
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది చెబుతుంటారు. కానీ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీలో విలన్‌గా చేసిన వెంకటేశ్ అలియాస్ వెంకీ మాత్రం ఇడ్లీ కొట్టుతో ఫేమస్ అయ్యాడు. నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించాడు. అయితేనేం ఇతడికి గుర్తింపు తెచ్చింది ఏది అటే ఇడ్లీనే. ఇప్పటికీ ఆ షాపులో అప్పుడప్పుడు సేల్ చేస్తుంటాడు. ఇంతకీ ఎవరీ వెంకటేశ్? ఏంటా ఇడ్లీ స్టోరీ?
కేరళకు చెందిన వెంకటేశ్ వీపీ. ఓ రియాలిటీ షోతో కెరీర్ ప్రారంభించాడు. అయితే అంతకు ముందు బతుకు తెరువు కోసం.. త్రివేంద్రంలో రోడ్ సైడ్ ఓ ఇడ్లీ స్టాల్ నడిపేవాడు. ప్రత్యేకించి ఇడ్లీలు మాత్రమే రకరకాల వెరైటీలు దొరుకుతాయి. రీల్స్ వల్ల ఈ 'సుడా సుడా ఇడ్లీ' స్టాల్ బాగానే ఫేమస్ అయింది. ఓవైపు నటుడిగా పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నా సరే తన ఇడ్లీ కొట్టుని మాత్రం మర్చిపోలేదు.
(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)

ఇప్పటికీ సినిమా షూటింగ్స్ లేని టైంలో వెంకటేశ్.. తన స్టాల్‌లో కస్టమర్లకు ఇడ్లీలు సర్వింగ్ చేస్తూ కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా 'కింగ్డమ్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరగ్గా.. అందరి స్పీచ్‌లు ఏమో గానీ వెంకటేశ్ వీపీ తనదైన మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్‌లో తొలి సినిమా ఇది. అయితేనేం తెలుగులో మాట్లాడుతూ అదరగొట్టేశాడు. అనిరుధ్, విజయ్ దేవరకొండ కూడా ఇతడు మాట్లాడుతుంటే నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
అలా మనోడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇతడికి చెందిన ఇడ్లీ కొట్టు గురించి బయటకొచ్చింది. గతంలో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలని మన నెటిజన్లు చూస్తున్నారు. ఇతడిని మెచ్చుకుంటున్నారు. మరి 'కింగ్డమ్' మూవీతో ఇతడి దశ తిరుగుతుందేమో చూడాలి? ఒకవేళ లక్ కలిసొస్తే మాత్రం టాలీవుడ్‌లో సెటిలైపోవచ్చు.
(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్)