Jailer 2 Movie
-
జైలర్-2 తెలుగు హక్కులపై భారీ చర్చ
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్‌కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్‌కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్‌కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్‌కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం. రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్‌కు ఎదురెళ్లే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్జే సూర్య కొత్త విలన్‌గా పరిచయం కానున్నారు. -
రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్
కొన్నేళ్ల క్రితం మరణించిన కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తని తలుచుకుని భావోద్వేగానికి గురైంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఈమె, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'జైలర్ 2' సినిమాలో నటించిన సంగతి బయటపెట్టింది. అలానే భర్త చిరంజీవికి సంబంధించిన జ్ఞాపకాలని పంచుకుంది.(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)'ఈ రోజు ఒక తేదీ మాత్రమే కాదు మనద్దరి డ్రీమ్ ఒక్కటైన రోజు. నా ప్రతి అడుగులోనూ నిన్ను ఫీలవుతున్నాను. నువ్వు ఆయనని(రజనీకాంత్) ఆరాధించావు. నీ కోరిక వల్లే ఆయనని నేను కలిశాను. ఇది అసలు నేను కలలో కూడా ఊహించని విషయం. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం 'జైలర్ 2'లో లభించింది. మనం సాధించాం. నా భర్తకే ఈ సినిమా అంకితం చేస్తున్నాను. ఈ సక్సెస్ అంతా అతడికే చెందుతుంది' అని మేఘనా సర్జా భావోద్వేంగా రాసుకొచ్చింది.రజనీతో దిగిన ఫొటోలోని పంచుకున్న మేఘనా సర్జా.. తన భర్తకు ఎంతో ఇష్టమైన భాషా బొమ్మపై స్వయంగా రజనీతో సంతకం కూడా చేయించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అల్లరి నరేశ్ 'బెండు అప్పారావు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మేఘనా.. తర్వాత కన్నడ, మలయాళ మూవీస్ చేస్తూ వచ్చింది. అలా హీరో చిరంజీవి సర్జాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ భర్త చనిపోయిన తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. మరి 'జైలర్ 2'లో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది? ఏ మేరకు ఈమెకు గుర్తింపు తీసుకొస్తుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఆ కెపాసిటీ నాకు లేదు.. అందుకే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్నా) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
జైలర్ 2 పూర్తి
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ చిత్రం షూటింగ్ పూర్తయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్’. రమ్యకృష్ణ, సునీల్, తమన్నా, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’ సినిమా 2023 ఆగస్టు 10న విడుదలై తమిళంతో పాటు తెలుగులోనూ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రజనీకాంత్–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందింది. ఈ సీక్వెల్లో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, ఎస్జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.‘జైలర్’ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ‘జైలర్ 2’ని కూడా నిర్మించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ చిత్రయూనిట్ కొన్ని ఫొటోలు విడుదల చేసింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా రజనీకాంత్–నెల్సన్ దిలీప్‌కుమార్ కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కూడా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, విజయ్ సేతుపతి వంటి వారు ‘జైలర్ 2’లో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
రజనీకాంత్ వీడియో లీక్.. షాక్‌లో అభిమానులు
దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్ మూవీ విడుదలకు ముందే లీక్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు రజనీకాంత్ జైలర్-2 మూవీ నుంచి కొన్ని సీన్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి చెందుతుంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌ను ప్రచారం చేయవద్దని చిత్ర నిర్మాతలు ఒక ప్రకటన ద్వారా ప్రేక్షకులను కోరారు.జైలర్ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్-2ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. అత్యంత భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కావాల్సిన ఈ మూవీ నుంచి కీలకమైన ఫుటేజ్ లీక్ అయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. దయచేసి మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని కోరింది. తమ పైరసీ నిరోధక టీమ్ ఈ అంశంపై చురుకుగా పర్యవేక్షిస్తోందని పేర్కొంది. ఎవరైనా వీడియోను షేర్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు.. లైన్లో పది హిట్ సినిమాలు
‘ముదల్ పగుది’ (ఫస్ట్ పార్ట్) అదిరింది. అయితే ఆ కథ అక్కడితో ఆగలేదు. కొనసాగించే స్కోప్ ఉంది. అంతే... ‘ఇరండామ్ పగుది ఇరుక్కు’ (సెకండ్ పార్ట్ ఉంది) అంటూ సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ ఇరండామ్ పగుది రెండింతల మజానివ్వాలని ప్రేక్షకులకు, ఆయా చిత్రాల హీరోల అభిమానులకు ఉంటుంది కదా. అది దృష్టిలో పెట్టుకునే మరింత జాగ్రత్తగా సీక్వెల్ కథలను సిద్ధం చేసుకున్నారు దర్శకులు. 2026–2027లో తమిళ ‘వెండి తిరై’ (వెండి తెర) బోలెడన్ని సీక్వెల్స్ చూడబోతోంది. చెప్పాలంటే... కొన్ని సినిమాలకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ తెలుగులోనూ విడుదలైంది. సో... ఇరండామ్ పగుది కూడా ఇక్కడ విడుదల కాకుండా ఉండదు. మరి... ఏయే సినిమాకి సీక్వెల్ రానుందో పడిక్కలాం (చదువుదాం) వాంగ (రండి). మరింత యాక్షన్ డోస్‌తో...టైగర్ ముత్తువేల్ పాండియన్ రాక కోసం అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముత్తువేల్ పాత్రను రజనీకాంత్ అంత స్టైలిష్‌గా చేశారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023)లో రజనీ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయింది. ఇక జైలర్‌గా రజనీ తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం కన్నా మలి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రకు మరింత యాక్షన్ డోస్ పెంచి, రజనీని మరింత స్టైలిష్‌గా చూపించనున్నారు నెల్సన్. ఈ సీక్వెల్ కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్ వర్క్ నేపథ్యంలో సాగుతుందని, ముత్తువేల్ పాండియన్ గతాన్ని కూడా చూపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్ 2’లోనూ మోహనల్ లాల్, శివ రాజ్‌కుమార్ కనిపించనున్నారు. విజయ్ సేతుపతి కూడా అతిథి పాత్ర చేశారు. అదనపు ఆకర్షణగా షారుక్ ఖాన్ కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. విద్యా బాలన్, మిథుర్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్‌ని మరింత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారన్నది ప్రస్తుత సమాచారం. తొలి భాగంలానే మలి భాగం కూడా అదే టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. త్వరలో సెట్స్‌కి కంగువ 2గతం, వర్తమానం... ఇలా రెండు టైమ్‌లైన్స్‌లో సాగే చిత్రంగా ‘కంగువ’ (2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో కంగువాగా, ఫ్రాన్సిస్ థియోడోర్గా డ్యుయల్ రోల్లో కనిపించి, ఆకట్టుకున్నారు సూర్య. ‘కంగువ’ విడుదల సమయంలోనే సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు. సీక్వెల్ కథ కూడా సిద్ధమైంది. గత ఏడాది చివర్లోనే క్లాప్ కొట్టి, చిత్రాన్ని ఆరంభిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగలేదు. త్వరలో చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది విడుదల చేయాలన్నది టీమ్ ప్లాన్. ఇదిలా ఉంటే... తొలి భాగం చివర్లో కార్తీ పాత్ర పరిచయం అవుతుంది. దాంతో ఈ సీక్వెల్ సూర్య, కార్తీ మధ్య సాగే భారీ యాక్షన్ మూవీగా ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగులో భాషల్లో తొలి భాగం విడుదలైనట్లుగానే ‘కంగువ 2’గా ఈ రెండు భాషల్లో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో సర్దార్ 2... 2027లో సెట్స్‌కి డిల్లీ ఒకటి కాదు... రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు కార్తీ. ఒకటి ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది అదే ‘సర్దార్ 2’. మరొకటి ‘ఖైదీ 2’. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. సర్దార్ ఎప్పుడు వస్తాడు? కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్’ (2022) సూపర్ హిట్ అయింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీకి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో ‘సర్దార్ 2’ రూపొందిన. నిజానికి ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది జూన్‌లో పూర్తయింది. డిసెంబరులో విడుదలవుతుందని చాలామంది ఊహించారు. కానీ, అది జరగలేదు. చివరికి ఈ ‘సర్దార్’ సమ్మర్‌కి వస్తాడనే టాక్ ప్రచారంలో ఉంది. అయితే ఏ తేదీకి వస్తాడు? అనే విషయం గురించి చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తొలి బాగంలో ఏజెంట్ సర్దార్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్‌గా డ్యుయల్ రోల్ చేసిన కార్తీ మలి భాగంలోనూ ఈ రెండు పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్‌లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని సమాచారం. తొలి భాగం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.రెండింతల యాక్షన్... ఎమోషన్ డిల్లీ అంటే ఎవరో ‘ఖైదీ’ (2019) సినిమా చూసినవాళ్లకి తెలుసు. ఆ సినిమాలో హీరో కార్తీ పాత్ర పేరు డిల్లీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని లోకేశ్ గతంలో పేర్కొన్నారు. అయితే ఇంకా పట్టాలెక్కకపోవడంతో ‘ఖైదీ 2’ లేదని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మఖ్యంగా డిల్లీ పాత్రను చాలా ఇష్టపడిన కార్తీ అభిమానులను ఈ సీక్వెల్ ఆగిందనే వార్తలు నిరాశకు గురి చేశాయి. నిజానికి ఈ సినిమా ఆగిందని ప్రచారం జరగడానికి కారణం అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి లోకేశ్ కనగరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ‘ఖైదీ 2’ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిల్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ‘ఖైదీ’ సినిమా చివర్లో డిల్లీ తన కూతురు అముదిని కలుసుకోవడానికి బయలుదేరుతాడు. తన కూతురితో కొత్త జీవితం ్ర΄ారంభించాలనుకుంటాడు. కానీ అతను జైలులో ఉన్నప్పుడు పని చేసిన డ్రగ్ మాఫియా గ్యాంగ్ పూర్తిగా నాశనం కాదు. ఆ గ్యాంగ్‌లో మిగిలిన సభ్యులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తారు. ‘ఖైదీ 2’ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే సీక్వెల్ రెండింతల యాక్షన్, ఎమోషన్‌తో ఉండేలా లోకేశ్ ΄ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ అంటోంది. కార్తీ అన్ని సినిమాలూ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి కాబట్టి ‘ఖైదీ 2’ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. మరోసారి అమ్మవారిగా...నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘మూకుత్తి అమ్మన్’ (2020). దర్శకుడిగా బాలాజీకి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర పోషించారు. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందింది. రెండో భాగంలోనూ నయనతార కథానాయికగా నటించారు. అయితే దర్శకుడు మారారు. రెండో భాగాన్ని దర్శకుడు సుందర్. సి తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బూ, స్నేహ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఊర్వశి, రెజీనా కసాండ్రా, సునీల్, యోగిబాబు, అభినయ తదితరులు నటించారు. ఇటీవలే ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్ పూర్తయింది. తొలి భాగం ‘అమ్మోరు తల్లి’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. రెండో భాగం కూడా విడుదల కానుంది. ఈ ఏడాదే ఈ సీక్వెల్ సిల్వర్ స్క్రీన్‌కి వస్తుంది. అయితే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. మళ్లీ బాక్సింగ్ రెడీబాక్సింగ్ నేపథ్యంలో ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సార్పట్ట పరంపర’ (2021). ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తమిళనాడులోని అట్టడుగు వర్గాలు నివాసం ఉండే ప్రాంతం నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామాని రూపొందించారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే సీక్వెల్ ప్రకటించారు. ఈ జూన్‌లో సీక్వెల్ షూటింగ్‌ని ప్రారంభిస్తామని తాజాగా ఆర్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... పా.రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా ఆరంభమైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఈ ఏడాదే ‘వెట్టువమ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో ‘సార్పట్ట పరంపర 2’ షూటింగ్‌ని జూన్‌లో ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘తని ఒరువన్ 2’ ఆగదు‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ (2015). ఈ చిత్రకథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, ‘జయం’ రవి పర్ఫార్మెన్స్... ఇలా అన్నింటికీ ప్రశంసలు దక్కాయి. వసూళ్ల పరంగా కూడా భేష్ అనిపించుకుంది. ఈ చిత్రం తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ‘ధ్రువ’ పేరుతో రీమేక్ అయింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘తని ఒరువన్’కి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే పదేళ్లయినా సీక్వెల్ ఇంకా పట్టాలెక్కక΄ోవడంతో రెండో భాగం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆగలేదని, గత ఏడాది సెప్టెంబర్‌లో త్వరలో ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఆ తర్వాత వేరే న్యూస్ ఏదీ రాలేదు. నిర్మాణంలో జాప్యం జరుగుతుందే కానీ సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనను యూనిట్ విరమించుకోలేదని కోలీవుడ్ టాక్. కుస్తీకి రెడీవిష్ణు విశాల్ హీరోగా రెజ్లింగ్ నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గట్ట కుస్తీ’ (2022). ‘మట్టి కుస్తీ’గా తెలుగులో విడుదలైంది. మరోసారి ఈ హీరో–దర్శకుడు వెండితెరపై కుస్తీ చూపించడానికి రెడీ అయ్యారు. ‘గట్ట కుస్తీ 2’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. నీలాంబరి రిటర్న్స్రజనీకాంత్ హీరోగా నటించిన ‘పడయప్పా’ (1999 – తెలుగులో ‘నరసింహా’) లో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన నటనను అంత సులువుగా మరచిపోలేం. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. రెండో భాగానికి రజనీకాంత్ కథ రాస్తున్నారని ఆయన రెండో కుమార్తె సౌందర్య పేర్కొన్నారు. కానీ ఎవరు నటిస్తారు? దర్శకత్వం వహిస్తారు వంటి విషయాలు తెలియజేయడానికి ఇది ‘టూ ఎర్లీ’ అవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. కథ పూర్తయ్యాక ఆ వివరాలను తెలియజేస్తారు. అయితే టైటిల్ మాత్రం ‘నీలాంబరి’ అనుకుంటున్నారట. మరగద నాణ్యం 2‘మరకతమణి’గా విడుదలైంది. ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీకి సీక్వెల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మరగద నాణ్యం 2’ని ఆరంభించారు. ఆది పినిశెట్టి హీరోగా, నిక్కీ గల్రానీ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా ఏఆర్కే శరవణన్ దర్శకత్వంలోనే రెండో భాగం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లానే సీక్వెల్ కూడా ఫ్యాంటసీ కామెడీ నేపథ్యంలోనే సాగుతుంది. కాగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆది, నిక్కీ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ఇద్దరూ 2022లో పెద్దల సమ్మతంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులోనూ విడుదలవుతుంది. -
పవన్ కల్యాణ్.. ఏ మాత్రం నమ్మలేని రూమర్!
పవన్ కల్యాణ్‌కి ప్రస్తుతం సినిమాలు చేయడంపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లయితే కనిపించట్లేదు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితమే ఈయన నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. కొత్తగా ఏ మూవీస్ ఒప్పుకోలేదని, ఒకవేళ కొత్త ప్రాజెక్టులు అంగీకరిస్తే ఆయన వెల్లడిస్తారనేది సదరు పోస్ట్ సారాంశం. దీంతో పవన్ ఇప్పట్లో కొత్తగా ఏం చేయరని చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ఇంతలోనే ఓ రూమర్ వినిపిస్తోంది. 'జైలర్ 2'లో ఏకంగా అతిథి పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)చూస్తుంటే ఈ రూమర్లో ఏ మాత్రం నిజం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ తన సినిమాలకే సరిగా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఆయనతో మూవీ అంటే అనుకున్న టైం కంటే చాలా ఆలస్యమైపోతుంటాయి. రీసెంట్గా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. ఏది తీసుకున్నా సరే పూర్తవడానికి ఏళ్లకు ఏళ్లు పట్టాయి. అలానే పవన్ ఇప్పటివరకు చిరంజీవి సినిమాల్లో తప్పితే వేరే వాటిలో అతిధి పాత్రలు చేయలేదు.అలాంటిది 'జైలర్ 2'లో షారూఖ్ ఖాన్ చేయాల్సిన పాత్రని పవన్ చేస్తారని అనుకోవడం అస్సలు నమ్మేలా లేదు. రూమర్ అంటే కనీసం నమ్మేలా అయినా ఉండాలి. కానీ తమిళ మీడియాలో ఏ మాత్రం నమ్మశక్యం కాని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే మూవీలో క్యామియో కోసం హీరో బాలకృష్ణని కూడా సంప్రదించారని, కానీ వర్కౌట్ అవ్వలేదని టాక్ వినిపించింది. చూస్తుంటే 'జైలర్ 2'లో అతిథి పాత్రలు ఎవరు చేస్తారనే సస్పెన్స్ ఎన్నాళ్లు కొనసాగుతుందో ఏంటో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా) -
చండీగఢ్‌లో జైలర్
చండీగఢ్‌లో ల్యాండ్ అయ్యారట ముత్తువేల్ పాండ్యన్ . రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్ 2’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఎస్జే సూర్య, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, విజయ్‌సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. జైలర్ ముత్తువేల్ పాండ్యన్‌గా నటిస్తున్నారు రజనీకాంత్.ఇందులోని మరో కీలకమైన పోలీస్ పాత్రలో హీరో షారుక్‌ఖాన్ నటించనున్నారని సమాచారం. ‘జైలర్ 2’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం చండీగఢ్‌లో జరుగుతోందని కోలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్లో రజనీకాంత్, షారుక్‌ఖాన్ లపై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తీస్తున్నారట నెల్సన్ అండ్ టీమ్. కార్ క్రషింగ్ ఫ్యాక్టరీలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్‌తో ‘జైలర్ 2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. -
'జైలర్-2'లో పోలీస్ ఆఫీసర్‌గా బాలీవుడ్ కింగ్
జైలర్-2 సినిమాలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముత్తువేల్ పాండియన్‌గా మరోసారి రజనీకాంత్ సందడి చేయనున్నారు. 2023లో విడుదలైన జైలర్ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్-2ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇదే ఏడాదిలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే, ఇప్పుడీ సీక్వెల్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.జైలర్-2లో ప్రత్యేక పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నట్లు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించేందుకు ఆయన ఓకే అన్నట్లు సమాచారం. ఏడు నుండి ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించబడే అతని సన్నివేశాలతో సినిమా ముగుస్తుందని భావిస్తున్నారు. మార్చి చివరి వారంలో జైలర్-2 సెట్స్‌లోకి షారుఖ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.‘జైలర్’లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు సినిమాను మలుపుతిప్పే అతిథి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తారని సమాచారం. ఇందులో ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ కోడలు శ్వేతా పాండియన్ పాత్ర పోషించిన నటి మిర్నా కూడా ఈ సీక్వెల్లో కీలక పాత్ర పోషించనుందని వర్గాలు చెబుతున్నాయి. -
ముంబైకి ముత్తువేల్ పాండ్యన్
ముంబై వెళ్లానున్నారట ముత్తువేల్ పాండ్యన్ . హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్ లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్జే సూర్య, విజయ్‌సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ అతి త్వరలోనే ముంబైలో ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం.రజనీకాంత్–షారుక్‌ఖాన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడు పాత్రలో షారుక్‌ఖాన్ నటిస్తున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘జైలర్ 2’ ఈ జూన్‌లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్ 173వ సినిమాకు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఆయన 174వ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్, 175వ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రా లపై అధికారిక ప్రకటన రావాలి. -
జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే..
తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. హీరోగా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. అవసరమైతే అతిథి పాత్రలో కనిపించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. జైలర్ 2లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. అలాంటి రోల్స్ చేయనుఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నవారి దగ్గరినుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అలా జైలర్ 2లో ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చాలామంది విలన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. హీరోను ఎలివేట్ చేసే విలన్ పాత్రలు చేయడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు.మూకీ సినిమాతో..కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ పంచే విలన్ పాత్రల్ని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం 'గాంధీ టాక్స్'. మూకీ (మాటలు లేని) సినిమాగా తెరకెక్కిన గాంధీ టాక్స్ జనవరి 30న విడుదలవుతోంది. ఈ మూవీలో అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్దార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.చదవండి: మహేశ్‌బాబు గుడ్‌న్యూస్.. ఆరోజే ఓపెనింగ్ -
రూ. 1000 కోట్లకు ప్లాన్ చేసిన.. రజినీకాంత్ జైలర్ 2
-
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రజనీకాంత్ సినిమాలో గెస్టులుజైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్. జైలర్ 2లో సూపర్ స్టార్ఇందులోనూ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
జైలర్ 2లో ఐటం సాంగ్!
సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నవి ఐటమ్ సాంగ్స్‌నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్ సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జైలర్ 2లో ఐటం సాంగ్అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్–2 చిత్రంలోనూ ఐటమ్‌సాంగ్ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్‌లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.స్టెప్పేయనున్న నోరా ఫతేహి?మోడలింగ్ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్‌బాస్ రియాలిటి గేమ్షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్–2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!


