న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, నగరంలోని ఉత్తర జిల్లాలో ఉదయం 4:14 గంటలకు ఈ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూ అంతర్భాగంలో 8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.
EQ of M: 2.9, On: 02/08/2026 04:14:01 IST, Lat: 28.721 N, Long: 76.957 E, Depth: 8 Km, Location: North District, Delhi.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/zY2wLZ1Sqi— National Center for Seismology (@NCS_Earthquake) August 1, 2026
అయితే ఈ భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇదే సమయంలో దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భూకంపాలు నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆదివారం ఉదయం ఈ వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


