తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో ఉద్రికత్త.. | ysrcp thopudurthi prakash reddy arrest at anantapur | Sakshi
Sakshi News home page

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో ఉద్రికత్త..

Jul 9 2026 1:24 PM | Updated on Jul 9 2026 1:31 PM

ysrcp thopudurthi prakash reddy arrest at anantapur

సాక్షి, అనంతపురం: అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. 

ఇక, అంతకుముందు.. టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీనికి ధీటుగా టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు తోపుదుర్తి సిద్ధమయ్యారు. టీడీపీకి కౌంటర్‌గా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల తనపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ముందుకు పెట్టి పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్ర బాబు రాజకీయాలు చేస్తున్నారని తోపుదుర్తి విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆయన తన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, టీడీపీ నేతల ఆరోపణలను రాజకీయంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని తోపుదుర్తి ఏర్పాటు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. తోపుదుర్తి ఇంటి వద్ద భారీగా మోహరించారు. తోపుదుర్తి ఇంటికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెళ్లకుండా వారిని అడ్డుకుంటున్నారు. తోపుదుర్తి ఇంటి వద్దకు పార్టీ శ్రేణులు చేరకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అనంత సరిహద్దుల్లో కూడా వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement