
సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్‌కి కౌంటర్స్ ఇస్తూనే ఉంటారు. రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'పై రెచ్చిపోయారు. పవన్ చేతకానితనం వల్లే ఈ మూవీ ఆలస్యమైందని, ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్‌కి వచ్చుంటే రెండేళ్ల క్రితమే ఈ చిత్రం రిలీజ్ అయ్యేండేది కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఇలా రెచ్చిపోయారు.
(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్)
'మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడుతాం. చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? ఎవరికి అమ్ముతున్నారు. ఇంతకు ముందు ఏఎన్నార్, ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయంటే ఎదురుచూసేవాళ్లం. కానీ మీరు చేస్తున్నది నమ్మకద్రోహం కాదా?'
'బాహుబలి లాంటి సినిమా రాజమౌళి తీస్తే అది ఎలా ఆడింది? ట్రెండ్ సెట్ చేసింది. అదే మేము చేస్తున్నామని చెప్పి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. ఎలాంటి దోపిడి చేస్తున్నారు? ఎవరిని దోపిడి చేస్తున్నారు? మీ అభిమానుల్నే కదా! మీ సినిమాలో ఆ రేంజు వీఎఫ్ఎక్స్ ఉన్నాయా? కథ ఉందా? నిజాయతీ ఉందా? నాలుగైదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది. మీ చేతకాని తనంతో కదా?'
'కథల్ని మార్చి, అందులో మీ రాజకీయ సిద్ధాంతాల్ని రుద్ది, దాన్ని ఓ సినిమాగా చేయాలని వచ్చి.. ఇంత కష్టపడ్డాం, ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అని అంటున్నారు. ఈ పదిరోజులు ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్స్‌కి నిజాయితీగా వచ్చుంటే రెండేళ్ల ముందే రిలీజయ్యేది కదా ఈ సినిమా!'
'మహేశ్ బాబు-జూ.ఎన్టీఆర్ గతంలో ఓ వేదికపై ఉన్నప్పుడు ఏం చెప్పారు వాళ్లు ఫ్యాన్స్‌కి? మేమిద్దరం ఫ్రెండ్సే.. మేం మేం బాగానే ఉంటాం. మా కోసం మీరు కొట్టుకోవద్దు అని అన్నారు. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు.. తిరిగి కొట్టమంటాడా? నిన్ను చొక్కా చించుకుని ప్రేమించేవాళ్లు.. నిన్ను ప్రేమిస్తుంటే వాళ్లని నీ సైనికులు అనుకుంటున్నావా? ఇది నాన్సెన్స్. పవన్ ఫ్యాన్స్‌కి బాడీ పార్ట్స్ తప్పితే వేరేది తెలియదు. వాళ్లని నువ్వు కరెక్ట్‌గా ఉండమని చెప్పవు. కానీ వేరే ఎవడైనా ట్రోల్ చేస్తే మాత్రం గట్టిగా ట్రోల్ చేయమంటావా? అసలు మనసాక్షి లేని ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడతాం. ఇది కోపం కాదు నా ఆవేదన'
'నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి.. అది జనాలకు నచ్చకపోతే నేను అర్థం చేసుకుంటా. ఒకవేళ ఫ్లాప్ అయితే అది ప్రయోగం అనుకోవచ్చు. కానీ నీ అహంకారం వల్లే సినిమా ఐదేళ్లకు వచ్చింది. ఒక డైరెక్టర్ అనుకున్న పరిస్థితిని మీరు కల్పించారా? ఎవరిని మోసం చేస్తావు? ఒక నిజాయితీ ఉండాలి కదా. నీకు సిగ్గు అనిపించడం లేదా? ఇలాంటి ద్రోహానికి రూల్స్ లేవు కాబట్టి తప్పించుకుంటున్నారు. నేను పాలిటిక్స్ మాట్లాడుతాను కానీ నా సినిమాల్లో మాట్లాడను. అది వేరు ఇది వేరు కదా. చివరికి ఎవరిని కోల్పోతున్నావు? నిన్ను ప్రేమించేవాళ్లనే దోపిడి చేయడం కరెక్ట్ కాదు' అని ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం)