రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ‘చోర శికామణులు’. ఈ సినిమాకు ఆనంద్ కుర్మా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి దర్శకడు నక్కిన త్రినాథరావు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్‌లో తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఆనంద్ కుర్మా వెల్లడించారు. జూలై 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రంలో నరేశ్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి ఆనంద్ రాజావిక్రమ్ సంగీతం అందిస్తున్నారు. ఓ మంచి సాంగ్‌తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని.. త్వరలోనే మరిన్ని అప్డేట్‌లతో మీ ముందుకు వస్తామని మేకర్స్ పేర్కొన్నారు.


