సరికొత్త కథతో ఓరి నాయనో | Actor Naveen Chandra unveils the title of Ori Nayano | Sakshi
Sakshi News home page

సరికొత్త కథతో ఓరి నాయనో

Jul 13 2026 12:55 AM | Updated on Jul 13 2026 12:55 AM

Actor Naveen Chandra unveils the title of Ori Nayano

సాయి అభిషేక్, నవీన్‌ చంద్ర, మణితేజ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వీరాంజనేయ ప్రొడక్షన్స్ అనే మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం అయింది. గొండి మణితేజ దర్శకత్వంలో సాయి అభిషేక్‌ నిర్మాణంలో రూపొందనున్న చిత్రం ‘ఓరి నాయనో’. ఈ మూవీ టైటిల్, సినిమా కార్యాలయాన్ని హీరో నవీన్‌ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా గొండి మణితేజ మాట్లాడుతూ–‘‘నా హృదయానికి దగ్గరైన ఒక కథను ‘ఓరి నాయనో’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాను. 

ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది’’ అని తెలిపారు. ‘‘ఓరి నాయనో’ చిత్రం వినోదం, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని సమ్మిళితం చేసిన కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. విభిన్నమైన కథలను ప్రోత్సహించడం, ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్‌ సినిమాలను అందించడం వీరాంజనేయ ప్రొడక్షన్స్ లక్ష్యం’’ అన్నారు సాయి అభిషేక్‌. డైరెక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవీంద్ర, కెమెరామెన్‌ వెట్రి పళనిస్వామి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రోహిత్‌ కంభంపాటి– డా. ప్రవీణ్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement