అమెరికా నుంచి 4,800 భారతీయులు వెనక్కి | US Deportations, 4,840 Indians Sent Back From America Since 2025, Says External Affairs Ministry | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి 4,800 భారతీయులు వెనక్కి

Aug 1 2026 8:58 AM | Updated on Aug 1 2026 11:13 AM

US deported over 4800 Indians since 2025

న్యూఢిల్లీ: 2025 నుంచి ఈ ఏడాది జూలై వరకు 4,840 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం తిప్పి పంపించింది. 2025లో 3,567 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1,273 మంది స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ శుక్రవారం వివరించింది. భారతీయులను తిప్పిపంపే అంశమై అనేక దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామంది. ఇటువంటి కేసులు తమ దృష్టికి వచి్చన ప్రతిసారీ సంబంధిత వ్యక్తులు భారతీయులా కాదా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ధ్రువీకరించుకుంటున్నామని వివరించింది. భారతీయ జాతీయులేనని ధ్రువీకరించుకున్న తర్వాతే వారిని భారత్‌కు పంపించేందుకు అనుమతిస్తున్నామని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement