135 నుంచి 89కి.. గడ్కరీ వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే! | Union Minister Nitin Gadkari Weight Loss Journey: How He Shed 46 Kg | Sakshi
Sakshi News home page

135 నుంచి 89కి.. గడ్కరీ వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే!

Aug 12 2026 1:12 PM | Updated on Aug 12 2026 1:16 PM

Nitin Gadkaris Weight Loss Secret Revealed How He Shed 46 Kg

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏకంగా 46 కిలోల బరువు తగ్గిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి కఠినమైన డైట్‌లు లేకుండా, కేవలం క్రమశిక్షణతో కూడిన దినచర్య ద్వారానే తాను ఈ ఆరోగ్య మార్పును సాధించినట్లు ఆయన వెల్లడించారు. ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో గడ్కరీ తాను బరువు తగ్గేందుకు అనుసరించిన విధానాన్ని తెలియజేశారు.

ఒక దశలో తన బరువు 135 కిలోలు ఉండేదని, ప్రస్తుతం అది 89 కిలోలకు తగ్గిందని ఆయన తెలిపారు. ‘ఉదయం 7 గంటలకు నిద్రలేచి, ప్రతిరోజూ రెండున్నర గంటల పాటు వ్యాయామం చేయడం నా దినచర్యలో భాగం’ అని ఆయన వివరించారు. కోవిడ్ సమయంలో తనతో పాటు ఉన్న కొందరు మిత్రులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సంఘటనే తనలో ఆరోగ్య స్పృహను మరింతగా పెంచిందని గడ్కరీ పేర్కొన్నారు.

అంతకుముందు ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి తనను ఆరోగ్యంపై  దృష్టి పెట్టేలా చేసిందని చెప్పారు. ఒకప్పుడు తాను ఎటువంటి నియమాలు లేని, క్రమశిక్షణ లేని జీవితాన్ని గడిపానని, కానీ వ్యక్తిగతంగా ఎదరైన విషాదాల తర్వాత ఆరోగ్యాన్నే మహాభాగ్యంగా భావించి జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి  అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని గడ్కరీ తెలిపారు.

ఇది కూడా చదవండి: రాఖీ పండుగంతా ‘ఇండియా పోస్ట్’లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement