ఘనాంకాలు
ఆగస్టు 3 వాటర్‌మెలన్ డే
పుచ్చకాయకు దాదాపు నాలుగువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు ఎడారి దారుల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తప్పనిసరిగా వెంట తీసుకుపోయేవారు.
ఆఫ్రికాలో మొదలైన పుచ్చకాయ ప్రస్థానం దాదాపు ప్రపంచమంతటా పాకింది. పుచ్చకాయ ఏడాది పొడవునా పండుతుంది. వేసవి ప్రారంభం నుంచి వేసవి ముగిసే లోపు అత్యధికంగా పండుతుంది.
పుచ్చకాయలో అత్యధిక శాతం నీరు ఉంటుంది. వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కోసం బాగా పనికొస్తుంది. పుచ్చకాయలో అనేక విలువైన పోషకాలు కూడా ఉంటాయి. రుచులకు మెచ్చుకాయ అయిన పుచ్చకాయ విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...


