
కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ అన్నిరకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే దేశంలో ఉన్న పాక్ ప్రజలను వారి స్వదేశానికి వెళ్లగొట్టింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో డీయాక్టివేట్ చేసింది. వారి యూట్యూబ్ ఛానళ్లను సైతం నిలిపివేసింది. పాక్ నటులను, వారి సినిమాలను బ్యాన్ చేసింది.
సినిమాలను నిషేధించకూడదు
దీంతో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) నటించిన అబీర్ గులాల్ సినిమా రిలీజ్ ఆగిపోయింది. సినిమాలను బ్యాన్ చేయడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుపట్టాడు. ద లాలంటాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మాట్లాడుతూ.. సినిమాలను నిషేధించడాన్ని నేను సమర్థించను. అది ఎటువంటి సినిమాలు అయినా సరే.. వాటిని జనాల నిర్ణయానికి వదిలేయాలి. శృతిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదు అని పేర్కొన్నాడు. అయితే పాక్ నటుడి సినిమాను సపోర్ట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు వస్తున్నాయి.
అబీర్ గులాల్..
పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం అబీర్ గులాల్ (Abir Gulaal Movie). వాణీ కపూర్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఆర్తి ఎస్.బగ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్ నిర్మించారు. మే 9న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అంతలోనే జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగ్గా.. కేంద్రం పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాక్ నటుడు ఫవాద్ నటించిన అబీర్ గులాల్ సినిమాపై బ్యాన్ ప్రకటించింది.
చదవండి: సారీ చెప్పమన్న బేబీ డైరెక్టర్.. రెండేళ్ల జీవితం వృథా అన్న బాలీవుడ్ హీరో