ముంబైకి ముత్తువేల్‌ పాండ్యన్ | Superstar Rajinikanth will be back as Muthuvel Pandian in Jailer 2 | Sakshi
Sakshi News home page

ముంబైకి ముత్తువేల్‌ పాండ్యన్

Feb 3 2026 12:05 AM | Updated on Feb 3 2026 12:05 AM

Superstar Rajinikanth will be back as Muthuvel Pandian in Jailer 2

ముంబై వెళ్లానున్నారట ముత్తువేల్‌ పాండ్యన్ . హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్  దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘జైలర్‌’. 2023లో విడుదలైన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్ లోనే ‘జైలర్‌’కి సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ముత్తువేల్‌ పాండ్యన్  పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్‌. రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్‌జే సూర్య, విజయ్‌సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ అతి త్వరలోనే ముంబైలో ప్రారంభం కానుందని కోలీవుడ్‌ సమాచారం.

రజనీకాంత్‌–షారుక్‌ఖాన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట నెల్సన్  దిలీప్‌ కుమార్‌. ఈ సినిమాలో రజనీకాంత్‌ స్నేహితుడు పాత్రలో షారుక్‌ఖాన్  నటిస్తున్నారని సమాచారం. సన్  పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘జైలర్‌ 2’ ఈ జూన్‌లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్‌ 173వ సినిమాకు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఆయన 174వ చిత్రానికి నెల్సన్  దిలీప్‌ కుమార్, 175వ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రా లపై అధికారిక ప్రకటన రావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement