ్లు మాత్రమే ఈ వేదికలో జరపనున్నారు.99, 100వ ఆస్కార్ వేడుకలను డాల్బీ థియేటర్లోనే జరుపుతారు. 2028లో జరగనున్న 'సెంటెనరీ' (వందో) వేడుకను చాలా ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. 2029లో జరపనున్న 101వ వేడుకకు లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని పీకాక్ థియేటర్ వేదిక కానుందని తాజాగా అవార్డు కమిటి ప్రకటించింది. కాబట్టి దాదాపు పాతికేళ్లు ఆస్కార్ వేడుకకు వేదిక అయిన డాల్బీ థియేటర్లో ఇక ఈ వేడుక సందడి కనిపించదు.ఇప్పటివరకూ ఆస్కార్ అవార్డు వేడుకలు ఏబీసీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యేవి. 99, 100 అవార్డు వేడుకలు కూడా ఇందులోనే వస్తాయి. ఈ ఛానెల్లో ప్రసారమయ్యే చివరి వేడుకలు ఇవే. 101వ అవార్డు వేడుక నుంచి మాత్రం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నారు. 1929లో తొలి ఆస్కార్ అవార్డు వేడుక ఎక్కడా ప్రసారం కాలేదు. తర్వాత రేడియోలో ప్రసారమైంది. ప్రతిసారి ఆస్కార్ అవార్డు వేడుక 1953లో ఎన్బీసీ చానల్లో ప్రసారమైంది. తర్వాత కొంత మార్పు జరిగింది. 1976లో ఏబీసీ చానల్లో ప్రసారం ఆరంభమైంది. అప్పట్నుంచి రానున్న రెండు అవార్డు వేడుకల వరకూ ఈ ఛానెల్ లోనే ప్రసారాన్ని చేసింది కమిటీ.దాదాపు 50 ఏళ్ల తర్వాత దీనిని కాదనుకుని 2029 నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయనుంది. అంటే ఆస్కార్ వేడుక ఆరంభమైన వందేళ్లకు ఈ అవార్డు వేడుకలో వచ్చే కొత్త మార్పులంటే..కొత్త వేదిక, యూట్యూబ్. 2029లో జరగనున్న 101వ అవార్డు వేడుకలో ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి? -
పాటల ప్రపంచంలోకి...
ఆనందానికిపాట... ఆరోగ్యానికిపాట... కల్యాణానికిపాట... కలలకుపాట... విషాదానికిపాట... వినోదానికిపాట... స్ఫూర్తికిపాట... సందేశానికిపాట... ఇలా మనిషి జీవితంలో ప్రతి సందర్భానికీపాట ఉంటుంది. అందుకేపాట సృష్టించేవాళ్లన్నా, సాహిత్యం అందించేవాళ్లన్నా, ఆపాటకు తమ గాత్రంతో ప్రాణం పోసేవాళ్లన్నా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలా వెండితెర కోసం పసందైనపాటలతో ప్రేక్షకులను అలరించిన మ్యూజికల్ స్టార్స్ ఎందరో ఉన్నారు. హాలీవుడ్లో ఇలాంటి స్టార్స్ జీవితాలపై ‘బయోపిక్స్’ రూపొందుతున్నాయి. బయోపిక్స్ రూపొందడం కామన్. అయితే ఒకేసారి అరడజనుకి పైగా మ్యూజికల్ బేస్డ్ బయోపిక్స్‌కి శ్రీకారం జరగడం విశేషం. ఆ మ్యూజికల్ స్టార్స్ వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఈ చిత్రాలు ఆవిష్కరించనున్నాయి. ఇక థియేటర్స్‌లో కూర్చున్న ప్రేక్షకులనుపాటల ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆ ‘మ్యూజికల్ బయోపిక్స్’ విశేషాలు తెలుసుకుందాం.ఏప్రిల్ 24న మైఖేల్ పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ప్రపంచం కోసం వదిలి వెళ్లినపాటల రూపంలో జీవించే ఉన్నారు. ఆయన జీవితంలోని కీలక విషయాలను వెండితెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘మైఖేల్’ టైటిల్‌తో రూపొందిన ఈ బయోగ్రఫీలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసినవాళ్లు జాఫర్ అచ్చం తన బాబాయిలానే ఉన్నాడని పేర్కొనడంతో లుక్ పరంగా మార్కులు కొట్టేశారు జాఫర్. ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గ్లాడియేటర్, ది ఏవియేటర్’ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించిన జాన్ లోగన్ ‘మైఖేల్’ స్క్రిప్ట్ రాశారు.గ్రాహం కింగ్ ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘‘మైఖేల్ జీవితాన్ని నిజాయతీగా చూపించాలన్నది మా లక్ష్యం. అలానే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం’’ అని గ్రాహం పేర్కొన్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ‘మైఖేల్’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ‘ది జాక్సన్: యాన్ అమెరికన్ డ్రీమ్’ పేరిట ఐదు గంటల మినీ సిరీస్ రెండు భాగాలుగా ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారమైంది.మైఖేల్ జాక్సన్ బతికి ఉన్నప్పుడే 1992లో ఈ సిరీస్ రూపొందింది. జాక్సన్, అతని కుటుంబం, అతని సోదరులు మ్యూజికల్ ఫీల్డ్‌లో ఎలా ఎదిగారు వంటి విశేషాలతో ప్రధానంగా ఈ సిరీస్ రూపొందింది. సో... హాలీవుడ్ చెబుతున్న ప్రకారం మైఖేల్ జాక్సన్ జీవితంపై రానున్న సమగ్ర చిత్రం ‘మైఖేల్’ అని తెలుస్తోంది. ఇక 50 ఏళ్ల వయసులో 2009 జూన్ 25న మైఖేల్ మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.హూ ఈజ్ దట్ గర్ల్‘‘నా కంటే నా కథను ఎవరు బాగా రాయగలరు... చూపించగలరు’’ అంటున్నారు మడోన్నా. ‘క్వీన్ ఆఫ్పాప్’గా పేరు తెచ్చుకున్న మడోన్నా తన జీవితంతో ‘హూ ఈజ్ దట్ గర్ల్’ టైటిల్‌తో సినిమా నిర్మించాలని ఐదేళ్ల క్రితమే అనుకున్నారు. 2020లోనే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారామె. తానే దర్శకత్వం వహించాలనుకున్నారు కూడా. అయితే 2020 నుంచి 2023 వరకూ ఎలాంటి అప్డేట్ రాలేదు. 2024లో తాను ఈ సినిమాకి స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్లు పేర్కొని, కొన్ని ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేశారు మడోన్నా.సంగీతమే తనను నడిపించింది కాబట్టి ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ పైనే ఉంటుందని కూడా పేర్కొన్నా రామె. అయితే గడచిన ఐదేళ్లల్లో ఆమె ప్లాన్ చేసుకున్న మ్యూజికల్ ట్యూర్స్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ ఏడాది ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలని మడోన్నా అనుకుంటున్నారట. మడోన్నాపాత్రను జూలియా గార్నర్ చేయనున్నారు. ‘‘నేను ట్రైన్డ్ డ్యాన్సర్‌ని, సింగర్‌ని కాదు. అందుకని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాను. నా నటనతో మడోన్నాని మెప్పించాలనుకుంటున్నాను’’ అని గార్నర్ పేర్కొన్నారు. వన్ డైరెక్టర్... ఫోర్ బయోపిక్స్ఒక డైరెక్టర్ ఒక బయోపిక్ చేయడం అంటే అది పెద్ద విషయమేం కాదు. కానీ ఒక దర్శకుడు నాలుగు బయోపిక్స్ చేయడం మాత్రం విశేషం అనే చె΄్పాలి. ఆ దర్శకుడు ఎవరంటే ‘సామ్ మెండిస్’. ‘ద బీటిల్స్’ అనే రాక్ బ్యాండ్ పై నాలుగు చిత్రాలు రూపొందించడానికి సామ్ సన్నాహాలు చేస్తున్నారు. 1960లో ఈ రాక్ బ్యాండ్ ఫామ్ అయింది. అప్పట్లో ఈ బ్యాండ్ చాలాపాపులర్. ‘ద బీటిల్స్’పై సినిమా అనేది తన కలల ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు దర్శకుడు సామ్ మెండిస్. ఈ రాక్ బ్యాండ్‌లోని సభ్యుల (పాల్ మెక్కార్ట్నీ, జాన్ లెన్నాన్, జార్జ్ హారిసన్, రింగో స్టార్) జీవితాలపై ఈ నాలుగు చిత్రాలు ఉంటాయి.ఒక్కో స్టార్ జీవితంతో ఒక్కో సినిమా ఉంటుంది. ఈ చిత్రాల్లోపాల్ మెక్కార్ట్నీగాపాల్ మెస్కల్, జాన్ లెన్నాన్ క్యారెక్టర్‌ను హ్యారిస్ డికిన్సన్, రింగో స్టార్పాత్రను బ్యారీ కియోగన్, జార్జ్ హారిసన్ క్యారెక్టర్‌ను జోసెఫ్ క్విన్ చేయనున్నారు. ‘ద బీటిల్స్ – ఎ ఫోర్ – ఫిల్మ్ సినిమాటిక్ ఈవెంట్’ టైటిల్‌తో ఈ నాలుగు చిత్రాలు రూపొందనున్నాయి. ఇక సాదా సీదా స్థాయి నుంచి స్టార్డమ్ వరకూ సంగీత ప్రపంచంలో ఎదగడానికి ‘ద బీటిల్స్’ రాక్ బ్యాండ్ చేసిన కృషి నేపథ్యంలో ఈ చిత్రాలు ఉంటాయి. ఈ నాలుగు చిత్రాలనూ 2028లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అమెరికన్ సంగీత చరిత్రలో సింగర్‌గా, రైటర్‌గా, గిటారిస్ట్‌గా అత్యంత ప్రభావం చూపినవారిలో సిస్టర్ రోసెట్టా థార్పే ఒకరు. 1915లో పుట్టారు రోసెట్టా. అయితే 1921లోనే తన తల్లితో కలిసి మ్యూజికల్ ట్రూప్‌లో సింగింగ్ టాలెంట్‌ని చూపించడంతోపాటు గిటారిస్ట్గానూ భేష్ అనిపించుకుంది చిన్నారి రోసెట్టా. పెద్దయ్యాక సంగీత ప్రపంచంలో దూసుకెళ్లారామె. ముఖ్యంగా 1930–1940 మధ్యకాలంలో అప్పటి తరం శ్రోతలను తనపాటలతో అలరించారు. అంతటి ప్రతిభాశాలి అయిన సిస్టర్ రోసెట్టా థార్పే జీవితం ఆధారంగా ‘ఎ రోసెట్టా’ చిత్రం రూపొందనుంది. ‘గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా పేరు పొందిన రోసెట్టా క్యారెక్టర్‌ను ఆమె బయోపిక్‌లో సింగర్, ర్యాపర్, నటి‡లిజ్జో పోషించనున్నారు. అలాగే ఈ చిత్రానికి ఓ నిర్మాతగానూ వ్యవహరించనున్నారామె. అయితే ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.బీ మై బేబీఅమెరికన్ మ్యూజికల్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ షో మేన్’లో నటించడంతోపాటు తన గాత్రాన్ని వినిపించి, మరింతగా ఆకట్టుకున్నారు జెండయా. మంచి నటిగా, గాయనిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓ మ్యూజికల్ ఫిల్మ్‌లో నటించనున్నారు. ‘బీ మై బేబీ’ టైటిల్‌తో దివంగత ప్రముఖ గాయని రోనీ స్పెక్టర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో రోనీ స్పెక్టర్పాత్రను జెండయా చేయనున్నారు. బ్యారీ జెంకిన్స్ దర్శకత్వం వహించనున్నారు. కాగా... రోనీ స్పెక్టర్ అంటే తనకెంతో అభిమానం అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు జెండయా. 2022లో రోనీ మరణించినప్పుడు నివాళి అర్పిస్తూ, ఎంతో భావోద్వేగానికి గురయ్యారు జెండయా. కెమెరా ముందు రోనీగా ఒదిగిపోవడానికి ఎంత కృషి చేయాలో అంతా చేస్తానంటున్నారామె.బాయ్ జార్జ్ జీవితంతో... 1980లలో తమ గాత్రంతో శ్రోతలను ముగ్ధులను చేసిన గాయకుల్లో బాయ్ జార్జ్ ఒకరు. వేరే రచయితలతో కలిసి బాయ్ జార్జ్ రాసిన ‘టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్’, ‘స్ట్రైట్’, బాయ్ జార్జ్ మాత్రమే రాసిన ‘ఎ కర్మ’ ఆటోబయోగ్రఫీల ఆధారంగా బాయ్ జార్జ్ బయోపిక్ రూపొందనుంది. బాయ్ జార్జ్పాత్రను సోఫీ టర్నర్ చేసే అవకాశం ఉందట. దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే... బాయ్ జార్జ్ అబ్బాయి కాబట్టి... ఆపాత్రను అబ్బాయే చేయాలని, నటి సోఫీ టర్నర్‌తో ఎందుకు చేయించాలనుకుంటున్నారనే చర్చ హాలీవుడ్లో జరుగుతోంది. అయితే తనపాత్రకు సోఫీ టర్నర్ పూర్తి న్యాయం చేస్తుందని నమ్ముతున్నానని బాయ్ జార్జ్ అంటున్నారు. ‘‘నాపాత్రను సోఫీ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ... ‘ఆమె మీపాత్ర చేయలేదు... ఆమె ఒక మహిళ...’ అని అందరూ అంటున్నారు. అయితే నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఆమెపాత్ర చేయాలనుకున్నాను. నాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు నా బయోపిక్‌లో ఆమె నాపాత్ర చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది’’ అని బాయ్ జార్జ్ అంటున్నారు.ఈ చిత్రాలు మాత్రమే కాదు... దివంగత డ్రమ్మర్ కీత్ మూన్ బయోపిక్, అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, పియానిస్ట్ బిల్లీ జోయెల్ జీవితం ఆధారంగా... ఇలా పలు బయోపిక్స్ రానున్నాయి. – డి.జి. భవాని -
10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో?
హాలీవుడ్ సినిమాలు సరైన కంటెంట్‌తో రావాలే గానీ మన దేశంలోనూ మంచి కలెక్షన్స్ వస్తాయి. అలా లేటెస్ట్గా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనే మూవీ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. విదేశాల్లో వారం క్రితమే థియేటర్లలో రిలీజై అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. గత వీకెండ్ మన దేశంలోని విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? వసూళ్లు ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో)మన దగ్గర ప్రస్తుతం 'ధురంధర్ 2' హవా నడుస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' గురించి సినీ ప్రేమికులు తెగ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పేస్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజ్ కాగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.2800 కోట్ల మేర వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. మరింతగా పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.భారత్‌లో చాలావరకు ఈ సినిమాని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే స్క్రీనింగ్ చేస్తున్నారు. అయినా సరే నాలురు రోజుల్లో రూ.18 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా కొన్నిచోట్ల హౌస్‌పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి గతంలో వచ్చిన ఇంగ్లీష్ చిత్రాలతో పోలిస్తే దీనికి బాగానే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది.'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ విజువల్స్ అదిరిపోయాయని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా
'అవతార్' సినిమాల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ కాగా.. మరో రెండు పార్ట్ థియేటర్లలోక రావాల్సి ఉంది. అయితే 2009లో వచ్చిన తొలి పార్ట్ అద్భుతమైన హిట్ కాగా.. 2022లో వచ్చిన సీక్వెల్ పర్లేదు బాగానే ఉందనే రెస్పాన్స్ అందుకుంది. గతేడాది డిసెంబరులో రిలీజైన మూడో పార్ట్ చాలా మందికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.12 వేల కోట్లకు పైనే వచ్చాయి. అందరూ ఈ మూవీ గురించి దాదాపు మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా)జేమ్స్ కామెరూన్ తీసిన మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్'.. గతేడాది డిసెంబరు 19న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్లే పెద్దగా మెప్పించలేకపోయింది. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ మళ్లీ అదే టైపు స్టోరీ కావడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కొందరు మాత్రం చూశారు. అలా కొన్నాళ్ల పాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అంటే ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మన దగ్గర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. మరి మన దగ్గర థియేటర్లలో రూ.225 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‌కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్) -
సరికొత్త 'స్పైడర్ మ్యాన్' సినిమా ట్రైలర్ రిలీజ్
90స్ జనరేషన్ పిల్లల్ని ఎంతగానో అలరించిన 'స్పైడర్ మ్యాన్' నుంచి ఇప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. 2021లో చివరగా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' పేరుతో రిలీజైన మూవీ ఆకట్టుకుంది. బాగానే కలెక్షన్స్ సాధించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త చిత్రం రాబోతుంది. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' టైటిల్‌తో తీశారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?)ట్రైలర్ బట్టి చూస్తే.. నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో అతడు న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? స్పైడర్ మ్యాన్ అలియాస్ పీటర్ పార్కర్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణమేంటి? అనే విషయాల్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టామ్ హోలండ్, జెండాయా ప్రధాన పాత్రలు చేశారు. ఈ జూలై 31న ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి) -
ఆస్కార్ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)
-
అనుబంధాలకే ఆస్కారం
ఎన్ని గ్రాఫిక్స్ వచ్చినా, ఎన్ని ఏఐ విప్లవాలు వచ్చినా, ‘ఈ జనరేషన్ కథ’ అనుకోవడానికి ఎన్ని ఫీట్లు చేసినా... గత, వర్తమాన, భవిష్యత్‌లలో తిరుగులేని కాలాతీత కథా వస్తువు... కుటుంబం, అనుబంధాలు, త్యాగాలు... మొదలైనవి. ‘నాది పాత స్కూలు’ అని చెబుతుంటారు డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. సెంటిమెంట్, భావోద్వేగాలు అనే ఆ పాత స్కూల్ సబ్జెక్ట్‌తోనే ఆస్కార్ బరిలో సంచలనం సృష్టించారు. అతడి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆరు ఆస్కార్ అవార్డులు గెల్చుకుంది. ఈ ఏడాది ‘ఉత్తమ చిత్రం’గా ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది...‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అనే ప్రసిద్ధ మాట ఉన్నప్పటికీ... ఆర్థికం ఒక్కటే కాదు అనేకానేక సంబంధాలు అనుబంధాలను నిర్ణయిస్తాయి అని చెప్పుకోవడానికి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ను ఉదాహరణగా చెపొ్చచ్చు. ‘సాగర సంగమం’ సినిమాలో పితృ సమానుడైన బాలు (కమల్ హాసన్)ను శైలు అకారణంగా ద్వేషిస్తుంటే ‘అయ్యో!’ అనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్లు తెరుచుకొని ‘మాతృదేవోభవ పితృదేవోభవ’ అని పాడుతుంటే ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. అలాంటి బలమైన భావోద్వేగాలు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో చాలా ఉన్నాయి.ఇదీ కథ...విప్లవ సంస్థ ‘ఫ్రెంచ్ 75’లో సభ్యులైన ΄్యాట్ కల్వాన్ (లియోనార్డో డికాప్రియో), పెర్పిడియో బెవర్లీ హిల్స్ (టెయన్ టేలర్) ప్రేమికులు. ఒక డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించబడిన వలసదారులను బయటకు తీసుకువచ్చే క్రమంలో కమాండింగ్ ఆఫీసర్ స్టీవెన్‌ను అవమానిస్తుంది పెర్పిడియో. దీంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు స్టీవెన్. ఒక కేసులో పెర్పిడియోను అరెస్ట్ చేసిన స్టీవెన్, తన కోరిక తీర్చితే వదిలేస్తానని చెబుతాడు. అతడి డిమాండ్‌కు ఆమె అంగీకరించడంతో వదిలేస్తాడు.పెర్పిడియా ‘చార్లీన్’ అనే బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తరువాత విప్లవ కార్యకలాపాలు కొనసాగించడానికి అజ్ఞాతంలోకి వెళుతుంది. బ్యాంకు దోపిడి సమయంలో సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసినందుకు పెర్పిడియో అరెస్ట్ అవుతుంది. స్టీవెన్ ఆమెను జైలు నుంచి తప్పించుకునేలా చేస్తాడు. అయితే ఇది ఆమె మీద ప్రేమతో చేసింది కాదు. ‘ఫ్రెంచ్ 75’ సభ్యుల సమాచారాన్ని తెలుసుకోవాలనే కుట్రతో చేస్తాడు.పెర్పిడియో ఇచ్చిన సమాచారంతో ఆమె సహచరులను వెంటాడి, ఉరి తీస్తాడు. పదహారేళ్ల తరువాత.... చార్లీన్కు తానే తండ్రి అని తెలుసుకున్న స్టీవెన్ ఆమెను చంపేందుకు కుట్రలు చేస్తాడు. ఇన్నాళ్లు చార్లీన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ΄్యాట్ ఎలా స్పందించాడనేది కథ. తనను వదిలేసి వెళ్లిపోయిన తల్లిపై చార్లీన్కు కోపం, పెంపుడు తండ్రి (΄్యాట్)పై అనుమానం. ΄్యాట్ ఆమె నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నాడనేది అసలు సిసలు కథ.వైన్‌ల్యాండ్ స్ఫూర్తితో...‘వైన్‌ల్యాండ్’ నవలను స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ పాల్ థామస్ ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ తీశారు. థామస్ పిన్చాన్ 1990లో రాసిన పోస్ట్ మోడర్న్ నవల... వైన్‌ల్యాండ్. అమెరికా అధ్యక్షుడిగా రోనాల్డ్ రీగన్ తిరిగి ఎన్నికైన సంవత్సరం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1960 నుంచి 1980 వరకు అమెరికన్ సమాజంలో జరిగిన రకరకాల సంఘటనలను కళ్లకు కడుతుంది.తీయలేనేమో... లేదు తీయాల్సిందే!‘ఈ నవలను సినిమాగా తీయగలనా?’ అనే సందేహం మొదట్లో పాల్ థామస్‌కు వచ్చింది. నవలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఏదైనా కాన్సెప్ట్ అనుకొని తీయాలనుకున్నాడు. అప్పుడు అతడి మదిలోకి వచ్చిన ఆలోచనలు...యాక్షన్ కార్–చేజ్ మూవీ, మరొకటి... ఒక విప్లవకారిణి కథ. తండ్రి–కూతురు అనుబంధంతో పై రెండు కాన్సెప్ట్‌లను కలిపి సినిమా తీయాలనుకున్నారు.కారు ఛేజింగ్‌లు, షూటౌట్లతో యాక్షన్–హెవీ కథనం ఉండాలి. అదే సమయంలో బలమైన భావోద్వేగాలు ఉండాలనుకున్నారు. డ్రాఫ్ట్‌ల మీద డ్రాఫ్ట్‌లు రాశారు. ఎన్నోసార్లు తిరగరాసుకున్నాకగానీ తనకు స్క్రిప్ట్ సంతృప్తిగా అనిపించలేదు. అలా సినిమా తెర మీదికి వచ్చింది. ఆండర్సన్ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ చా...లా ఎక్కువ!ఒక తల్లి కథవిప్లవకారిణి, ప్రేమికురాలు, అన్యాయానికి గురైన మహిళ, ఒక బిడ్డకు తల్లిగా... రకరకాల షేడ్స్‌తో తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు టెయన్ జాక్వెలిన్ టేలర్. సింగర్, సాంగ్ రైటర్, మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ వీడియో డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.డైనమిక్ డాటర్‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో కూతురిగా ప్రధాన పాత్ర పోషించింది అమెరికన్ నటి చేజ్ ఇన్ఫినిటి పేన్. పదేళ్ల వయసులో స్కూలులో జరిగిన సంగీత కార్యక్రమానికి ఎంపిక కావడం ద్వారా ఆమె మ్యూజిక్ జర్నీ మొదలైంది. హైస్కూల్ రోజుల్లోనే మ్యూజిక్, థియేటర్ ప్రోగ్రామ్స్‌తో బిజీబిజీగా గడిపేది. ‘కె–పాప్ కవర్ డ్యాన్స్ గ్రూప్’ కో–ఫౌండర్లలో ఇన్ఫినిటీ ఒకరు. ఫ్రెంచ్ బాగా వచ్చు.గతం విషయం ఎలా ఉన్నా... ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’తో ‘ఈ అమ్మాయి ఎవరు?’ అని ప్రపంచ ప్రేక్షకులు ఆరా తీసేలా నటించింది. ‘కెమెరా టెస్ట్‌ల తరువాత ఆండర్సన్ సినిమాకు ఎంపిక కావడం మాట ఎలా ఉన్నా, లియో డికాప్రియోతో కలిసి నటిస్తున్నాననే ఊహ భయపెట్టింది. అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెబితే, నా కంటే ఎక్కువ భయభ్రాంతులకు గురయ్యారు! ఇదొక గొప్ప అవకాశం. భయపడకూడదు’ అనుకొని చేశాను’ అంటుంది ఇన్ఫినిటీ పేన్. -
ఆమెదే ఆస్కార్!
ఆస్కార్‌లో ఆమె నిలిచింది... చరిత్ర సృష్టించేలా గెలిచింది... కెమెరాలో ‘ఆమె’, క్యాస్టింగ్‌లో ‘ఆమె’, సాంగ్‌లో ‘ఆమె’, కాస్ట్యూమ్స్‌లో ‘ఆమె’, యానిమేషన్ నిర్మాణంలో ‘ఆమె’... ఇలా సాంకేతిక విభాగాల్లో పురుషులతో పోటీ పడి ‘ఆమె’ ఆస్కార్ దక్కించుకుంది. 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఆమె’ తన సత్తా చాటింది. ప్రతిభతో ‘ఆస్కార్ ఆమెదే’ అని నిరూపించింది. టోటల్‌గా ఈసారి ‘ఫిమేల్ డామినేషన్’ కనిపించింది. ఇంకా ఆస్కార్ అవార్డులు సాధించిన విజేతలు, ఇతర విశేషాల్లోకి...⇒ ‘‘ఈ రోజు నేను ఆస్కార్ వేదికపై ఉన్నానంటే ఇందుకు కారణం సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్, హాలీ బెర్రీ, జేమీ ఫాక్స్, ఫారెస్ట్ విటేకర్, విల్ స్మిత్ (జోర్డాన్ కంటే ముందు ఆస్కార్ అవార్డులు అందుకున్న నల్లజాతి నటులు). ఈ దిగ్గజాల బాటలో నిలబడటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నాకు అండగా నిలుస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లికి, నా కోసం ఘనా నుంచి ఇక్కడకు వచ్చిన నా తండ్రికి ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు మైఖేల్ బి. జోర్డాన్⇒ ఈ సినిమా కథను నా పిల్లల (పెర్ల్, లూసిల్లే, జాక్, మిన్నీ) కోసమే రాశాను. మనం వాళ్లకు ఓ గందరగోళ ప్రపంచాన్ని అందిస్తున్నాం. ఇందుకు వారికి మనం ముందుగా క్షమాపణలు చె΄్పాలి. అదే సమయంలో మనల్ని మనం కూడా సరిదిద్దుకోవాలని, మానవత్వాన్ని తిరిగి ఇచ్చేయాలనే ఓ ఆశతో కూడా ఈ కథ రాశాను. నా ప్రయాణంలో భాగమైన నా భార్య మాయా రుడాల్ఫ్కు థ్యాంక్స్. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించిన అకాడమీకి థ్యాంక్స్. – ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్⇒ ఒక్క షాట్‌తో క్రికెటర్ సిక్సర్ కొట్టినట్లు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆస్కార్ వేదికపై సిక్సర్ కొట్టింది. ఆరు అవార్డులు సాధించి, హాట్ టాపిక్‌గా నిలిచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్ వేదికగా మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) హాలీవుడ్ హాస్య నటుడు కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన అమెరికన్ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ఆరు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, క్యాస్టింగ్) సిక్సర్ కొట్టింది. ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా 16 నామినేషన్స్‌ను దక్కించుకుని, అందరి దృష్టినీ ఆకర్షించిన అమెరికన్ హారర్ ఫిల్మ్ ‘సిన్నర్స్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) మాత్రమే అవార్డులు సాధించింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘ఫ్రాంకైన్ స్టీన్’కు మూడు అవార్డులు లభించాయి. ‘కే పాప్ డిమాన్ హంటర్స్’ చిత్రాన్ని రెండు అవార్డులు వరించాయి.‘వెపన్స్, అవతార్: ఫైర్ అండ్ యాష్, ఎఫ్1, సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రాలు ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. ఉత్తమ నటుడిగా మైఖేల్. బి. జోర్డాన్, నటిగా జెస్సీ బక్లీ, సహాయ నటి విభాగంలో ఎమీ మాడిసన్ తొలిసారి ఆస్కార్ అవార్డులు అందుకోగా, ఉత్తమ సహాయ నటుడు విభాగంలో సీన్ పెన్కు మూడో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ ఆండర్సన్ అవార్డును అందుకున్నారు. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ఆటం డ్యూరాల్డ్ అర్కాపా. అలాగే ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెట్టిన బెస్ట్ క్యాస్టింగ్ విభాగంలో కాసాండ్రా కులుకుండిస్ అవార్డు అందుకుని, ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా, తొలి మహిళగా నిలిచారు.ఆరో నల్ల జాతీయుడు... తొలి ఐరిష్ మహిళ‘సిన్నర్స్’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి, అద్భుతమైన నటన కనబరిచిన మైఖేల్ బి. జోర్డాన్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఆస్కార్ అవార్డు సాధించిన ఆరో నల్ల జాతీయుడిగా మైఖేల్ రికార్డు సృష్టించారు. అంతేకాదు... ఉత్తమ నటుడు విభాగంలో తొలిసారి లభించిన నామినేషన్‌తోనే మైఖేల్ ఆస్కార్ అవార్డును ముద్దాడటం విశేషం. ఇక ‘హామ్నెట్’లో ఆగ్నేస్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. జెస్సీకి ఇదే తొలి ఆస్కార్ అవార్డు. అలాగే ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ఐరిష్ మహిళగా కూడా ఆమె రికార్డులకెక్కారు.⇒ ముచ్చటగా మూడు: దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ ఆస్కార్ కల నెరవేరింది. 98వ ఆస్కార్ అవార్డులకు ముందు ఆయనకు పదకొండు ఆస్కార్ నామినేషన్స్ ఉన్నాయి. కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు. కాగా 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఆయన (ఉత్తమ చిత్రం, దర్శకుడు, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) విభాగాల్లో నామినేషన్స్ సాధించారు. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు లభించాయి.సీన్... అన్‌సీన్!‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుచుకున్న సీన్ పెన్ వేడుకకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సీన్... అన్‌సీన్ అని గుసగుసలు వినిపించాయి. అతను ఉక్రెయిన్‌లో ఉండటం వల్ల హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక యాక్టింగ్ విభాగంలో మూడు ఆస్కార్ అవార్డులు సాధించిన ఎనిమిదో వ్యక్తిగా సీన్ పెన్ నిలిచారు.‘‘ఇక్కడ ఉన్న అద్భుతమైన మహిళలందరికీ ధన్యవాదాలు. మీ ప్రతిభ నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇక ఫ్రెడ్ (భర్తని ఉద్దేశించి)... నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు అద్భుతమైన నాన్నవి... నా బెస్ట్ ఫ్రెండ్‌వి. ఇక మా చిన్న అమ్మాయి ఇస్లా వయసు ఎనిమిది నెలలు. ఏం జరుగుతుందో తనకు తెలియదు. బహుశా పాలు కావాలని కలలు కంటూ ఉంటుంది.నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ నీ తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను. నా ఐరిష్ కుటుంబం ఇక్కడ ఉంది. కలలు కనడం, వాటిని సాకారం చేసుకునేలా అండగా నిలబడటం నుంచి అన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు అమ్మానాన్న. ఈ రోజు యూకేలో మదర్స్ డే. ఈ వారం మా పాపకి ఒక పన్ను వచ్చింది. ఈ రోజు ఉదయం నా గుండెలను హత్తుకుని నిద్రపోయింది. ఈ తల్లి సాధించిన అవార్డుని నీ అందమైన హృదయానికి అంకితం చేయాలనుకుంటున్నాను’’. – నటి జెస్సీ బక్లీఆస్కార్ ఇన్ మెమోరియమ్లో కోటఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకుంటూ వీడియోను ప్రదర్శించారు. ఆస్కార్ కమిటీ నివాళులర్పించిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కోట శ్రీనివాసరావు, బాలీవుడ్‌కి చెందిన ధర్మేంద్ర, మనోజ్ కుమార్, దక్షిణాది తార బి. సరోజాదేవి వంటి దిగ్గజాలు ఉన్నారు.అయితే వీరి గురించి వేదికపై ప్రస్తావించినప్పుడు ధర్మేంద్రను చూపించకపోవడం భారతీయ ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేసింది. ధర్మేంద్ర అభిమానులు ఆస్కార్ ప్రతినిధులపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని... ఆ తర్వాత అందరి పేర్లను ఆస్కార్ అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచారని టాక్.⇒ ‘‘నేత కార్మికులకు, కళాకారులకు, నా టీమ్‌కి, మా పనిని గుర్తించిన అకాడమీకి ధన్యవాదాలు’’ అంటూ కన్నీళ్లు ఆపుకోవడానికి కష్టపడుతూనే కాస్ట్యూమ్ విభాగంలో ‘ఫ్రాంకైన్స్టైన్’ సినిమాకి అవార్డు అందుకున్న ఆనందాన్ని పంచుకున్నారు కేట్ హాలే. అలాగే తాను చేసే సరదా పనులు, చిరాకు పెట్టే పనులను భరిస్తున్న తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారామె.⇒ ‘‘అవార్డ్స్‌లో కొత్తగా క్యాస్టింగ్ కేటగిరీని చేర్చినందుకు అకాడమీకి థ్యాంక్స్. ఒక సినిమాకి నటీనటులను సెట్ చేయడానికి అవిశ్రాంతంగా పోరాడుతున్న క్యాస్టింగ్ డైరెక్టర్లకు థ్యాంక్స్. సినిమాలో తమ పేరు కూడా రాని క్యాస్టింగ్ డైరెక్టర్లకు ఈ అవార్డుని అంకితం చేస్తున్నా’’.– కాసాండ్రా కులుకుండిస్⇒ ‘వెపన్’ సినిమాలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఎమీ మాడిగన్ తొలిసారి ఆస్కార్ అవార్డును సాధించారు. కాగా 1986లో జరిగిన 58వ ఆస్కార్ అవార్డుల్లో ఇదే విభాగంలో అవార్డు కోసం ‘ట్వైస్ ఇన్ ఏ లైఫ్‌టైమ్’ అనే చిత్రంలోని నటనకు గాను ఎమీ మాడిగన్కు నామినేషన్ దక్కినా, అవార్డు రాలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆమెకు 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటి విభాగంలోనే నామినేషన్ లభించి, అవార్డు రావడం విశేషం. ఇలా ఒక ఆస్కార్ నామినేషన్‌కి, మరో ఆస్కార్ నామినేషన్‌కు మధ్య 40 ఏళ్ల గ్యాప్ ఉండి, అవార్డు సాధించిన ఘనత మాత్రం ఎమీ మాడిగన్కే దక్కుతుంది.కెమెరా... ఆమె మూడో కన్నుఉత్తమ సినిమాటోగ్రఫీకి అకాడమీ అవార్డు గెల్చుకున్న తొలి మహిళగా, శ్వేతజాతియేతర తొలి మహిళగా చరిత్ర సృష్టించారు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఆటం డ్యూరాల్డ్ అర్కాపావ్. ‘సిన్నర్స్’ సినిమాకు ఆస్కార్ అందుకున్నారు. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఆటం కొంతకాలం ప్రకటనల రంగంలో పని చేశారు. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగు పెట్టి, కెమెరా అసిస్టెంట్‌గా పని చేశారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్‌లో సభ్యురాలిగా చేరారు.2025 చిత్రం ‘సిన్నర్స్’ సినిమాను ఐమాక్స్15–పెర్ఫ్ అండ్ అల్ట్రా పానా విజన్ 70 కెమెరాలను ఉపయోగించి 65 ఎంఎం ఫిల్మ్‌పై చిత్రీకరించారు.‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. నా బాల్యం, కుటుంబంపై ప్రభావం చూపిన వ్యక్తి’ అని పోరాట యోధుడైన తన తాత పాగన్ బటిస్టా గురించి చెబుతుంటారు ఆటం. ‘నేను ఇక్కడ నిలబడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఇంకా ఎంతోమంది మహిళలు ఇక్కడ నిలబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకుండా నేను ఇక్కడకి రాలేను అని నాకు తెలుసు’ అంటూ చిత్రపరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు ఆస్కార్ వేడుకలో కృతజ్ఞతలు తెలియజేశారు ఆటం.ఆస్కార్ విజేతలు ⇒ ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ∙దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్) ∙నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్) ∙సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ∙సహాయ నటి : ఎమీ మాడిగన్ (వెపన్స్) ∙సినిమాటోగ్రఫీ: ఆటం డురాల్డ్ అర్కపా (సిన్నర్స్) ⇒ ఎడిటింగ్: యాండీ జుర్గెన్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ఒరిజినల్ స్కోర్: లుడ్విగో గోరాన్సన్ (సిన్నర్స్)⇒ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె–పాప్ డిమాన్ హంటర్స్) ⇒ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వేల్యూ (నార్వే) ⇒ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ. రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1) ⇒ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం: మిస్టర్ నోబడీ ఎగైన్స్ట్ పుతిన్ ⇒ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎమ్టీ రూమ్స్ ⇒ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)⇒్రపొడక్షన్ డిజైన్: టమరా డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకైన్స్టీన్) ∙ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)⇒ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్) ⇒ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్) ⇒ క్యాస్టింగ్: కాసాండ్రా కులుకుండిస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పాల్స్ ⇒ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె–పాప్ డిమాన్ హంటర్స్⇒ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్సే ్చంజింగ్ సలైవా.⇒ ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, రిలయన్ ్స అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ భర్త ఆనంద్ పిరమాల్‌తో కలిసి ఆస్కార్ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ ఇటలీ డిజైనర్ వాలెంటినో ఫాల్/వింటర్ వింటేజ్ కలెక్షన్ గౌను, చోకర్ స్టైల్ డైమెండ్ నెక్లెస్‌లో ఈషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించడంతో పాటు ఇండియన్ సినిమాకు మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈషా అంబానీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి⇒ 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో భారతీయ నటి ప్రియాంకా చోప్రా సందడి చేశారు. స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్‌తో కలిసి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అవార్డు సాధించిన నార్వేజియన్ డ్రామా ‘సెంటిమెంటల్ వేల్యూ’ సినిమా యూనిట్‌కు అవార్డు అందించారామె. ఈ విభాగంలో అవార్డు సాధించిన తొలి నైజీరియన్ ఫిల్మ్‌గా ‘సెంటిమెంటల్ వేల్యూ’ నిలిచింది. అవార్డును ప్రదానం చేసే సమయంలో ‘యుద్ధం వద్దు... పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి’ అన్నట్లుగా జేవియర్ నినాదం చేయగా, ప్రియాంకా చోప్రా మద్దతు ఇస్తున్నట్లుగా హావభావాలు పలికించారు. ఆస్కార్ వేదికపై ఇది చర్చనీయాంశమైంది.⇒ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో టై అవడం విశేషంగా నిలిచింది. ఈ విభాగంలోని అవార్డుకు ‘టూ పీపుల్ ఎక్సే ్చంజ్ సలైవా’, ‘ది సింగర్స్’ చిత్రాలు పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీకి అవార్డు వస్తుందోననే ఆసక్తి నెలకొంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘టూ పీపుల్ ఎక్సే ్చంజ్ సలైవా’, ‘ది సింగర్స్’ విజేతలుగా నిలిచాయి. ఈ జాబితా టై అయింది’ అని ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని తెలిపారు. ఈ విభాగంలోని రెండు చిత్రాల విజేతలకు నటుడు కుమాయిల్ నంజియాని అవార్డు అందించారు. కాగా 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇలా టై అవడం ఇది ఏడోసారి అట.ఈ అవార్డు కొరియన్ల కోసమే... ‘కేపాప్ డిమాన్ హంటర్స్’ సినిమాకు యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ఒరిజినల్ సాంగ్ (‘గోల్డెన్’ పాటకు) విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వచ్చాయి. యానిమేషన్ విభాగంలో డిస్నీ, పిక్సార్ సంస్థలు నిర్మించిన సినిమాలు కాకుండా వేరే యానిమేటెడ్ సినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు రావడం ఇదే తొలిసారి. సౌత్ కొరియన్ సాంగ్ రైటర్లు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డులు సాధించారు. ‘కేపాప్ డిమాన్ హంటర్స్’ చిత్రాన్ని మాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్ ద్వయం దర్శకత్వంలో మిచెల్లీ వాంగ్ నిర్మించారు.యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును స్వీకరించే సమయంలో మాగీ కాంగ్ మాట్లాడుతూ – ‘ఈ అవార్డు కొరియా కోసం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొరియన్ల కోసం’ అంటూ కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును స్వీకరిస్తూ కిమ్ యున్–జే భావోద్వేగానికి లోనయ్యారు. ‘నన్ను తక్కువగా చూసేవారి మధ్య పెరిగాను. ఇప్పుడు వారందరూ మా పాటలు పాడుతున్నారు. అంతటా కొరియన్ లిరిక్స్ వినిపిస్తున్నాయి. ఇది సక్సెస్ మాత్రమే కాదు. ధైర్యానికి స్ఫూర్తి’ అన్నారు. -
ఆ ఆరుగురిపై ఆస్కార్ బ్యాన్.. ఎందుకో తెలుసా?
ఆస్కార్ అవార్డు గెలిస్తే నింగిలోని చందమామను అందుకున్నంత సంతోషం! ఒక్కసారైనా ఆస్కార్ గెలవాలని కలలు కనే ఆర్టిస్టులు ఎంతోమంది. కనీసం అకాడమీ అవార్డుల వేడుకను దగ్గరినుంచైనా చూసి తరించాలనుకునేవారు బోలెడంతమంది! ప్రపంచ ప్రఖ్యాతికెక్కిన ఈ ఆస్కార్ వేడుకలు 1929లో మొదలయ్యాయి. అప్పుడు 12 విభాగాల్లో అవార్డులు అందించేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 24 కేటగిరీలకు చేరింది.ఆస్కార్ చరిత్రలో చెరగని చిరునామాఆస్కార్ చరిత్రలో అత్యధిక నామినేషన్లు అందుకున్న వ్యక్తిగా సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ పేరిట చెక్కుచెదరని రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 నామినేషన్లు దక్కించుకోగా ఐదుసార్లు పురస్కారం గెలిచాడు. వాల్ట్ డిస్నీ ఏకంగా 26 ఆస్కార్లు అందుకుని చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇకపోతే అకాడమీ పురస్కారాన్ని వేలం వేయకూడదు, బయట అమ్మకూడదు. అంతలా వద్దనుకుంటే అకాడమీకే తిరిగివ్వాలి.. అది కూడా కేవలం ఒక్క డాలర్‌కి మాత్రమే!వారిపై బ్యాన్ఈ అవార్డుల ఫంక్షన్ కోసం ఏకంగా రూ.500 కోట్ల మేర ఖర్చుపెడతారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి రమ్మని పిలుపు వస్తే సంబరంతో పరిగెత్తేవారెందరో!. అయితే కొందరిపై మాత్రం ఆస్కార్ ఈవెంట్‌కు హాజరవకుండా, అవార్డులకు నామినేట్ అవకుండా నిషేధం అమల్లో ఉంది. వాళ్లెవరంటే.. మీటూ ఉద్యమం సమయంలో సినీ నిర్మాత హార్వే వైయిన్ స్టీన్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. దీంతో అతడిని అకాడమీ కమిటీ బ్యాన్ చేసింది.విల్ స్మిత్‌పై నిషేధం.. కాకపోతే!2022లో కమెడియన్ క్రిస్ రాక్.. స్మిత్ భార్యపై జోక్ వేశాడు. దీంతో అతడు ఆవేశంగా స్టేజీపైకి వచ్చి క్రిస్ చెంప చెళ్లుమనిపించాడు. దీని కారణంగా విల్ స్మిత్‌పై పదేళ్ల నిషేధం పడింది. అయితే అతడి నామినేషన్స్‌పై మాత్రం వేటు వేయలేదు. మైనర్‌పై లైంగిక వేధింపుల కారణంగా దర్శకుడు రోమన్ పోలంస్కిని, లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన కమెడియన్ బిల్ కాస్బీని సైతం అకాడమీ నిషేధించింది. నేర చరిత్రఆస్కార్కు నామినేట్ అయిన సినిమాలను పైరసీ చేస్తున్నాడని గుర్తించి నటుడు కార్మైన్ కార్డీని సైతం బ్యాన్ చేసింది. లైంగిక నేరాల చరిత్ర కారణంగా నటుడు, సినిమాటోగ్రాఫర్ ఆడమ్ కిమ్మెల్పైనా నిషేధం విధించింది. ఇలా ఈ ఆరుగురు నటులను ఆస్కార్ వేదికపైకి రాకుండా దూరం పెట్టింది.చదవండి: 98వ ఆస్కార్.. పూర్తి జాబితా -
ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
సినీప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా ఏకంగా ఆరు అవార్డుల(ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే ఎడిటింగ్ విభిగాల్లో)ను కైవసం చేసుకుంది. తర్వాత నాలుగు (ఉత్తమ నటుడు, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) పురస్కారాలతో సిన్నర్స్ రెండో స్థానంలో ఉంది. మరి ఆస్కార్ (Oscars 2026) గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూసేద్దాం..వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ : జియో హాట్స్టార్సిన్నర్స్ : జియో హాట్స్టార్ఫ్రాంకెన్స్టీన్ : నెట్‌ఫ్లిక్స్F1 : యాపిల్ టీవీఅవతార్: ఫైర్ అండ్ యాష్ : ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు.వెపన్స్: జియో హాట్స్టార్కెపాప్ డిమాన్ హంటర్స్ : ఈ యానిమేటెడ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.సెంటిమెంటల్ వాల్యూ : అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది.హామ్నెట్ : యాపిల్ టీవీలో అద్దెకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్కార్ 2026: విజేతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
OSCARS 2026 : ఆస్కార్ విజేతల జాబితా (ఫోటోలు)
-
98వ ఆస్కార్: ఆ సినిమాకు అత్యధికంగా 6 అవార్డులు
హాలీవుడ్లో ఆస్కార్ పండగ సందడి కనిపించింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మార్చి 16న ఉదయం ఘనంగా జరిగింది. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. అలా ఈసారి 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి అత్యధికంగా 6 పురస్కారాలు వరించాయి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిగణించారు. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో రెండు చిత్రాలకు పురస్కారాలు వరించడం విశేషం! ఆస్కార్ స్టేజీపై తళుక్కుమన్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రంగా 'సెంటిమెంటల్ వాల్యూ'ని ప్రకటించింది.ఆస్కార్ విజేతల జాబితాఉత్తమ చిత్రం : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ నటుడు: మైఖెల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)ఉత్తమ నటి: జెస్సీ బక్లే (హామ్నెట్)ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె-పాప్ డిమాన్ హంటర్స్)ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే దేశపు సినిమా)ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్)ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)ఉత్తమ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ.రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1)ఉత్తమ కాస్టింగ్: కసాండ్రా కులుకుందిస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్ నోబడీ ఎగైన్స్ట్ పుతిన్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్)ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్)ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె-పాప్ డిమాన్ హంటర్స్ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవాచదవండి: ఉత్తమ చిత్రంగా నిలిచిన "వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్" సినిమా రివ్యూ -
‘అసలుకు అచ్చుగుద్దినట్లు చేస్తే ఊరుకోం’
ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్, క్యాప్‌కట్ వంటి యాప్‌లతో సంచలనం సృష్టించిన చైనా కంపెనీ ‘బైట్‌డ్యాన్స్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రతిష్టాత్మకమైన ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ‘సీడ్యాన్స్ 2.0’ గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ నిరవధికంగా నిలిపివేసింది. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల నుంచి కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.వివాదానికి కారణం ఇదే..సీడ్యాన్స్ 2.0 సృష్టించే వీడియోలు అచ్చం హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను తలపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని క్లిప్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి. అందులో హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఐకానిక్ క్యారెక్టర్లుగా పేరున్న స్పైడర్ మ్యాన్, వెనమ్ వంటి సూపర్ హీరోలతో పాటు ప్రముఖ యానిమేషన్ క్లిప్‌లను ఈ ఏఐ మోడల్ అత్యంత నాణ్యతతో సృష్టించింది.దాంతో తమ మేధో సంపత్తిని అనుమతి లేకుండా ఈ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించారని హాలీవుడ్ స్టూడియోలు మండిపడుతున్నాయి.హాలీవుడ్ దిగ్గజాల ధ్వజంప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ గత నెలలోనే బైట్‌డ్యాన్స్‌కు ‘సీజ్ అండ్ డెసిస్ట్’ (నిలిపివేత) లేఖను పంపింది. తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడుకున్నారని డిస్నీ ఆరోపించింది. మరోవైపు, పారామౌంట్ స్కైడాన్స్ సైతం రంగంలోకి దిగింది. ‘స్టార్ ట్రెక్, ది గాడ్ ఫాదర్, సౌత్ పార్క్ వంటి మా ఐకానిక్ చిత్రాల హక్కులను బైట్‌డ్యాన్స్ ఉల్లంఘించింది’ అని పారామౌంట్ స్పష్టం చేసింది.సీడ్యాన్స్ 2.0 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, ఇ-కామర్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం రూపొందించారు. ఒకవేళ ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తే హాలీవుడ్ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
ఆస్కారం ఎవరికి?
హాలీవుడ్లో ఆస్కార్ సందడి మొదలైంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ నెల 15న జరగనున్న సంగతి తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం జరుగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డు సాధించే ఆస్కారం ఎవరికి మెండుగా ఉంది? అనే చర్చ జరుగుతోంది. ఆస్కార్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించి, అత్యధికంగా 16 నామినేషన్స్ దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాకు ఫైనల్‌గా ఎన్ని అవార్డులు వస్తాయి? అనేది ప్రస్తుతం హాలీవుడ్లో హాట్ టాపిక్.అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ‘సిన్నర్స్’ సినిమాను డామినేట్ చేసి, ఎక్కువ అవార్డులు దక్కించుకునే అవకాశం లేకపోలేదని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ‘ఫ్రాకింగ్స్టన్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలకు తొమ్మిది నామినేషన్స్ లభించగా, ‘హామ్నెట్’ చిత్రానికి 8 నామినేషన్స్ దక్కాయి. మరి... ఈ చిత్రాల్లో ఏ చిత్రం ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది. ఇక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు... ఈ ప్రధాన విభాగాల్లో హాలీవుడ్ కథనాల ప్రకారం అవార్డు దక్కే ఆస్కారం ఎవరికి ఉందనే విషయం తెలుసుకుందాం...జోస్యం నిజమవుతుందా?ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఐదుగురిలోనూ తిమోతి చాలమేట్ (‘మార్టీ సుప్రీం’ సినిమాకుగానూ)కే ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ ఈ ఏడాది జరిగిన 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును ‘ది సీక్రెట్ ఏంజెంట్’ చిత్రానికిగానూ వాగ్నర్ మౌరా గెలుచుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి బ్రెజిలియన్ యాక్టర్‌గా వాగ్నర్ నిలిచారు.అది మాత్రమే కాదు... ఉత్తమ నటుడిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ వాగ్నర్ మౌరా అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ అందించే అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచున్నారు మైఖేల్ బి. జోర్డాన్. పైగా ఆస్కార్‌లోనే అత్యధిక నామినేషన్స్‌ను దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాలో నటించిన యాక్టర్ కాబట్టి మైఖేల్ బి. జోర్డాన్‌పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ‘బ్లూ మూన్’ సినిమాలో ఈథన్ హాక్, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రంలో లియోనార్డ్ డికాప్రియో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది పోటీ కాస్త గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మెజారిటీ మాత్రం తిమోతి చాలమేట్కే అవార్డు వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా 30 ఏళ్ల వయసులోనే మూడుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన అతి పిన్న వయస్కుడిగా తిమోతి పేరిట రికార్డు ఉంది. 97వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు విభాగంలో ‘ఏ కంప్లీట్ అన్నోన్’ సినిమాకుగాను తిమోతికి నామినేషన్ దక్కినప్పటికీ అవార్డు రాలేదు. ఈ మూడో ప్రయత్నంలో తిమోతికి అవార్డు ఖాయం అని హాలీవుడ్ జోస్యం చెబుతోంది..పాతికేళ్ల తర్వాత... గత ఏడాది జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. అయితే ఈ ఏడాది జరగనున్న 98వ అవార్డ్స్ ప్రదానోత్సవంలో కొత్తగా ‘బెస్ట్ క్యాస్టింగ్’ అనే విభాగాన్ని ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రవేశపెట్టింది. 2001లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ పాతికేళ్లకు ‘బెస్ట్ క్యాస్టింగ్’ పేరుతో మరో విభాగాన్ని చేర్చారు.ఇలా 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ క్యాస్టింగ్ విభాగంలో నీనా గోల్డ్ (‘హామ్నెట్’ సినిమా), జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్), గాబ్రియేల్ డొమింగ్యూస్ (ది సీక్రెట్ ఏజెంట్), ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్) మధ్య పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీ ‘సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రాల మధ్య ఉన్నట్లే, ఈ కొత్త విభాగంలోనూ ప్రధాన పోటీ ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్)ల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎందుకంటే యాక్టింగ్ విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు నాలుగు నామినేషన్స్ దక్కగా, ‘సిన్నర్స్’కు మూడు నామినేషన్స్ దక్కాయి. అయితే ఈ విభాగంలో ‘సిన్నర్స్’కే అవార్డు రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే... ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా నామినేషన్స్ దక్కించుకున్న రికార్డు ‘సిన్నర్స్’కే దక్కింది కాబట్టి ఈ సినిమాకే ఈ విభాగంలో అవార్డు వస్తుందంటున్నారు హాలీవుడ్ సినీ నిపుణులు. అలాగే జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం) అవార్డు అందుకునే చాన్స్ లేకపోలేదంటున్నారు.సిన్నర్స్ వర్సెస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. ఆస్కార్ హిస్టరీలోనే అత్యధికంగా 16 నామినేషన్స్‌ను దక్కించుకుని, చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి కూడా ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ ఉంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధానంగా ఈ రెండు చిత్రాల మధ్యనే పోటీ ఉంటుందనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. నామినేషన్స్ పరంగా ‘సిన్నర్స్’దే పై చేయి అయినప్పటికీ ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు రావచ్చొనే టాక్ హాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.ఈ ఏడాది జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డు (బాఫ్తా), గోల్డెన్ గ్లోబ్, ్ర΄÷డ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్కార్‌లోనూ ఉత్తమ చిత్రం విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కు అవార్డు దక్కుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కానీ ‘సిన్నర్స్, హామ్నెట్’ చిత్రాలను కూడా తేలికగా తీసివేయలేమని హాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాలను దాటుకుని ఈ విభాగంలో బరిలో ఉన్న ‘బగోనియా, ఎఫ్1, ఫ్రాంకిన్‌స్టన్, మార్టీ సుప్రీం, ది సీక్రెట్ ఏజెంట్, ట్రైన్ డ్రీమ్స్’ వంటి సినిమాల్లో ఏదైనా సర్ప్రైజింగ్గా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? అనే విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.ఈ ఇద్దరిలో ఎవరు?ఉత్తమ నటి విభాగంలో ‘హ్యామ్‌నెట్’ చిత్రానికిగాను జస్సీ బక్లీ, ‘బగోనియా’ చిత్రానికిగాను ఎమ్మా స్టోన్, ‘సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రానికి రెనాటా రైన్సావా, ‘ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ ఉడ్ కిక్ యు’ చిత్రానికి నురోజ్ బర్న్, ‘సాంగ్ సంగ్ బ్లూ’ మూవీకి గాను కేట్ హడ్సన్‌లు నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ‘క్రిటిక్స్ చాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్తా అవార్డ్స్’లో నటిగా అవార్డు గెలుచుకుని, ఉత్తమ నటి విభాగంలోని ఆస్కార్ అవార్డు కోసం రేసులో ముందు వరుసలో ఉన్నారు జస్సీ బక్లీ. కాగా రెనాటా రైన్సావా, రోజ్లు తమ కెరీర్లో తొలిసారి ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు.అలాగే గతంలో ‘ఆల్మోస్ట్ ఫేమస్’ అనే చిత్రంలో సహాయ నటిగానూ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు కేట్ హడ్సన్. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె మళ్లీ ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఈసారి ఉత్తమ నటి విభాగంలో కేట్ హడ్సన్‌కు నామినేషన్ దక్కింది. కేట్, రెనాటా... ఈ ఇద్దరిలో ఆస్కార్ అదృష్టం ఎవర్ని వరిస్తుంది అనేది చూడాలి.భారత్‌కు నిరాశ ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో మన దేశానికి నిరాశే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్’ను పంపింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం షార్ట్ లిస్ట్ అయింది కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో బ్రెజిల్ దర్శకుడు క్లెబర్ మెండోన్సా ఫిల్హో తీసిన ‘ది సీక్రెట్ ఏజెంట్’, ఫ్రాన్స్ దర్శకుడు జాఫర్ పనాహి తెరకెక్కించిన ‘ఇట్ వాజ్ జస్ట్ ఎ యాక్సిడెంట్’, నార్వే డైరెక్టర్ జోచిమ్ ట్రైయర్ తీసిన ‘సెంటిమెంటల్ వేల్యూ’, స్పెయిన్ డైరెక్టర్ ఆలివర్ లాక్సే రూపొందించిన ‘సిరాట్’, ట్యూనిషియా డైరెక్టర్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ సినిమాలు నామినేషన్ దక్కించుకున్నాయి.ఇంకా ఆస్కార్ కన్సిడరేషన్ విభాగంలో ‘మహావతార్ నరసింహా, కాంతార: ఏ లెజెండ్ చాప్టర్1, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్నైట్’ వంటి సినిమాలు పరిశీలన జాబితాలో ఉన్నప్పటికీ నామినేషన్‌ను దక్కించు కోవడంలో విఫలమయ్యాయి. అయితే ఆస్కార్ అవార్డుల ప్రజెంటర్స్‌లో భారతీయ నటి ప్రియాంకా చో్రపా కూడా ఉండటం అనేది భారతీయ ప్రేక్షకులను ఆనందపరిచే విషయం.పద్నాలుగో సారైనా అవార్డు వస్తుందా?దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఇప్పటికి 14 సార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క అవార్డు వచ్చింది లేదు. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గాను పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. పైగా ఈ ఏడాది జరిగిన బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు పాల్ థామస్‌కే దక్కింది.దీంతో ఆస్కార్ అవార్డు కూడా ఆయనకే రావొచ్చన్నది హాలీవుడ్ బలమైన నమ్మకం. మరోవైపు రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), ట్రియర్ (సెంటిమెంటల్ వేల్యూ), జాష్ షాఫ్టీ (మార్టీ సుప్రీం), క్లోయి జావ్ (హ్మామ్నెట్) లను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే...ఈ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో నామినేషన్స్ దక్కింది. ఇంకా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) అమీ మాడిగన్ (వెపన్స్), బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) విభాగంలో లుడ్విగ్ గోరాన్సన్ వంటి వారు అవార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుని ఏ స్టార్ చేజిక్కించుకుంటారు? ఉత్తమ చిత్రం అవార్డు ఏ సినిమాకి దక్కుతుంది? అనే సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోతుంది. – ముసిమి శివాంజనేయులు -
ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు సంగతి పక్కనబెడితే ఓటీటీల్లోనూ నేరుగా కొన్ని మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా గత వీకెండ్ వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'వార్ మెషీన్'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ దృష్టిలో పడింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)కథేంటి?అది అఫ్ఘానిస్తాన్‌లోని ఓ ప్రాంతం. పాడపోయిన తన తమ్ముడి ఆర్మీ కాన్వాయ్ బాగు చేసేందుకు అమెరికన్ ఆర్మీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ (అలెన్ రిచ్‌సన్) వస్తాడు. సరిగ్గా అప్పుడే తాలిబన్లు వీరిపై దాడి చేస్తారు. దీని నుంచి సార్జెంట్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత అమెరికన్ ఆర్మీలోని అత్యంత కష్టమైన రేంజర్ కావాలనుకుంటాడు. నాలుగుసార్లు తిరస్కరణకు గురైనా సరే చివరకు ట్రైనింగ్‌కి ఎంపికవుతాడు. శిక్షణలో భాగంగా చివరి దశకు చేరుకుంటాడు. చిట్టచివరి పరీక్షలో పాసైతే చాలు అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? సార్జెంట్.. ఏలియన్ షిప్‌తో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు గానీ దీన్ని థియేటర్లో విడుదల చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలాంటి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే 100 నిమిషాలున్న ఈ మూవీ.. మొదటి సీన్ నుంచి చివరవరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అదరగొట్టేసింది. ఓవైపు యాక్షన్ చూపిస్తూనే.. మరోవైపు ఏలియన్ షిప్ చేస్తున్న దాడి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే పాయింట్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.అసలు అమెరికన్ ఆర్మీ ఎలా ఉంటుంది? ఆర్మీలోని రేంజర్ కావాలంటే ఎలాంటి పరీక్షలు పెడతారు? ఎంతలా కష్టపడాల్సి వస్తుందనే విషయాల్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. హీరోతో సహా మిగతా పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయినా సరే చివరివరకు ఆపకుండా చూసేంత ఎంగేజింగ్‌గా మూవీని తెరకెక్కించారు.సింపుల్‌గా తేల్చేయొచ్చు అనుకునే పరిస్థితుల్లో ఊహించని విధంగా ఏలియన్ షిప్ దాడి చేసి.. కనిపించిన వాళ్లని కనిపించినట్లు చంపేస్తుంటే.. హీరో తను బయటపడటంతో పాటు మరో వ్యక్తిని ఎలా రక్షించాడు. చివరకు బతికి బట్టకట్టడంతో పాటు రేంజర్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ మూవీ చూసేయాల్సిందే.మిలటరీ కాన్సెప్ట్, యాక్షన్-సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అంటే ఆసక్తి ఉంటే మాత్రం దీనిపై లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రధాన పాత్ర చేసిన రిచ్‌సన్ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓటీటీలో ఏదైనా ఓ మంచి యాక్షన్ మూవీ చూద్దానుకుంటే మాత్రం ఇదో బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన) -
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ చిత్రం తాజాగా బాప్టా అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. గతేడాది సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ గతంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లోనూ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే వంటి కీలక విభాగాలలో నామినేట్ అయింది. View this post on Instagram A post shared by JioHotstar International (@jiohotstarinternational) -
బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం
ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఎరిక్ డేన్ (Eric Dane) అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. అయితే అరుదైన వ్యాధితో చనిపోవడానికి ముందు తన ఇద్దరు కుమార్తెలు (బిల్లీ, జార్జియా) కోసం రాసిన భావోద్వేగపూరితమైన సందేశం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందేశాన్ని విన్న తరువాత కన్నీళ్లు పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎరిక్ డేన్ తన జీవితంలోని ఒడిదుడుకులు, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసవ్వడం, డిప్రెషన్ వంటి సమస్యల నుండి కోలుకున్న తర్వాత ‘‘లెటర్స్ టు మై డాటర్స్" (Letters to My Daughters) అనే ప్రాజెక్ట్‌లో భాగంగా తీవ్రమైన భావోద్వేగంతో తన ఇద్దరు కుమార్తెలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, తమకు తాము నిజాయితీగా ఉండాలని కోరారు. తాను పరిపూర్ణమైన తండ్రిని కాకపోవచ్చు, కానీ నా తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నానన్నారు. తన పిల్లలు కూడా తప్పులు చేయడానికి భయపడ కూడదని హితవు పలికారు. తను ఎప్పుడూ వారికి అండగా ఉంటానని, వారి ఎదుగుదలలో తండ్రిగా గర్వపడతానని చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. లోకం ఏమనుకున్నా సరే, తమ స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని ఆయన వారికి సూచించారు.కన్నీళ్లు పెట్టించే ఎరిక్డేన్ ఏమోషనల్ మెసేజ్ ‘‘వర్తమానంలో జీవించండి.ఇప్పుడే, ఈ క్షణమే. మీ దగ్గర ఉన్నదల్లా ఈ వర్తమానమే. దానిని నిధిలా దాచుకోండి. ప్రతి క్షణాన్ని ప్రేమగా ఆస్వాదించండి. ప్రేమలో పడండి. అది కేవలం ఒక వ్యక్తితో కాకపోవచ్చు (అది కూడా మంచిదే అనుకోండి). కానీ ఏదో ఒక దానితో ప్రేమలో పడండి. మీ అభిరుచిని, మీ సంతోషాన్ని వెతుక్కోండి. మిమ్మల్ని ఉదయాన్నే నిద్రలేపేలా చేసే, రోజంతా ఉత్సాహంగా నడిపించే ఒక లక్ష్యాన్ని కనుగొనండి. అమ్మ, మీరు ఎన్నో ప్రదేశాలు చూశాం. ఎన్నో బీచ్‌ల్లో గంటల తరబడి సంతోషంగా గడిపాం. ఆ క్షణాలు ఎప్పటికీ నాతోనే.స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ మనస్తత్వానికి తగ్గ వ్యక్తులను వెతకండి, వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా ఉండండి. ఆపై వారికి అంకితమవ్వండి. ఎటువంటి తీర్పులు, షరతులు, ప్రశ్నలు ఉండని నిజమైన స్నేహితులు మీకు తిరిగి అంతే ప్రేమను ఇస్తారు. మీ స్నేహితుల్ని ప్రేమించండి.వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు..నవ్విస్తారు. సాయం చేస్తారు..మార్గనిర్దేశం చేస్తారు. కొంతమంది మిమ్మల్ని కాపాడతారు.మీలోని ప్రతి అణువుతో, ఆత్మగౌరవంతో పోరాడండి. మీకు అనారోగ్యం లేదా మరేదైనా సవాళ్లు ఎదురైనప్పుడు, పోరాడండి. ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీ చివరి శ్వాస వరకు పోరాడండి. ఈ వ్యాధి నా శరీరాన్ని నెమ్మదిగా హరిస్తోంది కావొచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయ లేదు.మీరు దేనినైనా ఎదుర్కోగలరని, మీ జీవితం ముగిసిపోవచ్చని, నరకాన్ని కూడా గౌరవంగా ఎదుర్కోగలరని నేను నిరూపించానని ఆశిస్తున్నాను. మై డియర్ బిల్లీ, జార్జియా, మీరే నా హృదయం, మీరే నా సర్వస్వం. తలెత్తుకుని పోరాడండి. శుభరాత్రి. ఐ లవ్ యూ’’ అంటూ ఇచ్చిన సందేశం ఆయన మరణం తరువాత విడుదలైంది. ఇది పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.“I hope I've demonstrated that you can face anything, you can face the end of your days, you can face hell with dignity. Fight, girls, and hold your heads high. Billie and Georgia, you are my heart, you are my everything. Goodnight. I love you.Eric Dane leaves his daughters —… pic.twitter.com/kHA4UjW4yK— Netflix (@netflix) February 20, 2026 మరోవైపు డేన్ స్నేహితులు , మద్దతుదారులు ALS తో పోరాడుతూ మరణించిన డేన్ భార్య రెబెక్కా, ఇద్దరు టీనేజ్ కుమార్తెలు, బిల్లీ, జార్జియా కోసం GoFundMe ప్రచారం ప్రారంభించారు. లాస్ ఏంజిల్స్‌లోని "ఫ్రెండ్స్ ఆఫ్ ది డేన్ ఫ్యామిలీ" ‘ఇన్ హానర్ ఆఫ్ ఎరిక్ డేన్’ అనే పేరుతో ఈ ప్రచారానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.1.07 కోట్లనిధులను సేకరించారు. మొత్తం 2.27 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా అమెరికన్ టీవీ సిరీస్ గ్రేస్ అనాటమీ (Grey's Anatomy) లో డాక్టర్ మార్క్ “McSteamy” స్లోన్ పాత్రతో విశేష గుర్తింపు పొందిన ఎరిక్ డేన్ 53 ఏళ్లకే (2026 ఫిబ్రవరి 19న) చనిపోవడంతో హాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనేది ప్రొగ్రెసివ్ న్యూరోడీజెనరేటివ్ వ్యాధి.ప్రస్తుతం దీనికి చికిత్స లేదు.తన మరణానికి ముందు, ఎరిక్ డేన్ తాను మరణించిన తర్వాతే ఈ విషయం ప్రపంచంతో పంచుకుంటాడనే అవగాహనతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ALS తో తన పోరాటం, వ్యసనంతో తన పోరాటాలు, రెబెక్కా గేహార్ట్తో ప్రేమతదితర విషయాలు పంచుకున్నాడు. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. -
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.నా కూతురే ఒక అద్భుతంహీరోయిన్ ప్రియాంక చోప్రా- సింగర్ నిక్ జోనస్ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్ జోనస్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి. కిలో కంటే తక్కువ బరువుభవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్‌లో డెలివరీ డేట్ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. ఫలించిన నిరీక్షణమూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్స్పిరేషన్.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్.చదవండి: చంద్రహాస్‌పై కేసు నమోదు -
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛాంపియన్, సర్వంమాయ, పతంగ్, అన్నగారు వస్తారు తదితర చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు 'ధురందర్' కూడా ఓటీటీలోకి రానుందనే టాక్ నడుస్తోంది. వీటికి తోడు హాలీవుడ్ క్రేజీ మూవీ 'అనకొండ' ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)1997లో తొలిసారి వెండితెరపై 'అనకొండ' సినిమా వచ్చింది. అప్పట్లో ఇలాంటి పాములతో మూవీస్ ఎవరూ తీయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనాలు విరగబడి చూశారు. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన హిట్‌గా నిలిచింది. దీని తర్వాత 2004లో ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్కిడ్, 2008లో ఆఫ్ స్ప్రింగ్, 2009లో ట్రయల్ ఆఫ్ బ్లడ్, 2015లో లేక్ ప్లాసిడ్ అని మరో నాలుగు మూవీస్ కూడా వచ్చాయి. కమర్షియల్‌గా హిట్ అయ్యాయి గానీ కంటెంట్ పరంగా ఓకే ఓకే అనిపించుకున్నాయి.దాదాపు పదేళ్ల విరామం తర్వాత గత నెలలో 'అనకొండ' పేరుతో లేటెస్ట్ మూవీ ఒకటి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇది ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో నెలయ్యేసరికి అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఎల్లుండి (జనరి 29) నుంచి మన దగ్గర కూడా తెలుగు, తమిళ డబ్బింగ్ రూపంలోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్) -
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ వారం కూడా అఖండ 2, అయలాన్, దే దే ప్యార్ దే 2, వెపన్స్, మాస్క్, ప్రీడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ హాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా సడన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు 'ట్రాన్' ఫ్రాంచైజీ గురించి తెలిసే ఉంటుంది. 1982లో మొదటగా 'ట్రాన్' మూవీ వచ్చింది. 2010లో 'ట్రాన్: లెగసీ' పేరుతో మరో సినిమా రిలీజైంది. గతేడాది అక్టోబరులో 'ట్రాన్: ఏరిస్' పేరుతో మూడోది ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో స్టోరీ పరంగా పెద్దగా మెరుపులేం లేనప్పటికీ విజువల్ వండర్ అనేలా సీన్స్ ఉంటాయి. మూడో పార్ట్.. గత నెలలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉచితంగానే చూడొచ్చు. ఈ సినిమాలో ఏఐ అనేది మంచిదా కాదా అనే అంశాన్ని చర్చించడం విశేషం.'ట్రాన్: ఏరిస్' విషయానికొస్తే.. ఎన్‌కామ్, డీలింగర్ అనే రెండు కంపెనీలు ఉంటాయి. వీళ్లు ఏఐ(కృత్రిమ మేధ) టెక్నాలజీ ఉపయోగించి ఒకరు ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. మరొకరు ఆర్మీ, సైనికులని తయారు చేయాలనుకుంటారు. అయితే ఏఐ ఉపయోగించి ఓ సైనికుడిని తయారు చేస్తారు. అతడే ఏరిస్. మంచి కోసం ప్రాణాలకు తెగించే సైనికుడు. ఇతడి నాశనమైపోయినా సరే మరోదాన్ని సృష్టించుకోవచ్చు. అయితే ఏరిస్కి మనిషిలా బతకాలనే కోరిక పుడుతుంది. ఎమోషన్స్ వస్తాయి. అలాంటి టైంలో ఓ దాని గురించి వెతుకుతుంటాడు. అలానే ఈ రెండు కంపెనీలకు ఓ ప్రోగ్రామ్, ఆల్గారిథమ్ కూడా కావాల్సి వస్తుంది. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. స్టోరీతో పనిలేదు విజువల్స్ బాగుంటే చాలానుకుంటే దీన్ని చూడొచ్చు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన 'అయలాన్' తెలుగు వెర్షన్) -
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట్రేంజర్ థింగ్స్' గురించే మాట్లాడుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలియని వాళ్లకు దీని గురించి వివరించాలంటే ఇదో ఫాంటసీ థ్రిల్లర్ అడ్వెంచరస్ సిరీస్. 2016లో మొదలై 2026లో ముగిసింది. న్యూఇయర్ సందర్భంగా చిట్టచివరి ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంటుంది? ఎందులో చూడొచ్చు? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్ స్కామ్‌పై వెబ్ సిరీస్.. విడుదలకు లైన్ క్లియర్)కథేంటి?అమెరికాలోని హాకిన్స్ అనే గ్రామం. మైకేల్, విలియమ్, లూకస్, డస్టిన్ అనే నలుగురు పిల్లలు. ఓ రోజు రాత్రి మైకేల్ అలియాస్ మైక్ ఇంట్లో అందరూ కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడతారు. పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్తారు. విలియమ్ అలియాస్ విల్ మాత్రం కనిపించకుండా పోతాడు. ఇంతకీ విల్ ఏమయ్యాడు? మరోవైపు ఫ్రెండ్ కోసం వెతుకుతుండగా.. మిగిలిన ముగ్గురు పిల్లలకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతమేంటి? విల్ని కనిపెట్టడంలో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలు చూడటం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. 2-3 గంటల్లో ఇవి ముగిసిపోతాయి. కాకపోతే కొన్నేళ్లుగా పెరిగిన ఓటీటీ కల్చర్ వల్ల పరభాషా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మనకు పరిచయమయ్యాయి. అలాంటి వాటిలోని ఓ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. తెలుగు ప్రేక్షకుల్లో దీన్ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఎందుకంటే 2016 నుంచి ఇది సీజన్ల వారీగా స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. లాక్డౌన్ టైంలో దీనికి మన దేశంలోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది.ఇదో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్. ఓ చిన్న గ్రామంలో నలుగురు పిల్లలకు ఓ సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయికి స్నేహం ఏర్పడితే తర్వాత ఏమైందనేదే స్టోరీ లైన్. కాకపోతే పిల్లాడు తప్పిపోవడంతో మొదలయ్యే ఈ సిరీస్.. తర్వాత అనుహ్యమైన మలుపులు, అద్భుతమైన సన్నివేశాలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మర్చిపోలేని పాత్రలు.. ఇలా ప్రతి దశలోనూ ఆశ్చర్యపరుస్తుంది. చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అర్థమయ్యాలా ఉండటం ఈ సిరీస్ స్పెషాలిటీ.పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌లో మొత్తంగా 42 ఎపిసోడ్స్ ఉంటాయి. తొలి మూడు సీజన్లలో ఒక్కో ఎపిసోడ్ సగటున 50 నిమిషాల పాటు ఉంటుంది. నాలుగో సీజన్లో మాత్రం ఎపిసోడ్ యావరేజ్ గంట 10 నిమిషాలు. రీసెంట్గా రిలీజైన ఐదో సీజన్లోనూ ఒక్కో ఎపిసోడ్ గంటకు పైనే నిడివితో ఉంటుంది. జనవరి 1న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఫినాలే ఎపిసోడ్ అయితే ఏకంగా 2 గంటలు ఉంది.మిగిలిన సిరీస్‌ల కంటే 'స్ట్రేంజర్ థింగ్స్' ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం స్టోరీ చెప్పిన విధానం. ఇందులో డార్క్ హారర్ ఎలిమెంట్స్, ఉలిక్కిపడేలా చేసే జంప్ స్కేర్ సీన్లకు కొదవలేదు. తొలి మూడు సీజన్లలో హారర్ అంశాలు ఓ రేంజులో ఉంటే నాలుగో సీజన్లో అంతకు మించి అనేలా ఉంటుంది. కేవలం విజువల్స్ అనే కాదు సౌండ్, పాత్రలు, నిర్మాణ విలువలు ఒకటేమిటి ఇలా సిరీస్‌లోని ప్రతి అంశం ఆశ్చర్యపరుస్తుంది. మరి ముఖ్యంగా విలన్ వెక్నా, మైండ్ ఫ్లయిర్ని చూస్తే భయమేస్తుంది.ఈ సిరీస్ అంతా కూడా 80ల్లో జరుగుతుంది. అందుకు తగ్గట్లే అప్పటి పరిస్థితులు, దుస్తులు, వస్తువులు.. ఇలా ప్రతి ఒక్క దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. ఈ సిరీస్ మొత్తం బడ్జెట్ రూ.5000-6000 కోట్ల పైనే ఉంటుంది! వ్యూస్ కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఉంది కానీ బూతులు ఎక్కువ. వీలైతే ఇంగ్లీష్ వెర్షన్లోనే చూడండి. ఈ సిరీస్‌ని మీరు ఒక్కసారి చూడటం మొదలుపెట్టారంటే అయిపోయేంతవరకు అస్సలు ఆపరు.గత నెలరోజుల్లో చిట్టచివరిదైన ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేశారు. తొలి నాలుగు సీజన్లు వావ్ అనేలా ఉంటాయి. చివరి దానిలో మాత్రం వావ్ ఫ్యాక్టర్స్ కంటే వీలైనంత ఎమోషనల్ కంటెంట్ ఉండేలా దర్శకద్వయం ఢప్పర్ బ్రదర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సిరీస్‌కి ఎలాంటి ముగింపు ఇస్తారా అని అందరూ ఎదురుచూశారు. కానీ చాలా సింపుల్‌గా తేల్చేయడం ఈ సిరీస్ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. ప్రస్తుతానికైతే భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎలెవన్ పాత్ర చనిపోయిందా? బతికుందా అనే విషయాన్ని ప్రేక్షకులకే వదిలేశారు.ఐదో సీజన్లలో ఈ సిరీస్‌ని ముగించారు. కానీ దీనికి 'స్పిన్ ఆఫ్' ఉంటుందని దర్శకద్వయం చెప్పుకొచ్చారు. దీని పేరు కూడా 'స్ట్రేంజర్ థింగ్స్' అనే పెడతామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన సిరీస్ 1980ల్లో హాకిన్స్ అనే ఊరిలో జరిగింది. స్పిన్ ఆఫ్‌లో భాగంగా ప్రస్తుత కాలంలో మరో ఊరిలో జరిగే కథతో కొత్త సిరీస్ తీయబోతున్నారు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'రంగస్థలం'లో ఆ పాట సుకుమార్‌కి నచ్చలేదు.. ఎవరూ ఏడవకపోవడంతో) -
'అవతార్ 3' విలన్ చార్లీ చాప్లిన్ మనవరాలా?
పదిరోజుల క్రితం థియేటర్లలో వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3'.. భారత్‌లో అంతంత మాత్రంగానే ఆడింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే స్టోరీపై విమర్శలు వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే ప్రశంసలు వచ్చినప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం ఏమంత గొప్పగా అయితే లేదు. సరే టాక్, కలెక్షన్స్ గురించి పక్కనబెడితే ఇందులో విలన్‌గా చేసిన నటి.. దిగ్గజ కమెడియన్ చార్లీ చాప్లిన్ మనవరాలు అనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.1950,60ల్లో మూకీ కామెడీతో చాలా గుర్తింపు తెచ్చుకున్న చార్లీ చాప్లిన్.. ఇప్పటి తరంలోనూ చాలామందికి తెలుసు. అయితే ఈయన తర్వాత కుటుంబ సభ్యులెవరైనా యాక్టర్స్ అయ్యారా? ఏదైనా సినిమాలు చేశారా? అనేది పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే 'అవతార్ 3'లో విలన్ వరంగ్ పాత్రలో చేసిన ఊనా చాప్లీన్.. ఆయనకు మనవరాలి అనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ వాయిదా)ఊనా చాన్నాళ్లుగా యాక్టింగ్ చేస్తోంది. 2007 నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో సహాయ పాత్రలు చేస్తోంది. కాకపోతే పెద్దగా ఫేమ్ లాంటిది దక్కలేదు. ఓటీటీల్లో క్లాసిక్ సిరీస్ అయిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లోనూ స్టార్క్ రాజు పెద్ద కొడుకు భార్యగా టలీషా స్టార్క్ పాత్రలో కొన్ని ఎపిసోడ్స్ కనిపిస్తుంది. చిన్న పాత్రనే అయినప్పటికీ గుర్తుండిపోయింది. దీనితో పాటు చాలా మూవీస్, సిరీస్‌లు చేసినప్పటికీ మళ్లీ ఇన్నాళ్లకు 'అవతార్ 3'లో విలన్ రోల్ వల్ల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.చార్లీ చాప్లిన్ కూతురు గెరాల్డైన్. ఈమె పుట్టింది ఊనా చాప్లిన్. తాత, అమ్మలానే యాక్టర్ అయింది. తాత కామెడీతో నవ్విస్తుంటే మనవరాలు మాత్రం విలనిజంతో భయపెడుతోంది.(ఇదీ చదవండి: ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by laura_sophie_cox (@laura_sophie_cox) -
'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2016 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్స్ వచ్చాయి. అవన్నీ కూడా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. గత నెలలో ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌లో నాలుగు ఎపిసోడ్స్, క్రిస్మస్ సందర్భంగా రెండో వాల్యూమ్‌లో మూడు ఎపిసోడ్స్ రిలీజయ్యాయి. సిరీస్ చిట్టచివరి ఎపిసోడ్.. జనవరి 1న రానుంది. దీని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)ఐదో సీజన్లో ఇప్పటివరకు వచ్చిన 7 ఎపిసోడ్స్ గమనిస్తే.. విలన్ వెక్నాతో ఎలెవన్ అండ్ టీమ్ పోరాడటానికి కావాల్సినదంతా సిద్ధం చేశారు. ఇప్పుడు రాబోయే ఫినాలే ఎపిసోడ్లో ఎమోషన్‌తో పాటు అదిరిపోయే యాక్షన్ ఉండనుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు ఉంటారు. వీళ్లకు ఓ సూపర్ పవర్స్ ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. వీళ్లంతా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఎలెవన్.. తనలాంటి అతీత శక్తులుండే కొందరితో పోరాడాల్సి వస్తుంది. ఇంతకీ వాళ్లెవరు? ఎలెవన్ గతమేంటి అనేదే సిరీస్ ప్లాట్ లైన్. ఫాంటసీ టచ్ ఉండే యాక్షన్, అడ్వెంచర్ స్టోరీలు ఇష్టముంటే ఈ సిరీస్ చూడండి. అస్సలు విడిచిపెట్టరు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకు సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్) -
జేమ్స్ కామెరూన్ అవతార్-3.. ఇండియాలో క్రేజీ రికార్డ్..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్. ఈ సిరీస్‌లో వచ్చిన పార్ట్-3 ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 19న ఇండియా వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.ఈ క్రమంలోనే అవతార్ -3.. హాలీవుడ్ మూవీ ఎఫ్1 ఇండియా ఆల్‌టైమ్ వసూళ్లను అధిగమించింది. దీంతో ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాల లిస్ట్‌లో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. అవతార్-3 ఇప్పటివరకు ఇండియావ్యాప్తంగా రూ. రూ. 131 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన బ్రాడ్ పిట్ మూవీ ఎఫ్1 రూ. 129 కోట్ల వసూళ్లను అధిగమించింది. ఇప్పటివరకు భారతదేశంలో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా అవతార్-3 నిలిచింది.అవతార్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ చిత్రానికి ఇండియాలో అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. తొలి రోజు కేవలం రూ. 23 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ బరిలో ఉండడం అవతార్-3కి కలిసి రాలేదని చెప్పాలి. కాగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 400 మిలియన్ డాలర్ల మార్క్‌కు దగ్గర్లో ఉంది. -
మరో ఓటీటీలోకి క్రేజీ హారర్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
హారర్ సినిమాలు తీయాలంటే హాలీవుడ్ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. చూస్తున్నప్పుడు భయపెడతాయి. ఈ ఏడాది అలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని భయపెట్టిన ఓ సినిమా ఓటీటీలో ఉచితంగా అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?)ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన హాలీవుడ్ మూవీ 'వెపన్స్'. రూ.335 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.2400 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. విడుదల తర్వాత కొన్ని వారాలకే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఎక్కువమంది చూడలేకపోయారు. ఇప్పుడు కొత్తగా హాట్స్టార్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 8 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?'వెపన్స్' విషయానికొస్తే.. మేబ్రూక్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి 2:17 గంటలకు 17 మంది చిన్నారులు వాళ్ల ఇంట్లో నుంచి బయటకెళ్లిపోతారు. ఎంత వెతికినా కనిపించరు. వీళ్లంతా ఒకే స్కూల్ ఒకే క్లాస్‌లో చదువుతుంటారు. ఇదే క్లాస్‌కి చెందిన ఓ పిల్లాడు మాత్రం బాగానే ఉంటాడు. దీంతో ఊరందరి అనుమానం క్లాస్ టీచర్ జస్టిన్(జూలియా గార్నర్)పై పడుతుంది. అసలు ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)At 2:17 a.m., seventeen children disappeared from their homes and never came back. Where did they go?#Weapons, streaming January 8 onwards on JioHotstar. pic.twitter.com/46m9ewEc06— JioHotstar (@JioHotstar) December 23, 2025 -
క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' తెలుగు ట్రైలర్ రిలీజ్
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.. తెలుగు ప్రేక్షకుల్లోనూ చాలామందికి తెలుసు. ద డార్క్ నైట్స్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్ లాంటి క్రేజీ టైమ్ ట్రావెల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాడు. ఇతడి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇప్పుడు రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్‌ది కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)సాధారణంగా నోలన్ తీసే సినిమాలన్నీ ఫిజిక్స్, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో ఉంటాయి. కానీ కెరీర్లో తొలిసారి వార్ మూవీ తీస్తున్నాడు. ట్రైలర్లో పెద్దగా స్టోరీ ఏం రివీల్ చేయలేదు గానీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉండబోతున్నాయని హింట్ అయితే ఇచ్చాడు. వచ్చే జూలై 17న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ కూడా తీసుకురాబోతున్నారు. విచిత్రం ఏంటంటే మూవీ విడుదలకు ఏడాది ముందే టికెట్ బుకింగ్స్ తెరిస్తే అవి నిమిషాల్లో సేల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?) -
థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్
-
అవతార్-3.. జేమ్స్ కామెరూన్ ఆ లాజిక్ ఎలా మిస్సయ్యాడు?
జేమ్స్ కామెరూన్ అవతార్‌కు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. 2009లో వచ్చిన మొదటి పార్ట్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత అవతార్-2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. చివరికీ 2022లో అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో రిలీజై ఆడియన్స్‌ను అలరించింది. ఈ రెండు చిత్రాలకు ఆదరణ దక్కడంతో జేమ్స్ కామెరూన్ మరో అడుగు ముందుకేసి అవతార్-3ని(అవతార్ ఫైర్ అండ్ యాష్ ) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.అయితే మరికొందరు మాత్రం అవతార్-3 అస్సలు బాగోలేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. పార్ట్-3 రోటీన్‌గా అనిపించిందని.. కొత్తదనం ఏం కనిపించలేదని పోస్టులు పెట్టారు. ఈ మూవీలో కొత్తగా రెండు రకాల జీవాలను పరిచయం చేసినప్పటికీ జేమ్స్‌కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త ట్రైబ్‌ను తీసుకొచ్చినా.. విజువల్స్ అదిరిపోయే రేంజ్లో ఉన్నా.. కథ మొత్తం తిరిగి జాక్, కల్నల్ మధ్యే వార్ సాగడం ఆడియన్స్‌కు బోరు కొట్టించింది. సినిమాలో మెయిన్ విలన్ అంటూ వరాంగ్ గురించి ఆసక్తిగా అనిపించినా మెప్పించలేకపోయింది. దీంతో అవతార్ ఫ్యాన్స్‌ను మరోసారి మెప్పించడంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అవతార్ పార్ట్ 2 అండ్ పార్ట్- 3 తేడా కేవలం అదొక్కటే కావడం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇందులో వరాంగ్ ట్రైబ్ ఒక్కటి అదనంగా చేర్చాడు జేమ్స్ కెమెరూన్. అంతా పాత కథే కావడంతో జేమ్స్ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేకాకుండా నిడివి కూడా మూడు గంటలకు ( 3 గంటల 17 నిమిషాలు) పైగా ఉండడం.. రోటీన్ కథ కావడం ఆడియన్స్‌కు చిరాకు తెప్పించింది. సినిమా రిలీజ్‌కు ముందు రాజమౌళి- మహేశ్ బాబు సెట్స్‌కు రావాలని ఉందని చెప్పడం జేమ్స్ కామెరూన్ సినిమాపై కాస్తా బజ్ క్రియేట్ అయినా.. ఆ ప్రచారం కూడా పెద్దగా కలిసి రాలేదు.ఇక్కడ జేమ్స్ కామెరూన్ కేవలం విజువల్స్ ఎఫెక్ట్స్‌పైనే ఆధారపడడం అవతార్-3ని దెబ్బతీసినట్లు తెలుస్తోంది. కథలో కొత్తదనం కూడా లేకపోవడం మరింత మైనస్‌గా మారింది. పార్ట్-1, పార్ట్-2 హిట్ అయ్యాయన్న ధీమాతో వచ్చిన జేమ్స్ కామెరూన్‌కు ఆడియన్స్ నాడీని పట్టుకోవడంలో ఫెయిల్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రోటీన్ కథను కేవలం విజువల్ ఎఫెక్ట్స్తోనే నడిపిస్తానంటే ఇప్పుడు కుదరదు. ఆడియన్స్ కూడా ఫుల్ అప్డేట్ అయి ఉన్నారు. కథలో కొత్తదనం లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడన్నదే అందరికీ అంతుచిక్కని ప్రశ్న. ఇకనైనా జేమ్స్ కామెరూన్ రియలైజ్ అయి.. అవతార్ సిరీస్‌కు స్వస్తి చెబితే బాగుంటుందని సగటు ప్రేక్షకుడి భావన. అవతార్-4 అంటూ మరో ప్రయోగం ఇక అదొ పెద్ద సాహసమనే చెప్పాలి. -
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
వెతకాలే గానీ ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలు చాలా కనిపిస్తాయి. అలాంటి ఓ మూవీ 'జోజో రాబిట్'. సాధారణంగా యుద్ధం బ్యాక్ డ్రాప్ అనగానే యాక్షన్ లేదంటే ఎమోషన్స్ చూపిస్తారు. దీనికి మాత్రం కామెడీ టచ్ ఇచ్చారు. ఓ పిల్లాడి కంట్లో నుంచి ప్రపంచ యుద్ధాన్ని చూస్తే ఎలా ఉంటుందనేదే ఈ మూవీ స్టోరీ. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఉంది? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.2019లో థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఆదరణ దక్కించుకున్న సినిమాల్లో ఇది ఒకటి. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో 2020లో ఆస్కార్ కూడా సొంతం చేసుకుంది. హిట్లర్, నాజీ సైన్యంపై తీసిన మూవీనే అయినప్పటికీ కాస్త వ్యంగం జోడించి తెరకెక్కించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇది హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.కథేంటి?అది రెండో ప్రపంచయుద్ధ సమయం. జర్మనీలోని ఓ ఊరిలో జోజో అనే పదేళ్ల పిల్లాడు ఉంటాడు. హిట్లర్ సైన్యంలో పిల్లల విభాగంలో ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇతడికి మాత్రమే కనిపించే 'ఊహజనిత హిట్లర్'.. అన్ని విషయాల్లోనూ గైడ్ చేస్తుంటాడు. అలాంటి జోజో జీవితంలో ఈ యుద్ధం ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. తల్లి రోజ్, ఇతడి ఇంట్లో రహస్యంగా ఉంటున్న యూదు అమ్మాయి ఎల్సా.. ఇతడి ప్రయాణంలో ఎలాంటి మలుపులకు కారణమయ్యారు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?చూడగానే ఇది పిల్లల సినిమాలా అనిపిస్తుంది గానీ రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, జర్మనీలోని నాజీ సైన్యం, యూదులు.. ఇలా పలు విషయాల్ని వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. వీళ్లు గురించి ఏం తెలియకపోయినా పర్లేదు. ఎందుకంటే వాటి కంటే జోజో అనే పదేళ్ల పిల్లాడు, అతడి ప్రపంచం మనకు నచ్చేస్తుంది. తోటి పిల్లలతో ఉండే కామెడీ, తల్లి, ఎల్సాతో ఉండే ఎమోషనల్ సీన్స్ మనం ఆ ప్రపంచంలోకి వెళ్లేలా చేస్తాయి.రెండు గంటల కూడా ఉండదు ఈ సినిమా. అయితేనేం డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. జోజోతో పాటు మనం కూడా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. జోజో తల్లి, తండ్రి.. యూదులకు మంచి జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటారు. జోజోకి మాత్రం హిట్లర్, అతడి సైన్యం అంటే చచ్చేంత ప్రేమ. అలాంటి ఈ పిల్లాడు.. ఇంట్లోనే రహస్యంగా ఉంటున్న ఎల్సాతో స్నేహం చేయడం, యూదుల గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అదే టైంలో ఆకట్టుకుంటాయి.కాకపోతే రెగ్యులర్ ఉండే డ్రామా కంటే ఇందులో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి సగటు ప్రేక్షకుడి ఇది నచ్చకపోవచ్చు. లేదు ఏదైనా డిఫరెంట్‌గా టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఈ మూవీ ట్రై చేయొచ్చు. మరీ ముఖ్యంగా జోజో పాత్రలో నటించిన రోమన్‌తో ప్రేమలో పడిపోతాం. ఇతడి తల్లిని హిట్లర్ ఆర్మీ చంపి, ఊరి మధ్యలో వేలాడాదీసే సీన్ అయితే మనల్ని కూడా కంటతడి పెట్టిస్తుంది.- చందు డొంకాన -
ఎంత పనైంది..? అవతార్ 3కి బిగ్ షాక్..
-
'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ
'అవతార్' సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే మాట గ్రాఫిక్స్(వీఎఫ్ఎక్స్). నీలం రంగు మనుషులు, వాళ్లు ఉండే ప్రదేశం, వింత వింత ఆకారాలు.. ఇలా ఒకటేమిటి మూవీలోని ప్రతిదీ కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనదే. వీటన్నింటిని వందలాది మంది ఏళ్లకు ఏళ్లు కష్టపడి సృష్టించారు. అయితే పండోరా ప్రపంచాన్ని సృష్టించడంలో, వీఎఫ్ఎక్స్ విభాగాన్ని దగ్గరుండి నడిపించడంలో ఓ భారతీయ మహిళ కీలక పాత్ర పోషించిందని మీలో ఎంతమందికి తెలుసు?ప్రపంచంలో ఏ రంగంలో చూసినా భారతీయుల ఆధిపత్యం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళ్తున్నారు. తాజాగా బయటపడిన ఓ సంగతి.. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రపంచ సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల్లో 'అవతార్' ఒకటి. ఇప్పటికే రెండు భాగాలు రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం మూడో పార్ట్ థియేటర్లలోకి రానుంది.జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తీసిన ఈ అద్భుతమైన సినిమాల్లో వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్‌లో ఏ మాత్రం వంకపెట్టడానికి వీల్లేని విధంగా ఉంటాయని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వెటా ఎఫ్ఎక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. ఇందులో పావనీ రావు బొడ్డపాటి అనే భారతీయ మహిళ.. వీఎఫ్ఎక్స్ టీమ్‌ని లీడ్ చేస్తోంది. తాజాగా ఈమె.. తన గురించి, ఈ మూవీస్ కోసం తాము ఎంతలా కష్టపడ్డామనే విషయాన్ని చెప్పుకొచ్చింది.ఢిల్లీలో పుట్టి పావని రావు.. తల్లిదండ్రులు, నానమ్మ-తాతయ్యతో కలిసి పెరిగింది. తన నానమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ అని, కనిపించిన ప్రతి పేపర్‌పైన ఏదో ఒక బొమ్మ వేస్తూనే ఉండేవారని.. ఆమె ద్వారా ఇటువైపు ఆసక్తి పెరిగిందని.. అలా తొలిసారి 2009లో 'అవతార్' కోసం లైటింగ్ టీడీగా పనిచేశానని.. అప్పటినుంచి పండోరా ప్రపంచంలో ఓ భాగమైపోయానని ఈమె చెప్పింది.పావని రావు విషయానికొస్తే.. ఢిల్లీలో పెరిగిన ఈమె.. ఇక్కడే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్లో బీఆర్క్ పట్టా పొందింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్ఏ, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో భర్తతో కలిసి నివసిస్తోంది. 2009లో తొలిసారి 'అవతార్' కోసం పనిచేసిన ఈమె.. ఇప్పుడు రాబోతున్న మూడో భాగానికి కూడా పనిచేసింది.తొలి భాగంలో ఈమె పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ.. 2022లో రిలీజైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కోసం దాదాపు 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్, అవి కూడా ఎక్కువ భాగం నీటి అడుగున ఉన్నవి పావన్ టీమ్ సృష్టించారు. ఇప్పుడు అవతార్ 3( 'ఫైర్ అండ్ యాష్') కోసం అగ్ని, బూడిద తదితర వీఎఫ్ఎక్స్ షాట్స్ రూపొందించారు. మరి ఇవి ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా 'అవతార్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో వీఎఫ్ఎక్స్ లాంటి కీలకమైన విభాగాన్ని భారతీయ మహిళ దగ్గరుండి నడిపించడం అంటే చాలా విశేషం. -
ప్రపంచంలో అందమైన టాప్ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. కానీ అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోయినా ఛాన్స్ రావడం కష్టమే. సినిమా అనే రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా ఈ ఏడాది అత్యంత అందమైన తారల గురించి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే టాప్ టెన్ అందమైన హీరోయిన్ల లిస్ట్‌లో ఇండియా నుంచి కేవలం ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. ఆమె మరెవరో కాదు.. ఆదిపురుష్ భామ కృతి సనన్ మాత్రమే టాప్-5లో నిలిచింది. ఈ ఏడాదితో గానూ ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్ట్‌లో కృతి సనన్ ఐదో స్థానం దక్కించుకుంది.మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు. టాప్-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్ నిలిచారు.Top 10 Most Beautiful Actresses in the World 2025/261. 🇦🇺 Margot Robbie2. 🇺🇸 Shailene Woodley3. 🇨🇳 Dilraba Dilmurat4. 🇰🇷 Nancy McDonie5. 🇮🇳 Kriti Sanon6. 🇵🇰 Hania Aamir7. 🇨🇺/🇪🇸 Ana de Armas8. 🇬🇧 Emma Watson9. 🇺🇸 Amber Heard10. 🇹🇷 Hande Erçel(Source: IMDb List - Top… pic.twitter.com/DlW1Hj9Pzy— Infodex (@infodexx) December 15, 2025 -
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసింది. గత నెలలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్. ఇంతకీ ఏంటీ సినిమా? ప్రస్తుతం ఎందులో చూడొచ్చు?2022లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై యాక్షన్ మూవీ లవర్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా 'శిశు'. కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉండే ఈ మాస్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీనికి కొనసాగింపుగా గత నెల 21న 'శిశు: రోడ్ టు రివెంజ్' చిత్రం రిలీజైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి విదేశాల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ మన దేశంలోనూ ఓటీటీలో రిలీజయ్యే అవకాశముంది. ఈ సినిమా కూడా గంటన్నర నిడివితోనే తెరకెక్కించారు. మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఓన్లీ యాక్షనే ఉంటుంది.'శిశు: రోడ్ టు రివెంజ్' విషయానికొస్తే.. రెండో ప్రపంచ యుద్ధంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న అటామి కోర్పి(జోర్మా).. తన ఫ్యామిలీ కోసం గుర్తుగా నిర్మించిన ఇంటి చెక్క మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు. ఇది తెలుసుకున్న రెడ్ ఆర్మీ చీఫ్ ఇగోర్ (స్టీఫెన్ లాంగ్) అటామిని చంపేందుకు ఆర్మీతో సహా చిన్నపాటి యుద్ధం ప్రకటిస్తాడు. ఈ భీకర పోరాటంలో అటామి ఎలా గెలిచి, ఇల్లు కట్టుకోవాలనే తన కల నెరవేర్చుకున్నాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ) -
'స్ట్రేంజర్ థింగ్స్ 5' వాల్యూమ్ 2 ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్‌ల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. 2016 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. గత నెలలోనే ఐదో సీజన్ తొలి వాల్యూమ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో భాగంగా నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అద్భుతమైన రెస్పాన్ అందుకుంది. ఇప్పుడు రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: హిందీ మార్కెట్లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్)అమెరికాలోని హాకిన్స్ అనే ఓ పల్లెటూరిలో నలుగురు ఫ్రెండ్స్(అబ్బాయిలు) ఉంటారు. ఓ రోజు రాత్రి వీళ్లకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? వీళ్ల ఐదుగురితో పాటు మరికొందరు కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తి నుంచి తమ ఊరిని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. అయితే ఎలెవన్ అనే అమ్మాయికి ఇప్పటివరకు పవర్స్ ఉండగా.. నలుగురు పిల్లల్లోని విల్ అనే అబ్బాయికి కూడా పవర్స్ వచ్చినట్లు చూపించి ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌ని ముగించారు. రెండో వాల్యూమ్‌లో ఎలెవన్, విల్, నం.8 కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తులున్న విలన్ని ఎలా ఎదిరిస్తాయనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?
ఈ శుక్రవారం(డిసెంబరు 19).. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈసారీ విజువల్స్, స్టోరీ గ్రాండియర్ అదే రేంజులో ఉండబోతున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. కానీ మన దగ్గర ఈ మూవీ వస్తుందనే విషయం కూడా చాలామందికి తెలీదు. హైప్ అంత తక్కువగా ఉంది మరి! అసలు దీనికి ఏంటి కారణం? మూడో భాగంలో స్టోరీ ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)1997లో 'టైటానిక్' లాంటి బ్లాక్ బస్టర్, ఆస్కార్ విన్నింగ్ సినిమా తీసిన తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరున్ దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఓ విజువల్ వండర్ సృష్టించాడు. అదే 'అవతార్'. 2009లో ఇది రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.18-19 వేల కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత ఇది ఫ్రాంచైజీలా వస్తుందని కామెరూన్ ప్రకటించాడు. కాకపోతే రెండో భాగం రావడానికి చాలా ఆలస్యమైంది. 2022 డిసెంబరులో 'అవతార్ 2' విడుదలైంది. తొలి భాగంతో పోలిస్తే దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. వసూళ్లు మాత్రం కళ్లు చెదిరేలా వచ్చాయి.ఈ వారం మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలతో పోలిస్తే దీనిపై అనుకున్నంత బజ్ లేదు. తొలి పార్ట్ రిలీజైనప్పుడు విజువల్స్, పండోరా ప్రపంచం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో పార్ట్ వచ్చేసరికి చూసిన కంటెంట్‌లానే ఉంది కదా అనిపించింది. దీంతో రెండో భాగానికి మన దేశంలో రూ.450-480 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు రాబోయే మూడు పార్ట్ ట్రైలర్ కూడా విజువల్‌గా బాగున్నప్పటికీ స్టోరీ.. తొలి రెండు భాగాల్లో చూపించిందే ఉండబోతుందా అని సందేహం కలిగేలా చేస్తోంది. హైదరాబాద్ లాంటి చోట్ల బుకింగ్స్ ఇంకా పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. బహుశా రిలీజైన తర్వాత అదిరిపోయిందనే టాక్ వస్తే జనాలు దీనిపై ఆసక్తి చూపిస్తారేమో?(ఇదీ చదవండి: 'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!)అవతార్ విషయానికొస్తే.. ప్రకృతినే ప్రాణమని భావించే 'నావి' జాతి వాళ్లకు, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్లే మానుషులకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా థీమ్. ఇందులో యాక్షన్‌ని మించిన లవ్‌స్టోరీ దాగుంది. ఆ ప్రేమకథ ఎన్నో హృదయాలని హత్తుకుంది. అలానే పంచభూతాలైన భూమి గురించి తొలి పార్ట్‌లో చూపించారు. నీటి గురించి రెండో భాగంలో, ఇప్పుడు అగ్ని గురించి మూడో భాగంలో చూపించబోతున్నారు.'అవతార్' 22వ శతాబ్దంలో పండోరా అనే గ్రహంపై జరుగుతుంది. ఇక్కడ మానవులు 'అన్బ్టేనియం' అనే విలువైన ఖనిజం కోసం వచ్చి, స్థానిక 'నావి' తెగపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. వికలాంగుడైన మాజీ మెరైన్ జేక్ సుల్లీ.. నావి తెగలో ఒకడిగా మారేందుకు తన 'అవతార్' శరీరం ద్వారా వారి సంస్కృతిని అర్థం చేసుకుని, వారి ప్రేమలో పడి, చివరికి నావి పక్షాన నిలబడి మానవులతో పోరాడి గెలుస్తాడు. పండోరని రక్షించుకుంటాడు. ఇదే పార్ట్-1 స్టోరీ.(ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?)అవతార్ 2 (ది వే ఆఫ్ వాటర్) కథ.. మొదటి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మొదలవుతుంది. దశాబ్దం గడిచిపోతుంది. జేక్ సుల్లీ, నెయితిరి తమ ఐదుగురు పిల్లలతో కలిసి పండోరాలో కొత్త జీవితం ప్రారంభిస్తారు. తర్వాత మనుషుల దాడుల నుంచి తమ కుటుంబాన్ని, తమ జాతిని కాపాడుకోవడానికి, సురక్షితంగా ఉండటంలో భాగంగా మరో చోటకు వెళ్లిపోతారు. నీటిలో నివసించే మెట్కైయినా తెగతో కలిసి మనుగడ సాగిస్తారు. కానీ మనుషులు తిరిగి రావడంతో మళ్లీ పోరాడతారు. పాత శత్రువు కల్నల్ క్వారిచ్తోనూ మరోసారి తలపడతారు.అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) కథ.. రెండో భాగంగా ముగిసిన చోటనే మొదలవుతుంది. ఈసారి కల్నల్ క్వారిచ్.. నావి తెగలోని మనుషుల్లా మారిపోతాడు. ఇదే జాతికి చెందిన ఓ మహిళతో కలిసి జేక్, అతడి బృందంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఏమైంది? జేక్, అతడి కుటుంబం ఈసారి ఎలా తప్పించుకుంది? ఇందులో యాష్ తెగ పాత్ర ఏంటనేది మూడో భాగం స్టోరీ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: బతికున్నప్పుడే అన్నయ్య తన విగ్రహం గురించి చెప్పారు: ఎస్పీ శైలజ) -
స్టార్ దర్శకుడు, భార్య అనుమానాస్పద మృతి!
హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి మిచెల్ దారుణ హత్యకు గురయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని తమ నివాసంలో వారిద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. రక్తపుమడుగులో ఉన్న వారిద్దరిని చూసి అభిమానులు చలించిపోయారు. శరీరాలపై అనేక కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడింది వారి కుమారుడు నిక్ రైడర్ అని అమెరికా వార్తా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగించే వాడినని నిక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి దర్శకత్వంలో నిక్ ఒక సినిమాలో కూడా నటించి ప్రశంసలు పొందాడు. అయితే, తన తల్లిదండ్రులనే హత్య చేశాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అతని నుంచి ఎలాంటి రెస్సాన్స్ రాలేదు. రాబ్ రైనర్ గత ఐదు దశాబ్దాలకు పైగా హాలీవుడ్లో ఉన్నారు. ఆయన నటనకు రెండు ఎమ్మీ అవార్డులు కూడా లభించాయి. వెన్ హ్యారీ మెట్ సాలీ , స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, తదితర సినిమాలకు దర్శకత్వం వహించి పేరు తెచ్చుకున్నారు. -
2025లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాలు (ఫొటోలు)
-
‘జింగిల్ బెల్ హీస్ట్’ మూవీ రివ్యూ.. సూపర్ రాబరీ!
దొంగతనాల కథాంశం సినిమాలలో మహా గమ్మత్తుగా, థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఏ తరం ప్రేక్షకులనైనా ఇట్టే మెప్పిస్తాయి. దొంగతనానికి సమయం, సందర్భంతో పాటు చక్కటి ప్రణాళిక కూడా చాలా ముఖ్యం. అదే నేపథ్యంలో హాలివుడ్ దర్శకుడు ఓ కొత్త చిత్రాన్ని వినూత్న రీతిలో తెరకెక్కించాడు. దాని పేరే జింగిల్ బెల్ హీస్ట్(Jingle Bell Heist Movie). పేరుకు తగ్గట్టు క్రిస్మస్ పండుగ నేపధ్యంలోనే జరిగే ఓ దొంగతనం పై ఈ సినిమా ఉంటుంది. దొంగతనంతో పాటు ఈ సినిమాలో సెంటిమెంట్, కామెడీ ఎలిమెంట్స్ తో మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందీ సినిమా. ఈ సినిమా కథ విషయానికొస్తే ఓ పెద్ద మాల్ లో పని చేసే సోఫీ తన కోసం, తన తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఓ సమయంలో తన స్టోర్ లోనే కాస్తంత పెద్ద సొమ్మును కాజేస్తుంది. ఇది అక్కడి సీసీటీవిలో రికార్డ్ అవుతుంది. అయితే ఆ సీసీ టీవి ని ఎక్కడ నుండో హాక్ చేసిన నిక్ సోఫీ చేసిన పనికి వీస్తుపోతాడు. అదే అదనుగా నిక్ సో ఫీకి తన వీడియో చూపించి తాను చేయబోయే ఓ పెద్ద దొంగతనంలో సహాయ పడమని బెదిరిస్తాడు. ఇక వేరే దారి లేక సోఫీ నిక్ తో కలుస్తుంది. నిక్ సోఫీ పని చేసే స్టోర్ ఓనర్ లాకర్ ని దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ స్టోర్ ఓనర్ దగ్గర చాలా పెద్ద డబ్బు ఓ సేఫ్ లో ఉంటుంది. ఆ సేఫ్ సూపర్ సెక్యూర్ గా ఉంటుంది. అయితే నిక్, సోఫీ క్రిస్మస్ పండుగ రోజు దొంగతనం చేయాలనుకుంటారు. నిక్ స్టోర్ ఓనర్ సేఫ్ సెక్యురిటీని హాక్ చేసి పాస్ వర్డ్ తెలుసుకోవాలని స్టోర్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్ ని ట్రాప్ చేస్తాడు. మరి ఆ ట్రాప్ లో ఇరుక్కుని స్టోర్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్ పాస్ వర్డ్ లీక్ చేస్తుందా...సోఫీ నిక్ ఈ దొంగతనాన్ని చేయగలుగుతారా లేదా అన్నది మాత్రం నెట్ ఫ్రిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న జింగిల్ బెల్ హీస్ట్ మూవీలోనే చూడాలి. ఓ రొటీన్ పాయింట్ ని చాలా విభిన్నంగా చూపించాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఈ సినిమా మాతృక ఇంగ్లీషు అయినా తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. వీకెండ్ కి వాచ్ బుల్ మూవీ ఎంజాయ్.– హరికృష్ణ ఇంటూరు -
నెట్‌ఫ్లిక్స్ బిగ్ డీల్.. వార్నర్ బ్రదర్స్ కోసం బిడ్!
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బిగ్ డీల్ ఖరారు కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ఒప్పందం కోసం బిడ్ వేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌కు చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 72 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)గా ఉంది.ఈ లెక్కన ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేరుకు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) బిడ్ వేసినట్లు తెలిసింది. సీఎన్ఎన్, టీబీఎస్, టీఎన్టీ వంటి కేబుల్ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను వార్నర్ బ్రదర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. హాలివుడ్లో అత్యంత విలువైన కెంపెనీగా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి బిగ్ డీల్ చేపట్టడం ఇదే తొలిసారి.ఈ బిగ్ డీల్ కొనుగోలుతో హెచ్‌బీఓ నెట్వర్క్ నెట్‌ఫ్లిక్స్ సొంతం కానుంది. అలాగే ది సొప్రానోస్, ‘ది వైట్ లోటస్ వంటి హిట్ షోల లైబ్రరీలతో పాటు హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి సినిమా, టీవీ ఆర్కైవ్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్లనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అసాధారణమైన వినోదాన్ని అందిస్తామమని తెలిపింది. Today, Netflix announced our acquisition of Warner Bros. Together, we’ll define the next century of storytelling, creating an extraordinary entertainment offering for audiences everywhere. https://t.co/rXPFMNIs1A pic.twitter.com/0pdsMUEob8— Netflix (@netflix) December 5, 2025 -
అప్పటినుంచే 'అవతార్ 3' అడ్వాన్స్ బుకింగ్స్
యానిమేషన్ కథా చిత్రాలకు ప్రపంచస్థాయిలో స్ఫూర్తిదాయకుడు జేమ్స్ కామెరూన్. ఆయన 2009లో తెరకెక్కించిన అవతార్ చిత్రం ఒక అద్భుతం. ఈ మూవీ ప్రపంచ సినీ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తరువాత దానికి సిక్వెల్‌గా రూపొందిన అవతార్. ది వే ఆఫ్ వాటర్ చిత్రం 2022లో విడుదలై ప్రేక్షకులకు కనువిందు చేసింది. అప్పుడే దర్శకుడు జేమ్స్ కామెరూన్ దీనికి ఫ్రాంచైజీ ఉందన్నారు. దీంతో ప్రేక్షకులు ఈ సారి ఎలాంటి వండర్ సృష్టిసారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడే రోజు వచ్చేసింది. అవతార్ మూడో పార్ట్‌గా అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19వ తేదీన తెలుగు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. దీన్ని 20 సెంచరీ స్టూడియో సంస్థ విడుదల చేస్తోంది.ఈ మూవీ గత రెండు చిత్రాల కంటే మరింత బ్రహ్మాండంగా తెరకెక్కించినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఈసారి ఈ చిత్రం ప్రేక్షకులకు ఐమాక్స్ థియేటర్లో అనుభూతిని కలిగించబోతోంది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్లు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రానికి డిసెంబర్ 5నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్.. వేదికలు ఇవే..!
హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్‌కు వేదికగా నిలవనుంది. ప్రతిష్టాత్మక యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ భాగ్యనగరంలో జరగనుంది. ఈ ఏడాది 30వ ఎడిషన్‌లో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్, సారథి స్టూడియోస్‌లో చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ జెల్లే డే జోంగ్ తెరకెక్కించిన మేమెరీ లేన్ అనే మూవీతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.హైదరాబాద్ వేదికగా ఈ నెల 5 నుంచి 14వరకు జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో యూరప్ దేశాల్లో తెరకెక్కించిన పలు చిత్రాలను ప్రదర్శించనున్నారు. బెల్జియం మూవీ జూలీ క్వీప్ క్వైట్.. ఆస్ట్రియా చిత్రం హ్యాపీలో లాంటి సినిమాలు తెరపై ఆవిష్కరించనున్నారు. అలాగే పలు దేశాలకు సంబంధించిన సూపర్ హిట్ చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారని యూరోపియన్ యూనియన్ రాయబారి హార్వే డెల్ఫిన్ వెల్లడించారు. ఈయూఎఫ్ఎఫ్-2025లో దాదాపు 23 దేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ప్రేక్షకులను ముందుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ నిరాశపరిచింది. భారీ హైప్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి రాహుల్ సాంకృత్యాన్‌తో జతకట్టారు. టాక్సీవాలా కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వీడీ14 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే వీడీ14 మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ వీడీ14లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్‌లో వినోద్ సాగర్‌తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో ది మమ్మీ స్టార్ రోల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఈ స్టోరీ 1854 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో వోస్లూ ఆంగ్ల అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆర్నాల్డ్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆర్నాల్డ్ పాత్ర ఏంటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా.. గతంలో లైగర్ మూవీలో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్రలో ఆర్నాల్డ్ కనిపించారు. ఈ మూవీతో రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్ కనిపించనున్నారు. -
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంకొందరు మాత్రం వెబ్ సిరీస్‌లు చూస్తుంటారు. తెలుగులో తక్కువే గానీ ఇంగ్లీష్ భాషలో మాత్రం లెక్కలేనన్ని సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు నచ్చిన వాటిలో నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పుడు దీని నుంచి చివరి సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. కానీ దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాడు. తొలి పార్ట్ ఈ వారంలోనే రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2016లో తొలి సీజన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. 2017లో రెండో సీజన్, 2019లో మూడో సీజన్, 2022లో నాలుగో సీజన్ వచ్చాయి. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చివరిదైన ఐదో సీజన్ రాకకు రంగం సిద్ధమైంది. ఒకేసారి కాకుండా మూడు భాగాలు రిలీజ్ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం తొలి పార్ట్ ఈ గురువారం(నవంబరు 27) ఉదయం స్ట్రీమింగ్ కానుంది. దాని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అనే ఆత్రుత పెంచుతోంది.గత సీజన్లలన్నీ తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఐదో సీజన్ కూడా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లోనూ స్ట్రీమింగ్ కానుంది. నాలుగు ఎపిసోడ్ల తొలి పార్ట్ నవంబరు 27న, మూడు ఎపిసోడ్ల రెండో పార్ట్ డిసెంబరు 25న, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండే చివరి పార్ట్ జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది. హారర్ కామెడీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు, వీళ్లకు తోడు మరికొందరు.. వీళ్లంతా కలిసి హంగామానే ఈ సిరీస్. కామెడీకి కామెడీ ఉంటూనే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఈ సిరీస్‌లో ఉంది.(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ) -
మైఖేల్ డేట్ ఫిక్స్
పాప్ మ్యూజిక్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న హాలీవుడ్ చిత్రం ‘మైఖేల్’. ఈ బయోపిక్‌లో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జాఫర్‌కి ఇది తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం.నియా లాంగ్, లారా హారికర్, జూలియానో క్రూ వాల్డి, కోల్మన్ డొమింగో ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామాని ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్‌క్లైన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. -
రూ. 7వేల కోట్ల సినిమా.. ఓటీటీలో ఉచితంగానే స్ట్రీమింగ్
హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ (Jurassic World Rebirth) మరో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 7500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో కూడా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టి సత్తా చాటింది. అయితే, గత చిత్రాల ప్రభావం వల్లే ఈ కలెక్షన్స్ వచ్చాయని, రీబర్త్ పేరుతో వచ్చిన ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు.జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ మూవీ చూడాలంటే అదనంగా రూ. 399 చెల్లించాలని మొదట ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత దానిని రూ. 119కి తగ్గించారు. ఈ క్రమంలోనే తాజాగా జియోహాట్‌స్టార్ (JioHotstar)సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రాన్ని ఉచితంగానే చూడొచ్చని తెలిపింది. నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని జియోహాట్‌స్టార్ ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలను కూడా ‘జురాసిక్ పార్క్’ చిత్రాలు ఆకట్టుకున్నాయి. 2022లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’కు సీక్వెల్‌గా ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ (Jurassic World Rebirth) పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. విజువల్స్‌తో పాటు కొన్ని థ్రిల్లింగ్‌కు గురిచేసే సీన్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదు. కథ మొత్తం సాగదీతగానే ఉంటుంది. -
తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు
ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన దగ్గర కూడా బాగానే ఫేమస్. సూపర్ హీరో అడ్వెంచరస్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే నాలుగు సీజన్లు వచ్చాయి. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ నెలలో చివరిదైన ఐదో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇంతలోనే ఇందులో లీడ్ రోల్ చేసిన నటి.. సహనటుడిగా చేసిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.ఈ సిరీస్‌లో మిల్లీ బాబీ బ్రౌన్, ఎలెవన్ అనే పాత్ర చేయగా.. డేవిడ్ హార్బర్, జిమ్ హాపర్ అనే పోలీస్ రోల్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించారు. కానీ నిజజీవితంలో మాత్రం మిల్లీని డేవిడ్ వేధించడంతో పాటు ఏడిపించాడట కూడా. ఇదంతా కూడా ఐదో సీజన్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జరిగిందని మిల్లీ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయమై నెట్‌ఫ్లిక్స్ సంస్థ దర్యాప్తు చేస్తోంది.(ఇదీ చదవండి: అప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. ఇప్పుడు డీజే)షూటింగ్ టైంలో ఈ వేధింపులు జరగడంతో చాన్నాళ్ల క్రితమే మిల్లీ, డేవిడ్‌పై ఫిర్యాదు చేసిందని.. తర్వాత నెలల పాటు విచారణ సాగుతూనే ఉందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సిరీస్ చివరి సీజన్ రిలీజ్ మరికొద్ది రోజులు ఉందనగా ఇదంతా బయటకు రావడం నటి అభిమానులకు షాకింగ్ అనిపించింది.చివరిదైన ఐదో సీజన్ విషయానికొస్తే.. రీసెంట్‌గానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31న ఫైనల్ సీజన్‌కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ విడతలవారీగా రాబోతున్నాయి.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ) -
ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చూసే ఆడియెన్స్ కూడా ఉంటారు. వాళ్లలో చాలామందికి నచ్చే సిరీస్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. తొలుత రిలీజ్ చేసినప్పుడు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉండేది. కానీ తర్వాత కాలంలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ చివరి సీజన్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తేదీలని ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)ఇప్పటికే నాలుగు సీజన్లు రాగా వేటికవే అదరగొట్టేశాయి. 2022లో చివరగా నాలుగో సీజన్ రిలీజైంది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా ఈ సిరీస్ ఫ్యాన్ బాగానే ఎదురుచూస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కి తెరదించుతూ కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ తేదీల్ని అధికారికంగా ప్రకటించారు. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31వ తేదీల్లో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో విల్, మైక్, డస్టిన్, లూకస్ అనే నలుగురు పిల్లలు ఉంటారు. అనుకోకుండా ఓ రోజు ఎలెవన్ అనే అమ్మాయి.. ఈ నలుగురి కంట పడుతుంది. కొన్నిరోజులకే వీళ్లంతా స్నేహితులు అయిపోతారు. అయితే తమతో ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి సూపర్ పవర్స్ ఉన్నాయనీ ఈ పిల్లలకు తెలుస్తుంది. వీళ్లంతా కలిసి తమ ఊరికి ఎదురైన ప్రమాదాల్ని ఎలా ఆపగలిగారు? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై షాకింగ్ రూమర్స్) -
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఇండియాలోనూ రిలీజ్
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. డాన్ ట్రాచెన్‌బర్గ్ (Dan Trachtenberg) దర్శకత్వం వహించిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ (Predator: Badlands) ఇండియాలో రిలీజ్‌కు సిద్ధమైంది. హాలీవుడ్లో సత్తాచాటిన ఈ సినిమా నవంబర్ 7న మన థియేటర్లలో సందడి చేయనుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది.దర్శకుడు ట్రాచెన్‌బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్‌ను మునుపెన్నడూ లేని విధంగా తెరకెక్కించారు. కేవలం సర్వైవల్ గేమ్‌కు పరిమితం కాకుండా.. ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యాట్జుజా కల్చర్, కోడ్ ఆఫ్ హానర్ లాంటి లోతైన కథాంశాలను డీల్ చేయడం ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తోంది. అంతేకాకుండా డిమిట్రియస్ షస్టర్-కొలోమాటాంగీ, ఎల్లె ఫ్యానింగ్ జోడీ కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఏలియన్ హంట్ ఉద్రిక్తత మధ్యలో కూడా వారి మధ్య కనిపించే మానవత్వం, ఫ్రెండ్షిప్, హ్యూమర్ సినిమాకు సరికొత్త ఫీల్ తెచ్చేలా కనిపిస్తోంది. డాన్ ట్రాచెన్‌బర్గ్ సృష్టించిన ఈ ఎమోషనల్ అడ్వెంచర్ హంట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే నవంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే. -
ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్లో మార్వెల్, డీసీ యూనివర్స్లే గుర్తొస్తాయి. కొన్నేళ్ల ముందు వరకు వీటి నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిత్రాలైతే వస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా ఈ ఏడాది జూలైలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరోల మూవీ 'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్'. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయింది.జూలై 25న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎందుకనో పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. కొన్నిరోజుల ముందు రెంట్ విధానంలో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఉచితంగానే నవంబర్ 5 నుంచి హాట్స్టార్లోకి రాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఒకవేళ సూపర్ హీరో జానర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్' విషయానికొస్తే.. రీడ్ రిచర్డ్ (పెడ్రో పాస్కల్), స్యూ స్ట్రామ్ (వన్నెసా), జానీ స్ట్రామ్ (జోసెఫ్ క్విన్), బెన్ (మోస్ బాక్రాక్).. ఓ జట్టుగా ఉండే వీళ్లు ఆస్ట్రోనాట్స్. అందరూ వీళ్లని ఫెంటాస్టిక్ ఫోర్ అని పిలుస్తుంటారు. భూమిని ఎప్పుడూ కాపాడటమే వీళ్ల పని. స్యూ ప్రెగ్నెంట్ కావడంతో ఈమెకు పుట్టబోయే బిడ్డకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో గలాక్టస్ (రాల్ఫ్ ఇన్నేసన్) భూమిని అంతం చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఇతడికోసం ఫెంటాస్టిక్ ఫోర్ వేట మొదలుపెడతారు.స్యూకి పుట్టబోయే బిడ్డని తనకు ఇస్తే.. భూమిని, మనుషుల్ని విడిచిపెడతానని గలాక్టస్ చెబుతారు. అప్పుడు స్యూ ఏం చేసింది? భూమ్మీదకు వచ్చిన గలాక్టస్ని ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. ఓటీటీ రివ్యూ) -
ఇండియాలో అవతార్ ఈవెంట్
‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Avatar: Fire And Ash). సామ్ వర్తింగ్టన్, జో సాల్డానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, కేట్ విన్సె్లట్ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంగా నటించగా, క్లిఫ్ కర్టిస్, డేవిడ్ థెవ్లిస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జేమ్స్ కామెరూన్, జాన్ లాండౌ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఇంగ్లిష్తో పాటు కొన్ని భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగులో కూడా విడుదలవుతోంది. కాగా, ఈ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కు సంబంధించి ఇండియాలో ఓ పెద్ద ఈవెంట్‌ను ప్లాన్ చేస్తారట మేకర్స్. మరోవైపు ఇండి యాలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రదర్శితం కానున్న థియేటర్స్‌లో ‘అవతార్’ ఫ్రాంచైజీ సినిమా అభిమానులు కొందరు ‘అవతార్’ సినిమా లోగోను దీపాల రూపంలో వెలిగించి, హ్యాఫీ ఫీలయ్యారు. ఇక 2009లో వచ్చిన ‘అవతార్’, 2022లో వచ్చిన ‘అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్) ప్రేక్షకులను మెప్పించి, రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘అవతార్ 3’ రానుంది. అలాగే ‘అవతార్ 4, అవతార్ 5’ చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ కన్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే. -
లెక్క తగ్గేదే లే! నవంబరులోనూ సినిమాల సందడి
అక్టోబరు నెలలో చిన్నా పెద్దా కలుపుకుని దాదాపు డజను సినిమాలకు పైగానే విడుదలయ్యాయి. ఫైనల్లీ ‘మాస్ జాతర, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాల విడుదల (అక్టోబరు 31)తో ఈ నెల ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యే నవంబరులోనూ ‘లెక్క తగ్గేదే లే’ అంటూ... సినిమాల సందడి జోరుగా ఉండబోతోంది. ‘జటాధర, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా, ది గర్ల్ ఫ్రెండ్’ వంటి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా పలు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం...యాక్షన్ డ్రామా... మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్, నయన సారిక ముఖ్య పాత్రలు పోషించారు. నందకిశోర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, మలయాళ భాషల్లోనే కాదు... హిందీ, కన్నడలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘‘హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వృషభ’లో అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్ అవుతుంది. అలాగే చక్కని అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సరికొత్త ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రష్మికకి జోడీగా దీక్షిత్ శెట్టి నటించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ మూవీ నిర్మించారు.ఈ సినిమా నవంబరు 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ‘‘సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని తనదైన శైలిలో చక్కగా తెరకెక్కించారు రాహుల్ రవీంద్రన్. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టిల జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. సూపర్ నేచురల్ బ్యాక్‌డ్రాప్‌లో... సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్, రవిప్రకాశ్, ఇందిరా కృష్ణన్, రోహిత్ పాఠక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ బాబు పాత్ర కొత్తగా ఉండనుంది.బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ధన పిశాచి అనే పవర్ఫుల్ రోల్ చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జటాధర’. అద్భుతమైన కథ, భావోద్వేగాలతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డారు. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదల కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ ప్రయాణంలో ‘జటాధర’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.మైథలాజికల్ థ్రిల్లర్ రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’. ఈ సినిమాకి ‘జబర్దస్త్’ ఫేమ్ అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుషిత హీరోయిన్ గా నటించగా, శ్రీరంజని, అమిత్ భార్గవ్, గడ్డం నవీన్, ఇమ్మాన్యుయేల్, టేస్టీ తేజ కీలక పాత్రధారులు. స్ట్రీమ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మించారు. ఈ మూవీని నేరుగా ఆహా ఓటీటీలో నవంబరు 7న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్లో ‘నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. అంబులెన్స్ డ్రైవర్.. ’ వంటి డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘‘మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘చిరంజీవ’. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. తనకి సూపర్ పవర్స్‌తో పాటు ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసే పవర్ ఉంటుంది. ఈ పవర్స్ వల్ల శివ ఎలా లాభపడ్డాడు? ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు? వంటి విషయాలు మా చిత్రంలో ఆసక్తిగా ఉంటాయి’’అని మేకర్స్ తెలిపారు. నవ్వుల్ నవ్వుల్ ‘మసూద’ (2022) సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్గా నటించారు. 7 పి.ఎం ప్రోడక్షన్స్, పప్పెట్ షో ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేసిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘ఈ మూవీ టీజర్ చూడగానే సినిమా చూడాలనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, ΄్యాషన్ ఉండాలి’’ అంటూ శేఖర్ కమ్ముల చెప్పడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ వింటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ కథ నచ్చడంతో పప్పెట్ షో అనే బ్యానర్‌ని స్థాపించి, పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యాను’’ అని తిరువీర్ పేర్కొనడం విశేషం. పీరియాడికల్ డ్రామా ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్ర ఖని కీలక పాత్ర పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ ΄÷ట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ కానుంది.‘‘పీరియాడికల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘కాంత’. 1950 చెన్నై నేపథ్యంతో పాటు గోల్డెన్ ఏజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రమిది. అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఝను చంతర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ, వింటేజ్ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. వినోదాల సంతాన ప్రాప్తిరస్తు విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తరుణ్ భాస్కర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ అవుతోంది.‘‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఒక సమకాలీన అంశాన్ని కథలో చూపిస్తూ వినోదాత్మకంగా తీశాడు సంజీవ్ రెడ్డి. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కల్యాణి ఓరుగంటి పాత్రలో చాందినీ చౌదరి ఆకట్టుకోనున్నారు. రచయిత షేక్ దావూద్ జి. అందించిన స్క్రీన్ ప్లే మా చిత్రానికి అదనపు ఆకర్షణ. సునీల్ కశ్యప్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. వీరాభిమాని సందడి రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ మూవీలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, తులసి రామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సూర్య కుమార్ అనే ఆన్ స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర. ఆయన వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు.వివేక్– మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ‘‘ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) వీరాభిమాని సాగర్‌గా రామ్ నటిస్తున్నారు. ఆయన నటన సూపర్బ్‌గా ఉంటుంది. ప్రతి హీరో అభిమాని... రామ్ పాత్రలో తమను తాము చూసుకుంటారు. భాగ్యశ్రీ అందం, అభినయం ఈ చిత్రానికి ప్లస్. తొలి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’తో పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ మహేశ్‌బాబు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే మరో మంచి కథతో రాబోతున్నాడు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు నవంబరులో విడుదలకు ముస్తాబయ్యే అవకాశాలున్నాయి. టాలీవుడ్లోనే కాదు... బాలీవుడ్లో, హాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ జోడీగా నటించి ‘హక్’ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. అలాగే ‘ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్’ అనే హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఇక అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ‘దే దే ΄్యార్ దే 2’ నవంబరు 14న విడుదల కానుంది. అదే విధంగా అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘120 బహదూర్’ అనే హిందీ చిత్రం, ‘వికెడ్ 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 21న రిలీజ్ అవుతున్నాయి. అలాగే ధనుష్, కృతీ సనన్ జోడీగా నటించిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’, ‘జూటోపియా 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 28న విడుదలకు ముస్తాబయ్యాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్ కూడా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్' సినిమా నవంబర్ 7న రిలీజ్
సైన్స్ ఫిక్షన్ జానర్లో అత్యంత భయానకమైన పాత్రల్లో 'ప్రెడేటర్' ఒకటి. గత నాలుగు దశాబ్దాలుగా ఈ తరహా సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ జీవి, అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.(ఇదీ చదవండి: 'జట్టు పట్టుకుని నేలకేసి'.. మాధురికి క్లాస్ పీకిన నాగార్జున)ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న కొత్త సినిమా 'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్'. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. 1987లో తొలి మూవీ రిలీజ్ కాగా.. తర్వాత 1990, 2010, 2022ల్లో సినిమాలు వచ్చాయి. మరి ఇప్పుడు రాబోతున్న చిత్రం ఎలా అలరించనుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!) -
ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
ఈ వీకెండ్లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్ 16న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్‌టైమ్ కేవలం 1:50 మాత్రమే.ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు. కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్‌తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్-6 కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు. కానీ ఐరిస్ వల్ల కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్‌ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్‌గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు ఉండవ్.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్‌గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్ ఈ మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. -
జాన్ సీనా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఏడాదిన్నర సస్పెన్స్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ప్రముఖ రెజ్లర్, నటుడు జాన్ సీనా(48) తన రెజ్లింగ్ ప్రొఫెషనల్‌కు ముగింపు పలకబోతున్నారు. తన చివరి మ్యాచ్ ఎప్పుడనేదానిపైనా ఆయనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. అయితే ప్రత్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ ఉంచారు. దీంతో ఆ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని చెబుతూనే మరోపక్క అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.రెజ్లింగ్ పరంగానే కాదు.. సినిమాలతోనూ జాన్ సీనా(John Cena) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఫ్యాన్స్‌కు ఆయన చేదు వార్త చెప్పారు. డిసెంబర్ 13వ తేదీన తన చివరి మ్యాచ్‌తో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపారాయన. కిందటి ఏడాది జూన్‌లో ఆయన ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ, అప్పటి నుంచి కూడా ఆయన డబ్ల్యూడబ్ల్యూఈలో మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్నారు. Despite any speculation or rumors, on July 6, 2024 I announced I would retire from WWE in ring participation. I am far from perfect but strive to be a person whose word has value. 12/13/25 will be my final match. I am beyond grateful for every moment WWE has given me. I am… https://t.co/TnUPfuEfzx— John Cena (@JohnCena) October 17, 2025ఈ క్రమంలో మునుపటిలా ఆయన ప్రేక్షకులను అలరించలేకపోతున్నారనే విమర్శ వినిపిస్తూ వచ్చింది. అయితే.. 23 ఏళ్లుగా ‘ది చాంప్ ఈజ్ హియర్, యూ కాంట్ టు సీ మీ’ అంటూ హీరోగా చెలామణి అవుతూ వస్తున్న జాన్ సీనా.. ఈ ఏడాది ‘హీల్’ స్క్రిఫ్ట్‌తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిపోయారు. చాంపియన్ అయిన కోడీ రోడ్స్‌ను ది రాక్ సమక్షంలో దాడి చేసి నెగెటివ్ షేడ్స్‌తో జాన్ సీనా తన క్రేజ్‌ను మళ్లీ పెంచుకున్నారు. ఆ వెంటనే మరో లెజెండ్ రాండీ ఓర్టాన్తోనూ ఆయన మ్యాచ్ ఆడి నెగ్గారు. తాజాగా మరో దిగ్గజ రెజ్లర్ ఏజే స్టయిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాన్ సీనా గెలిచాడు. అయితే.. అందులో ఇద్దరూ పలువురు రెజ్లింగ్ దిగ్గజాల ఫైనల్ మూవ్స్‌తో ఆకట్టుకోవడం.. ఈ ఏడాదికి బెస్ట్ మ్యాచ్‌ను అందించారనే అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేసింది. అభిమానులు ఆ ఆనందంలో ఉండగానే.. జాన్ సీనా తన చివరి మ్యాచ్ తేదీని ప్రకటించారు(John Cena Last Match). అయితే ఆ మ్యాచ్ ఎవరితో అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. మరోవైపు.. ఈ రెజ్లర్ లెజెండ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని డబ్ల్యూడబ్ల్యూఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రెజ్లింగ్ రింగ్ నుంచి హాలీవుడ్ దాకా.. జాన్ సీనా పూర్తి పేరు జాన్ ఫెలిక్స్ ఆంటోనీ సీనా. 1977లో మసాచుసెట్స్‌లో ఆయన జన్మించారు. 1999లో ర్యాపర్ నుంచి రెజ్లింగ్ వైపునకు మళ్లారు. 2002లో డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టి.. ప్రారంభంలోనే కర్ట్ యాంగిల్, అండర్టేకర్, బ్రాక్ లెస్నర్లాంటి స్టార్స్‌తో తలపడ్డాడు. 2004 రెజ్లింగ్ మేనియా-20 ఈవెంట్లో బిగ్ షోతో యూఎస్ చాంపియన్ టైటిల్ కోసం జరిగిన మ్యాచ్.. జాన్ సీనా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ మరుసటి ఏడాది.. అదే ఈవెంట్లో జేబీఎల్(బ్రాడ్షా)తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి చాంపియన్ టైటిల్ గెల్చుకున్నారు. అలా.. తక్కువ సమయంలోనే అభిమానుల మనసు గెలుచుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈలో 17 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆయన.. స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, ది రాక్, అండర్ టేకర్ వంటి దిగ్గజాలతో సమానంగా గుర్తింపు పొందాడు. రెజ్లింగ్‌లో ఫేమ్ కొనసాగుతుండగానే.. జాన్ సీనా 2006లో ది మెరైన్ (The Marine) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. తర్వాత ట్రెయిన్వ్రెక్, బంబ్లేబీ, ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 9, ది సూసైడ్ స్క్వాడ్, పేస్‌మేకర్(హెచ్‌బీవో సిరీస్) నటించి సక్సెస్‌లు అందుకున్నారు. హాస్యం, యాక్షన్, భావోద్వేగం.. సమపాళ్లలో ఉన్న నటుడిగా గుర్తింపు పొందాడు.జాన్ సీనా వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకుంటారు. ఆయనకు రెండు సార్లు వివాహం అయ్యింది. 2009లో ఎలిజబెత్ హుబెర్డ్యూని వివాహమాడి మూడేళ్లకే విడాకులిచ్చారు. ఆపై 2012 నుంచి ఆరేళ్ల పాటు తోటి రెజ్లర్ నిక్కీ బెల్లాతో డేటింగ్ వ్యవహారం నడిపించారు. 2018లో షే షరియత్జాదెహ్ అనే ఇరానీయన్ కెనెడియన్ను వివాహమాడారు. ఈ జంట పిల్లలు వద్దని నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటే.. రెజ్లింగ్, సినిమా పారితోషకంతో ఆయన ఆస్తుల విలువ(తాజా సమాచారం) సుమారు 80–85 మిలియన్ డాలర్లు(రూ.750 కోట్ల దాకా) ఉంటుందనేది అంచనా. అంతేకాదు.. పలు ప్రముఖ బ్రాండ్ల ఎండోర్స్మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతోనూ ఆయన గణనీయంగా సంపాదించుకుంటున్నారు. ఆయనకు ఫ్లోరిడాలో విలాసవంతమైన మాన్షన్ ఉంది(John Cena Wife Children Assets Details). రెజ్లింగ్ చాంపియన్‌గా, సినీ తారగానే కాదు.. జాన్ సీనా మంచి వ్యక్తిగానూ గుర్తింపు దక్కించుకున్నాడు. మేక్ ఏ విష్ Make-A-Wish Foundation ద్వారా 650 మందిని కలిసి.. వాళ్ల చిన్ని చిన్ని కోరికలు తీర్చాడు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించారు కూడా.ఇదీ చదవండి: జాన్ సీనా స్టయిల్‌తో మోదీ.. ఈ చిత్రం చూశారా? -
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్
కల్పిత కథలతో సినిమాలు తీయడం సులభమే. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం. కొన్నిసార్లు మాత్రం ఇలా తీసి బ్లాక్ బస్టర్ కొడుతుంటారు లేదంటే చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంటారు. ఈ మధ్య అలా వచ్చిన 'ద లాస్ట్ బస్' అనే చిత్రం మూవీ లవర్స్‌కి మంచి అనుభూతి ఇస్తూ తెగ నచ్చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)కథేంటి?అది 2018. అమెరికాలోని కాలిఫోర్నియా. కెవిన్ (మాథ్యూ మెక్ కొనాగే) స్కూల్ బస్ డ్రైవర్. ఇతడికి నడవలేని స్థితిలో ఉండే తల్లి, టీనేజ్ కొడుకు ఉంటారు. ఓ రోజు డ్యూటీలో భాగంగా పిల్లల్ని స్కూల్లో దింపేసి కెవిన్.. ఇంటికి తిరిగొచ్చే దారిలో ఉంటాడు. అప్పుడే ఆ ప్రాంతమంతా కార్చిచ్చు అంటుకుంటుంది. దీంతో స్కూల్లో ఉన్న 22 మంది పిల్లల్ని మరోచోటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెవిన్‌పై పడుతుంది. ఓవైపు ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటాయి. మరోవైపు కెవిన్.. ఈ పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలి? మరి కెవిన్ ఏం చేశాడు? చివరకు పిల్లలతో పాటు బతికి బయటపడ్డాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని నిజంగా జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశారు. 2018లో కాలిఫోర్నియాలో కార్చిచ్చులో 85 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఊళ్లకు ఊళ్లు బూడిదయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలోనే కెవిన్ అనే సాధారణ స్కూల్ బస్ డ్రైవర్.. ఊళ్లని తగలబెట్టేసే మంటల్ని దాటుకుని 22 మంది పిల్లల్ని సాహసోపేతంగా ఎలా కాపాడాడనేదే 'ద లాస్ట్ బస్' మూవీ.పేరుకే ఇది సినిమా. కానీ చూస్తున్నప్పుడు ఏ మాత్రం అలా అనిపించదు. చాలా రియలస్టిక్‌గా ఉంటుంది. మనం కూడా ఆ బస్సులోనే ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ రేంజు విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా తీశార్రా అని కచ్చితంగా సందేహం వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క సీన్ కూడా గ్రాఫిక్స్‌లా అనిపించదు. ఫస్టాప్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది గానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. తర్వాత ఏమవుతుందా అనే టెన్షన్ మనల్ని కుదురుగా కూర్చోనివ్వదు.ఏదైనా ఆపద వచ్చినప్పుడు 'ప్రెజెన్స్ ఆఫ్ మైండ్' అనేది చాలా కీలకం. ఇందులో బస్ డ్రైవర్ కెవిన్ ఆలోచన విధానం చూస్తే అదే గుర్తొస్తుంది. తొందరపడటం కంటే కొన్నిసార్లు ఏం చేయకుండా అలా ఉండటం కూడా ఒకందుకు మంచిదే అనేలా ఓ సీన్ ఉంటుంది. కానీ కార్చిచ్చు వీళ్ల దగ్గరకు కూడా వచ్చేసరికి మంటల్లోని బస్ పోనిచ్చే సీన్ అయితే ప్రీ క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చివరకొచ్చేసరికి హ్యాపీ ఎండింగ్‌తోనే ముగించడం సంతోషం.సినిమాలో కనిపించిన నటీనటులు ఎవరూ మనకు తెలియదు. కానీ వాళ్లతో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం. అయితే సినిమాలో ఎమోషన్స్, డ్రామా లాంటివి ఇంకా పెట్టొచ్చు కానీ దర్శకుడు ఆ పనిచేయలేదు. అది మాత్రం కాస్త వెలితిగా అనిపిస్తుంది. సెప్టెంబరు 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్టోబరు 03 నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతోనూ చూడొచ్చు. ఒకవేళ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు) -
సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ట్రాన్ ఏరిస్... రిలీజ్ ఎప్పుడంటే?
ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ట్రాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగంగా ట్రాన్: ఏరిస్ మూవీని తీసుకొస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏఐ టెక్నాలజీ ప్రధానంగా రూపొందించారు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా లండన్ ప్రీమియర్‌లో జారెడ్ మాట్లాడుతూ... "ఒక విధంగా చూస్తే ఏఐ ఒక పెద్ద సంభాషణగా మారిన సరైన సమయంలో వస్తుంది. మేము ఈ సినిమా పై 9-10 సంవత్సరాల క్రితం పని చేయడం మొదలుపెట్టాం. అప్పుడు ఏఐ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగిస్తున్నారు. వారు తెలిసినా లేదా తెలియకపోయినా, అది మన జీవితాల్లో ఏదో ఒక రూపంలో భాగమైపోయింది. కాబట్టి ఈ సినిమా ఈ సమయంలో వస్తుండటం ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను." అని అన్నారు. కాగా. ఈ చిత్రంలో జారెడ్ లెటో, జెఫ్ బ్రిడ్జెస్, గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, జోడి టర్నర్ స్మిత్, కామెరాన్ మోనాఘన్, హాసన్ మిన్హాజ్, గిలియన్ ఆండర్సన్ నటించారు. -
హాలీవుడ్లో తెలుగోడి ‘కింగ్ బుద్ధ’
టాలీవుడ్ దర్శక,నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో 'కింగ్ బుద్ధ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్‌గా జరిగింది.ఈ ఈవెంట్‌కు మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్‌గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్‌గా హాజరై, 'కింగ్ బుద్ధ' పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ‘గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్లో తీసి హాలీవుడ్లో డబ్బింగ్ చేయకుండా, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లోనే నిర్మించడం చాలా సంతోషకరం. తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్లో సినిమా తీస్తున్న సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని పేర్కొన్నారు.చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ.. గతంలో సత్యారెడ్డి దర్శకత్వం వహించిన 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో గద్దర్ నటించారు. షూటింగ్ సమయంలో గద్దర్ బుద్దుడి శాంతి ప్రవచనాలు చూసి ఆకర్షితులైనట్లు పేర్కొన్నారు. ఆ సినిమాను చూసినప్పుడే సత్యారెడ్డి డైరెక్షన్లో ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో 'కింగ్ బుద్ధ'ను పూర్తిస్థాయిలో హాలీవుడ్లో నిర్మించాలని నిర్ణయించుకున్నాము. డైరెక్టర్ సత్యారెడ్డి చెప్పిన స్టోరీతో ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది అన్నారునటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా, గాయకుడుగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను, ప్రపంచ శాంతి కోసం 'కింగ్ బుద్ధ' కాన్సెప్ట్‌ను నా నిర్మాతలకు చెప్పగానే వారు భారీ బడ్జెట్‌తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతి త్వరలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’ అని సత్యారెడ్డి అన్నారు. -
ప్రియురాలు ఫిర్యాదు.. సింగర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష
అమెరికన్ ప్రముఖ ర్యాపర్ డిడ్డీ (54)కి జైలు శిక్ష పడింది. అమ్మాయిల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నాడని ఈ ఏడాది జులైలో న్యూయార్క్‌లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో ఆయన్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. కానీ, అతని మాజీ ప్రియురాళ్ళు కాసాండ్రా వెంచురా, జేన్లతో వ్యభిచారం కోసం రవాణా చేసినందుకు అతని ప్రమేయం ఉందని తేలింది. తమను డిడ్డీ విక్రయించాడని వారు కోర్టుకు ఆధారాలు అందించారు. దీంతో అతనికి 4ఏళ్లు జైలు శిక్ష పడింది.2016లో డిడ్డీ తన ప్రియురాలు కాసాండ్రా వెంచురా నుంచి బ్రేకప్ అయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె డిడ్డీపై పలు ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా హింసించాడని పేర్కొంది. అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా సహా చాలా కేసులు కూడా ఆ సమయంలో పెట్టింది. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాసాండ్రా ఆరోపించింది. ఈ క్రమంలోనే తనను విక్రయించాడని కూడా పేర్కొంది.ర్యాపర్ డిడ్డీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని న్యాయమూర్తి పేర్కొన్నాడు. దీంతో అతనికి 4 ఏళ్లు జైలు శిక్ష విదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షను అధిగిమించి తిరిగొస్తావని ఆశిస్తున్నట్లు డిడ్డీతో ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మహిళలకు హాని కలిగించడానికి నువ్వు చూపిన చొరవ.. వారికి సహాయం చేయడానికి చూపించాల్సింది అంటూ చేసిన పాపాల విముక్తి కోసం ఈ శిక్ష తప్పదని పేర్కొన్నారు.తన ప్రతిభతో గ్రామీ అవార్డులను సొంతం చేసుకుని మ్యూజిక్ మొఘల్ గా డిడ్డీ కీర్తిని అందుకున్నాడు. కోర్టు తీర్పు తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన భయానకంగా, అవమానకరంగా ఉందని తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే తాను మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నానని చెప్పాడు. నేను చేసిన తప్పులను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించుకోను. నేను శిక్ష అనుభవించాల్సిందే. డిడ్డీ 2029లో విడుదల కావచ్చు.BREAKING: Sean 'Diddy' Combs sentenced to over 4 years in federal prison.Back in July, Combs was found guilty of two counts of transporting individuals for prostitution."A substantial sentence must be given to send a message to abusers and victims alike that abuse against… pic.twitter.com/atFjasAmiv— Collin Rugg (@CollinRugg) October 3, 2025 -
థియేటర్లలో కాంతార ఛాప్టర్-1.. ఓటీటీల్లో ఏయే సినిమాలంటే?
అసలే దసరా సెలవులు.. చూస్తుండగానే అయిపోతున్నాయి. మరో వీకెండ్ కూడా వచ్చేస్తోంది. ఈ పండుగకు అలరించేందుకు కాంతార చాప్టర్-1, ఇడ్లీ కొట్టు సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇవీ తప్ప పెద్దగా సినిమాలేవీ దసరాకు రిలీజ్ కాలేదు. కాంతార మూవీపై భారీ అంచనాలు ఉండడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు.ఇక ఓటీటీల విషయానికొస్తే అదే పరిస్థితి నెలకొంది. ఈ శుక్రవారం పెద్దగా మూవీస్ ఏవీ స్ట్రీమింగ్ కావట్లేదు. మైనే ప్యార్ రియా అనే మలయాళ సినిమా, హాలీవుడ్ చిత్రాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పెద్దగా బజ్ చిత్రాలేవీ కనిపించడం లేదు. అయితే దసరా సెలవులు కావడంతో కాస్తా డిఫరెంట్ సిరీస్, సినిమాలు ట్రై చేసే వాళ్లు ఓ లుక్కేయ్యొచ్చు. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్..స్టీవ్(హాలీవుడ్ మూవీ)- అక్టోబరు 03మాన్స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03జెనీ మేక్ ఏ విష్(కొరియన్ సిరీస్)- అక్టోబరు 03ఓల్డ్ డాగ్.. న్యూ ట్రిక్స్(స్పానిష్ కామెడీ సిరీస్)- అక్టోబరు 03ది న్యూ ఫోర్స్(స్వీడీష్ మూవీ)- అక్టోబరు 03జీ5డాకున్ కా ముండా-3(పంజాబీ మూవీ)- అక్టోబర్ 03జియో హాట్స్టార్బిగ్బాస్ తమిళ్(రియాలిటీ షో)- అక్టోబర్ 05లయన్స్ గేట్ ప్లేమైనే ప్యార్ కియా(మలయాళ సినిమా)- అక్టోబరు 03 ఆపిల్ ప్లస్ టీవీ లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03హులువేర్ వాల్వ్స్- అక్టోబర్ 03 -
ఓటీటీకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సినిమాలకు పెద్ద సంఖ్యలో ఆడియన్స్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ చిత్రాలకు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగాన్ని తెరకెక్కించారు. మే 15న భారత్‌లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ భయపెట్టేసింది.అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియా ఫ్యాన్స్‌కు మాత్రం వీక్షించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో ఓటీటీలో ఫైనల్ డెస్టినేషన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇండియా ఫ్యాన్స్ కోసం జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి తెలుగు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.కాగా.. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్‌వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. -
పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. సోషల్ మీడియాలో పోస్ట్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బెన్నీ బ్లాంకోను పెళ్లాడింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో స్నేహితులు, సన్నిహితులు, పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు టేలర్ స్విఫ్ట్, పారిస్ హిల్టన్, మార్టిన్ షార్ట్, ఆష్లే పార్క్ లాంటి హాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. తాజాగా సింగర్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.కాగా.. సింగర్ సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఈ జంట గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 12న ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫొటోలు తెగ వైరలయ్యాయి.బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్‌ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) -
ఆ హీరో అంటే విపరీతమైన క్రష్.. నా గదిలో కూడా: బద్రి హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. హిందీ మూవీస్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ.. టాలీవుడ్లో బద్రిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లోనూ మెప్పించింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత గదర్-2లో మెప్పించింది. అయితే ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన అమీషా పటేల్ తన పెళ్లితో పాటు కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాల పంచుకుంది.అంతేకాకుండా తన క్రష్ గురించి కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడింది. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తనకు విపరీతమైన ప్రేమ ఉందని అమీషా పటేల్ మనసులోని మాటను బయటపెట్టింది. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే టామ్ క్రూజ్ పట్ల తనకున్న అభిమానాన్ని అమీషా పటేల్ పంచుకోవడం ఇదేం మొదటిసారి కాదు.. 2023లోను తన గదిలో ఆ స్టార్ పోస్టర్లు ఉన్నాయని అమీషా వెల్లడించింది. టామ్‌తో కలిసి పనిచేయాలనేది తన కోరిక అని తెలిపింది.అమీషా పటేల్ మాట్లాడుతూ.. "నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. మీరు అతనితో పాడ్‌కాస్ట్ చేయగలిగితే.. దయచేసి నన్ను కూడా ఆ పాడ్‌కాస్ట్‌కి పిలవండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ అంటే ఇష్టం. నా పెన్సిల్ బాక్స్‌లో.. నా ఫైల్స్‌లో అతని ఫోటో ఉండేది. నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ టామ్ క్రూజ్దే. అతను ఎప్పుడు.. ఎప్పటికీ నా క్రష్. నేను అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా వెనకాడను. అతనికి పెద్ద అభిమానిని అని.. అవకాశం ఇస్తే పెళ్లి చేసుకునేదాన్ని" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని..సరైన వ్యక్తి దొరికితే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడతానని కూడా అంటోంది అమీషా పటేల్.ఇక కెరీర్ విషయానికొస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత అమీషా పటేల్.. గదర్- 2తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆమె చివరిసారిగా 2024లో వచ్చిన తౌబా తేరా జల్వా మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ 50 ఏళ్ల బ్యూటీ ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. -
జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ రిలీజ్
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) విజువల్ వండర్ అవతార్(Avatar). ఆ తర్వాత అవతార్-2 కూడా ఆడియన్స్‌ను కట్టిపడేసింది. దీంతో ఈ సిరీస్‌లో మూడో పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కామెరూన్. అవతార్: ఫైర్ అండ్ యాష్ పేరుతో ఈ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరోసారి తెలుగులోట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే జేమ్స్ కామెరూన్ విజువల్ మార్క్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచంలోని విషయాలు .. నువ్వు ఊహించిన దానికంటే లోతైనవి అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ఫైట్ సీన్స్ అవతార్ మూవీ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం విజువల్ వండర్‌ను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, ట్రినిటీ బ్లిస్, జాక్ ఛాంపియన్, బెయిలీ బాస్, కేట్ విన్స్లెట్ కీలక పాత్రల్లో నటించారు. -
ఐఫోన్‌తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. అందున హాలీవుడ్ నుంచి ఈ జానర్ మూవీస్ వస్తున్నాయి అంటే కచ్చితంగా భయపెట్టి తీరేలానే ఉంటాయి. అలా జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఓ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే '28 ఇయర్స్ లేటర్'(28 ఏళ్ల తర్వాత). ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'స్లమ్ డాగ్ మిలీయనీర్'ని తీసిన డేనీ బోయెల్ దీనికి దర్శకుడు. మరి ఈ సినిమా అంతలా భయపెట్టిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)కథేంటి?2002లో రేజ్ వైరస్ రాకతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. అలా 28 ఏళ్లు గడిచిపోతాయి. బ్రిటన్‌లోని ఓ దీవిలో ఈ వైరస్ బారిన పడని కొంతమంది జీవిస్తుంటారు. హీరో జేమీ తన 12 ఏళ్ల కొడుకు స్పైక్, భార్యతో కలిసి బతుకుతుంటాడు. ఓ రోజు వేట కోసం జేమీ, స్పైక్.. మెయిన్ ల్యాండ్‌కు వెళ్తారు. ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే జాంబీలు ఉండే ప్రదేశం. అక్కడ 'ఆల్ఫా' అనే బలమైన జాంబీ ఈ తండ్రి కొడుకులకు ఎదురుపడుతుంది. తర్వాత ఏమైంది? తిరిగి ద్వీపానికి చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో జాంబీ సినిమా. అంటే వైరస్ సోకేసరికి చాలామంది మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు ఓ ద్వీపంలో తలదాచుకుంటారు. ఆ ద్వీపానికి జాంబీలు ఉండే ప్రదేశానికి మధ్యలో చిన్న దారి ఉంటుంది. కానీ రాత్రయితే ఆ దారి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అలాంటి వీళ్లలోని ఓ తండ్రి కొడుకు జాంబీల దగ్గరకు వెళ్తారు. తర్వాత ఊహించి పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుంది. తర్వాత ఏమైందనేది మూవీ చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయాలి.ఈ సినిమాని కచ్చితంగా ఒంటరిగానే చూడండి. అలా అని బూతు సన్నివేశాలు ఏం ఉండవు. జాంబీలన్నీ బట్టల్లేకుండానే ఉంటాయి. కానీ ఒంటిపై బురదలాంటిది ఉంటుంది. కానీ జాంబీలని భయంకరంగా చంపడం లాంటి సీన్స్ ఉంటాయి. ఇదో హారర్ మూవీ అయినప్పటికీ మరోవైపు థ్రిల్ పంచుతూ మానవ సంబంధాలు, భావోద్వేగాలని కూడా చూపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.రెండు గంటల్లోపే ఉండే ఈ సినిమా నెమ్మదిగానే ఉంటుంది గానీ విజువల్స్ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కూడా మూవీలో మీరు లీనమయ్యేలా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఐఫోన్‌తో తీయడం విశేషం. అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీల్లోనూ ఉంది గానీ వాటిలో రెంట్ పద్ధతిలో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేసేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)) -
హాలీవుడ్ బ్యూటీకి జాక్‌పాట్.. ఏకంగా రూ.530 కోట్లా?
సినీ ఇండస్ట్రీలో పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకైతే ఏకంగా వంద కోట్లు ముట్టజెప్పాల్సిందే. కొందరు బిగ్ స్టార్స్ ఏకంగా వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే పారితోషికాలు అంత ఎక్కువగా ఉండవు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో పదిశాతం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఒక హీరోయిన్‌కు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? అది మన బాలీవుడ్ సినిమాలో ఇంతలా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సిడ్నీ స్వీనీ కోసం బాలీవుడ్ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. 'యుఫోరియా', 'ది వైట్ లోటస్' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న సిడ్నీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఈ బిగ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.ఓ నివేదిక ప్రకారం 28 ఏళ్ల సిడ్నీ స్వీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 530 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు సంప్రదించిందని టాక్. ఒకవేళ ఆమె ఈ డీల్ అంగీకరిస్తే బాలీవుడ్ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ జరగనుందని సమాచారం. మొదట ఈ ఆఫర్ చూసి సిడ్నీ స్వీనీ ఆశ్చర్యపోయిందని ఓ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ బిగ్ డీల్‌కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సిడ్నీ తరఫున ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.ప్రస్తుతం సిడ్నీ స్వీనీ 'క్రిస్టీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో యూఎస్ పోరాట యోధురాలు క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఆ తర్వాత సిడ్నీ నటించిన మరో చిత్రం 'ది హౌస్‌మెయిడ్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Sydney Sweeney (@sydney_sweeney) -
ఎమ్మీ అవార్డ్స్- 2025 విన్నర్స్.. తొలిసారి రెండు రికార్డ్స్
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్- 2025 వేడుక లాస్ ఏంజిల్స్(యూఎస్)లోని పికాక్ థియేటర్లో జరిగింది. తాజాగా జరిగిన 76వ ఎమ్మీ అవార్డుల వేడుకలో రెండు రికార్డ్స్ నమోదు అయ్యాయి. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 27 నామినేషన్లతో అత్యధిక అవార్డులకు ఎంపికైన డ్రామా సిరీస్ "సెవెరెన్స్" ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీలో నటించిన టిల్మాన్ అత్యుత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డ్ అందుకున్న తొలి నల్లజాతి సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ డ్రామా సీరిస్‌గా "ది పిట్" ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన నోహ్ వైల్ 26 సంవత్సరాల తర్వాత మరోసారి ఎమ్మీని గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్ హిట్ సీరిస్‌గా గుర్తింపు పొందిన "అడోలెసెన్స్"లో నటించిన ఓవెన్ కూపర్‌కు ఉత్తమ సహాయనటుడిగా అవార్డ్ దక్కింది. ఎమ్మీ అవార్డ్ అందుకున్న అత్యంత పిన్న వయసు ఉన్న వ్యక్తిగా ఓవెన్ కూపర్ (15) రికార్డ్ క్రియేట్ చేశాడు.ఉత్తమ డ్రామా సిరీస్- ది పిట్ (HBO Max)ఉత్తమ నటుడు- నోహ్ వైల్ (ది పిట్)ఉత్తమ నటి - బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)ఉత్తమ సహాయనటుడు - ట్రామెల్ టిల్మాన్ (సెవెరెన్స్)ఉత్తమ కామెడీ సిరీస్- ది స్టూడియో ఉత్తమ లిమిటెడ్ సిరీస్- అడోలెసెన్స్ (నెట్‌ఫ్లిక్స్)ఉత్తమ సహాయనటుడు లిమిటెడ్ సిరీస్- ఓవెన్ కూపర్ (అడోలెసెన్స్)ఉత్తమ డాక్యుమెంట్రీ సిరీస్- 100 ఫుట్ వేవ్ఉత్తమ యానిమేషన్- ఆర్కేన్ లీగ్ ఆర్ లెజెండ్స్ (నెట్‌ఫ్లిక్స్) -
హిట్ ఫ్రాంచైజీ చిత్రం 'ట్రాన్: ఏరీస్' ట్రైలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం 'ట్రాన్: ఏరీస్'.. దర్శకుడు జోయాకిమ్ రోన్నింగ్ తెరకెక్కించిన ఈ మూవీ నుంచి తాజాగా కొత్త పోస్టర్, ట్రైలర్‌ను డిస్నీ విడుదల చేసింది. సైన్స్ ఫిక్షన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ట్రాన్ (1982), దాని సీక్వెల్ ట్రాన్: లెగసీ (2010) తర్వాత వస్తున్న మూడవ చాప్టర్ ఇది. ఈ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 10, 2025న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.డిజిటల్ ప్రపంచం నుండి రియల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అధునాతన ప్రోగ్రామ్ ఏరీస్ ఒక ప్రమాదకరమైన మిషన్‌లో నడిచే కథ ఇది. ఇదే మానవజాతి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I.) జీవుల మధ్య మొదటి భేటీగా నిలుస్తుంది. ఈ చిత్రంలో జారెడ్ లేటో ప్రధాన పాత్రలో నటించగా, గ్రెటా లీ, ఎవాన్ పీటర్స్, హసన్ మినహాజ్, జోడీ టర్నర్-స్మిత్, గిల్లియన్ ఆండర్సన్ వంటి అంతర్జాతీయ నటీనటులు కనిపించనున్నారు. -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్‌లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్‌పై భారతీయ ఫిల్మ్‌మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.అవతార్‌ను మించి..! హాలీవుడ్లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్డేట్స్కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్ఎస్ఎమ్బీ29’ సినిమా ఫస్ట్ లుక్‌ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్‌ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్‌లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఫారిన్ స్పిరిట్ ప్రభాస్ ది ఇంటర్నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.గ్లోబల్ డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్నేషనల్ కనెక్ట్విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్‌ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.ఇదిలా ఉంటే... ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్‌లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్‌కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.ఇంటర్నేషనల్ పెద్ది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్నేషనల్ లెవల్లో. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రామ్చరణ్పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్‌చరణ్‌కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్‌లోనూ రామ్‌చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.హాలీవుడ్ అసోసియేషన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.హాలీవుడ్లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్‌లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్‌ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్‌తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ది ప్యారడైజ్ ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు -
భారత్‌లో అవతార్ రీరిలీజ్.. ఎప్పుడంటే?
"అవతార్: ఫైర్ అండ్ యాష్" కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 20th Century Studios ఓ గొప్ప బహుమతి ఇవ్వనుంది. జేమ్స్ కామెరూన్ మాస్టర్ పీస్ "అవతార్: ది వే ఆఫ్ వాటర్" అక్టోబర్ 2న భారతీయ థియేటర్స్‌లో ఒక వారంరోజుల పాటు 3D లో రీరిలీజ్ కానుంది. 2022 డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) గెలుచుకుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3D వర్షన్ ద్వారా పండోరా ప్రపంచాన్ని మరోసారి చుట్టేయండి.“ఈ అవకాశం అస్సలు మిస్ అవ్వకండి. ఈ మనోహరమైన లోకాన్ని ముందే చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా ఇది మర్చిపోలేని సినిమా అనుభవం అవుతుంది” అని 20th Century Studios ఇండియా ప్రతినిధులు తెలిపారు. "అవతార్: ఫైర్ అండ్ యాష్" విషయానికి వస్తే ఈ మూవీ ఇండియాలో ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది. చదవండి: నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగత్తెను: బిగ్‌బాస్ బ్యూటీ -
రూ. 9 వేల కోట్ల కలెక్షన్స్.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమా 'లిలో అండ్ స్టిచ్' ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. మే 23న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు భారత అభిమానుల కోసం స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉండనుందని మొదట ప్రకటించారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.'లిలో అండ్ స్టిచ్' చిత్రాన్ని వాల్ట్ డిస్నీ పిక్చర్స్, రైడ్బ్యాక్ సంయుక్తంగా నిర్మించాయి. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రంగా డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించారు. 2002లో ఇదే టైటిల్‌తో విడుదలైన సినిమాకు లైవ్-యాక్షన్ రీమేక్‌గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 3 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటనలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ భాషలలో మాత్రమే విడుదల కానుందని జియోహాట్‌స్టార్ మొదట చెప్పింది. తన టాలీవుడ్ సబ్స్క్రైబర్లను నిరాశపరచకూడదని సడెన్‌గా తెలుగు వర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.'లిలో' జీవితం కోట్ల కలెక్షన్స్ రాబట్టిందిప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ. 8800 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘లిలో అండ్ స్టిచ్’ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యానిమేటెడ్ క్లాసిక్ లైవ్ యాక్షన్ సినిమాలో మైయా కీలోహా, సిడ్నీ అగుడాంగ్, క్రిస్ సౌండర్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ సమస్యలతో ఒంటరిగా బాధపడుతున్న లిలో అనే అమ్మాయి జీవితంలోకి స్టిచ్ అనే గ్రహాంతరవాసి ఎంటర్ అవుతుంది. వారిద్దరి మధ్య స్నేహం మొదలౌతుంది. దీంతో లిలో జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరి హృదయాన్ని తాకే చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంది. -
2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో థ్రిల్లర్, హారర్, యాక్షన్.. ఇలా వివిధ జానర్స్ ఉంటాయి. అయితే చాలామంది యాక్షన్ లేదా థ్రిల్లర్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)యాక్షన్ సినిమాలనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. అందుకు తగ్గట్లే 2021లో వచ్చిన 'నోబడీ'.. ఈ జానర్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో ఇది టాప్-10లో ఉండటం విశేషం. దీనికి సీక్వెల్ 'నోబడీ 2'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ వచ్చింది. మరి ఏమైందో ఏమో గానీ రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు యూఎస్, యూకే లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. మరి వారం పదిరోజుల్లో మన దగ్గర కూడా రావొచ్చు.'నోబడీ 2' విషయానికొస్తే.. భార్య, పిల్లలతో కలిసి హీరో విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలు అనుకోకుండా చేసిన ఓ పని వల్ల చిన్న గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దది అయి.. ఓ కోటీశ్వరుడి సామ్రాజ్యాన్ని నేలకూల్చే వరకు వెళ్తుంది. మరి హీరో.. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ప్రారంభం నుంచి చివరివరకు కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ ఉంటాయి. చిన్న గ్యాప్ అనేది లేకుండా యమ స్పీడుగా వెళ్తుంది. నిడివి కూడా గంటన్నర కావడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?) -
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సిసు. ఈ సిరీస్‌లో మరో చిత్రం శిశు.. రోడ్ టూ రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శిశు పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రిలీజ్ చేయనుంది.కాగా.. జాల్మారి హెలాండర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైక్ గూడ్రిడ్జ్, పెట్రి జోకిరాంటా నిర్మించారు. ఈ చిత్రంలో జోర్మా టొమ్మిలా, రిచర్డ్ బ్రేక్, స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 నవంబర్ 21న భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. -
కన్నీళ్లు పెట్టుకున్న కండల వీరుడు.. ఈసారి అవార్డ్ ఖాయం
WWE మాజీ స్టార్, నటుడు డ్వెన్ జాన్సన్ (ది రాక్) కండలు తిరిగిన దేహంతో ఉండే హాలీవుడ్ నటుడు. రెజ్లర్‌గానే కాకుండా నటుడిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. WWEలో ఏకంగా 10 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా సత్తా చాటాడు. అయితే, ఒక నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన 'ది స్మాషింగ్ మెషిన్' సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. సినిమా చూసిన వారందరూ సుమారు 15 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ మొత్తం భావోద్వేగానికి గురైంది.పోరాట యోధుడి జీవితంపై సినిమా90ల నాటి పోరాట యోధుడు మార్క్ కెర్ (Mark Kerr) అనే వ్యక్తి MMA (Mixed Martial Arts) ప్రపంచంలో ఒక లెజెండరీ ఫైటర్‌గా గుర్తింపు పొందాడు. ఆయన జీవితం ఆధారంగానే 'ది స్మాషింగ్ మెషిన్' చిత్రాన్ని దర్శకుడు బెన్నీ సాఫ్డీ తెరకెక్కించారు. మార్క్ కెర్ పాత్రలో డ్వెన్ జాన్సన్(Dwayne Johnson ) అదరగొట్టాడు. ఈ సినిమా మార్క్ కెర్ జీవితంలోని గెలుపులు, ఓటములతో పటు అతని ఒపియాయిడ్ వ్యసనం వల్ల ఎదురైన వ్యక్తిగత సమస్యలను హృదయాన్ని తాకే విధంగా చూపిస్తుంది. ఇది కేవలం పోరాటం గురించి మాత్రమే కాదు.. అతని అంతర్గత పోరాటం గురించి కూడా ఈ చిత్రంలో చూపించారు. మార్క్ కెర్‌తో పాటు డ్వెన్ జాన్సన్‌లకు కూడా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో సినిమా చూసిన వారు తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారని చెబుతున్నారు.ఆస్కార్ ఖాయండ్వేన్ జాన్సన్ నటన అద్భుతం అంటూ ఈ సినిమాలో తన పాత్రను చూసి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు. క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాగా చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్నారు. అక్టోబర్ 3న అమెరికాలో మొదట ఈ చిత్రం విడుదల కానుంది. ఫాస్ట్ & ఫ్యూరియస్ సిరీస్, జుమాన్జీ, మోనా, బ్లాక్ ఆడమ్ వంటి చిత్రాల్లో నటించిన డ్వేన్ ఇప్పటికీ ఒక్క ఆస్కార్ అవార్డ్ కూడా సొంతం చేసుకోలేదు. అయితే, 'ది స్మాషింగ్ మెషిన్' చిత్రంతో ఆయన తప్పకుండా ఈసారి ఆస్కార్ అందుకుంటాడని సినిమా చూసిన వారు చెప్పేశారు.కన్నీళ్లు పెట్టుకున్న డ్వేన్ జాన్సన్వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'ది స్మాషింగ్ మెషిన్' చిత్రాన్ని తాజాగా ప్రదర్శించారు. సినిమా చూసిన వారందరూ దాదాపు 15 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీంతో డ్వేన్ జాన్సన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మార్క్ కెర్ పాత్రలో డ్వేన్ అద్భుతంగా నటించాడంటూ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో నటుడు డ్వేన్ జాన్సన్ కూడా భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ క్షణంలో సహనటి ఎమిలీ బ్లంట్, దర్శకుడు బెన్నీ సఫ్డీ అతన్ని ఓదార్చారు.Dwayne Johnson's 'The Smashing Machine' explodes onto Rotten Tomatoes with a flawless 100% scorecritics are calling it his all-time greatest performance! Might not return back to the ring!Oscar buzz is real. 😭🏆 #TheSmashingMachine pic.twitter.com/yEoMM7MvyZ— Azam Sajjad (@AzamDON) September 2, 2025 -
ప్యారడైజ్‌కి హాలీవుడ్ కనెక్షన్!
హాలీవుడ్ రేంజ్లో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తు్తన్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసెడింట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ హెడ్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటిని ‘ది ప్యారడైజ్’ టీమ్‌ని కలిసి, ఈ సినిమాతో కొలాబరేట్ కావడానికి చర్చలు జరిపారు.అలాగే ఈ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఓ హాలీవుడ్ నటుడితో కూడా ఈ చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోంది. ఇక ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
ది కంజురింగ్: లాస్ట్ రైట్స్.. రియల్ స్టోరీ!
హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ఇంతకుముందు వచ్చిన కంజురింగ్ ఫ్రాంచైజ్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ ఫ్రాంచైజ్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ది కంజురింగ్: లాస్ట్ రైట్స్. మైఖెల్ చావ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని న్యూ లైన్ సినిమా సమర్పణలో ది సఫ్రాన్ కంపెనీ, యాన్ అటామిక్ మాన్స్టర్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ సెప్టెంబర్ 5న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు చిత్ర కింది వివరాలను తెలిపారు. ఇది 1980–90 మధ్య జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం అని చెప్పారు. ఇంతకుముందు వచ్చిన కంజురింగ్ ఫ్రాంచైజ్‌లో కంటే భారీ బడ్జెట్లో రూపొందిన మూవీ అని పేర్కొన్నారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుందన్నారు. ఈ చిత్రాన్ని భారతదేశంలో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లం భాషల్లో విడుదల చేస్తోంది. చదవండి: జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'థండర్ బోల్ట్స్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మే 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జేక్ ష్రియర్ (Jake Schreier) దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి న్యూ అవేంజర్స్ (New Avengers) అనే ట్యాగ్లన్ ఉండటంతో ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తి పెరిగింది. అవెంజర్స్ లేని సమయంలో దేశాన్ని కాపాడేందుకు వాలంటీనా టీమ్ 'థండర్ బోల్ట్స్'ని రెడీ చేస్తుంది. ఈ పాయింట్‌తోనే సినిమా ప్రారంభమౌతుంది.'థండర్ బోల్ట్స్: న్యూ అవేంజర్స్' చిత్రాన్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కించారు. మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ విలన్లు ఒక టీమ్‌గా ఏర్పడటాన్ని ఇందులో చూపిస్తారు. అయితే, సడెన్‌గా జియోహాట్‌స్టార్ ((JioHotstar))లో ఈ చిత్రం ఆగష్టు 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. రెంట్ విధానంలో ఇప్పటికే జూలై 1 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఇతర దేశాల్లోని అభిమానులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఇండియాలోని ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.థండర్ బోల్ట్స్ చిత్రంలో ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, హన్నా జాన్-కామెన్, గెరాల్డిన్ విశ్వనాథన్, లూయిస్ పుల్మాన్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. -
అల్లు అర్జున్‌తో హాలీవుడ్ పవర్ హౌస్.. బిగ్ ప్లాన్ రెడీ
అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ఈమేరకు దర్శకుడు అట్లీ అందుకు సంబంధించిన ప్రణాళికలతో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం AA22XA6 పేరుతో ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్‌కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది.అల్లు అర్జున్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్‌కి చెందిన స్పెక్ట్రల్ మోషన్ సంస్థ ఇప్పటికే పనిచేస్తుంది. ఆపై హాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని మార్కెట్ చేయడానికి హాలీవుడ్ స్టూడియోతో కూడా ఈ మూవీ టీమ్ కనెక్ట్ అయింది. హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్(Connekkt Mob Scene) బన్నీ సినిమా కోసం పనిచేయనుంది. రెండు దశాబ్దాలకు పైగా ఈ సంస్థ అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పవర్ హౌస్లా పనిచేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఆ టీమ్ పనిచేయనుంది.ఈ ఏజెన్సీకి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ 'అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి' తొలిసారి ఇండియాకు వచ్చారు. ముంబైలో అల్లు అర్జున్, అట్లీని ఆమె కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అవతార్, డ్యూన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జురాసిక్ వరల్డ్, బార్బీ వంటి దిగ్గజ చిత్రాల కోసం ఆమె పనిచేశారు. AA22 చిత్రానికి మార్కెటింగ్ పరంగా ఆమె టీమ్ పనిచేయనుంది. అది గేమ్-ఛేంజర్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. హాలీవుడ్ చిత్రాలకు పవర్ హౌస్లా అలెగ్జాండ్రా పనిచేస్తుందని ఆమెకు పేరు ఉంది. దీంతో అల్లు అర్జున్ నటించే ఈ సినిమా హాలీవుడ్లో విడుదల కావాడం ఖాయం అని చెప్పొచ్చు. -
బిగ్ బాస్ షో.. అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ ఎవరంటే?
బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్‌లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఈ బిగ్‌బాస్ సీజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆదివారం హిందీ బిగ్‌బాస్ సీజన్-19 గ్రాండ్‌గా మొదలైంది. ఈ సీజన్లో పలువురు కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.బిగ్‌బాస్ మొదలైందంటే చాలు అందరి దృష్టి కంటెస్టెంట్ ఎవరనే దానిపై ఉంటుంది. అంతేకాకుండా కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ జరుగుతుంది. అయితే గతంలో నాలుగో సీజన్లో అడుగుపెట్టిన హాలీవుడ్ బ్యూటీ పమేలా అండర్సన్ పారితోషికంపై తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ సీజన్లోనే అత్యధిక పారితోషికం అందుకుంటోన్న కంటెస్టెంట్‌గా నిలిచింది. హౌస్‌లో హాలీవుడ్ గ్లామర్ తీసుకొచ్చిన పమేలా.. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొట్టమొదటి అంతర్జాతీయ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె స్పెషల్ గెస్ట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది.కళ్లు చెదిరే రెమ్యునరేషన్..అయితే హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన పమేలా అండర్సన్ ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు రోజులు మాత్రమే హౌస్‌లో ఉన్న పమేలా ఒక్కో రోజుకు దాదాపు రూ.83 లక్షలుగా తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా నిలిచింది. కాగా.. హాలీవుడ్‌కు చెందిన పమేలా అండర్సన్ 1990ల్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బార్బ్ వైర్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్, సిటీ హంటర్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. -
ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హాలీవుడ్లో సూపర్ హీరో తరహా క్యారెక్టర్స్ ఇప్పుడు బోలెడన్ని కనిపిస్తున్నాయి. అయితే 90స్ కిడ్స్ ఇష్టమైన పాత్ర అంటే చాలామంది చెప్పే పేరు 'సూపర్ మ్యాన్'. 1984 నుంచి ఈ జానర్ మూవీస్.. ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులో ఉంది?(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))డీసీ యూనివర్స్‌లోని లేటెస్ట్ మూవీ 'సూపర్ మ్యాన్'. గతనెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజైంది. మిగతా వాటితో పోలిస్తే యావరేజ్ టాక్ వచ్చింది. మన దేశంలోనూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజై ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అద్దె విధానంలో తీసుకొచ్చేశారు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఔట్ సైడ్ ఇండియాలో అందుబాటులో ఉంది.'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్) -
షూటింగ్లో తీవ్ర విషాదం.. అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూత
హార్ట్ ఎటాక్ ఈ పేరు వింటే చాలు అందరి గుండెల్లో గుబులే. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఈ సమస్య మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ అందరినీ వేధిస్తోంది. కారణం ప్రస్తుత జనరేషన్ జీవనశైలి మార్పులే కారణం కావొచ్చు. తాజాగా హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ డియోగో బోరెల్లా షూటింగ్ స్పాట్లోనే కన్నుమూశారు.ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఎమిలీ ఇన్ పారిస్ వెబ్ సిరీస్ ఐదో సీజన్‌కు డియోగో బోరెల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ ఇటలీలోని వెనిస్ నగరంలో జరుగుతోంది. ఈ ఘటన ఆగస్టు 21 గురువారం సాయంత్రం జరిగింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అతను కుప్పకూలిపోవడంతో సెట్లోని వైద్య సిబ్బంది బతికించడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ మృతితో షూటింగ్‌ను నిలిపేశారు. కాగా.. 'ఎమిలీ ఇన్ పారిస్' సీజన్ -5 డిసెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. -
రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'ఎఫ్ 1' అనే హలీవుడ్ మూవీ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. థియేటర్లలో ఉండగానే ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సన్నీ హేన్ (బ్రాడ్ పిట్) ఓ 'ఎఫ్ 1' రేసర్. కుర్రతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. కానీ ఓసారి రేసింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చావు వరకు వెళ్లి బతికి బయటపడతాడు. డాక్టర్స్ హెచ్చరించడంతో తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌ని పక్కనబెట్టేస్తాడు. డబ్బుల కోసం చిన్న రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత 'ఎఫ్ 1' రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వస్తుంది. వెళ్తాడు కూడా. ఇతడితో పాటే టీమ్‌లో మరో కుర్ర డ్రైవర్ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్) ఉంటాడు. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దశని దాటి సన్నీ.. ఎఫ్ 1 ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెబుతారు. కొందరు ఫైట్స్ కావాలంటారు. మరికొందరు రొమాన్స్ కోరుకుంటారు. కానీ చాలామంది మాత్రం సరైన కథ ఉండాలి, మనసుని తాకే ఎమోషన్స్ ఉండాలని అంటుంటారు. అలా అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ తీసిన చిత్రం 'ఎఫ్ 1'. సినిమా చూస్తున్నంతసేపు మీరు కూడా రేస్ ట్రాక్‌పైనే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఓ మంచి మూవీ చూశామనే అనుభూతిని దక్కుతుంది.ఇది రెండున్నర గంటల సినిమా. కానీ మొదటి నిమిషం నుంచే ఏ మాత్రం బోర్ కొట్టకుండా, రేస్ ట్రాక్‌పై కారు దూసుకెళ్లినంత వేగంగా వెళ్తుంది. డబ్బుల కోసం ఓ రేసింగ్ పోటీలో సన్నీ పాల్గొని గెలిచే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రూబెన్ అనే పాత్ర ఎంటరవుతుంది. ఇతడు అప్పట్లో సన్నీకి ప్రత్యర్థి రేసర్. ఇప్పుడు మాత్రం ఓ రేసింగ్ జట్టుకు యజమాని. తన టీమ్ భారీ నష్టాల్లో ఉందని, డ్రైవర్‌గా రావాలని సన్నీని అడుగుతాడు. దీంతో ఎఫ్ 1 పోటీలో పాల్గొనేందుకు సన్నీ, లండన్ వెళ్తాడు. తొలి రేసులో పాల్గొంటాడు. కానీ తన టీమ్‌లోని కుర్ర డ్రైవర్ జోషువాతో రేసింగ్ ట్రాక్‌పైనే గొడవ పెట్టుకుంటాడు. అలా కలవడం కలవడంతోనే శత్రువుల్లా మారిన వీరిద్దరూ తర్వాత తర్వాత ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. చివరకు ఒక్క రేసులోనైనా గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.30 ఏళ్ల పాటు 'ఎఫ్ 1' రేసింగ్‌కి దూరంగా ఉన్న ఓ వ్యక్తి.. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఎలా విజేత అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. ఈ లైన్ వినగానే తెలుగులో వచ్చిన 'జెర్సీ' గుర్తురావొచ్చు. అయితే నాని సినిమాలో బాధాకరమైన ముగింపు ఉంటుంది. ఇందులో మాత్రం హ్యాపీ ఎండింగే ఉంటుంది లెండి.'ఎఫ్ 1' రేసింగ్ అంటే ఏంటి? ఎలాంటి రూల్స్ ఉంటాయి? లాంటి వాటి గురించి మీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా సరే ఈ సినిమా చూడొచ్చు. చూస్తే చాలావరకు అర్థమైపోతుంది. టీవీల్లో రేసింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం. కానీ తెర వెనక ఏమేం జరుగుతుంటాయి? అనే అంశాల్ని కూడా ఇందులో చాలా చక్కగా చూపించారు. చూస్తున్నంతసేపు ఓ ప్రేక్షకుడిలా కాకుండా మీరు కూడా రేసర్ అయిపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. మొదటి నుంచి చివరివరకు మిమ్మల్ని స్క్రీన్‌కి అతుక్కుపోయాలా చేస్తుంది.ఎవరెలా చేశారు?సన్నీగా చేసిన బ్రాడ్ పిట్.. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. సినిమా చూశాక ఇతడికి ఫ్యాన్ అయిపోతారేమో? జోషువా క్యారెక్టర్ చేసిన డామ్సన్, బ్రాడ్ పిట్తో పోటీపడి మరీ నటించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఎక్కడా తగ్గకుండా ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో సైలెన్స్తోనూ వాహ్ అనిపించాడు. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవల్.ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఎఫ్ 1' మూవీ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్ కావొచ్చు. ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) -
20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ అలా చేస్తే ఎక్కడ తమ కెరీర్ డ్యామేజ్ అవుతుందోనని కంగారుపడుతుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు అలా ఓ నటి.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఏడాది తిరిగేలోపు ఓ అమ్మాయికి తల్లి కూడా అయిపోయింది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఎవరా నటి?(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న తెలుగు నటుడు.. రేటు ఎంతో తెలుసా?)ఓటీటీ ప్రియులకు 'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎల్ అలియాస్ ఎలెవన్ అనే లీడ్ రోల్ చేసిన మిల్లీ బాబీ బ్రౌన్.. పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదో సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే మిల్లీ గత కొన్నాళ్లుగా జేక్ బొంగియోవి అనే యువకుడితో డేటింగ్ చేసింది. గతేడాది అక్టోబరులో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. వివాహం జరిగేటప్పటికి మిల్లీ వయసు 20 ఏళ్లు. దీంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏడాది లోపే ఓ పాపకు తల్లి కూడా అయినట్లు స్వయంగా మిల్లీనే ప్రకటించింది. అయితే పాపని దత్తత తీసుకున్నామని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown) -
యానిమే మూవీ 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్' రిలీజ్‌కి రెడీ
ప్రపంచవ్యాప్తంగా యానిమే చిత్రాలు, సిరీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జానర్లో లేటెస్ట్గా రాబోతున్న సినిమా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్'. వచ్చే నెల అంటే సెప్టెంబరు 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ సమ్మె.. ‘మెగా’ ప్రయత్నం ఫలించేనా?)కథ విషయానికి వస్తే.. టాంజిరో కామాడో అనే పిల్లోడి ఫ్యామిలీని ఓ రాక్షసుడు చంపేస్తాడు. అతని చెల్లెలు నెజుకో రాక్షసిగా మారుతుంది. ఆమెను మళ్లీ మాములు మనిషిలా తిరిగి మార్చాలనే సంకల్పంతో టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్లో చేరతాడు. ఈ సిరీస్, మనుషులు, రాక్షసుల మధ్య జరిగే విషాదగాథ, కత్తి యుద్ధాలు, ఆకట్టుకునే కారక్టర్స్, కామెడీ సీన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని జపాన్ మరియు కొన్ని ఆసియా దేశాల్లో తప్ప ప్రపంచవ్యాప్తంగా క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్లు రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: నందమూరి కుటుంబంలో విషాదం) -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్‌గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్‌కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్‌జీపీ (APXGP) అనే టీమ్‌లో రేసర్‌గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా
ఇప్పుడంటే కాస్త తగ్గిపోయాయి గానీ అప్పట్లో హాలీవుడ్లో సూపర్ హీరో జానర్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ప్రత్యేకించి 'సూపర్ మ్యాన్' ఫ్రాంచైజీ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1984 నుంచి ఈ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు నెల అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఈ మూవీ సంగతేంటి?డీసీ యూనివర్స్‌లోని లేటెస్ట్ 'సూపర్ మ్యాన్' సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే మరీ సూపర్ అనిపించేలా టాక్ తెచ్చుకోలేకపోయింది. మన దేశంలోనూ ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టర్ జేమ్స్ గన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఫాండంగో ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.సూపర్ మ్యాన్‌తో పాటు ఈ వారం 30కి పైగా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, గ్యాంబ్లర్స్, టెహ్రాన్ చిత్రాలతో పాటు సారే జహాసే అచ్చా, అంధేరా లాంటి సిరీసులు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటే ఏమైనా సడన్ సర్ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?) -
ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 30కి పైగా లేటెస్ట్ చిత్రాలు రానున్నాయి. వీటిలో కొన్ని తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఉండగా.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ సిరీస్ తెలుగు వెర్షన్.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: శ్రీదేవి జయంతి.. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ ఈమెదే)హాలీవుడ్లో డైనోసార్లు, ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో సినిమాలు, సిరీసులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్నిరోజుల క్రితమే 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్' అనే మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు 'ఏలియన్: ఎర్త్' పేరుతో తీసిన ఓ సిరీస్ సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రావడం విశేషం.కొన్నాళ్ల క్రితం రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. 2120 సంవత్సరం. భూమ్మీదకు ఏలియన్స్ వస్తారు. మరోవైపు శాస్త్రవేత్తలు వాటిని కట్టడి చేసేందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. మరి ఈ సమరంలో ఎవరు పైచేయి సాధించారు? చివరకు ఏమైందనేదే సిరీస్ స్టోరీలా అనిపిస్తుంది. ప్రస్తుతానికి రెండు ఎపిసోడ్స్‌ని హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అదిరిపోయిందని రివ్యూలు కూడా వస్తున్నాయి. ఆసక్తి ఉంటే ఈ సిరీస్‌పై లుక్కేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన 'జురాసిక్' సినిమా
హాలీవుడ్లో డైనోసార్లు ఉండే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా జురాసిక్ పార్క్ పేరుతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఆ జానర్లో తీసిన ఓ చిత్రం రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చింది. ఓకే పర్లేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. మన దేశంలోనూ ప్రేక్షకులు మూవీని చూశారు. ఇప్పుడు ఈ చిత్రం సరిగ్గా నెల రోజులు అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్'. స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్ చేయగా, గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన 'జురాసిక్ వరల్డ్: డొమినియన్'కు సీక్వెల్‌గా తీసిన చిత్రం ఇది. అయితే అది ఆకట్టుకోలేకపోయింది. ఇది కూడా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. దీంతో నెలరోజులు తిరగకుండానే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో వీడియో ఆన్ డిమాండ్(అద్దె విధానంలో) అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)'జురాసిక్ వరల్డ్ రీబర్త్' విషయానికొస్తే.. గుండె జబ్బులు సహా మనిషి ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులు నయమయ్యేలా చేసే శక్తి.. మూడు అరుదైన డైనోసార్ల రక్తంతో చేసిన ఔషదానికి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. కానీ బతికున్న వాటి నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తేనే అది ప్రయోగానికి ఉపయోగపడుతుంది. దీంతో అడ్వెంచర్ ఆపరేషన్స్ చేసే జోరా బెన్నెట్‌తో (స్కార్లెట్ జాన్సన్) మార్టిన్ (రూపర్ట్ ఫ్రెండ్) అనే ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి ఒప్పందం చేసుకుంటాడు.ఈక్వెడార్‌లో మాత్రమే సంచరించే అరుదైన, డేంజరెస్ డైనోసార్లని గుర్తించి, వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్ హెన్రీ (జొనాథన్ బెయిలీ), బోటు యజమాని, సాహసీకుడు డంకన్ (మహర్షలా అలీ) అందరూ కలిసి ప్రయాణిస్తారు. తర్వాత ఏమైంది? డైనోసార్ల నుంచి రక్తం సేకరించారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్) -
ప్రాణాంతకమైన గేమ్.. ఆ చేయి పట్టుకుంటే దెయ్యం వచ్చేస్తుంది!
కొన్ని ఆటలు చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా సరే ఓసారి ఆడి చూస్తే పోలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులోనూ దెయ్యాన్ని చూడొచ్చు అనగానే ఓ పక్క ఎగ్జయిట్ అవుతూ, మరో పక్క భయపడుతూనే రంగంలోకి దిగుతారు. ఒక్క లైన్లో చెప్పాలంటే టాక్ టు మి సినిమా (Talk To Me Movie Review) కథ ఇదే! ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గర రాతి చేయి ఉంటుంది. కథఓ క్యాండిల్ వెలిగించి.. ఆ చేయిని పట్టుకుంటే చాలు దెయ్యాలు కనిపిస్తాయి. కనిపించడంతో ఆగవు. చేయి పట్టుకున్న వ్యక్తి శరీరంలోకి కూడా వెళ్తాయి. చేయిని వదిలేసి, క్యాండిల్ ఆర్పేసినప్పుడు ఆ దెయ్యం ఒంట్లో నుంచి తిరిగి వెళ్లిపోతుంది. దెయ్యం శరీరంలోకి చేరినప్పుడు ఎవరేం చేస్తున్నారనేది సరదాగా వీడియోలు షూట్ చేస్తూ ఉంటారు మిగతా ఫ్రెండ్స్. అప్పటివరకు వచ్చిన దెయ్యాలేవీ పెద్దగా భయపెట్టకపోవడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దీంతో చీకటి అంటేనే భయపడే ఓ బాలుడు కూడా ధైర్యం చేసి తనూ గేమ్ ఆడతానంటాడు.అందుకు అతడి అక్క ఒప్పుకోదు. అప్పటికే ఆమె ప్రియుడి శరీరంలోకి దెయ్యం ప్రవేశించి చేసిన పిచ్చిపనిని చూసి ఆమె బిక్కచచ్చిపోతుంది. ఇదేమంత సరదా గేమ్ కాదని, ఇక ఆపేయమని వారిస్తుంది. అయినా పట్టించుకోకుండా చిన్నపిల్లాడితో గేమ్ ఆడిస్తారు. ఈసారి గేమ్ వైల్డ్‌గా మారుతుంది. అతడు తన కనుగుడ్లు పీకేసుకుంటాడు. తలను టేబుల్‌కేసి బాదుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం ఏరులై పారుతుండటంతో అందరూ భయంతో వణికిపోతారు. ఎలా ఉంది?దీంతో అందరూ ఎలాగోలా ఆ రాతి చేతి నుంచి బాలుడి చేతిని విడిపిస్తారు. తర్వాతేం జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! దెయ్యాన్ని ఆహ్వానించే ఆటలాడితే ఏం జరుగుతుందనేది చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటిదే! కాకపోతే కథ ఎక్కడా దారితప్పకుండా స్పీడ్‌గా వెళ్లిపోతూ ఉంటుంది. అనవసరమైన సీన్లు ఉండవు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. అయితే మరీ ఎక్కువగా భయపెట్టే సన్నివేశాలు లేవు.టాక్ టు మి.. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ. 2023లో రిలీజైన ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. టాక్ టు మి 2 కథ ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. 'టాక్ టు మి' మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. దీనికి ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్ ఉంది. -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ హారర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. జాంబీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ డాని బోయెల్ దర్శకత్వం వహించాడు. జూన్‌లో ఇది థియేటర్లలోకి రాగా అలా నెల దాటిందో లేదో ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ హారర్ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.2002లో రిలీజైన '28 డేస్ లేటర్', 2007లో విడుదలైన '28 వీక్స్ లేటర్' చిత్రాలకు సీక్వెల్ '28 ఇయర్స్ లేటర్'. దీన్ని రెండు భాగాలుగా తీశారు. ఇందులోని తొలి పార్ట్ జూన్‌లో రిలీజైంది. కాకపోతే థియేటర్లలో అనుకున్నంతగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయింది. మరి అందుకేనేమో ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీడియో అన్ డిమాండ్(రెంట్ విధానంలో) అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో ఈ మూవీ చూడొచ్చు. ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్)'28 ఇయర్స్ లేటర్' విషయానికొస్తే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రేజ్ వైరస్ మహమ్మారిలా వ్యాపించేసరికి బ్రిటన్ ప్రజలందరూ జాంబీలుగా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు.. ఓ ఐలాండ్‌లో బతుకుతుంటారు. మరి అక్కడికి కూడా జాంబీలు ఎలా వచ్చేశారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. 'ఓపెన్‌హైమర్' నటుడు కిలియన్ మర్ఫీ.. జాంబీ పాత్ర చేశాడు. ఈ మూవీకి రెండో భాగం '28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్'.. వచ్చే జనవరిలో థియేటర్లలోకి రానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి దాదాపు 25కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. 3 బీహెచ్‌కే, తమ్ముడు, నెట్వర్క్, జిన్ ద పెట్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్ప్రైజ్ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?) -
63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?
సినిమా సెలబ్రిటీల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి లాంటివి చాలా సాధారణంగా వినిపిస్తుంటయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మిగతా వాటి సంగతేమో గానీ ఇప్పుడు 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమలో పడిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా హీరోహీరోయిన్? ఏంటి సంగతి?టాప్ గన్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్.. ఆరోసారి ప్రేమలో పడ్డాడనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకే మూడుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు కూడా ఇచ్చేసిన ఇతడు.. తర్వాత ఒకామెతో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 37 ఏళ్ల అనా డీ అర్మాస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా టామ్ క్రూజ్, అనా డి అర్మాస్‌తో కలిసి ఉంటున్నారని సమాచారం. ఈ పుకార్లను నిజం చేస్తూ తాజాగా వెర్మోంట్లో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. వెర్మోంట్ ఏరియాలో అర్మాస్కి ఓ ఇల్లు ఉంది. అందులోనే టామ్, అర్మాస్ కలిసి ఉన్నారని హాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమేంటి? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)టామ్ క్రూజ్ ఇప్పటికే మూడసార్లు పెళ్లి చేసుకున్నాడు. 1987లో మిమీ రోజర్స్‌ని పెళ్లి చేసుకోగా.. మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. మొదటగా విడిపోయిన 1990లోనే నికోల్ కిడ్మన్ని వివాహమాడాడు. పదకొండేళ్లు కాపురం చేసిన తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత ఐదేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న టామ్.. 2006లో కేట్ హోమ్స్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆరేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చేశాడు. ఇవే కాకుండా అమెరికన్ నటి హీథర్ లాక్లియర్తో, సింగర్ చెర్తో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ మెంటైన్ చేశాడు.ఇప్పుడు అనా డి అర్మాస్‌తో ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. టామ్ మాత్రమే కాదు అర్మాస్ కూడా గతంలో ఓసారి పెళ్లి చేసుకుంది. 2011లో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్తో ఒక్కటి కాగా.. రెండేళ్లకే అతడికి విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి పెళ్లి చేసుకోని అర్మాస్.. ఇప్పుడు టామ్‌తో చెట్టాపట్టేలేసుకుని తిరుగుతోంది. రీసెంట్గా ఒయాసిస్ మ్యూజిక్ ఈవెంట్‌కి వీళ్లిద్దరూ కలిసి హాజరయ్యారు. మరి ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు) -
జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 ట్రైలర్ చూశారా?
సినీ ప్రియుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న విజువల్ వండర్ అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2022లో విడుదలైన అవతార్-2.. ది వే ఆఫ్ వాటర్ సైతం ప్రేక్షకులను అలరించింది. ఈ అవతార్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. దీంతో ఈ ఏడాదిలో మరో సినిమాతో జేమ్స్ కామెరూన్ రెడీ అయిపోయారు. అవతార్ సిరీస్‌లో భాగంగా అవతార్.. ఫైర్ అండ్ యాష్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అవతార్ పార్ట్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ట్రైలర్ చూస్తుంటే మరింత మరో అద్భుతమైన విజువల్ వండర్‌గా రికార్డ్ సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. -
పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్
ఇండియన్ సినిమా రేంజ్ మారిపోతోంది. ప్రపంచమంతా ఇండియన్ సినిమావైపు చూస్తోంది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, జేజే అబ్రామ్స్, డేనియల్ క్వాన్ వంటి... హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్‌మేకర్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మెచ్చుకున్న విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేము. మన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చిన ఆస్కార్ అవార్డునూ మర్చిపోలేము. ఈ ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ రేంజ్‌కి తగ్గ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. అలా పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రేంజ్లో సినిమాలు చేస్తున్న కొందరు హీరో–దర్శక–నిర్మాతలపై ఓ లుక్ వేయండి.ఇంటర్నేషనల్ ప్లాన్‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ ఓ కీలక పాత్రలో నటిస్తారని, అతనిది మహేశ్‌బాబు తండ్రి పాత్ర అనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనుంది. ఇంతవరకు బాగానే ఉంది.కానీ... ప్రతిసారీ తన సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనో లేదా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాతనో తన సినిమా గురించి ఓ మీడియా సమావేశం నిర్వహించి, ఆ సినిమా కథ క్లుప్తంగా చెబుతారు రాజమౌళి. ఆ సమావేశం లోనే నటీనటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ వివరాలు ఉండేవి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. కానీ మహేశ్‌బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి ఈ పంథాను ఫాలో కాలేదు. ఆ మాటకొస్తే... ఇప్పటివరకు రాజమౌళి–మహేశ్‌బాబు సినిమా గురించిన పూర్తి స్థాయి అధికారిక ప్రకటనే రాలేదు. మరి... దీని వెనక కారణం ఏంటో రాజమౌళికే తెలియాలి.ఆస్కార్ ప్లాన్: 95వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంపిక అవుతుందని సినిమా లవర్స్ ఊహించారు. కానీ ఈ విభాగంలో భారతదేశం తరఫున ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో (ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’)ను ఎంపిక చేసింది. కానీ ‘లాస్ట్ ఫిల్మ్ షో’ సినిమాకు ఆస్కార్ రాలేదు. అయితే ఆస్కార్ కన్సిడరేషన్కు ‘ఆర్ఆర్ఆర్’ను పంపి, ఆస్కార్ కమిటీ రూల్స్‌ను ఫాలో చేసి, మొత్తానికి ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాజమౌళి అండ్ టీమ్ నిలపగలిగింది.ఓ దశలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో లీడ్ యాక్టర్స్‌గా చేసిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు కూడా బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేషన్స్ వస్తాయేమో అన్నట్లుగా హాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇది జరగలేదు కానీ... ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. కానీ ఈసారి ఆ తరహా ఇబ్బందులు ఏవీ రాకూడదని, ఓ హాలీవుడ్ ప్రముఖప్రోడక్షన్ సంస్థతో భాగస్వామ్యం కావాలని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారట. ఇలా ఓ హాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థతో భాగం అయితే, తమ సినిమా కూడా ఇంగ్లిషవిదేశీ స్పిరిట్‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ అవుతోంది. కానీ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేయనున్న ‘స్పిరిట్’ మాత్రం భారతీయ భాషలతో పాటు జపాన్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకాప్రారంభం కాలేదు. ప్రస్తుతం ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ‘స్పిరిట్’ సినిమా షూటింగ్నుప్రారంభిస్తారు ప్రభాస్. ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇందులో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తారు. కొరియన్ యాక్టర్ డాన్ లీ ‘స్పిరిట్’ సినిమాలో విలన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రణయ్ వంగా రెడ్డి, భూషణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.గాడ్ ఆఫ్ వార్‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో లీడ్ రోల్ చేశారు) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు. ఈ గుర్తుంపుకి తగ్గట్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మైథాలజీ సినిమా రానుంది.గాడ్ ఆఫ్ వార్‌గా చెప్పుకునే కుమారస్వామి నేపథ్యంలో సాగే ఈ మైథాలజీ సినిమాను ‘రామాయణ’ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని, వచ్చే ఏడాది షూటింగ్ప్రారంభం అవుతుందని నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి అదే స్థాయిలో రిలీజ్‌ను ప్లాన్ చేస్తారు మేకర్స్. పైగా ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ వెర్షన్ థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఇది కూడా ఎన్టీఆర్‌కు బాగా కలిసొచ్చే అంశమే. ఇక హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.తెలుగు హీరో వర్సెస్ హాలీవుడ్ విలన్హీరో అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రానుంది. ఈ సినిమా కోసం ఓ సరికొత్త లోకాన్నే సృష్టిస్తున్నారట అట్లీ. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కనిపించే మాదిరి ఈ చిత్రంలోనూ కొన్ని విచిత్రమైన జంతువులు, జీవరాసులు కనిపిస్తాయట. ఆ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సినిమాను సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని, తాత–తండ్రి–ఇద్దురు కొడుకులు... ఇలా విభిన్నమైన పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఐదుగురు హీరోయిన్స్ కూడా ఉంటారట. వీరిలో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయిపోయారు. మిగిలిన హీరోయిన్స్ పాత్రలకు రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్య శ్రీ బోర్సే, ఆలియా ఎఫ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.అలాగే ఈ సినిమాలోని విలన్ పాత్రల కోసం విన్ డిజీల్, ది రాక్...వంటి హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా అయితే తమ సినిమాను హాలీవుడ్ రేంజ్లో విడుదల చేసేటప్పుడు బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దాదాపు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఒకేసారి భారతీయ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేసేలా సన్నాహాలు మొదలు పెట్టారట అట్లీ అండ్ టీమ్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ఆ మధ్య ముంబైలోప్రారంభమైంది. చిన్న బ్రేక్ రావడంతో అల్లు అర్జున్ వెకేషన్లో భాగంగా విదేశాలకు వెళ్లారట. వచ్చిన తర్వాత తిరిగి షూటింగ్ ఆరంభిస్తారు.రామాయణరూ. నాలుగువేల కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ (రెండు భాగాలు కలిపి) సినిమాను నిర్మిస్తున్నామని, ఈ చిత్రంతో ప్రపంచ సినిమా అంతా భారతదేశం వైపు చూస్తుందని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని ఈ చిత్ర నిర్మాత, డీఎన్ఈజీ (డబుల్ నెగటివ్) స్టూడియో అధినేత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నమిత్ మల్హోత్రా వ్యాఖ్యలను బట్టి నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ఊహించవచ్చు. పైగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్లతో పాటు హాలీవుడ్లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోటరీ, గై నోరిస్, హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసినప్రోడక్షన్ డిజైనర్లు రవి బన్సాల్, రాంసే ఏవరీ వంటి బలమైన సాంకేతిక నిపుణులతో ‘రామాయణ’ రూపొందుతోంది.ఇక బడ్జెట్ పరంగా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం‘రామాయణ’నే అవుతుంది. ఇంకా ‘డీఎన్ఈజీ’ స్టూడియో గ్రాఫిక్ వర్క్ చేసిన సినిమాల్లో 8 చిత్రాలు ఆస్కార్ అవార్డులను సాధించాయి. ఇవన్నీ ‘రామాయణ’ సినిమా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ హిందీ ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది.‘రామాయణ పార్ట్ 1’ 2026 దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ సినిమా 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఇటీవలేసూపర్ హీరోబాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సూపర్ హీరో సినిమా రానుంది. కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసిన తర్వాత, ఆమిర్ ఖాన్‌తో ఈ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్ కనగరాజ్. కాగా ఈ సూపర్ హీరో సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేస్తామని, రిలీజ్ కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుందని ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్.2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ప్రారంభం కానుంది. 2028లో విడుదలయ్యే చాన్సెస్ ఉన్నాయి. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా ఆమిర్ ఖాన్ మూడు భాగాలుగా ఓ సినిమాలో నటించి, నిర్మించనున్నారు. ఈ ఆగస్టు నుంచి ఈ సినిమానుప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది ఆమిర్ ప్లాన్ అని బాలీవుడ్ టాక్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఆయా సినిమాల హీరోలు–దర్శక–నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
తెలుగు సినిమాలపై విదేశీ జంట క్రేజ్.. ఈ సాంగ్ చూశారా?
తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వస్తోంది. మన టాలీవుడ్ చిత్రాలకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. జపానీయులైతే మన చిత్రాలను తెగ చూసేస్తారు. జపాన్‌కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తెలుగు కూడా నేర్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతలా మన సినిమాలకు ఫారినర్స్ ఫిదా అయిపోయారు. ఇక డేవిడ్ వార్నర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మేనరిజంతో రీల్స్ చేస్తూ అలరించిన డేవిడ్ వార్నర్.. నితిన్ మూవీ రాబిన్హుడ్తో ఏకంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అంతలా మన సినిమాలు, పాటలకు విదేశీ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోవాల్సిందే.గతంలో సంక్రాంతి వస్తున్నాం సాంగ్‌తో అలరించిన విదేశీ జంట.. మరోసారి తెలుగు పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ జంట మరోసారి తెలుగు సాంగ్‌తో ప్రేక్షకులను అలరించింది. స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ అనే నటుడు తన సతీమణితో కలిసి మరో తెలుగు పాటకు డ్యాన్స్ చేశారు.అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా, ఐశ్వర్య అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతా పయనం. ఈ సినిమాలో 'ఏ ఊరికెళ్తావే పిల్లా..నువ్వు ఏ ఊరికెళ్తావే పిల్లా.. మా ఊరు రావే పిల్లా' అనే పాటను రీ క్రియేట్ చేశారు. తెలుగు వంటకాలను పరిచయం చేస్తూ విదేశీ జంట చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు ఆడియన్స్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. అర్జున్ సర్జా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతా పయనం. అర్జున్ కుమార్తె, హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ మెయిన్ లీడ్ రోల్లో నటించింది. సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
ఏఐ ప్రపంచం మన మధ్యకు వస్తే ఏమవుతుంది.. ఆసక్తిగా ట్రైలర్
హలీవుడ్లో వచ్చిన ట్రాన్ సిరీస్ ఇప్పటివరకు అభిమానుల విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌లో మరో చిత్రం అలరించేందుకు వస్తోంది. ఏఐ ప్రోగ్రామ్ మన ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మానవుల మధ్యకు ఏఐ ప్రపంచం వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ చిత్రంలో చూపించనున్నారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ట్రాన్ సిరీస్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ట్రైన్ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడం విశేషం. 1982 సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రాన్, ఆ తర్వాత 2010 సీక్వెల్‌ను రూపొందించారు. వాల్డ్ డిస్నీ స్డూడియోస్ నిర్మించిన ఈ సిరీస్ చిత్రాలు అభిమానులను అలరించాయి.ఈ సినిమాకు జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. అకాడమీ అవార్డు విన్నర్ జారెడ్ లేటో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, హసన్ మిన్హాజ్, జోడీ టర్నర్-స్మిత్, ఆర్టురో కాస్ట్రో, కామెరాన్ మోనాఘన్, గిలియన్ ఆండర్సన్, జెఫ్ బ్రిడ్జెస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 10న ఇంగ్లీష్‌తో పాటు ఇండియన్ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.This October, they are coming to our world.Watch the brand-new trailer for Tron: Ares and experience it in theaters, filmed for IMAX, October 10. pic.twitter.com/a2z8Pnn3Ei— Walt Disney Studios (@DisneyStudios) July 17, 2025 -
ఇదేంటి మావ.. అవీ టిక్కెట్లా.. హాట్ కేకులా.. అలా బుక్ చేశారేంటి!
సినిమాల రిలీజ్‌కు నెల రోజుల ముందే హైప్ క్రియేట్ అవ్వడం కామన్. అభిమాన హీరో చిత్రం వస్తోందంటే ఫ్యాన్స్‌లో ఆ మాత్రం ఉత్సాహం, ఆసక్తి ఉంటుంది. కానీ విడుదలకు ఏడాది ఉండగానే ఏ సినిమాకైనా అంత క్రేజ్ ఉంటుందా? ఆ ఇంకా ఏడాది ఉంది కదా అని అనుకుంటారు. కానీ హాలీవుడు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు మాత్రం ఏడాది ముందే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంటే ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఓపెన్ హైమర్ మూవీతో అలరించిన క్రిస్టోఫర్ నోలన్ మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఆయన డైరెక్షన్లో వస్తోన్న ది ఒడిస్సీ అనే చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ అవుతోంది. కానీ.. సరిగ్గా ఏడాదికి ముందే ఈ మూవీ టిక్కెట్లకు బుకింగ్స్ ప్రారంభించారు. ఇంకా ఏడాది ఉంది కదా అప్పుడే రిలీజ్ చేశారేంటి? అనుకున్నారనుకుంటే పొరపాటే.. అవీ అట్ట బుకింగ్ ఓపెన్ కాగానే.. గబుక్కున్న మూడే మూడు నిమిషాల్లో టికెట్స్ అన్ని బుక్కైపోయాయి. ఇది చాలు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు క్రేజ్ గురించి చెప్పడానికి. ఈ విషయాన్ని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ వంటి నగరాల్లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. గురువారం సాయంత్రం ఓపెన్ అవ్వగానే నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయి. కొద్ది నిమిషాలకే టిక్కెట్లు పూర్తిగా బుకింగ్ కావడంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా మూడు నిమిషాల్లో టిక్కెట్స్ అమ్ముడైనట్లు రాసుకొచ్చాడు. మరో వ్యక్తి లింకన్ స్క్వేర్ థియేటర్లో ది ఒడిస్సీ టికెట్లు 3 నిమిషాల కంటే తక్కువ సమయంలో అమ్ముడైనట్లు పోస్ట్ చేశారు. లాస్ ఏంజిల్స్‌లోని కొన్ని థియేటర్లలో బుకింగ్ ఓపెన్ అయిన ఒక నిమిషం లోపు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చరిత్రలో ఏ చిత్రానికి ఇంత వేగంగా టికెట్స్ బుకింగ్స్ కాలేదని అందరూ అవాక్కవుతున్నారు.అమెరికన్ ఫిల్మ్‌మేకర్ క్రిస్టోఫర్ నోలన్ తాజాగా చేస్తున్న చిత్రం ‘ది ఒడిస్సీ’. మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హతావే, జెండయా వంటి హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. గ్రీకు పురాతన ఇతిహాస సాహిత్యాల్లో ప్రముఖమైన వాటిల్లో ఒకటిగా చెప్పుకునే హోమర్ రాసిన ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను నోలన్ తెరకెక్కిస్తున్నారు. ట్రోజన్ యుద్ధం అనంతరం తన భార్య పెనెలోప్‌ను కలిసే క్రమంలో ఇథాకా గ్రీసు రాజు అధిగమించిన సమస్యలు, ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉండనుంది. ఎమ్మా థామస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నోలన్ కూడా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Pubity (@pubity)


