
సినిమా సెలబ్రిటీల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి లాంటివి చాలా సాధారణంగా వినిపిస్తుంటయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మిగతా వాటి సంగతేమో గానీ ఇప్పుడు 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమలో పడిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా హీరోహీరోయిన్? ఏంటి సంగతి?
టాప్ గన్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్.. ఆరోసారి ప్రేమలో పడ్డాడనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకే మూడుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు కూడా ఇచ్చేసిన ఇతడు.. తర్వాత ఒకామెతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇప్పుడు 37 ఏళ్ల అనా డీ అర్మాస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా టామ్ క్రూజ్, అనా డి అర్మాస్‌తో కలిసి ఉంటున్నారని సమాచారం. ఈ పుకార్లను నిజం చేస్తూ తాజాగా వెర్మోంట్‌లో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. వెర్మోంట్ ఏరియాలో అర్మాస్‌కి ఓ ఇల్లు ఉంది. అందులోనే టామ్, అర్మాస్ కలిసి ఉన్నారని హాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమేంటి? అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)
టామ్ క్రూజ్ ఇప్పటికే మూడసార్లు పెళ్లి చేసుకున్నాడు. 1987లో మిమీ రోజర్స్‌ని పెళ్లి చేసుకోగా.. మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. మొదటగా విడిపోయిన 1990లోనే నికోల్ కిడ్మన్‌ని వివాహమాడాడు. పదకొండేళ్లు కాపురం చేసిన తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత ఐదేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న టామ్.. 2006లో కేట్ హోమ్స్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆరేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చేశాడు. ఇవే కాకుండా అమెరికన్ నటి హీథర్ లాక్‌లియర్‌తో, సింగర్ చెర్‌తో కొన్నాళ్ల పాటు రిలేషన్‌షిప్ మెంటైన్ చేశాడు.
ఇప్పుడు అనా డి అర్మాస్‌తో ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. టామ్ మాత్రమే కాదు అర్మాస్ కూడా గతంలో ఓసారి పెళ్లి చేసుకుంది. 2011లో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్‌తో ఒక్కటి కాగా.. రెండేళ్లకే అతడికి విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి పెళ్లి చేసుకోని అర్మాస్.. ఇప్పుడు టామ్‌తో చెట్టాపట్టేలేసుకుని తిరుగుతోంది. రీసెంట్‌గా ఒయాసిస్ మ్యూజిక్ ఈవెంట్‌కి వీళ్లిద్దరూ కలిసి హాజరయ్యారు. మరి ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్తారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)
