జస్ట్‌ మూడేళ్లలో 47 కేజీలు..!ఆ ఐదింటితోనే బరువు మాయం.. | Fitness Influencer Shares 5 Habits Behind Her 47 Kg Weight Loss | Sakshi
Sakshi News home page

Weight Loss: జస్ట్‌ మూడేళ్లలో 47 కేజీలు..!ఆ ఐదింటితోనే బరువు మాయం..

Aug 3 2026 2:50 PM | Updated on Aug 3 2026 3:11 PM

Fitness Influencer Shares 5 Habits Behind Her 47 Kg Weight Loss

బరువు తగ్గడం అనేది కాలంతో చేసే పరుగులాంటిది. కేవలం నిలకడైన మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఓర్పు, సహనం, పట్టుదలతోనే సాధ్యమవుతుంది. అదే నిరూపించింది ఈ మహిళ. ఏకంగా వంద కేజీలపైనే బరువు ఉన్న ఈ మహిళ అద్భుతంగా వెయిట్‌లాస్‌ అయ్యి స్ఫూర్తిగా నిలిచింది. ఏకంగా 47 కేజీలపైనే బరువు తగ్గడం విశేషం.

హేలీ అనే మహిళా ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మూడేళ్లలో ఈ ఫలితాన్ని అందుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. మొదట తాను 116 కేజీలపైనే అధిక బరువుతో ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. మూడేళ్ల పాటు నిలకడగా చక్కటి జీవనశైలి మార్పులను అనుసరించి బరువు తగ్గినట్లు తెలిపారు. అందుకోసం అనుసరించిన ఐదు ముఖ్యమైన ఆహారపు మార్పులు గురించి పంచుకున్నారు. 

బరువు తగ్గడం కోసం..

వాకింగ్‌..
దీన్ని చాలా తేలిగ్గ  చూస్తుంటాం. కానీ తాజా గాలిలో జస్ట్‌ ఓ 30-45 నిమిషాలు నడవడం మన ఆలోచనలను మార్చి అద్భుతమైన మార్పుని తీసుకొస్తుందని అన్నారు.

తగినంత నీరు తాగడం
క్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగడం ఆహార కోరికలను నియంత్రిస్తుందని అన్నారు. అలాగే తన పనులకు అవసరమైన శక్తి అంతా తిరిగి లభిస్తుందని చెప్పుకొచ్చింది. నీటి తోపాటు ప్రతిరోజూ ఒక గ్లాసు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలని కూడా సూచించారామె.

ప్రోటీన్ తీసుకోవడం
ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని అన్నారు. దీనివల్ల కడుపు నిండిన అనుభూతి తోపాటు కండరాలను కోల్పోమని అన్నారు. కొవ్వుని కరిగించడం సులభమవుతుందని అన్నారు.

ఉదయపు అలవాట్లు
ఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం లేదా ధ్యానం చేయాలని, అలాగే కనీసం 30 నిమిషాల పాటు ఫోన్‌లకు దూరంగా ఉండాలని ఆ మహిళ సూచించారు. ఇలా రెండు వారాలు పాటించి చూస్తే ఒత్తిడి మాయం అయ్యి మంచి నిద్ర పడుతుందని అ‍న్నారు. అలాగే మానసిక స్పష్టత, ఏకాగ్రత, ప్రశాంతత తదితరాల్లో మెరుగుదలను చూస్తారని చెబుతోంది.

ఫైబర్ వినియోగం
ఎక్కువ ఫైబర్ ఉన్న మూడు రకాల కూరగాయలను తినమని సూచిస్తోంది. ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేసి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడే కాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందని అంటోంది. చివరగా శరీరం చెప్పే మాట వింటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని సాకులకు తావివ్వకుండా అనుసరిస్తే బరువు తగ్గడం సులభమని చెబుతోందామె.

ఆమె సిఫార్సు చేశారు, ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేయడానికి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి మరియు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: నో రన్నింగ్‌, నో కార్డియో..! జస్ట్‌ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement