breaking news
Prakash Raj
-
ప్రకాష్ రాజ్‌ను చేపలకు ఆహారంగా వేస్తా: బీజేపీ ఎమ్మెల్యే
ఉడుపి: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కళాకారుల మదిలో విషబీజాలు నాటడం మానుకోవాలని, లేనిపక్షంలో అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనలో పాల్గొన్నవారు అసలైన విద్యార్థులు కారనీ, వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.ఇలాంటి రాజకీయాలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వీ. సునీల్ కుమార్‌తో సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు 'ఇండియా' కూటమి నేతలైన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితరుల ముఖాలతో ఉన్న బొద్దింకల ప్లకార్డులపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్! -
ప్రియమైన బొద్దింకలారా కంగ్రాట్స్.. CJPకి ప్రకాష్ రాజ్ విషెస్
-
నటుడు ప్రకాష్ రాజ్‌కు భూ ఆక్రమణల నోటీసు
వాగమన్: కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాగమన్‌లోని వరాట్టుమెడులో రెవెన్యూ అధికారులు భారీ ఆక్రమణలను తొలగించారు. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూమిలో అక్రమంగా నిర్మించిన హోమ్‌స్టే భవనం, కేఫెటేరియా, ఇనుప కంచెలు, రాతి రిటైనింగ్ గోడలను అధికారులు నేలమట్టం చేశారు. అలాగే టార్పాలిన్‌తో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనును కూడా తొలగించారు. ఈ భూమిని మొదట వరాట్టుమెడుకు చెందిన ప్రతీష్ ఆక్రమించుకోగా, ఆ తర్వాత దానిని సెబిన్ ఆంటోనీకి బదిలీ చేశారు. వరాట్టుమెడు తహసీల్దార్ జోజో వీ సెబాస్టియన్, భూసేకరణ తహసీల్దార్ ఆర్ హరీంద్రనాథ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యుడు ఎస్. రాజ్‌కుమార్, ల్యాండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యుడు శశికుమార్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.ప్రకాష్ రాజ్ భూమిపై కూడా..ఇదే ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా కొంత స్వంత భూమి (పట్టా భూమి) ఉంది. అయితే ఆయన భూమికి ఆనుకుని ఉన్న కొంత భూమికి సరైన పట్టాలు లేవని వరాట్టుమెడు తహసీల్దార్ తెలిపారు. ప్రకాష్‌రాజ్ సమక్షంలో ఆ భూమిని సర్వే చేసి, సరిహద్దులను గుర్తించేందుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయనకు ఇప్పటివరకు నోటీసులు అందలేదని, ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని అధికారులు తెలిపారు. వరాట్టుమెడులో ప్రతీష్ తండ్రి దురైరాజ్, నానమ్మ సుబ్బయ్య పేరున రెండున్నర ఎకరాల చట్టబద్ధమైన భూమి ఉంది. అయితే దానికి ఆనుకుని ఉన్న దాదాపు 10 ఎకరాల భూమిని ఆక్రమించుకుని అక్కడ వ్యవసాయం కూడా సాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: పాక్‌కు భారత్ గట్టి కౌంటర్.. ఉగ్రవాదంపై నిలదీత! -
కాక్రోచ్ పార్టీకి మద్దతుగా ప్రకాష్ రాజ్
-
నేను మౌనంగా లేను, ఇది ఆరంభం మాత్రమే.. ప్రకాష్ రాజ్ సంచలన వీడియో
-
వాళ్లకి నా సమాధానం ఇదే: ప్రకాశ్‌రాజ్
ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకి తన సమాధానం ఇదేనంటూ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ మరో ట్వీట్ చేశారు. వీడియో రూపంలో మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతును ఆపలేరని చెప్పారు.‘‘మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నాను.. అమ్ముడుపోయిన ఛానల్స్ కట్టుకథలు, అబద్ధాలు వింటున్నాను. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. ప్రపంచమంతా మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. దిగజారడంలో మీకు మీరే సాటి అని గర్వంతో దిగజారకండి. మీరు ఎంత అరిచినా ప్రశ్నంచే గొంతును ఆపలేరు’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుగా మారి ఎన్నో అంశాలపై స్పందిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై ఆయన తరచూ స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం, మీడియా, పౌర సమాజం అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన పలుసార్లు పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం.. my answer to those who are spreading fake stories on the Voices of dissent #justasking pic.twitter.com/8NHTQPA2ho— Prakash Raj (@prakashraaj) July 12, 2026 -
‘కాక్రోచ్’ ఉద్యమానికి ప్రకాశ్ రాజ్ మద్దతు
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన శనివారం 22వ రోజుకు చేరుకుంది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జంతర్ మంతర్ వద్దకు చేరుకొని నిరసన కారులకు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. తాను ఆధునిక గాంధీనో లేదా హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని వాంగ్‌చుక్ ఈ సందర్భంగా అన్నారు. కేరళ మాజీ మంత్రి థామస్ ఐజాక్, త్రిపుర ప్రతిపక్ష నాయకుడు జితేంద్ర చౌదరి కూడా జంతర్‌మంతర్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్, ఐజాక్, జితేంద్ర చౌదరి నిరసనకారులతో మాట్లాడారు. పరీక్షల్లో పదే పదే జరుగుతున్న అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకమైన, నిష్పక్షపాత మైన, విశ్వసనీయమైన పరీక్షా విధానం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామ ని ప్రకటించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామని వెల్లడించారు. సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. నిద్రించినప్పుడు రక్తపోటు 109/72 ఎంఎం హెచ్‌జీ గాను, కూర్చున్నప్పుడు 106/74 ఎంఎం హెచ్‌జీ గాను నమోదైంది. హృదయ స్పందన నిమిషానికి 81 సార్లు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి 78 ఎంజీ/డీఎల్ గాను రికార్డయ్యింది. ఆయన బరువు 58.45 కిలోలకు చేరుకుంది. నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 7.5 కిలోల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ శరీరంలో నీటి శాతం బాగానే ఉందని, మానసికంగా చురుకుగా ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. జీవితానికి మీరే హీరో కావాలి దీక్ష కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత బలహీనంగా ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ తన సంకల్పంలో మార్పు రాలేదన్నారు. సోషల్ మీడియాలో ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. చాలామంది తనను 21వ శతాబ్దపు గాంధీ లేదా ఆధునిక గాంధీ అని పిలుస్తున్నారని, మరికొందరు తనను హీరో అంటున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వెల్లడించారు. తాను గాంధీని కాదు, హీరోని కూడా కాదని వివరణ ఇచ్చారు. బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించే ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని స్పష్టంచేశారు. ఇతరుల్లో హీరోల కోసం వెతకడం మానేసి, పౌరులుగా బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘జీవితానికి మీరే హీరో అవ్వండి. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి’’అని పిలుపునిచ్చారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ‘‘మీరు ప్రతిరోజూ ఇక్కడికి రాలేకపోతే, కనీసం ఒక్క రోజైనా జంతర్ మంతర్ వద్ద మాతో చేరండి. మీరు ఢిల్లీకి రాలేకపోతే, ఎక్కడ ఉన్నా ఉపవాసం పాటించి మీ సందేశాన్ని పంచుకోండి’’అని వాంగ్‌చుక్ కోరారు. నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించేలా ఒత్తిడి పెంచడానికి జూలై 20న పార్లమెంటు వరకు ప్రతిపాదించిన యాత్రలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ కేసులో ప్రకాశ్ రాజ్‌కు బిగ్ రిలీఫ్..!
టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను బెంగళూరు కోర్ట్ రద్దు చేసింది. ప్రకాష్ రాజ్ పలు రాష్ట్రాల్లో ఓటర్ గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో ప్రకాశ్ రాజ్‌కు బెయిల్ మంజూరూ చేసింది. గతంలో కోర్టు నోటీసులకు స్పందించడంలో ఫెయిల్ అయ్యారని నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.ఓటర్ ఐడి కేసులో శుక్రవారం బెంగళూరు కోర్టు ముందు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు చేస్తూ ప్రకాష్ రాజ్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 4,000 నగదు పూచీకత్తు సమర్పించాలనే షరతు విధించింది. ఈ కేసులో ఎప్పుడూ సమన్లు అందలేదని ప్రకాష్ రాజ్ తరఫు న్యాయవాది వాదించారు.ప్రకాష్ రాజ్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2019లో న్యాయవాది దిలీప్ కుమార్ హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. -
కూటమి సర్కార్‌పై ప్రకాష్‌రాజ్ మరో ట్వీట్
సాక్షి, అమరావతి: కూటమి సర్కార్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రతీకార రాజకీయాలు ఆపాలన్న ప్రకాష్‌రాజ్.. ‘‘మాపై రుద్దబడుతున్న ఈ కఠినమైన ఉపా చట్టాన్ని తొలగించండి అంటూ ట్వీట్ చేశారు.కాగా, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకాష్‌రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా టీడీపీ కూటమి ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. ‘ఉపా చట్టం కింద ఓ యూట్యూబర్‌ను రిమాండ్‌కు పంపుతారా? ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహమా?’ అంటూ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘ఇంకా ఇంకా దిగజారండి..’ అంటూ ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.మరో వైపు, విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కూటమి నేతల తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి వెనుక వైఎస్సార్సీపీ ఉందంటారా? రేపొద్దున కూటమి పార్టీల మధ్య విభేదాలొస్తే దాని వెనుక కూడా వైఎస్సార్సీపీ ఉందని ఆరోపిస్తారా?’ అంటూ ఆయన మండిపడ్డారు.ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలపై లేదా అధికార కూటమిపై విమర్శలు వినిపించిన ప్రతిసారీ వాటివెనుక వైఎస్సార్సీపీ ఉందని ఆరోపించడం కూటమి నేతలకు అలవాటైపోయింది. సామాజిక కార్యకర్తలు, మేధావులు, సినీ ప్రముఖులు లేదా సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వారిని ప్రతిపక్షంతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా సినీ నటుడు ప్రకాష్‌రాజ్ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటే.. ఆయన వెనుక వైఎస్సార్సీపీ ఉందనే ప్రచారాన్ని కూటమి నేతలు చేస్తున్నారంటూ నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రావణ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్.. ప్రకాష్ రాజ్ ఏమన్నారు?
-
యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై సెటైర్లు
నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ 'ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మొదలుపెట్టిన మీ ఆటను ముగించేది ప్రజలే" అని వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా UAPA సెక్షన్‌తో రిమాండ్‌లోకి పంపడంపై మండిపడ్డారు. 'యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా?' అని, జనసైనికులు ఇప్పటికే ఏఐ వీడియోలతో క్యారెక్టర్ అససినేషన్ మొదలుపెట్టారని ఆరోపించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్‌కి తమిళ నేత వార్నింగ్)'వరసగా తప్పుడు కేసులు పెట్టి నాలుగుసార్లు కోర్ట్ బెయిల్ ఇస్తే UAPA వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ అర్థమైంది. తర్వాత ఏంటి? వ్యక్తిగత దూషణ. ఆల్రెడీ జనసైనికులు ఏఐ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వాడి ఫోన్ మీ దగ్గరుంది. అందులో సమాచారాన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకు అండగా నిలుచున్న వాళ్లని, ఎన్నో ప్రశ్నించే గొంతులని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత దిగజారతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు. గేమ్ ఆన్' అని ప్రకాశ్ రాజ్ అన్నారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justasking pic.twitter.com/febENen78z— Prakash Raj (@prakashraaj) July 6, 2026 -
నాది రావణ్ ది ఆడియో లీక్.. ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
'ఇంకా ఎంతకు దిగజారుతారు.. కొత్తగా ఏదైనా ట్రై చేయండి'
టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వీడియో రిలీజ్ చేశారు. నా గొంతుతో పాటు.. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని క్లియర్ కట్‌గా తెలిసిపోతోందని అన్నారు. ఆడియోను ఎడిట్ చేసి గాలి మాటలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇలాంటి గాలి మాటలను సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు దౌర్జన్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా??! అని ప్రశ్నించారు.ఇదంతా జనాలు గమనిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఆడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది?.. సోషల్ మీడియాలో దీన్ని ఎవరు లీక్ చేశారని కౌంటరిచ్చారు. మీరు చేస్తున్న ఈ నాటకం అందరికీ తెలుసని అన్నారు. ఇలా కాకుండా కొత్తగా ఇంకేదైనా ట్రై చేయండని హితవు పలికారు. పదవి ఉందన్న అహంకారంతో ఒక వ్యక్తిని ఇలా అరెస్టు చేయించడం సిగ్గుగా లేదా? అని నిలదీశారు ప్రకాశ్ రాజ్.కాగా..యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్‌పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ రాగా.. తాజాగా మరో కేసులో అరెస్ట్ చేశారు. రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.Editing voice messages of me asking for spelling corrections in telugu and a minister claiming it as an act of conspiracy to destabilise a government shows your desperation to silence voices of dissent. From where did you this audio ? who leaked it on social media ? #justasking pic.twitter.com/b9r9YaT8WF— Prakash Raj (@prakashraaj) July 5, 2026 -
ఇంకా ఎంత దిగజారుతార్రా.. నాలుగోసారి బెయిల్, ఐదోసారి అరెస్ట్...
-
పవన్-చంద్రబాబు.. కోర్టు ఏం చెబుతుందో అర్థమవుతోందా మీకు?
యూట్యూబ్, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలతో ప్రశ్న రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి న్యాయస్థానం ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇవ్వగా.. జైలు నుంచి విడుదలయ్యే లోపే మచిలీపట్నంలో నమోదైన కేసును రంగంలోకి తెచ్చిన పోలీసులు.. పక్కా ప్లాన్‌తో రావణ్‌ని మళ్లీ అరెస్ట్ చేసి తరలించారు. ఈ వరుస అరెస్టుల పరిణామాల నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ వరస వీడియోలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.'నాలుగు రోజుల నుంచి రావణ్ నిరాహారదీక్షలో ఉన్నాడు. అసలు ఆలోచించరా? ఏంటీ నాటకం, దౌర్జన్యం. అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ అరెస్ట్ చేశారు. మళ్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెబుతున్నదో అర్థమవుతోందా మీకు?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.Arrest/ Bail ..Arrest /Bail.. Arrest/Bail.. and arrest again. Isn’t Courts telling you that you are wrong.. Citizens are witnessing your Vindictive politics.. @ncbn @PawanKalyan please stop this #justasking pic.twitter.com/xU4AxGwpKl— Prakash Raj (@prakashraaj) July 4, 2026 -
కార్యకర్తలా, గుండాలా..? ప్రశ్నిస్తే చంపేస్తారా.? ప్రకాష్ రాజ్ వైరల్ వీడియో
-
జనసైనికులా? గూండాలా?.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం..
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో జన సైనికుల ఓవరాక్షన్ చేస్తున్నారంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. జన సైనికుల తీరుపై ఆయన మండిపడ్డారు. జనసైనికులు గూండాల్లా రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేవాళ్లను చంపేస్తారా ఏంటి? అని నిలదీశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇదంతా దేశం చూస్తోందని ఆయన అన్నారు. బిహేవియర్ యువర్ సెల్ఫ్ అంటూ జన సైనికులను ఉద్దేశించి మరో వీడియో రిలీజ్ చేశారు. కాగా.. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో రావణ్‌ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అతడిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే విచారణ తర్వాత పిఠాపురంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే మరో కేసులో రావణ్‌ని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర హైడ్రామా నెలకొంది. ఆ తర్వాత రావణ్‌ని మచిలీపట్నం తరలించారు. What is this act of your janasena party cadres . ప్రశ్నిస్తే చంపేస్తారా ???. @ncbn @PawanKalyan … Will you take action against this Rogue behaviour. #justasking pic.twitter.com/HZYEIaKbfp— Prakash Raj (@prakashraaj) July 3, 2026 -
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో రావణ్‌ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అతడిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే విచారణ తర్వాత పిఠాపురంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే మరో కేసులో రావణ్‌ని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం రావణ్‌ని మచిలీపట్నం తరలించారు.(ఇదీ చదవండి: నా భర్తకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత)ఇక రావణ్ అరెస్ట్ వివాదంపై ఓ వీడియో విడుదల చేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు? అని ప్రశ్నిస్తూ యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై వరుస కేసులు పెట్టడాన్ని తప్పు పట్టాడు. ఈ కేసులో అరెస్ట్ చేయలేమని కోర్టులు బెయిల్ ఇస్తున్నా మరో కేసు వేసి మళ్లీ అరెస్ట్ చేస్తున్నారు. ఓ 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా? ఇలా అధికారాన్ని దుర్వినియోగంతో ఎంత దూరం వెళ్తారు? ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలు దేనికి? ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో రావణ్‌ని వదిలేస్తారని ఆశిస్తున్నా అని సోషల్ మీడియాలో వీడియోని పంచుకున్నారు.(ఇదీ చదవండి: బెయిల్.. అరెస్ట్.. రిపీట్)How low will you stoop down and missuse power and government machinery.. do you realise you are getting Naked day by day . #justasking pic.twitter.com/f3dDPw2ZAk— Prakash Raj (@prakashraaj) July 2, 2026 -
ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
-
ధర్మస్థలపై ప్రశ్నిస్తే తప్పా?.. చిన్నయ్యతో నాకేం సంబంధం??
బెంగళూరు: ధర్మస్థల వ్యవహారంలో తన పేరును లాగుతూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్లు అందుకున్నానంటూ ముసుగువ్యక్తిగా గుర్తింపు పొందిన చిన్నయ్య చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.‘‘చిన్నయ్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటివరకు ధర్మస్థలకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారిని కూడా కలవలేదు’’ అని వెల్లడించారు.బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్‌రాజ్.. తన సహచర కార్యకర్త గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్య ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. ‘‘ధర్మస్థల అంశంపై మాట్లాడాలని అతడు కోరాడు. అయితే ఇలాంటి విషయాలు నాతో కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు చెప్పాలని సూచించాను. అతని మాటలు అనుమానంగా అనిపించాయి. అందుకే ఆ సంభాషణను రికార్డు చేసి సిట్ చీఫ్‌కు కూడా పంపించాను’’ అని చెప్పారు.ధర్మస్థలలో వెలుగుచూసిన అనుమానాస్పద మరణాలు, బాధిత కుటుంబాలు వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలోనే తాను స్పందించానని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ‘‘సామాజిక బాధ్యతతోనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరాను. ఇందులో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవు’’ అని స్పష్టం చేశారు.చిన్నయ్య ఆరోపణలపై స్పందిస్తూ, ‘‘ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి రూ.200 కోట్లు తీసుకున్నాననే ఆరోపణలకు ఆధారాలేంటి?’’ అని ప్రశ్నించారు. తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొన్ని వర్గాల మీడియా చిన్నయ్య వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ధర్మస్థల ప్రతిష్ఠకు తాను మసి పూసేందుకు ప్రయత్నిస్తున్నానని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన. తాను దేవాలయాలకు వెళ్లనప్పటికీ తన భార్య భక్తురాలని, ఆమె విశ్వాసాలను ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ధర్మస్థలలో విద్యార్థిని సౌజన్య హత్య కేసులో నిజాలు బయటపడాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.విలేకరులతో మాట్లాడిన టైంలో.. ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అంటూ చేసిన ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. అయితే ప్రకాశ్‌రాజ్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ఆపై వివరణ ఇస్తూ.. ఆ వ్యాఖ్యలు మీడియా మొత్తాన్ని ఉద్దేశించి చేసినవి కావని, కొందరికి మాత్రమే వర్తిస్తాయని అన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు శాంతించడంతో.. ప్రెస్‌మీట్ కొనసాగింది.Prakash Raj called a press meet to clarify Chinnayya's claim that they had spoken during the alleged Dharmasthala hoax mass burial kconspiracy.He invited the "sold-out Godi Media."The media turned up.Then came the questions and a heated exchange. #Dharmasthala #Massburial pic.twitter.com/j8uVCMfba5— Harish Upadhya (@harishupadhya) June 17, 2026కర్ణాటకలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థల వ్యవహారం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో 1995-2014 మధ్య కాలంలో పలువురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఆ మృతదేహాలను తానే ఖననం చేశానంటూ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య (ముసుగువ్యక్తి) సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే అనంతరం చిన్నయ్య తన వాంగ్మూలాన్ని మార్చుకుంటూ.. ధర్మస్థల ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్ల కుట్ర జరిగిందని, అందులో ప్రకాశ్‌రాజ్ సహా పలువురి పేర్లు ప్రస్తావించాడు. మరోవైపు 2012లో ధర్మస్థల సమీపంలో హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య కేసులో అసలు నిందితులు శిక్ష తప్పించుకున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మస్థల, సౌజన్య కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికితీయాలని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేస్తున్నారు. -
కాక్రోచ్ పార్టీ ధర్నాలో ప్రకాష్ రాజ్ సంచలన ఎంట్రీ
బెంగళూరు: నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా రగులుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం జరగాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళనకు ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడమే కాకుండా స్వయంగా హాజరుకావడం సంచలనంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.‘ఎక్స్’ వేదికగా ప్రకాష్ రాజ్ పిలుపుగతంలో ఢిల్లీలో జరిగిన నిరసనకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన నటుడు ప్రకాష్ రాజ్, ఈసారి బెంగళూరు ధర్నాలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వం తన వైఫల్యాలకు బాధ్యత వహించేలా మనమంతా గొంతు ఎత్తాలని, ఈ శాంతియుత నిరసనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలను నిరంతరం విమర్శించే ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమంలో చేరడంతో జెన్ జెడ్ నేతృత్వంలోని ఈ విద్యార్థి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్లయింది.దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలుగత వారం రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని పలు నగరాల్లో వరుస ఆందోళనలతో హోరెత్తిస్తోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శనతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఆ తర్వాత పుణె, లక్నో, అమృత్సర్ నగరాలకు పాకింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగే నిరసనలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థ కుప్పకూలిందని, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూన్ 20న 'ఢిల్లీ చలో'.. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపబోమని, జూన్ 20న దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు అక్కడే తిష్ట వేస్తామని సీజేపీ ప్రతినిధి దిప్కే స్పష్టం చేశారు. పుణె నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీకి దేశంలోని ఒక కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా, లేక ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కాక్రోచ్ ముసుగులు ధరించి, చేతుల్లో పూలు పట్టుకుని వినూత్న రీతిలో చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు.ధర్మస్థళ కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఆరోపించారు. గిరీష్ మట్టన్నవర ద్వారా ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడి, జూన్ 29న కలుస్తానని చెప్పారని చిన్నయ్య పేర్కొన్నారు.పిటిషన్లో ధర్మస్థళపై ప్రచారం కోసం రూ.200 కోట్లు కేటాయించారని ఆరోపించారు. మహేష్ శెట్టి తిమరోడి తనకు సహకరిస్తే రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని చిన్నయ్య పేర్కొన్నారు. అలాగే, ఈ కుట్రకు కావలసిన నిధులు కేరళ నుంచి వచ్చాయని, చిత్రదుర్గకు చెందిన రామ నాగరాజ్ కూడా ఆర్థిక సహాయం అందించారని ఆరోపించారు.చిన్నయ్య తన భార్య ఖాతాకు జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్లు, నగదు చెల్లింపుల వివరాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కుట్రకు భాగస్వాములైన మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర, విఠల్ గౌడ, జయంత్ అని ఆయన ఆరోపించారు. వీరి పేర్లు వెల్లడించినప్పటికీ సిట్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చిన్నయ్య ఫిర్యాదు చేశారు. చిన్నయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు స్వీకరించింది. ధర్మస్థళ కేసు వివరాలు కోరింది. తదుపరి కేసు విచారణను జూన్ 29కి వాయిదా వేసింది.ఈ కేసులో తన పేరు ప్రస్తావన రావడంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ‘ధర్మస్థళ అంశం కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ముడిపడి ఉంది. ప్రస్తుతం నేను చాలా దూరంలో ఉన్నాను. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి మీడియా ఎదుట స్పందిస్తాను. అప్పటి వరకు నా మీద వస్తున్న కల్పిత కథనాలు, జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Actor and film director Prakash Raj tweets, "Greetings to all.. In the media… On social networks, some news regarding me about the Dharmasthala case has come to my attention being discussed. Since this is an extremely sensitive matter.. and one that has hurt the faith of… pic.twitter.com/YYpoVB5UfR— IANS (@ians_india) June 12, 2026 -
నాగబాబుకు బిగ్ షాక్ ప్రకాష్ రాజ్ కు RGV సపోర్ట్
-
ప్రకాశ్ రాజ్‌కు ఆర్జీవీ మద్దతు.. నాగబాబుకు కౌంటర్
సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తరచూ స్పందించే ఆర్జీవీ.. తాజాగా జనసేన నేత నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రకాశ్ రాజ్‌కు తన మద్దతు తెలుపుతూ పరోక్షంగా నాగబాబుకు చురకలు అంటించాడు.ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే తెలుసు. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి’ అంటూ పవన్ కల్యాణ్ ఫోటోని షేర్ చేశాడు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది’ అని నాగబాబుకు కౌంటర్ ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.In effect what you mean is , in a democracy, a leader is given a responsible position by people who trusted him to take care of their issues ..He’s not been crowned as a king 🙏 https://t.co/k9OaxI2Mn8— Ram Gopal Varma (@RGVzoomin) June 7, 2026 -
బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్
-
అసలు నువ్వెవడివి? ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
-
రండి దొర.. వస్తానంటే వద్దంటామా..? పవన్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
-
రండి దొర.. రండి.. ప్రకాశ్‌రాజ్ సెటైరికల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రకాశ్‌రాజ్ తాజాగా ఎక్స్ వేదికగా..‘మీరొస్తానంటె మేమొద్దంటామా?. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?. లేదా సింగల్‌గా వస్తున్నారా?. అది చెప్పి రండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి . #justasking— Prakash Raj (@prakashraaj) June 4, 2026 -
ప్రశ్నిస్తే చంపేస్తారా..! నాగేశ్వరరావుకు నేను ఉన్నా!
-
‘ఒక్కమాట మీకు నచ్చలేదని ప్రొ.నాగేశ్వర్‌ను వేధిస్తారా?’
సాక్షి, అమరావతి: రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన నాయకులు కేసులు పెట్టడాన్ని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియో విడుదల చేశారు. ‘ఆయన మాట్లాడిన మొత్తం అంశాలను పక్కన పెట్టి, అందులో ఒక లైను మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, కేసులు, బెదిరింపులు... ఏమిటివన్నీ. ఇది ప్రజాస్వామ్యమా. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గూండాయిజమా?..మీకు నిజంగా ఒక్క మాట తప్పు అనిపిస్తే దానికి ఆధారం అడగండి. రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం.. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి’ అంటూ తూర్పారపట్టారు. ‘ఓ రాజకీయ విశ్లేషకుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వాళ్లను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నించారు, పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రశ్నించారు, జగన్‌ను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పటి ఆయన నిజాయితీ కూడా మీకు గుర్తుకు రాలేదు...ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా ? ప్రశ్నించే గొంతులను కేసులతో మూసేయాలని చూడడం ప్రమాదకరం. ఈ రోజు నాగేశ్వర్, రేపు ఇంకెవరో...’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో... ఎవరి పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. ఇలాంటి అర్థం లేని కార్యక్రమాలు దయచేసి వెంటనే ఆపండి’ అంటూ జనసేన నేతలకు సూచించారు. ‘నాగేశ్వర్.. మీకు అండగా మేం ఉన్నాం. కీప్ అప్ ది గుడ్ వర్క్’ అంటూ మద్దతు తెలిపారు. -
విజయ్ కోసం గళమెత్తిన కమల్, ప్రకాశ్‌రాజ్
చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వైఖరిని పలువురు సినిమా ప్రముఖులు తపుబట్టారు. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో తాత్సారం ప్రదర్శించడాన్ని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని అన్నారు. తమిళనాడు గవర్నర్ వ్యవహరశైలిపై సీనియర్ నటుడు కమల్ హాసన్, విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో స్పందించారు.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమేనని కమల్ హాసన్ పేర్కొన్నారు. ''శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదు. తమిళనాడు చరిత్రలో ఇది అపూర్వమైన నిర్ణయం. ప్రజల తీర్పును గౌరవించి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని నా సోదరుడు స్టాలిన్ ప్రకటించారు. ఆయన రాజకీయ పరిణితిని నేను గౌరవిస్తాను.ఇప్పుడు రాజ్యాంగ బాధ్యతలో ఉన్నవారు కూడా అదే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇది డిమాండ్ కాదు, వారి రాజ్యాంగ కర్తవ్యాన్ని గుర్తుచేయడం మాత్రమే. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుంది. 233 మంది ఎన్నికైన సభ్యులు ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలి. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీలో నిరూపించుకోవాలని ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింద''ని కమల్ హాసన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.గవర్నర్ తీరుపై ప్రకాశ్‌రాజ్ ఫైర్తమిళనాడు గవర్నర్ తీరుపై నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా విమర్శలు గుప్పించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవరిస్తున్నారని, ఆయన వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ''విజయ్‌తో మాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఆయనకు అనుకూలంగా ప్రజా తీర్పు వచ్చింది. అసెంబ్లీలో తన హక్కును వినియోగించుకోవడానికి విజయ్‌కు గవర్నర్ అవకాశం ఇవ్వాల''ని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలని, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు అవకాశం కల్పించాలని కోరారు. చదవండి: టీవీకే ప్రభుత్వాన్ని నడపగలదా?తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు కలిగిస్తున్నారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయ్ సంయమనంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా, అన్నివైపుల నుంచి విమర్శలు రావడంలో గవర్నర్ మెత్తబడ్డినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని విజయ్‌కు హామీయిచ్చినట్టు తాజా సమాచారం. -
విజయ్‌కు మద్దతుగా ప్రకాష్ రాజ్
-
నమస్కారం తమిళనాడు: ప్రకాశ్ రాజ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఎక్కువ మంది స్పందిస్తున్నారు. బెంగాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడం, తమిళనాడులో విజయ్ సంచలన విజయం నమోదు చేయడంతో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై సోషల్ మీడియాలో స్పందన అధికంగా ఉంది. ప్రభుత్వాన్ని నడిపే సత్తా విజయ్‌కు ఉందా అని ఒకరు సందేహిస్తే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు మంచి చేయాలని మరొకరు హితవు పలికారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు పలువురు తమ అభిప్రాయాలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.‘అభిమాన’ సమాజంనమస్కారం తమిళనాడు. కామరాజర్ ఓడిపోయారు. ఎం.కె. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం ‘అభిమాన గణం’గా మారిందే తప్ప, రాజకీయ చైతన్యం పొందలేదని నిరూపితమవుతోంది. రాజకీయ అవగాహన కల్పించే వారి పని ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజయం సాధించినవారు ప్రజలకు చేసే సేవ బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.– ప్రకాశ్ రాజ్, నటుడు‘టీవీకే’ నడపగలదా?బెంగాల్లో బీజేపీ విజయం కేవలం ప్రజాభిప్రాయంలో మార్పు మాత్రమే కాదు. ఓటర్ల జాబితా సవరణలతో ఆట మైదానాన్ని మార్చినప్పుడు, స్కోర్‌బోర్డు అసలైన ఆటకు ప్రతిబింబంగా ఉండదు. తమిళనాడులో యువత ఒక ‘కొత్త ముఖానికి’ ఓటు వేసినప్పటికీ, సినిమా ఆకర్షణ, సోషల్ మీడియా ప్రదర్శనలకు అతీతంగా టీవీకే దగ్గర ఏమైనా విషయం ఉందో లేదో చూడాల్సి ఉంది. కేరళ ఫలితాల్లో యూడీఎఫ్ విజయం అతి తక్కువ ఆశ్చర్యం కలిగించేదీ, అత్యంత నిజాయితీతో కూడినదీ అని నా భావన.– యోగేంద్ర యాదవ్, పొలిటికల్ సైంటిస్ట్పింగ్–పాంగ్బెంగాల్లో 15 ఏళ్ల పాలన నుండి కొత్త సైద్ధాంతిక పాలనకు జరిగే ఈ పరివర్తన... రాష్ట్ర పాలనా యంత్రాంగానికి అంతిమ పరీక్ష అవుతుంది. తమిళనాడు తన సంప్రదాయ ‘పింగ్–పాంగ్’ (రెండు పార్టీల మధ్యనే మారుతుండే) రాజకీయాల నుండి, అంచనా వేయలేని విధంగా మూడో ముఖం వైపు మళ్లింది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యత, అక్కడ చారిత్రకంగా నెలకొన్న ‘రివాల్వింగ్ డోర్’ విధానానికి తిరిగి వెళ్లటంగా మాత్రమే చూడాలి.– ప్రణయ్ రాయ్, ఎన్నికల డేటా విశ్లేషకులువిద్య... ఆరోగ్యంఅధికారంలో మార్పు వచ్చినా, బెంగాల్లో లోతుగా పాతుకుపోయిన సమ్మిళిత మేధో సంస్కృతి చెక్కుచెదరకుండా ఉంటుందని, ‘సంకుచిత వర్గవాదం’ దానిని కబళించదని ఆశిస్తున్నాను. తమిళనాడులో కొత్త ఆటగాళ్లు ఆవిర్భవించారు. ఆ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిది. అది స్థిరపడిన పార్టీలను అప్రమత్తం చేస్తుంది. కేరళలో భావోద్వేగపూరితమైన మతపరమైన అంశాల కంటే.. పరిపాలన, విద్య, ఆరోగ్యమే ఎప్పటికీ ప్రధానాంశాలుగా ఉంటాయిని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.– జావేద్ అఖ్తర్, గీత రచయితవిసుగు ఫలితం!సరిహద్దు జిల్లాల్లో భారీగా హిందువుల ఏకీకరణ, టీఎంసీ స్థానిక నాయకత్వంపై నెలకొన్న విసుగు – వీటి ఫలితమే బెంగాల్లో తాజా పరిణామం. తమిళనాడులో, స్థిరపడిన ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా యువత చేసిన తిరుగుబాటే టీవీకే విజృంభణ. కేరళలో ద్రవ్యోల్బణం, దాదాపు 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగం వంటి సమస్యలు ఎల్.డి.ఎఫ్.పై ప్రభావం చూపాయి.– రాజ్‌దీప్ సర్దేశాయ్, సీనియర్ జర్నలిస్ట్మూడో శక్తిపశ్చిమ బెంగాల్ ఫలితాలు మార్పు కోరు కుంటున్న ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. కానీ అవి ఆ రాష్ట్ర మేధో చరిత్రను నిర్వచించిన ‘బహుళత్వం’, భావప్రకటనా స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు రానున్న కొత్త పరిపాలనపై ఒక పెద్ద భారాన్ని కూడా మోపుతాయి. రాజకీయ వారసత్వాలు శాశ్వతం కాదని తమిళ నాడులో ఆవిర్భవించిన మూడో శక్తి నిరూపించగా; కేరళ ఎప్పటిలా తన విశిష్టమైన ప్రజాస్వామ్య విజ్ఞతను ప్రదర్శించింది. – అరుణా రాయ్, ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ సభ్యురాలుమార్పే బలంబెంగాల్లో ఎన్నికల అనంతర ఘర్షణల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ప్రజాస్వా మ్యంలోని అత్యంత బలహీన వర్గాల భద్రతను, ముఖ్యంగా మైనారిటీలకు, ప్రతిపక్షానికి ఓటు వేసిన వారికి రక్షణ కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. తమిళనాడులో సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎదురైన ఎదురు దెబ్బ... చారిత్రక వారసత్వంపై ఆధారపడకుండా క్షేత్రస్థాయి క్రియాశీలత వైపు తిరిగి రావడానికి నాయకులకు ఒక మేల్కొలుపుగా పని చేయాలి. ఇక కేరళలో ప్రభుత్వాలు తరచుగా మారడమే ఆ రాష్ట్రానికి అతి పెద్ద బలం. ఎందుకంటే ఇది ప్రతి నాయకుడిని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.– హర్ష్ మందర్, సామాజిక కార్యకర్త, రచయితకట్టుబడి లేరుటీఎంసీని ‘బుజ్జగింపు పార్టీ’గా చిత్రీకరించే ప్రయత్నంలో సఫలం అవటం వల్లే బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులో జెన్ జడ్, మిలీనియల్ ఓటర్లు ఇకపై డీఎంకే– ఏఐఏడీఎంకేకి కట్టుబడి లేరని స్పష్టం అయింది. కేవలం ఒక సినిమా నటుడికి ఓటు వేయటం మాత్రమే కాదు, ‘ద్వంద్వ పాలనను తిరస్కరించడం’ కూడా అక్కడి ఫలితాలకు సంకేతాలు! కేరళలో గత ఎన్నికల్లో పాక్షికంగా ఎల్డిఎఫ్ వైపు మళ్లిన తమ సంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి ఆకర్షించుకోగలగడమే యూడీఎఫ్ విజయానికి ప్రధాన కారణం.– నీరజా చౌధరి, రాజకీయ విశ్లేషకురాలుఅందరూ దూరమే!గత నెలలో నేను మాట్లాడిన దాదాపు ప్రతి జర్నలిస్టు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కే అనుకూలమని చెప్పారు. కొందరైతే టీఎంసీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా అంచనా వేశారు. కానీ, పశ్చిమ బెంగాల్‌పై పరిశోధన చేసిన విద్యావేత్తలు మాత్రం టీఎంసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనీ, బీజేపీ గణనీయమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందనీ అన్నారు. హిందువులు దూరమవ్వడం వల్లే మమతా బెనర్జీ ఓడిపోయారా? ముస్లింలు అధికంగా ఉన్న టాప్ 10 నియోజకవర్గాల్లో కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మార్పు కనిపించింది. టీఎంసీ నుంచి వచ్చిన హిందూ ఓట్ల కంటే, కాంగ్రెస్, లెఫ్ట్ నుంచి వచ్చిన హిందూ ఓట్లనే బీజేపీ ఎక్కువగా సాధించగలిగింది. మరోవైపు, టీఎంసీకి రావాల్సిన ముస్లిం ఓట్లలో పెద్ద భాగాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ దక్కించుకున్నాయి.– అనింద్యో చక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు
-
శ్రీరాముడిపై కామెంట్స్.. ప్రకాశ్ రాజ్‌పై బ్యాన్..!
దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన శ్రీరాముడిని ఉద్దేశించి తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన కామెంట్స్‌పై వ్యతిరేకత రావడంతో వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మరింత ముదిరేలా కనిపిస్తోంది.ప్రకాశ్ రాజ్‌ను సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. శ్రీరాముడిపై చేసిన కామెంట్స్‌తో ఆయనపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీంతో ఆయనపై నిషేధం విధించాలనే డిమాండ్స్ రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. సినీ వర్గాలు సైతం ప్రకాశ్ రాజ్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.ప్రకాశ్ రాజ్ తన చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చినప్పటికీ వ్యతిరేకత ఏమాత్రం తగ్గడం లేదు. అయితే కొందరు దర్శకులు, నటులు మాత్రం ఈ విషయంపై పునరాలోచన చేయాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా ఆయనపై ఇండస్ట్రీలో వివాదాలు ఉన్నాయని.. అప్పట్లో తాత్కాలికంగా బ్యాన్ జరిగిన సంఘటనలు కూడా తాజాగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. -
శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు త్వరలో మీముందుకు వస్తా..
-
నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు
-
శ్రీరాముడిపై వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన ప్రకాష్ రాజ్
శ్రీరాముడు, హిందూ ధర్మం గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పాటు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశం గురించి ఆయన వివరణ ఇచ్చారు. కొందరు రాజకీయ నాయకులు చేసే కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. తన మాటలను మరోసారి పూర్తిగా వినాలని ఆయన కోరారు.సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ తాజాగా ఒక వీడియో ద్వారా ఇలా వివరణ ఇచ్చారు. 'ఒక సాహితీ వేడుకలో నేను చేసిన ప్రసంగంలో కొన్ని మాటలను మాత్రమే తీసుకుని అదేపనిగా కొందరు వక్రీకరించారు. నేనేదో అవతారపురుషుడు శ్రీరాముడి గురించి వెటకారం చేశానని వైరల్ చేశారు. హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడానని అంటున్నారు. నేను అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమిస్తాను. ఒకరిని తక్కువ చేసే అలాంటి అవసరం నాకు లేదు. కానీ, కొందరు మతోన్మాధంతో ధర్మాన్ని అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్నారు. అలాంటి వారు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక.. నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా గురించి ఇలాగే తప్పుగా వాగుతూ ఉంటే నేను కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీ పని మీరు చూసుకోండి.' అంటూ ఆయన వివరణ ఇచ్చారు. To all the desperate bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp— Prakash Raj (@prakashraaj) April 19, 2026 -
విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్
-
పవన్ మీరు సిద్ధమేనా.. కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్
లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోయింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఫుల్స్టాప్ పడింది. బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. దీంతో లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లుకు బ్రేక్ పడటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ పేజీలో విపక్షాలపై మండిపడ్డారు. దీంతో ఆయనకు కౌంటర్‌గా సినీ నటుడు ప్రకాష్ రాజ్ పలు వ్యాఖ్యలు చేశారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంలో విపక్షాలు వ్యతిరేఖంగా నిలబడ్డాయని పవన్ కల్యాణ్ ఇలా అన్నారు. భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని పవన్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడంతో విపక్షాలు జాతీయ ప్రగతిని అడ్డుకోవడంతో పాటు తమ రాజకీయ సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ తెలిపారు. అయితే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు.పవన్ మీరు సిద్ధమేనా..?: ప్రకాష్ రాజ్దయచేసి ప్రధాని మోదీని మెప్పించడం కోసం పౌరులకు అబద్ధాలు చెప్పడం ఆపాలని పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదించబడిందని గుర్తు చేశారు. దాన్ని ఇప్పుడైనా ఆమోదించవచ్చని చెప్పుకొచ్చారు. 'కానీ, మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది, ఇది ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. మిమ్మల్ని డీసీఎం చేసిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అంశం గురించి వివరించడానికి మీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా..? ' అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ కోరారు. Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you… https://t.co/LyQGy2Fh8E— Prakash Raj (@prakashraaj) April 18, 2026 -
నటుడికి దేశాన్ని అప్పగించలేం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పళనిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రస్తుత ఎన్నికలను మూడు రకాల రాజకీయ నమూనాలుగా అభివర్ణిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిండుగల్ జిల్లా పళనిలో సీపీఐ అభ్యర్థి పాండికి మద్దతుగా ప్రచార సభలో ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ ద్రావిడ మోడల్ అన్నది విద్యను అందించే, భాషను రక్షించే, గౌరవాన్ని కాపాడే మోడల్ అని ఆయన కొనియాడారు. అడిమై(బానిస) మోడల్ అన్నది తమిళుల ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల చెంత పెట్టే మోడల్ అని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వస్తే తమిళనాడుకు తీరని అన్యాయం జరుగుతుందని, దానికి ఈ బానిస మోడల్ మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. మరొకటి సినిమా మోడల్ అంటూ నటుడు విజయ్ పార్టీని ఉద్దేశిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ఒకే పాటలో డాక్టర్, ఇంజినీర్ లేదా ముఖ్యమంత్రి అయిపోవచ్చని, అయితే నిజ జీవితం వేరు అని ఎద్దేవా చేశారు.విజయ్‌పై నేరుగా విమర్శలు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ‘భాషకు లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు ఆ నటుడు (విజయ్) ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా అంటూ, నటుడి కోసం థియేటర్లో ఈలలు వేయడం వేరు, కానీ దేశ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టడం వేరు. అని వ్యాఖ్యలు చేశారు. విభజన రాజకీయాలపై హెచ్చరిక మణిపూర్ తరహాలో మధురైను మార్చాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మధురై తర్వాత వారి కన్ను పళనిపైనే ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం పారీ్టల మధ్య పోరాటం కాదని, ఐక్యతకు, విభజనవాదానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తుండడం గమనార్హం. -
శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
హిందీ రుద్దుడుపై ప్రకాష్ రాజ్ వెటకారం!
బతుకు తెరువు వెతుక్కుంటూ కొత్త ప్రాంతాలకు వెళ్లడం ఇవాళ్టి సంస్కృతి కాదు. మానవజాతి పుట్టినప్పటినుంచి ఉన్న వ్యవహారమే. ఇప్పటికీ మనం మన నైపుణ్యాలకు, ఆసక్తులకు తగిన వృత్తులు, వ్యాపారాలు, వ్యాపకాలు వెతుక్కుంటూ కొత్త ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు వెళుతూ ఉంటాం. బతుకుతూ ఉంటాం. ఈ క్రమంలో అక్కడి స్థానిక మర్యాదలను పాటించినప్పుడే మనకు మనుగడ ఉంటుంది.సాధారణంగా ‘లా ఆఫ్ ది ల్యాండ్’ ను పాటించాలి.. అని పెద్దలు అంటూ ఉంటారు. రోమ్ నగరంలో రోమన్ లాగానే జీవించాలి అని చెప్పే ఇంగ్లిషు నానుడికే మరో రూపం ఈ మాట. ఏ ప్రాంతానికి వెళ్లి జీవించాలనుకుంటే ఆ ప్రాంతపు జీవన శైలులకు, సంస్కృతికి, భాష సాంప్రదాయాలకు మనమే అలవాటు కావాలి. అప్పుడే మర్యాద దక్కుతుంది. కానీ.. దక్షిణాది రాష్ట్రాల మీద కూడా హిందీ భాషను బలవంతంగా రుద్దడం ఈ సంస్కారాన్ని ధిక్కరించే, పూర్వపక్షం చేసే దుర్మార్గమైన పోకడ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్నే సినీనటుడు ప్రకాష్ రాజ్ ఒక ఆసక్తికరమైన కల్పిత కథతో ముడిపెట్టి సరదాగా చెప్పే ప్రయత్నం చేశారు.ఇటీవల ప్రకాష్ రాజ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చిన్న కథ చెప్పారు. ఉత్తరాది నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత దక్షిణాదికి వచ్చారు. అడవుల వెంట నడచి వెళుతున్న క్రమంలో వారికి పండ్ల చెట్లతో నిండిన అడవి కనిపించింది. ఇది అడవి కాదు.. ఎవరిదో ప్రైవేటు తోట అనే క్లారిటీ రాముడికి ఉన్నది గానీ.. లక్ష్మణుడికి ఆకలి వేస్తోంది గనుక పండ్లు కోసుకుని తినమని చెప్పాడు. ముగ్గురూ కడుపునిండా పండ్లు తిన్నారు. ఈలోగా అక్కడకు శూర్పణఖ, రావణుడు వచ్చారు. ఎవరో పండ్లు తినేస్తున్నారని శూర్పణఖ అంటే.. పోన్లే పాపం ఆకలితో ఉన్నట్టున్నారు.. తిననివ్వు అన్నాడు రావణుడు. అంతా అయ్యాక.. మీరు పండ్లు తిన్నారు గనుక.. డబ్బు చెల్లించండి అని అడిగాడు. ఎంత అని రాముడు అడిగితే జీఎస్టీతో కలిపి రెండువేలు అన్నాడు. మాదగ్గర అంత లేదు అన్నాడు రాముడు.Prakash Raj's hilarious take on Hindi Imposition.....In 'Thoolika Politics' session, narrates Ram, Lakshman as North Indian migrants eating fruits on a South Indian farm, sparking a feud over a $2000 GST bill.Don't force Hindi with that One Nation, One Religion 🔥 pic.twitter.com/aRSEr88bef— D (@Deb_livnletliv) April 16, 2026సరే అయితే.. 20శాతం డిస్కౌంటు ఇస్తా అన్నాడు రావణుడు. ఆ డబ్బు కూడా లేదు అన్నాడు రాముడు. సరే అయితే మీ దగ్గర డబ్బులూ లేవంటున్నారు గనుక.. మీరు టూరిస్టులు కాదు. కడుపుకూటికోసమే ఇక్కడకు వచ్చారు.. ఎటూ పండ్లు తినేశారు గనుక.. ఆ విత్తనాలను ఇక్కడే విత్తి.. ఇక్కడే పని చేసుకుంటూ బతకండి అని చెప్పాడు రావణుడు. ఇది ప్రకాష్ రాజ్ చెప్పిన కథ. ఉత్తరాది నుంచి ఓ వ్యక్తి ఎక్కడో కేరళలో బ్యాంకు మేనేజరుగా ఉద్యోగం చేయడానికి వస్తే.. ఇక్కడి ప్రజలు హిందీ ఎందుకు నేర్చుకోవాలి? అతడే కదా మళయాళం నేర్చుకోవాలి అనేది ప్రకాష్ రాజ్ వినిపిస్తున్న వాదన. బతుకు తెరువు కోసం వచ్చేవాళ్లు.. ఈ నేల మీద భాషా సాంప్రదాయాల్ని గౌరవించాలే తప్ప.. తమకు తెలిసినది ఇక్కడి వాళ్లు నేర్చుకోవాలని భీష్మించుకుంటే మూర్ఖత్వం అవుతుందని ఆయన అంటున్నారు.కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద బలవంతంగా హిందీ రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇదే విధంగా ఉంటున్నాయనేది ఆయన లాజిక్. వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అనే నినాదంతో దేశాన్నంతా ఒకటి చేస్తామని కేంద్రం చెబుతున్న మాటల పట్ల ప్రకాష్ రాజ్ తన ధిక్కార స్వరాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా బలంగానే వినిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేకత ప్రబలంగా ఉండదు. తమిళనాడులో హిందీ వ్యతిరేక పోరాటాలు ఏ స్థాయిలో సాగుతూ ఉంటాయో మనందరికీ తెలుసు. అదే విధంగా.. కేరళ కూడా హిందీ భాషను, ఉత్తరాది సంస్కృతీ సంప్రదాయాలను బలవంతంగా తమ మీద రుద్దడాన్ని నిరసిస్తుంటుంది. ఇదే వైఖరిని ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో వెటకారంగా, వ్యంగ్యంగా పిట్టకథతో చెప్పిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...యం.రాజేశ్వరి. -
శ్రీ రాముడిపై ప్రకాష్ రాజ్ వివాదస్పద వ్యాఖ్యలు
శ్రీరాముడు హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైన దేవుడిగా ఆరాధిస్తారు. రాముడు నిత్యజీవితంలో మమేకమై ఉంటాడని నమ్ముతారు. శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు. రాముడి వీరత్వంలో తిరుగులేదు. ఎంతో కీర్తి ఉన్న రాముడు, లక్ష్మణులను వలస కూలీలు అని సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొనడం సిగ్గుచేటని నెటిజన్లు భగ్గుమంటున్నారు. గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో అనేక చిక్కుల్లో పడిన ఆయన ఇప్పుడు మరోసారి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ.. రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలని, వారిద్దరూ దక్షిణ భారత్‌కు చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే, దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని అడిగినట్లు ఎద్దేవా చేశాడు. ఈ కారణం వల్లనే వివాదం మొదలైందని ఎటకారంగా కామెంట్ చేశాడు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంప్రదాయ ఇతిహాస కథనాన్ని వక్రీకరించినందుకు నెటిజన్లు కూడా విరుచుకుపడుతున్నారు. మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.బీజేపీ కార్యవిధానాన్ని తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఈ దేశంలో ప్లాన్ ప్రకారం ఒక జాతి నిర్మూలనకు అడగులు పడుతున్నాయి. వారు ముస్లింలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు. ఆపై గిరిజనులను, మైనారిటీలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు." అని ఆయన అన్నాడు. కానీ, మత సామరస్యం, ప్రజల విశ్వాసం అనే అంశాన్ని తీసుకుని ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న నెటిజన్లు అనేక పోస్టులు పెడుతున్నారు. రాబోయే ప్రాజెక్టులలో ఆయనకు అవకాశం ఇవ్వడంపై చిత్రనిర్మాతలు పునరాలోచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా వంటి వారు వారణాసి, స్పిరిట్, దృశ్యం 3 చిత్రాల నుంచి ఆయన్ను తొలగొంచాలని కోరుతున్నారు. Prakash Raj claims Ram was a North Indian, Ravan a South Indian tribal, and their conflict began because Ram "STOLE FRUITS."🥲This is what happens when you learn itihas from church pic.twitter.com/yRJmEzwivq— The Jaipur Dialogues (@JaipurDialogues) April 16, 2026 -
దేవుడిని నమ్మనంటూ చర్చిలో ప్రకాశ్‌రాజ్.. విమర్శలపై కౌంటర్!
తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కారణం.. ఆయన తల్లి సువర్ణలత అంత్యక్రియలను క్రైస్తవ ఆచారం ప్రకారం నిర్వహించడమే! దేవుడినే నమ్మనని చెప్పే ఆయన తల్లి భౌతికకాయాన్ని చర్చిలో పెట్టి ప్రార్థనలు, కీర్తనలు ఎందుకు చేయించాడని పలువురూ విమర్శలు గుప్పించారు.నేను నమ్మనుఈ ట్రోలింగ్‌పై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించాడు. అవును, నేను దేవుడిని నమ్మను, కానీ మా అమ్మ నమ్మేది. తన విశ్వాసాల ప్రకారం అంతిమసంస్కారాలు పొందే హక్కును కాదనడానికి నేనెవర్ని? ఇది తనకు నేనిచ్చే కనీస గౌరవం. ఒంటినిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఇదేం అర్థమవుతుంది? అని ట్వీట్ చేశాడు.నాస్తికుడిగా ప్రయాణంఇది చూసిన కొందరు తల్లి నమ్మకాల్ని గౌరవించి, ఆమెకు నచ్చినట్లుగానే అంతిమయాత్ర చేసిన ప్రకాశ్‌రాజ్‌ను సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మీ తల్లి నమ్మకాన్ని గౌరవిస్తున్నావు, బాగానే ఉంది.. మరి మా నమ్మకాల్ని ఎందుకు హేళన చేస్తావు? ఎందుకు ద్వేషిస్తావు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత క్రైస్తవురాలు కాగా తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. భిన్నమైన మతాల నేపథ్యంలో పెరిగినప్పటికీన ఆయన ఏ మతంవైపూ అడుగు వేయలేదు. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు. Yes. I don’t believe in god .. but my mother believed in her god . Who am i to deny her .. the right to be buried according to her belief. This is the basic respect we give one another. Will you Hate mongering monsters understand this #justasking https://t.co/vD1GhySf3M— Prakash Raj (@prakashraaj) April 2, 2026 చదవండి: అచ్చం ఓయ్ హీరోయిన్లా ఉందే.. ఎవరీ మానస శర్మ? -
ప్రకాష్ రాజ్ తల్లి మరణంపై వైఎస్ జగన్ ఎమోషనల్
-
ప్రకాశ్ రాజ్ తల్లి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత (86) మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. సువర్ణలత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్ రాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ఆకాంక్షించారు.కాగా, ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం బెంగుళూరులో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. -
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్‌కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్‌ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
ప్రతి అమ్మాయి 'సరస్వతి'లా ఉండదు.. అదిరిపోయేలా ట్రైలర్
ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరస్వతి’. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ హై కాన్సెప్ట్ థ్రిల్లర్ సినిమాను వరలక్ష్మీ శరత్‌కుమార్, ఆమె సోదరి పూజా శరత్‌కుమార్ నిర్మించారు. ఇందులో ప్రకాశ్ రాజ్, రాధిక, నాజర్, ప్రియమణి కీలకపాత్రల్లో నటించగా .. తమన్ సంగీతం అందించారు. తన కూతురు కోసం క్రూరమైన ప్రపంచానికి వ్యతిరేకంగా సరస్వతి ఎదురు నిలిచే సాహసం ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించనున్నారు. -
వారణాసి గురించి అసలు విషయాన్ని బయటపెట్టిన ప్రకాష్ రాజ్
-
'వారణాసి'లో ప్రకాష్ రాజ్ పాత్ర పవర్ఫుల్.. రివీల్ చేసిన నటుడు
మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్ సినిమా ‘వారణాసి’.. ఇందులో ప్రకాష్ రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనేది దర్శకుడు ప్రకటించలేదు. దీంతో సోషల్‌మీడియాలో పలు కథనాలు వచ్చాయి. మహేశ్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. వారణాసిలో శివుడి పరమ భక్తుడిగా నటిస్తున్నానని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ పంచుకున్నారు. ఆపై హిందీ ‘దృశ్యం 3’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే విక్రమార్కుడులో నటించిన విషయం తెలిసిందే. ఆపై మహేశ్‌తో కూడా ఆయన కలిసి పలు సినిమాల్లో నటించారు. ఒక్కడు, రాజకుమారుడు, గుంటూరు కారం వంటి పలు సినిమాల్లో మెప్పించారు. ఇప్పుడు వారణాసిలో వీరిద్దరూ మరోసారి కలిశారు. మైథలాజికల్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వారణాసి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్‌ను అంటార్టికాలోనూ ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.“I am a Maha Shiva Bhakt in #Varanasi”— #PrakashRaj pic.twitter.com/Xr3AMjQZH9— cinee worldd (@Cinee_Worldd) February 16, 2026 -
దృశ్యం 3లో ప్రకాశ్ రాజ్.. కానీ!
ఈ మధ్య ప్రకాశ్ రాజ్ గురించి అనేక రూమర్స్ వస్తున్నాయి. మొన్నటివరకు ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. దీంతో అదంతా ఫేక్ న్యూస్ అని అతడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. హిందీ 'దృశ్యం 3' సినిమాలో అక్షయ్ ఖన్నా తప్పుకున్న విషయం తెలిసిందే! ప్రకాశ్‌రాజ్ క్లారిటీఆ స్థానంలో ప్రకాశ్ రాజ్ నటించనున్నాడన్నది లేటెస్ట్ టాక్. ఈ ఊహాగానాలపై ప్రకాశ్‌రాజ్ స్పందించాడు. తాను దృశ్యం 3లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదన్నాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. హిందీ మూవీ 'దృశ్యం 3'లో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్ కూడా మొదలైంది. కాకపోతే నేను ఎవరినీ రీప్లేస్ చేయడంలేదు అని వెల్లడించాడు.సూపర్ హిట్ ఫ్రాంచైజీదృశ్యం విషయానికి వస్తే.. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పలు భాషల్లో రీమేకై అక్కడా విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం మరింత సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దృశ్యం ఫ్రాంచైజీలో మూడో భాగం రాబోతోంది. మలయాళంలో ఇప్పటికే షూటింగ్ పూర్తవగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో 'దృశ్యం 3' తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.దృశ్యం 3 నుంచి అక్షయ్ అవుట్'దృశ్యం 2'లో పోలీస్ అధికారి పాత్రలో యాక్ట్ చేశాడు అక్షయ్ ఖన్నా. ఈ లెక్కన మూడో భాగంలోనూ అతడు ఉండాల్సిన వ్యక్తి! కానీ 'ధురంధర్' సక్సెస్ తర్వాత గర్వం అతడి తలకెక్కిందని, గొంతెమ్మ కోర్కెలు కోరాడని ప్రచారం జరిగింది. నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ కూడా అదే నిజమన్నాడు.గొంతెమ్మ కోర్కెలు'అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ, విగ్ కావాలని డిమాండ్ చేశాడు. దృశ్యం 2లో బట్టతలతో కనిపించి ఇప్పుడు జుట్టుతో కనిపిస్తే బాగోదని నచ్చజెప్పాం. అప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకోవడంతో నోటీసులు ఇచ్చాం' అని పేర్కొన్నాడు. దీంతో అతడి స్థానంలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నట్లు కూడా తెలిపాడు. ఇంతలోనే ప్రకాశ్ రాజ్ తెరమీదకు రావడం, ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. Started shooting for this engaging franchise #Drishyam3 in hindi. With a wonderful team and a scintillating role to play . Im sure you will love it . ❤️❤️❤️( and yes im not replacing anyone..) 😛😛😛— Prakash Raj (@prakashraaj) February 10, 2026 చదవండి: ఏదైనా జరగరానిది జరిగితే.. శ్రీహాన్ మంచి మనసు -
స్పిరిట్ నుంచి అవుట్? ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే!
ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య వాయిస్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో ప్రకాశ్ రాజ్, ప్రభాస్ డైలాగులు వినిపించాయి తప్ప మనుషులు కనిపించలేదు. అయినప్పటికీ ఆడియో గ్లింప్స్‌తోనే స్పిరిట్‌కు మంచి హైప్ వచ్చింది.స్పిరిట్‌పై రూమర్అయితే ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నాడంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌తో వచ్చిన విభేదాల కారణంగానే ప్రకాశ్‌రాజ్ సినిమా నుంచి సైడ్ అయిపోయాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ ప్రచారంపై ప్రకాశ్ రాజ్ ఘాటుగానే స్పందించాడు. మీ ప్రచారాలు తగలెయ్యస్పిరిట్ మూవీ గురించి విషపూరిత ప్రచారం చేస్తున్న అందరికీ చెప్పొచ్చేదేంటంటే.. ఇంకా సినిమాలో నా సీన్స్ షూటింగే మొదలవలేదు. కానీ, అంతలోనే వాట్సాప్ ఫ్యాక్టరీలో ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోండి, పోయి మీ పని మీరు చూసుకోండి ట్వీట్ చేశాడు. దీనికి నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. సినిమాదీంతో స్పిరిట్ నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నాడన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. స్పిరిట్ విషయానికి వస్తే.. ప్రభాస్, ప్రకాశ్‌రాజ్‌తో సహా వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రి, కాంచన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది. To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life 😂😂😂😂. #justasking— Prakash Raj (@prakashraaj) February 9, 2026 చదవండి: బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ -
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ వంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మొదలైంది. త్వరలో విదేశాలకు కూడా వెళ్లనున్నారు. కొన్నిరోజుల క్రితమే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అంతకు ముందు న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలి అంచనాలని పెంచేశారు. ఇప్పుడీ చిత్రం నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా నుంచి కొన్నాళ్ల క్రితం ఆడియో గ్లింప్స్ ఒకటి వదిలారు. ఇందులో ప్రభాస్, ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు వాయిస్ ద్వారా అర్థమైంది. హీరోయిన్ తృప్తి దిమ్రి కాగా వివేక్ ఒబెరాయ్ కూడా ఉన్నాడని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ప్రకాశ్ రాజ్.. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సులే కారణమని మాట్లాడుకుంటున్నారు. సందీప్ వర్కింగ్ స్టైల్ గానీ సినిమా తీసే విధానం మిగతా దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మరి ఎక్కడ సమస్య వచ్చిందో గానీ ప్రకాశ్ రాజ్ తప్పుకొన్నారనే విషయం చర్చనీయాంశమవుతోంది. మరి ఇదే నిజమైతే ఇతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి? -
బాలీవుడ్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు
సౌత్ టు నార్త్.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్ రాజ్. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్‌లో కేరళ లిటరేటర్ ఫెస్టివల్‌కు ప్రకాశ్ రాజ్ హాజరయ్యాడు. సహజత్వం లేదుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్‌లా ఉంటుంది.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి. ఫోకస్ అంతా దానిపైనేదళితుల సమస్యలను తమిళ యంగ్ డైరెక్టర్స్ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక బాలీవుడ్ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్, రీల్స్, ప్రమోషన్స్.. వీటిపైనే ఫోకస్ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్ ఇచ్చిన నటి -
వీళ్లకు బుద్ది రావాలంటే.. పవన్, చంద్రబాబులను ఏకిపారేసిన ప్రకాష్ రాజ్
-
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
డాబా గార్డెన్స్: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పేరిట అమ్మడం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు. కళ్లముందే విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యాపారం (ప్రైవేటీకరణ) జరుగుతోంది. అమ్మేవాడు ఒకడు. కొనేవాడు ఒకడు’’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో 1,007 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రైవేట్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలంతా ఏకమై పోరాడి అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎవరిని బలపరచాలో వారు నేర్చుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా శ్రామిక ఉత్సవ్ ప్రారంభానికి హాజరైన ఆయన శనివారం ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిదానంగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా విమానయాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉందని, ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ప్రజలు, కార్మికుల ఓపికను పరీక్షిస్తున్నారని అన్నారు. ప్రశ్నిoచే గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి పరిస్థితులపై నిరంతరం పోరాటం చేయడమే మార్గమని సూచించారు. ప్రశ్నిoచేవారు ఉండకూడదని పాలకులు కోరుకుంటారని, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. వందేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఒక్కరూ లేరని, వారు చడ్డీల నుంచి ప్యాంట్లకు వచ్చారు తప్ప సాధించిందేమీ లేదని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. భారత దేశం సరోవరమైతే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్ఎస్ఎస్ అని అన్నారు. శివాజీ వ్యాఖ్యలు అహంకార పూరితం సినీ నటుడు శివాజీ మహిళలపై మాటలు అహంకారంతో కూడినవని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. విశాఖ విచ్చేసిన ఆయన ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేదికలపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు ఒళ్లు, భాష జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. శివాజీ చెత్తగా మాట్లాడారు.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే తరతరాలుగా అన్యాయం జరుగుతుందని.. మహిళలను కుసంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ల అవయవాలు మాత్రమే కనిపిస్తాయన్నారు. నటి అనసూయపై గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాష్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. శివాజీ మాటలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. తన మద్దతు ఎప్పుడూ అనసూయకే ఉంటుందన్నారు. శివాజీ మాటలు చూస్తుంటే.. ఒక మహిళలో ఆయనకు కేవలం అవయవాలు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. -
టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే సినిమాలు చూడకండి: ప్రకాశ్ రాజ్
టాలీవుడ్లో ఈ ఏడాది ఏదైనా ఓ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే అది టికెట్ రేట్ల గురించే. పెద్ద సినిమాల రిలీజయ్యే ప్రతిసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. కొన్నిసార్లు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా అభిప్రాయాలు వినిపించాయి. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం టికెట్ ధరలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్)సీఐటీయూ మహాసభల కోసం వైజాగ్ వచ్చిన ఈ నటుడు.. మీడియాతో మాట్లాడారు. మహిళలపై శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి ఘాటుగా స్పందించారు. పురుషుల వల్ల మహిళలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోంది, ఓ వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయంలో అనసూయకే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశాడని, అది ముమ్మాటికీ తప్పే అని చెప్పుకొచ్చాడు.ఇలా మాట్లాడుతున్న టైంలోనే.. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటని ప్రకాశ్ రాజ్‌ని అడగ్గా.. అయితే సినిమాలు చూడకండి. ఎవరి వ్యాపారం వాళ్లది అని కుండబద్దలు కొట్టేశాడు. చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్‌కి ఎలా తీసుకురావాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. ఈ నటుడు మాత్రం ఇలా ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా)"Don't watch Films if you think they're Expensive. Cinema is a Business."- #PrakashRaj pic.twitter.com/zYYgejLF96— Movies4u Official (@Movies4u_Officl) December 27, 2025 -
ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్
-
మరోసారి పోకిరి కాంబో.. వారణాసితో పాన్ వరల్డ్ షేక్
-
రాజమౌళి-మహేశ్ బాబు వారణాసి.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది..!
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్‌ను గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వారణాసికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను.. ఇది నాలో నటుడి ఆకలి తీర్చిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు..మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.ప్రకాశ్ రాజ్ రోల్ అదేనా?అయితే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ రోల్‌పై టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు తండ్రిగా కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో ప్రకాశ్ రాజ్ రోల్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ప్రకాశ్ రాజ్ గతంలో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు చిత్రంలో నటించారు. Wrapped up a wonderful schedule of #Varanasi .. a joy to the hungry actor within me .. thank you @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @priyankachopra ❤️❤️❤️ it was exhilarating to work with you all .. can’t wait to resume the next schedule 🥰🥰🥰— Prakash Raj (@prakashraaj) December 23, 2025 -
Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే
-
'తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే..'.. ప్రకాశ్ రాజ్
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీనటుడు ప్రకాశ్ రాజ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో జూలై 30న ఈడీ ముందు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా.. ఆన్లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు.ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..'నోటీసులు రావడంతోనే సీఐడీ విచారణకు హాజరయ్యా. బ్యాంకు స్టేట్మెంట్స్ అన్ని గతంలోనే సమర్పించా. 2016లో బెట్టింగ్ యాప్‌కి ప్రమోషన్ చేశా. 2017లో బెట్టింగ్ యాప్‌లను నిషేధించారు. బెట్టింగ్ యాప్ ఎవరు వాడకండి. యువత బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దు.. అడ్డదారిలో వెళ్లకండి. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే. సీఐడీ విచారణలో బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం ఇచ్చా. బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా రాంగ్ వే. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టకండి. ముఖ్యంగా యంగ్ స్టార్స్ అర్థం చేసుకోవాలి. వీటివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. అది బాధాకరమైన విషయం' అని అన్నారు.కాగా.. ఈ బెట్టింగ్ యాప్ కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రకాశ్ రాజ్‌తో పాటు పలువురు టాలీవుడ్ తారలు కూడా సీఐడీ ఎదుట హాజరయ్యారు. టాలీవుడ్ హీరో విజయ్‌దేవరకొండ కూడా సీఐడీ విచారణ ఎదుర్కొన్నారు. మంగళవారం గంటకుపైగా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కాగా.. గతంలో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
కన్నడ నటికి అవార్డు.. సీఎం చేతుల మీదుగా సన్మానం (ఫోటోలు)
-
'OG' మూవీలో పవర్ఫుల్ రోల్లో ప్రకాశ్ రాజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఓజీ (OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్‌ను పక్కనపెట్టి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వదిలింది చిత్రయూనిట్. ఓజీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఉన్నట్లు ప్రకటించింది. సత్య దాదాగా ప్రకాశ్ రాజ్ఈమేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్.. శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును సత్యదాదాగా ప్రకటించారు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv— DVV Entertainment (@DVVMovies) September 18, 2025 చదవండి: దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్ -
దయచేసి బెట్టింగ్ యాప్‌ల్లో ఆడకండి: ప్రకాష్‌రాజ్
-
తెలియక చేశా.. నేను డబ్బు తీసుకోలేదు: ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఈయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ ప్రకాశ్ రాజ్‌తో పాటు మొత్తం 29 మందికి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరైన ఇతడు.. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ కి ప్రకాశ్ రాజ్ కౌంటర్)'చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యాను. దయచేసి బెట్టింగ్ యాప్‌లలో ఆడకండి. కష్టపడి సంపాదించుకోండి. ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ తెలియక ప్రమోట్ చేశాను. అందులో నేను డబ్బులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను' అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇదే కేసులో రానా, మంచు లక్ష్మీ సహా చాలామంది యూట్యూబర్స్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్) -
చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్‌కి కౌంటర్స్ ఇస్తూనే ఉంటారు. రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'పై రెచ్చిపోయారు. పవన్ చేతకానితనం వల్లే ఈ మూవీ ఆలస్యమైందని, ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్‌కి వచ్చుంటే రెండేళ్ల క్రితమే ఈ చిత్రం రిలీజ్ అయ్యేండేది కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఇలా రెచ్చిపోయారు.(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్)'మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడుతాం. చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? ఎవరికి అమ్ముతున్నారు. ఇంతకు ముందు ఏఎన్నార్, ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయంటే ఎదురుచూసేవాళ్లం. కానీ మీరు చేస్తున్నది నమ్మకద్రోహం కాదా?''బాహుబలి లాంటి సినిమా రాజమౌళి తీస్తే అది ఎలా ఆడింది? ట్రెండ్ సెట్ చేసింది. అదే మేము చేస్తున్నామని చెప్పి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. ఎలాంటి దోపిడి చేస్తున్నారు? ఎవరిని దోపిడి చేస్తున్నారు? మీ అభిమానుల్నే కదా! మీ సినిమాలో ఆ రేంజు వీఎఫ్ఎక్స్ ఉన్నాయా? కథ ఉందా? నిజాయతీ ఉందా? నాలుగైదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది. మీ చేతకాని తనంతో కదా?''కథల్ని మార్చి, అందులో మీ రాజకీయ సిద్ధాంతాల్ని రుద్ది, దాన్ని ఓ సినిమాగా చేయాలని వచ్చి.. ఇంత కష్టపడ్డాం, ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అని అంటున్నారు. ఈ పదిరోజులు ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్స్‌కి నిజాయితీగా వచ్చుంటే రెండేళ్ల ముందే రిలీజయ్యేది కదా ఈ సినిమా!''మహేశ్ బాబు-జూ.ఎన్టీఆర్ గతంలో ఓ వేదికపై ఉన్నప్పుడు ఏం చెప్పారు వాళ్లు ఫ్యాన్స్‌కి? మేమిద్దరం ఫ్రెండ్సే.. మేం మేం బాగానే ఉంటాం. మా కోసం మీరు కొట్టుకోవద్దు అని అన్నారు. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు.. తిరిగి కొట్టమంటాడా? నిన్ను చొక్కా చించుకుని ప్రేమించేవాళ్లు.. నిన్ను ప్రేమిస్తుంటే వాళ్లని నీ సైనికులు అనుకుంటున్నావా? ఇది నాన్సెన్స్. పవన్ ఫ్యాన్స్‌కి బాడీ పార్ట్స్ తప్పితే వేరేది తెలియదు. వాళ్లని నువ్వు కరెక్ట్‌గా ఉండమని చెప్పవు. కానీ వేరే ఎవడైనా ట్రోల్ చేస్తే మాత్రం గట్టిగా ట్రోల్ చేయమంటావా? అసలు మనసాక్షి లేని ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడతాం. ఇది కోపం కాదు నా ఆవేదన''నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి.. అది జనాలకు నచ్చకపోతే నేను అర్థం చేసుకుంటా. ఒకవేళ ఫ్లాప్ అయితే అది ప్రయోగం అనుకోవచ్చు. కానీ నీ అహంకారం వల్లే సినిమా ఐదేళ్లకు వచ్చింది. ఒక డైరెక్టర్ అనుకున్న పరిస్థితిని మీరు కల్పించారా? ఎవరిని మోసం చేస్తావు? ఒక నిజాయితీ ఉండాలి కదా. నీకు సిగ్గు అనిపించడం లేదా? ఇలాంటి ద్రోహానికి రూల్స్ లేవు కాబట్టి తప్పించుకుంటున్నారు. నేను పాలిటిక్స్ మాట్లాడుతాను కానీ నా సినిమాల్లో మాట్లాడను. అది వేరు ఇది వేరు కదా. చివరికి ఎవరిని కోల్పోతున్నావు? నిన్ను ప్రేమించేవాళ్లనే దోపిడి చేయడం కరెక్ట్ కాదు' అని ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం) -
ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్
-
సినీ తారలకు ఈడీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తేదీల వారీగా సినీతారలకు విచారణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మిలకు వేర్వేరుగా సోమవారం సమన్లు జారీ చేసింది. బుధవారం రానా దగ్గుబాటి, ఈ నెల 30న ప్రకాశ్‌రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మిలను విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేయడంలో వారి పాత్ర..ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు..తీసుకున్న పారితోషకాల వివరాలు, అందుకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకుని హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరుకావాలని సూచించారు. సైబరాబాద్, సూర్యాపేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. లోన్ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది. -
బెట్టింగ్ యాప్ కేసు: సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)ని జూలై 23న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రకాశ్ రాజ్‌ను జూలై 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది.సెలబ్రిటీలపై కేసుకాగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటివరకు దాదాపు 25 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. వీరిలో ప్రకాశ్ రాజా, రానా, మంచు లక్ష్మితో పాటు ప్రణీత, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, అనన్య నాగళ్ల తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌కు వీరు భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణలో.. ఆ లావాదేవీల గురించి ఈడీ ఆరా తీయనుంది.చదవండి: యాక్సిడెంట్.. పక్షవాతం రావొచ్చన్నారు, అప్పుడు తమన్..: సింగర్ -
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై ప్రకాశ్ రాజ్ సెటైరికల్ పోస్ట్
-
ప్రకాశ్‌రాజ్.. ఆంధ్ర రైతుల సంగతి చూడు
కర్ణాటక: ప్రముఖ నటుడు, సామాజిక అంశాలపై గళమెత్తే ప్రకాశ్‌రాజ్, కాంగ్రెస్ సర్కారు మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. దేవనహళ్లిలో పరిశ్రమలకు భూములు సేకరించడాన్ని ఖండిస్తూ రైతుల ధర్నాలో ఆయన పాల్గొనడాన్ని ఓ మంత్రి తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు ఇస్తున్నారని, భూ స్వాదీనం తప్పనిసరి అని పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన దేవనహళ్లి రైతులకు మద్దతుగా పోరాడుతున్న ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో భూముల స్వాధీనం జరుగుతోందని, అక్కడ రైతులకు మద్దతుగా పోరాడితే మంచిదని సలహా ఇచ్చారు.ప్రకాశ్‌రాజ్ కర్ణాటకలో కంటే ఆంధ్ర, తమిళనాడులో బాగా ఫేమస్ అన్నారు. రాష్ట్రంలో హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ కోసం 1200 ఎకరాల భూమి మాత్రమే స్వాదీనం చేసుకుంటుంటే, ఇదే అవసరానికి ఆంధ్రప్రదేశ్‌లో మడకశిర నుంచి పెనుకొండ వరకూ 10 వేల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ అవసరాల పేరుతో అన్నదాతల నుంచి 45 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని, విశాఖ పట్నంలో 95 పైసలకు ఒక ఎకరాను కట్టబెడుతున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రకాశ్ రాజ్ కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి సవాల్‌కు ప్రకాశ్‌రాజ్ ఏమని స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది. -
బాలీవుడ్ అమ్ముడు పోయింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj ) బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో సగం మంది నటీనటులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అందుకే వారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ప్రకాశ్ రాజ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడానికి కారణాలను వివరించారు.“నేను సూటిగా మాట్లాడతాను. రాజకీయ పరిణామాలపై నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతుంటాను. దీని వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని భావించి, నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసిన తర్వాతే నేను గళం విప్పాలని నిర్ణయించుకున్నాను,” అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించాలనే ఆలోచన చాలా మందిలో ఉన్నప్పటికీ, ధైర్యంతో ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“సినిమా పరిశ్రమలో సగం మంది అమ్ముడుపోయినవారే. కొంతమంది మంచివారు ఉన్నప్పటికీ, ప్రశ్నించే ధైర్యం లేదు. నా సన్నిహిత మిత్రుడు ఒకరు, ‘ప్రకాశ్, నీకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నావ్, మాకు అంత ధైర్యం లేదు’ అని చెప్పారు. వారి పరస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ, చరిత్ర నేరాలు చేసిన వారిని క్షమించినా, మౌనంగా ఉండేవారిని మాత్రం క్షమించదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన తాజాగా సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రంలో కనిపించారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’, విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పాక్ నటుడి సినిమాపై బ్యాన్ వద్దు.. రిలీజ్ చేయాలి: ప్రకాశ్ రాజ్
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ అన్నిరకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే దేశంలో ఉన్న పాక్ ప్రజలను వారి స్వదేశానికి వెళ్లగొట్టింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో డీయాక్టివేట్ చేసింది. వారి యూట్యూబ్ ఛానళ్లను సైతం నిలిపివేసింది. పాక్ నటులను, వారి సినిమాలను బ్యాన్ చేసింది.సినిమాలను నిషేధించకూడదుదీంతో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) నటించిన అబీర్ గులాల్ సినిమా రిలీజ్ ఆగిపోయింది. సినిమాలను బ్యాన్ చేయడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుపట్టాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మాట్లాడుతూ.. సినిమాలను నిషేధించడాన్ని నేను సమర్థించను. అది ఎటువంటి సినిమాలు అయినా సరే.. వాటిని జనాల నిర్ణయానికి వదిలేయాలి. శృతిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదు అని పేర్కొన్నాడు. అయితే పాక్ నటుడి సినిమాను సపోర్ట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు వస్తున్నాయి.అబీర్ గులాల్..పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం అబీర్ గులాల్ (Abir Gulaal Movie). వాణీ కపూర్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఆర్తి ఎస్.బగ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్ నిర్మించారు. మే 9న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అంతలోనే జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగ్గా.. కేంద్రం పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాక్ నటుడు ఫవాద్ నటించిన అబీర్ గులాల్ సినిమాపై బ్యాన్ ప్రకటించింది.చదవండి: సారీ చెప్పమన్న బేబీ డైరెక్టర్.. రెండేళ్ల జీవితం వృథా అన్న బాలీవుడ్ హీరో -
పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తలచుకుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి అత్యంత క్రూరమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ రెండు పేజీల సందేశాన్ని ట్వీట్ చేశారు.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏప్రిల్ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రాంతమైన పహల్గామ్లో నెత్తురు చిందిన రోజు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. ఈ దారుణమైన చర్యను చెప్పడానికి నకాు మాటలు కూడా రావడం లేదు. అందుకే బాధతో కూడిన హృదయంతోనే రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంంగా కాల్చి చంపారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితికి గురయ్యారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి కశ్మీర్‌పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేసిన దారుణచర్య. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది' అని రాసుకొచ్చారు.ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమానాలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య.. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మన ఇంటిలో జరిగిన ఈ కృరమైన చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన లేదు. ఉగ్రవాదులు ఏం ఆశించి ఇంత దారుణానికి ఒడిగట్టారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసిందని.. ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చిందని ప్రకాశ్ రాజ్ అవేదన వ్యక్తం చేశారు.కశ్మీర్ ఆట స్థలం కాదు.. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదని అన్నారు. మీరు ఉపయోగించుకునే ఆయుధం కాదు.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశమే కశ్మీర్ అని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిది. మీతో పాటు మీరు కోల్పోయిన దానికి మేము చింతిస్తున్నామని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. మీరు కశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు.. కానీ మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాశ్‌రాజ్ పోస్ట్ చేశారు. Listen to this Voice from Kashmir . 🙏🏿🙏🏿🙏🏿💔💔💔 #PahalgamTerrorAttack pic.twitter.com/CJGsXcy3O1— Prakash Raj (@prakashraaj) April 24, 2025 -
Prakash Raj: పవన్ సనాతన వేషం వెనుక రహస్యం
-
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్‌గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025 -
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
బెట్టింగ్ యాప్ కేసు.. అవును ప్రమోట్ చేశా.. కానీ: స్పందించిన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. అయితే 2016 జూన్‌లో ఓ యాడ్ చేసినట్లు తెలిపారు. అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వ్యవహారంపై వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..' బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ నేను ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందంతో చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరణ ఇస్తా' అని అన్నారు.My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls— Prakash Raj (@prakashraaj) March 20, 2025 -
బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాష్ రాజ్ వివరణ
-
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్‌కి ప్రకాశ్‌రాజ్ జత చేశారు.‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు ప్రకాష్‌రాజ్. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారాయన.కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA— Prakash Raj (@prakashraaj) March 15, 2025‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు. -
పవన్ కల్యాణకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
-
తమిళులపై కామెంట్స్.. పవన్‌కు ప్రకాష్‌రాజ్ కౌంటర్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నటుడు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please..’ అంటూ కామెంట్స్ చేశారు."మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please... 🙏🏿🙏🏿🙏🏿 #justasking— Prakash Raj (@prakashraaj) March 14, 2025ఇక, అంతకుముందు.. పవన్ కల్యాణ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జాతీయ విద్యావిధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్‌ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఇప్పటికే సీఎం స్టాలిన్ దీనిపై స్పందించారు. ‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. -
నటుడు ప్రకాష్ రాజ్ కొత్త కారవ్యాన్ చూశారా (ఫోటోలు)
-
ఈయన్ను బయటకు పంపించేయండి: విజయ్ సేతుపతి
భిన్న నటులందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారు. తమిళ సినీ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అరవింద్ స్వామి, మలయాళ హీరో ఉన్ని ముకుందన్, కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్, తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ నటుడు విజయ్ వర్మ.. అందరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతాఇందులో విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలకు మిగిలినవారంతా పడిపడి నవ్వారు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే నేను అభద్రతాభావానికి లోనవుతాను. ఫలానా సన్నివేశంలో అంత ఈజీగా ఎలా యాక్ట్ చేశారు? అని ఆలోచిస్తుంటాను.. అని విజయ్ చెప్పుకుంటూ పోతుంటే అరవింద్ స్వామి నవ్వకుండా ఉండలేకపోయాడు.(చదవండి: Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ)అంతా ఈయన వల్లే..అతడిని చూసి ప్రకాశ్ రాజ్ సైతం నవ్వేశాడు. ఈయన వల్లే నవ్వానంటూ ప్రకాశ్.. అరవింద్వైపు వేలు చూపించాడు. దీంతో సేతుపతి.. సర్.. ఈయన నన్ను మాట్లాడినవ్వట్లేదు. ఇంటర్వ్యూ మధ్యలో చెడగొడుతున్నాడు. వెంటనే ఈయన్ని బయట నిల్చోబెట్టండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కోరాడు. దీంతో అక్కడున్న మిగతా నటులు సైతం ఘొల్లుమని నవ్వారు.రాత్రి సిట్టింగ్..కొన్నిసార్లు అరవింద్ స్వామి నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. వెళ్లాక మేము తాగుతూ కూర్చుంటాం. రెండుమూడు గంటలపాటు నన్ను టీజింగ్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లయితే తెల్లవారేవరకు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని సీక్రెట్ బయటపెట్టాడు. ఇక మరో సందర్భంలో జీవిత సత్యాన్ని బయటపెట్టాడు. జీవితం కొన్నిసార్లు మనకు పాఠాలు చెప్తుంది. దాన్ని నేర్చుకోకపోతే లైఫ్ మనకు గుణపాఠం చెప్తుందన్నాడు. చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
అవకాశాలు రాకుండ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా నిలబడ్డ
-
సినిమా ఛాన్సులు పోయినా పర్వాలేదు ప్రశ్నిస్తా: ప్రకాష్ రాజ్
సౌత్ ఇండియాలో పాపులర్ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తన కుటుంబంతో పాటు సినిమా ఛాన్స్‌ల విషయం గురించి కూడా మాట్లాడారు. తన జీవితంలో ఎక్కువగా బాధించిన ఘటనలు రెండు ఉన్నాయని ఆయన అన్నారు. తన కుమారుడి మరణమంతో పాటు స్నేహితురాలు గౌరీ (గౌరీ లంకేష్) మరణం అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.ప్రకాశ్ రాజ్- లలిత పెద్ద కుమారుడు సిద్ధు (5) 2004లో మృతి చెందాడు. మేడపై గాలిపటాన్ని ఎగురవేస్తున్న సమయంలో ఒక స్టూల్ నుంచి జారిపడి కన్నుమూశాడు. ఆ సమయం నుంచి ప్రకాష్ రాజ్, లలిత మధ్య విభేదాలు పెరిగాయి. అలా చివరికి 2009లో లలితకు ప్రకాష్ రాజ్ విడాకులు ఇచ్చారు. అనంతరం 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కుమారుడి మరణం తీవ్రంగా బాధపెట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. కానీ, అలాగే బాధలో ఉండిపోతే ఎలా..? అని ముందుకు సాగానంటూ పంచుకున్నారు. 'ఆ సంఘటనతో నేను స్వార్థపరుడిగా మారలేను. నాకు కుమార్తెలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నాకు వృత్తి ఉంది, నాకు మనుషులు ఉన్నారు. నేనూ ఒక మనిషి, నాకు జీవితం ఉంది, నాపై ఆధారపడి ఉన్న వాళ్లకు నేను చేయాల్సింది చాలా ఉంది. అందుకే తిరిగి నిలబడ్డాను.' అని ఆయన అన్నారు.ప్రశ్నించడం ఆపనుఇండస్ట్రీలో బాలచందర్, కృష్ణవంశీ, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు ఇచ్చిన అవకాశాలే తనను ఇంతటి స్థాయికి చేర్చాయని ప్రకాష్‌రాజ్ గుర్తుచేసుకున్నారు. కథ బాగుంటే ఎలాంటి సినిమానైనా చేస్తానని ఆయన తెలిపారు. తనకు ఉన్న టాలెంట్‌కు ప్రజల నుంచి ఆదరణ, ప్రేమ వల్లే ఇక్కడ తాను నటుడిగా కొనసాగుతోన్నానని చెప్పారు. నేటి సమాజంలో గళం వినిపించలేని ప్రజలకు గొంతుకగా ఉంటానని ఆయన అన్నారు. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని బలంగా చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎన్ని కుట్రలు పన్నినా తట్టుకొని నిలబడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్‌లో కూడా అంతే స్థాయిలో నిలబడతానని ప్రకాష్ రాజ్ అన్నారు. -
కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్
గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ వరస ట్వీట్స్ వేస్తున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. దేనికి కూడా పవన్ నుంచి సమాధానం లేదు. ఇక రీసెంట్గా ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. హీరో కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్న విషయం గురించి మాట్లాడారు. తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు.(ఇదీ చదవండి: కొండా సురేఖపై పిటిషన్.. కోర్టులో నాగార్జున స్టేట్మెంట్)అసలేం జరిగింది?కార్తీ హీరోగా నటించిన 'సత్యం సుందరం'.. సెప్టెంబరు 28న తెలుగులో రిలీజైంది. అంతకు కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఇందులో యాంకర్, లడ్డు గురించి ఓ ప్రశ్న అడగ్గా.. అది సెన్సిటివ్ మేటర్ వద్దులేండి అని కార్తి అనేశాడు. ఇందులో ఏం లేనప్పటికీ.. పవన్ ఈ విషయాన్ని ఓ ప్రెస్మీట్లో చెప్పారు. ఎందుకొచ్చిన సమస్యలే అని కార్తి క్షమాపణ చెప్పాడు. అంతటితో అది అయిపోయింది.ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. కార్తీ ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయలేదని, తప్పు లేకపోయినా సరే సారీ చెప్పించుకున్నారని అన్నాడు. నార్మల్ అయితే క్షమాపణ చెప్పకపోయేవాడు. సినిమా రిలీజ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ తదితరులకు ఇబ్బంది రాకూడదని చెప్పి ఉంటాడని అన్నాడు. సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుని మరీ సారీ చెప్పినట్లు పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందన్న టాలీవుడ్ హీరోయిన్)కార్తిది తప్పు లేకపోయినా ఆయన చేత పవన్ కళ్యాణ్ సారి చెప్పించుకున్నాడు సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ Create చేసి సారీ చెప్పినట్లు ట్విట్టర్ లో ప్రచారం చేశారు -@prakashraaj 🔥🔥🔥 pic.twitter.com/1gFGL0vioV— MBYSJTrends ™ (@MBYSJTrends) October 7, 2024 -
లడ్డూ వివాదంపై పవన్ కల్యాణ్ కు క్లాస్ పీకిన ప్రకాష్ రాజ్
-
ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సినీ నటులు గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa— Prakash Raj (@prakashraaj) October 2, 2024అంతకుముందు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. దుబాయ్ నుండి సోషల్ మీడియాను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్ సెటైర్లు -
ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. పవన్‌పై మళ్లీ సెటైర్!
గత కొన్నిరోజుల నుంచి ప్రకాశ్ రాజ్-పవన్ కల్యాణ్ మధ్య ట్విటర్ వార్ నడుస్తూనే ఉంది. తిరుపతి లడ్డూ విషయమై మొదలైన ఈ రచ్చ కాస్త ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తప్పు ఎక్కడ జరిగింది? ఎవరు చేశారనేది పక్కనబెట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారు. ఈయనకు వంతపాడటం అన్నట్లు లడ్డూ వ్యవహారాన్ని రాజకీయాంగా ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో రెచ్చగొట్టేలా పవన్ పలు కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!)గత కొన్నిరోజుల నుంచి పవన్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజులో ఆడుకుంటున్న ప్రకాశ్ రాజ్.. మరోసారి సెటైరికల్ ట్వీట్ వేశాడు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్‌పై కౌంటర్ వేశాడు.'నువ్వు మైనారిటీవి అయినా నిజం ఎప్పటికీ నిజమే -మహాత్మా గాంధీ. మనకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఇదే భారత్, పాకిస్థాన్‌ల మధ్య తేడా. -లాల్ బహదూర్ శాస్త్రి. మీ అందరికీ #గాంధీ జయంతి #లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు … ఈ సత్యాన్ని మనందరిలో నింపనివ్వండి జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)Wishing you all happy #GandhiJayanti #LalBahadurShastriJayanti … Let this TRUTH sink into all of us 🙏🙏🙏 #justasking pic.twitter.com/AQV92znBHc— Prakash Raj (@prakashraaj) October 2, 2024 -
ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పై ప్రకాశ్ రాజ్ సటైర్లు
-
పవన్ అసలు రంగు బట్టబయలైంది
ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగకండితిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్ రిపోర్టులో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందు ఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జూలైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడెందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్. – ప్రకాశ్‌రాజ్, ప్రముఖ నటుడుదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun— Prakash Raj (@prakashraaj) September 30, 2024 సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది – సుబ్రమణియన్‌స్వామి, మాజీ ఎంపీ Tirupati Laddu controversy: Supreme Court slams CM Naidu, says no conclusive proof yet. Test report was on rejected ghee https://t.co/3ZHuifcdWN via @PGurus1— Subramanian Swamy (@Swamy39) September 30, 2024బాబు, పవన్ రాజీనామా చేయాలిచంద్రబాబు, పవన్ ఇద్దరూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారు. తిరుమల దేవస్థానంపై విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు వీరే బాధ్యత వహించాలి. హిందువులను మోసం చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు పశ్చాత్తాప్పడి పదవులకు రాజీనామా చేయాలి. -పీవీఎస్ శర్మ, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారిSC has put the ball in Central govt court whether to continue SIT investigation or with other agencies.One more issue by which Modi govt will control @ncbn in addition to #SkillDevelopmentScam We have to wait & see how both CM and Dy CM will dance to BJP tunes in Delhi.— PVS Sarma (@pvssarma) September 30, 2024From day one, since #TTDprasadam controversy erupted, I was convinced that only non-believers & dirty minds would play with devotees sentiments.I was not wrong.CM @ncbn & Dy CM @PawanKalyan raised the issue without any proof or evidence& hurt sentiments.#Thoo#CheeChee— PVS Sarma (@pvssarma) September 30, 2024భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం. నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఒక ఆహార పదార్థంలో 14 రకాల కల్తీలు చేయవచ్చా? ఇక మతవాదులకు చెప్పడానికి ఏముంది! – ధన్య రాజేంద్రన్ (ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ చీఫ్)Tirupati laddu row: How politics is shaping the conflictWas adulterated ghee actually used in srivari laddu?Should devotees really be worried about their faith being defiled?@PoojaPrasanna4 tells you all about this and more in this week's Let Me Explain. Watch the full… pic.twitter.com/6RoAAsw0P8— TheNewsMinute (@thenewsminute) September 27, 2024 దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి – పూనమ్‌కౌర్, నటి "At least the Gods should be kept away from politics"- SUPREME COURT 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2024బాబు, పవన్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను చూస్తుంటే సిగ్గేస్తోంది. – గబ్బర్, ప్రముఖ మలయాళీ రచయిత బాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని మతపరమైన భావోద్వేగాలు ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలోనే ‘ఎక్స్’లో చెప్పాను. ఈరోజు సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పింది. – శ్రీధర్ రామస్వామి, ఏఐసీసీ సోషల్ మీడియా నేషనల్ కో–ఆర్డినేటర్A few days ago I had posted on the Tirupati Laddu row was instigated by CBN to make it communal and he has a history to that. Today the SC has pulled up CBN for his remarks 👇 https://t.co/jHMeraRveB pic.twitter.com/PLEA4MmXUA— Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) September 30, 2024 పవన్ అసలు రంగు బట్టబయలైంది తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి – వీణా జైన్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్) Breaking!🚨Police raid on Sadhguru Isha Foundation, Today only Madras High court raised serious concerns over itThere are multiple allegations on Sadhguru & his foundation. Details of raid yet to come pic.twitter.com/UQrQ1Z289A— Veena Jain (@DrJain21) October 1, 2024దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? – ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ రాజ్యసభShame! If such be the case why did the Chief Minister claim otherwise? Will temples now be dragged into the politics of targeting opponents? For a few thousand votes it is okay to drag our places of worship?How is it okay to shake the faith of crores of devotees who believed… pic.twitter.com/DASek9o77h— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 30, 2024బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా! చంద్రబాబూ సిగ్గు సిగ్గు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెబుతారా! – సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకులు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారురాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. వీరిద్దరూ క్షమాపణ చెప్పాలి. పవన్ చాలా గొప్ప నటుడు. ఆయన నటనతో రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటే అది పొరపాటే. – డాక్టర్ గిరిజా షేట్కార్, యూనివర్సల్ హెల్త్ రైట్స్ అడ్వొకేట్ఇప్పుడేం చేస్తారు మీరందరూ అబ్బబ్బ.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు? భక్తుల మనోభావాల్ని ఎంత హింసించేశారు? రాజకీయ నేతల్ని పక్కన పెడదాం.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్ చేశారు వీళ్లంతా. ప్రాయశి్చత్త శ్లోకాలట..! వాళ్లే కనిపెట్టేసి .. రామ రామా.. మీరు చేసింది మామూలు రచ్చనా.. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా! ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వేంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి.. ఎంత మంది పెడతారో చూస్తాను. – వీణావాణి, వేణు స్వామి భార్యవైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధమాడారు. ఇది వారు రాజకీయ స్వార్ధంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గు చేటు. – హర్ష్ తివారి -
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ప్రకాశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి' అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల లడ్డు విషయంలో దీక్షలు చేస్తానంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రకటించారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ పలుసార్లు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం వ్యాఖ్యలతో మరోసారి పవన్‌కు తనదైన శైలిలో చురకలంటించారు.(ఇది చదవండి: 'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్)సోమవారం సుప్రీం కోర్టులో లడ్డు అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అంటూ పోస్ట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking— Prakash Raj (@prakashraaj) October 1, 2024 -
ట్విట్టర్లో ప్రకాష్ రాజ్ మరో చురక..
-
'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో మరోసారి స్పందించారు. తాజాగా సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది.సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తెలుపుతూ ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్' అంటూ ఒక పోస్ట్ చేశారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పలుమార్లు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు.. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పలు ప్రశ్నలు సంధించడంతో ప్రకాశ్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun— Prakash Raj (@prakashraaj) September 30, 2024 -
ఎందుకింత అయోమయం పవన్..
-
పవన్ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ మరో సూటి ప్రశ్న
తనని తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకొంటున్న పవన్ కల్యాణ్‌కి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వరస షాకులు ఇస్తున్నాడు. గత రెండు రోజులుగా ట్విటర్లో ప్రకాశ్ రాజ్-పవన్ మధ్య పెద్ద వార్ జరుగుతోంది. తాజాగా మరో ట్వీట్ చేసి పవన్ కల్యాణ్ తీరుని ఎండగట్టారు. మనకేం కావాలి అని ప్రశ్నిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని లేవనెత్తారు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ట్వీట్లో ఏముంది?'మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చాడు.ఏం చెప్పాలనుకున్నారు?ప్రకాశ్ రాజ్ గత ట్వీట్స్‌తో పోలిస్తే ఈసారి పవన్ కల్యాణ్ తన మాటలతో ప్రజల భావోద్వేగాలని ఎలా రెచ్చగొడుతున్నారో అనేది చెప్పకనే చెప్పారు. దీని ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారా అని పవన్‌ని సూటిగా ప్రశ్నించారు. మరి ఈ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి)మనకేం కావాలి...ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?లేక ప్రజల మనోభావాలుగాయపడకుండా..పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..?జస్ట్ ఆస్కింగ్ #justasking— Prakash Raj (@prakashraaj) September 27, 2024 -
పవన్‌కు ప్రకాశ్‌రాజ్ కౌంటర్
-
అరె అవతారం..అయోమయం.. పవన్ పై ప్రకాష్ రాజ్ పంచులు
-
గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ‘‘గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్’’ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్.. పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు.దీనిపై పవన్ కల్యాణ్ మంగళవారం కనకదుర్గమ్మ ఆలయం వద్ద స్పందించారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ.. సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్ సూచించారు. ‘‘ ప్రకాష్ రాజ్‌తో పాటు పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్ మళ్లీ చదవి అర్థం చేసుకోవాలని’’ అని పేర్కొన్నారు. ఈ లోపు..ఈలోపే.. ‘సత్యం సుందరం’ ఈవెంట్లో ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ అని నటుడు కార్తీ నవ్వుతూ చెప్పడంపైనా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని సూచించడంతో కార్తీ క్షమాపణ చెప్పారు. అందుకు పవన్ బదులిస్తూ, కార్తి కావాలని అనలేదని అర్థమైందని అనడంతో అక్కడికి ఆ వివాదం ముగిసింది. అయితే.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...’ అని ప్రకాశ్‌రాజ్ పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగిసిపోదని అర్థమైంది. -
పవన్ కు ప్రకాష్ రాజ్ మరుసారి కౌంటర్
-
అందులో ఉన్న ఆనందం ఏంటో.. పవన్‌కి ప్రకాశ్ రాజ్ మరోసారి కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. హీరో కార్తీని పవన్ టార్గెట్ చేయడాన్ని తప్పు పడుతూ.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...’ అని ట్వీట్ చేశాడు.(చదవండి: దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వాడకండి : యాంకర్ రష్మి)తిరుమల లడ్డు వివాదంపై పవన్ కల్యాణ్ చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రకాశ్‌రాజ్ మొదటి నుంచి తప్పుపడుతున్నాడు. ‘జస్ట్ ఆస్కింగ్’అంటూ పవన్ చర్యలను తప్పుపడుతూ ట్వీట్ చేశాడు. ప్రకాశ్ రాజ్ పోస్టులపై పవన్ అసహనం వ్యక్తం చేశాడు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ప్రశ్నలకు సమాధానమిస్తానని, ఆలోపు వీలైతే తను చేసిన ట్వీట్స్ మళ్లీ ఒకసారి చదవండి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. కార్తీ వివాదం ఏంటి?‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ లడ్డు కావాలా అంటూ కార్తిని అడుగుతుంది. దానికి కార్తి నవ్వుతూ.. ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ వద్దులే అన్నాడు. ఆయన సరదా అన్నట్లు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కార్తి వ్యాఖ్యలను తప్పపడుతూ.. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. ఈ వివాదం పెద్దది కావొద్దనే ఉద్దేశంతో కార్తి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్... #justasking— Prakash Raj (@prakashraaj) September 25, 2024 -
హిందువులంతా ఏకం కావాలి
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై.. కలసికట్టుగా మాట్లాడాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే, ఆ మౌనం భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేయాలనుకుంటే తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి సిద్ధమని, కానీ, అక్కడిదాకా తీసుకెళ్లనని చెప్పారు. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? మాట్లాడేవారు ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పారు. సెక్యులరిజం అనేది వన్ వే కాదని అది టూ వే అని చెప్పారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మసీదులో చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని అన్నారు. హిందూ దేవుళ్లపైన మాట్లాడేవారు అల్లాహ్ పైన, మహ్మద్ ప్రవక్తపైన, జీసస్పైన మాట్లాడగలరా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇస్లాంపైన మాట్లాడితే ఆ మతం వారు పెద్దఎత్తును బయటకు వస్తారు అంటూ చెప్పారు. హిందువులను రోడ్లపైకి రమ్మని చెప్పడం లేదన్నారు. కనీసం హిందువులకు కోపం రాకపోతే ఏం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వారికి కూడా విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు వేయడం, మీమ్స్ చేయడం సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో జోకులు వేస్తున్నారని, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దేశమంతటికి కలిపి ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ తప్పనిసరి అని చెప్పారు. అంతకుముందు పవన్ కళ్యాణ్‌కు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయం మెట్లను కడిగి, పసుపు రాశారు.మహిళలను అడ్డుకున్న సిబ్బంది ఆలయంలో మెట్లను పవన్‌కళ్యాణ్ శుభ్రం చేసే కార్యక్రమానికి అర్ధగంట ముందు, ఆ తర్వాత కూడా మహిళా భక్తులు మెట్ల పూజ చేసుకోకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్న మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని క్యూలైన్లోకి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, మహిళా భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెట్ల పూజ మొక్కు పూర్తి చేసుకోకుండా దర్శనానికి వెళ్లమని చెప్పడం ఎంత వరకు సబబని మహిళలు మండిపడ్డారు. -
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్
-
పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పవన్.. ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ .. నేను చేసిన ట్వీట్ ఏంటి? నా ట్వీట్‌పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్‌ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa— Prakash Raj (@prakashraaj) September 24, 2024 ట్వీట్లో ప్రకాష్ రాజ్ ఏమన్నారంటేపవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024 ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై పవన్ ఇలా మాట్లాడారుసున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే -
గొడవలు చేయగల సత్తా నాకూ ఉంది : పవన్ కళ్యాణ్
విజయవాడ, సాక్షి: ఒక సనాతనవాదిగా, హిందువుగా బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా తనకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటున్నారు. హిందువులకు ఇతర మతాలపై విద్వేషం ఉండదని, కానీ, సెక్యులరిజం అనేది అన్ని వైపులా నుంచి రావాలని అన్నారాయన.మంగళవారం ఉదయం ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి పవన్ వచ్చారు. ఆపై తిరుమల లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్సీపీ సహా తన మీద పలువురు విమర్శలు చేయడంపై ఆయన స్పందించారు. ‘‘సాటి హిందువులే హిందుత్వాన్ని కించపరుస్తున్నారు. తోటి హిందువులను కించపరుస్తున్నారు. ఇష్టానికి మాట్లాడుతున్నారు. మరి మిగతా మతాల మీద జోకులేయరేం?. నన్ను పచ్చిబూతులు తిట్టినా మౌనంగా ఉన్నా. కానీ నన్ను విమర్శించేవాళ్లకు చెబుతున్నా. సనాతన ధర్మం జోలికి రావొద్దు. చేస్తే.. బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా నాకుంది... చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రిదాకా రామనామమే వినిపిస్తుంది. రామ భక్తులం మేం. అలాంటిది సనాతన ధర్మం మీద దాడి జరిగితే మాట్లాడొద్దంటే.. ఏమనాలి?. హిందువులుగా అది మీ బాధ్యత కాదా? ధర్మాన్ని పరిరక్షించరా?’’. .. తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌ను తానేం నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని, ఆ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలని మాత్రమే కోరుతున్నానని పవన్ అన్నారు... ‘‘భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా?. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయం. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి. మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడాలి. నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డూ గురించి మాట్లాడారు’’.తనను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడంపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. ‘‘అపవిత్రం జరిగిందనే నేను మాట్లాడాను తప్ప.. మరో మతాన్ని ఏమైనా నిందించానా?. ఆ మాత్రం దానికే గోల చేయకూడదని ప్రకాశ్ రాజ్ అంటున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా?. ఏం పిచ్చి పట్టింది మీకు? ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరంటే గౌరవం ఉన్నా.. అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను. .. ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు. మాకు ఇదంతా చాలా బాధ. మీ ఇష్టానికి సనాతన ధర్మం పై మాట్లాడుతున్నారు. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవి లపై జోకులు వేస్తారా?. ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టే సనాతన ధర్మం బోర్డు రావాలని తాను కోరుతున్నానని అన్నారు. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా?’’ అని పవన్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఈ పెద్దమనిషికి సనాతన ధర్మం అంటే తెలుసా? -
పవన్.. రెచ్చగొట్టడం మానేసి ముందు ఆ పని చూడు: ప్రకాశ్ రాజ్
తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తామని మరోసారి నిరూపించింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం చంద్రబాబు తానా అంటే తాను తందాన అంటున్నారు. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే కదా ఈ ఘటన జరిగింది. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. ఆ పని చేయడం మానేసి ఈ ఆందోళనలను జాతీయస్థాయిలో ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఉన్న మతకల్లోలాలు చాలవన్నట్లు దీన్ని ఎందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు? అని అసహనం వ్యక్తం చేశారు.అసలేం జరిగింది?2024 జూలై 12న ఆవు నెయ్యిని పరీక్షల కోసం టీటీడీ పంపింది. అది ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి జూలై 17న చేరగా పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే! ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఉందే తప్ప ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదు. కానీ టీడీపీ.. జంతు మాంసం కలిసిందంటూ దుష్ప్రచారానికి తెరదీసింది. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024చదవండి: ఈ బతుకే వ్యర్థం అని నిద్రమాత్రలు మింగా: బాలీవుడ్ నటి -
‘ ఉత్సవం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉత్సవంనటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులునిర్మాత: సురేష్ పాటిల్రచన, దర్శకత్వం: అర్జున్ సాయిసంగీతం: అనూప్ రూరబెన్స్సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024కథేంటంటే..అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు. అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)ఫస్టాఫ్లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్‌లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..దిలీప్ ప్రకాష్‌కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ
టైటిల్: పురుషోత్తముడునటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్ ఖన్నా తదితరులుదర్శకుడు: రామ్ భీమననిర్మాతలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్విడుదల తేదీ: 26 జూలై, 2024ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథరచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే! కథ రొటీన్ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారంటే?రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు. చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘పురుషోత్తముడు’
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామ్ భీమన దర్శకత్వంలో డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నేను ‘ఆకతాయి, హమ్ తుమ్’ అనే రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆరేళ్లకు నాకు ‘పురుషోత్తముడు’ చాన్స్ వచ్చింది. విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘మంచి క్లీన్ ఎంటర్టైనర్ మూవీ తీశామని గర్వంగా చెప్పగలం’’ అన్నారు రమేశ్ తేజావత్. ‘‘పురుషోత్తముడు’లో మంచి పోలీసాఫీసర్ రోల్ చేశాను. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు బ్రహ్మానందం.‘‘ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించా. రాజ్ తరుణ్ ఈ ప్రెస్‌మీట్‌కు రాలేదు. త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారు’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘నాది మహా రాష్ట్ర. నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హాసినీ సుధీర్. -
ఏడు ఎపిసోడ్లుగా ఏకం.. ట్రైలర్ చూశారా?
ప్రకాశ్ రాజ్, రాజ్ బి శెట్టి, షైన్ శెట్టి, మానసి సుధీర్, ప్రకాశ్ తుమినడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఏకం. ఇందులో ఏడుగురి జీవితాలను ఏడు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు దర్శకులు పని చేశారు. సుమంత్ భట్, స్వరూప్ ఎలమొన్, సనల్ అమన్, శంకర్ గంగాధరన్, వివేక్ వినోద్ దర్శకత్వం వహించారు. వీరిలో సనల్, వివేక్ మినహా మిగతా ముగ్గురూ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ స్క్రీన్‌ప్లేకు జీఎస్ భాస్కర్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ సిరీస్ జూలై 13న ఏకం ద సిరీస్ (https://www.ekamtheseries.com/) వెబ్సైట్లో విడుదల కానుంది.భావోద్వేగాల సమ్మేళనంఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, భయం, ధైర్యం, బాధ.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ను రంగరించారు. ఎంతో సహజసిద్ధంగా కనిపిస్తున్న ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే ఎక్కువమంది చూసే ఆస్కారం ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ సిరీస్‌ను తిరస్కరించడంతో మరో అవకాశం లేక సొంత ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.పట్టించుకోని ఓటీటీలుఈ విషయాన్ని కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించాడు. '2020 జనవరిలో ఏకం ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. 2021 అక్టోబర్‌లో ఫైనల్ కట్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సిరీస్‌ను ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాను. కానీ ఎంత ఎదురుచూసినా, ప్రయత్నించినా ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఏకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మా సొంత ప్లాట్ఫామ్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు' అని ట్వీట్ చేశాడు. Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024చదవండి: అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో? -
మళ్ళీ ఆయనే గెలుస్తారు: నటుడు ప్రకాష్ రాజ్
తిరువనంతపురం: దేశంలో ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో సీనియర్ నేతలు సైతం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్ళీ 'శశిథరూర్' విజయం సాధిస్తారని అన్నారు. జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికలో శశిథరూర్ మళ్ళీ విజయం సాధిస్తారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తిరువనంతపురం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ నుంచి చాలా అందుకుంది. కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. శశి థరూర్ నా స్నేహితుడు, గొప్ప నాయకుడు. అందుకే అతని అండగా నిలబడటానికి నేను వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఈయన (శశి థరూర్) కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు పన్నియన్ రవీంద్రన్‌లను ఎదుర్కొని పోటీకి నిలబడుతున్నారని అన్నారు. 2009 నుంచి గెలుస్తున్న శశి థరూర్‌కు వ్యతిరేకంగా బీజేపీ బలమైన నాయకున్ని బరిలోకి దింపింది. కాబట్టి ఈ సారి జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. 20 ఎంపీ స్థానాలకు కేరళ రాష్ట్రంలో 2019లో 19 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. ఒక స్థానంలో సీపీఎం గెలుపొందింది. బీజేపీ విఫలమైంది. 2016లో ఒక్కసారి మాత్రమే బీజేపీ నెమోమ్ అసెంబ్లీ స్థానంలో గెలిచింది. అయితే ఇప్పటివరకు బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేదు. కాగా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. #WATCH | Thiruvananthapuram, Kerala: Actor Prakash Raj says, " I find this (Thiruvananthapuram) constituency has received a lot from Shashi Tharoor. It is going to be his term again, I am here to just stand by him not because he is a great friend of mine, but because he has given… pic.twitter.com/J34XOJUQ7Y — ANI (@ANI) April 22, 2024 -
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారా?
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని సోషల్ ప్రచారం జోరందుకుంది. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలక్షణ నటుడు కొట్టిపారేశారు. దిస్కిన్ డాక్టర్ అనే ఎక్స్ అకౌంట్ యూజర్.. ప్రకాష్ రాజ్ బీజేపీలోకి చేరుతున్నారంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ప్రకాష్ రాజ్ స్పందన కంటే ముందే దాదాపు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఆ ట్వీట్‌కు విలక్షణ నటుడు స్పందించారు. ‘నన్ను కొనేంత సైద్ధాంతిక బలం బీజేపీకి లేదని’ వ్యంగ్యంగా స్పందించాడు ప్రకాష్ రాజ్. I guess they tried 😂😂😂 must have realised they were not rich enough (ideologically) to buy me.. 😝😝😝.. what do you think friends #justasking pic.twitter.com/CCwz5J6pOU — Prakash Raj (@prakashraaj) April 4, 2024 ఈ ఏడాది జనవరిలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రాజకీయ పార్టీలు టికెట్ ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. తాను మోదీని విమర్శిస్తున్నాను కాబట్టే టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, తన సిద్ధాంతాలు నచ్చి కాదని పేర్కొన్నారు.అలాంటి ట్రాప్‌లో తాను పడబోనన్న ప్రకాశ్ రాజ్.. తనను సంప్రదించిన పార్టీలేవో చెప్పలేదు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. -
వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్‌లో ప్రకాష్ రాజ్ బర్త్‌డే
కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ వాంగ్ చుక్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు. ‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా షేర్ చేశారు. Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD — Prakash Raj (@prakashraaj) March 26, 2024 మరోవైపు సేవ్ లడఖ్, సేవ్ హిమాలయాస్ అంటూ చేపట్టిన వాంగ్‌చుక్ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్ చుక్ ట్వీట్ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తున్న ఆయన ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 21st Day OF MY #CLIMATEFAST 350 people slept in - 10 °C. 5000 people in the day here. But still not a word from the government. We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 -
ప్రకాష్ రాజ్ బర్త్‌డే స్పెషల్.. రేర్ పిక్స్
-
‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’.. ప్రకాష్‌రాజ్ కౌంటర్
బెంగళూరు: అన్నీ 420 పనులు చేసి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకుపైగా గెలుస్తామనడం కేవలం మూర్ఖత్వమేనని బీజేపీని ఉద్దేశించి సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ సహా ఏ పార్టీ చేసినా అది మూర్ఖత్వమేనన్నారు. కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూర్ ప్రెస్‌క్లబ్‌లో ప్రకాష్‌రాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ ఒంటరిగా 400కుపైగా సీట్లు గెలిచే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. ప్రజలు గెలిపిస్తేనే ఎవరైనా గెలుస్తారని చెప్పారు. ఇన్ని సీట్లు తీసుకుంటామని ఏ పార్టీ చెప్పడానికి వీల్లేదన్నారు. కాగా, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మాట్లాడుతూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీఏ 400కుపైన సీట్లు గెలుస్తుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనూ అబ్ కీ బార్ చార్ సౌ పార్( ఈసారి 400కుపైన) అనే నినాదాన్ని బీజేపీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బాండ్లతో బీజేపీకి 6,986 కోట్లు -
ప్రకాశ్ రాజ్ నుంచి అవార్డ్ విన్నింగ్ మూవీ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!
ప్రకాశ్ రాజ్ పేరు చెప్పగానే విలక్షణమైన పాత్రలే గుర్తొస్తాయి. హీరో, విలన్, తండ్రి, బాబాయ్.. ఇలా అన్ని రకాలు పాత్రలు చేశాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించాడు. అయితే గతంతో పోలిస్తే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అలరించాడు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కన్నడలో తీసిన 'ఫొటో' అనే సినిమాని కొత్త దర్శకుడు ఉత్సవ్ గోన్వర్ తీశాడు. గతేడాది దిల్లీలో జరిగిన హ్యాబిటట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ రెండు చోట్ల కూడా 'ఫొటో' చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం విశేషం. అయితే ఈ సినిమా చూసిన ప్రకాశ్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 15న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'ఫొటో' సినిమా కథ విషయానికొస్తే.. బెంగళూరులో ఓ వ్యక్తి, వలస కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో లాక్డౌన్ విధిస్తుంది. దీంతో తమ సొంతూరు అయిన రాయచూర్‌కి నడక మార్గంలోనే వెళ్తారు. అసలు ఇంటికి వెళ్లారా అనేది పాయింట్. అలానే ఇదే కథలో ఆ పిల్లాడికి బెంగళూరులోని విధానసౌధ(కర్ణాటక శాసనసభ) ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనే కోరిక ఉంటుంది. మరి లాక్డౌన్ కష్టాల మధ్య దాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే 'ఫొటో' సినిమా స్టోరీ. కథ పరంగా బాగానే ఉంది. వలస కూలీల కష్టాలు ప్రతిబింబించేలా ఉంది. పలు అవార్డ్ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే సినిమా నచ్చి.. సొంతంగా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ని జనాలు చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) -
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్‌తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై స్టాలిన్ ప్రభుత్వం చర్యలు
సౌత్ ఇండియాలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహా అక్రమ నిర్మాణాల కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కొడైకెనాల్ మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ మధురై బెంచ్ చేపట్టిన విచారణ సందర్భంగా స్టాలిన్ సర్కారు ఈ మేరకు వివరణ ఇచ్చింది. కొడైకెనాల్లో సరైన అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘించి నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా బంగ్లా నిర్మిస్తున్నారని గతేడాది సెప్టెంబర్‌లో వివాదం తలెత్తింది. కొడైకెనాల్ కొండ ప్రాంతంలోని రైతుల రాకపోకలు కొనసాగించేన దారిలో వారు ఇల్లు నిర్మించారని అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు. నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాలు నిర్మిస్తున్నారని పెతుపర గ్రామాధికారి మహేంద్రన్ ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. విల్పట్టి పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని, బాబీ సింహా ఒక ఎకరాన్ని కొనుగోలు చేశారు. నటీనటులిద్దరూ నిబంధనలను ఉల్లంఘించి ఆ భూమిలో బంగ్లా నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలలో బంగ్లాల నిర్మాణానికి తమిళనాడు బిల్డింగ్ పర్మిట్ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పొందాలి. అలాగే కొండ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం అవసరం. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రకాష్‌రాజ్, బాబిసింహలు పెటుప్పరై ప్రాంతంలో బంగ్లా నిర్మించారని తెలుస్తోంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా.. ఇద్దరూ ప్రముఖ నటులు కావడంతో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడి పెద్ద నష్టం వాటిల్లుతుంది. అలాగే కొడైకెనాల్ పెటుప్పరైలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా అధునాతన పరికరాలు ఉపయోగించి రాళ్లను పగలగొట్టినందుకు సరైన ప్రభుత్వ అనుమతి లేకుండా ఆధునిక బంగ్లాలు నిర్మించిన నటులు ప్రకాష్‌రాజ్, బాబీ సింహలపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యక్తి ఎస్. మహమ్మద్ జునాథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల సమీపంలోని నివాసాలకు ముప్పు ఏర్పడిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, విజయకుమార్ ఈ పిటిషన్‌పై వాదనలు విన్నారు. రెండు భవనాల నిర్మాణ పనులను నిలిపివేసినట్లు న్యాయస్థానానికి తమిళనాడు సర్కారు తెలిపింది. ఇద్దరిపైనా లీగల్ యాక్షన్ ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు- ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. -
డబ్బు కోసం చెత్త సినిమాలు కూడా చేశా: ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్.. ఏ పాత్రలోనైనా ఇట్టే జీవించేయగల సమర్థుడు. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిన ఈయన బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేశాడు. అయితే కొన్నిసార్లు కేవలం డబ్బు కోసమే కథ, పాత్ర నచ్చకపోయినా సదరు సినిమాల్లో నటించానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. 'నేను ఎన్నో సినిమాలు చేశాను. కొన్నిసార్లు నన్ను రిజెక్ట్ కూడా చేశారు. దానివల్ల పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే.. నాకు నో చెప్పడం వెనక ఎంత రాజకీయం జరిగి ఉంటుందో నేను ఊహించగలను. వారు తప్పని పరిస్థితుల్లో నన్ను సినిమా నుంచి తప్పించారనే విషయాన్ని అర్థం చేసుకోగలను. ఓవరాక్టింగ్.. యాక్టింగ్ చేస్తున్నట్లేగా అయినా నా లైఫ్‌స్టైల్ వేరేలా ఉంటుంది. ముందు నాకు సౌకర్యంగా ఉందా? లేదా? అనేది చూస్తాను. ఆ తర్వాతే మిగతావాటి గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లయితే కేవలం డబ్బు కోసమే పిచ్చి సినిమాలన్నీ చేశాను. సినిమాలో ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తావని కొందరు అంటుంటారు. వారికి నేను చెప్పే సమాధానం.. నేను నిజంగా ఓవరాక్టింగ్ చేస్తున్నానంటే నాకు నటించడం వచ్చినట్లే కదా! కమర్షియల్ సినిమాలపై ద్వేషం లాంటిదేమీ లేదు. ఆ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. వారి కోసం మేకర్స్ ఎంతో కష్టపడి సినిమాలు తీస్తున్నారు. వారు నన్ను విలన్‌గానే సెలక్ట్ చేసుకుంటున్నారు. పైసా తీసుకోకుండా ఫ్రీ సినిమాలు కొన్నిసార్లు.. ఈ చెత్త సినిమాలు చేయడం అవసరమా? అని నాది నాకే అనిపిస్తుంది. కానీ డబ్బు కావాలంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోక తప్పదు కదా! మరికొన్నిసార్లు పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తుంటాను. అప్పుడు ఎందుకిలా ఉచితంగా సినిమాల్లో నటిస్తున్నావని అడుగుతుంటారు. కానీ అలాంటి సినిమాల్లో నటించినప్పుడు, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు పొందిన ఆనందం డబ్బుతో కొలవలేనిది. ఇది నా లైఫ్.. నాకు నచ్చినట్లుగా బతుకుతున్నాను' అని చెప్పుకొచ్చాడు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం గుంటూరు కారం, దేవర, పుష్ప 2:ద రూల్ సినిమాలు చేస్తున్నాడు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి.. అశ్వినిని పెళ్లి చేసుకుంటానన్న యావర్ -
రూ. 100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్‌కు ఊరట.. ఆ స్కామ్‌లో క్లీన్ చిట్
అక్రమ నగదు బదిలీ కేసులో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఊరట లభించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జ్యువెలరీ గ్రూపుపై రూ.100 కోట్ల పోంజీ, మోసం కేసులో ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి ఆయన్ను విచారించింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నివేదికల ప్రకారం, మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని తేలింది. ఆయన ఆ సంస్థకు కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని తెలిపింది. దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్, "తమిళం అర్థం కాని వారి కోసం. తమిళనాడులోని ప్రణవ్ జ్యువెలర్స్ మోసంతో నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎటువంటి సంబంధం లేదని అధికారిక ప్రకటన వెలువడింది. నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి ఎందరో ఆదరించారు. సత్యమేవ జయతే." తిరుచిరాపల్లికి చెందిన భాగస్వామ్య సంస్థ ప్రణవ్ జ్యువెలర్స్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 20న ఈడీ అధికారులు దాడులు నిర్వహించి రూ.23.70 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు ప్రకాష్ రాజ్ ఈ జ్యువెలర్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఈ విధంగా, ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని ఈడీ కోరింది. కొన్ని ఉద్దేశపూర్వక చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆయన్ను ప్రశ్నించాలని కోరుతూ ED గత నెలలో అతనికి సమన్లు జారీ చేసింది. కేసు నేపథ్యం: ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న జ్యువెలర్స్ కంపెనీపై తమిళనాడు ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పోలీసుల ఫిర్యాదు మేరకు ప్రణవ్ జ్యువెలర్స్, ఇతరులు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేశారని ఈడీ తెలిపింది. అయితే, ప్రణవ్ జ్యువెలర్స్ తమ డబ్బును పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. జ్యువెలర్స్ ఆర్గనైజేషన్, ఇతర అనుబంధ వ్యక్తులు ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించడం ద్వారా మోసం చేశారు. విచారణలో, బ్యాంక్ చెల్లింపులు, నకిలీ ఎంట్రీలకు బదులుగా రూ.100 కోట్లకు పైగా ఇచ్చినట్లు అంగీకరించింది. 23.70 లక్షలు వివరించలేని రూ. నగదు, 11.60 కిలోల బంగారు కడ్డీలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. For those who don’t understand Tamil BREAKING NEWS:-Official announcement of the Investigation team. Actor prakash raj is not involved in any ponzi scam of tamilnadu s Pranav jewellers.. 🙏🏿🙏🏿🙏🏿 I thank everyone who trusted me and stood by me .. #SathyamevaJayathe #justasking pic.twitter.com/AZ6hLM8wjI — Prakash Raj (@prakashraaj) December 15, 2023 -
కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన నటుడు ప్రకాష్ రాజ్
-
ప్రకాశ్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రణవ్ జువెలర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ నుంచి అందుకున్న చెల్లింపుల వివరాలను సమర్పించాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా.. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నందునే విచారణకు పిలిచింది. కాగా.. గత కొంతకాలంగా బీజేపీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ దాడులు.. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!
-
మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ కామెంట్లు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఇండస్ట్రీలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కొన్ని నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పని తీరుపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సుమారు రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ మధ్య హోరా హోరీగా పోటీ కొనసాగింది. ఈ బిగ్‌ఫైట్‌లో మంచు విష్ణు భారీ విజయంతో మా అధ్యక్షుడి పీఠాన్ని అదరోహించారు. ఆ తర్వాత ఆయన సినీ కార్మికులతో పాటు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్న వారికి మా సభ్యత్వంతో పాటు పలు సహాయసహకారాలు అందించారు. కానీ ఆ ఎన్నికల్లో అందరి ఎజెండాలో మా బిల్డింగ్ నిర్మాణం ప్రధానంగా ఉంది. త్వరలో దానిని నిర్మాస్తామని మంచు విష్ణు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి కూడా మా బిల్డింగ్ నిర్మాణం జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు గురించి ప్రకాశ్ రాజ్ ఇలా చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్,అఫ్రిది,అక్తర్ క్షమాపణలు) 'మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే మా కి సొంత భవనం కూడా లేదు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా.' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా అధ్యుక్షుడిగా మంచు విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలంటూ ప్రకాశ్ రాజ్ చెప్పారు. అతను ఈ రెండేళ్లలో ఏమి చేశాడో చెప్పాలని కోరాడు. బోగస్ ఓట్లతో పాటు బయట నుంచి విమానాల్లో పిలిపించుకోవడం, వంటి కార్యక్రమాలు చేయడంతో విష్ణు గెలిచాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో..? చెయ్యనో..? తెలియదని చెప్పిన ప్రకాశ్ రాజ్.. ఇక నుంచి తన దృష్టి జాతీయ అంశాలపై ఉందని పేర్కొన్నారు. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను మా అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. -
అల్లు అర్జున్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయిలో అవార్డులను పొందాయి. ఈ ఘనతను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం. కానీ.. ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణం. రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణం. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిది. తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్‌గారు బన్నీని ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లమంటే.. నేను ఇతర సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు నాకు గుర్తున్నాయి. తరువాత మేము గంగోత్రి చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్‌తో 'దిస్ బోయ్ విల్ గ్రో' అన్నాను. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచాడు. నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది. బన్నీకి జాతీయ అవార్డు వస్తే నా బిడ్డకి వచ్చినట్టు భావిసున్నా. నాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలువారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనకి అవార్డు వస్తేనే కాదు మనవాళ్లకి వస్తే కూడా మనకి వచ్చినట్టు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు కానీ ఇదెందుకు మన సినీ పెద్దలకి రావట్లేదు? మన సినిమాతో బౌండరీస్ దాటేస్తున్న సమయంలో అవతలి వాళ్లకంటే మన వాళ్లని మనం గౌరవించకపోతే ఎలా..? అంటూ ప్రకాష్ రాజ్ సినీ పెద్దలను ప్రశ్నించారు. -
క్షమించమని సిద్ధార్థ్‌ను కోరిన శివరాజ్ కుమార్
కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. కర్ణాటకలో ప్రతిచోటా పోరు కొనసాగుతోంది. కావేరి కోసం శాండల్‌వుడ్ తారలు కూడా తమ గళాన్ని పెంచారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇప్పటికే కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో తమిళ హీరో సిద్ధార్ధ్‌కు నిరసన సెగ తగలింది. తను నటించిన 'చిన్నా' చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో ప్రమోషన్ కార్యక్రమం చేపట్టాడు. దీనిని పలువురు కన్నడ అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. అక్కడి మీడియా సమావేశం నుంచి సిద్ధార్థ్‌ను బయటకు పంపించేశారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్ ) వారు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ చర్య సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తాజాగా సిద్దార్థ్‌కు జరిగిన అవమానంపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఇలా ప్రస్తావించారు. 'నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం.. మా ఇండస్ట్రీ తరపున సిద్ధార్థ్‌కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్ధార్థ్ క్షమించండి.. చాలా బాధపడ్డాం.. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు' అంటూ నటుడు సిద్ధార్థ్‌కి శివన్న సారీ చెప్పాడు. అలాగే కన్నడ ప్రజలు చాలా మంచివారు.అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను చూస్తారు.ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు. చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇదే వివాదంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 'దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను.' అని సోషల్ మీడియా ద్వార ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. Instead of questioning all the political parties and its leaders for failing to solve this decades old issue.. instead of questioning the useless parliamentarians who are not pressurising the centre to intervene.. Troubling the common man and Artists like this can not be… https://t.co/O2E2EW6Pd0 — Prakash Raj (@prakashraaj) September 28, 2023 -
నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు..
బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకాలోని బాగాల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్‌రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు. చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో?
న్యూఢిల్లీ: భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3పై అనుచిత వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోలేదు సరికదా దానిని సమర్ధించుకున్నాడు. ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. జులై 14న భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్)లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోకపోగా తాను పోస్ట్ చేసిన దానిని సమర్ధించుకున్నాడు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్.. అది అర్ధం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎట్లా? నేను కేరళ చాయ్‌వాలాని ఉద్దేశించి పోస్ట్ చేశాను.. మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో..? అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. చంద్రయాన్-3 పార్టీలకతీతంగా ప్రతి భారతీయుడు గర్వించాల్సిన ప్రయోగమని.. ఎవ్వరైనా ఆ వ్యత్యాసాన్ని గ్రహించి ప్రవర్తించాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
ప్రకాశ్‌రాజ్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: సినీ నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్(ఒకప్పుడు ట్విటర్) వేదికగా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుండి పంపిన మొట్టమొదటి ఫోటో అని రాసి ఒకతను తీ వడపోస్తున్న ఫోటోను ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార బీజేపీ పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో అప్డేటెడ్ గా ఉండే ప్రకాష్ రాజ్ ఈసారి మాత్రం తాను చేసిన విమర్శకు ప్రతిగా తాను విమర్శల పాలయ్యాడు. జూలై 14న భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టనున్న నేపథ్యంలో యావత్ భారతదేశం ఆ అద్భుత క్షణం కోసం ఎదురుచూస్తోంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విజయవంతమైన ప్రయోగాన్ని అభినందించకపోగా సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశాడు. ఒక వ్యక్తి టీ వడపోస్తున్న ఫోటో పోస్ట్ చేసి చంద్రయాన్ నుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫోటో.. వావ్.. అంటూ పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అదే స్థాయిలో ప్రకాష్ రాజ్‌పై విమర్శలు కురిపించారు. తప్పు చేస్తే తప్పని చెప్పడంలో తప్పులేదు కానీ.. ఏది పెడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు. BREAKING NEWS:- First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G — Prakash Raj (@prakashraaj) August 20, 2023 ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
జోకర్ నాయకుడైతే చూసేది సర్కస్ మాత్రమే.. ప్రకాష్ రాజ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభ శనివారం జరిగింది. ఈ సభను సినీనటుడు, రచయిత,సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సమూహ లోగోను ఆవిష్కరించారు. ‘లౌకిక ప్రజాస్వామిక విలువలకోసం రచయితలు అందరూ సంఘటితమైనదే సమూహా. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలు అందరి ఉమ్మడి స్వరమే సమూహ. సహనశిలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక సమూహా’. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారు. శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గుతాయి.. కానీ దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గలేవు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఊరికే కూర్చోలేను. 100 రోజుల నుండి మణిపూర్ రగిలిపోతుంటే పార్లమెంట్లో నువ్వా నేనా అన్నటు నడిచారు. రాజకీయం తప్ప సమస్య మీద స్పందన లేదు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయం తప్ప ప్రజల సమస్యలపై చర్చించలేదు. జోకర్ని నాయకుడు చేస్తే మనం చూసేది సర్కస్ మాత్రమే. మనలో ఐక్యత లేదు. మొదట మనలో మార్పు రావాలి. 70ఏళ్ల తర్వాత మనం రియలైజ్ అయ్యాం.. ఎక్కడ తప్పు జరిగిందని చూసుకోవాలి. మొదటిసారి ఇలాంటి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం బాధగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గులాబీలో సీటు హీటు.. కేటీఆర్, కవిత మధ్య పొలిటికల్ పోరు! -
సినీ తారలకు ట్విటర్ షాక్.. చిరంజీవితో సహా బ్లూటిక్ తొలగింపు!
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎక్కువగా అప్డేట్స్ ఇస్తుంటారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సందడి చేస్తుంటారు. అయితే వారి అఫీషియల్ అకౌంట్స్‌కు బ్లూ టిక్ సింబల్ ఉంటుంది. అయితే తాజాగా ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ సెలబ్రీటీలకు షాకిచ్చారు. సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించిని వారి బ్లూ టిక్స్‌ను తొలగించారు. ఇలా బ్లూ టిక్ తొలగించిన వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఉండడం విశేషం.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌లు తొలగిస్తోంది. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఇప్పటికే ప్రకటించిన విధంగా నెలవారీ లేదంటే ఏడాది చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్‌లు ఎగిరిపోయాయి. అయితే, ఇలా బ్లూ టిక్‌లు కోల్పోయిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉండడం విశేషం. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు అలాగే ఉన్నాయి. అయితే వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ విషయాకొనిస్తే.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా సైతం తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. సౌత్‌లో ముఖ్యంగా తమిళ స్టార్ రజినీకాంత్, విజయ్, శింబు లాంటి పెద్ద హీరోలకు సైతం బ్లూ టిక్ లేకుండా పోయింది. Bye bye #BlueTick …. It was nice having you….my journey ..my conversations..my sharing…will continue with my people … you take care #justasking — Prakash Raj (@prakashraaj) April 20, 2023 బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిందే: ఎలన్ మస్క్ ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌లు కావాలనుకుంటే వెబ్ కోసం అయితే నెలకు రూ.650, యాప్ కోసమైతే నెలకు రూ.900 చెల్లించాలి. ఏడాదికైతే రూ.6500 డిస్కౌంట్ ఆఫర్‌ను ట్విట్టర్ అందిస్తోంది. దీనికి ఈ ఏడాది ఏప్రిల్ 20 చివరి తేదీగా ప్రకటించింది. ఈ లోపల బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోనివారు బ్లూటిక్ కోల్పోతారని ప్రకటించారు. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ చెప్పినట్లుగానే సెలబ్రిటీలు తమ ట్విట్టర్ బ్లూ టిక్‌లను కోల్పోతున్నారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రంగమార్తాండ, ఎక్కడంటే?
కొన్ని సినిమాలు బాగుంటాయి. కలెక్షన్లు, బాక్సాఫీస్ రికార్డులకు అతీతంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాయి. వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రంగమార్తాండ. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మధు, వెంకట్ రెడ్డి నిర్మించారు. మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన నటసామ్రాట్‌కు ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రసారమవుతోంది. కథ విషయానికి వస్తే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. ఆయన ప్రతిభకు మెచ్చి అభిమానులు రంగమార్తాండ బిరుదు ప్రదానం చేస్తారు. అయితే ఆ సత్కార సభలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిస్తాడు. తన ఆస్తులను కూడా పిల్లలకు పంచేస్తాడు. కొడుకు, కోడలికి ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, కూతురికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్మును అప్పగిస్తాడు. ప్రేమించినవాడితో పెళ్లి కూడా చేస్తాడు. అన్ని బాధ్యతలు తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి ఆయన శేష జీవితం ఆనందంగా సాగిందా? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు? అతడి నిజజీవితం ఎలా ముగిసిందనేది మిగతా కథ. story of an extraordinary theatre artist and the unexpected changes in his life when he decides to retire ✨#RangaMaarthaandaOnPrime, watch now https://t.co/woDFJ0AJwD pic.twitter.com/0vQgtKa4NB — prime video IN (@PrimeVideoIN) April 7, 2023 -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
దిగ్భ్రాంతికి లోనయ్యా.. బాధగా ఉంది: ప్రకాష్ రాజ్
బెంగళూరు: సినీ నటుడు, రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రకాష్ రాజ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోటి నటుడు, కన్నడ స్టార్‌గా పేరున్న సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాష్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిచ్చా సుదీప్ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధించింది అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారాయన. అంతకు ముందు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరతారంటూ వచ్చిన కథనాలను ప్రకాష్ రాజ్ ఖండించారు. అది తప్పుడు వార్త అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నా. బీజేపీ ఓటమి భయంతోనే అలాంటి ప్రచారానికి దిగింది. అలాంటి ఉచ్చులో పడడానికి సుదీప్ అమాయకుడేం కాదంటూ ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ, ఆ అంచనాని తలకిందులు చేస్తూ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు సుదీప్. తాను రాజకీయాల్లో చేరబోనంటూనే.. రాబోయే ఎన్నికల్లో కేవలం బీజేపీ తరపున ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు. సీఎం బసవరాజ్ బొమ్మై తనకు గాడ్‌ఫాదర్ లాంటి వాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తాను ప్రచారం చేసేవాడినంటూ సుదీప్ నిన్న ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ ట్వీట్.. దుమారం
బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంతో.. ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. నీరవ్ మోదీ లలిత్‌మోదీ మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఉంచి.. తన ట్విటర్ వాల్‌పై పోస్ట్ చేశారాయన.జనరల్ నాలెడ్జ్.. ఈ ముగ్గురిలో కామన్ ఏంటి? జస్ట్ ఆస్కింగ్ #Justasking అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి మద్దతుగానే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు ఈ ట్వీట్‌పై మండిపడుతున్నారు. General Knowledge:- What is common here #justasking pic.twitter.com/HlNCjJejwk — Prakash Raj (@prakashraaj) March 25, 2023 గతంలోనూ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ పలు ట్వీట్లు చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోదీ అనే ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలతోనే రాహుల్ గాంధీపై 2019లో పరువు నష్టం దావా నమోదు కావడం, తాజాగా ఆయనకు గుజరాత్ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం.. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చెలరేగడం తెలిసిందే. -
ఆయన నటనలోని మ్యాజిక్‌ని చూశా: ప్రకాశ్‌రాజ్
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ ‘నటసామ్రాట్’ సినిమా చూశాక ఒక కళాకారుడి జీవితంలో ఉన్న బరువు నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ‘నటసామ్రాట్’ గురించి కృష్ణవంశీకి చెప్పగానే బాగుందన్నాడు. ఎమోషన్స్ చక్కగా ప్రెజెంట్ చేయగలడని తనని ఈ సినిమా రీమేక్ ‘రంగ మార్తాండ’కు దర్శకత్వం వహించమని కోరాను. బ్రహ్మానందంగారితో కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన నటనలోని మ్యాజిక్‌ను చూసే అవకాశం దొరికింది’’ అన్నారు. ‘‘ప్రకాశ్‌రాజ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న అద్భుత నటులు బ్రహ్మానందం ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులా నటించారు’’ అన్నారు కృష్ణవంశీ. ‘ఈ చిత్రం క్లయిమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్ నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సీన్‌ని కృష్ణవంశీ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు బ్రహ్మానందం. -
Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ
టైటిల్: రంగమార్తాండ నటీనటులు: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి దర్శకత్వం : కృష్ణవంశీ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి విడుదల తేది: మార్చి 22, 2023 క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ..ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రిమియర్స్ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్ ఏర్పడింది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ‘రంగమార్తాండ’ కృష్ణవంశీకి కమ్‌బ్యాక్ చిత్రమైయిందా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదుని ప్రదానం చేస్తారు అభిమానులు. అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్మెంట్ని ప్రకటించి అందరికి షాకిస్తాడు. అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు. కొడుకు రంగారావు(ఆదర్శ్), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్)కి తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్ముని అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్ సిప్లిగంజ్)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు. ఇలా బాధ్యతలన్ని తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది? భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటిని నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రి(బ్రహ్మానందం)కు ఎలాంటి న్యాయం చేశాడు? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మారాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేకే రంగమార్తాండ. ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. నానా పటేకర్‌తో సహా ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌లు ఇచ్చేశారు. అలాంటి కథను రీమేక్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించాడు. ‘నటసామ్రాట్’ సోల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించాడు. తెలుగు నాటకాలు..పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్ చాలా ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ముద్దగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి. ’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం... ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్ని గుండెని బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరెలా చేశారంటే.. ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల గొప్ప నటుడు ఆయన. రంగమార్తండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం ఒక సర్ప్రైజింగ్ ప్యాకెజ్. చక్రి పాత్రలో ఆయన తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం మారుతుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం నటన ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి సీన్లో ప్రకాశ్‌రాజ్‌ని బ్రహ్మానందం పూర్తిగా డామినేట్ చేశాడు. తెరపై ఓ కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. ఇక రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతమని చెప్పాలి. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలకు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘రంగమార్తాండ’ కచ్చితంగా ఉంటుంది. ఈ కథ కొత్తదేం కాదు. అందరికి తెలిసిన కథే.. మనం నిత్యం చూస్తున్న అమ్మ నాన్నల జీవిత కథే. ఇంత గొప్పకథను అంతేగొప్పగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ తరం, రేపటి తరం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్‌తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్‌తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
మీరెప్పుడూ చూడని ప్రకాశ్‌రాజ్ ఫ్యామిలీ ఫోటోలు
-
SSMB 28 సెట్లో సందడి చేయనున్న శ్రీలీల! కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్లో ఈ మూవీ సెట్‌పైకి వచ్చింది. ఇటీవలె హైదరాబాద్ రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తదుపరి అప్డేట్ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. SSMB 28కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ రేపటి(ఫిబ్రవరి 28) నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం త్రివిక్రమ్ ఓ భారీ సెట్ ప్లాన్ చేశాడట. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ హైదరాబాద్ శివారులోని ఓ ఇంట్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందట. ఈ షెడ్యూల్లో మహేశ్ బాబు హీరోయిన్ పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్‌తో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా జాయిన్ కానుందట. ఇక్కడ హీరోహీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అంతేకాదు ప్రకాశ్ రాజ్-మహేశ్ మధ్య ఉండే సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్‌తో శ్రీలీల SSMB 28 సెట్లో తొలిసారి అడుగుపెట్టబోతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ కాగా ఇందులో పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ కాగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు మరో బాలీవుడ్ నటి ఇందులో సందడి చేయనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సెకండ్ హాఫ్‌లో చాలా కీలకంగా ఉంటుందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనువిందు చేయనుందని టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. -
కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదం ఇంకా ముగిసిపోలేదు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తన జీవితమంతా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాతానని ఆయన చెప్పారు. కొంతమంది అబద్ధాలతో తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారని ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అనుపమ్ ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' కొందరు మనుషులు తమ స్థాయిని తగ్గట్లు మాట్లాడతారు. కొంతమంది మాత్రం తమ జీవితమంతా అబద్ధం చెబుతారు. మరికొందరు నిజాలే మాట్లాడతారు. నా జీవితమంతా నిజం మాట్లాడిన వారిలో నేనూ ఒకడిని. అబద్ధాలు చెబుతూ జీవించాలనుకోవడం అది వారి కోరిక.' అంటూ ప్రకాశ్ రాజ్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. కాగా.. గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లలో కశ్మీరీ హిందువుల వలసలను ఈ చిత్రంలో చూపించారు.వివేక్ అగ్నిహౌత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ్ ప్రధాన పాత్రలో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. -
కశ్మీరీ ఫైల్స్ సినిమా.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలుపై దుమారం


