ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ | Fans Association Reacts Jr Ntr Political Entry | Sakshi
Sakshi News home page

Ntr Political Entry: తారక్ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై స్పష్టత

Jul 13 2026 2:11 PM | Updated on Jul 13 2026 2:14 PM

Fans Association Reacts Jr Ntr Political Entry

స్టార్ హీరో జూ.ఎన్టీఆర్.. ఈ నెల 18న రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది వీటిని నిజమే అనుకుంటున్నారు. ఇదలా ఉండగా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది.

(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)

'జూలై 18న జరగబోయే 'ఊరు-వాడ' కార్యక్రమానికి ఎప్పుడో ప్లాన్స్ వేశాం. దీనికి రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దని మీడియా, సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారు' అని తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఓ నోట్ రిలీజ్ చేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి మిగతా భాషల హీరోలు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎన్టీఆర్ అనే కాదు బన్నీ, విజయ్ దేవరకొండ పేర్లు కూడా వినిపించాయి. చూస్తుంటే ఇవన్నీ కేవలం పుకార్లే అనిపిస్తోంది. ప్రస్తుతం 'డ్రాగన్'తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తర్వాత కుమారస్వామి కథతో త్రివిక్రమ్ మూవీలో నటిస్తాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement