ఓ ప్రాణాన్ని కాపాడాలన్న ఆత్రం.. ఓ పొరపాటు అంచనా.. చివరకు ఊహించని గాయాలకు దారితీసింది. రోడ్డుపై కుప్పకూలిన ఓ టీచర్‌ను గుండెపోటు వచ్చిందని భావించిన ఇద్దరు యువకులు ఆమెకు వెంటనే CPR చేశారు. కానీ, ఆసుపత్రికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదు.. అయితే తప్పుడు విధానంలో చేసిన CPR కారణంగా రెండు పక్కటెముకలు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తీవ్ర ఎండ వేడిమి కారణంగా టీచర్ లలిత స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగింది. దీంతో, వాహనంపై నుంచి అదుపుతప్పి కిందపడిపోయారు. క్షణాల్లోనే ఆమె చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు పరిస్థితిని చూసి ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించారు. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని అనుకుని వెంటనే CPR చేయడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడాలనే ఆందోళనలో పదేపదే ఛాతీపై ఒత్తిడి చేశారు.
Madhya Pradesh: A teacher, Lalita, collapsed from her scooter in Kailaras due to extreme heat. Bystanders mistook it for a heart attack and began CPR without checking her condition. Doctors later confirmed she had not suffered a heart attack, and unnecessary CPR allegedly left… pic.twitter.com/4BP0oGpVU8
— investmoneymag.com (@InvestMoneyMag) July 31, 2026
కానీ, వారికి CPR చేసే సరైన పద్ధతి తెలియకపోవడంతో అదే ఆమెకు మరో సమస్యగా మారింది. కొంత సమయం తర్వాత లలితను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గుండెపోటు ఆనవాళ్లు కనిపించలేదు. ఎండ వేడి, నీరసం కారణంగానే ఆమె స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు. అయితే, వైద్య పరీక్షల్లో మరో విషయం బయటపడింది. CPR సమయంలో అధిక ఒత్తిడి కారణంగా ఆమెకు రెండు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఆమెకు ఇలా ఊహించని గాయాలకు దారితీసింది. అత్యవసర పరిస్థితుల్లో CPR ఎంతో కీలకమైనప్పటికీ, దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతే ముఖ్యం. శిక్షణ లేకుండా చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాలను కాపాడటానికి బదులుగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
#WATCH | Morena School Teacher Suffers Heart Attack On National Highway-552, Two Youth Save Life With CPR #MPnews #MadhyaPradesh pic.twitter.com/nk0y4gLaux
— Free Press Madhya Pradesh (@FreePressMP) June 30, 2026


