గర్భందాల్చిన తొలిరోజుల్లో జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదా? | Early Pregnancy Warning, Prolonged Standing, Walking And Bending May Raise Miscarriage Risk, Check Out More Details | Sakshi
Sakshi News home page

గర్భందాల్చిన తొలిరోజుల్లో జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదా?

Aug 16 2026 11:41 AM | Updated on Aug 16 2026 12:05 PM

Health Tips: The Potential Risks to a Pregnancy during the First Trimester

మహిళలు గర్భందాల్చిన తొలిరోజుల్లో వారు తమ పనితీరులో భాగంగా తరచూ ముందుకు వంగడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి రావడంతోపాటు ఎక్కువసేపు నడక వంటి పనులతో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక డానిష్‌ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ‘ఆక్యుపేషనల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మెడిసిన్‌’అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

ఉద్యోగంలో లేదా తమ విధుల్లో భాగంగా మహిళలు చేసే శారీరక శ్రమ వారి గర్భధారణ/గర్భస్రావాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయాలపై చేసిన అధ్యయనంలో భాగంగా డెన్మార్క్‌కు చెందిన అధ్యయనవేత్తలు సుమారు 4.75 లక్షల మంది ఉద్యోగినుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. 

ఉద్యోగంలో భాగంగా ఎక్కువసేపు నిలబడటం, నడవడం, ముందుకు వంగి పనిచేయడం వంటి అంశాలు గర్భస్రావం ముప్పును పెంచినట్లుగా ఈ విశ్లేషణలో తేలింది. నిలబడి పనిచేయడం వల్ల మాత్రం ఈ ముప్పు చాలా స్వల్పంగా పెరిగినట్లు తేలింది. 

(చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్‌ టాబ్లెట్‌ తీసుకుంటే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement