జంక్‌ ఫుడ్‌ మాన్పించేందుకు డాడీ ‘అల్ట్రాసౌండ్‌’ ఐడియా! | Father Uses Fake Ultrasound Image To Stop Daughter From Eating Junk Food, Sparks Debate Online | Sakshi
Sakshi News home page

జంక్‌ ఫుడ్‌ మాన్పించేందుకు డాడీ ‘అల్ట్రాసౌండ్‌’ ఐడియా!

Aug 1 2026 12:02 PM | Updated on Aug 1 2026 12:49 PM

Dad Uses Fake Ultrasound Trick to Stop Daughters Junk Food Habit

పిల్లల చేత జంక్‌ ఫుడ్‌తో పాటు చెడు ఆహారపు అలవాట్లను మాన్నించేందుకు ఓ తండ్రి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కుమార్తె జంక్ ఫుడ్ తినడం మాన్పించడానికి ఆయన ఏకంగా ఒక నకిలీ అల్ట్రాసౌండ్ చిత్రాన్ని ఉపయోగించారు. ఈ విచిత్రమైన ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్ల విషయంలో కుమార్తె చూపుతున్న ఆసక్తిని కట్టడి చేసేందుకు  ఆ తండ్రి ఒక ఉపాయం తట్టింది.

చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కడుపులో ఒక ‘పురుగు’ (బగ్) తయారయ్యిందంటూ కుమార్తెకు  ఒక నకిలీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌ను చూపించాడు. దీన్ని నిజమని నమ్మిన ఆ చిన్నారి భయపడి, భవిష్యత్తులో స్వీట్లు, జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేసింది. ఈ వినూత్న పేరెంటింగ్ టెక్నిక్ సఫలం కావడంతో చిన్నారి అనారోగ్యకరమైన ఆహారాన్ని పూర్తిగా మానేసింది.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో విపరీతమైన చర్చకు దారితీసింది. పిల్లలను ఆరోగ్యకరమైన ఆహార వైపు మళ్లించేందుకు తండ్రి ప్రదర్శించిన సృజనాత్మకతను కొందరు తల్లిదండ్రులు ప్రశంసించగా, పిల్లలపై ఇలాంటి మోసపూరిత పద్ధతులను ప్రయోగించడం సరైనది కాదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఎలా పెంపొందించాలనే దానిపై ఈ ఘటన మరోసారి విస్తృతమైన చర్చకు తెరలేపింది.

ఇది కూడా చదవండి: ఉద్యోగం చివరి రోజున బాస్ షాక్.. శాపనార్థాలు పెడుతున్న నెటిజన్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement