రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'జైలర్ 2'. నెల్సన్ దర్శకత్వం వహించగా సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. అనిరుధ్ సంగీతమందించాడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. తొలి భాగం హిట్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ)
ఇకపోతే మూవీ విడుదలకు ముందు నిర్వహించే ఆడియో విడుదల కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. గతంలో విజయ్ 'జన నాయగన్' మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేసియాలో భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో మంచి ప్రచారం లభించింది. ఇప్పుడీ దారిలోనే జైలర్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మలేసియాలో భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు రజినీకాంత్ నుంచి అనుమతి ఇంకా లభించలేదని తెలుస్తోంది.
ఈ వయసులో భారీ బహిరంగ ప్రదేశంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లడం శ్రేయస్కరమేనా? ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కాల్ షీట్స్ సర్దుబాటు వ్యవహారం వంటి విషయాల గురించి రజినీకాంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ రాగానే జైలర్ 2 ఆడియో ఈవెంట్ గురించి క్లారిటీ వస్తుంది.
(ఇదీ చదవండి: విజయ్ జన నాయగన్.. రిలీజ్‌కు ముందే రికార్డ్స్..!)


