అనంతపురం : విజయ్ దేవరకొండ, రష్మిక (విరోష్) జోడీ గురువారం అనంతపురంలో సందడి చేసింది. ఈ దంపతులిద్దరూ కలసి నటిస్తున్న ‘రణబలి’ చిత్రం షూటింగ్ త్వరలో జిల్లాలో జరగనుంది.
ఈ క్రమంలోనే విరోష్ దంపతులు నగరానికి విచ్చేశారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని అభయాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించారు.
నూతన దంపతులకు పురోహితులు ఆత్మీయ స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి శేషవ్రస్తాలతో సత్కరించారు.
రష్మిక , విజయ్‌దేవరకొండను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సెల్ఫీల కోసం పలువురు ఎగబడ్డారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


