- సింగర్ జాన్ కుమార్ సానుకి కోవిడ్
మళ్లీ కరోనా వైరస్ కలకలం దేశంలో గుబులు రేపుతోంది. ఇక కరోనా భయం లేదనుకుంటున్న సమయంలో ఆ వైరస్.. మళ్లీ మెల్లగా పాగా వేస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు కరోనాతో మృతి చెందగా, తాజాగా దిగ్గజ గాయకుడు కుమార్ సాను కుమారుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, గాయకుడు అయిన జాన్ కుమార్ సానుకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
ఈ విషయాన్ని ఆయన ఈరోజు( జూలై 12, ఆదివారం) సోషల్ మీడియాలో ప్రకటించారు. జాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి అప్‌డేట్స్‌ను జాన్ కుమార్ సాను సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
దేశంలో మళ్లీ అక్కడక్కడ కోవిడ్-19 మాట వినిపిస్తోంది. ఈ తరుణంలో జాన్ కుమార్ సాను కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన రేకెత్తిస్తోంది. చైనా నుంచి వచ్చిన కోవిడ్ స్నేహితుడికి సెల్యూట్. వూహాన్ నుంచి నాకు కోవిడ్ వచ్చింది. ఈరోజు నేను నా అభిమాన డిజైనర్ కోకిలాబెన్ రూపొందించిన దుస్తులు ధరించాను’ అని రాసుకొచ్చారు జాను కుమార్ సాను. గాయకుడు జాన్ కుమార్ సానుకి కోవిడ్-19 సోకడంపై అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
ఇటీవల ఏపీలో కరోనా వైరస్ కలకలం రేగింది.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్ బారినపడి మృతి చెందడంతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కి పడింది.


