breaking news
Anantapur
-
ఎంపీ మిథున్ రెడ్డి తో అనంతపురం YSRCP లీడర్లు ములాఖత్
-
కర్నూలులో ఉద్రికత్త.. ఎన్టీఆర్ అభిమానుల నిరసన
సాక్షి, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసనకు దిగారు. తక్షణమే టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, నిరసనకారులను బలవంతంగా త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జూనియర్ అభిమానులు త్రీటౌన్ పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు వైరల్..అంతకుముందు.. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకేష్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్‌లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు. నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు’ ఈ ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లోకేష్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్‌ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్‌కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని. ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు.సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది. ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. -
జేసీ కోసమే పెద్దారెడ్డిని అడ్డుకున్నాం: పోలీసులు
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అయితే, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందనే కారణంగానే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్టు పోలీసులు చెప్పడం గమనార్హం.తాజాగా డీఎస్పీ వెంకటేషులు మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉంది. అందుకే నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నాం. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది. అన్ని విషయాలు హైకోర్టుకు విన్నవిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో, జేసీ కోసమే పెద్దారెడ్డి అడ్డుకున్నట్టు పోలీసులు బహిరంగంగానే ప్రకంటించేశారు.మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలి అంటూ హెచ్చరించారు. దీంతో, పెద్దారెడ్డి ఇంటిని కూల్చి ప్లాన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వామా?. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు పనిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. నేను గతంలో ఫ్యాక్షనిజం చేయలేదు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.ఇక, తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు వాహనాల్లో తాడిపత్రి వెళ్తున్నప్పటికీ, హైకోర్టు ఆదేశాలు చూపించినా.. బారికేడ్లు పెట్టి ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాలయాపన చేసి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునే కుట్రలు పోలీసులే చేయడం గమనార్హం. -
బయట కనబడితే.. ఎమ్మెల్యే దగ్గుపాటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా నారాయణరెడ్డి పల్లిలో ఆరుగంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డి పల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అయితే,తన స్వగ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు,కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డి పల్లికి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు.. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో, తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను. హైకోర్టు ఆదేశాలు పోలీసులు పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50-60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిణామాల కారణంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
MLA దగ్గుపాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా NTR అభిమానుల ఆందోళన
-
టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను బూతుల తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు.ఎమ్మెల్యే ప్రసాద్, జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్రవాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వార్ -2 సినిమా ఆడదంటూ పదేపదే చెప్పిన దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను అత్యంత దారుణంగా దూషించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ హెచ్చరించడంతో పాటు బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అయి ఉండి.. ఇంత అసభ్యకరమైన భాషను వాడటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని.. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు. మేం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావ్ అంటూ జూ.ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్‌లకు నచ్చదు.. అందుకే ఆయన సినిమాలు ఆడనివ్వను.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరూ చూడవద్దంటూ దగ్గుపాటి ప్రసాద్ హుకూం జారీ చేశారు. అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించిన ఆడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే దగ్గుపాటి.. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ షోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. ఒక్కసారి గా రెచ్చిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తారని.. మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని.. బాక్సులు, స్క్రీన్లు కాల్చేయిస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో భయపడ్డ.. దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ విడియో విడుదల చేశారు. అది ఫేక్ వీడియో అన్న ఎమ్మెల్యే.. తనకు నారా-నందమూరి కుటుంబాలపై గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు.మరో వైపు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని... అలా చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలు చించి వేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో లేరని... ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు -
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్‌గా మారింది.ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగుచూశాయి. దగ్గుబాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
అనంతపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురంలో పర్యటించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి వివాహానికి ఆయన హాజరయ్యారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికాయి.అనంతరం రుద్రంపేట సర్కిల్ మీదుగా ఇంద్రప్రస్థ కళ్యాణ వేదిక దాకా వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నూతన వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత లకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
నేడు వైఎస్ జగన్ అనంతపురం పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనంతపురంజిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం చేరుకుంటారు.నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులుసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ కార్యక్రమం బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ వేడుకకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌కుమార్, గూడూరి ఉమాబాల, పాతపాటి మురళీకృష్ణంరాజు, మేకా ప్రతాప్ అప్పారావు, తెల్లం బాలరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు, కంభం విజయరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్, చినమిల్లి చినవెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు జోరు వానను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరించారు. -
బాబు చేతగానితనం.. బస్సుకోసం రోడ్డెక్కిన చిన్నారులు
-
బస్సు డ్రైవర్ పై చేయి చేసుకున్న మహిళ
-
మహిళల జాకెట్లు చించేసి.. టీడీపీ నేతల కీచకపర్వం!
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పాలనలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా.. మహిళలు అని కూడా చూడకుండా.. టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. మహిళల జాకెట్లు చించేసి.. వారి పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అనుచరులు ప్రభాకర్, అంజన్ కుమార్ అధికార మదంతో రెచ్చిపోయారు. ఓ భూమికి సంబంధించిన వివాదంలో మహిళలు రేణుకమ్మ, జయలక్ష్మీపై విచక్షణారహితంగా దాడికి చేశారు. వారిపై భౌతికంగా దాడులు చేసి.. జాకెట్లు చించేసి కిరాతకంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా.. కొడవలి పట్టుకుని వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో బాధిత మహిళలు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చ మంద బెదిరింపులు, అరాచకాలపై మండిపడుతున్నారు. -
అనంతపురంలో ‘పచ్చ’ రౌడీల బీభత్సం..
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్‌లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.దుకాణం వద్ద అరాచకం..సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్‌లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్‌కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
Anantapur District: బోనాల సుమయాకు చెందిన రెండున్నర సెంట్ల స్థలం కబ్జా
-
అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు వర్గీయుల గూండాగిరి
-
Anantapur: లోకేష్, పవన్ కు ఛాలెంజ్ విద్యార్థులతో పెట్టుకోవద్దు..
-
బండారు శ్రావణి వర్గం Vs ఫీల్డ్ అసిస్టెంట్లు.. తన్నుకున్న తమ్ముళ్లు!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా అవినీతి డబ్బులు కోసం టీడీపీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. టీడీపీ నేతలు అవినీతి డబ్బు కోసం తన్నుకున్నారు. టీడీపీలోని రెండు వర్గాలు ఇలా తన్నుకోవడంపై స్థానికులు ఆశ్చర్యపోయారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు రెండు వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గం ఒకటి కాగా, టీడీపీ టూమెన్ కమిటీ వర్గాల మరొకటిగా విడిపోయింది. తాజాగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అవినీతి డబ్బుల కోసం తన్నుకున్నారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
Anantapur: ఉపాధ్యాయుడినే బెదిరించిన విద్యార్థిని
-
నువ్వు ఊ అంటే అన్నివిధాలా చూసుకుంటా..
అనంతపురం: భర్తను కోల్పోయిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. కొంతకాలంగా కూలి పనులు చేసుకుంటూ కన్న వారిని, పిల్లలను పోషించుకుంటోంది. ఆమె పెద్ద కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. తన కూతురిని ఏదైనా హాస్టల్లో ఉంచి చదివిస్తే..తనకు భారం కొద్దివరకైనా తగ్గుతుందని భావించింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రవేశానికి సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకుంటుండగా బ్రహ్మసముద్రానికే చెందిన ఓ టీడీపీ నాయకుడు గమనించాడు. తాను టీడీపీ మండల కన్వీనర్ అనుచరుడినని, తాను ఫోన్ చేసి చెబితే..ఏ స్కూల్లో అయినా సీటు గ్యారంటీ అని నమ్మించాడు. ఓ అన్నలా సాయం చేయడానికి ముందుకు వచ్చాడని ఆమె భావించింది. తాను ఫోన్లో మాట్లాడి సీటు విషయం చెబుతానంటూ ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజే ఆమెకు ఫోన్ చేసి సీటు కావాలంటే కొంత ఖర్చవుతుందని చెప్పాడు. ఎంతవుతుందని అడగ్గా..రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. అంత డబ్బు ఇచ్చుకోలేననడంతో ‘నువ్వు ఊ అంటే నీ కూతురు చదువుకునేందుకు స్కూల్ తో పాటు హాస్టల్ సీటు కూడా ఇప్పిస్తా’ అని అన్నాడు. దీంతో ఆమె సదరు టీడీపీ కార్యకర్తకు మాటలతో బుద్ధి చెప్పింది. అయినా అతడు వదల్లేదు. అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్ చేసి..‘సమాజంలో ఇలాంటివి సహజం. నీ ఒంటరి జీవితానికి తోడుగా ఉంటా. నీ పిల్లల జీవితానికి అన్ని విధాలుగా అండగా ఉంటా. మా నాయకుడితో చెప్పి ఆ స్కూల్లో నీ కూతురికి సీటు ఇప్పిస్తా. నీకు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి జీతం వచ్చేలా చేస్తాను’ అంటూ లొంగదీసుకునేందుకు యతి్నంచాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు తన సన్నిహితులతో ఈ విషయాన్ని చెప్పి ఆవేదన చెందింది. అలాగే ఆమె ఆవేదన చెందుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
హోంమంత్రి అనితకు నిరసన సెగ
-
అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ
అనంతపురం: అనంతపురంలో దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అనంతపురంలోని తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల రెండేళ్ల కుమారుడు కుషాల్. శనివారం ఉదయం స్థానిక తపోవనం సర్కిల్లోని ఓ హోటల్లో తల్లిదండ్రులు దోశ తినిపిస్తుండగా, దోశ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది.హుటాహుటిన స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. చిన్నారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే కుషాల్ మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
నీ అంతుచూస్తా.. రేయ్ ఏంట్రా నీ ఓవర్ యాక్షన్ అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
-
అధికారిపై జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం భక్తజన సాగరం (ఫొటోలు)
-
అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
తాడిపత్రికి వెళ్లాలి.. ఎస్పీకి పెద్దారెడ్డి లేఖ
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రికి వచ్చేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్‌కు తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. దీంతో, ఎస్పీ జగదీష్ ఈసారైన అనుమతి ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.అనంతపురం ఎస్పీ జగదీష్‌కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్బంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి.. అందుకు తాను తాడిపత్రికి రావాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని ఎస్పీని లేఖలో కోరారు. అయితే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు సూచించింది. కానీ, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖ రాశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటికి తాను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్.. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు’ అని జేసీ రెచ్చిపోయారు. -
ఈ - స్టాంపింగ్ కేసు లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు!
-
ఈ-స్టాంపుల కుంభకోణం.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు సహా ముగ్గురి అరెస్ట్
సాక్షి,అనంతపురం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణాన్ని పోలీసులు చేధించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం గురించి ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 15 వేల నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 100 రూపాయల స్టాంప్‌ల సున్నాలు మార్చి లక్ష రూపాయల స్టాంప్‌గా నిందితులు మార్చారు. ఫోటో షాప్‌లో ఎడిట్ చేసి నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు తేలింది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థకు టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 481 నకిలీ ఈ-స్టాంపులు విక్రయించిన ఆధారాలు సేకరించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ అసలు కథఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్‌లతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్ పత్రాలు సృష్టించారు.టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలుఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ స్టాంప్‌ల కోసం మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిషిలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణంటీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్‌డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! మోసం చేశారిలా.. ఈ–స్టాంప్‌లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్‌ను మీ–సేవ బాబు జనరేట్ చేస్తాడు. జనరేట్ అయిన డాక్యుమెంట్లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్బీఐని మోసగించారు.టాటా క్యాపిటల్స్ రుణాల్లోనూ ఇదే స్కామ్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్ 7న ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్లో స్టాంప్‌డ్యూటీ మొత్తాన్ని ఎడిట్ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్‌కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుంభకోణానికి పాల్పడింది. స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! స్టాంప్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్మనీగానే చెల్లించాలి. ఎస్ఆర్ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబుకు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్తవం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది. ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయన భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీష్‌బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచ్చిందన్నారు. మీ–సేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్ఎస్ 318(4), 338, 340, ఆర్/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
గిన్నిస్ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్‌పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్‌వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
Anantapur: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
అనంతలో యువకుల హల్చల్.. దమ్ముంటే పట్టుకో అంటూ పోలీసులకే..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. తాజాగా పుష్ప డైలాగులతో మందు బాబులు పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో, ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. అనంతపురం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. ఇద్దరు యువకులు కలిసి.. మరో యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం, పుష్ప సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ డైలాగ్ చెప్పారు. పోలీసు స్టేషన్ ఎదుటే ఇలా డైలాగ్ చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
తాడిపత్రిలో టెన్షన్.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరిన కేతిరెడ్ఢి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా పోలీసులు.. ఆయనతో అనుచితంగా ప్రవర్తించినట్టు సమాచారం. తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. కేతిరెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదు. ఇప్పటి వరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. మరోవైపు.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే.. కచ్చితంగా దాడులు చేస్తామని గతంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. -
రోడ్డుపై అడ్డుకున్న పోలీసులు.. ఉష శ్రీ చరణ్ వార్నింగ్..
-
Anantapur: పరిటాల సునీత డైరెక్షన్... పోలీసులు యాక్షన్
-
సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురి అరెస్ట్
పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ రత్న సోమవారం చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. దళిత బాలికపై కొన్ని నెలలుగా టీడీపీ కీచకులు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాలిక గర్భం దాలి్చంది. విషయం బయటకు రాకుండా నిందితులు జాగ్రత్త పడుతూ వచ్చారు. అత్యాచారం చేసిన వీడియోలు తీసి తల్లీకూతుర్లను బెదిరిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన 14 మందితో పాటు రాజీ కుదర్చడానికి ప్రయతి్నంచిన నలుగురు వ్యక్తులతో కలసి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ధర్మవరం డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ నేతృత్వంలో అచ్చంపల్లి వర్దన్, తలారి మురళి, నందవర్దన్రాజు, నాగరాజు, బోయ సంజీవ, బడిద రాజన్నలను రాప్తాడు సమీపంలో అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. మారుమూల ప్రాంతం కావడం, ఆరి్థక చేయూత, అవగాహన లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని, మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టేందుకు భవిష్యత్‌లో అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, ధర్మవరం టూటౌన్ సీఐ రెడ్డెప్ప ఉన్నారు. -
‘మా పాప చనిపోయేంత వరకూ పోలీసులు పట్టించుకోలేదు’
అనంతపురం: ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురికావడంపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు(సోమవారం, జూన్9) తన్మయి తల్లి దండ్రులతో కలిసి గిరిజన సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. పోలీసులు సరిగా పని చేయకపోవడం లేదంటూ నినాదాలు చేస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయాన్ని మట్టడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల చోటు చేసుకున్నాయి. దాంతో ఎస్సీ కార్యాలయం ముందే బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. .. తమ పాప మిస్ అయ్యిందని కేసు పెట్టడానికి వెళ్లినా పోలీసులు అస్సలు పట్టించుకోలేదన్నారు. కనీసం ఏ రకంగాను పోలీసులు దర్యాప్తు చేయలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ కూడా పరిశీలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసల నిర్లక్ష్యం కనిపించిందని, ఇప్పుడు డెడ్‌బాడీ కనిపించిన తర్వాత చేసేదేంటని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అనుమానితుల గురించి చెప్పినా పట్టించకోకపోవడం వల్లే ఇంతవరకూ వచ్చిందన్నారు.గిరిజన విద్యార్థిని దారుణహత్య -
Anantapur: ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య పై గిరిజన సంఘాల ఆగ్రహం
-
చంద్రబాబు సర్కార్ నైతిక బాధ్యత వహించాలని మహిళల డిమాండ్
-
బాబు వైఫల్యం.. ఇంటర్ విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
గిరిజన విద్యార్థిని దారుణహత్య
అనంతపురం /కూడేరు: కూటమి సర్కారు పాలనలో మరో ఘాతుకం జరిగింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో ఇంటర్ విద్యార్థిని తన్మయి(19) దారుణహత్యకు గురైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. ఘటనాస్థలంలో బీరుబాటిల్ లభ్యమైంది. దీంతో దుండగులు బీరుబాటిల్‌తో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం నగరంలోని టీవీ టవర్ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతులకు కొడుకుతోపాటు కుమార్తె తన్మయి ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆకుతోటపల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన్మయి ఈ నెల 3న అదృశ్యం కావడంతో మరుసటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాత్రి 9గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి బయటకు వెళ్లిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే.. కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతురేనని గుర్తించారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.హత్యగా ధ్రువీకరించిన వైద్యులు తలకు బలమైన గాయమైందని, దేనితోనో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో బీర్ బాటిల్ ఉండడంతో దాంతోనే తలపై కొట్టి చంపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్‌డేటా ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.నిందితులను కఠినంగా శిక్షించాలిగిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయినా కూటమి పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
జగన్ గారి పాలనలో ఎంతో ప్రశాంతంగా ఉన్నాం..
-
టీడీపీ నేత హత్యకు.. సొంత పార్టీ నేతలే స్కెచ్!
-
టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతల స్కెచ్!
సాక్షి, అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ సుధాకర్ నాయుడు వైరం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతలే కుట్రపన్నడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం అప్రమత్తమైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత సుధాకర్ నాయుడి హత్యకు ఎమ్మెల్యే అనుచరులు స్కెచ్ వేయడం పోలీసుల నిఘాలో బయటపడింది. ఇంట్లోకి చొరబడి మరీ సుధాకర్‌ను హత్య చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ వేశారు. అయితే.. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఈ విషయం కూడా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుధాకర్ నాయుడు హత్య కుట్రను భగ్నం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ ఎపిసోడ్‌తో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇద్దరిని అమరావతికి పిలిపించుకుని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తోంది. -
టీడీపీకి నిజమైన వారసులు ఎవరు?: శైలజానాథ్
సాక్షి అనంతపురం : టీడీపీది మహా నాడు కాదు... దగా నాడు అంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించింది చంద్రబాబే.. టీడీపీకి వారసుడు ఎవరు?. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించారు.జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు.పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పుజెప్పుతున్నారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా?. టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు. చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది. టీడీపీలో ఎన్టీఆర్‌నే గద్దె దించారు? చంద్రబాబు ఎంత?’’ అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. -
అనంత జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డిఅనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. -
మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
అనంతపురం: టీడీపీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునివ్వగా, అది కాస్తా రసాభాసగా మారింది. ఈరోజు(మంగళవారం) కమ్మ భవన్ లో ఉదయం పది గంటల ప్రాంతంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఓ కార్యకర్త పురుగుల మందు తాగాడు. టీడీపీకి వైఖరితో మనస్తాపం చెందిన వెంకటేష్ అనే కార్యకర్త వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేష్.. ఆపై పురుగుల మందు తాగేశాడు. దాంతో ఆ కార్యకర్తను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కలెక్టర్ చెబితే వినాలా..?
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి లోని న్యూట్రీషినల్ రీహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్ సీ)లో తీరు మారడం లేదు. ‘చిన్నారులకు అందించే డైట్‌పై నిర్లక్ష్యం చేయకూడదు’ అని ఇటీవల సాక్షాత్తు కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూస్తే అయ్యో అంటూ జాలిపడాల్సిందే. ఆరోగ్య శాఖ.. సర్వజనాస్పత్రి అధికారుల బాధ్యతారాహిత్యం చిన్నారులకు శాపంగా మారింది. గ్లాసు పాల కోసం మూడు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక.. ఎన్ఆర్సీలో వంట మనిషి లేకపోవడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం పాయసంతోనే అల్పాహారాన్ని సరిపెడుతున్నట్లు తెలిసింది. ఇదిగో సాక్ష్యం.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న తన ఇద్దరు బిడ్డలను (ఒకరు మూడేళ్లు, ఒకరికి 7 నెలలు) తాడిపత్రికి చెందిన శ్రావణి ఎన్ఆర్సీలో చేర్చింది. ఈ పిల్లలకు ఉదయం 6 గంటలకే ఎన్ఆర్సీలో సిబ్బంది పాలు పంపిణీ చేయాలి. కానీ ఆదివారం 9 గంటలైనా ఇవ్వలేదు. దీంతో పిల్లలు కడుపు కాలి ఏడుస్తుండటంతో చేసేదిలేక శ్రావణి ఆస్పత్రి బయట ఇడ్లీ తీసుకుని వచ్చి వారి పొట్ట నింపింది. మరో మహిళ కూడా తన బిడ్డ బాధను చూసి తట్టుకోలేక బయట తోపుడు బండ్లపై దోసె తీసుకువచ్చి ఆకలి తీర్చింది. ఇటీవల ‘సాక్షి’లో ‘చిన్నారుల ఆకలి కేకలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా.. ఆ మరుసటి రోజు వైద్య ఆరోగ్యశాఖాధికారులు, సర్వజనాస్పత్రి అధికారులు ఎన్ఆర్సీకి వచ్చి హడావుడి చేశారు. ఆ తర్వాత నుంచి షరామామూలుగానే పరిస్థితి తయారైంది. రెండు రోజులు సర్దుకో.. ‘ఎన్ఆర్సీలో ఉంటే మంచి తిండి పెడతారని చెప్పారు. కానీ ఇక్కడేమో ఆ పరిస్థితి కనిపించడం లేదు సార్’ అంటూ ఓ వృద్ధురాలు ఇటీవల డ్యూటీ వైద్యున్ని ప్రశ్నించగా.. సదరు వైద్యుడు ‘రెండు రోజులు సర్దుకొండహే’ అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా అతను విధులకు ఎప్పుడూ గైర్హాజరవుతుంటాడని, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తుంటాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూట్రీషియన్లు సౌజన్య, పల్లవి కూడా విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ఓ న్యూట్రీíÙయన్ సెలవులో వెళ్లి, జీతం మాత్రం తీసుకున్నట్లు తెల్సింది. రూ.లక్షలు జీతాలు తీసుకుంటూ చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
అనంతపురం: వివాదంలో ఎక్సైజ్ సీఐ హసీనా భాను
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీఐ, అటెండర్ మధ్య పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన వివాదంగా మారింది. రెండు క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందివివరాల ప్రకారం.. కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను, అటెండర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఐ హసీనా భాను. ఈ విషయమై తనకేమీ తెలియదని సదరు అటెండర్.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి.. ఆగ్రహానికి లోనైన సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
మురళీ నాయక్‌పై 'మంగ్లీ' పాట.. కన్నీళ్లు తెప్పించే వీడియో
‘ఆపరేషన్ సిందూర్’లో మీరమరణం పొందిన మన తెలుగుబిడ్డ మురళీనాయక్‌పై సింగర్ మంగ్లీ ఒక పాట పాడారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో మంగ్లీ తెలిపారు. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఆ సాంగ్ ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగాడు. ఈ వార్తతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. వారికి అండగా రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు నిలిచారు. ఈ క్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులను మంగ్లీ కూడా కలిసి ఓదార్చారు. దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించాడని ఆమె కొనియాడారు. దేశంలోని ప్రతి మహిళ సిందూరంలో మురళీనాయక్ నిలిచి ఉంటాడని మంగ్లీ భావోద్వగభరితంగా చెప్పారు. ఇప్పుడు తాజాగా తన పాట రూపంలో ప్రపంచానికి తెలిపారు. -
అనంతపురం జిల్లాను వణికిస్తున్న వర్షాలు
-
చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే
-
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
అనంతపురం: సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా పర్యటనలో నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఈరోజు(శుక్రవారం) ఉరవకొండ నియోజకవర్గం చాయపురంలో చంద్రబాబు పర్యటించిన క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది.. జీవో 77ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ కార్యకర్తంలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గో బ్యాక్ సీఎం అంటూ ఫ్లకార్డు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలపకుండా అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత చిన్నహోతూరు ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు నిర్భందించారు. బీజేపీ అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసనపై సర్వత్రా చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉండగా, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసన వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. -
పెద్దారెడ్డికి భద్రత కల్పించలేం: ఎస్పీ
అనంతపురం: తన స్వగ్రామమైన తాడిపత్రికి రావడానికి భద్రత కోరుతూ జిల్లా ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ. ఈ నెల9వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటన అనంతరం పోలీస్ భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లే అవకాశం ఉంది.కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా ఆయన ఇంకా అక్కడకి వెళ్లలేకపోయారు. పెద్దారెడ్డి తాడిపత్రలో అడుగుపెడితే అంటూ టీడీపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు.పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ రెండు రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. . పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. -
తాడిపత్రిలో టెన్షన్.. ఎస్పీ జగదీష్ తీరుపై చర్చ
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్‌కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్మెంట్కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది. -
అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లేందుకు అనేక అడ్డంకులను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన సందర్భంగా సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీలను ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది.అయితే, హైకోర్టు ఉత్తర్వుల కాపీలను అనంతపురం ఎస్పీ జగదీష్‌కు అందజేసేందుకు మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేరుగా అనంతపురం ఎస్పీ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. విషయం తెలుసుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఏఎస్పీతో మాట్లాడి.. అనంతరం ఎస్పీ జగదీష్‌తో కూడా ఫోన్లో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డి. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉందని.. ఆ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. తగిన భద్రత కల్పిస్తామని ఎస్పీ జగదీష్ హామీ ఇచ్చినట్లు వారు మీడియాకు వివరించారు. -
10th పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి బంపర్ ఆఫర్
-
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ స్కెచ్
-
అనంతపురం నగరంలో అమానుషం
-
గుత్తి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ భారీ దొంగతనం.. 30 తులాల బంగారం..
సాక్షి, అనంతపురం: నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (Rayalaseema Express)లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు దుండగులు అర్ధరాత్రి రైలులోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపిన సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. రైలులోని 10 బోగీల్లో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
AP: కాంగ్రెస్ నేత దారుణ హత్య
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
YSRCP Leaders: అంబేద్కర్ జోలికి వస్తే పాతాళానికి తొక్కుతాం
-
వివాహితపై జైలర్ వేధింపుల కేసు వివరాలు వెల్లడించిన విశాఖ సీపీ
-
లింగమయ్య హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, అనంతపురం: కురుబ లింగమయ్య హత్య కేసులో వైఎస్సార్సీపీ పోరాటం కొంతమేర ఫలించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్, మంజునాథ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు రమేష్, అనుచరులపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడితో కొందరిని కేసు నుంచి తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం మండలం రేఖల చేనులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. తీవ్ర గాయపడిన ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. వినాయకస్వామి ఆలయం వద్ద టీడీపీ కార్యకర్త లీలా ప్రకాష్ దేవుడు భజన చేస్తుంటే అడ్డుకోవడంతో స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అడ్డుకున్న భూపతి రెడ్డిని ఇంటి వద్ద నిద్రిస్తుంటే కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రామచంద్రపురం మండలంలో రౌడి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
బీసీలను టార్గెట్ చేయడం దుర్మార్గం
-
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్తత
-
హర్షవర్దిని ఎందుకమ్మా ఇలా చేశావు..!
రాప్తాడు రూరల్: మార్కుల ఒత్తిళ్లు ఓ ఇంటర్ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని జీఎం కాలనీకి చెందిన లక్ష్మన్న కళ్యాణదుర్గంలో సెరికల్చర్ శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హర్షవర్దిని (17) నగర శివారులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసింది. అయితే పరీక్షలు తాను సక్రమంగా రాయలేదని, ఆశించిన స్థాయిలో మార్కులు రావేమోననే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఇంటికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన YSRCP
-
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జగన్
-
ఓ వైపు ఎండలు.. మరోపక్క వానలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య తదితర జిల్లాల్లో పలుచోట్ల శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసలపల్లెలో ఆదివారం 2.9 సెం.మీ. వర్షం పడింది.శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్నిచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల ఆదివారం సాయంత్రం చెదురుమదురు వర్షాలు కురిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. విజయవాడలోని గుణదల, ప్రసాదంపాడు తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో భారీ వర్షం కురిసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో చిరు జల్లులు కురిశాయి. ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతోనే..ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలులు కలిసినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. -
అరటి రైతుల ఆత్మహత్యాయత్నం
యల్లనూరు/పులివెందుల రూరల్: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట అకాల వర్షానికి దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నంచిన ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జాంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.బాధిత కుటుంబాల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న వెంగప్ప 9 ఎకరాలు, లక్ష్మీనారాయణ మరో 10.5 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేశారు. అప్పులు తెచ్చి ఒక్కొక్కరూ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. ఒక్కో రైతుకు కనీసం రూ.20 లక్షల వరకు వస్తుందని ఆశపడ్డారు. కానీ.. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి పంట దెబ్బతింది.వడగళ్లు అరటి గెలలపై పడటంతో కాయలకు మచ్చలు వస్తాయని, దీనివల్ల పంటను ఎవరూ కొనరని బాధిత రైతులు ఆవేదన చెందారు. పంట నష్టాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆదివారం ఉదయం ఉద్యాన శాఖ అధికారులను ఫోన్లో కోరారు. సెలవు రోజు కావడంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రైతులిద్దరూ తాము తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. అప్పులు తీర్చే దారిలేక... చివరకు ఆత్మహత్యలే గతి అని భావించి తోటలోనే పురుగు మందు తాగారు.చిన్నవెంగప్ప భార్య రాజమ్మ ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు చెప్పగా.. ఇద్దరినీ పులివెందుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. పంట నష్టం జరిగిన తోటలను ఆదివారం మధ్యాహ్నం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యాన అధికారి ఉమాదేవి, తహసీల్దార్ రాజా పరిశీలించారు. కాగా.. రైతులు ఫోన్ చేసినా తాము స్పందించలేదనడంలో వాస్తవం లేదని, వెంటనే పొలాల వద్దకు వెళ్లి బాధిత రైతులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డామని ఉద్యాన అధికారి ఉమాదేవి చెప్పారు. ఎవరూ పట్టించుకోవడం లేదుమొత్తం పదిన్నర ఎకరాల్లో అరటి పంట వేశాను. 15 వేల మొక్కలు నాటాను. ప్రస్తుతం ఐదు వేల చెట్లలో పంట కోతకు వచ్చింది. రెండు, మూడు రోజుల్లో కోసి విక్రయించేవాళ్లం. మా ఖర్మ ఏమైందో గానీ వడగళ్ల వాన వచ్చింది. పంట మొత్తం దెబ్బతింది. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి?. ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. – లక్ష్మీనారాయణ, ఆత్మహత్యాయత్నం చేసిన రైతుతీవ్రంగా నష్టపోయాంతొమ్మిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.లక్షలు అప్పు చేసి పంట పెట్టా. 11 నెలలు పడ్డ కష్టానికి రెండు రోజుల్లో ఫలితమిచ్చేది. గెలలు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో కాస్తయినా అప్పులు తీర్చుకునేవాళ్లం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆశలపై నీళ్లు పడ్డాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం. – చిన్నవెంగప్ప, ఆత్మహత్యాయత్నం చేసిన రైతు -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు హల్ చల్
-
వీళ్లు మనుషులా, కుక్కలా? అనంతపురంలో వింత ఆచారం
-
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
సాక్షి,అనంతపురం: పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను,వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతపురం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లతో కలిసి అనంతపురం వద్ద ఉన్న మార్తాడు గ్రామంలో పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి ప్రయాణమైంది. తిరుగు ప్రయాణంలో బళ్లారి వైపు నుండి అనంతపురంకు వెళ్తున్న కారు.. ఎదురుగా ఉన్న ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్వసతితో పాటు ఆమె మూడునెలల కుమార్తె విద్య శ్రీ అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగేశ్వరి మృతి చెందారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
భావిపౌరులు.. వ్యసనాలకు బానిసలు
అడ్డాగా మారిన కంపచెట్లు: కూడేరు హైస్కూల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల నిర్మాణానికి రూ.లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పటి ప్రధానోపాధ్యాయుడు పనులు సక్రమంగా చేయించకపోవడంతో బాలుర మరుగుదొడ్ల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. బాలికలకు 5 మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో మగపిల్లలు మలవిర్జనకు పాఠశాలకు దగ్గరలో జాఫర్ పిండి మిషన్ ముందు ఖాళీ స్థలంలో పెరిగిపోయిన కంపచెట్ల మాటుకు వెళ్తున్నారు.ఈ కంప చెట్లే పిల్లలు చెడు మార్గంలో వెళ్లడానికి అడ్డాగా మారాయి. మూత్ర విసర్జనకంటూ అక్కడికి వెళ్లడం.. బీడీలు, సిగరెట్లు తాగడం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అలవాటు చేసుకోవడం అధికమైంది. పిల్లలు బయటకు వెళుతున్నా హెచ్ఎం, ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కూడేరు: బాగా చదివి భావి పౌరులుగా ఎదగాల్సిన ఆ విద్యార్థులు బంగారు బాల్యాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతంగా ఎదగాల్సిన వారి జీవితాలు బీడీ, సిగరెట్, గుట్కాలాంటి వ్యసనాలతో ‘పొగ’ చూరుతున్నాయి. పదిహేనేళ్లలోళ్లలోపే ‘మత్తు’కు అలవాటు పడి భవిష్యత్ చిత్తు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల గారాభం.. ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడడంతో తోటి విద్యార్థులు తోడై పెడదోవ పడుతున్నారు.చిరుప్రాయం నుంచే క్రమశిక్షణతో ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన పిల్లలు.. అవసరానికి మించి డబ్బులిస్తుండడంతో జల్సాలకు అలవాటు పడుతున్నారు. చెడుమార్గంలో వెళ్లి వారి ఆశయాలు, తల్లిదండ్రుల ఆశలను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నగరానికి పొరుగున ఉండే కూడేరు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 454 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పలువురు బాలురులు బీడీ సిగరెట్, గుట్కా, కల్లుకు బానిసవుతున్నారు. ఆరు నెలల క్రితం వరకు 9,10వ తరగతి పిల్లల్లో కొందరు వ్యసనాలకు అలవాటు పడ్డారు. నెల రోజులు నుంచి వారిని చూసి 6, 7,8వ తరగతి పిల్లలు కూడా అదేబాటలో నడుస్తున్నారు. తొలుత రూపాయి పెట్టి చుట్ట బీడీ తాగడం మొదలెట్టి .. తర్వాత రూ.10ల విల్స్, రూ.12 పెట్టి గోల్డ్ సిగరెట్లకు అలవాటు పడ్డారు. తాజాగా వారి ధ్యాస గుట్కా వైపు మళ్లింది. రూ.10, రూ.20 పెట్టి విమల్, చైనీ ఖైనీ వంటి గుట్కాలను వాడుతున్నారు. వ్యసనాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు.. కొందరు పిల్లలకు చదువుపై ధ్యాస లేదు. టీవీలు, సినిమాలు, సెల్ఫోన్లో యుట్యూబ్లో బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కాలు వేసుకోవడం ఫ్యాషన్‌గా తీసుకొని వీరు బానిసలవుతున్నారు. ధూమపానం చేయడం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, గుట్కా వేసుకోవడంతో నోటి కేన్సర్ వస్తుందన్న విషయం తెలియక డబ్బు పెట్టి జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. పిల్లల భవిష్యత్ నాశనంపెద్దవారే బీడీలు, సిగరెట్లు తాగి, గుట్కా వేసుకోవడంతో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. మరీ చిన్నపిల్లలు వీటికి బానిస కావడం దారుణం. అడ్డుకట్ట వేయకపోతే చదువుపై శ్రద్ధ చూపకపోగా మరింత వ్యసన పరులై చేతులారా భవిష్యత్ నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు డబ్బులివ్వడం మంచిది కాదు. – లక్ష్మీనారాయణ, మండల వైద్యాధికారి, కూడేరు నిఘా ఉంచుతాం..కొందరు పిల్లలు బీడీలు, సిగరెట్లు తాగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరగతి గదుల్లో ఉండకుండా బయట తిరుతున్న పిల్లలపై నిఘా ఉంచాం. అల్లరి, చిల్లరిగా తిరిగే పిల్లల విషయాన్ని వారి తల్లిదండ్రులను పిలిపించి తెలియజేశాం. మగపిల్లలకు మరుగుదొడ్లు లేకపోవడం సమస్యగా మారింది. మలమూత్ర విసర్జనకంటూ పిల్లలు బయటకు వెళుతున్నారు. ధూమపానం, గుట్కాకు అలవాటు పడిన పిల్లలపై తోటి పిల్లలతో నిఘా పెట్టిస్తాం. – శ్రీదేవి, హెచ్ఎం, కూడేరు హైస్కూల్ -
చిట్టిలంటూ జనాలకు టోపీ
-
ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు..
అనంతపురం: ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి మోసం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతులు వాస్మాయిల్ తాగారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం గెరిశనపల్లికి చెందిన దివాకర్ అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో ముదిగుబ్బకు చెందిన రేష్మ అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెద్దలు రేష్మకు వివాహం చేయగా.. పెళ్లయిన నెలకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. మళ్లీ దివాకర్‌తో ప్రేమాయణం సాగించింది.ఈ క్రమంలో రూ.2 లక్షలకు పైగా డబ్బు ఇచ్చింది. కాగా, కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన శారద (23) అనే యువతితోనూ దివాకర్ ప్రేమాయణం సాగించాడు. అటు రేష్మ, ఇటు శారద ఇద్దరితోనూ ఏకకాలంలో ప్రేమ బంధం నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసేవాడు. ఇటీవల శారదకు దివాకర్ తీరుపై అనుమానం వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలించగా.. రేష్మతో అతడి బాగోతం బయటపడింది. ఇదే క్రమంలో రేష్మ కూడా దివాకర్‌ను నిలదీసింది. విషయం తెలుసుకున్న రేష్మ కుటుంబ సభ్యులు ఆమెను కదిరిలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపారు.అయితే, శనివారం దివాకర్‌తో మరోమారు రేష్మ ఫోన్లో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో దివాకర్ కదిరికి వెళ్లి ఆమెను బైక్‌పై అనంతపురం తీసుకొచ్చాడు. శారద ఉంటున్న హాస్టల్లోనే ఆమెను వదిలాడు. ఆదివారం సాయంత్రం రేష్మ, శారదలు దివాకర్‌ను తామున్న చోటుకు పిలిచి ఇద్దరినీ పెళ్లిచేసుకోవాలని కోరారు. అయితే, తానెవరినీ పెళ్లి చేసుకునేది లేదంటూ దివాకర్ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతులు ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వాస్మాయిల్ తాగారు.విషయాన్ని దివాకర్‌కు ఫోన్లో తెలియజేయగా.. వెంటనే అతను అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరినీ ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక శారద మృతి చెందింది. రేష్మ పరిస్థితి నిలకడగా ఉంది. శారద వాస్మాయిల్ ఎక్కువ తాగిందని, రేష్మ కొంచెమే సేవించినట్లు గుర్తించిన పోలీసులు ఇందులో రేష్మ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ -
భూ వివాదంలో దళితులపై దాడి చేసిన టీడీపీ నేతలు
-
అనంతపురం: యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో అమ్మాయి బాత్రూమ్లోకి కొందరు తొంగిచూశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళన దిగారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్రూమ్ల్లోకి తొంగి చూశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో, వారంతా ఆందోళనకు దిగారు. అనంతరం, ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. -
అనంతపురంలో అక్రమ సంబంధానికి బలైన ఓ వ్యక్తి
-
టీడీపీ ఆఫీస్ లో రేషన్ షాప్..!
-
కరువు సీమలో విచిత్రం..
-
సూపర్ సిక్స్ హామీలపై నిలదీసిన YSRCP సభ్యులు
-
అనంతపురం నారాయణ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
-
బాహుబలి ఎద్దు..
-
అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
సీరియస్ మీటింగ్.. సైలెంట్‌గా రమ్మీ!
అనంతపురం అర్బన్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తరువాత రెవెన్యూ శాఖలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పోస్టు అత్యంత కీలమైనది. అలాంటి పోస్టులో ఉన్న అధికారి అందరికీ ఆదర్శంగా, జవాబుదారీగా ఉండాలి. అయితే జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో.. అదేమీ తనకు పట్టనట్లు బాధ్యతలు విస్మరించి తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాలు.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్‌కుమార్, టి.ఎస్.చేతన్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఇతర సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న డీఆర్ఓ మలోల అక్కడి వ్యవహారం తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన పక్కన ఉన్నతాధికారులు ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వివరణ కోరిన కలెక్టర్ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్ఓ మలోల ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు. డీఆర్ఓను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో డీఆర్ఓ మలోల స్వయంగా కలెక్టర్ బంగ్లాకు వెళ్లి కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
కీలకమైన సమావేశంలో ఆన్ లైన్ లో రమ్మీ ఆడిన డీఆర్వో మలోలా
-
AP: కలెక్టరేట్లో డీఆర్వో అలసత్వం.. ఫోన్లో గేమ్ ఆడుతూ..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికారులు రిలాక్స్ అవుతున్నారు. తమ బాధ్యతలు మరచి.. కీలక సమావేశంలో సైతం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కీలక సమావేశంలో రెవెన్యూ అధికారి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా నిర్వాకం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
ప్రభుత్వం మాదే.. స్థలం ఆక్రమిస్తామంటూ టీడీపీ నేతల దౌర్జన్యం
-
జర్నలిస్ట్ పై టీడీపీ నేతల దాడి
-
వెదురు సాగుకు ఎదురు లేదు
చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపే సామర్థ్యమున్న ఆకుపచ్చని బంగారం అది. సారవంతం లేని భూమైనా పర్వాలేదు.. గ్యారంటీగా పంట పండుతుంది. రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పంటగా గుర్తింపు పొందిన ఆ పంటే వెదురు సాగు. గ్రామీణ పేదలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే వనరు కూడా వెదురే కావడం గమనార్హం. వెదురు వినియోగం పెరిగే కొద్ది మార్కెట్లో దాని విలువ బంగారంతో సమానంగా ఎగబాకుతోంది. అందుకే దీనిని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం)గా ముద్దుగా పిలుస్తుంటారు. స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం పొందే ఈ పంటపై ఓ చిరుద్యోగి దృష్టి సారించి సఫలీకృతుడయ్యారు. సాగు ఆరంభంలో అందరూ నవ్వుకున్నా... పట్టువీడని విక్రమార్కుడిలా సత్ఫలితాలు సాధించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. రాయదుర్గం: అనంతపురం జిల్లాలో వెదురు సాగు (Bamboo Cultivation) రైతు అంటూనే ఠక్కున గుర్తొచ్చేది గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన పాటిల్ వంశీకృష్ణారెడ్డి. జిల్లాలో తొలిసారి వెదురు సాగుకు శ్రీకారం చుట్టి అటు ఉద్యానశాఖ అధికారుల్లో, ఇటు అన్నదాతల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగిగా స్థిరపడ్డారు. కరోనా (Carona) కారణంగా ఉద్యోగం వీడి వ్యవసాయంపై దృష్టి సారించారు. అందరిలా వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, పత్తి (Cotton) లాంటి పంటలు కాకుండా వినూత్న ఆలోచనతో 10 ఎకరాల్లో వెదురు సాగు చేపట్టారు. ఎకరాకు రూ.50 వేలు చొప్పన రూ.5 లక్షలు పెట్టుబడి అయింది. మూడేళ్ల పాటు పంటను కాపాడుతూ వచ్చారు. ఇది చూసిన చాలా మంది హేళనగా మాట్లాడారు. అయినా ఆయన వెనుదిరిగి చూడలేదు. మూడేళ్ల తర్వాత కోతలు.. వంశీకృష్ణారెడ్డి సాగు చేసిన వెదురు పంట మూడేళ్ల తర్వాత ప్రస్తుతం కోతకు వచ్చింది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో టన్ను వెదురు ధర రూ.6 వేలు పలుకుతోంది. నాణ్యమైన వెదురు కావడంతో వంశీకృష్ణారెడ్డి పొలం వద్దకే కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ధర పెంచేందుకు కూడా వెనుకాడడం లేదు. సరాసరి ఎకరాకు 20 టన్నులతో పదెకరాలకు 200 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. టన్ను రూ.6 వేలతో లెక్కించినా రూ.12 లక్షల ఆదాయం ఇంటి వద్దకే సమకూరింది. వచ్చే ఏడాది 25 నుంచి 30 టన్నులు, ఐదో ఏడాది 45 నుంచి 50 టన్నులకుపైగా దిగుబడి వస్తుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి పంట కోతలు చేపడితే.. ఆ తర్వాత కేవలం నీటి తడులతోనే పంట ఏపుగా పెరుగుతుందని పేర్కొటున్నారు. పైగా కోత దశకు వచ్చిన వెదురు పంటలో వ్యర్థమన్నదే ఉండదంటున్నారు. చిన్న పరిమాణంలో ఉన్న వెదురు కర్రలకు సంబంధించి టన్ను రూ.5వేలకు పైగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వీటిని టమాట, ఇతర పంటల సాగులో ఊతకర్రలుగా వినియోగిస్తుంటారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి.. సాగుకు యోగ్యంగా లేని భూములైన సరే నీటి వసతి ఉంటే వెదురు సాగుకు అనుకూలం. వెదురు సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేస్తాం. ఎకరం పది సెంట్లలో నర్సరీ ఏర్పాటు చేసుకుంటే రూ.10 లక్షలు ఇస్తాం. వెదురు మొక్కలు రాయితీతో అందించడంతో పాటు ప్రధాన పంటగా సాగు చేస్తే హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం. – నరసింహరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, అనంతపురం -
MLA Vs Ex MLA: టీడీపీలో ఆధిపత్య పోరు!
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఓ స్థలం విషయంలో వీరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. జిల్లాలో ప్రభుత్వ భూమి విషయంలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. అయితే, అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో మూడు ఎకరాల వంకపోరంబోకు స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులపై దాడి చేసి స్థలం ఖాళీ చేయించారు. అనంతరం, ప్రభుత్వ వంకపోరంబోకు స్థలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు పాగా వేశారు. దీంతో, టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో దగ్గుపాటి ప్రసాద్ మోసం చేశారంటూ మరో వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని సమాచారం. -
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగి ఉంటుందని ట్రావెల్స్ మేనేజర్ అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్లైయాష్ వివాదమే కారణమా? నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది. -
అనంతపురంలో లాయర్ ఘటనపై అనుమానాలు !
-
బాబు బాదుడుపై అనంతపురం YSRCP నేతలు పోరుబాట
-
వైఎస్సార్సీపీ పోరుబాటపై బాబు సర్కార్ కుట్రలు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వేల కోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వైఎస్సార్సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది.విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుండగా.. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి సహా వైఎస్సార్ సీపీ నేతలను పీఎస్‌కు పోలీసులు పిలిపించారు.వైఎస్సార్ సీపీ పోరుబాటకు వెళ్లకుండా బైండోవర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీ పోరుబాటకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే! -
తాడిపత్రిలో ఆగని జేసీ కుటుంబ అరాచకాలు
-
YS Jagan: నేను జైల్లో ఉన్నప్పుడు నా భార్య నా కోసం.. గూస్ బంప్స్ స్పీచ్
-
ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ముగిసిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు
-
అనంతపురం జిల్లా నార్పలలో ఘనంగా వీర జవాను సుబ్బయ్య అంత్యక్రియలు
-
ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు
సాక్షి,అనంతపురం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య (43) అంత్యక్రియలు అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో ముగిశాయి. తాను ప్రాణాలు వదులుతూ.. ఇతరులను కాపాడి అసలైన వీరుడు అనిపించుకున్న సుబ్బయ్య అంత్యక్రియలు పాల్గొనేందుకు మండల వ్యాప్తంగా ప్రజలు కుల, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య, తల్లికి సుబ్బయ్య భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను సైనిక లాంచనాలతో సైనిక అధికారులు అందజేశారు.కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్‌లోని మినీ కాశ్మీర్‌గా పేరొందని పూంచ్ జిల్లా, పూంచ్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరపై కాలు మోపారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాను సుబ్బయ్య సహచరులను అప్రమత్తం చేసి వారిని ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందుపాతరకు మాత్రం తాను బలయ్యారు.ఎల్ఓసీలో అమరుడైన సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా నార్పలకు తీసుకువచ్చారు. సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని చూసి భార్య లీల, తల్లి గాలెమ్మ, పిల్లలు, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్ వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు. ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్జమ్మూలో విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్లు 30 మందిని కాపాడి, తాను మాత్రం దాని బారిన పడి ప్రాణాలుకోల్పోవడం బాధాకరం. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
అనంతపురంలో వడ్డీ వ్యాపారుల దాష్టీకం
-
తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు చర్యలు
-
పులికి చుక్కలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్స్..
-
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్‌కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
అనంతపురం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: అనంతపురం జిల్లాలో శనివారం(నవంబర్ 23) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని,వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
సమాజమా నువ్వెక్కడ?
అందరి గురించి ఆలోచించేవాడునలుగురికీ తల్లోనాలుకలా ఉండేవాడుఎవరికి ఏ జబ్బుచేసినా మందులిచ్చి నయం చేసేవాడుసాయమంటే ముందుండేవాడుఆయనకే కష్టం వస్తే...అయ్యోపాపం అనలేకపోయావాకాస్త ఆదరణచూపలేకపోయావా?జీవితంపై విరక్తి చెందితే ..ఊరడింపుగా నాలుగు మాటలు చెప్పలేకపోయావాకుటుంబంతో ఉరికంభమెక్కితే...అలా చూస్తూ ఊరుకున్నావాపసిగుడ్డు గొంతునులిమేసేంతగా మార్చేశావా..ఆయువు ఆగి ఐదురోజులైనా కన్నెత్తి చూడలేకపోయావాఇప్పుడంతా అయిపోయింది..ఆ మనిషి లేడు..ఆ కుటుంబమూ లేదునువ్వుండు.. నూరేళ్లునిర్దయగా...నిక్షేపంగా..అలా నువ్వున్నా..లేనట్టే!అందుకే అతను.. తన ఐదు నెలల ప్రతిరూపాన్ని వెంటతీసుకెళ్లాడు..నార్పలకు చెందిన కృష్ణకిశోర్, శిరీష దంపతులు ఉరి వేసుకుని చనిపోగా..ఐదురోజుల తర్వాత ఇరుగుపొరుగు గుర్తించారు. లోనికి వెళ్లి చూడగా..వారి ప్రేమకు ప్రతిరూపమైన ఐదు నెలల పసికందు ఊయలలో నిర్జీవంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన మనసున్న మనిషెవరైనా ఇలాగే ప్రశ్నిస్తున్నాడు.. సమాజమా...నువ్వెక్కడా అని..అనంతపురం -
సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు.. అనంతపురం మేయర్ సీరియస్ వార్నింగ్
-
అనంతపురం : మెడికో ఫ్రెషర్స్ డే అదరహో (ఫొటోలు)
-
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
సెల్‌ఫోన్ రికవరీలో ‘అనంత’ టాప్
అనంతపురం: సెల్ఫోన్ల రికవరీలో 10 వేల మైలురాయిని దాటి అనంతపురం పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటివరకు మొత్తం 10,195 ఫోన్ల రికవరీ చేసి, బాధితులకు అందజేశారు. వీటివిలువ సుమారు రూ.18.85 కోట్లుగా నిర్ధారించారు. తాజాగా రికవరీ చేసిన 1,309 మొబైల్ ఫోన్లను బాధితులకు మంగళవారం అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ పి.జగదీష్ అందజేశారు. వీటివిలువ రూ.3.45 కోట్లు ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న తర్వాత ఆచూకీ దొరకదనుకునే ఫోన్లను సైతం రికవరీ చేసి అందజేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని బాధితులకు 1,156 ఫోన్లు అందజేశారు. -
ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసుల రికార్డు.. ఏకంగా 18.85 కోట్ల విలువైన
సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీస్ మైదానంలో సెల్ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు క్యూ కట్టడంతో పరేడ్ మైదానం జాతరను తలపించింది. మంగళవారం ఒక్కరోజే 1309 మంది బాధితులకు తమ ఫోన్లను తిరిగి అందజేశారు పోలీసులు. ఫోన్లు రివకరీ చేసిన సిబ్బందిని పోలీసులు ప్రశంసించి రివార్డులు అందించారు.ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మందికి సంబంధించిన 18.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఇవాళ అందజేసిన ఫోన్ల విలువ రూ. 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 10,195 ఫోన్లు రికవరీ చేయగా.. వీటిలో 19 జిల్లాలకు 2535 ఫోన్లను, 20 రాష్ట్రాలకు 1056 మొబైళ్లను పంపిణీ చేశామని తెలిపారు. రికవరీ చేసి నేడు అందించిన ఫోన్ల విలువ 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు. -
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్పల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు.మృతుల వివరాలు...శ్రీధర్(28)సంతోష్ (26)వెంకన్న (35)ప్రసన్న (34)వెంకీ (24)షణ్ముఖ (30) -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
నేను ఎక్కడికి పారిపోను .. ఎప్పుడైనా నన్ను అరెస్ట్ చేసుకోండి ..
-
అనంతపురంలో సినీ తారలు పాయల్ రాజ్‌పుత్,నభా నటేష్ సందడి (ఫొటోలు)
-
ఎస్పీని కలిసిన కేతిరెడ్డి
-
వివాదాస్పద తీరు.. ఆగడాల్లో సరిలేరు!
ఎక్కడైనా ఒక పోలీసు అధికారికి మంచి పోస్టింగ్ ఇవ్వాలంటే పనితీరు, నిజాయితీ వంటివి చూస్తారు. కానీ ఆ సీఐకి ఈ అర్హతలే లేవు. పైపచ్చు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హత్య కేసుల్లో నిందితులకు సహకరిస్తారని, బాధితులపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, రాజకీయ నాయకులఅడుగులకు మడుగులొత్తడంలో ఘనాపాటిగా పేరుంది. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచి మరీ అందలం ఎక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: గతంలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన రెండు హత్యలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాయి. అనంతపురం రూరల్ మండలం కందుకూరులో 2018 మార్చి 30న వైఎస్సార్ సీపీ నేత శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఇటుకలపల్లి నుంచి స్వగ్రామం వెళ్తుండగా దారిలో కాపుకాచిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు వారం రోజుల ముందే రెండు వర్గాల నడుమ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివారెడ్డి సోదరుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందించగా, అప్పట్లో సీఐగా ఉన్న రాజేంద్రనాథ్ యాదవ్ దాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత వారం రోజులకే శివారెడ్డి హత్య జరి గింది. వినతిపత్రం ఇచ్చినప్పుడే నిందితులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే అసలు హత్యే జరిగి ఉండేది కాదని కందుకూరు గ్రామస్తులు నేటికీ చెబుతున్నారు. శివారెడ్డి హత్యకు పరోక్షంగా సీఐ కూడా కారణమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణ అధికారిగా రాజేంద్రనాథ్ ఉంటే బాధితులకు న్యాయం జరగదని మరో పోలీసు అధికారిని ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం.ప్రసాదరెడ్డి హత్య కేసులోనూ..2015 ఏప్రిల్ 29న ఏకంగా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే వైఎస్సార్ సీపీ కీలక నేత భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య నేపథ్యంలోనూ రాజేంద్రనాథ్ వ్యవహార శైలిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారును అప్పట్లో శివప్రసాద్ రెడ్డి హత్య కేసు నిందితులు వాడినట్టు తేలింది. ఆ సమయంలో దగ్గుపాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. ఇప్పుడు దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే కావడంతో రాజేంద్రనాథ్ ఏకంగా కీలకమైన వన్‌టౌన్‌కు పోస్టింగ్ తెచ్చుకోగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సెటిల్మెంట్లలో ఘనుడు!రాప్తాడుకు చెందిన ఓ విలేకరికి, ఆయన అన్నదమ్ములకు మధ్య భూ వివాదం నడుస్తోంది. వీరిలో ఒక వర్గానికి పరిటాల కుటుంబం మద్దతు ఉంది. దీంతో అప్పట్లో మంత్రి అయిన పరిటాల సునీత ఒత్తిడితో విలేకరిపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రెచ్చిపోయారు. విలేకరి చొక్కా పట్టుకుని ‘భూమి మీద నీకు హక్కులేదు, మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా లేదా’ అని బెదిరించారు. దీంతో బాధిత విలేకరి అప్పట్లో తన మిత్రులతో కలిసి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగగా సీఐ క్షమాపణలు చెప్పారు. ఇలా ల్యాండ్ సెటిల్మెంట్లలోనూ ఘనాపాటిగా రాజేంద్రనాథ్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు.తాజాగా స్టూడెంట్ యూనియన్ నేతలపై..నేటికీ రాజేంద్రనాథ్ యాదవ్ తన వివాదాస్పద వైఖరిని వీడలేదు. స్టూడెంట్ యూనియన్ నాయకులపై ఇటీవల తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. స్కాలర్షిప్లు మంజూరు చేయాలంటూ అనంతపురంలోని పెన్నార్ భవన్ వద్ద ధర్నాకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలపై చిందులు తొక్కారు. సీఐ వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, తమను కొట్టడానికి కూడా యత్నించారని, విద్యార్థుల పట్ల కూడా అమాన వీయంగా వ్యవహరించారని విద్యార్థి సంఘం నేతలు వాపోయారు. ఇలా తాను ఎక్కడ పనిచేసినా లెక్కలేనన్ని ‘ఘనతలు’ మూటగట్టుకున్న వ్యక్తికి నగరంలో కీలక స్థానాన్ని కట్టబెట్టడం ఉమ్మడి జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేసే పోలీసు బాస్‌లు రాజేంద్రనాథ్ యాదవ్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
రామాలయంలో రథానికి నిప్పు
-
రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
బుక్కరాయసముద్రం/చిల్లకూరు: రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, తిరుపతి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. అనంతపురం నగరంలోని స్టాలిన్ నగర్‌కు చెందిన బలిజ పవన్(24) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెల కిందటే ఉద్యోగం వచి్చంది. చాకలి పవన్(22), ముస్తాక్(23)లు వడ్రంగి పని చేస్తుంటారు. శ్రీనివాసులు(24) డ్రైవర్. వీరంతా స్నేహితులు. ముస్తాక్ పుట్టిన రోజు కావడంతో శనివారం రాత్రి నగరంలో పార్టీ చేసుకున్నారు.తర్వాత మరో స్నేహితుడి నుంచి ఇన్నోవా కారు తీసుకుని ఎక్కడెక్కడో తిరిగి సుమారు రెండు గంటల ప్రాంతంలో నార్పలలో ఉంటున్న పవన్ నానమ్మను చూడడానికంటూ బయలుదేరారు. అతివేగంగా వెళుతూ బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట దాటగానే నార్పల వైపు నుంచి వేరుశనగ విత్తన బస్తాల లోడుతో అనంతపురం వస్తున్న లారీని ఢీకొట్టారు. లారీ కిందకి కారు దూసుకెళ్లి నుజ్జు నుజ్జయింది. చాకలి పవన్, శ్రీనివాసులు, ముస్తాక్, బలిజ పవన్ అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్ తాతయ్యకు గాయాలయ్యాయి. అదేవిధంగా నెల్లూరు సమీపంలోని కాకుపల్లి, వనంతోపునకు చెందిన రెండు కుటుంబాల వారు అరుణాచలం వెళ్లి తిరిగి కారులో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా చిల్లకూరు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందించేలోగా వెన్నెల మేఘన (8), జగదీష్(50), బాబు(48) మృతి చెందారు. -
ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఆదివారం తెల్లవారుజామున వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతులను నెల్లూరు జిల్లా, అనంతపూర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను అతి వేగంలో ఉన్న కారు వచ్చి ఢీకొట్టింది. కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, వీరంతా అరుణాచలం నుంచి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని నెల్లూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.మరోవైపు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఘెర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలో లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మృతులను అనంతపురం స్టాలిన్ నగర్‌కు చెందిన చాకలి పవన్, శ్రీనివాస్, ముస్తాక్, ఎస్. పవన్‌గా గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి -
ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
అనంతపురంలో సూర్యకుమార్ యాదవ్.. 5 పరుగులకే అవుట్ (ఫొటోలు)
-
భారత్-ఎ vs భారత్-సి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
అనంతపురం : ఆకాశంలో అద్భుతం (ఫొటోలు)
-
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్‌గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్‌కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్‌కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్‌కు చేరువలో కుల్దీప్ -
అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు.. ఫోటోలు
-
అభిమన్యు వీరోచిత పోరాటం
సాక్షి, అనంతపురం: భారత్ ‘బి’ జట్టు కెపె్టన్, ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (262 బంతుల్లో 143 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీతో జట్టును నడిపిస్తున్నాడు. దీంతో మూడు రోజులైనా తొలి ఇన్నింగ్స్ ఆటే సాగుతుండటంతో దులీప్ ట్రోఫీలో ‘సి’ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 124/0తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు ఆట నిలిచే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఫాలోఆన్‌ను తప్పించుకునేందుకు ఇంకో 16 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట మొదలవగానే ఓపెనర్లలో నారాయణ్ జగదీశన్ (137 బంతుల్లో 70; 8 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు కేవలం 3 పరుగులు జతచేసి అన్షుల్ కాంబోజ్ ఓవర్లో ని్రష్కమించాడు. స్వల్ప వ్యవధిలో అన్షుల్ టాపార్డర్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (1) వికెట్ పడగొట్టాడు. 133 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోగా... ఈ దశలో కెప్టెన్ అభిమన్యు, సర్ఫరాజ్ ఖాన్ (55 బంతుల్లో 16; 1 ఫోర్) ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా జాగ్రత్తగా ఆడారు. మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించాక సర్ఫరాజ్‌ను అన్షుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే 23 ఏళ్ల హరియాణా పేసర్ అన్షుల్ కాంబోజ్... హిట్టర్లు రింకూ సింగ్ (6), నితీశ్ కుమార్ రెడ్డి (2)లను అవుట్ చేసి జట్టును కష్టాల్లో పడేశాడు. 194 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన భారత్ ‘బి’ జట్టుకు ఇక ఫాలోఆన్ ఖాయమనిపించింది. కానీ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (13), సాయికిశోర్ (44 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ చహర్ (31 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 26 పరుగులు జోడించాడు. అన్షుల్ 5 వికెట్లు పడగొట్టగా, విజయ్ కుమార్ వైశాక్, మయాంక్ మార్కండేలకు చెరో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: 525; భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 143; నారాయణ్ జగదీశన్ (సి) అభిõÙక్ (బి) అన్షుల్ 70; ముషీర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 1; సర్ఫరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 16; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) అన్షుల్ 6; నితీశ్ కుమార్ రెడ్డి (బి) అన్షుల్ 2; వాషింగ్టన్ సుందర్ (సి) సుదర్శన్ (బి) విజయ్ 13; సాయికిశోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మార్కండే 21; రాహుల్ చహర్ (బ్యాటింగ్) 18; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 309. వికెట్ల పతనం: 1–129, 2–133, 3–175, 4–190, 5–194, 6–237, 7–283. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0–8–0, విజయ్ కుమార్ వైశాక్ 23–5–67–1, అన్షుల్ కాంబోజ్ 23.5–7– 66–5, మయాంక్ మార్కండే 18–0–59–1, మానవ్ సుతార్ 33–4–85–0, ఇషాన్ కిషన్ 1–0–7–0, సాయి సుదర్శన్ 1–0–3–0. -
అనంతపురంలో క్రికెటర్లు తీసుకునే ఆహారం (ఫొటోలు)
-
నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే!
టీమిండియా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ దులిప్ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్.. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.తొలి మ్యాచ్‌లో ఇలాతాజా ఎడిషన్‌లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్ ఆడింది. ఇందులో రియాన్ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్ పరాగ్ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడుతొలి ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్.. మంచి జోష్‌లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పాత కథే పునరావృతం చేశాడు.ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) అవుట్‌కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. తిలక్ వర్మ(111 నాటౌట్)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024భారీ స్కోర్లుగా మలచలేకపోయాడుఇండియా-‘డి’ స్పిన్నర్ సౌరభ్ కుమార్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్‌కు పోయి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే రియాన్ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్‌కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'20(31) Riyan parag gifted his wicket after settled#riya #parag #riyanparang #DuleepTrophy2024 #cricket #IPL2025 #ipl #test pic.twitter.com/lMGSUBQZna— mzk (@Zuhaib006) September 14, 2024 -
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. వీడియో వైరల్
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులేకాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.ప్రథమ్, తిలక్ శతకాలతోఅయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.తిలక్ వర్మకు ఐదో సెంచరీఫస్ట్క్లాస్ క్రికెట్లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలుCreativity & Placement 👌👌Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
ఆర్డీటీ స్టేడియంలో దులిప్ ట్రోఫీ.. రెండో రోజు ఇలా(ఫొటోలు)
-
అప్పుడు డకౌట్.. ఇప్పుడు వికెట్! శ్రేయస్ సెలబ్రేషన్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ తీశాడు. దులిప్ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో ఇండియా-‘డి’ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఇండియా-‘ఎ’ తో మ్యాచ్‌లో ఈ మేర తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. భారత టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా అయ్యర్ ఈ రెడ్‌బాల్ టోర్నీ బరిలో దిగాడు.తొలి టెస్టులో స్థానం దక్కలేదుఇండియా-‘సి’తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో సారథిగా ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో అర్ధ శతకం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడబోయే తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్‌కు స్థానం దక్కలేదు. దీంతో దులిప్ ట్రోఫీ జట్టుతోనే ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఇండియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతపురం వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-‘డి’ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా-‘ఎ’ను తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది ఇండియా-‘డి’.దేవ్‌దత్ పడిక్కల్ 92కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం రాణించలేకపోయింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా.. మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన దేవ్‌దత్ పడిక్కల్ 92 రన్స్‌తో అదరగొట్టగా.. రికీ భుయ్ 23, హర్షిత్ రాణా 31 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరి కారణంగా ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగలింది.స్వయంగా రంగంలోకి దిగిన కెప్టెన్ఈ క్రమంలో వందకు పైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘ఎ’ జట్టుకు ఓపెనర్లు ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరు మరింత పెంచారు. ఈ జోడీని విడగొట్టడం ఇండియా-‘డి’ బౌలర్ల తరం కాలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్వయంగా రంగంలోకి దిగాడు.రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల అయ్యర్.. ఇండియా-‘ఎ’ ఇన్నింగ్స్ 29వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(56)ను అవుట్ చేశాడు. ఊహించని రీతిలో రిటర్న్ క్యాచ్ అందుకుని మయాంక్‌కు షాకిచ్చాడు. ఆరేళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వికెట్ తీయడం ఇదే తొలిసారి. అంతకు ముందు సౌరాష్ట్రతో 2018 నాటి మ్యాచ్‌లో అతడు వికెట్(చేతన్ సకారియా) పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఇండియా-‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఇండియా-‘డి’పై 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్Golden Arm! 💪Shreyas Iyer comes into the attack. Shreyas Iyer strikes first ball 👌An excellent low catch off his own bowling, and he breaks the 115-run opening stand at the stroke of stumps. #DuleepTrophy | @IDFCFIRSTBankScorecard ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/c1nXJsN8QM— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
విఫలమైన సంజూ శాంసన్.. సింగిల్ డిజిట్ స్కోర్
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ తనకు వచ్చిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దులిప్ ట్రోఫీ జట్టుకు తొలిసారిగా ఎంపికైన అతడు.. ఆరంభ మ్యాచ్‌లోనే బ్యాటర్‌గా విఫలమయ్యాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో కేరళ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్.. చాలాకాలం తర్వాత దేశీ రెడ్‌బాల్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.వారు వెళ్లిపోవడంతోమరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడిన నేపథ్యంలో ఇండియా-‘డి’ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ.. ఈ టీమ్ ఆడిన తొలి మ్యాచ్‌లో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అయితే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లు దులిప్ ట్రోఫీ నుంచి వైదొలగడంతో సంజూ ఎంట్రీకి మార్గం సుగమమైంది.ఈ క్రమంలో ఇండియా-‘ఎ’తో అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఇండియా-‘డి’ తరఫున సంజూ బరిలోకి దిగాడు. టాస్ గెలిచిన ఇండియా-‘డి’ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-‘ఎ’ను 290 పరుగులకు ఆలౌట్ చేసింది.క్యాచ్‌తో హైలైట్ఇండియా- ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా(4/51) నాలుగు వికెట్లతో చెలరేగగా.. విద్వత్ కవేరప్ప(2/30). అర్ష్‌దీప్ సింగ్(2/73) రెండేసి వికెట్లు తీశారు. మిగతా వాళ్లలో సారాంశ్ జైన్(1/55), సౌరభ్ కుమార్(1/65) ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక కవేరప్ప బౌలింగ్‌లో ఇండియా-‘ఎ’ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను సంజూ పట్టిన తీరు హైలైట్‌గా నిలిచింది.ఐదు పరుగులకే అవుట్అనంతరం ఇండియా-‘డి’ బ్యాటింగ్‌కు దిగగా.. రెండో రోజు ఆటలో భాగంగా సంజూ ఐదో స్థానంలో వచ్చాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు.. కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆకిబ్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘సంజూ రెడ్‌బాల్ క్రికెట్‌కు పనికిరాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక దేవ్‌దత్ పడిక్కల్ 92 పరుగులతో రాణించడంతో.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగలిగింది. ఫలితంగా వందకు పైగా పరుగుల ఆధిక్యంతో ఇండియా- ‘ఎ’ రెండో ఇన్నిం గ్స్ మొదలు పెట్టింది.చదవండి: Shreyas Iyer: సన్‌గ్లాసెస్‌తో బ్యాటింగ్..! కట్ చేస్తే డకౌటయ్యాడు(వీడియో)Pacers Khaleel Ahmed & Aaqib Khan have impressed so far for India A with 2⃣ wickets each!Watch 📽️ all the 4⃣ India D wickets to fall in the morning session on Day 2 🔽#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0HttaH pic.twitter.com/7GIOzLwpa5— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
DT 2024: అనంతపురంలో దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్ (ఫొటోలు)
-
DT 2024: గిల్ స్థానంలో కెప్టెన్‌గా కర్ణాటక బ్యాటర్
దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌గా ఎంపికయ్యాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్‌బాల్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.టీమిండియాలోకి గిల్బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 46 పరుగులు చేసిన గిల్.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్ స్థానంలో మయాంక్ కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.కాగా గిల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.ఇక అనంతపురంలోఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్‌లో మయాంక్ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.శుబ్‌మన్ గిల్ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్డేటెడ్):మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. చదవండి: మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్ ట్రోల్స్ -
అనంతపురంలో ముగిసిన దులీప్ ట్రోఫీ మ్యాచ్.. ఫోటోలు
-
ఫొటోలు ఇవ్వని స్టూడియో యజమానికి జరిమానా
అనంతపురం: పెళ్లి సమయంలో తీసిన ఫొటోలు, వీడియో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన స్టూడియో యజమానికి రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్పర్సన్ ఎం.శ్రీలత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... అనంతపురానికి చెందిన శ్రీనివాసకుమార్ గత ఏడాది తన కుమారుడి వివాహ వేడుకకు సంబంధించి ఫొటోలు, వీడియో తీసేందుకు ఫొట్రోగాఫర్ జయచంద్రతో రూ.85 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో రూ.75 వేలను చెల్లించాడు. అయితే పెళ్లి ముగిసి నెలలు గడుస్తున్నా ఫొటోలు, వీడియో ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శ్రీనివాసకుమార్ నిలదీశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియో ఇవ్వడానికి కుదరదని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని జయచంద్ర తెలిపి, ఆ మొత్తం కూడా ఇవ్వకుండా మొండికేశాడు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. జయచంద్ర తీసుకున్న రూ.75 వేలను 24 శాతం వడ్డీతో సహా చెల్లించాలని, మానసిక వేదనకు గురి చేయడంతో పాటు సేవాలోపానికి గాను మరో లక్ష రూపాయల జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించాలని పిటీషన్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించిన నోటీసులు అందుకున్న స్టూడియో యజమాని కమిషన్ ఎదుట హాజరు కాకుండా ముఖం చాటేశాడు. దీనిపై పూర్వపరాలు విచారించిన అనంతరం ఫిర్యాది పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.75వేలను 9శాతం వడ్డీతో సహా చెల్లిచండంతో పాటు మానసిన వేదనకు గురిచేయడం, సేవాలోపానికి గాను రూ.50 వేలు జరిమానా, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు అంతా కలిపి 45 రోజుల్లోపు చెల్లించాలని జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్పర్సన్ ఎం శ్రీలత, సభ్యులు డి. గ్రేస్ మేరి, బి. గోపీనాథ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
అనంతపురంలో దులిప్ ట్రోఫీ: రెండో రోజు హైలైట్ ఫొటోలు
-
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్‌లో.. రెండో ఇన్నిం గ్స్‌లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్‌లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్‌లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇండియా-డి జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్‌రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్‌దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్‌దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్