ఆగస్టు 1 మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పుట్టినరోజు. మహారాష్ట్ర ధూలేలో 1992 న జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ముంబై పరిసర ప్రాంతంలోనే సాగింది.
నాన్న బ్యాంకు ఉద్యోగి కావడంతో తరచూ బదిలీ అవుతుండేది. దాంతో ఇంటర్ పూర్తయ్యేలోపు పదకొండు స్కూళ్లు మారింది.
2013 ప్రాంతంలో ‘ముజ్సే కుచ్ కెహ్తీ..ఖామోషియాన్’లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. మొదట ఆమె సీరియల్స్‌తోనే క్రేజ్ దక్కించుకుంది.
మొదటి సినిమా 2014లో వచ్చింది. ‘విట్టు దండు’ మరాఠీ మూవీతో మృణాల్ సినీ ప్రస్థానం మొదలైంది. ఈ మూవీ తర్వాత 2015 లో ‘లవ్ సోనియా’తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ మూవీలో ఆమె నటనతో మెప్పించినప్పటికీ కమర్షియల్‌గా మూవీ హిట్ అందుకోలేదు.
ఆ సమయంలో మృణాల్ పై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాకు పనికొచ్చే మొఖమేనా తనది అంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు. ఓసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన మృణాల్. ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందట.
ఆడిషన్స్ కోసం దర్శకులను నిర్మాతలను అభ్యర్థించాల్సి వచ్చేదని అయినా ఎవరూ కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంది.
అయితే అవకాశాల కోసం తన పోరాటం మాత్రం ఆపలేదని. పలు చిన్న సినిమాలు చేస్తూ ఉండటం వల్ల తన టాలెంట్‌పై మేకర్స్‌కు నమ్మకం కలగడం. ఆ తర్వాత ఆడిషన్స్ లేకుండానే సినిమాల్లోకి తీసుకున్నారని తెలిపింది.
‘బాడీ షేమింగ్ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం’ అని ఓ ఇంటర్వ్యూలో మృణాల్ చెప్పింది.
కెరీర్ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం అంటోది మృణాల్.
(Images Source : @mrunalthakur/instagram)


