135 రోజుల్లో 45 కేజీలు: నో స్ట్రిక్ట్‌ డైట్‌, జస్ట్‌ నడకతో.. | Weight Loss: Man Lost 45 Kgs In 135 Days: JustWalking is highly effective | Sakshi
Sakshi News home page

Weight Loss: 135 రోజుల్లో 45 కేజీలు: నో స్ట్రిక్ట్‌ డైట్‌, జస్ట్‌ నడకతో..

Aug 12 2026 5:33 PM | Updated on Aug 12 2026 5:38 PM

Weight Loss: Man Lost 45 Kgs In 135 Days: JustWalking is highly effective

బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక అసాధారణమైన లక్ష్యంగా ఉండిపోతుంటుంది. తీవ్రమైన డైట్‌లు, డిటాక్స్‌ క్లెన్సింగ్‌లు, అధిక తీవ్రత గల వర్కౌట్‌లు వంటి ఎన్నో ట్రెండ్‌లతో చాలామంది బరువు తగ్గొచ్చని నిరూపిస్తుంటారు. కానీ అవి కూడా మళ్లీ యథావిధికి వచ్చేలా అమాంతం బరువుని పెంచేస్తాయి. దాంతో స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్‌ చేయలేక చతికిలపడుతుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ట్రెండ్‌లు ఏం పాటించకుండా కేవలం వాకింగ్‌తోనే ప్రభావవంతంగా బరువు తగ్గొచ్చని నిరూపించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఏకంగా 45 కేజీలు తగ్గాడు. మరి అతడికి ఇదెలా సాధ్యమైందంటే..  

వివేక్‌ సిద్ధా అనే ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కేవలం వాకింగ్‌తో జస్ట్‌ 135 రోజుల్లో 45 కేజీలు తగ్గినట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకమైన డైట్‌లు, ఖరీదైన సప్లిమెంట్లు గానీ, షార్ట్‌కట్‌లు లేవు అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి షేర్‌ చేసుకున్నాడు. గురుగావ్‌లో పనిచేసే సిద్ధా, ప్రతిరోజూ ఢిల్లీలోని తన ఇంటికి నడిచి వెళ్తానని చెబుతున్నాడు. అతడు పదివేల అడుగులతో ప్రారంభించి..క్రమంగా 20 వేల దాక అడుగులు పెంచుకుంటూ వాక్‌ చేశానని తెలిపాడు.

ఆహారం కూడా అంతే ముఖ్యం
ఒకప్పుడు సిద్దా 128 కేజీల బరువుతో ఉండేవాడు. అలాంటి ఆయన నడకతో కిలోల కొద్దీ బరువు తగ్గడం విశేషం. ఆయన వాకింగ్‌ తోపాటు అధిక ప్రోటీన్‌ కలిగిన ఆహారంపై దృష్టి పెట్టానని చెప్పారు. అందుకోసమే రెండుపూటల భోజనంతో ప్రారంభించి..ఓమాడ్‌ శైలి దినచర్యకు మారినట్లు తెలిపారు.

బరువు తగ్గడానికి నడక ఎంత ప్రభావవంతమైనదంటే..

బరువు తగ్గడానికి నడక చాలా ప్రభావవంతమైనది, ఇది అందుబాటులో ఉంటుంది, నిలకడగా చేస్తే..కొవ్వును కరిగించి, లీన్ కండరాలను కాపాడటంలో శక్తిమంతంగా ఉంటుంది. రోజువారీ దినచర్యలో కేవలం 30 నిమిషాల వేగవంతమైన నడకను జోడించడం ద్వారా రోజుకు సుమారుగా 150 అదనపు కేలరీలను కరిగించవచ్చు. అయితే, దీని నిజమైన ప్రభావం వేగం, నిలకడ, మొత్తం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు వివేక్‌.

నడక నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

నడక  కోరికలను విపరీతంగా పెంచకుండా కేలరీలను దహిస్తుంది.

ఇది సురక్షితమేనా?

135 రోజుల్లో 45 కిలోలు తగ్గాలంటే, మీరు ప్రతిరోజూ సుమారు 2,567 కేలరీల శక్తి లోటును కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మందికి, వారి మొత్తం జీవక్రియ ఒక రోజులో అన్ని కేలరీలను దహించదు. దీనిని సాధించడానికి దాదాపు పూర్తి ఉపవాసంతో పాటు గంటల తరబడి తీవ్రమైన రోజువారీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే..

వేగంగా బరువు తగ్గడం వల్ల... పిత్తాశయ రాళ్లు, కండరాల క్షీణత, జీవక్రియ పతనం, జుట్టు రాలడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సురక్షితమైన 45 కిలోల బరువు తగ్గాలంటే,వాస్తవికంగా 11 నుంచి 22 నెలల సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ నెమ్మదైన కాలవ్యవధికి సహనం అవసరమైనప్పటికీ, ఇది కండరాలకు బదులుగా స్వచ్ఛమైన కొవ్వును కోల్పోవడానికి, చర్మం వదులుగా మారడాన్ని నివారించడానికి, అలాగే జీవితాంతం పాటించగలిగే ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్‌ అధికారి అడిగిన ప్రశ్న..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement