breaking news
Indians
-
పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులతో ట్రంప్ పంపేస్తారా?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి ఒక్క ఉద్యోగం అమెరికన్లకే దక్కాలనే దురాశతో దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని, లొసుగును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి గ్రీన్‌కార్డ్, వీసాదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. మద్యం తాగి వాహనం నడపడంతో నమోదైన పాత కేసులను సైతం తిరిగి తోడి ఆయా వ్యక్తులపై మళ్లీ నేరాభియోగాలు మోపి దేశం నుంచి బహిష్కరించాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా ఇప్పటికే ‘ప్రొటెక్షన్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డ్రంక్ అండర్ ఇన్ప్లూయన్స్’చట్టాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధుల(దిగువ)సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు జూలై చివరివారంలో ఆమోద ముద్రపడింది. వెంటనే దీనిని ఎగువ సభ అయిన సెనేట్‌లో ప్రవేశపెట్టారు. జూన్‌లో ఈ బిల్లును సెనేట్ జుడీíÙయరీ, రూల్స్ కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడ బిల్లుకు ఆమోదముద్రపడితే సెనేట్‌లో తర్వాత ఆమోదం పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఈ లెక్కన బిల్లు చివరకు చట్టంగా మారితే ఇప్పటికే పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కేసులున్న గ్రీన్‌కార్డ్ పొందిన భారతీయులకూ కష్టాలు మొదలుకానున్నాయి. ఇక విద్యార్థి, హెచ్–1బీ వంటి వీసాలు పొందిన భారతీయులకూ బహిష్కరణ వేటు పడే అవకాశముంది. ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ హెచ్.ఆర్.875 బిల్లును తీసుకొచ్చారు. అమెరికా పౌరసత్వంలేని విదేశీయులు అమెరికాలో మద్యం తాగి, లేదంటే మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసినా, అమెరికన్ల ప్రాణాలు హరించినా అలాంటి వ్యక్తలను దేశబహిష్కరణ చేయాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై గ్రీన్‌కార్డ్, వీసాదారుల నుంచి సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత నిర్దయగా నిబంధనలు కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధనలు, షరతులు చూస్తుంటే ఎలాగైనా సరే పాత, చిన్నపాటి నేరాలకు పాల్పడిన విదేశీయులను ఖచ్చితంగా దేశబహిష్కరణచేయాలనే ఉద్దేశం్య స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఒక పదేళ్ల క్రితంనాటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినాసరే, అది ఇప్పటికే మూసేసిన కేసు అయినాసరే దానిని మళ్లీ తెరచి నేరం మోపుతారు. ఆ కేసులో నిందితుడు క్షమాపణ చెప్పడం, సంబంధిత ట్రయల్ కోర్టు అందుకు సమ్మతి తెలపడం వంటి సందర్భాల్లోనూ పాత కేసులను తిరగతోడి దేశ బహిష్కరణచేస్తారు’’అని వలసదారుల కేసులను వాదించే లాయర్ జోసెఫ్ ట్సాంగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇది అత్యంత దారుణమైన బిల్లు. ఉదాహరణకు గ్రీన్కార్డ్దారుడు లేదంటే స్టూడెంట్ వీసా, హెచ్–1బీ వంటి అంతర్జాతీయ వీసా పొందిన వ్యక్తి పదేళ్ల క్రితం మద్యం మత్తులో చిన్నపాటి యాక్సిడెంట్ చేసి తర్వాత కేసు నుంచి బయటపడ్డాను అనుకుందాం. ఈరోజు ఆ వ్యక్తి స్వదేశానికి లేదంటే వేరే పని నిమిత్తం న్యూజిలాండ్ వంటి దేశానికి వెళ్లాడనుకుందాం. ఈలోపు హెచ్.ఆర్.875 బిల్లు చట్టంగామారితే ఇకపై ఆ వ్యక్తిని అమెరికాలోకి అనుమతించబోరు. కనీసం ఆ పాత కేసుపై వాదించుకునే అవకాశం అతనికి ఇవ్వబోరు. నిన్ను అమెరికాలోకి అనుమతించబోమనే ముంద్తు హెచ్చరిక కూడా ప్రభుత్వం పంపబోదు. అసలు అమెరికాలోకి వచ్చే అధికారిక మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఇంతటి నిర్దయ నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి’’అని జోసెఫ్ చెప్పారు. ‘‘ఎలాంటి అధికారిక పత్రాలు లేని వలసదారులు, వీసా, శాశ్వత స్థిరనివాస హోదా సవరణ కోసం దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్న వ్యక్తులకు సైతం ఈ బిల్లు వర్తిస్తుంది’’అని వలసదారుల న్యాయసేవల సంస్థ ‘ల్యాండర్హోమ్ ఇమిగ్రేషన్’పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపే పాత కేసులున్న వ్యక్తులు తక్షణం కోర్టులను ఆశ్రయించి తమ వాదనలను వినిపించడం ఉత్తమమని ఈ సంస్థ అభిప్రాయపడింది. -
భారతీయులను రిక్రూట్ చేసుకోవడానికి రష్యా కంపెనీల ఆసక్తి
మాస్కో: రష్యాలోని కంపెనీలు, ముఖ్యంగా యంత్రాలు, ఎల్రక్టానిక్స్ రంగాలకు చెందిన కంపెనీలు భారతీయులను రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ అన్నారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాల్లో పనిచేస్తున్నారని, కానీ యంత్రాలు, ఎల్రక్టానిక్స్ విభాగాల్లో భారతీయులకు డిమాండ్ బాగా ఉందని వెల్లడించారు. ఆ దేశీయ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. రష్యాలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎక్కువ మంది భారతీయులు వస్తుండటంతో కాన్సులర్ సేవల పనిభారం పెరుగుతోందన్నారు. అమెరికా, కెనడా, యూకే సహా పాశ్చాత్య దేశాల్లో వలసలపై పెరుగుతున్న అణిచివేత మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రష్యాలో పెరుగుతున్న భారతీయ కార్మీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కాన్సులర్ సైతం తమ సేవలను విస్తరింపజేస్తోందన్నారు. రష్యాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్యరష్యాలో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, వివిధ రంగాల్లోని నిపుణులు, కార్మీకులు గణనీయమైన కార్మిక లోటును పూడ్చుతున్నారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన డేటా ప్రకారం ప్రస్తుతం రష్యాలోని భారతీయుల సంఖ్య 14,000 గా ఉంది. అదనంగా, భారత సంతతికి చెందిన దాదాపు 1,500 మంది ఆఫ్ఘన్ జాతీయులు ఉన్నారు. ఇక ఇటీవలి కాలంలో రష్యాలోని వైద్య, సాంకేతిక సంస్థల్లో సుమారు 4,500 మంది భారతీయ విద్యార్థులు చేరారని తెలుస్తోంది. వారిలో 90 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 విశ్వవిద్యాలయాలు/సంస్థలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మిగిలిన వారు ఇంజనీరింగ్, ఏరోనాటికల్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్, రవాణా సాంకేతికత, మేనేజ్మెంట్, వ్యవసాయం, బిజినెస్/ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటివి చదువుతున్నారు. -
యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. షెంజెన్ వీసా ధరలు పెరిగాయ్
షెంజెన్ వీసా (schengen visa) దరఖాస్తులు మరింత ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల భారతీయులకు యూరప్ ప్రయాణాల ఖర్చు పెరిగింది. చాలా యూరోపియన్ దేశాలకు వీసా సమర్పణలను నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీ వీఎఫ్ఎస్ గ్లోబల్ తన సర్వీస్ ఛార్జీలను పెంచడంతో ధరలు పెరిగాయి.2023 తర్వాత ధరలు పెరగడం ఇదే మొదటిసారి. పెద్దలకు బేస్ షెంజెన్ వీసా ఫీజు దాదాపు రూ. 8,000 - రూ. 10,000 వరకు ఉన్నప్పటికీ.. VFS అదనపు సర్వీస్ ఫీజును వసూలు చేస్తుంది. దీనివల్ల వల్ల మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఈ కొత్త సర్వీస్ ఫీజు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జర్మనీ ఇప్పుడు రూ.1933, స్విట్జర్లాండ్ రూ.2690, పోర్చుగల్ రూ.3111, ఫ్రాన్స్ రూ.2234, ఆస్ట్రియా రూ.2274 వసూలు చేస్తున్నాయి.కొరియర్ డెలివరీ, ఎస్ఎమ్ఎస్ అప్డేట్లు, ప్రీమియం లాంజ్ యాక్సెస్ వంటి సేవలకు అదనంగా చెల్లించడాన్ని కూడా దరఖాస్తుదారులు ఎంచుకోవచ్చు. దేశాన్ని బట్టి ఈ ఛార్జీలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్ స్విట్జర్లాండ్‌కు ఈ పెరుగుదలను ధృవీకరించింది. కానీ ఇతర దేశాలకు ఫీజులు మారాయా?, లేదా?.. అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.షెంజెన్ వీసా కలిగిన ప్రయాణికులు 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు 29 యూరోపియన్ దేశాలను సందర్శించడానికి అనుమతిస్తుంది. దీనికోసం దరఖాస్తుదారులు ట్రావెల్ ప్లాన్, ఇన్సూరెన్స్ వంటి వాటితోపాటు ఫైనాన్సియల్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా యూరప్ పర్యటనల ఖర్చు పెరగడానికి మరోకారణం అని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంలో రూపాయి బాగా బలహీనపడింది. 2015లో ఒక యూరో ధర రూ.72.12గా ఉంది. 2020లో ఇది రూ.84.64కి పెరిగింది. 2023 నాటికి రూ.89.20కు చేరింది. 2024లో దీని విలువ రూ. 90.55గా ఉంది. కాగా జూన్ 2025లో యూరో విలువ మొదటిదారిగా రూ. 100 దాటిపోయింది. ఇది భారతీయ సందర్శకులకు యూరోపియన్ ప్రయాణ ఖర్చును మరింత పెంచింది. -
భారతీయ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు స్వల్ప ఊరట
వాషింగ్టన్: ఉపాది ఆధారిత(ఈబీ) కేటగిరీలో తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ గ్రీన్కార్డ్దారులకు అమెరికా ప్రభుత్వం స్వల్ప ఊరట అందించింది. తమ జీవితభాగస్వామి, 21 ఏళ్ల వయసులోపు సంతానానికి సైతం గ్రీన్‌కార్డ్ రావాలని ఆశించే భారతీయ గ్రీన్‌కార్డుదారులు సమరి్పంచే దరఖాస్తులకు పరిశీలన గడువును పొడిగించారు. సాధారణంగా ఏప్రిల్ ఒకటో తేదీలోపు తేదీని కటాఫ్ తేదీగా పరిగణిస్తారు. కానీ ఈసారి జూన్ ఒకటోతేదీని కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. గడువు పొడిగించిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైనాసరే అర్హత గల భారతీయ గ్రీన్కార్డ్దారులు తమ కుటుంబసభ్యుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. ఉపాధి ఆధారిత(ఈబీ) కేటగిరీ కింద వచ్చే భారతీయ దరఖాస్తులను ఈబీ–2, ఈబీ–3 దరఖాస్తులుగా వ్యవహరిస్తారు. జీవితభాగస్వామి, 21ఏళ్లలోపు పెళ్లికాని తమ సంతానం కోసం ఎఫ్2ఏ కేటగిరీ కింద భారతీయులు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు గడువు తేదీ ఏప్రిల్ ఒకటో తేదీనే ముగుస్తున్నప్పటికీ భారతీయ గ్రీన్కార్డ్దారులకు మాత్రం జూన్ ఒకటో తేదీదాకా అనుమతిస్తున్నట్లు ‘యూఎస్ వీసా బులెటిన్, సెప్టెంబర్–2025’పేర్కొంది. 2025 ఏడాదికిగాను కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డ్‌లను 2,26,000కు పరిమితం చేశారు. ఉపాధి ఆధారిత(ఈబీ) కేటగిరీలో గ్రీన్కార్డ్లకు సైతం 1,50,037గా పరిమితి విధించారు. ఇక వీసాల విషయానికొస్తే మొత్తం వీసాల్లో ప్రతిదేశం తమ కోటా కింద 7 శాతం వరకు అంటే దాదాపు 26,323 వరకు వీసాలు పొందొచ్చు. డిపెండెంట్ వీసా అనేది ప్రతీదేశానికి గరిష్టంగా 2 శాతమే ఇస్తారు. చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ తరహాలో భారత్‌కు సైతం దేశాలవారీ కోటా కిందే వీసాలు దక్కుతున్నాయి. మరోవైపు సెపె్టంబర్ 30వ తేదీలోపు డైవర్సిటీ ఇమిగ్రేషన్ వీసా కోసం దరఖాస్తుచేసుకోవాలని వీసా బులెటిన్‌లో అమెరికా ప్రభుత్వం పేర్కొంది. లాటరీ విధానంలో ప్రతిఏటా 55,000 మందికి ఈ వీసాలను అందజేస్తారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్, నైజీరియాసహా 20 దేశాలకు చెందిన వారికి మాత్రమే ఈ వీసా ఇస్తారు. -
పాలిటిక్స్ మనకెందుకు భయ్యా.. ఏం తిందాం.. ఏం ఆర్డర్ పెడదాం!
దేశ రాజకీయాలు.. ఎన్నికలు వంటి ముఖ్యమైన అంశాల కంటే కూడా ప్రతీరోజు ఆన్లైన్లో చేసే ఫుడ్ ఆర్డర్లపైనే ఆలోచనలతో మెజారిటీ ఇండియన్లు తలమునకలు అవుతున్నారట. అంతే కాకుండా 81% మంది భారతీయులు ప్రతిరోజూ కనీసం మూడు గంటలపాటు ఏదో ఒక విషయమై తీవ్రమైన దీర్ఘాలోచనలు చేస్తున్నారట. ఎన్నికల కంటే కూడా 61% మంది ఫుడ్ డెలివరీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు.దాదాపు 74% మందికి ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలి..ఏం తినాలో అన్న నిర్ణయంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయం కంటే కూడా ఆన్లైన్లో ఫుడ్‌కు సంబంధించి అనేక ఎంపికలు, డీల్స్ పట్ల ఆసక్తి, వాటిలో ‘సరైన’ఎంపికకు తమ మొబైల్ స్క్రీన్లను ఎక్కువ సేపు పరిశీలిస్తున్నారు. దీంతో అతిగా ఆలోచించడం అనేది భారతీయులకు ఓ కొత్త అలవాటుగా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి, హైదరాబాద్ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు వస్తాయి.. కానీ లంచ్, డిన్నర్ ప్రతిరోజూ తప్పదు కాబట్టి సాపాటు సంతృప్తి ఇవ్వకపోతే కష్టమేనని ‘ఆన్లైన్ ఫుడ్ డెలివరీ’పైనే సిటిజన్లు అతిగా వర్రీ అవుతున్నట్టుగా తాజాగా సెంటర్ ఫ్రెష్–యు గావ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండియా ఓవర్‌థింకింగ్ రిపోర్ట్–2025’అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అతిగా ఆలోచించడం..ఏదైనా విషయంపై దీర్ఘాలోచనలు చేయడమనేది ఇండియన్ల ‘న్యూ నార్మల్’గా మారిపోయిందా అన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.దేశంలో అతిగా ఆలోచించడం ఒక విస్తృతమైన సమస్య అని తేలింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని విద్యార్థులు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇతర వర్గాల వారి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో అతి ఆలోచనల వల్ల ఆహారం, జీవనశైలి అలవాట్లు, మానవ సంబంధాలు, కెరీర్, వృత్తిగత జీవితం తదితరాలు ఎలా ప్రభావితం అవుతున్నాయనే అంశాలను పరిశీలించారు. ముఖ్యాంశాలు⇒ ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అతిగా ఆలోచించడం ఒక స్థిరమైన అలవాటు అనే భావిస్తున్నారు ⇒ ఆహారం, జీవనశైలి, డిజిటల్, సామాజిక జీవితం, డేటింగ్, సంబంధాలు, కెరీర్ ఎంపికలతో సహా వివిధ రంగాల్లో నిర్ణయాలను అతిగా ఆలోచించడం ప్రభావితం చేస్తున్నాయి ⇒ 81% మంది భారతీయులు రోజుకు కనీసం మూడు గంటలు ఎక్కువగా ఆలోచిస్తారు. ⇒ ఈ విధంగా అధిక ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి గణనీయమైన సంఖ్యలో ఇండియన్లు గూగుల్, చాట్ జీపీటీ వంటి సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నారు ⇒ అతిగా ఆలోచించడం, అనిశి్చతిని అధిగమించడానికి, మరింత స్పష్టతకు డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు ⇒ ఎన్నికల్లో రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కంటే ఏం తినాలో ఎంచుకోవడం ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నదని 63% మంది భావన ⇒ ఓ సాధారణ బిర్యానీ ఆర్డర్ చేయడానికి ఫుడ్ యాప్ ద్వారా 30 నిమిషాలు స్క్రోలింగ్ చేస్తున్న ఉదంతాలున్నాయి ⇒ ఆర్డర్ చేసే ఆహార ఎంపికలో అస్పష్టతకు గురికావడం లేదా డబ్బుకు తగిన విలువ లభించకపోవడం గురించి ఆందోళన చెందుతున్నారు ⇒ డిస్కౌంట్లు, డెలివరీ సమయ అంచనాలు తదితరాలపై అధిక దృష్టి ⇒ డిజిటల్ ఒత్తిళ్లు, సోషల్ మీడియా ఆందోళన, పని ప్రదేశంలోని సందేహాలు, ప్రాంతాలు, వృత్తుల్లో రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి ⇒ మెనూ మెల్ట్‌డౌన్‌ల మొదలు ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సాప్‌లో తమ స్టోరీల పోస్టింగ్ చేయాలా వద్దా అనే వరకు..అతిగా ఆలోచించడం ఇప్పుడు భారతదేశానికి ఇష్టమైన కాలక్షేపంగా మారింది ⇒ అతిగా ఆలోచించడం అనేది మెజారిటీ ప్రజల అలవాటుగా మారిందని, మన డిజిటల్ జీవితాల్లో, రోజువారీ ఎంపికల్లో, సామాజిక డైనమిక్స్‌లో లోతుగా పాతుకుపోయింది ⇒ పని ప్రదేశాల్లో బాస్ ఏదైనా అంశంపై ఎస్ అని స్పందిస్తే దాని పట్ల 42% మంది ఆందోళన చెందుతున్నారు ⇒ 63% మంది రెస్టారెంట్లో వంటకం ఎంచుకోవడం రాజకీయ నాయకుడి ఎంపిక కంటే ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నదని చెబుతున్నారు. ఈ సంఖ్య దక్షిణాదిలో 69%గా ఉందిఅతి ఆలోచనను డీకోడ్ చేయడమే..‘సెంటర్ ఫ్రెష్ ఇండియా ఓవర్‌థింకింగ్ రిపోర్ట్ ద్వారా..నేటి హైపర్–కనెక్టెడ్ ప్రపంచంలో అతిగా ఆలోచించడం ఎలా వ్యక్తమవుతుందో డీకోడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది ఒక సందేశాన్ని రెండవసారి ఊహించడం అయినా లేదా విందు ఎంపికను అతిగా విశ్లేషించడం అయినా, అతిగా ఆలోచించడమనేది రోజువారీ అలవాటుగా మారింది. ఈ మానసిక గందరగోళాన్ని హైలైట్ చేయడం ద్వారా, ఈ నివేదిక రోజువారీ మానసిక స్పష్టత యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించేలా ఆలోచనను రేకెత్తిస్తుంది’అని పర్ఫెట్టి వాన్ మెల్లె ఇండియా డైరెక్టర్ మార్కెటింగ్ గుంజన్ ఖేతాన్ పేర్కొన్నారు. -
ఇది మీ దేశం కూడా..: భారతీయులకు ఐరిష్ దిగ్గజ క్రికెటర్ సందేశం
ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను ఐరిష్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ ఒ'బ్రెయిన్ ఖండించాడు. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే తన మనసు తల్లడిల్లుతోందని.. తన హృదయంలో భారతీయులకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు పెరిగిపోయాయి. రాజధాని డబ్లిన్‌లో ఓ భారత వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి మరీ చిత్ర హింసలకు గురిచేశారు. మరో ఘటనలో ఆరేళ్ల చిన్నారిపై.. తోటి పిల్లలే దాడికి తెగబడటం సంచలనం రేపింది.తన ఇంటి బయట ఆడుకుంటున్న నియా నవీన్ అనే ఆరేళ్ల బాలిక ముఖంపై.. 12- 14 ఏళ్ల వయస్సున్న పిల్లలు పిడిగుద్దులు కురిపించారు. ఈ దుర్ఘటనలను ఐర్లాండ్‌లోని భారత రాయబారి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.నా మనసులో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానంఈ పరిణామాల నేపథ్యంలో కెవిన్ ఒ బ్రెయిన్ ఐర్లాండ్‌లోని భారతీయులను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ‘‘ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, హేయమైన చర్యలు నా మనసుకు బాధ కలిగించాయి.ఇక్కడి ప్రజలుగా మేమేంటో ఇలాంటి దాడులు ఏ రకంగానూ నిర్వచించలేవు. ఇండియా, ఇండియన్స్‌కు నా మనసులో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐర్లాండ్ మాలాగే మీ ఇల్లు కూడా అని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.ఐరిష్ సమాజ అభివృద్ధిలో మీ వంతు సాయం కూడా ఉంది. మీరు కూడా ఈ దేశంలో భాగమయ్యారు. మీరు చేసే ప్రతి పనిని మేమెంతగానో గౌరవిస్తాం’’ అని కెవిన్ ఒ బ్రెయిన్ ప్రేమపూర్వక నోట్‌తో బాధితులకు సంఘీభావం తెలిపాడు.ఐర్లాండ్ తరఫున సత్తా చాటికాగా 2008 నుంచి 2021 వరకు ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన కెవిన్.. మూడు టెస్టులు, 152 వన్డేలు, 109 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 258 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 3619 రన్స్‌తో పాటు 114 వికెట్లు తీశాడు. అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో 1973 పరుగులు సాధించడంతో పాటు 58 వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.ఇక తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను కెవిన్ భారత్‌లోనే ఆడటం విశేషం. 2011 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌పై 50 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంటే, 2023 వరల్డ్‌కప్ సందర్భంగా ఫాస్టెస్ట్ సెంచరీ విషయంలో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ (40 బంతుల్లోనే శతకం) కెవిన్‌ను అధిగమించాడు.చదవండి: ఒక్క బిస్కట్ కోసం పడిగాపులు.. తోకలు ఊపుతూ..: రితికా సజ్దే భావోద్వేగం -
వామ్మో.. మామూలు ఖర్చు కాదు!
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండవని సామెత. కొంతమంది తెగ తిరుగుతుంటారు. నిరంతరం ప్రయాణిస్తుంటారు. కొత్త ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.15 లక్షల కోట్లు!ప్రపంచ యాత్రలు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్దలు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మనవాళ్లు. విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.జర్నీలకే ఎక్కువ!గతంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రయాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్రయాణాలకు కూడా ఎక్కువ మొత్తంలో వ్యయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశాల్లో చదువు కంటే కూడా జర్నీలు చేయడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయం గత 15 ఏళ్లలో 1000 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.ఎక్కడికి వెళ్తున్నారు?తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వస్తున్నారు. 2009 సంవత్సరంలో 1.1 కోట్ల మంది ఇండియన్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్రయాణించిన (travel abroad) భారతీయుల సంఖ్య మళ్లీ 2 కోట్లు దాటింది.చదువుకెంత ఖర్చు?భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భరోసాయిచ్చే నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మనవాళ్లు చేసిన వ్యయం 9.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాలర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుదల నమోదయింది. చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా? -
పాలిటిక్స్ కన్నా.. పిజ్జాయే మిన్న
పాలిటిక్స్ కంటే పిజ్జా గురించే మన వాళ్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారని ‘ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్’ పేరిట సెంటర్ ఫ్రెష్ యూ గోవ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా జాతీయ స్థాయిఅధ్యయనం వెల్లడైంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఓవర్ థింకింగ్‌లో ముందున్న మన దేశవాసులు రాజకీయాల కంటే పిజ్జా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు తేలింది. దేశవాసుల ఆలోచనల్లోనూ, రోజువారీ జీవనశైలిలోనూ అతి ప్రభావితం చేస్తోందని, సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అత్యంత సాధారణమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాల్లోనూ, ఆలోచనల్లోనూ అతి కనిపిస్తోందని ఈ నివేదిక చెబుతోంది. 81 శాతం మందిలో.. దేశంలో 81 శాతం మందికి రోజుకి మూడు గంటలకు పైగా ఓవర్‌థింకింగ్ అలవాటైంది. వాట్సాప్ మెసేజ్‌కి ఎలా స్పందించాలో, భోజనానికి ఏం తినాలో, లేదా ఇన్‌స్ట్రాగామ్‌లో ఏ ఫొటో పోస్ట్ చేయాలో అనేటటువంటి ప్రతి చిన్న విషయంలోనూ ప్రజలు ఆలోచనల ఊబిలో మునిగిపోతున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. రెస్టారెంట్లో డిష్ ఎంపిక చేయడం అనేది రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంకన్నా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తోందని 63% మంది చెప్పడం విశేషం. (చదవండి: అరచేతిలో అనర్థం..! మొబైల్ ఫోబియాపై నిపుణులు ఆందోళన..) -
చలో అమెరికా అంటున్న భారతీయులు.. పరుగులు తీస్తున్న ఈబీ–5
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇప్పుడున్న ఈబీ–5 వీసా స్థానంలో ట్రంప్ తెస్తానన్న ‘గోల్డ్ కార్డ్’ నేటికీ పట్టాలెక్కలేదు. కానీ, అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం చేసే ఈబీ–5 దరఖాస్తులు రయ్యిన దూసుకుపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో ఎన్నడూ లేనంతగా మనదేశం నుంచి ఎక్కువ సంఖ్యలో ఈబీ–5 వీసాకు దరఖాస్తులు వెళ్లాయి.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక విద్యార్థి, తాత్కాలిక వర్క్ వీసాలపై నియంత్రణలు కఠినతరం కావటానికి ముందు.. 2024 ఏప్రిల్ నుండే ఈబీ–5 వీసాలకు డిమాండ్ పెరిగినట్లు వాషింగ్టన్‌లోని అమెరికన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ అలయెన్స్ (ఎ.ఐ.ఐ.ఎ.) డేటా చెబుతోంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే (2024 అక్టోబర్–2025 జనవరి. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30తో ముగుస్తుంది) 1,200 మందికి పైగా భారతీయులు ఈబీ–5 వీసా కోసం ఫామ్ ఐ–526ఈ దరఖాస్తు చేశారు. ఈ సంఖ్య 2023 మొత్తం ఏడాది సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.శాశ్వత నివాసానికి హామీఈబీ–5 వీసాకు డిమాండు పెరగటానికి హెచ్1–బి, గ్రీన్ కార్డ్ సహా ఇతర ఇమిగ్రేషన్ కేటగిరీల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటమూ ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పలు అంచనాల ప్రకారం, ప్రస్తుతం యూఎస్‌లో కోటీ 10 లక్షలకు పైగా ఇమిగ్రేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాశ్వత నివాసానికి ఈబీ–5 వీసా ఒక వేగవంతమైన, నమ్మకమైన హామీగా మారిందని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ఇన్వెస్ట్ ఇన్ ది యూఎస్ఏ (ఐ.ఐ.యూఎస్ఏ) ఆధ్వర్యంలోని వాషింగ్టన్ ప్రాంతీయ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం సమాచారం ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో (2023 అక్టోబర్ –2024 సెప్టెంబర్) భారతీయులకు 1,428 ఈబీ–5 వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 815 మాత్రమే.ప్రాంతాన్ని బట్టి పైకం..1992 నుంచి అమెరికా ఈబీ–5 వీసాలను ఇవ్వటం ప్రారంభించింది. అమెరికన్లకు ఉద్యోగాల సృష్టి కోసం వీటిని సృష్టించారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతం లేదా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో (టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా – టి.ఇ.ఎ.) 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.88 కోట్లు), తక్కిన ప్రాంతాల్లో కనీసం 10.50 లక్షల డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) పెట్టుబడి పెట్టే వలసదారులకు ఈబీ–5 వీసా (గ్రీన్ కార్డులు) ఇస్తారు. ఈ వీసా ఉంటే.. పెట్టుబడి పెట్టేవాళ్లు, వారి జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు ఉండే వారి పెళ్లికాని పిల్లలకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. త్వరలో వీటిని.. ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తారు.అమెరికాలో నుంచే దరఖాస్తుహెచ్–1బీ వీసాలపై ఉన్న విద్యార్థులు, పని చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తులు తమ దేశానికి వెళ్లకుండానే ఈబీ–5ను అమెరికాలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం యూఎస్‌లో హెచ్–1బీ లేదా విద్యార్థి వీసా వంటి వలసేతర హోదాలపై ఉన్న భారతీయ పౌరులు, కొత్త నిబంధనల ప్రకారం ఐ–526ఈ ఫారం దాఖలు చేసిన సమయం నుండి 3–6 నెలల్లోపు వర్క్, ట్రావెల్ పర్మిట్లను పొందటం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ పర్మిట్ సాధారణంగా వారి ఈబీ–5 గ్రీన్ కార్డ్ ఆమోదం పొందేవరకు చెల్లుబాటులో ఉంటుంది.ఈబీ-5 వీసా..కనీస పెట్టుబడి టి.ఇ.ఎ.లకు రూ. 6.88 కోట్లు, నాన్–టి.ఇ.ఎ.లకు రూ.9 కోట్లు. కనీసం 10 ఫుల్ టైమ్ ఉద్యోగాల కల్పన జరగాలి. 2027 వరకు చట్టబద్ధమైన భరోసా. యూఎస్‌లో ఉన్న భారతీయులు అక్కడి నుండే దరఖాస్తు చేసుకోవచ్చుట్రంప్ గోల్డ్ కార్డు.. రూ. 43.5 కోట్లు నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి.విధి విధానాలు ఖరారు కాలేదు.చట్టం రూపొందలేదు. -
ట్రంప్ రూల్.. ఇండియన్స్ కు షాక్
-
భారతీయులకు ఉద్యోగాలు ఆపండి
న్యూయార్క్/వాషింగ్టన్: విపరీతమైన వీసా ఆంక్షలు అమలుచేస్తూ, సోషల్‌మీడియా ఖాతాలను జల్లెడపడుతూ వీలైనంతవరకు భారతీయులను అమెరికా గడ్డపై కాలుమోపకుండా అడ్డు తగులుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి కంపెనీలకే ఆదేశాలు ఇచ్చేందుకు తెగించారు. చట్టబద్ధంగా, అత్యంత నైపుణ్యముండి వీసాలతో అమెరికాకొస్తున్న భారతీయులను కాదని, అమెరికన్లకే కొలువుల్లో పట్టంకట్టాలని ట్రంప్ అక్కడి టెక్ దిగ్గజ సంస్థలకు హితవు పలికారు. బుధవారం వాషింగ్టన్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలనుద్దేశిస్తూ సూటిగా సూచనలు ఇచ్చారు. ‘‘ వేర్పాటు వాదంలాంటి ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) భావాజలంలో మన అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కొట్టుకుపోతున్నాయి. గ్లోబలైజేషన్ కోసం పరితపిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలన్నీ కోట్లాది మంది అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయి కృతçఘ్నులుగా తయారవుతున్నాయి. మీరు తోటి అమెరికన్ల పట్ల తీవ్ర నిర్లక్ష ధోరణిని కనబరుస్తున్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇక్కడి కంపెనీలు చైనాలో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయి. భారత్ నుంచి తక్కువ జీతభత్యాలకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్‌లో నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఇక్కడ లాభాలను తక్కువచేసి చూపిస్తూ పన్నుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇవన్నీ చేస్తూ మీ తోటి అమెరికన్పౌరుల ఉద్యోగ హక్కులను కాలరాస్తున్నారు. ఇక నా హయాంలో మీ ఆటలు సాగవు. అమెరికా టెక్నాలజీ సంస్థలన్నీ మన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. ఫ్యాక్టరీల కల్ప నలో, ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం దక్కాలి. ఇకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి. అమెరికన్లకు ఉపాధి కల్పించండి. మిమ్మల్ని నేను అడిగేది ఇదొక్కటే. ఈ పని మీరు ఖచ్చితంగా చేస్తారనే భావిస్తున్నా’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.#WATCH | Trump promises to bring tech jobs back home, slamming US firms for outsourcing to China and hiring Indian workers abroad.#DonaldTrump #UnitedStates #China #India pic.twitter.com/p2KLKkDqj9— News18 (@CNNnews18) July 24, 2025 ట్రంప్ వ్యాఖ్యలు.. భారతదేశంపై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-భారత టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇండియన్ IT ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ రంగం పై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.“No more Indian workers” అని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు.Apple, Google, Tesla వంటి కంపెనీలు భారతదేశం లో ఉద్యోగాలు ఇవ్వడం పై 25% టారిఫ్ విధించవచ్చని హెచ్చరిక జారీ చేశారు. -
8 వేల మంది ప్రొఫెషనల్స్‌కి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 8,000 మంది ప్రొఫెషనల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది. కాంటాక్ట్ సెంటర్ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్ టూల్‌తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్ ప్రెసిడెంట్ గగన్ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
విదేశీ విద్య @ రూ. 3,78,400 కోట్లు
భారతీయ కుటుంబాలు తమ పిల్లల విదేశీ విద్య కోసం 2024లో రూ.3,78,400 కోట్లు ఖర్చు చేశాయి. 2030 నాటికి ఇది రెండింతలు దాటి రూ.7,82,600 కోట్లకు చేరుతుందని లండన్ కు చెందిన పేమెంట్స్ కంపెనీ వైజ్, కన్సల్టింగ్ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ నివేదిక వెల్లడించింది. భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లుగా నమోద య్యాయి. ఏటా రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది.రూ.75 వేల వరకు...భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లు నమోదయ్యాయి. ఆరేళ్లలో ఇది రూ.4,300 కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ చెల్లింపులలో 95% పైగా సంప్రదాయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా విదేశాలకు చేరుతున్నాయి. విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినందుకుగాను బ్యాంకింగ్ సంస్థలు విదేశీ మారకపు రేటుపై 3–3.5% చార్జీ వసూలు చేస్తున్నాయి. లావాదేవీ పూర్తి కావడానికి 2–5 రోజుల సమయం పడుతోంది. ఏటా తమ పిల్లల చదువుల కోసం రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది. ఈ మొత్తంతో కొన్ని రోజులపాటు విద్యార్థులు రోజువారీ ఖర్చులు వెళ్లదీయవచ్చు. లేదా అదనపు కోర్సులు చేసేందుకు వెచ్చించవచ్చు.యూఎస్‌లో అనిశ్చితితో..రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్ ్స స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ విద్య కోసం భారతీయులు విదేశాలకు పంపిన డబ్బు ఈ ఏప్రిల్‌లో రూ.1,410 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21% తక్కువ. 2025 మొదటి నాలుగు నెలల్లో విదేశీ విద్యకు ఎల్ఆర్ఎస్ కింద చేసిన ఖర్చు మొత్తంగా 21% తగ్గి రూ.7,516 కోట్లకు చేరుకుంది. గత ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు.. తొమ్మిది నెలలుగా ఈ పథకం కింద విదేశాలకు పంపిన డబ్బు తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో అనిశ్చితి. ఎల్ఆర్ఎస్ కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రయాణం, విద్య, వైద్య చికిత్స, విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు వంటి లావాదేవీల కోసం రూ.2.15 కోట్ల వరకు విదేశాలకు పంపడానికి ఆర్బీఐ అనుమతి ఇస్తోంది.ప్రపంచ సగటు 6.62%ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2024 జూలై–సెప్టెంబర్‌లో విదేశాలకు పంపే మొత్తంపై ఈ చార్జీల ప్రపంచ సగటు 6.62% ఉంది. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి అయ్యే ఖర్చు మధ్యవర్తులు లేదా కరస్పాండెంట్ బ్యాంకుల సంఖ్యను బట్టి పెరుగుతుంది. రుసుములు, కార్యాచరణ జాప్యాలు ప్రతి దశలోనూ ఉంటాయి. ఈ ఖర్చులు, జాప్యాల వల్లే కేంద్ర బ్యాంకులు విదేశాలకు నగదు బదిలీ చేయడానికి డిజిటల్ కరెన్సీలకు శ్రీకారం చుట్టాయి.⇒ విదేశాల్లో ఉన్న పిల్లలకు గత ఏడాది విదేశీ విద్యకు అయిన వ్యయంలో నాలుగింట ఒక వంతు.. అంటే రూ.94,600 కోట్లను భారత్‌లోని కుటుంబ సభ్యులు బదిలీ చేశారు. మిగిలిన మొత్తాన్ని పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా సంపాదించిన మొత్తం, అలాగే ఉపకార వేతనాల ద్వారా విద్యార్థులు సమకూర్చుకున్నారు.⇒ ప్రస్తుతం 18 లక్షల పైచిలుకు భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యనభ్యనిస్తున్నారు. ఏడాది క్రితం ఈ సంఖ్య 13 లక్షలు మాత్రమే.⇒ విద్యార్థుల ప్రాధాన్యతలో యూఎస్, కెనడా, యూకే టాప్–3లో నిలిచాయి.⇒ వివిధ దేశాల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయుల వాటా 30–35% ఉంది. దశాబ్దం క్రితం ఈ సంఖ్య 11% మాత్రమే.⇒ విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆరేళ్లలో 25 లక్షలు దాటొచ్చు. -
వలసదారులకు గుడ్ న్యూస్.. ఇక ఊపిరి పీల్చుకోండి..!
-
ఆఫ్రికాలో మరో ఇద్దరు భారతీయులు మృతి
-
మనకు బ్యూటిఫుల్ కాదు!
అమెరికాను మరింత గొప్ప (బిగ్)గా, మరింత చూడచక్కగా (బ్యూటిఫుల్)గా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ తెచ్చిన ‘ది వన్ బిగ్, బ్యూటిఫుల్’చట్టం అక్కడి భారతీయులకు పెను సమస్యగా మారేలా ఉంది. వలస, వలసేతర వీసాల ద్వారా అమెరికాలో కాలుపెట్టిన మనవాళ్లకు ఈ చట్టం సమస్యల స్వాగతం పలకడం ఖాయంగా కన్పిస్తోంది. ముఖ్యంగా వేలాది భారతీయ అమెరికన్లకు వైద్య బీమా రక్షణ ఛత్రాన్ని ఈ చట్టం దూరం చేస్తోంది. శాశ్వత స్థిరనివాస హోదా అయిన గ్రీన్కార్డ్దారులకు కూడా ‘బ్యూటిఫుల్’కష్టాల నుంచి ఊరట దక్కడం లేదు. హెచ్–1బీ వీసాదారుతో పాటు విద్యార్థి వీసాలపై అమెరికాకు వచ్చిన భారతీయులకు కూడా కొత్త చట్టం సమస్యాత్మకంగా మారుతోంది. ఏకంగా 20 లక్షల మంది భారత అమెరికన్లు దీని దెబ్బకు ఆరోగ్య బీమా సౌకర్యం కోల్పోయారు. ఖజానాపై ఏకంగా 1.7 లక్షల కోట్ల డాలర్ల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కొత్త చట్టం తేవడం తెలిసిందే. ఉచితంగా, అన్యాయంగా వైద్య సేవలు, సాయం వాళ్లకు మాత్రమే కోతలు పెడతానని అమెరికా పౌరులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థి వీసాపై అమెరికా వర్సిటీల్లో చదివే మనవాళ్లకు ఇన్నాళ్లూ కొనసాగిన వైద్య బీమా సదుపాయం ఎత్తేశారు. అది లేకపోతే అమెరికాలో వైద్య ఖర్చులకు చుక్కలు కనిపిస్తాయి. తమకిది పెను ఆర్థిక భారమేనని న్యూజెర్సీలోని రూత్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కాలేజీలో ఎలాగోలా నెట్టుకొస్తాం. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుంది. ఆ వెంటనే ఉద్యోగం రాకుండా మరిన్ని ఇక్కట్లు తప్పవు’’అంటూ వాపోయారు. శరణార్థులకు అరిగోస! శరణార్థులుగా అమెరికాకు వచ్చిన వారిలో అత్యధికులు మెడిక్ఎయిడ్, ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ ప్రోగ్రాంతోనే లబ్ధి పొందుతున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం 2020లో 6,000 మంది భారతీయులు శరణార్థి హోదా పొందారు. 2023లో ఆ సంఖ్య 8 రెట్లు పెరిగి 51,000కు చేరింది. దాంతో శరణార్థుల్లో కొందరికే మెడిక్ఎయిడ్ను పరిమితం చేయాలని ‘బ్యూటిఫుల్’చట్టంలో పేర్కొన్నారు. మిగతా వారంతా వైద్య బీమాకు దూరం కానున్నారు. కనీసం 80,000 మంది భారత శరణార్థులకు బీమా సౌకర్యం దూరమవుతుందని చెబుతున్నారు. విద్యార్థులనూ కలుపుకుంటే కనీసం లక్ష మందికి పైగా భారతీయులు బీమాకు దూరమవుతున్నారు. బరాక్ ఒబామా హయాంలో గ్రీన్కార్డ్దారులు, శరణార్థులు, గృహహింస బాధితులు, హెచ్–1బీ వీసాదారులు, ఎఫ్–1 వీసా ఉన్న విద్యార్థులు ‘ఒబామాకేర్’పథకంలో భాగంగా వైద్య బీమా పొందేవాళ్లు. దీనికింద కుటుంబాలు, చిన్న వ్యాపారులకూ బీమా అందేది. వారికీ రెడ్ అలర్టే! గ్రీన్ కార్డు కేవలం శాశ్వతస్థిర నివాస హామీ మాత్రమే. అది లభించినంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఇవ్వరు. ట్రంప్ సర్కారు సరిగ్గా ఇదే పాయింటు పట్టుకుంది. పౌరసత్వంలేని వాళ్లకు మెడిక్ఎయిడ్ తెగ్గోయాలని చట్టంలో పేర్కొంది. తద్వారా గ్రీన్కార్డ్దారుల్లో అత్యధికులకు వైద్య బీమా ఎత్తేస్తోంది. మిగతా వారి అర్హతను కూడా ప్రతి ఆర్నెల్లకోసారి సమీక్షిస్తారు. ఆ లెక్కన త్వరలో వారికీ బీమా ఎత్తేయడం ఖాయమంటున్నారు. ‘నేను న్యూజెర్సీలో ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను, నా భార్య కలిసి ఏటా 27,000 డాలర్లు పన్నుగా కడుతున్నాం. అయినా ట్రంప్ ప్రభుత్వం దృష్టిలో మేం తక్కువ పన్ను కడుతున్నట్టే లెక్క. నెలకు 450 డాలర్లున్న నా ఒక్కని నెలవారీ వైద్య బీమా ప్రీమియమే కొత్త చట్టంతో 1,200 డాలర్లకు పెరగనుంది’’అని సుహాస్ ప్రతాప్ అనే తెలుగు ఎన్నారై వాపోయారు. ఆయన హెచ్–1బీ వీసా మీద అమెరికాకు వచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా నుంచి 1,563 మంది భారతీయుల బహిష్కరణ
వాషింగ్టన్: ఈ ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికా 1,563 మంది భారతీయులను బహిష్కరించి స్వదేశానికి సాగనంపిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బహిష్కరించిన వారిలో ఎక్కువ మందిని వాణిజ్య విమానాల్లో తిప్పి పంపించిందని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా సేవలందించిన కాలంలో మొదటి నెలలోనే 37,660 మంది వివిధ దేశాలకు చెందిన వలసదారులను బహిష్కరించడం గమనార్హం. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేవలం 3,000 మందిని మాత్రమే బహిష్కరించడం గమనార్హం. ప్రస్తుతం 18,000 వేలకుపైగా భారతీయులు సరైన పత్రాలు లేకుండా జీవిస్తున్నట్లు అమెరికా సిద్ధం చేసిన ఒక నివేదిక పేర్కొంది. #WATCH: #Delhi: MEA spokesperson Randhir Jaiswal says, "Since 20 January of this year, till yesterday, some 1563 Indian nationals have been deported from the United States so far. Most of these Indian nationals have come by commercial flight..." (ANI)#Indians #US #Deportation pic.twitter.com/9IP4cY8cDi— Prameya English (@PrameyaEnglish) July 17, 2025 -
భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?
భారతీయులకు శుభవార్త. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం. రూ. 7,500కే వీసా అందిస్తోంది. ఫ్రాన్స్, యుఎస్, యుకె, స్పెయిన్ కాదు, మరేంటి ఆ దేశం! ఏంటి నమ్మబుద్ధి కావడం లేదు కదా. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.వీసా దరఖాస్తు ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, కొన్నిసార్లు అదనపు ఛార్జీలు ఇవన్నీ కలిపి కొంత ఖర్చుతో కూడుకున్నదే. వీసా ఫీజు ఎంత అనేది ఆయా దేశాలను బట్టి మారుతుంది.ప్రతి ఒక్కరూ ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ పని చేసి మంచి డబ్బు సంపాదించాలని కలలు కంటారు. అయితే, ఖరీదైన వీసాల కారణంగా, ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు, రూ.7,500 కంటే తక్కువకే వీసాను అందించడమే కాకుండా, అక్కడ ఒక ఏడాది దాకా పని చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ దేశం పేరే జర్మనీ. రొమాంటిక్ రైన్ వ్యాలీ నుండి బవేరియాలోని అద్భుత కోటలు, గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది జర్మనీ. జర్మనీ బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగాలు , అధిక జీవన నాణ్యత భారతీయులతో సహా ఈయూ యేతర నివాసితులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి, జర్మనీ ఫ్రీబెరుఫ్లర్ వీసా అని కూడా పిలిచే ఫ్రీలాన్స్ వీసాను అందిస్తోంది. ఇది వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా( ఫ్రీలాన్సర్లుగా) పని చేయడానికి వీలు కల్పిస్తుంది. హైక్వాలిటీ లైఫ్ గడపాలనుకునే వారికి, క్రియేటివ్ ప్రొఫెషనల్స్, పర్యాటకులకు గొప్ప అవకాశం అంటూ ఊరిస్తోంది. ఎవరు అర్హులుభారతదేశంలోని జర్మన్ మిషన్ల ప్రకారం, జర్మన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18 కింద ఈ క్రింది వర్గాల ఫ్రీలాన్స్ వీసాలు పొందే అర్హత వీరికి ఉంది.ఇండిపెండెంట్ సైంటిస్టులు, శాస్త్రవేత్తలుకళాకారులు, ఉపాధ్యాయులు , విద్యావేత్తలున్యాయవాదులు, నోటరీలుపేటెంట్ ఏజెంట్లుసర్వేయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లుపశువైద్యులువాణిజ్య రసాయన శాస్త్రవేత్తలుఅకౌంటెంట్లు, పన్ను సలహాదారులుకన్సల్టింగ్ ఆర్థికవేత్తలు, స్వార్న్ అకౌంటెంట్లు, పన్ను ఏజెంట్లుదంతవైద్యులు, వైద్యేతర నిపుణులు, ఫిజియోథెరపిస్టులుజర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వ్యాఖ్యాతలుఅనువాదకులు, పైలట్లు , ఇతర సారూప్య వృత్తులు.ఫ్రీలాన్స్ వీసా అంటే ఏంటి? అర్హతలు, పైన పేర్కొన్న వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్న వారు ఫ్రీలాన్స్ వీసాను వినియోగించుకోవచ్చ. వీసా కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ పని రుజువు , అర్హత రుజువుతో సహా కొన్ని అవసరాలను తీర్చాలి. వీసా కోసం చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా కూడా అవసరం.అదనంగా, దరఖాస్తుదారులు జర్మనీ లేదా యూరప్‌లోని వారి సంబంధిత వృత్తిపరమైన రంగంలో వ్యాపార పరిచయాల ఉన్నవారి వివరాలను, వారి ఫ్రీలాన్స్ జాబ్ వివరాలపై సమగ్ర సమాచార మివ్వాలి.ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన పత్రాలుఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (6 నెలల కంటే పాతవి కానివి), ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ వర్క్, అర్హత రుజువుతో సహా అనేక దృవీకరణ పత్రాలను సమర్పించాలి. జర్మనీలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థ లేదా ఇతక సంస్థనుంచి డిగ్రీ చదివి ఉండాలి.. 75 యూరోలు లేదా రూ. 7,486 వీసా రుసుము, సుమారుగా. 45 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు, పెన్షన్ లేదా యాజమాన్యంలోని ఆస్తులతో సహా అదనపు పదవీ విరమణ ప్రయోజనాల ధృవపత్రాలు అవసరం.జర్మన్ ఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు ప్రక్రియలో సాధారణంగా జర్మనీలోకి ప్రవేశించే ముందు స్వదేశం నుండి నేషనల్ డి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. జర్మన్ ఎంబసీ లేదా కాన్సులేట్‌తో అపాయింట్మెంట్ తీసుకొని, అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీసా మంజూరైన తరువాత జర్మనీకి వెళ్లిన తరువాత రెండు వారాలలోపు వారి చిరునామాను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత, వారు ఫ్రీలాన్సర్‌గా లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక విదేశీయుల కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుందినివాస అనుమతి ఫ్రీలాన్స్ వీసా సాధారణంగా ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు చెల్లుతుంది. ఆ తరువాత సంబంధిత నియమాలకు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారి వీసా రెన్యూల్ అవుతుంది. జర్మనీలో వరుసగా ఐదేళ్ల నివాసం తరువాత వారి ఫ్రీలాన్సర్ భాషా ప్రావీణ్యం, ఆర్థిక పరిస్థితి అక్కడి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే శాశ్వత నివాసం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్లు స్థానిక పన్ను కార్యాలయంలో నమోదు చేసుకుని పన్ను నంబర్‌ను పొందాలి.ఫ్రీలాన్స్ వీసా ప్రయోజనాలుఫ్రీలాన్స్ వీసా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు జర్మనీలో స్వతంత్రంగా పనిచేసే అవకాశం, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగానికి ప్రాప్యత మరియు అధిక నాణ్యత గల జీవనంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్రీలాన్స్ వీసాతో, వ్యక్తులు తమ వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని తద్వారా జర్మన్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడవచ్చు. అన్నీ సవ్యంగా ఉండి, అక్కడి భాషలో ప్రావీణ్యం సంపాదించి, ఆర్థిక పరిస్థితులు ప్రమాణాల కనుగుణంగా వుంటే ఫ్రీలాన్స్ వీసా శాశ్వత నివాసానికి ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది, ఇది జర్మనీలో దీర్ఘకాలికంగా స్థిరపడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు. -
నెలకు రూ.1,000 కోట్లకుపైనే
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్–పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, టాస్క్, పెట్టుబడి.. ఎంచుకున్న విధానం ఏదైనా విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు చిక్కుతున్నారు. తద్వారా ప్రతి నెల సగటున రూ.1,000 కోట్లకుపైగా దోపిడీకి గురవుతున్నారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఆగ్నేయాసియా కేంద్రంగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. భారతీయులతో సహా అక్రమ రవాణాకు గురైన వ్యక్తులతో ఈ కేంద్రాల్లో బలవంతంగా మోసాలు చేయిస్తున్నారు.ఈ ఏడాది జనవరి నుండి మే వరకు ఆన్ లైన్ స్కామ్‌ల వల్ల భారతీయులు కోల్పోయిన మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. ఇందులో సగానికి పైగా మోసాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుండి పనిచేస్తున్న నెట్వర్క్లే కారణమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎంహెచ్ఏ అనుబంధ విభాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రూపొందించిన డేటా ప్రకారం.. అధిక భద్రత కలిగిన ప్రదేశాల నుండి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెట్‌వర్క్‌లను చైనీస్ ఆపరేటర్లు నియంత్రిస్తున్నారు.బాధితులే ఉద్యోగులు..విదేశాల్లో ఉద్యోగాల ఆశతో మానవ అక్రమ రవాణాకు గురై.. ఆయా దేశాల కేంద్రాల్లో వీరితో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లాతోపాటు పలువురు యువకులు ఉపాధి కోసం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి సైబర్ కేఫ్‌లలో బందీలుగా చిక్కుకున్నారు. దీనిపై వార్తల నేపథ్యంలో స్పందించిన కేంద్రం అక్కడి 539 భారతీయ బందీలను విడిపించి, మార్చి 11న సురక్షితంగా భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇలా చాలామందిని నిఘా సంస్థలు రక్షించాయి. వీరి సాయంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కంబోడియాలో కనీసం 45, లావోస్‌లో ఐదు, మయన్మార్‌లో ఒక కేంద్రాన్ని గుర్తించాయి. బాధితుల్లో భారతీయులతో పాటు, ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలు, యూరప్/ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆగ్నేయాసియా నుండి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మూడు రకాల మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో స్టాక్ ట్రేడింగ్/పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, టాస్క్ ఆధారిత, పెట్టుబడి ఆధారిత మోసాలు ఉన్నాయి.ఘోస్ట్ సిమ్ కార్డులతో..ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం మార్చికి ముందు ఆరు నెలల్లో భారతీయులు కనీసం రూ.500 కోట్ల మేర మోసపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికం రంగాలలో ఉన్న లొసుగులను ప్యానెల్ గుర్తించింది. నకిలీ, దొంగిలించిన గుర్తింపులతో సిమ్‌లను జారీ చేశారనే ఆరోపణలపై వివిధ రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నకిలీ, ఇతరుల గుర్తింపుతో జారీ అయిన ఈ ఘోస్ట్ సిమ్‌లను పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్నారు. మోసపూరితంగా సిమ్ జారీ కావడంతో నేరస్తులను గుర్తించడం కష్టమవుతోంది.బాధితులే ఉద్యోగులు..సైబర్ నేరాల కోసం వ్యక్తులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి 59 అత్యధికంగా మంది ఉన్నారు. తమిళనాడు 51, జమ్మూ కాశ్మీర్ 46, ఉత్తర ప్రదేశ్ 41, ఢిల్లీ నుంచి 38 మంది ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెంట్లు లావోస్, మయన్మార్, కంబోడియాలకు ఎక్కువ మందిని నియమించుకుంటున్నారు. 5,000 మందికిపైగా భారతీయులు కంబోడియాలో చిక్కుకున్నట్టు సమాచారం. నేరగాళ్లు వీరిని నిర్బంధించి, బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. దేశాలను దాటి..సైబర్ నేరస్తుల చెర నుంచి రక్షించిన బందీలు, తిరిగి వచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలను ప్రభుత్వం నమోదు చేసింది. భారత్ నుంచి కంబోడియాకు బాధితులను తరలిస్తున్న తీరు నిఘా సంస్థల విచారణలో బయటపడింది. తొలుత దుబాయ్.. అక్కడి నుండి చైనా, కంబోడియాకు; తమిళనాడు నుండి కంబోడియా; మహారాష్ట్ర నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి వియత్నాం.. అక్కడి నుండి బ్యాంకాక్, కంబోడియాకు; ఢిల్లీ నుండి బ్యాంకాక్, కంబోడియా, లక్నో నుండి బ్యాంకాక్, కంబోడియా; కేరళ నుండి వియత్నాం, కంబోడియా; కేరళ నుండి సింగపూర్, కంబోడియాకు తరలిస్తున్నారు. ఇక కోల్‌కతా నుండి వియత్నాం, కంబోడియాకు రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నట్లు తేలింది. ఆధునిక మోసాలు..: తప్పుదోవ పట్టించి రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం, నకిలీ యాప్‌లు, ఫిషింగ్ హెచ్చరికలు, వంచన వంటి వివిధ పద్ధతులను సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఒత్తిడికి గురిచేయడం, లాభదాయక రాబడి పేరుతో వల వేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా 2025లోనే రూ.210 కోట్లకుపైగా నష్టాలు నమోదయ్యాయి. సైబర్ నేరస్తులు గ్రామీణులతోపాటు నగరవాసులనూ లక్ష్యంగా చేసుకుని మరింత ఆధునిక మోసాలకు తెరలేపుతున్నారు.కాల్ 1930..: సైబర్ నేరం మీ దృష్టికి వచ్చినా.. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినా వెంటనే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండితక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం నష్టాలు వచ్చే ఏడాది కాలంలో రూ.1.2 లక్షల కోట్లకు మించి ఉండవచ్చని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరించింది. -
5 నెలలు.. రూ.7వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాలా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. దీనిని బట్టి చూస్తే మే– జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కాం వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది. ఐ4సీ ఏం చెబుతోందంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాల్లో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా తేల్చింది. వీరి వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది ఐ4సీ స్పష్టం చేస్తోంది. నెలకు రూ. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది. డబ్బంతా వెళ్లేది అటే.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) డేటా ప్రకారం దేశంలో జనం నుంచి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేయాసియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ స్కాం, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, ఈ నెంబర్‌పై ఆఫర్ ఉంది కారు గిఫ్ట్‌గా వస్తుందని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాల్లో జనం నుంచి లాగేస్తున్నారు. మన వాళ్లే ఏజెంట్లు సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులు తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు..మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మనవాళ్లు నేరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, వీరి ఉచ్చులో పడొద్దని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్లఉచ్చులో జనం పడుతుండటం గమనార్హం. -
టైమ్ టాప్–100 డిజిటల్ క్రియేటర్ల జాబితాలో ప్రజక్తా కోలికి చోటు
లండన్: ప్రతిష్టాత్మక టైమ్ 100 క్రియేటర్స్ జాబితాలో ఒక భారతీయురాలితోపాటు భారత సంతతికి చెందిన నలుగురు కంటెంట్ రైటర్లు చోటు దక్కించుకున్నారు. యూ ట్యూబర్, నటి అయిన ప్రజక్తా కోలి(32)కి భారత్ నుంచి చోటు దక్కడం విశేషం. భారతీయ అమెరికన్లు ధర్ మాన్, మిచెల్ ఖరె, సమీర్ చౌదరి, జే షెట్టి కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, చర్చలు, సంఘాలను ప్రభావితం చేసే అత్యంత ప్రభావశీలురైన డిజిటల్ సృష్టికర్తలను టైమ్ ఎంపిక చేసింది. మొట్టమొదటి సారిగా రూపొందించిన ఈ జాబితాలో టైటాన్స్, ఎంటర్టెయినర్స్, లీడర్స్, ఫెనొమ్స్, కేటలిస్ట్స్ అనే ఐదు కేటగిరీల్లో 15 దేశాలకు చెందిన వారున్నారు. టైటాన్స్ విభాగంలో భారత సంతతికి చెందిన ధర్ మాన్(41) సామాజిక, మానవీయ విలువలను కథల మాదిరిగా బోధిస్తూ యూట్యూబ్ షార్ట్ వీడియోలను రూపొందించడంలో పేరు తెచ్చుకున్నారు. ఈయన చానెల్‌కు 2.50కోట్ల మంది సబ్ స్క్రైబర్లున్నారు. నికెలోడియన్ కిడ్స్ చాయిస్ అవార్డులకు రెండుసార్లు నామినేట్ అయ్యారని టైమ్ మేగజీన్ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌ల్లో డిగ్రీలు సంపాదించారు. లీడర్స్ కేటగిరీలో భారతీయ అమెరికన్ యూట్యూబర్ మిచెల్ ఖరె స్థానం సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ చానెల్లో ‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్’సిరీస్‌తో బాగా పేరు తెచ్చుకున్నారు. ఈ చానెల్‌కు 50 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. 1992లో లూసియానాలో జన్మించిన ఖరె..డార్ట్మౌత్ కాలేజీ నుంచి డిజిటల్ ఆర్ట్స్ అండ్ మీడియా టెక్నాలజీలో డిగ్రీ చేశారు. టైమ్ మేగజీన్ జాబితాలో లీడర్స్ కేటగిరీలో ఎంపికైన జె షెట్టి(37) బ్రిటన్‌కు చెందిన భారత సంతతి రచయిత, పాడ్‌కాస్టర్. కొంతకాలం హిందూ సన్యాసిగా గడిపారు. ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాలో 2.2 కోట్ల ఫాలోయర్లు, యూట్యూబ్ చానెల్‌కు 90 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఇతడి తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి లండన్‌లో స్థిరపడ్డారు. టాప్ 100 జాబితాలో మరో భారతీయ అమెరికన్ సమీర్ చౌదరి పేరూ ఉంది. ఇతని యూట్యూబ్ చానెల్ ‘కొలిన్ అండ్ సమీర్’కు 16 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానెల్ సహనిర్వాహకుడు కొలిన్ రొజెన్ బ్లమ్కూ ఈ జాబితాలో చోటు దక్కింది. కాలిఫోర్నియాలోని శాంటామోనికాలో 1989లో జన్మించిన సమీర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిల్మ్ అండ్ డిజిటల్ మీడియాలో విద్యనభ్యసించారు.ప్రజక్తా కోలి ఎవరంటే..?మహారాష్ట్రకు చెందిన ప్రజక్తా కోలి నటి, యూట్యూబర్. మోస్ట్‌లీసేన్ అనే యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. రోజువారీ జీవితంపై హాస్యం పుట్టించేలా ఉండే ఈమె చానెల్‌కు 70 లక్షల మంది, ఇన్‌స్టాలో 80 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో మిస్మ్యాచ్డ్ అనే సిరీస్‌తోపాటు, జుగ్‌జుగ్ జీయే అనే సినిమాలోనూ నటించారు. పలు పుస్తకాలు రాశారు. -
అమెరికా వీసా మరింత భారం
వాషింగ్టన్: వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా పొందాలని భావించే భారతీయులకు మరింత ఆర్థికభారం నెత్తిన పడనుంది. 250 డాలర్లు అంటూ దాదాపు రూ.21,000లను సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి(ఎఫ్/ఎం) వీసాలతోపాటు పర్యాటక(బీ–1), ఉద్యోగ(హెచ్–1బీ), బిజినెస్(బీ–2), ఎక్సే్ఛంజ్(జే) వీసాల కోసం దరఖాస్తుచేసుకునే విదేశీయులు తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందేనని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ ది వన్ బిగ్ బ్యూటిఫుల్’ చట్టం నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు. ఈ ఫీజును వీసా మంజూరు చేసేటప్పుడు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వసూలుచేస్తుంది. వీసా పొందాక ఆయా వీసాదారులు సంబంధిత కఠిన నిబంధనావళిని ఖచ్చితంగా పాటించినట్లు ప్రభుత్వం భావిస్తే ఈ ఫీజును తిరిగి ఇచ్చేస్తారు. 2026 ఏడాదికి మాత్రమే ఫీజును 250గా నిర్ణయించారు. ఆ తర్వాతి ఏడాది ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)లకు అనుగుణంగా ఫీజును పెంచుతారు. అన్ని కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి వసూలుచేస్తున్నందున దీనిని ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’గా పేర్కొంటున్నారు. ఏ, జీ రకం దౌత్య వీసా కేటగిరీలకు మాత్రం ఈ అదనపు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన పనిలేదు. ఇతర ఫీజులూ వడ్డింపు ఐ–94 దరఖాస్తుకు 24 డాలర్లు, 90 రోజుల్లోపు అమెరికాలో ఉండే పర్యాటకులు, వ్యాపారులకు ఇచ్చే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈఎస్టీఏ)కు 13 డాలర్లు వసూలుచేయనున్నారు. ఇక చైనీయులకు ఇచ్చే పర్యాటక, బిజినెస్ వీసాలపై మరో 30 డాలర్ల ఫీజు వసూలుచేస్తారు. శరణార్థులుగా వచ్చే వాళ్లు దరఖాస్తుతోపాటు 1,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. శరణార్థులుగా వచ్చి అమెరికాలో తాత్కాలిక చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వాళ్లు అదనంగా 500 డాలర్లు చెల్లించాలి. చట్టప్రకారం శాశ్వత స్థిర నివాస హోదా దరఖాస్తుతోపాటు మరో 1,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. తమ వీసా పొందాలనుకునే విదేశీ పౌరులు అమెరికా ఇమిగ్రేషన్ చట్టనిబంధనలను పాటించాల్సిందేనని వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుతమున్న అమెరికా వీసా ఫీజుల విధానం ప్రకారం ఒక భారతీయుడు పర్యాటక(బీ–1) లేదా బిజినెస్(బీ–2) వీసా పొందాలంటే ఖచ్చితంగా 185 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై కొత్త నిబంధనల ప్రకారం ఈ 185 డాలర్లతోపాటు సెక్యూరిటీ ఫీజు(250 డాలర్లు), ఐ–94ఫీజు(24 డాలర్లు), ఈఎస్టీఏ ఫీజు(13 డాలర్లు) కలిపి మొత్తంగా 472 డాలర్లు(దాదాపు రూ.41వేలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాస్తవ ఫీజు కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ అని అమెరికాలోని ప్రైవేట్ ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొంది. అఫ్గానిస్తాన్, సిరియా వంటి పేద దేశాల నుంచి వలసలను అడ్డుకునే దురుద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఇలా శరణార్థులు సైతం ఏకంగా 1,000 డాలర్ల సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాలనే కఠిన నిబంధనను చేర్చిందని అమెరికాలోని వలసదారుల హక్కుల సంస్థ ‘నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్’ ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ వలసదారులను తగ్గిస్తున్నామంటూ ఆ వంకతో ప్రభుత్వం అన్ని రకాల కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి అదనపు ఫీజులు వసూలుచేస్తోందని నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్ ఆరోపించింది. -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్‌మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఆల్ ఖైదా టెర్రరిస్టులు
-
Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ
న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే నేపధ్యంలో మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అపహరించింది. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి ప్రభుత్వం ఆ ముగ్గురు భారతీయుల సురక్షితమైన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.మాలిలోని కేస్లోగల డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు. వీరి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై ఒకటిన సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాడి చేసి, ముగ్గురు భారతీయులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిందని ఎంఈఏ తెలిపింది.అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం)మాలి అంతటా జరిగిన దాడులకు బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ ముగ్గురు భారతీయుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం ఖండిస్తోందని, అపహరణకు గురైన భారత పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఎంఈఏ కోరింది. మాలిలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని ఎంఈఏ సూచించింది.ఇది కూడా చదవండి: విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే.. -
మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలో మనవాడు!
నాలుగు దశాబ్దాల అనంతరం రోదసి నుంచి భారతీయ స్వరం మోగింది. మన వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతోపాటు అమెరికా, పోలెండ్, హంగేరీలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12.01 నిమిషానికి 28 గంటల అంతరిక్షయాత్ర ప్రారంభించారు. వీరు అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకుని 14 రోజులపాటు దాదాపు 60 పరిశోధనలు చేస్తారు. ‘మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం. భారత మానవ అంతరిక్ష కార్యక్రమం మొదలైంద’ంటూ శుభాంశు శుక్లా పంపిన సందేశం ఈ మొత్తం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శాస్త్రవేత్తల్లో భావోద్వేగం కలిగించింది. ఎప్పుడో 1984లో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేశాక భారత్ నుంచి మరొకరు వెళ్లటం ఇదే ప్రథమం. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యాత్ర ప్రారం¿¶ మైంది. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఐఎస్ఎస్... ప్రతి 90 నిమిషాలకూ భూకక్ష్యలో ఒక రౌండ్ పూర్తిచేస్తుంది. ఆ కారణంగా మన శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు రోజూ 16 సూర్యోదయాలనూ, 16 సూర్యాస్తమయాలనూ వీక్షిస్తారు. అవనిపై ఎలావున్నా అంతరిక్షంలో దేశాల మధ్య ఇంతవరకూ కొనసాగుతున్న సహకారానికీ, సమన్వయానికీ ఐఎస్ఎస్ ఒక ప్రతీక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, రష్యా సంస్థ రోస్కాస్మోస్, జపాన్ సంస్థ జాక్సా, కెనడా అంతరిక్ష సంస్థ సీఎస్‌ఏలు ఉమ్మడిగా ఐఎస్ఎస్ నిర్మాణానికి ముందుకు కదిలాయి. అంతరిక్షంలో ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని, దాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించాలని, అక్కడి పరిశోధనల ఫలితాలు సమస్త మాన వాళికి అందించాలన్న లక్ష్యాలతో ఐఎస్ఎస్కు అంకురార్పణ జరిగింది. రెండున్నర దశాబ్దాల క్రితం గనుక ఇదంతా కుదిరింది. వర్తమానంలో ఇది సాధ్యమయ్యేదా? ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సి. క్లార్క్ చాన్నాళ్ల క్రితం ‘ఈ విశాల విశ్వంలో రెండే రెండు సంభావ్యతలుంటాయి... అవి–మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలి’ అన్నారు. సకల అంతరిక్ష యాత్రల సారాంశం దాన్ని ఛేదించటమే. ఈ క్రమంలో ఐఎస్ఎస్ ఒక సాధనం. ప్రయోగశాలగా, భిన్న సాంకేతికతల నిగ్గుతేల్చేదిగా భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో సేవలందిస్తున్న ఐఎస్ఎస్ ఇప్పటికి భిన్న శాస్త్రాల్లో 4,000 ప్రయోగాలకు వేదికైంది. జీవశాస్త్రం మొదలుకొని ఔషధాల వరకూ... భూ విజ్ఞాన శాస్త్రాలు మొదలుకొని భౌతిక శాస్త్రం వరకూ... పర్యావరణ పర్యవేక్షణ నుంచి అంతరిక్ష అన్వేషణ వరకూ ఎన్నెన్నో అంశాల్లో ఐఎస్ఎస్ వ్యోమగాములకు తోడ్పాటునందిస్తోంది. గురుత్వాకర్షణ శక్తి బలంగావుండే భూ వాతావరణంలో కొన్ని కొన్ని పరిశోధ నలు అసాధ్యమవుతాయి. అత్యంత సూక్ష్మ గురుత్వాకర్షణ కలిగి భారరహిత స్థితిలో ఉండే ఐఎస్ఎస్లో సంక్లిష్టమైన పరిశోధనలూ, ప్రయోగాలూ చేయటం, వాటినుంచి ఫలితాలు రాబట్టడం ఎంతో సులభం. ఇవి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయగల అనేక సృజనాత్మక సాంకేతికతల ఆవిష్కరణకు తోడ్పడ్డాయి. కమ్యూనికేషన్ల రంగంలో, వనరుల యాజమాన్య నిర్వహణలో, తాగు నీరు స్వచ్ఛతకు వినియోగించే సాంకేతికతల రూపకల్పనలో, అంతరిక్ష యాత్రకు పనికొచ్చే అధు నాతన సాంకేతికతల అభివృద్ధిలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్డాయి. అంతేకాదు... మానవాళి భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణలకు ఐఎస్ఎస్ వేదికవుతున్నది. ఐఎస్ఎస్ భూమ్మీద రూపొందించి ప్రయోగించింది కాదు. అది కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో పూర్తయినది కూడా కాదు. అందుకు దాదాపు పదమూడేళ్లు పట్టింది. అందులోని విడిభాగాల్లో ఎవరేమి తయారుచేయాలో, ఎప్పుడు పట్టుకెళ్లాలో సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోగా, 1998 నవంబర్‌లో మొదలుపెట్టి 2011 వరకూ పునర్వినియోగ అంతరిక్ష నౌకలద్వారా, రష్యన్ రాకెట్ల ద్వారా 30 దఫాలు వందకుపైగా ఐఎస్ఎస్ విడిభాగాలు, సౌరశక్తి ప్యానెళ్లు, కేబుళ్లు వగైరాలు చేర్చారు. వ్యోమగాములు స్పేస్‌వాక్ చేస్తూ ఈ కేంద్రానికి రూపకల్పన చేశారు. నిద్రపోవటానికీ, తిండికీ, వ్యాయామాలకూ, పరిశోధనలకూ ఇక్కడి నుంచి ప్రయోగించిన మాడ్యూళ్లు తోడ్పడ్డాయి. మొదట్లో ఇది గరిష్ఠంగా 2020 వరకూ పనిచేయొచ్చని అంచనా వేయగా ఇప్పటికీ నిక్షేపంలా ఉంది. తాజా అంచనా ప్రకారం 2030తో దీని జీవితకాలం పూర్తవుతుందని, ఆ తర్వాత కక్ష్య తప్పించి నేలపై పడేవిధంగా చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ట్రంప్ ఏలుబడి మొదల య్యాక 2030 కన్నా ముందే దాన్ని దించేయాలని ఎలాన్ మస్క్ వాదించటం మొదలుపెట్టారు. ప్రస్తుతం మస్క్ స్థానమేమిటన్న దాన్నిబట్టి ఐఎస్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మామూలుగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడే ఇంటిల్లిపాదీ ఎంతో భావోద్వేగానికి లోనవు తారు. అంతరిక్ష యాత్రంటే చెప్పేదేముంది? అందులో సాహసమూ, సమస్యలూ కలగలిసి ఉంటాయి. ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలి. శిక్షణ కోసం అయినవాళ్లకు దూరంగా ఉండాలి. కష్టతరమైన వ్యాయామాలు తప్పనిసరి. శుభాంశు వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు. వాయుసేన నుంచి అంతరిక్షయాత్ర వైపు అడుగులేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇప్పుడు 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలనూ, నమ్మకాలనూ మోసుకెళ్లాడు. యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.శుభాంశు యాత్ర దిగ్విజయం కావాలని, మరో ముగ్గురితో కలిసి ఆయన సాగించే ప్రయోగాలూ, పరిశోధనలూ మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని దేశ పౌరులంతా ఆకాంక్షిస్తున్నారు. -
ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్‌కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్‌కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్‌లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి. -
ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్‌లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్ స్పష్టీకరణ -
నాన్నా.. డబ్బు పంపండి!
అప్పులు చేస్తున్నాం... డబ్బులు పంపుతున్నాంమా బాబును అమెరికా పంపినప్పుడు ఎంతో సంతోషించాం. కానీ ఇప్పుడు ప్రతీ రోజూ ఏడుస్తున్నాం. ఫీజులు పెరిగాయి. ఉద్యోగాల్లేవు. అమ్మా డబ్బులు పంపు అనడం మాత్రమే ప్రతీ ఫోన్ కాల్లో విన్పిస్తోంది. అప్పులు చేసి మరీ పంపుతున్నాం. ఈ పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్తుందో అనే ఆందోళన ఉంది. – వరలక్ష్మి పల్లవ (విద్యార్థి తల్లి, హైదరాబాద్)సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మన విద్యార్థులు అనుకున్నదొకటి... అక్కడ జరుగుతున్నది మరోటి. భౌగోళిక పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు మన విద్యార్థులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ ఇబ్బందులు భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రానురాను డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తోంది. దీంతో విద్య కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని విధంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. 2014లో డాలర్ విలువ రూ.60.95 ఉంటే, ఇప్పుడు రూ.86.25కు చేరింది. దీంతో విదేశీ విద్య కోసం వెళ్లిన మన విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. దీనికితోడు పార్ట్ టైం ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిల్లడంతో భారత్‌లోని తల్లిదండ్రుల వైపు విద్యార్థులు దీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫోన్ చేసి డబ్బులు పంపండి అని అడుగుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ అన్ని దేశాల్లోనూ భారత విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. విదేశీ విద్యకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విద్యార్థులూ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏటా రూ.4.32 లక్షల కోట్లు.. ఏటా 13 లక్షల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో టూరిస్టులు, విద్యార్థులూ ఉన్నారు. అయితే, విదేశీ చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు ఉంటే.. 2022 నాటికి ఇది రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. రూపాయి మారకం విలువ పెరగడంతో 2024లో చేస్తున్న ఖర్చు 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ.4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం లెక్కగట్టింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14 శాతం అదనపు భారం పడే వీలుంది. అంటే, రూ.5.86 లక్షల మేర భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాకు వెళ్లడానికి ముందు విద్యార్థులు అక్కడి వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కెనడాలో రూ.1.60 లక్షలు, ఆ్రస్టేలియాలో రూ.1.80 లక్షలు, బ్రిటన్‌లో రూ.2 లక్షలకు పైగా అదనపు వ్యయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. దీనికితోడు వసతి ఖర్చులు 15 శాతం వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాల నేపథ్యంలో జీవన వ్యయం ఏకంగా 22 శాతం పెరిగింది. అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడది రూ.52 లక్షల వరకూ వెళ్లింది. ప్రధాన సమస్య అదే.. అమెరికాలో చదవడం కంటే ముందు పార్ట్‌టైం ఉద్యోగంపైనే మన దేశ విద్యార్థులు ఆధారపడుతున్నారు. భారత్‌లో ఉద్యోగాలు రాని వాళ్లు, వస్తాయనే నమ్మకం లేని వాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్తున్నారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. అమెరికాకు దాదాపు 3 లక్షల మంది భారతీయులు వెళ్తుంటే, వారిలో 1.25 లక్షల మంది తెలుగువాళ్లే ఉంటున్నారు. 2024లో భారత్‌తోపాటు ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్‌టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. ఇక్కడ అమెరికాతో పోలిస్తే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. బ్రిటన్, ఆ్రస్టేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. దిగితే గానీ లోతు తెలియదు: కూర్మం దామోదర్ (అమెరికాలో ఎంఎస్ చేస్తున్న వరంగల్ విద్యార్థి) అమెరికా చదువు కోసం కలలు కన్నాం. ఇక్కడికి వస్తే చాలు ఎన్ని అప్పులు చేసినా తీర్చి, ఎంతో కొంత వెనకేసుకుని వెళ్తామని ఆశించాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పార్ట్‌టైం ఉద్యోగాల్లేవు. డాలర్ ధర పెరగడంతో ఫీజులూ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఏంటో మాకే అంతుబట్టడం లేదు. -
గ్లోబల్ విస్తరణలో దేశీ హోటల్స్
న్యూఢిల్లీ: దేశీ హోటల్ చెయిన్స్ అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భారతీయులు విదేశాలకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో బ్రిటన్, పశ్చిమాసియా దేశాలతో పాటు అటు ఆఫ్రికా ఖండంపైనా ఫోకస్ చేస్తున్నాయి. టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) తాజాగా దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో మూడు లగ్జరీ లాడ్జిలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సఫారీతో పాటు విశిష్టమైన అనుభూతి కల్పించే పలు ఆఫర్లను తాము అందిస్తున్నట్లు ఐహెచ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ ఛత్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల స్థాయిలో ఆదాయ వృద్ధిని అంచనా వేస్తున్న ఐహెచ్‌సీఎల్ ఈ ఏడాదిలో 30 హోటల్స్ ప్రారంభించాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాలుగో త్రైమాసికంలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో 126 గదుల తాజ్ ప్రాపర్టీని కూడా ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయంగా పది కొత్త ప్రాపర్టీలపై కసరత్తు చేస్తోంది. వచ్చే మూడు–నాలుగేళ్లలో బహ్రెయిన్‌లో రెండు, సౌదీ అరేబియాలో రెండు ప్రాపర్టీలను ప్రారంభించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం న్యూయార్క్, బ్రిటన్, మాల్దీవులతో పాటు కంపెనీకి 28 ప్రాపర్టీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయంలో వీటి వాటా దాదాపు 20 శాతంగా నిల్చింది. ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతుండటంతో 2025 ప్రారంభం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలోని హోటల్ కూడా మెరుగైన పనితీరు కనపరుస్తోందని ఛత్వాల్ తెలిపారు. అటు న్యూయార్క్ ప్రాపర్టీ కూడా పుంజుకుంటోందని వివరించారు. ఏడాది మొత్తం మీద ఇదే సానుకూల ధోరణి కొనసాగవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆదాయాల్లో దేశీ వ్యాపారంతో పాటు అంతర్జాతీయ విభాగం వాటా కూడా మరింతగా పెరుగుతుందని చెప్పారు. ఒబెరాయ్ హోటల్స్ .. సరోవర్ సైతం.. ఇక లగ్జరీ దిగ్గజం ఒబెరాయ్ హోటల్స్ కూడా అంతర్జాతీయంగా కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. 2028లో సెంట్రల్ లండన్‌లోని మేఫెయిర్ ప్రాపర్టీ ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో 21 గదులు ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా 497 గదులు ఒబెరాయ్ బ్రాండ్ కింద ఉన్నాయి. 2028 నాటికి మరో 290 గదులను జోడించుకోవాలని కంపెనీ భావిస్తోంది. రెండు ఫ్లోటింగ్ బోట్ హోటల్స్‌తో పాటు (చెరి ఏడు గదులు చొప్పున), 25 గదులతో నైల్ క్రూయిజర్ కూడా వీటిలో ఉంటాయి. లండన్‌లోని హోటల్‌ను ఒబెరాయ్ మాతృ సంస్థ ఈస్ట్ ఇండియా హోటల్స్ నిర్వహించనుండగా, మిగతా వాటిని మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా నిర్వహించనున్నారు. దేశీయంగా 1994లో ప్రారంభమైన సరోవర్ హోటల్స్ కూడా విదేశాల్లో విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఆఫ్రికా ఖండంలో ఉగాండాలో సరోవర్ పోర్టికో కంపాలాను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ అజయ్ బకాయా తెలిపారు. ఇందులో 85 గదులు ఉంటాయి. అలాగే సోమాలియాలో 121 గదులతో సరోవర్ ప్రీమియర్ హెర్గేసియాను ప్రారంభించనున్నట్లు వివరించారు. మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా కంపెనీ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నేపాల్‌లో 304 గదులతో రాయల్ తులిప్ ఖాట్మండు ప్రాపర్టీని కంపెనీ ఈ ఏడాది ప్రారంభించనుంది. అలాగే 22,000 చ.అ.విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేస్తోంది. అటు చిత్వన్ నేషనల్ పార్క్‌లో రాయల్ తులిప్ చిత్వన్, లుంబినిలో గోల్డెన్ తులిప్ భైరాహవా కూడా జాబితాలో ఉన్నాయి. ఆగ్నేయాసియాలో రాయల్ ఆర్కిడ్ .. మరో దిగ్గజ సంస్థ బెంగళూరుకు చెందిన రాయల్ ఆర్కిడ్ హోటల్స్ అంతర్జాతీయంగా ఎదిగేందుకు మాల్దీవులతో పాటు కొన్ని ఆగ్నేయాసియా దేశాలను కూడా పరిశీలిస్తోంది. శ్రీలంక, నేపాల్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే హోటల్స్ ఉన్న ప్రాంతాలతో పాటు సమీపంలోని ఇతర మార్కెట్లలోనూ ప్రవేశించే యోచన కూడా ఉన్నట్లు రాయల్ ఆర్కిడ్ హోటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ కే బాల్జీ తెలిపారు. మాల్దీవులు, పశి్చమాసియా, ఆగ్నేయాసియా దేశాలను కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రీజెంటా బ్రాండ్ హోటల్స్, రిసార్టులను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. -
కంటిపాపలకు కనురెప్పలు దూరం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కంటికి రెప్పలే భద్రత. ఆ కనురెప్పలే మాయమైతే కళ్ల పరిస్థితేంటి? అలాగే కంటికి రెప్పలాంటి ఇంటిపెద్ద దేశంకాని దేశంలో ఉన్నట్టుండి కనిపించకుండా పోతే.. ఇక్కడి ఆ కుటుంబం పరిస్థితేంటి? కట్టుకున్నవాడి కోసం ఆ ఇల్లాలు పడే ఆవేదన మాటలకు అందదు.. అమ్మా.. నాన్న ఎక్కడ అని పిల్లలు అడిగినప్పుడల్లా ఆ తల్లి గుండె ముక్కలయ్యే శబ్దం ఆమెకు మాత్రమే వినిపిస్తుంది. బతుకుదెరువు కోసం అప్పులు చేసి, సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నవారిలో కొందరు కనిపించకుండా పోతుండటంతో వారి కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోతున్నాయి. ఆర్థిక ఆసరా ఆగిపోయి జీవితాలు తలకిందులవుతున్నాయి. విదేశాల్లో ఆచూకీ లేకుండా పోయిన కొందరు కార్మికుల కుటుంబ సభ్యులను ‘సాక్షి’ కదిలించే ప్రయత్నం చేసింది. నాలుగేళ్లుగా నరకయాతన ఈమె పేరు సింగం లక్ష్మి. ఈమె భర్త సింగం రాజేశ్వర్ గౌడ్ సౌదీఅరేబియాలో నాలుగేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ తెలపాలని నాయకులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ లక్ష్మి అలుపెరుగక తిరుగుతూనే ఉంది. ఖానాపూర్‌కు చెందిన సింగం రాజేశ్వర్ గౌడ్ 2018లో సౌదీ వెళ్లి.. రియాద్ సిటీ ఆమ్రియాలో ఖర్జూర తోట పని చేసేవాడు. తరచూ భార్య, పిల్లలతో ఫోన్లో మాట్లాడేవాడు. 2021 సెపె్టంబర్ 12 నుంచి అతని నుంచి ఫోన్లు రావడం నిలిచిపోయింది. అప్పటి నుంచి రాజేశ్వర్ ఆచూకీ లేకుండా పోయాడు. అతడితో కలిసి రూమ్‌లో ఉండేవారిని ఆరా తీయగా నాలుగు నెలల జీతంతో ఇంటికి డబ్బులు వేస్తానని వెళ్లి, తిరిగి రాలేదని తెలిపారు. దీంతో అక్కడి భారత ఎంబసీ, గల్ఫ్ కారి్మక సంఘాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కలసి రాజేశ్వర్ గౌడ్ ఆచూకీ కనుక్కోవాలని లక్ష్మి వినతులు ఇస్తూనే ఉంది. కట్టుకున్న భర్త కనిపించకపోవటం, కుటుంబ భారం మొత్తం ఆమెపైనే పడటం, పైగా రూ.7 లక్షల వరకు అప్పు కూడా ఉండటంతో ప్రస్తుతం కూలిపని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు సిద్దార్థ డిగ్రీ పూర్తిచేసి మూడు నెలలక్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. కూతురు మౌనిక డిగ్రీ పూర్తిచేసింది. చిన్న కొడుకు మల్లిఖార్జున్ పదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటికైనా రాజేశ్వర్ ఆచూకీ దొరుకుతుందేమోనని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. నాన్న ఏడని అడుగుతున్నారు? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందినలాస్యకు ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం గర్భవతి కూడా. ఈమె భర్త బట్టు నాగార్జున్ జగిత్యాలలోని సీఎమ్మార్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా గత మే 5న దుబాయ్‌కి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో లాస్య తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. తండ్రి నుంచి నెల రోజులుగా ఫోన్ రాకపోవడంతో పిల్లలు.. నాన్న ఏడి? అని అడుగుతన్న ప్రతిసారీ లాస్య గుండె తరుక్కుపోతోంది. భర్త ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో అని తలచుకుని రోజూ విలపిస్తోంది. నాగార్జున్ ఆచూకీ తెలపాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి మెయిల్ ద్వారా విన్నవించింది. ట్రావెల్స్ వాళ్లు పట్టించుకోవడం లేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన భర్తను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతోంది. సింగపూర్‌లో మతి స్థిమితం కోల్పోయి..! నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి చెందిన గుండ్ల భూమేశ్వర్ మే 13న సింగపూర్ వెళ్లాడు. 19న అందరితో పాటే బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడిని పనిలో పెట్టుకున్నవారు భూమేశ్వర్‌ను వెతికి పట్టుకొని మెట్రో ట్రైన్లో రూమ్‌కు తిరిగి తీసుకొస్తుండగా మధ్యలో ఒక స్టేషన్ వద్ద దిగిపోయాడు. తర్వాత ఎంత వెతికినా దొరకలేదు. అతడి ఫోన్ కూడా పనిచేయడం లేదు. భూమేశ్వర్ మతి స్థిమితం కోల్పోయినట్టుందని అనుమానిస్తున్నారు. ఎలాగైనా ఆయనను ఇంటికి రప్పించేలా సింగపూర్ అధికారులు, అక్కడి భారత ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల ‘ప్రవాసీ ప్రజావాణి’లోనూ భూమేశ్వర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 31 ఏళ్లుగా కానరాని ఆచూకీ.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన ఈమె పేరు భోగ లక్షి్మ. ఈమె భర్త సదానందం 1994లో టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లభించలేదు. సదానందం దుబాయ్ వెళ్లిన సమయంలో లక్షి్మకి ఐదేళ్లలోపు బాబు, పాప ఉన్నారు. సదానందం ఆచూకీ కోసం అధికారులు, నాయకులను ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమే సంసార బాధ్యతలు భుజానికెత్తుకుని బీడీ కార్మికురాలిగా మారి పిల్లలను చదివించి పెళ్లిళ్లు చేసింది. 31 ఏళ్లుగా భర్త ఆచూకీ కోసం వెదుకుతూనే ఉంది. ఏనాటికైనా సదానందం తిరిగి వస్తాడన్న ఆశతో లక్ష్మి బతుకుతోంది. ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించవచ్చు విదేశాలలో తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ’ప్రవాసీ ప్రజావాణి’లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవాసీల కుటుంబ సభ్యులకు, భారత విదేశాంగ శాఖకు, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలకు ’ప్రవాసీ ప్రజావాణి’ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. బాధితులు నేరుగా భారత రాయబార కార్యాలయాలకు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు. ’మదద్’పోర్టల్‌లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా నమోదు చేయవచ్చు. – మందా భీంరెడ్డి, వైస్ చైర్మన్, స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ, తెలంగాణ ప్రభుత్వం -
వీసా ఫ్రీ.. విదేశాలు!
విదేశాలు చుట్టి రావాలని ఎవరికి ఉండదు. సమస్యల్లా వీసా పొందడమే. వీసా అక్కర్లేదు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు, ఆతిథ్యం స్వీకరించేందుకు విచ్చేయండి అని భారతీయులను ఆహ్వానించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జాబితాలో తాజాగా ఫిలిప్పీన్స్ వచ్చి చేరింది. పలు దేశాలు వీసా రహిత ప్రవేశం, వీసా ఆన్ అరైవల్, ఆన్లైన్ వీసాలు (ఈ–వీసాలు) అందించడం ద్వారా పాస్‌పోర్ట్ ఉన్న భారతీయులకు ప్రయాణాన్ని సులభతరం చేశాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్వీసా అవసరం లేకుండానే..విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రకారం 2025 మార్చి నాటికి 25 దేశాలలో భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం అందుబాటులో ఉంది. దేశాన్నిబట్టి కాల వ్యవధులు, కొన్ని షరతులు ఉన్నాయి. దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా ఎలాంటి వీసా, రోజుల పరిమితి లేకుండా దక్షిణాసియాలో భూటాన్, నేపాల్‌ను చుట్టేయవచ్చు. హిందూ మహాసముద్ర ద్వీప దేశాలైన మాల్దీవులు (90 రోజులు అక్కడ ఉండొచ్చు), సీషెల్స్ (ముందస్తు ప్రయాణ అనుమతితో 90 రోజులు) భారతీయులను స్వాగతిస్తున్నాయి. మారిషస్ సైతం ఉచిత ప్రవేశాన్ని మంజూరు చేస్తోంది. ఆగ్నేయాసియాలో థాయ్‌లాండ్ 60 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. 2026 డిసెంబర్‌లోగా 30 రోజుల పాటు వీసా లేకుండానే మలేషియా చుట్టొచ్చు. కరేబియన్ దీవులు భారతీయులకు వీసా రహిత ప్రయాణానికి హాట్‌స్పాట్. బార్బడోస్, గ్రెనడా, హైతీ, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెడీన్స్లో 30 నుండి 90 రోజుల వరకు బస చేయవచ్చు. ఇతర వీసా రహిత దేశాలలో పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్, మధ్య ఆసియాలోని కజకిస్తాన్, బెలారస్, ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్ ఉన్నాయి.వీసా ఆన్ అరైవల్పాస్పోర్టు కలిగిన భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ 38 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఉన్న దేశానికి చేరుకున్న వెంటనే విమానాశ్రయంలోనే వీసా మంజూరు చేస్తారు. ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, రువాండా, మడగాస్కర్, గినియా–బి స్సావు, జింబాబ్వే.. ఆసియాలోని లావోస్, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, మయన్మార్ వీటిలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలైన ఖతార్, ఒమన్ కూడా వీసా ఆన్ అరైవ ల్ అందిస్తున్నాయి. కరేబియన్ మళ్ళీ ఇక్కడ బలంగా ఉంది. సెయింట్ లూ సియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ సైతం ఈ జాబితాలో నిలిచాయి.ఈ–వీసా 62 దేశాల్లో.. భారత పౌరులకు 62 దేశాలు ఈ–వీసా ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలకు వెళ్లే ఔత్సాహికులు రాయబార కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత పత్రాలతో ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. అర్హతలనుబట్టి మంజూరు చేస్తారు. సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ఆసియాలో జపాన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, శ్రీలంక, తైవాన్ ఎలక్ట్రానిక్ వీసా అందిస్తున్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, రష్యా వంటి మధ్య ఆసియా, యురేషియా దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యా, టాంజానియా, ఇథియోపియా, మొరాకో, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలకు ఈ–వీసాలను పొందవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం భారతీయ పౌరులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి. లాటిన్ అమెరికా, కరేబియన్‌లలోని అర్జెంటీనా, చిలీ, సురినామ్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. పశ్చిమాసియాలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, టర్కీ, ఒమన్ కూడా ఈ–వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. బుర్కినా ఫాసో, బెనిన్, సావో టొమే అండ్ ప్రిన్సిపే, ఈక్వటోరియల్ గినియా ఈ జాబితాలో ఉన్నాయి.టాప్–10 వీసా–ఫ్రీ దేశాలుపర్యాటక ప్రదేశాలు, బీచ్‌లు, ప్రకృతి సుందర దృశ్యాలు, నోరూరించే వంటకాలు, జీవ వైవిధ్యం పరంగా ఎక్కువ మంది సందర్శించడానికి ఇష్టపడేవి.. థాయ్‌లాండ్, నేపాల్, మారిషస్, భూటాన్, మలేషియా, డొమినికా, కెన్యా, శ్రీలంక, ఖతార్, సీషెల్స్.కొన్ని మార్గదర్శకాలువీసా రహిత దేశాలకు ప్రయాణించే భారతీయులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. ఎన్ని రోజులు ఆ దేశంలో ఉండొచ్చు, నిర్దిష్ట ప్రవేశ అర్హతలు ధ్రువీకరించుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్లే దేశాన్ని బట్టి ఖర్చులకు సరిపడా డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉంచడమేగాకుండా అందుకు ఆధారాలనూ చూపించాల్సి ఉంటుంది. ఎక్కడ బస చేస్తున్నదీ హోటల్ వివరాలు సమర్పించాలి. -
అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బహిష్కరణ
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 1,100మంది ఇండియన్స్ బహిష్కరణకు గురయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది.వీరిలో 62 శాతం వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారన్నారు. ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి రప్పిస్తుందని చెప్పారు.1,080 మంది భారతీయులు అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్నారని రణదీర్ జైశ్వాల్ తెలిపారు. చట్టవిరుద్ధంగా అమెరికా వెళ్లిన భారతీయ పౌరులను బహిష్కరించే విషయంలో... వారి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత అన్ని విషయాలు ధ్రువీకరించుకున్న తరువాతనే వారిని తిరిగి స్వదేశానికి రప్పిస్తున్నాం. గతంలోనే చెప్పినట్లుగా వారి జాతీయతను ధృవీకరించిన ర్వాత మాత్రమే వారిని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఈవిషయంలో భారత్ అమెరికాల మధ్య సన్నిహిత సహకారం ఉందన్నారు. స్టూడెంట్ , ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసా దరఖాస్తుదారులపై అమెరికా ప్రభుత్వ మార్గదర్శకత్వం గురించి వచ్చిన నివేదికలను కూడా జైస్వాల్ ప్రస్తావించారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థుల సంక్షేమంపై దృష్టిపెట్టినట్టు వివరించారు.అలాగే తప్పిపోయిన ముగ్గురు భారతీయుల కోసం ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యులకు మంత్రిత్వ శాఖ అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని రణధీర్ జైశ్వాల్ వివరించారు. -
పేదల నోరుకొట్టే ట్రంప్ ప్రతిపాదన
సగటు భారతీయులు అమెరికా వెళ్ళాలని ఎందుకు కోరుకుంటారు? అక్కడ సంపాదించే డాలర్లలో కొద్ది మొత్తం ఇక్కడకు పంపించినా అది వారి కుటుంబ సభ్యులకు రూపాయలలో గణనీయమైన మొత్తాలుగా మారుతాయి కనుక. అమెరికా నుంచి జమ చేసే మొత్తాలు, స్వదేశంలోని బంధు జనాన్ని నిజంగానే ఎంతగానో ఆదుకుంటున్నాయి. ప్రవాస భారతీయులు అలా చేసే జమలపైన 5% పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపా దించారు. దానిని ఆయన తమ ఖజానాకు పెద్ద మొత్తం గడించి పెట్టగల సొగసైన బిల్లుగా భావిస్తున్నారు. మనకు మాత్రం అది పీడకల లాంటి ప్రతిపాదనే. ఇది భారతదేశంలోని అనేక కుటుంబాల జీవనాధారాన్ని నీరుగార్చవచ్చు. జమ చేసే మొత్తాలపై ఇక మీదట అమెరికా ప్రభుత్వానికి పన్ను కట్టవలసి ఉంటుంది కనుక వారు పంపే మొత్తాలు కొంతమేరకైనా తగ్గవచ్చు. ఆ విధంగా అది మనకు తిరోగమన చర్య కిందే లెక్క. అమెరికా నుంచే ఎక్కువ...భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, అమెరికాలో 12 లక్షల 80 వేల మంది ప్రవాస భారతీయు (ఎన్.ఆర్.ఐ)లుగా ఉన్నారు. మరో 31 లక్షల 80 వేల మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తు (పి.ఐ.ఓ.)లుగా ఉన్నారు. విదేశాల నుంచి నగదు జమల విషయంలో భారతదేశం అగ్ర స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంకు 2024 రెమిటెన్స్ రిపోర్ట్ తెలుపుతోంది. 2024లో అలా 129 బిలియన్ల డాలర్లు వచ్చిపడ్డాయని అది వెల్లడించింది. ఇలా జమ అయ్యేదానిలో అమెరికా నుంచి వచ్చేదే పెద్ద మొత్తంగా ఉంటోందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ.) నివే దిక పేర్కొంటోంది. అమెరికా నుంచి జమయ్యే మొత్తం 2016–17లో 22.9 శాతంగా ఉన్నది 2023–24 నాటికి 27.7 శాతానికి పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. మన దేశానికి 120 బిలియన్ల డాలర్లు జమ అయ్యాయనుకుందాం. దానిలో అమెరికా వాటా 27% అంటే, ఒక్క అమెరికా నుంచే 33 బిలియన్ల డాలర్లు చేకూరినట్లు లెక్క. దీనిపై ఇపుడు 5% పన్ను విధిస్తే, అది సుమారుగా 1.6 బిలియన్ డాలర్లు (రూ. 13,000 కోట్లు)గా లెక్కకు వస్తుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియాకు రావలసిన ఆ మొత్తానికి, ట్రంప్ నూతన పన్ను విధానం వల్ల గండి పడుతుంది. దీన్ని కేవలం సంఖ్యల రూపంలో చూడవద్దు. ఇది అనేక భారతీయ కుటుంబాల దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుంది. బతుకు బండి లాగించడానికి, ఇతర కుటుంబ సభ్యుల చదువు సంధ్యలకు, ఆరోగ్య రక్షణకు ఆ మొత్తాలు ఉపయోగపడుతున్నాయి. ఆ ముఖ్య ఆదాయానికి కత్తెర పడితే భారతదేశంలోని ఆయా కుటుంబాల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఈ జమలు ఎవరి దయా ధర్మాలూ కావు. వలస వెళ్ళినవారు చెమటోడ్చి సంపాదించిన ఆదా యంలో కుటుంబ పోషణకు పంపుతున్న కొంత మొత్తాలు. అల్ప, మధ్యాదాయ దేశాలు 2023లో 650 బిలియన్ల డాలర్లను విదేశీ జమల కింద అందుకున్నాయి. ఇది ఆ యా దేశాల అభివృద్ధికి అధికారికంగా అందిన సహాయం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కన్నా ఎక్కువ. ఇది భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యమే కాదు, లక్షలాది మందికి సామాజిక భద్రతా కవచంలా పనిచేస్తోంది. ఎంతో ముఖ్య మైన ఈ మొత్తాలు అధిక లావాదేవీ రుసుములతో ఒత్తిడిని ఎదు ర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీజు 2023లో సగటున 6.18 శాతంగా ఉంది. కొన్ని దేశాల్లోనైతే ఆ ఫీజు 8 శాతం పైచిలు కుగా ఉంది. అసమంజసంగా ఉన్న ఈ ఫీజుల భారాన్ని తగ్గించాలనీ, ప్రపంచంలోని పేదలకు ఊరట కల్పించాలనీ ఐక్యరాజ్య సమితి భావించింది. విదేశాల నుంచి నగదు జమ చేసేవారిపై పడే ఫీజుల భారాన్ని 3% కన్నా తక్కువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. లావాదేవీల రుసుము 5%కన్నా మించి ఉన్నవి 2030 నాటికి ఒక్కటి కూడా లేకుండా చేయాలని సంకల్పించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్య స్ఫూర్తికి తూట్లు ట్రంప్ ప్రతిపాదిత పన్ను ఈ అంతర్జాతీయ నిబద్ధతపై ప్రత్యక్ష దాడి కిందకే వస్తుంది. ఇది లావాదేవీ జరిపినందుకు మోస్తున్న భారాన్ని మరింత పెంచడమే కాదు, ఆర్థిక అన్యాయానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుంది. విదేశాల్లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నవారు తమ వ్యక్తిగత కోరికలను పక్కనబెట్టి, తమకున్న పరిమిత ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని కుటుంబాల సంక్షే మానికి పంపుతున్నారు. లావాదేవీ ఫీజుకు తోడు మరో 5% పన్ను విధించడం వారిని శిక్షించడం, దోచుకోవడమే అవుతుంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న పేదరికం లేకుండా చేయడమనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్.డి.జి.) స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లవుతుంది. నగదు జమ చేసేందుకు రుసుములు మితిమీరితే జనం బ్యాంకులు, డిజిటల్ వ్యాలెట్ల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అని యత, క్రమరహిత మార్గాల వైపు మొగ్గు చూపవచ్చు. అటువంటి పద్ధతుల్లో మోసపోయే, దోపిడీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మహిళలకు ఆసరా కల్పించడమనే దృక్కోణం నుంచి చూసినా ట్రంప్ ప్రతిపాదన కల్లోలపరచేదిగానే ఉంది. ఎందుకంటే, విదేశాల నుంచి నగదు అందుకుంటున్నవారిలో మహిళలే ఎక్కువ. కుటుంబ పోషణకు, పిల్లల ఆలనాపాలనకు వారు ఆ మొత్తాలపైనే ఆధార పడుతున్నారు. నగదు జమలపై పన్ను విధిస్తే, వారి ఆర్థిక స్థితి గతులు, ప్రగతి బలహీనపడతాయి. ఇది ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న (స్త్రీ పురుష సమానత్వ) ఐదవ ఎస్.డి.డి. లక్ష్యాన్ని నీరుగారుస్తుంది. మహిళా సాధికారత వారి ఆర్థిక సౌలభ్యంపైన కూడా ఆధారపడి ఉంది. ఈ పన్ను దానికి కోత పెట్టేదిగా ఉంది. తక్కువ ఖర్చుతో, తక్షణం నగదు వేయడం, తీసుకోవడం వీలయ్యే సమీకృత చెల్లింపుల వ్యవస్థ (యు.పి.ఐ.) వంటివాటి ద్వారా భారతదేశంలో ఫైనాన్షియల్ సౌలభ్యం ఒక రకంగా ప్రజా స్వామికీకరణ చెందింది. ట్రంప్ వేయదలచిన పన్ను ఆ విజయాన్ని కూడా నీరుగారుస్తుంది. మరింత సమ్మిళిత, పరస్పరాశ్రిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన సిసలైన నవీకరణలను... డిజిటల్ జమలపై ఫెడరల్ పన్నును జోడించదలచిన ట్రంప్ చర్య నిర్వీర్యపరుస్తుంది. పేదరికం, అసమానత, వాతావరణ మార్పుపై పోరాటానికి బహుముఖ సహకారం ఎంతో అవసరమైన సమయంలో అటువంటి ఏకపక్ష చర్యలు, సొంత బాగు మాత్రమే చూసుకునే విధానాలు అంతర్జాతీయ సంఘీభావాన్ని సడలింపజేస్తాయి. జమలకు రుసుము వసూలు చేయకుండా చూడాలనే ప్రయ త్నాలను లాభాపేక్షతో నడిచే ఫైనాన్షియల్ సంస్థలు ప్రతిఘటిస్తు న్నాయి. పెద్ద మొత్తంలో జమలు చేసే దేశం శాసనపరమైన విద్రోహా నికి కూడా పాల్పడడం వలస కార్మికులకేకాక, అంతర్జాతీయ అభివృద్ధికే నమ్మకద్రోహం చేసినట్లవుతుంది. ఎస్.డి.జి.ల సాధనకు పెట్టుకున్న 2030 సంవత్సరపు గడువు సహాయానికో లేదా విధానానికో సంబంధించినది మాత్రమే కాదు. న్యాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నది. జమలపై పన్ను వేసే ఎటువంటి ప్రయత్నమైనా పేదలను దోచుకోవడమే అవుతుంది. భారతదేశంతోపాటు ప్రపంచంలోని పేద దేశాలన్నీ రాజకీయ దృఢ సంకల్పంతో దీన్ని ప్రతిఘటించాలి. జమలపై పన్ను వేయాలనే ట్రంప్ నిర్ణయం అనుచిత విధానమే కాదు, వలసవెళ్ళేవారి హక్కు లకు, మరింత సమానత, స్వావలంబన ఏర్పడాలనే ప్రపంచ దార్శని కతకు ప్రత్యక్ష ముప్పు.రెజిమన్ కుట్టప్పన్వ్యాసకర్త కార్మిక వలసల పరిశోధకుడు, ‘అన్ డాక్యుమెంటెడ్; స్టోరీస్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్స్ ఇన్ ది అరబ్ గల్ఫ్’ పుస్తక రచయిత ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
షెంజెన్ వీసా దరఖాస్తుల తిరస్కరణ
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశాల్లో 3 నుంచి ఆర్నెల్ల పాటు ఉండేందుకు వీలు కల్పించే షెంజెన్ వీసాలు భారతీయులకు నానాటికీ తగ్గుతున్నాయి. 2024లో 1.65 లక్షల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ జాబితాలో అల్జీరియా, టర్కీ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. దరఖాస్తు రుసుం రూపేణా మనవాళ్లు రూ.136.6 కోట్లు కోల్పోయారు. ఇండియా నుంచి 11.08 లక్షల మంది దరఖాస్తు చేయగా, ఇందులో 5.91 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందాయి. 1.65 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెంజెన్ వీసాతో యూరప్‌లోని 26 దేశాల్లో పర్యటించవచ్చు. -
ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్
న్యూఢిల్లీ: గడచిన నాలుగు దశాబ్ధాలలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు 20 వేల మందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి(United Nations)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన దరిమిలా పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఐక్యరాజ్య సమితిలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూయార్క్లోగల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నదని, అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించే వరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ఈ ఒప్పంద అంశాన్ని లేవనెత్తిన తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది. #IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 202565 ఏళ్ల క్రితం భారత్ సింధు జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని, అయితే పాకిస్తాన్ భారత్‌పై మూడు యుద్ధాలు జరిపి, లెక్కకుమించిన ఉగ్రవాద దాడులను చేయడం ద్వారా ఆ ఒప్పందపు స్ఫూర్తిని ఉల్లంఘించిందని హరీష్ పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ పాకిస్తాన్ విషయంలో అసాధారణ సహనం, ఉదారతను ప్రదర్శించిందని హరీష్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం -
భారత్‌ను చుట్టేస్తున్న... స్థూలకాయ సునామీ
న్యూఢిల్లీ: మిరపకాయ బజ్జీ. మైసూర్ బోండా. పిజ్జా. బర్గర్. ఇలా జంక్ ఫుడ్‌ను భారతీయులు మితిమీరి తింటున్నారట. ఫలితంగా జనాభాలో చాలామంది స్థూలకాయ సుడిగుండంలో చిక్కుతున్నారని ప్రఖ్యాత లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఈ సమస్య దేశాన్ని నిశ్శబ్ద సునామీలా చుట్టేస్తోందని ప్రమాదఘంటికలు మోగించింది. 2050కల్లా దేశంలో మూడోవంతు, అంటే 45 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడటం ఖాయమని ‘ది లాన్సెట్ ప్రాజెక్ట్స్’ పేరిట ప్రచురించిన అధ్యయనంలో కుండబద్దలు కొట్టింది. 22 కోట్ల మంది పురుషులు, 23 కోట్ల మంది స్త్రీలు సమస్య బారిన పడతారని అంచనా వేసింది. స్థూలకాయం వల్ల టైప్–2 మధుమేహం, గుండె, శ్వాసకోశ, కాలేయ, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం, క్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. సర్వాంతర్యామి స్థూలకాయం నగరాలు, అధికాదాయ కుటుంబాలకే పరిమితం కావడం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. మధుమేహ బాధితుల్లో భారతీయులే ఎక్కువని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. జనాభాలో 10 కోట్ల మందికి పైగా దాని బారిన పడ్డట్టు అంచనా. యుక్త వయసు్కల్లోనూ షుగర్ సమస్యలు పెరుగుతుండటం ఆందోళనకరమేనని అధ్యయనం పేర్కొంది. అధిక బరువే దీనికి మూలమని ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగ అదనపు అధ్యాపకుడు డాక్టర్ నీరజ్ నిశ్చల్ అన్నారు. ‘‘ఒబెసిటీ విజృంభణ భారత్‌లో వ్యాధుల ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. సమస్యకు వెంటనే పరిష్కారం వెతక్కపోతే ఆరోగ్య, ఆర్థిక రంగాలకు పెనుభారంగా మారుతుంది’’ అన్నారు. ‘‘ఒకప్పుడు వ్యక్తిగత సమస్య అయిన స్థూలకాయం ఇప్పుడు దేశ సమస్యగా మారుతోంది. స్కూళ్లు, కార్యాలయాల నుంచి ఆస్పత్రులదాకా అంతటా దీనిపై అవగాహన కలి్పంచాలి’’ అని సూచించారు. ‘‘స్థూలకాయం నిజంగానే నిశ్శబ్ద సునామీ. పైకి కనిపించకుండా దీర్థకాల సమస్యలకు దారితరరీస్తుంది. దీన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రకటించాలి. వ్యవస్థీకృత ప్రజారోగ్య సవాల్‌గా పరిగణించి సంస్థాగత స్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలి’’ అని గంగారాం ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మొహ్సిన్ వాలీ అన్నారు. ‘‘పోషకాహారంపై ప్రజలకు అవగాహన పెంచాలి. ఆహార పదార్థాల్లో పరిమితికి మించి కృత్రిమ పదార్థాల జోడింపు తదితరాలపై తనిఖీలు పెంచాలి. స్థూలకాయానికి ప్రభుత్వరంగ సంస్థలను జవాబుదారీగా చేయాలి’’ అన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. ‘‘ఒబెసిటీ దెబ్బకు భావి తరాల ఆయుర్దాయం బాగా తగ్గే ప్రమాదముంది. దేశ శ్రామికశక్తి సామర్థ్యాలను తగ్గించి ఆర్థికాభివృద్ధికి ఇది ప్రతిబంధకంగా మారుతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఒబెసిటీ రోగులకు, సాంక్రమణేతర వ్యాధి సంక్షోభానికి భారత్ ప్రపంచ కేంద్ర స్థానంగా మారడం ఖాయం’’ అని హెచ్చరిస్తున్నారు. -
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే, అజర్ బైజాన్లపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నారు. ఈ రెండు రోజుల్లోనే భారీ ఎత్తున బుకింగ్స్ రద్దయినట్లు నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్స్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలోనే పర్యాటకులు తరలివెళ్తారు. ఈ సంవత్సరం కూడా సుమారు లక్ష మందికి పైగా పర్యాటకులు తుర్కియే, అజర్బైజాన్ల సందర్శనకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు అంచనా. తుర్కియే, అజర్బైజాన్ దేశాల్లో అందమైన పర్యాటక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది కుటుంబాలతో సహా టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగానే ఈ రెండు దేశాల పర్యటనలను రద్దు చేసుకోవడం విశేషం. మరోవైపు ట్రావెల్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం తుర్కియే, అజర్బైజాన్ల బుకింగ్‌లను రద్దు చేయాలని అన్ని ప్రాంతాలకు చెందిన టూర్ ఆపరేటర్లకు సర్క్యూలర్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూర్ ఆపరేటర్లు తమ వద్దకు వచ్చే బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు నగరానికి చెందిన వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు హరికిషన్ తెలిపారు. రెండు, మూడు రోజులుగా నగరం నుంచి సుమారు 10 వేల మందికిపైగా పర్యాటకులు తమ టూర్లను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఆ రెండు దేశాలకే ఎందుకు.. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, మలేíÙయా, శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనలను ఎంపిక చేసుకుంటారు. కానీ కొంతకాలంగా తుర్కియే, అజర్‌బైజాన్‌లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్ టూర్లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆకట్టుకొనే అందమైన పార్కులు ఉన్నాయి. తుర్కియేలో కేవలం సినిమా షూటింగ్లకే కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే చారిత్రక ఇస్తాంబుల్ నగరం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న బ్లూ రివర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. హగీష్ సోఫియా చారిత్రక మ్యూజియం కూడా పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. పురాతన కట్టడాలు, కోటలు, గొప్ప ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన భవనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అజర్‌బైజాన్‌లోని పాతనగరం బాకు మరో ప్రముఖ పర్యాటక కేంద్రం. వందల సంవత్సరాల నాటి చారిత్రక, సాంస్కృతిక విశేషాలకు ఇది నిలయం. హైదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్, జొరాస్ట్రియన్ల చారిత్రక ఫైర్ టెంపుల్ వంటివి ఆకట్టుకొనే ప్రదేశాలు.షాపింగ్ సెంటర్.. మినీ చైనాగా పేరొందిన తుర్కియో నుంచి పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మార్బుల్స్, ఫర్నీచర్, యాపిల్స్ దిగుమతి ఎక్కువగా ఉంది. అలాగే ఈ దేశానికి వెళ్లిన పర్యాటకులు కూడా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలా షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇస్తాంబుల్‌లోని గ్రాండ్ బజార్ అతి పెద్ద స్ట్రీట్ మార్కెట్. సుమారు 4 వేలకుపైగా షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. దుస్తులు, ఆభరణాలు, టర్కి, పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్ లభిస్తాయి. అలాగే అంకారాలోని అంకామాల్, కెనెరాలోని ఆస్కార్బజార్ వంటి మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.ఉందిగా.. ప్రత్యామ్నాయం.. తుర్కియే, అజర్బైజాన్ టూర్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్న పర్యాటకులు ప్రత్యామ్నాయంగా వియత్నాం, దుబాయ్, మలేసియా, బ్యాంకాక్, ఇండోనేషియా తదితర దేశాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ‘ఆ రెండు దేశాల బుకింగ్స్ రద్దు చేసుకుంటున్న వారు ఎక్కువ మంది వియత్నాంను ఎంపిక చేసుకుంటున్నారు.’ కూకట్‌పల్లికి చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
భారతీయులకు ట్రంప్ మరో షాక్..
-
ఎన్నారైలపై ట్రంప్ మరో పిడుగు
మీరు అమెరికాలో ఉంటున్నారా? భారత్‌లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే ఇకపై మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండండి. అలా పంపే ప్రతి లక్ష రూపాయలకూ రూ.5 వేల చొప్పున ట్రంప్ ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు (Migrants) తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అమెరికా పౌరులు కానివారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రీన్‌కార్డుదారులతో పాటు హెచ్–1బీ, ఎఫ్–1 లేదా జే–1 తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ట్రంప్ దీనికి ‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్నారైల (NRIs) మద్దుతుదారుగా పేరున్న విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. అక్కడ, అనంతరం సెనేట్‌లో ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది. మనోళ్లకు పెద్ద దెబ్బ అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పై చిలుకే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్‌కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగులు చేసేవాళ్లు కూడా భారత్‌లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెలా టంచనుగా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు.రెమిటెన్స్ పన్ను (remittance tax) దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారకద్రక్య నిల్వలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. ‘‘భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్నారైలు సంపాదించే ప్రతి డాలర్‌పైనా 5 శాతం కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జూలైకి ముందే ముగించుకోవడం మేలు’’ అని సూచిస్తున్నారు.జీవనాధారంపై దెబ్బ రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులూ ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ‘‘పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి అద్దె, లేదా ఈఎంఐలు మొదలుకుని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్సులంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు. లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై రెమిటెన్సులపై బాగా ఆధారపడే మన రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని చెబుతున్నారు.రెమిటెన్సుల్లో భారతే టాప్ → ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు వచ్చేది భారత్‌కే. → 2024లో వాటి మొత్తం ఏకంగా 130 బిలియన్ డాలర్లు! అంటే దాదాపు రూ.10.7 లక్షల కోట్లు. → అందులో 28 శాతం, అంటే రూ.3 లక్షల కోట్ల (32 బిలియన్ డాలర్ల) మేరకు వాటా భారత అమెరికన్లదే. → ఆ లెక్కన 5 శాతం రెమిటెన్సు పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్నారైల మీదే అప్పనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది! అక్రమ పన్నే! రెమిటెన్స్ పన్ను విధింపు చట్టారీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ‘‘ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకోర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి’’ అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమొక్రాట్ సభ్యులు కాంగ్రెస్‌లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో ఎన్ఆర్ఐలే మా టార్గెట్
సాక్షి, హైదరాబాద్ : ‘అమెరికాలో స్థిరపడిన భారతీయులనే మేం టార్గెట్ చేయాలి. ముందుగా గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల నుంచి అందమైన యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకొని.. ఆ ఫొటోలు ప్రొఫైల్‌గా పెట్టుకొని ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు తెరవాలి. వాటి ద్వారా అమెరికాలోని భారతీయులను టార్గెట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాలి. ఆ తర్వాత వారితో ఆన్లైన్లో అమ్మాయిల్లా పరిచయం పెంచుకోవాలి. తర్వాత వారితో సెక్స్ అంశాలపై చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దింపాలి. నమ్మకం కుదిరిన తర్వాత వారితో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే చాలా లాభాలు వస్తాయని, చైనా సైబర్ ముఠాలు తయారు చేసిన ఫేక్ వెబ్సైట్లో పెట్టుబడి పెట్టించాలి. తర్వాత ట్యాక్స్‌లు, ఇతర పేర్లతో అందినకాడికి దోచుకోవాలి. ఇలా చేయడానికి మాకు 15 రోజులు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉంటుంది’అని లావోస్‌లో సైబర్ ముఠాల చేతిలో చిక్కిన బాధితుడు నగరంలోని సైదాబాద్ మాదన్నపేటకు చెందిన రహ్మత్‌ఖాన్ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు వివరించారు. తన పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న కశ్మీర్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఆషిఖీబాబా, లావోస్‌లో టెలికాలర్ ఉద్యోగం పేరిట మోసగించి గతేడాది డిసెంబర్ 23న బ్యాంకాక్ పంపినట్టు తెలిపారు. తనను మోసగించిన ఆషిఖీబాబాపై టీజీసీఎస్బీలో ఫిర్యాదు చేశారు. మంగళవారం కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేను టార్గెట్ చేరుకోలేదని జీతం ఇవ్వలేదు రహ్మత్‌ఖాన్ ఆ ముఠా తనను ఎలా హింసించారన్నది ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నాడు. ‘నేను ఇండియా నుంచి బ్యాంకాక్ వెళ్లిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో బెల్ అనే ఇథోఫియన్ నన్ను రిసీవ్ చేసుకున్నాడు. పదకొండు గంటలపాటు బస్సు ప్రయాణం తర్వాత మేం లావోస్ చేరుకున్నాం. అక్కడ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్‌కి వెళ్లాం. అక్కడ చైనావారు నడుపుతున్న ఒక సైబర్ కంపెనీలో ఉద్యోగం పేరిట కాంట్రాక్ట్ మీద సంతకాలు తీసుకున్నారు. తర్వాత నా పాస్‌పోర్టు, ఫోన్ తీసుకున్నారు. నాకు సైబర్‌మోసాలపై 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత అందమైన యువతుల ఫొటోలు సేకరించే పని అప్పగించారు. తర్వాత ఎన్ఆర్ఐలను మోసగించాలని చెప్పారు. వారు చెప్పిన టార్గెట్ రీచ్ కాలేదని నన్ను చిత్రహింసలు పెట్టడంతోపాటు నాకు మూడు నెలలపాటు వేతనం కూడా ఇవ్వలేదు. ఎలాగోలా నేను అక్కడి నుంచి స్థానికుల సాయంతో తప్పించుకొని లావోస్ ఎంబసీకి, అటు నుంచి ఇండియన్ ఎంబసీకి చేరుకున్నా. ఎంబసీ అధికారులు నాకు ఎమర్జెన్సీ పాస్‌పోర్టు ఇచ్చి ఇండియాకు పంపారు. నన్ను మోసగించి సైబర్ ముఠాలకు అప్పగించిన ఏజెంట్ ఆషిఖీబాబాపై చర్యలు తీసుకోండి’అని బాధితుడు కోరారు. -
భారతీయుల రూటే.. సపరేటు
సాక్షి, అమరావతి : ఋగ్వేదంలోనే యోగా గురించి ప్రస్తావించాం. సింధు లోయ నాగరికతలోనే టాయిలెట్లను వినియోగించాం. గూస్బెర్రీ వంటి మొక్కల సారాన్ని వినియోగించి షాంపూలు తయారు చేశాం.. ‘సున్నా’కు విలువ కనిపెట్టి ప్రపంచానికి అందించాం. ఇలా విశ్వజగతికి భారతీయులు ఆది నుంచి నాయకులుగానే పరిచయమయ్యారు. నేటికీ అదే విధంగా ఉండేందుకు, గ్లోబల్ లీడర్లుగా పిలిపించుకునేందుకు భారతీయులు ఇష్టపడుతున్నారు. అందుకోసమే కష్టాన్నీ సంతోషంగా స్వీకరిస్తున్నారు. ప్రపంచ ప్రముఖ కార్యనిర్వాహక పరిశోధన సంస్థ అయిన అమ్రోప్ నిర్వహించిన అధ్యయనంలో భారత్ ప్రజల తాజా మనోగతం ఆవిష్కృతమైంది. గ్లోబల్ సౌత్ దేశాలైన భారత్, చైనా, బ్రెజిల్‌తోపాటు పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్‌లో పని వైఖరిపై అమ్రోప్ తాజాగా అధ్యయనం జరిపింది. కష్టించి పనిచేయడం వల్లనే గుర్తింపు లభిస్తుందని, జీవితం సంతృప్తికరంగా ఉంటుందని, ఆశయం నెరవేరుతుందని భారతీయులు నమ్ముతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో 20 ఏళ్లు నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల బ్యాచిలర్ డిగ్రీ, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న 8 వేల మంది నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి దేశం నుంచి వెయ్యి మంది సర్వేలో పాల్గొన్నారు. అధ్యయనంలోని ముఖ్యాంశాలు:» భారతీయుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. 92 శాతం మంది పని చేయడంలోనే సంతోషం ఉందని అంటున్నారు. » 73% మంది మంచి ఉద్యోగం, జీవితం ఉండాలని కోరుకుంటున్నారు. »75% మంది కష్టపడి పనిచేయడం సాధారణంగా మనిషి ధర్మమని నమ్ముతున్నారు.» 42% మంది వారానికి 40 గంటలకు మించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్రాన్స్‌లో 16 శాతంగా ఉంది.» 76 శాతం మంది భారతీయ నిపుణులు ఒక కంపెనీని నడిపించాలని లేదా తామే సొంతంగా ఒక సంస్థను నిర్వహించాలని కోరుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారు 36% కాగా, అమెరికాలో 49% మంది ఉన్నారు. » తామేంటో నిరూపించుకునేలా పనిచేయాలని 73% మంది భారతీయులు అనుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారి సంఖ్య 41 శాతం మాత్రమే ఉంది. »మన దేశంలో 84 శాతం మందికి చదువు, వ్యాపారం, ఉద్యోగం వంటి మంచి కెరీర్ ముఖ్యంగా భావిస్తున్నారు. »పాశ్చాత్య దేశాల్లో మాత్రం 62% మంది తాము కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొనడం గమనార్హం. » రాజకీయ నాయకుడిగా ఉండేందుకు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ఇష్టపడటం లేదు. -
ఆపరేషన్ సిందూర్ పై భారతీయుల రియాక్షన్
-
అతిథుల్లా వ్యవహరించలేదో..గ్రీన్‌కార్డ్ కోల్పోతారు
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వలస విధానాలు భారతీయులతో సహా అమెరికాలోని వేలాది మంది గ్రీన్‌కార్డు హోల్డర్లలో గుబులు రేపుతున్నాయి. వలసదారులు అమెరికాలో అతిథుల్లా ప్రవర్తించాలని ట్రంప్ సర్కారు తాజాగా హితవు పలికింది. ‘‘లేదంటే గ్రీన్‌కార్డ్ కోల్పోతారు. అంతేకాదు, దేశం నుంచి బహిష్కరణకు గురవుతారు’’అంటూ హెచ్చరించింది. గ్రీన్‌కార్డుదారులు అమెరికా చట్టాలు, విలువలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. శాశ్వత నివాస హక్కు రద్దుకు దారితీసే కారణాల జాబితాను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) విడుదల చసింది. విదేశీయులు చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డులు, వీసాలు రద్దు చేస్తామని తెలిపింది. ‘‘అమెరికా చట్టాలను, విలువలను గౌరవించాలి. హింసను సమర్థిస్తే, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తే, అలా చేయాల్సిందిగా ఇతరులను ప్రోత్సహిస్తే అమెరికాలో ఉండటానికి అర్హులు కాదు. గ్రీన్‌కార్డుదారులను కూడా కఠినంగా తనిఖీ చేయడానికి ఏజెన్సీలకు అధికారముంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీతో కలిసి దీనిపై నిరంతరం పనిచేస్తున్నాం. అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దడానికి ఈ అప్రమత్తత చాలా అవసరం’’అని యూఎస్సీఐఎస్ పేర్కొంది. ఈ విధానాలను ప్రకటించిన అనంతరం విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అమెరికా ఔదార్యాన్ని దురి్వనియోగం చేసే శకం ముగిసిందన్నారు. ట్రంప్ సర్కారు తాజా హెచ్చరికలు గ్రీన్కార్డ్దారుల్లో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అమెరికాలోని భారతీయులకు అక్కడ గ్రీన్‌కార్డ్, శాశ్వత నివాసం పొందడం ఇప్పటికే క్లిష్టంగా మారింది. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం ఏకంగా 50 ఏళ్లు, అంతకు మించి ఎదురు చూడాల్సిన పరిస్థితి! తీరా శాశ్వత నివాసాన్ని పొందినా అమెరికాలో భవిష్యత్తుకు భద్రత లేదని, చిన్న పొరపాటు చేసినా దేశ బహిష్కారానికి దారి తీయొచ్చని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి. పాత నిబంధనల ప్రకారం వీసా రద్దు తదితరాల విషయంలో వలసదారులకు చట్టపరమైన రక్షణ ఉంది. కొత్త విధానంలో దాన్ని తొలగించారు. అప్పీల్ కూడా లేకుండా వీసా రద్దుకు, బహిష్కరణకు వీలు కల్పించారు. -
ఏఐనా.. అంటే..
సాక్షి, స్పెషల్ డెస్క్: ఓవైపు అగ్ర దేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విస్తృతంగా కొనసాగుతుంటే ఆ దేశాలతో అన్ని రంగాల్లో పోటీపడుతున్న భారత్ మాత్రం ఏఐని అందిపుచ్చుకోవడంలో ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఏకంగా 60% మంది భారతీయులకు ఏఐ గురించి తెలియదని టెక్నాలజీ దిగ్గజం గూగుల్, మార్కెట్ పరిశోధన సంస్థ కాంటార్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో కేవలం 31% మందే జనరేటివ్ ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారు.జీవితాల మెరుగుదల కోసం.. అత్యధికులకు ఇప్పటికీ ఏఐ గురించి తెలియకపోయినా తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఏఐ వంటి సాధనాలను ఉపయోగించాలనే కోరిక ఎక్కువ మందిలో ఉంది. మరింత ఉత్పాదకత పొందాలని 72% మంది, సృజనాత్మకతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని 77% మంది, మరింత సమర్థంగా సమాచారాన్ని తెలియజేయాలని 73% మంది చూస్తున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రాణించడానికి సహాయపడే సాధనాన్ని 75 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రారంభించడమూ తెలియదు.. పనిప్రదేశం లేదా తరగతి గదికి మించి భారతీయులు రోజువారీ పనుల్లో కూడా సహాయం కోసం ఆసక్తిగా ఉన్నారు. ప్రయాణ ప్రణాళిక నుంచి బడ్జెట్లను నిర్వహించడం వరకు 76% మంది తమ సమయం ఆదా చేయడంలో సహాయం కోరుకుంటున్నారు. పిల్లలకు హోంవర్క్‌లో చేదోడు లేదా వంట వంటి కొత్త అభిరుచులను అన్వేషించడం.. ఇలా రోజువారీ జీవితంలో మరింత సృజనాత్మకంగా ఉండాలని 84% మంది ఆశిస్తున్నారు. ఏఐ వినియోగంలో చాలా మంది నిరంతర అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఏఐని ఎలా ప్రారంభించాలో 68% మందికి తెలియడంలేదు. అందుకు నైపుణ్యం లేదా మార్గదర్శకత్వం లేకపోవడాన్ని 52% మంది ఉదహరిస్తున్నారు. అటువంటి అడ్డంకుల కారణంగా వృత్తిపరమైన లేదా సృజనాత్మక ఆకాంక్షను వదులుకున్నామని 61% మంది చెప్పారు. మార్పు తెచ్చిన జెమినై..తమ ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినైని మొదటగా స్వీకరించినవారు ఇప్పటికే గణనీయంగా ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారని గూగుల్ తెలిపింది. దేశంలోని 92% జెమినై వినియోగదారుల విశ్వాసాన్ని ఈ సాధనం మెరుగుపరిచిందని వెల్లడించింది. ముఖ్యంగా జనరేషన్ జెడ్ (94%), విద్యార్థులు (95%), మహిళల్లో (94%) జెమినై అధిక ప్రభావం ఉందని వివరించింది. ఏఐ వినియోగం 93% మంది వినియోగదార్ల ఉత్పాదకతను పెంచిందని తెలిపింది. సృజనాత్మకంగా ఆలోచించడంలో 85% మందికి సహాయపడిందని గూగుల్ వివరించింది. గూగుల్–కాంటార్ తాజా అధ్యయనం.. -
పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే?
లాహోర్: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు.. పాకిస్తాన్ నుంచి స్వదేశం చేరుకుంటున్నారు. మూడు రోజుల్లో 450 మందికి పైగా భారతీయులు పాక్‌ను వీడారు. వాఘా సరి హద్దు గుండా వారంతా భారత్‌కు చేరుకున్నారు. శనివారం పాక్‌ను వీడిన వారిలో పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) 2025 ప్రసార సంస్థలో భాగమైన 23 మంది భారతీయులు ఉన్నారని పాక్ అధికారులు తెలిపారు. శుక్రవారం 300 మంది, గురువారం 100 మంది భారతీయులు ఇదే మార్గంలో స్వదేశానికి తిరిగి వెళ్లారని వెల్లడించారు. ఇక 200 మంది పాకిస్తానీయులు భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్లో దీర్ఘకాలిక వీసాలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), ‘రిటర్న్ టు ఇండియా’ స్టాంపులు ఉన్నవారు సరిహద్దు దాటడానికి అధికారులు నిరాకరించారు.మరోవైపు సిక్కు కుటుంబాలతో సహా కొందరు భారత సంతతి కి చెందిన విదేశీయులను భారత ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు పాకిస్తాన్లోకి ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. లాహోర్‌కు 80 కిలోమీ టర్ల దూరంలోని నాన్కానా సాహిబ్‌లో నివసి స్తున్న భారత సంతతికి చెందిన కెనడియన్ సిక్కు కుటుంబం వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. దుబాయ్ మీదుగా విమాన మార్గం గుండా ప్రయాణించాలని సూచించారు.అటారీ–వాఘా సరిహద్దు మూసివేత.. ఆగిపోయిన బ్యాండ్, బాజా, బరాత్..!భారత్, పాకిస్తాన్ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవస్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్ సింగ్ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు.‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్ సింగ్ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్ పోస్ట్ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్పుట్ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. -
ఆరోగ్య బీమా అంతంతే..
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో భారతీయులు వెనకడుగు వేస్తున్నారు. ఆరోగ్య బీమా గురించి 83 శాతం మందికి అవగాహన ఉన్నా.. 23 శాతం మంది మాత్రమే హెల్త్ పాలసీలు తీసుకున్నారు. ఆరోగ్య బీమా లేని భారతీయుల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది అనూహ్యంగా ఎదురయ్యే జీవన, ఆరోగ్య సంక్షోభాల వాస్తవ ఖర్చులపై ముందుచూపు లేక ఇబ్బందులు పడుతున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ వంటివి లేనివారిలో 87 శాతం మంది ఆర్థికంగా పడబోయే భారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. 13 శాతం మంది మాత్రమే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ అవసరాలను గుర్తిస్తున్నట్లు ‘హౌ ఇండియా బైస్ ఇన్సూరెన్స్ 2.0’పేరిట ‘పాలసీ బజార్ డాట్‌కామ్’సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు» భారతీయులు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు,ఆకస్మిక ఖర్చులను భరించేందుకు సిద్ధంగా లేరు. » దేశ జనాభాలో ఆరోగ్య బీమా లేనివారే అధికం. పాలసీదారుల్లోనూ సుమారు 75 శాతం మంది రూ.10 లక్షల కంటే తక్కువ కవరేజీ ఉన్నవారే. 48 శాతం మంది రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ కవరేజీతో సరిపెట్టుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ఇక్కడ 66 శాతం పాలసీదారులు రూ 5 లక్షల అంతకంటే తక్కువ కవరేజీ కలిగి ఉన్నారు. » పాలసీదారుల్లో 51 శాతం మంది క్యాన్సర్, కిడ్నీ మారి్పడి, గుండె జబ్బుల చికిత్సల ఖర్చు రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటుందనిభావిస్తున్నారు. 47.6 శాతం భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ప్రయోజనాల గురించి తెలియదు. » ఇప్పటికీ బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా సంబంధిత పొదుపు పథకాలు, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయ పెట్టుబడులు ఆధిపత్యం వహిస్తున్నాయి. » బీమా తీసుకోనివారిలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేకపోవడం ఆందోళనకరంగా మారింది. » చాలామంది తమ కుటుంబ అవసరాలను అంచనా వేసేటప్పుడు పిల్లల విద్య, వివాహం, రుణ బాధ్యతలు, జీవిత భాగస్వామి పదవీ విరమణ, ఆకస్మిక వైద్య ఖర్చుల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు.అవగాహన పెంచుతున్నాంఈ నివేదికఆధారంగా ప్రజల్లో ఆరోగ్య బీమాపైఅవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర చికిత్సలతో ఆర్థిక సంక్షోభం ఎదురైనపుడు ఆస్తులను అమ్మటం, అప్పు చేయటానికి బదులు ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోవటంమంచిది. అందరికీ ఆర్థిక భద్రత ఏర్పడేలా పాలసీలు, ఇతరత్రా సలహాల ద్వారా కష్టమర్లకు ప్రయోజనం కలిగేలా చూడాల్సిఉంది. – సర్బ్వీర్ సింగ్,జాయింట్ గ్రూప్ సీఈఓ, పీబీ ఫిన్‌టెక్. -
పెరుగుతున్న మత సమ్మతి
దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి. ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.పెరుగుతున్న భక్తిమతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ యాటిట్యూడ్’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది. లాభదాయక వ్యాపారంగుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్ కబీర్ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను. కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తోంది. సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్ స్క్వేర్ , చైనా తియనాన్మెన్లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?బహిరంగ సమర్థనా?మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్లాల్ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు. అయితే ఆమె మనవడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్ రహీం సింగ్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు. అంతకు ముందు ఏడాది మోదీ కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్నాథ్ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్ షరీఫ్ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్ ఖాన్ కోక్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత- mohanguru@gmail.com -
టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్. -
గుడ్ న్యూస్ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు
ఆంక్షలు, టారిఫ్‌లు అంటూ ప్రపంచ దేశాలను ముఖ్యంగా చైనాకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దీంతో చైనా ఇండియాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో తాజాగా చైనా (China) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు, భారతీయులకు 85 వేల వీసాల(China Visas)ను జారీ చేసినట్లు చెప్పింది. చైనా రాయబారి జు ఫీహాంగ్ ఎక్స్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారతీయ సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, చైనా అనేక వీసా సడలింపులను ప్రవేశపెట్టింది.ఇండియా-చైనా దేశాల మధ్య ఏర్పడుతున్న దృఢమైన బంధానికి ఇది నిదర్ణమని స్పష్టం చేసింది. చైనాకు వస్తున్నన్న 85 వేల ఇండియన్లకు వీసాలు ఇచ్చినట్లు జూ ఫీహంగ్ తెలిపారు. తమన దేశంలో పర్యటించాల్సిందిగా ఎక్కువ మంది భారతీయ మిత్రులను కోరుతున్నట్లు వెల్లడించారు. భారత్, చైనా మద్య ట్రావెల్‌ను ఈజీ చేసేందుకు అనేక సదుపాయాలు కల్పించినట్లు చైనీస్ ప్రభుత్వం చెప్పింది.చదవండి: అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!అంతేకాదు వీసాకోసం దరఖాస్తుదారులు ఇకపై ఆన్లైన్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవలసిన అవసరం లేదనీ, ఇప్పుడు పని దినాలలో వీసా కేంద్రాలలోకి నేరుగా తమ దరఖాస్తులను అందచేయ వచ్చని కూడా చైనా ప్రకటించింది. చాలా తక్కువ టైం కోసం చైనా వెళ్లే వారు బయోమెట్రిక్ డేటాను సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది అలాగే చాలా తక్కువ ధరకే చైనా వీసాను అందిస్తున్నట్లు చెప్పారు. కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సాంస్కృతిక, వ్యాపార విద్యా సంబంధాలను విస్తృతం చేయడానికి రెండు దేశాలు ప్రయత్నాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! -
మనోళ్లపై మరో పిడుగు
ట్రంప్ సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డులు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ–5) అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్‌ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్‌లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు! నెలవారీ బులెటిన్‌లో విదేశాంగ శాఖ పేర్కొనే ‘తుది కార్యాచరణ తేదీ’లు చాలా కీలకం. వీసా/గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ–5 కటాఫ్‌ను మార్చకపోవడం విశేషం. ఏమిటీ ఈబీ–5 కేటగిరీ? అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ, హెచ్చు నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ–5 కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దాంతో అందుబాటులో ఉండే వీసాల తగ్గిపోతోంది. భారతీయులకు ఈబీ–5 కటాఫ్ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలోని భారతీయులపై ట్రంప్ తెంపరితనం
-
టారిఫ్‌లకు బ్రేక్‌తో భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రతీకార టారిఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేయాలన్న అమెరికా నిర్ణయంతో దేశీ ఎగుమతిదార్లకు భారీగా ఊరట లభించింది. దీనితో భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చల పురోగతికి మరికాస్త వెసులుబాటు లభిస్తుందని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. ఒప్పందంపై దౌత్యపరంగా సంప్రదింపులు జరపడం, చర్చలను వేగవంతం చేయడం ద్వారా టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు భారత్‌కు వీలవుతుందని వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే దిశగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలి విడత చర్చలు ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్‌లో ముగిసే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశీ పరిశ్రమలకు రిసు్కలు ఉన్నందున దీన్ని కుదుర్చుకునే విషయంలో భారత్ పునరాలోచన చేయాలని భారత్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. ఒప్పందం ప్రకారం భారత్‌లో రైతులకు కనీస మద్దతు ధరను తొలగించడం, జన్యుపరమైన మార్పులు చేసిన ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం, వ్యవసాయ టారిఫ్‌లను తగ్గించడం మొదలైన గొంతెమ్మ కోర్కెలన్నీ అమెరికా కోరుతోందని పేర్కొంది. ఇలాంటివి అమలు చేస్తే రైతుల ఆదాయాలకు, ఆ హార భద్రతకు, జీవవైవిధ్యానికి, చిన్న రిటైలర్ల మనుగడకు రిస్కులు తప్పవని అభిప్రాయపడింది. కార్లులాంటివి మినహాయించి 90% దిగుమతులపై ఇరువైపులా సున్నా స్థాయి టారిఫ్‌లతో డీల్‌ను భారత్ ప్రతిపాదించవచ్చని పేర్కొంది. -
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్‌కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్‌కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్‌కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్‌కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరీ ఇంత మతిమరుపా!
ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్. రోజంతా కష్టపడి షాపింగ్ చేశాక ఇంటికొచ్చే దారిలో పెళ్లి చీర. కష్టించి సంపాదించిన డ బ్బుతో కొన్న బంగారు బిస్కెట్. ఇలాంటివన్నీ క్యాబ్‌లో మర్చిపోతే! అంత విలు వైన వస్తువులు ఎవరైనా మర్చిపోతా రా అని కొట్టిపారేయకండి. భారతీయులు ఉబర్ క్యాబ్‌ల్లో మర్చిపోయిన వస్తువుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఉబెర్ 9వ ‘లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్’విడుదల చేసిన గణాంకాల్లో ఇ వన్నీ ఉన్నాయి. భార త్లో అత్యంత మతిమరుపు నగరంగా ముంబై నిలిచిందని నివేదిక తేల్చింది. బ్యాగులు, పర్సులు, తాళాలు, కళ్లద్దాలు, ఇయర్ ఫోన్స్ వంటివాటిని మర్చిపోవడం పరిపాటే. కానీ కొందరు మాత్రం మతిమరుపును మరో లెవల్‌కు తీసుకెళ్లారు. వీల్ చైర్, 25 కిలోల నెయ్యి డబ్బా, యజ్ఞకుండం, పెళ్లి చీర, బంగారు బిస్కెట్ల వంటివాటిని కూడా క్యాబ్‌లో మర్చిపోయారు. వినియోగదారులు కోల్పోయిన వస్తువులను గుర్తించే ఇన్–యాప్ ద్వారా ఆయా వస్తువులను ఉబర్ వారికి తిరిగి చేర్చిందన్నది వేరే విషయం. 2024లో అత్యంత ’మతిమరుపు’ నగరాల జాబితాలో ముంబై తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యధిక ‘మతిమరుపు’నగరాల్లో పుణే, బెంగళూరు, కోల్‌కతా కూడా ఉన్నాయి. హైదరాబాద్ మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రయాణికులు వస్తువులను మర్చిపోయింది చాలా తక్కువట. 2024లో అత్యధిక మతిమరుపు రోజులు→ ఆగస్టు 3 (శనివారం, శివరాత్రి), సెపె్టంబర్ 28 (శనివారం), మే 10 (శుక్రవారం, అక్షయ తృతీయ) మరిచిన టాప్ 10 వస్తువులు → బ్యాక్ ప్యాక్/బ్యాగ్, ఇయర్ ఫోన్స్/స్పీకర్, ఫోన్, వాలెట్/పర్స్, కళ్లద్దాలు/సన్ గ్లాసెస్, తాళంచెవులు, బట్టలు, లాప్టాప్, వాటర్ బాటిల్, పాస్‌పోర్ట్ మర్చిపోయిన అరుదైన వస్తువులు→ విగ్, టెలిస్కోప్, గ్యాస్ బర్నర్ స్టవ్, 25 కిలోల నెయ్యి, వీల్‌చైర్, పిల్లనగ్రోవి, పెళ్లి చీర, గోల్డ్ బిస్కెట్, కుక్కలు మొరగకుండా నియంత్రించే పరికరం, యజ్ఞకుండం శనివారం జాగ్రత్త శనివారం ప్రయాణాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండండి. వారంలో అత్యంత మతిమరుపు రోజు ఇదేనని ఉబర్ నివేదిక తేల్చింది. అందులోనూ శనివారం సాయంత్రాలు మతిమరుపు పీక్స్‌లో ఉంటోందట. ప్రయాణికులు అత్యధికంగా వస్తువులను క్యాబ్‌ల్లో మర్చిపోయింది ఆ రోజే. ఈ విషయంలో పండగ రోజులూ తక్కువేమీ కాదు. పర్వదినాల్లో కూడా ప్రయాణికులు ఉబర్‌లో అత్యధికంగా వస్తువులు మరిచిపోయారు. ‘‘మర్చిపోయిన వస్తువులను సులభంగా తిరిగి పొందేందుకు ఉబర్ క్యాబ్‌ల్లో ఇన్–యాప్ ఆప్షన్ ఇచ్చాం. అయినా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి’’అని ఉబర్ ఇండియా దక్షిణాసియా కన్జ్యూమర్ అండ్ గ్రోత్ డైరెక్టర్ శివ శైలేంద్రన్ సూచించారు. వస్తవులన్నింటినీ ఒకే బ్యాగ్‌లో వేసుకోవడం, క్యాబ్ దిగేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మేలని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్‌లో వైశాఖీ ఉత్సవం.. 6,500 భారతీయులకు వీసాలు జారీ
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్తంభించినప్పటికీ, ఇరు దేశాల మధ్య మతపరమైన పర్యాటక యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ తమ దేశంలో జరిగే వైశాఖీ ఉత్సవాలకు భారత్ నుంచి హాజరయ్యే 6,500 మందికి పైగా సిక్కు యాత్రికులకు వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.పాకిస్తాన్లో వైశాఖీ ఉత్సవాలు ఏప్రిల్ 10 నుండి 19 వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా పాక్‌కు వచ్చే యాత్రికులు గురుద్వారా పంజా సాహిబ్, గురుద్వారా నన్కానా సాహిబ్, గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌లను సందర్శించనున్నారు. తాజాగా పాకిస్తాన్ హై కమిషన్‌లోని ఛార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వరైచ్ మీడియాతో మాట్లాడుతూ ‘పాకిస్తాన్ ప్రభుత్వం అధిక సంఖ్యలో జారీ చేసిన వీసాలు ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, సంస్కృతులు, మతాల మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయని, పాకిస్తాన్ ఇలాంటి పవిత్ర స్థలాల సందర్శనలను భవిష్యత్తులో కూడా సులభతరం చేస్తుంటుందని’ తెలిపారు. ఈ యాత్రలు 1974లో రూపొందిన ‘పాకిస్తాన్-ఇండియా ప్రోటోకాల్ ఆన్ విజిట్స్ టు రిలీజియస్ ష్రైన్స్’ ఒప్పందం ప్రకారం జరుగుతున్నాయి.ఎవాక్యూఈ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీబీపీ) ప్రతినిధి సైఫుల్లా ఖోఖర్ మాట్లాడుతూ గడచిన 50 ఏళ్లలో ఈ ఒప్పందం ప్రకారం నిర్దేశించిన 3,000 వీసాల పరిమితిని మించి అదనపు వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారన్నారు. ఈటీపీబీ ఆధ్వర్యంలో వైశాఖీ ఉత్సవాల ప్రధాన ఘట్టం ఏప్రిల్ 14న నన్కానా సాహిబ్‌లోని గురుద్వారా జన్మస్థాన్‌లో జరగనుందని తెలిపారు. సిక్కులకు పాకిస్తాన్ రెండవ ఇల్లు లాంటిదని, తాము ఇక్కడికి వచ్చే అతిథులను హృదయపూర్వకంగా స్వాగతించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో వైశాఖీ ప్రధాన కార్యక్రమం హసన్ అబ్దాల్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌లో జరిగేది. అయితే ఈసారి యాత్రికుల సంఖ్య పెరగడం వల్ల నన్కానా సాహిబ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.ఇది కూడా చదవండి: 26/11 మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా రాక.. ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు? -
‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత దానగుణం కలిగిన వ్యక్తిగా పేరొందిన బిల్ గేట్స్(Bill Gates) భారతీయ యువతకు అమూల్యమైన సలహా అందించారు. ‘ప్రయాణాలు చేయండి.. మీకు ఉన్నటువంటి అవకాశాలను పొందలేనివారిని చూసి, పరిస్థితులను అర్థం చేసుకోండి’ అని బిల్‌గేట్స్ అన్నారు. ఈ మాటను అనుసరించే యువతీయువకులు వారి దృక్పథాన్ని విస్తృతం చేసుకుంటుంటారని, ప్రపంచంలోని విభిన్న జీవన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారనే భావనతో బిల్‌గేట్స్ ఈ సూచన చేశారు.భారతదేశంలోని యువతను ఉద్దేశిస్తూ బిల్‌గేట్స్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినదాని ప్రకారం ప్రయాణం చేయడం ద్వారా యువత వివిధ సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులు(Financial conditions), సామాజిక వాస్తవాలను దగ్గరగా చూడగలుగుతుంది. ఇది వారిలో సానుభూతి, అవగాహన, బాధ్యతను పెంపొందిస్తుందని బిల్‌గేట్స్ భావించారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో యువతకు అవకాశాలు అసమానతలతో కూడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దానిని అర్థం చేసుకుంటే వారు జీవితంలో, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి దోహదపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.గేట్స్ ఈ సందర్భంగా భారతదేశం(India)లో జరుగుతున్న వేగవంతమైన ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధిని ప్రశంసించారు. అయితే ఈ పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో లేదని, యువత దానిని గుర్తించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించడం ద్వారా యువత తమకంటే తక్కువ అవకాశాలు కలిగిన వారి జీవితాలను చూసి, వారికి సహాయం చేయడానికి లేదా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణ పొందుతుందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.గేట్స్ తరచూ విద్య, ఆరోగ్యంతో పాటు సమాజంలోని అసమానతలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంటారు. భారతదేశంలోని యువత, దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారాల కోసం కృషి చేయాలని గేట్స్ సూచించారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఈ సలహా భారతీయ యువత విజయం సాధించేందుకు, వారు సమాజంలోని ఇతరుల జీవన స్థితిగతులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తరచూ బీహార్‌కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా.. -
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తుర్కియేలో చిక్కుకున్న భారతీయులు
లండన్ నుంచి ముంబై వెళ్తున్న ‘వర్జిన్ అట్లాంటిక్’ విమానం తుర్కియేలోని దియార్బాకిర్ ఎయిర్పోర్ట్ (డీఐవై)లో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.తుర్కియేలో ఒక మారుమూల విమానాశ్రయంలో బుధవారం రాత్రి నుంచి 200 మందికి పైగా భారత ప్రయాణికులు 16 గంటలకుపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రయాణికులు తిరిగి వారు ఎప్పుడు గమ్యస్థానం చేరతారనే దానిపై విమానయాన సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. వీలైనంత త్వరగా రవాణా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ప్రయాణికులు కోరారు. -
బ్యాకప్‌లో మనమే అప్
సాక్షి, హైదరాబాద్: మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు.. చివరికి సాధారణ వ్యక్తులకు కూడా నేడు డిజిటల్ డేటా కీలకంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో మన సమాచారం చోరీ చేసినా, రాన్సమ్వేర్ ఎటాక్‌లతో తస్కరించినా ప్రమాదమే. ఇందుకు ఏకైక పరిష్కారం డేటా బ్యాకప్ చేసుకోవడమే. డేటా బ్యాకప్‌లో భారతీయులు ముందంజలో ఉంటున్నట్టు వెస్ట్రన్ డిజిటల్ సంస్థ సర్వే వెల్లడించింది. డేటా బ్యాకప్‌కు సంబంధించి ఈ సంస్థ ఇటీవల పలు దేశాల్లో సర్వే నిర్వహించింది. అత్యధికంగా భారతీయులే డేటా బ్యాకప్ చేస్తున్నట్టు సర్వేలో తేలింది. నివేదికలోని ముఖ్యాంశాలు» అత్యధికంగా 30% మంది భారతీయులు నిత్యం తమ డేటా బ్యాకప్ చేసుకుంటున్నారు. తర్వాత స్థానంలో అమెరికా 27%, బ్రిటన్ 23 శాతంతో నిలిచాయి. » భారతీయుల్లో 77%మంది డేటా బ్యాకప్ కోసం తాము క్లౌడ్ స్టోరేజీని వాడుతున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మొబైల్ (ఇతర డివైజ్) పాడవడంతో లేదా అనుకోకుండా డిలీట్ చేయడం, లేదా సైబర్ ఎటాక్.. ఇలా ఏదో ఒక కారణంగా తమకు డేటాను పోగొట్టుకున్న అనుభవం ఉందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 71 శాతం మంది పేర్కొన్నారు. » డేటా బ్యాకప్‌కు 3 విధానాలు వాడుతున్నట్టు సర్వే లో వెల్లడైంది. ఇందుకు 3–2–1 సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు సర్వే నిర్వాహకులు తెలిపారు. డేటాకు సంబంధించి 3 కాపీలను పెట్టుకోవాలి. రెండింటిని రెండు వేర్వేరు డివైజ్‌లలో స్టోర్ చేసుకోవాలి. ఒక సాఫ్ట్ కాపీని క్లౌడ్ వంటి స్టోరేజీలో దాచుకోవాలి. -
పుత్తడి @ రూ. 94,000
సాక్షి, స్పెషల్ డెస్క్: పసిడి దూకుడు ఆగడం లేదు. తాజాగా మరో రికార్డును తిరగరాస్తూ 10 గ్రాముల (24 క్యారట్లు) పుత్తడి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.94,000లకు చేరింది. ఒకానొక దశలో రూ.94,200లను కూడా తాకింది. ఒక్క రోజులోనే ధర రూ.2,500 దూసుకెళ్లడం గమనార్హం. పరిశ్రమ నిపుణులు అంచనా వేసినట్టుగానే రూ.1 లక్షకు చేరువ దిశగా పుత్తడి ధర పరుగులు తీస్తోంది. ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై టారిఫ్‌ల పెంపు అమలు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. ఇన్వెస్టర్లకుతోడు ఆభరణాల వర్తకులు సైతం కొనుగోళ్లకు దిగడంతో పసిడి ధర ఆల్‌టైం హై నమోదు చేసింది. అటు 22 క్యారట్ల పసిడి రూ.86,300లకు చేరింది. మరోవైపు వెండి లో మూడురోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. కిలోకు రూ.500 నష్టపోయి రూ.1,02,500 స్థాయికి పరిమితమైంది. కాగా, గతేడాది ఏప్రిల్ 1న బంగారం ధర రూ.70,000 నమోదైంది. అంటే ఏడాదిలో రూ.24 వేలు పెరగడం విశేషం. ఇక 2020 ఏప్రిల్ 1న పసిడి ధర రూ.46,500 పలికింది. తాజా రి కార్డుతో పోలిస్తే ఐదేళ్లలో ధర రెండింతలకు ఎగిసింది. ధరలో 102 శాతం వృద్ధి నమోదైందన్న మాట. సురక్షిత ఆస్తుల వైపు.. 2025లో ఇప్పటివరకు పసిడి 18 కొత్త గరిష్టాలను తాకింది. 2024లో 40 కంటే ఎక్కువసార్లు ఆల్‌టైమ్ గరిష్టాలను అందుకుంది. ఏప్రిల్ 1న అంతర్జాతీయంగా ఔన్స్ (31.1గ్రాములు) ధరరూ.2,68,784 దాటింది. రెండు వారాల క్రితం ఇది రూ.2,56,800 ఉంది. యూఎస్ ప్రతిపాదిత సుంకాలు, ఆర్థిక అని శ్చితి ఆందోళనల మధ్య బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక మాంద్యం ముప్పు, ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలకు అవకాశముందన్న అంచనాల కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతోంది. పెట్టుబడికి సురక్షిత సాధనంగా పుత్తడి నిలిచిందని సికింద్రాబాద్‌లోని ఆదినాథ్ జువెల్లర్స్ ఎండీ ముకేశ్‌కుమార్ సురానా వివరించారు. ఐదేళ్లలో 3,627 టన్నులు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా ప్రకారం 2019 నాటికి భారతీయ కుటుంబాల వద్ద సుమారు 24,000–25,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 2020 నుంచి 2024 వరకు 3,627 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకుంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న పుత్తడి నిల్వలు 2019 నాటికి 618.2 టన్నులు. 2024 డిసెంబర్ నాటికి ఇవి 876.18 టన్నులకు చేరాయి. ఐదేళ్లలో ఆర్బీఐ 258 టన్నులు అదనంగా సమకూర్చుకుంది. కరోనా మహమ్మారి, తదనంతర కాలంలో అమ్మకం, తాకట్టు ద్వారా కోట్లాది కుటుంబాలను బంగారమే ఆదుకుంది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో ప్రజల వద్ద పుత్తడి నిల్వలు 25,000 టన్నులు ఉన్నాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ వెల్లడించింది. దాచిందంతా బంగారమే.. అవును మీరు చదివింది నిజమే. దాచిందంతా బంగారమే. ఎంతలా అంటే ఊహకు అందనంత. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,87,50,00,00,00,000 కోట్లు. సింపుల్‌గా రూ.118 లక్షల కోట్లకుపైమాటే. భారతీయ కుటుంబాలు దాచుకున్న 25,000 టన్నుల బంగారం విలువ ఐదేళ్లలో ఈ స్థాయిలో ఎగిసింది. పుత్తడి ధర ఐదు సంవత్సరాల్లో రెండింతలకుపైగా దూసుకుపోవడమే ఇందుకు కారణం. అయితే ఒక్క ఏడాదిలోనే భారతీయ కుటుంబాల వద్ద బంగారం రూపంలో ఉన్న ఈ సంపద రూ.60 లక్షల కోట్లు వృద్ధి చెందడం మరో విశేషం. ఆభరణం, పొదుపు, పెట్టుబడి.. బంగారం కొనుగోలుకు కారణం ఏదైనా ఈ ‘గోల్డెన్డేస్’జనానికి కాసులు కురిపిస్తోందని పెద్దపల్లికి చెందిన బంగారం వ్యాపారి కట్టా సంజీవ్ కుమార్ తెలిపారు. ధర దూకుడుగా ఉన్నా భవిష్యత్ అవసరాల కోసం కొనుగోళ్లు జరుపుతున్నారని చెప్పారు.ఐదేళ్ల బంగారం ముచ్చట్లు3,627 టన్నులు భారత్ దిగుమతి చేసుకున్న పుత్తడి258 టన్నులు ఆర్బీఐ అదనంగాసమకూర్చుకున్న బంగారంరూ. 47,500 అధికమైన పసిడి ధరపసిడి రూపంలో పెరిగిన సంపదరూ.118 లక్షల కోట్లు ఐదేళ్లలోరూ.60 లక్షల కోట్లు సంవత్సరంలో2,16,265 టన్నులు 2024 డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన పసిడి11.56 శాతం మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న బంగారం -
ప్రాణాల కోసం పరుగులు తీశాం.. బ్యాంకాక్ భూకంపంపై భారతీయ టూరిస్టులు
మయన్మార్, థాయిలాండ్‌లలో సంభవించిన భూకంపం(Earthquake) వందలాదిమందిని పొట్టనపెట్టుకుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాలు ఊగిపోతూ నేలకొరిగాయి. కొన్ని భవనాలపైనుంచి నీరు బయటకు దారాపాతంగా పొంగుకొచ్చింది. ఈ పరస్థితులను చూసిన జనం వణికిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు.Terremoto en tailandia desde la altura de un edificio, que locura#earthquake #Terremoto pic.twitter.com/mGQS5Ts5W3— ¿Por qué es tendencia Colombia? (@TendenciaenXHoy) March 29, 2025మయన్మార్(Myanmar)లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా దాని ప్రకంపనలు థాయ్‌లాండ్‌ను కుదిపివేశాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న భారత్‌కు చెందిన పర్యాటకులు వెనువెంటనే విమానాల్లో భారత్‌కు తిరిగి వచ్చారు. వీరు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న రంజన్ బెనర్జీ మాట్లాడుతూ.. భూకంపం సంభవించినప్పుడు వెంటనే మాల్స్‌తోపాటు పలు కార్యాలయాలను ఖాళీ చేయించారు. మెట్రో రైలు రాకపోకలను నిలిపివేశారని తెలిపారు. మరో పర్యాటకుడు సఫ్దర్ మాట్లాడుతూ, ఆకాశహర్మ్యాలు వణికిపోయాయని, భవనాల పైనుంచి జలపాతంలా నీరు కిందికి పడిందని తెలిపారు.సంజీవ్ దత్తా మాట్లాడుతూ.. తాను పడుకున్న మంచం ఒక్కసారిగా కదిలిపోయిందన్నారు. జనం భయంలో రోడ్లపై పరిగెట్టారని, తాను ఏడవ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చి, అక్కడ కొంతసేపు వేచి ఉన్నానని, భారీ ట్రాఫిక్ కారణంగా 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఐదారు గంటలు పట్టిందని ఏఎన్ఐకి తెలిపారు. అత్యవసరంగా విమానాశ్రయానికి చేరుకునేందుకు టాక్సీలు దొరకలేదని భారతి ఖురానా చెప్పారు. తాము ఉన్న హోటల్ తీవ్రంగా కంపించడంతో అందరూ బయటకు పరుగులు తీసిన విషయాన్ని ప్రణవ్ గుర్తు చేసుకున్నారు.థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం(Indian Embassy) అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో థాయిలాండ్‌లోని భారతీయ పౌరులు నంబర్ +66 618819218ను సంప్రదించాలని సూచించారు. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు,సిబ్బంది చియాంగ్ మాయిలోని కాన్సులేట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో తెలిపింది.ఇది కూడా చదవండి: Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం? -
అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారులు 636 మంది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 636 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరిలో 341 మంది చార్టెర్డ్ విమానాల్లో, 55 మంది పనామా నుంచి వాణిజ్య విమానాల్లో, మిగతా 240 మంది వేర్వేరు వాణిజ్య విమానాల్లో చేరుకున్నారని లోక్‌సభలో విదేశాంగ శాఖసహాయ మంత్రి కృతి వర్దన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అమెరికాలో ఉంటున్న 18 వేల మంది భారతీయ అక్రమ వలసదారులను వాపసు తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వచ్చిన వార్తలపై టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ప్రశ్నించగా..విదేశాల్లో ఉండే అక్రమ వలసదారులను వెనక్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత దేశాలదేనని మంత్రి చెప్పారు. భారత్ ఒక్కటే కాదు..అంతర్జాతీయ సంబంధాల్లో అందరూ అంగీకరించిన సూత్రమని చెప్పారు. తమ నిర్బంధంలో ఉన్న మరో 295 మంది వ్యక్తుల సమాచారాన్ని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మన అధికారులకు అందజేసిందని మంత్రి చెప్పారు. వీరు మన జాతీయులేనా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అమెరికా ప్రభుత్వం తిప్పి పంపేవారికి అవసరమైన సాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. -
యూఏఈ: 500 మందికి పైగా భారతీయులకు క్షమాభిక్ష
అబుదాబి: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సమ్ ఇస్సా అల్ హుమైదాన్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. -
ముందే ప్లానేద్దాం.. సమ్మర్లో టూరేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సమ్మర్ వెకేషన్‌కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్‌కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్ రూమ్‌లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్–స్కేల్, బడ్జెట్ సెగ్మెంట్లలో హోటల్ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్ దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్‌స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకంగా మహబలేశ్వర్‌లోని బీచ్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్‌పూర్, జైపూర్లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్ సంస్థ వెల్లడించింది. టాప్ ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్‌గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్ పెరుగుతోందని అట్లీస్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్లో యూఏఈ, యూఎస్ఏలకు అత్యధికంగా బుక్సింగ్ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది. అంటార్కిటికాలో ఐస్‌బ్రేకర్ క్రూయిజ్‌లు, ఫిన్లాండ్లో నార్తర్న్ లైట్స్ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్ సూట్లు మరియు ఆర్కిటిక్ ట్రీహౌస్‌లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా వైన్‌యార్డ్‌లలో కన్వర్టిబుల్ కార్లు లేదా హార్లే–డేవిడ్‌సన్‌లతో సెల్ఫ్–డ్రైవ్ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్‌బైజాన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్ ట్రిప్‌లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ... ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషస్ వంటి వాటికి భారత్ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్ఓటీసీ ట్రావెల్ హాలిడేస్, కార్పొరేట్ టూర్స్ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో ముయే థాయ్ (కిక్‌బాక్సింగ్) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్‌లలో డిటాక్స్ కార్యక్రమాలు, మారిషస్‌లో స్నార్కెలింగ్ లేదా మాల్దీవ్స్‌లో మిషెలిన్–స్టార్ అండర్‌వాటర్ డైనింగ్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది. -
ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోతాం..
ముంబై: దేశంలోని అత్యంత ధనవంతుల్లో 22 శాతం మంది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. విదేశాల్లో మెరుగైన జీవన పరిస్థితులు, వ్యాపార అనుకూల వాతావరణం వారిని ఆకర్షిస్తున్నాయి. 150 మంది అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (అల్ట్రా హెచ్ఎన్ఐలు) అభిప్రాయాలను కోటక్ ప్రైవేటు (వెల్త్ మేనేజర్), ఈవై ఇండియా సర్వే చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది అల్ట్రా హెచ్ఎన్ఐ భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా దేశాలు ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పథకం అనుకూలంగా ఉన్నట్టు కోటక్–ఈవై నివేదిక తెలిపింది. ఏటా 25 లక్షల మంది విదేశాలకు వలసపోతున్న గణాంకాలను ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు అల్ట్రా హెచ్ఎన్ఐలలో ఒకరు విదేశాలకు వలసపోయే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. వీలైతే అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని, అదే సమయంలో భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించుకునే ఆలోచనతో ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు, విద్య, జీవనశైలి ఇలా అన్నింటా విదేశాల్లో మెరుగైన ప్రమాణాలను వారు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశాల్లో వ్యా పార నిర్వహణలో ఉండే సౌలభ్యం తమను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయ స్సుకు వీరు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. పిల్లల విద్యకూడా కారణమే.. విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని భవిష్యత్ పెట్టుబడిగా ఈ సర్వే నివేదిక అభివర్ణించింది. వారి పిల్లలకు అత్యుత్తమ ఉన్నత విద్య సదుపాయం సైతం వారిని ఆ దిశగా నడిపించొచ్చని పేర్కొంది. ‘‘విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని పెట్టబడులు తరలిపోవడంగా చూడరాదు. ఈ తరహా కార్యకలాపాలపై పరిమితులు విధించడం ద్వారా పౌరసత్వ హోదా మారినప్పటికీ వారి పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చు. భారత్‌లో నివసించే పౌరుడు ఏడాదికి ఇంటికి తీసుకెళుతున్నది సగటున 2,50,000 డాలర్లే. అదే విధంగా నాన్ రెసిడెంట్‌ను సైతం ఏటా మిలియన్ డాలర్లనే తీసుకెళ్లేందుకు అనుమతించడం వల్ల పెట్టుబడులు తరలిపోవు’’అని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవంకర్ అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తల కంటే వృత్తి నిపుణులే ఎక్కువగా విదేశాలకు వలసపోయే ఉద్దేశంతో ఉన్నారు. అది కూడా అల్ట్రా హెచ్ఎన్ఐలలో 36–40 ఏళ్ల వయసులోని వారు, 61 ఏళ్లపైన వయసువారు వలసవెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2.83 లక్షల అల్ట్రా హెచ్ఎన్ఐలు 2023 నాటికి మన దేశంలో 2.83 లక్షల మంది అల్ట్రా హెచ్ఎన్ఐలు ఉన్నారు. ఒక్కొక్కరి నెట్‌వర్త్ (నికర సంపద విలువ) రూ.25 కోట్లకు పైన ఉండడాన్ని ప్రామాణికంగా తీసుకుని, వీర జనాభా లెక్కగట్టారు. వీరందరి ఉమ్మడి సంపద విలువ రూ.2.83 లక్షల కోట్లుగా ఉంది. 2028 నాటికి అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 4.3 లక్షలకు పెరుగుతుందని, వీరి నిర్వహణలోని సంపద రూ.359 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం, పనిచేయతగిన యువ జనాభా ఎక్కువగా ఉండడం అల్ట్రా హెచ్ఎన్ఐల విభాగం వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. -
ఇండియన్స్‌కు ట్రంప్ వార్నింగ్!
-
హైదరాబాద్ చేరుకున్న సైబర్ కేఫే బందీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం విదేశాలకు పోయి, సైబర్ కేఫేలో బందీలుగా చిక్కుకుపోయిన 540 మంది భారతీయులు మంగళవారం ఢిల్లీకి చేరుకోగా, వారిలో బుధవా రం రాత్రి తెలంగాణకు చెందిన 24 మంది బాధితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి సంబంధించిన పర్వవేక్షణ బాధ్యతలను ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ఉప్పల్కు అప్పగించారు. వారిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. దీంతో వారి బంధువులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే అధికారులు రెగ్యులర్ ఎగ్జిట్ నుంచి కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి వారి నుంచి వివరాలు, స్టేట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులను ఆశ్రయించగా, బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పంపిస్తామని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తెలంగాణకు చేరుకున్న 24 మంది బాధితుల గురించి కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ఆరా తీసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల పేరిట అక్రమ రవాణా చేయడానికి కారణమైన వారిని గుర్తించడానికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, విచారణ అనంతరం మధుకర్‌రెడ్డిని కుటుంబసభ్యులకు అప్పగించారు.జగిత్యాలలో వెలుగుచూసిన మరో మోసం సైబర్ కేఫేలో చిక్కుకొని బయటపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన దేశెట్టి రాకేశ్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు మల్లికార్జున మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. నిర్వాహకుడు ఆల్లెపు వెంకటేశ్‌కు ఫోన్‌పే, నగదు రూపంలో 2022లో రూ.3.50 లక్షలు అప్పజెప్పాడు. 2023 ఆగస్టులో రాకేశ్‌ను ఆర్మీనియాకు పంపించాడు. కానీ అక్కడ జాబ్ చూపించకపోవడంతో ఇబ్బందులు పడి, అతి కష్టం మీద నవంబర్ 2023లో స్వదేశానికి చేరుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంకటేశ్‌ను అడగ్గా 2025 జనవరి 12న రాకేశ్‌ను థాయిలాండ్‌కు పంపించాడు. అక్కడ వెంకటేశ్‌కు సంబంధించిన వ్యక్తులు ఒక సైబర్ క్రైమ్ చేసే ముఠాకు అప్పజెప్పారు. ఇతరుల సహాయంతో ఇండియన్ ఎంబసీనీ సంప్రదించి స్వదేశానికి రాకేశ్ తిరిగి వచ్చాడు. తనను మోసం చేసిన కన్సల్టెన్సీ నిర్వహకుడు ఆల్లెపు వెంకటేశ్‌పై జగిత్యాలటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసుదర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చెప్పారు. -
చదువు పాతదాయె.. కొలువు కొత్తగాయె, ఇంట్రస్టింగ్ సర్వే!
టెక్ ప్రపంచంలో రోజుకో కొత్త సాంకేతికత పుట్టుకొస్తోంది. ఒక టెక్నాలజీని నేర్చుకోవటం మొదలుపెట్టేలోపు.. కొంగొత్తది పుట్టుకొచ్చి. నేర్చుకునేది పాతబడిపోతోంది. చదివిన చదువుకు, సాధించిన డిగ్రీలకు.. ఇప్పుడున్న మార్కెట్ అవసరాలకు పొంతనే లేకుండా పోతోంది. దేశంలోని 80 % వృత్తి నిపుణులది ఇప్పుడు ఇదే సమస్య. కృత్రిమ మేధ, మిషన్ లరి్నంగ్, జనరేటివ్ ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలున్న వారికి మంచి ప్యాకేజీలతో అవకాశాలు లభిస్తున్నాయి. కానీ, పాతకాలపు టెక్నాలజీ కోర్సులు చదివినవారికి ఎంత వృత్తి అనుభవం ఉన్నా కొత్త ఉద్యోగాలు దొరకటం లేదు. గురుగోవింద్‌సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, హీరోవైర్డ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఇలాంటి అనేక విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలోని ముఖ్యాంశాలుదేశంలోని ప్రతి 10 మంది వృత్తి నిపుణుల్లో 8 మంది విద్యార్హతలు ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకు సరిపోవడం లేదు. కాలేజీల్లో నేర్చుకున్నదానికిభిన్నంగా జాబ్ మార్కెట్ఉండడంతో.. అందుకు తగ్గట్టుగా తాము సిద్ధం కాలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 77% మంది తెలిపారు. నేటి అవసరాలకు తగ్గట్టుగా తమనుతాము మలుచుకోవాలంటే ఏఐ టెక్నాలజీపై పట్టుసాధించాలని 90.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డేటా అనలిటిక్స్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు 89.6 శాతం మంది తెలిపారు. ఆగ్మెంటెడ్ అనలిటిక్స్ ఓ గేమ్‌ఛేంజర్‌గా మారుతున్నదని 72 శాతం వృత్తి నిపుణులు అభిప్రాయపడ్డారు. (Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!)సస్టెయినబుల్ ఇన్నోవేషన్ ఒక ముఖ్యమైన పరిశ్రమగా ఉద్భవిస్తోందని 69.7 శాతం మంది చెప్పారు. క్రియేటివ్ ఆంట్ర ప్రెన్యూర్షిప్ ద్వారా సుస్థిరమైనకెరీర్ను నిర్మించు కోవచ్చని 62.3%అభిప్రాయం నిపుణులు సూచలు ప్రస్తుత జాబ్మార్కెట్లో అందుబాటులో ఉన్నఅవకాశాలకు తగ్గట్టుగా ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలి. సాంకేతికతపై పట్టుకే పరిమితం కాకుండాసృజనాత్మకత, టీంవర్క్,సవాళ్లకు తగ్గట్టుగాస్పందించే తీరుతోనే ప్రయోజనం ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న ‘జాబ్ రోల్స్’కు అనుగుణంగానైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. నైపుణ్యాలకు తగ్గట్టుగా కెరీర్‌ను ఎంచుకోవాలి. ఏఐ నైపుణ్యాలకే పరిమితంకాకుండా కంటెంట్ క్రియేషన్,డేటా అనలిటిక్స్ వంటి వాటి ద్వారా కూడా ముందుకు సాగొచ్చు. గతంలో ఓ వెలుగు వెలిగినఇంజనీరింగ్, మీడియా/ఎంటర్టైన్మెంట్, మెడిసిన్ వంటి రంగాలు ప్రస్తుతం కొంత నెమ్మదిస్తున్నాయి.ఆగ్మెంటెడ్ అనలిటిక్స్, సస్టెయినబుల్ ఇన్నోవేషన్, క్రియేటివ్ ఆంట్రప్రెన్యూర్షిప్, మల్టీసెన్సరీ డిజైన్ వంటివి ప్రాధాన్యం సాధిస్తున్నాయి.- సాక్షి, హైదరాబాద్ -
ఇంకా కష్టపడితేనే లక్ష్యాలు సాధించగలం
న్యూఢిల్లీ: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారతీయులు మరింత ఎక్కువగా కష్టపడితేనే సాధ్యమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా పనిచేయాల్సిందేనన్నారు. ‘‘నేను కష్టించి పని చేయాలని విశ్వసిస్తాను. భారతీయులు ఇంకా కష్టపడి పనిచేయాలి. అది వారానికి 80 గంటలు కావచ్చు లేదా 90 గంటలు కావచ్చు. ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల భారీ లక్ష్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు, వినోదాలతో గడిపేస్తూనో, లేకపోతే ఏదో కొందరు సినిమా స్టార్ల అభిప్రాయాలను అనుసరిస్తూనో కూర్చుంటే సాధించలేము’’ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పని విధానాలతోనే జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆర్థిక విజయం సాధించాయని, ప్రపంచ స్థాయి ఎకానమీగా ఎదగాలంటే భారత్ కూడా అలాంటి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎన్ని గంటల పని వేళలు ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరు కార్పొరేట్ దిగ్గజాలు వారానికి 70–90 గంటలు పని చేయాలంటే, ఎన్ని గంటలు పని చేశామనేది కాదు ఎంత నాణ్యంగా పని చేశామనేది ముఖ్యమని మరికొందరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాషనైపోయింది.. ‘‘ఎక్కువగా కష్టపడకూడదంటూ మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. పనుల్లో జాప్యం జరగకుండా, ఖర్చులు పెరిగిపోకుండా, ప్రపంచ స్థాయి నాణ్యతతో, గడువు కన్నా ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే భారత్ కష్టపడి పని చేయాల్సిందే. ఇక పని–కుటుంబ జీవితం మధ్య సమతౌల్యం పాటించాలనే విషయానికొస్తే.. నేను ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ చేస్తూనే నేను ప్రతి రోజూ కష్టపడి పని కూడా చేస్తాను. మీకు వ్యక్తిగతంగా ఒకటిన్నర గంటలు మీకోసమే పక్కన పెట్టుకున్నా మీకు రోజులో ఇంకా 22.5 గంటలు ఉంటాయి. పని–కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించడానికి బోలెడంత సమయం ఉంటుంది. కష్టపడకపోవడమనేదాన్ని ఏదో ఫ్యాషన్‌గా మార్చొద్దు. పెద్దగా శ్రమించకుండానే భారత్ గొప్ప దేశంగా ఎదగగలదంటూ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కష్టపడకుండా ఏ దేశమూ ఎదగలేదు’’ అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. -
దేశం ఖర్చు చేస్తోంది
న్యూఢిల్లీ: వస్తు సేవల కోసం 2013లో భారతీయులు వెచ్చించిన మొత్తం రూ.87,15,000 కోట్లు. 2024లో ఇది రెట్టింపై రూ.1,83,01,500 కోట్లకు చేరుకుందని డెలాయిట్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం 7.2 శాతం వార్షిక వృద్ధితో దూసుకెళ్లిందని, అమెరికా, చైనా, జర్మనీ కంటే భారత్ వేగంగా ఉందని తెలిపింది. భారత్‌లో కస్టమర్ల విచక్షణా వ్యయంపై రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ నివేదికను రూపొందించింది. 2026 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరించే దిశగా జనాభాపర లాభాలను పొందేందుకు భారత్ మంచి స్థితిలో ఉందని వివరించింది. వ్యవస్థీకృత రిటైల్, అనుభవ ఆధారిత వినియోగం పెరుగుదల.. వెరశి వినియోగాన్ని పెంచడంలో సహాయపడిందని తెలిపింది. వ్యవస్థీకృత రిటైల్ వేగంగా విస్తరిస్తోంది. ఏటా 10 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. ఇది 2030 నాటికి రూ.20,04,450 కోట్లకు చేరుకుంటుందని అంచనా అని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. పెరగనున్న సంపాదనపరులు.. 2030 నాటికి సంవత్సరానికి రూ.8,71,500 కంటే ఎక్కువ సంపాదించే భారతీయుల సంఖ్య దాదాపు మూడు రెట్లు దూసుకెళ్లి 16.5 కోట్లకు చేరుతుందని అంచనా. 2024లో ఈ సంఖ్య 6 కోట్లు. ఇది దేశంలోని మధ్యతరగతి వర్గాల వృద్ధిని, విచక్షణా వ్యయం వైపు ప్రాథమిక మార్పును ప్రతిబింబిస్తుంది. పెరుగుతున్న సంపదతో వినియోగదారులు ధర కంటే నాణ్యత, సౌలభ్యం, అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రీమియమైజేషన్, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలతోసహా అనేక కీలక శక్తులు వినియోగంలో దూకుడును నడిపిస్తున్నాయి. ఫిన్‌టెక్ సొల్యూషన్స్, యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు వినియోగదారులు బ్రాండ్లతో ఎలా నిమగ్నమవ్వాలో పునరి్నర్మిస్తున్నాయి. ఈ–కామర్స్ స్వీకరణను పెంచుతున్నాయి. డిజిటల్ వినియోగానికి ఆజ్యం పోస్తున్నాయి. జెన్ జడ్, మిలీనియల్స్.. జనాభాలో 52 శాతం ఉన్న జనరేషన్ జెడ్, మిలీనియల్స్ ఈ మార్పును నడిపిస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లు, స్థిర ఉత్పత్తులు, వ్యక్తిగతీకరించిన అనుభవాల కోసం డిమాండ్‌ను పెంచుతున్నాయి. ‘భారత వినియోగదారుల వ్యవస్థ ప్రాథమిక పరివర్తనకు లోనవుతోంది. విచక్షణతో కూడిన వ్యయాల పెరుగుదల, డిజిటల్ వాణిజ్యాన్ని విస్తరించడం, అందుబాటులో రుణాలు.. వెరశి బ్రాండ్లు తమ నియమాలను పునరి్నర్వచించుకుంటున్నాయి’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, కంజ్యూమర్ ఇండస్ట్రీ లీడర్ ఆనంద్ రామనాథన్ అన్నారు. ‘2030 నాటికి భారతదేశ తలసరి ఆదాయం రూ.3,48,600 దాటుతుందని అంచనా. ఇది వివిధ రంగాలలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. వ్యాపారాలు వినియోగదారుల అంచనాలను అందిపుచ్చుకోవడానికి అద్భుత అవకాశాన్ని కలిగి ఉన్నాయి. అందుబాటు ధర, సౌలభ్యం, స్థిరత్వాన్ని సమతుల్యం చేయడం ద్వారా సమాచారం, సాంకేతికతను ఉపయోగించుకుని అత్యంత వ్యక్తిగతీకరించిన అనుభవాలను సృష్టిస్తాయి’ అని వివరించారు. వృద్ధి దశలోకి ప్రవేశం.. పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ స్వీకరణ, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల ద్వారా భారత్‌లో విచక్షణా వ్యయం కొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు. ‘వ్యవస్థీకృత రిటైల్, నూతన వాణిజ్య నమూనాలు విస్తరిస్తున్న కొద్దీ ఈ ధోరణులకు అనుగుణంగా ఉండే వ్యాపారాలు వృద్ధి, ఆవిష్కరణలకు అపార అవకాశాలను తెరుస్తాయి. డిజిటల్, ఆర్థిక సమ్మిళిత వృద్ధి దేశంలో ఖర్చులను పెంచుతోంది. రుణ లభ్యత అపూర్వ వేగంతో విస్తరిస్తోంది. క్రెడిట్ కార్డుల సంఖ్య గత ఏడాది దేశవ్యాప్తంగా 10.2 కోట్లు ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 29.6 కోట్లకు దూసుకెళుతుందని అంచనా. దీనివల్ల వినియోగదారులు చేస్తున్న ఖర్చులు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అమెరికన్ కంపెనీలు ఈ పథకాన్ని ఉపయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతులను నియమించుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ కేవలం పౌరసత్వ కలను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్ కంపెనీలు మంచి నిపుణులను నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. వ్యాపారం పరంగా ఈ ఆఫర్ అమెరికన్ కంపెనీలకు ఆకర్షణీయమేనా? భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఒక కోటి గోల్డ్ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా (America) అప్పులు తొలగిపోతాయని ట్రంప్ పేర్కొంటున్నారు. కానీ రూ.43.7 కోట్ల విలువైన వీసాను కొనగలిగే అతి ధనవంతులు అమెరికా వెలుపల ఎంతమంది ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సరే.. పన్ను నిబంధనలపై అనిశ్చితి కారణంగా గోల్డ్‌కార్డు (Gold Card)ను తీసుకునేవారు తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ బ్యూరోట్రంప్ లక్ష్యం అంత సులభమేమీ కాదు..ఒక కోటి గోల్డ్ కార్డుల అమ్మకాలు అమెరికా రుణభారాన్ని తుడిచిపెట్టగలవని ట్రంప్ అంటున్నారు. కానీ ఏకంగా రూ.43.7 కోట్లు వెచ్చించగల స్తోమత ఉన్న ధనవంతులు అమెరికా వెలుపల ఎంత మంది ఉన్నారు? క్రెడిట్ స్విస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5–10 మిలియన్ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య 51 లక్షలు. ఇందులో 10 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నవారు 28లక్షల మంది. ఇలాంటప్పుడు ఒక కోటి మంది గోల్డ్‌కార్డ్ కొనుగోలుదారులను పొందడం సాధ్యమయ్యేదేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారేమోగానీ.. విదేశీ బిలియనీర్లు గోల్డ్ కార్డ్‌ను తీసుకుంటారా? అని ఇమిగ్రేషన్ నిపుణులే పేర్కొంటున్నారు. గోల్డ్కార్డ్పై తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. » ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం, యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివాటిని ప్రతిభావంతులైన నిపుణుల ఖర్చుతో ధనవంతుల అవసరాలను తీర్చడంగా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. » గోల్డ్ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్ కార్యక్రమాలు మనీలాండరింగ్‌కు, విదేశాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇది రష్యన్ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. ‘అవును. నాకు కొందరు రష్యన్ సామ్రాజ్యవాదులు తెలుసు. వారు చాలా మంచి వ్యక్తులు’అని పేర్కొన్నారు. » ఉద్యోగాలను సృష్టించే సంస్థలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ కార్డ్ వస్తే.. చాలా మంది ధనవంతులు యూఎస్ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి తోడ్పాటు ఏమీ ఇవ్వకుండా నివాసం ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. » కెనడాలో ఇలాంటి కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించారు. కానీ అది విపరీతంగా దుర్వినియోగం కావడంతో రద్దు చేశారు. ముందున్న సవాళ్లు రెండు.. ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో.. వలస విధానంలో ఏదైనా ముఖ్య మార్పును అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదించాలి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ కి ఉభయ సభలలో మెజారిటీ ఉంది. కానీ అమెరికన్ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందరు రిపబ్లికన్లు సమర్థించకపోవచ్చు. డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనను దాదాపుగా వ్యతిరేకిస్తారు. కోర్టులలో..అమెరికాలో చాలా చట్టపరమైన సవాళ్లు వీసా కార్యక్రమాల నిర్వహణ నుంచే ఉత్పన్నమవుతాయి. ట్రంప్ గోల్డ్ కార్డ్ ఎలాంటి చట్టపర సవాళ్లను ఎదుర్కొంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. భారతీయులు–గోల్డ్ కార్డ్..కాన్సులర్ ప్రాసెసింగ్ ఉపయోగించి 2022–23లో ఈబీ–5 కార్యక్రమం ద్వారా 631 మంది భారతీయులు మాత్రమే యూఎస్ గ్రీన్‌కార్డులను పొందారు. ఈ పథకానికి రూ.9.17 కోట్లు పెట్టుబడి మాత్రమే అవసరం. అలాంటిది రూ.43.7 కోట్లపైన చెల్లించి గ్రీన్‌కార్డ్ కొనాలనే ఆలోచన చాలా మంది భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే అవకాశం లేదని యూఎస్ న్యాయవాది, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యురాలు రవనీత్ కౌర్ బ్రార్ అభిప్రాయపడ్డారు. గోల్డ్ కార్డ్ వీసా అంటే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ను ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్కార్డ్కు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా. గోల్డ్ కార్డ్ కోరుకునేవారు యూఎస్ ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.7 కోట్లు) చెల్లించాలి. ఈ వీసా విధివిధానాలు రెండు వారాల్లో వెలువడనున్నాయి. గోల్డ్ కార్డ్ హోల్డర్లు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీయంగా (యూఎస్‌లో) ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. గోల్డ్‌కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు సమకూరుతారని ట్రంప్ అన్నారు. అప్పుల భారం తగ్గించుకునేందుకు.. గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేం కోటి కార్డులు అమ్మితే 50 ట్రిలియన్ డాలర్లు (రూ.43,70,00,000 కోట్లు) సమకూరుతుంది. మాకు 35 ట్రిలియన్ డాలర్ల (రూ.30,59,00,000 కోట్లు) అప్పు ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ ఉన్న దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడం కోసం కంపెనీలను అనుమతించే నిబంధనలను గోల్డ్ కార్డ్‌లో చేర్చవచ్చని ట్రంప్ చెప్పారు. యాపిల్ వంటి సంస్థలు తాము నియమించుకోవాలనుకునే అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గోల్డ్ కార్డులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే.. ప్రస్తుత ఈబీ–5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ రానుంది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిర్వహించే ఈబీ–5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ను 1990లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్ రూపొందించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అమెరికాలో ఉద్యోగ సృష్టి, మూలధన పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దానిని అమలు చేస్తున్నారు. ఈబీ–5 వీసా కోసం 10,50,000 డాలర్ల (రూ.9.17 కోట్లు) పెట్టుబడి అవసరం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే 8,00,000 డాలర్లు (రూ.6.99 కోట్లు) పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. దీనికితోడు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. దీనిద్వారా సాధారణంగా 3–5 ఏళ్లలో గ్రీన్‌కార్డ్ అందుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న 2019లో ఈ పరిమితిని 9,00,000 డాలర్లకు (రూ.7.8 కోట్లకు) పెంచాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. అమెరికా ఏటా 10,000 ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% వీసాలు ఇస్తారు. ఈబీ–5 వీసా కావాల్సినవారు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్త గోల్డ్ కార్డ్ అయితే ఒకసారి కొనుక్కుంటే చాలు. పెట్టుబడి, ఉద్యోగ కల్పన భారం ఉండదు. దశాబ్దంలో 3,800 మంది.. హెచ్–1బీ, ఈబీ–2, లేదా ఈబీ–3 వీసాలపై యూఎస్‌లో ఉన్న భారతీయ వలసదారులు గోల్డ్ కార్డ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని అందుకోవచ్చు. వర్క్ వీసాలు, ముఖ్యంగా హెచ్–1బీ వీసాల కోసం భారత్ నుంచి అత్యధిక డిమాండ్ ఉంది. గోల్డ్ కార్డ్ వీసా హోల్డర్ల రాక వల్ల.. ఇతర వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం వేచిఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. అమెరికాలో గ్రీన్‌కార్డ్ (శాశ్వత చట్టపర నివాస అనుమతి) కోసం వేచి ఉండే సమయం భారతీయులకు చాలా ఎక్కువ. కొన్నిసార్లు దశాబ్దాల సమయం పడుతోంది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఓ–1 వీసా మెరుగైన ప్రత్యామ్నాయమని.. దానిద్వారా సులభంగా ఈబీ–1 గ్రీన్కార్డ్లోకి మారవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ విభాగాల్లా కాకుండా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వ్యాపార సంస్థల యజమానులు, కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఎల్–1 వీసాను పరిగణించవచ్చు. ఈబీ–5 వీసా కోసం చూస్తున్నవారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో.. దానిని రద్దు చేయడానికి ముందే త్వరపడాలనే ఆత్రుత కనిపిస్తోంది. అయితే ఈబీ–5 వీసా రద్దు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్దంలో దాదాపు 3,800 మంది భారతీయులు ఈబీ–5 వీసాతో అమెరికా వెళ్లారని అంచనా. 100కుపైగా దేశాల్లో సంపన్నులకు గోల్డెన్ వీసాలు ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు సంపన్నులకు గోల్డెన్ వీసాలు ఇస్తున్నాయి. యూరప్, ఇతర ప్రాంతాల్లోని చాలా దేశాలు పెట్టుబడి కార్యక్రమాల ద్వారా పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే వారికి మాల్టా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఆ విధానం ఉత్తమమైనదని హ్యాన్లీ సిటిజన్‌షిప్ ప్రోగ్రామ్ ఇండెక్స్ పేర్కొనడం గమనార్హం. మాల్టా పౌరసత్వం పొందాలంటే కనీసం €6,00,000 యూరోల (రూ.5.45 కోట్లు) పెట్టుబడితోపాటు అక్కడ కనీసం 36 నెలల పాటు నివాసం ఉండాలి. లేదా 12 నెలలు అక్కడ నివసించిన తర్వాత €7,50,000 యూరోలు (రూ.6.82 కోట్లు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హ్యాన్లీ ఇండెక్స్ టాప్–10 జాబితాలో ఆ్రస్టియా, గ్రెనాడా, యాంటీగ్వా అండ్ బాబూడా, నౌరూ, సెయింట్ కిట్స్ ఉన్నాయి. తమ లాభాలను పెంచుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ వ్యాపారులకు ఇవి ఆకర్షణీయ పన్ను స్వర్గధామాలు (ట్యాక్స్ హెవెన్స్) కూడా. ఇక హ్యాన్లీ గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ జాబితాలో గ్రీస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. సంపన్న భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనీసం 5,45,000 డాలర్ల (రూ.4.76 కోట్లు) పెట్టుబడితో గోల్డెన్ వీసా రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. -
ఆ‘పాత’ నావ
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భవిష్యత్ భయాలు
ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పిల్లల ఫీజులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు ఏటా తడిసి మోపెడవుతున్నాయి. నిత్యావసరాల ధరలు సరేసరి.. కానీ, ఆ స్థాయిలో ఆదాయాలు పెరగటంలేదు. వచ్చే సంపాదనలోనే ఎంతో కొంత భవిష్యత్ కోసం పొదుపు చేస్తున్నా.. అవి ఏమూలకూ సరిపో వటంలేదు.. ఇదీ నేడు సగం మంది భారతీయుల ఆవేదన. ముఖ్యంగా 35 – 54 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పొదుపు, ఖర్చులపై యూ గౌ, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్అధ్యయనంలోని కీలకాంశాలు..» దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని 4,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 94 శాతం మంది భవిష్యత్ కోసం సవివరమైన ఆర్థిక ప్రణాళిక లేదా ఒక మోస్తరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.» సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిపైగా తాము చేస్తునపొదుపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని ఆందోళన వ్యక్తంచేశారు.» పక్కా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్నా చివరకు అది పూర్తిస్థాయిలో అక్కరకు రావడం లేదని తెలిపారు.» వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వయసు పెరుగుతున్న పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడంలో నిమగ్నమైన 35–54 ఏళ్ల లోపువారిలో 60 శాతం మంది తమ పొదపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని అంగీకరించారు.» వివిధ రూపాల్లో ఎదురయ్యే అత్యవసరాలను ఎదుర్కొనే విషయంలో పొదుపు సొమ్ము సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది చెప్పారు.» అనారోగ్య సమస్యలు, విద్య, ఇంటికి మరమ్మతులు వంటివాటికి అన్నిరకాల రుణాలను వినియోగించుకుంటుండటంతో దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేర్చుకునే విషయంలో ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు.» భవిష్యత్ అవసరాలకు పనికి వస్తుందనే ఆశతో పలు మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నా.. అది అవసరానికి చేతికి రావటంలేదని కొంతమంది పేర్కొన్నారు. » భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్న 35 – 54 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగంమందికి పైగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు జీవిత బీమా వంటి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.రెండు రకాల సవాళ్లురెండు తరాలవారిని (తల్లి దండ్రులు, పిల్లలు) ఆదుకోవాల్సిన బాధ్యతల మధ్య ‘సాండ్విచ్ జనరేషన్’ (35 – 54 ఏళ్ల మధ్యవారు) నలిగిపోయే పరిస్థితి ఎదురవుతోంది. పెద్దలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినపుడు తగిన విధంగా ఖర్చు చేయడం, పెరుగుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం వీరికి సవాల్‌గా మారుతోంది. –సుమిత్ రాయ్, ఎండీ–సీఈవో, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్. -
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగు తుండగానే కెనడా ప్రభ్తుత్వం కూడా షాకిస్తోంది. స్టడీ, వర్క్ వీసాలపై కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది.. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తోంది.కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి . ఉద్యోగులు, వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణాధికారాలను ఇస్తున్నాయి.జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే, పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడువు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే, గడువు ఉన్నప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా పదివేల మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్‌పోర్టు) నుంచే వెనక్కు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి ట్రంప్ ఆంక్షల తరువాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యనభ్యిస్తున్నారు.ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే (2024 నవంబర్), కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన విషయం విదితమే. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పాముల బ్యాగు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు(Indira Gandhi Airport)లో కలకలం చెలరేగింది. కస్టమ్స్ అధికారులు అరుదైన జీవ జాతులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఉదంతంలో ముగ్గురు భారత పౌరులను అదుపులోనికి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిన్న(శనివారం) రాత్రి బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ఏఐ 303లో ముగ్గురు ప్రయాణికులు అరుదైన జీవ జాతులను అక్రమంగా భారతదేశానికి తీసుకువచ్చారు. వీరి బ్యాగులను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు(Customs officials) షాక్ తిన్నారు. ఆ బ్యాగులో పాములు, బల్లులు, కప్పలు, కీటకాలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జీవ జాతులు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ జీవ జాతులను వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ అథారిటీకి అప్పగించారు. గతంలోనూ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే! -
పనామా నిర్బంధ కేంద్రంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ
పనామా సిటీ: భారతీయులు సహా సుమారు 300 మంది అక్రమ వలసదారుల్ని లాటిన్ అమెరికా దేశం పనామాలో ఉంచింది అమెరికా. అయితే.. నిర్బంధ కేంద్రంలో వాళ్లంతా దయనీయమైన స్థితిలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమకు సాయం అందించాలని కొందరు ఫ్లకార్డులను ప్రదర్శించడమే అందుకు కారణం. అయితే పనామాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై స్పందించింది.పనామా(Panama)లోని ఓ హోటల్లో వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది. వాళ్లకు అవసరమైనవన్నీ ఇక్కడి అధికారులు అందిస్తున్నారని, వాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలిపింది.Panamanian authorities have informed us that a group of Indians have reached Panama from US They are safe and secure at a Hotel with all essential facilitiesEmbassy team has obtained consular accessWe are working closely with the host Government to ensure their wellbeing pic.twitter.com/fdFT82YVhS— India in Panama, Nicaragua, Costa Rica (@IndiainPanama) February 20, 2025భారత్,ఇరాన్, నేపాల్,శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనాకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పనామాకు తరలించారు అధికారులు. హోటల్ అయిన ఆ నిర్బంధ కేంద్రం చుట్టూ తుపాకులతో సిబ్బంది ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే టైంలో.. వలసదారుల్లో కొందరు సాయం కావాలని, తాము తమ దేశంలో సురక్షితంగా ఉండలేమంటూ హోటల్ అద్దాల గదుల నుంచి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆందోళన మొదలైంది.అయితే అక్రమ వలసదారుల్ని(Illegal Migrants) నేరుగా స్వస్థలాలకు పంపడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే పనామాను వారధిగా(ట్రాన్సిట్ కంట్రీ) ఉపయోగించుకుంటోంది. ఇక వలసదారుల ఆందోళనలను పనామా తోసిపుచ్చుతోంది. అమెరికాతో ఉన్న వలసదారుల ఒప్పందం మేరకు..వాళ్లను ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని పనామా సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అబ్రెగో వెల్లడించారు. వాళ్లకు సకాలంలో ఆహారం, మందులు..ఇతర సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారాయన. అయితే..వాళ్లలో చాలామంది హోటల్ దాటే ప్రయత్నాలు చేశారని, అందుకే కాపలా ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.బుధవారం చైనాకు చెందిన ఓ మహిళ పారిపోయే ప్రయత్నంలో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అక్రమ వలసదారుల్ని ఇక్కడి(పనామా) నుంచే స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారాయన.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు 332 మంది అక్రమ వలసదారుల్ని పంపించి వేసింది. ఈ మేరకు మూడు దఫాలుగా అమృత్‌సర్‌లో అమెరికా యుద్ధ విమానం వలసదారుల్ని తీసుకొచ్చింది. -
భారత 'శ్రమ'కు మస్త్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్నదేశం మనదే. అత్యధికంగా ఉద్యోగ, కార్మిక శక్తి లభ్యత ఉన్న దేశం కూడా భారతే. ఈ భారతీయ వర్క్‌ఫోర్స్‌ను ఇప్పుడు కొన్ని దేశాలు కళ్లకద్దుకొని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత ఉద్యోగ, కార్మిక శక్తికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.అమెరికా వద్దన్నా..డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత అమలుచేస్తున్న కఠిన నిబంధనలతో ఆ దేశంలో భారతీయులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆసియా, యూరప్‌లో మనవాళ్లకు అవకాశాలు పెరుగుతున్నట్లు కేంద్ర కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారత కార్మిక శక్తికి ఇప్పటికే పశ్చిమాసియా అతిపెద్ద జాబ్ మార్కెట్‌గా ఉంది. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాల్లో లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ దేశాల్లో 30 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు లభించవచ్చని కేంద్ర కార్మికశాఖ అంచనా వేసింది.ఒక్క సౌదీ అరేబియాలోనే పదేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు ఉపాధి లభించవచ్చని పేర్కొంది. ఆ దేశంలో నిర్మాణ, రిటైల్, రవాణా, స్టోరేజీ, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో భారతీయులకు మంచి డిమాండ్ ఉన్నట్టు గుర్తించారు.సీఐఐతో కలిసి ‘ఫ్రేమ్‌వర్క్’ తయారీసౌదీ, ఖతార్, ఒమన్, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియాలో భారత వర్క్‌ఫోర్స్‌కు అవకాశాలు పెంచేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)తో కలిసి కేంద్ర కార్మికశాఖ ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. కార్మికుల నైపుణ్యాలు, విద్యార్హతలను గుర్తించి పై దేశాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చటం ఈ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమని అధికారవర్గాలు తెలిపాయి. ఒమన్‌లో ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఖతార్‌లో ఆతిథ్యం, ఏవియేషన్, స్పోర్టింగ్ ఈవెంట్లతో ముడిపడిన పరిశ్రమలు.. జపాన్‌లో నర్సింగ్, ఆతిథ్యం, ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్టేషన్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) రంగాల్లో భారతీయులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. టర్కీ, దక్షిణాఫ్రికా, కువైట్, గుయానా, కెనడా, మలేసియాలలో కూడా భారత వర్కర్లకు అవకాశాలు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.యూఏఈ అతిపెద్ద మార్కెట్వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. మనదేశంలో అందుబాటులో ఉన్న వర్క్‌ఫోర్స్ తదితర అంశాలపై విశ్లేషణ కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో నమోదైన డేటాను కేంద్ర కార్మికశాఖ విశ్లేషించింది. దీని ప్రకారం యూఏఈ భారత వర్కర్లకు అతిపెద్ద గమ్యస్థానంగా నిలుస్తున్నట్టు వెల్లడైంది. 2023–24లో ఇజ్రాయెల్‌లో భారత వర్కర్లకు గణనీయంగా ఉద్యోగాలు లభించాయి. నిపుణులకు జర్మనీ ఆహ్వానంజర్మనీలో వచ్చే ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల మంది భారతీయ వర్కర్లకు ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. జర్మనీ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2035 నాటికి ఆ దేశంలో 70 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత ఏర్పడనుంది. ఆస్ట్రేలియాలో నర్సులు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఫిన్లాండ్లో హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య, ఉత్పత్తి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం భారతీయులకు కాంట్రాక్టు, ప్రాజెక్టు ఆధారిత ఉపాధి అధికంగా ఉంది. కానీ, ఫుల్‌టైమ్ ఉద్యోగాల కల్పనకు మనదేశం మొగ్గుచూపుతున్నట్టు కార్మికశాఖ చెబుతోంది. -
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు. మన్‌దీప్‌ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
వలసదారులతో అమృత్ సర్ కు చేరుకున్న మూడో విమానం
-
సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు
హోషియార్పూర్/పటియాలా/చండీగఢ్: అమెరికా తిప్పి పంపిన రెండో విమానంలోనూ భారతీయ వలసదారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. చేతులకు సంకెళ్లు.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. 116 మందిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు మినహా అందరిదీ ఇదే పరిస్థితి. మరోవైపు వలసదారుల్లోని సిక్కులు తలపాగా ధరించడానికి అమెరికా అనుమతించకపోవడాన్ని ఎస్జీపీసీ ఖండించింది. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వలసదారులలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. హత్య కేసుతో సంబంధం ఉన్న పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు శనివారం రాత్రే అరెస్టు చేశారు. సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లు 2023లో నమోదైన ఒక హత్య కేసులో నిందితులని పోలీసులు ధ్రువీకరించారు. వలసదారుల్లో సిక్కులను తలపాగా ధరించడానికి కూడా అనుమతించకపోవడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ ఖండించారు. విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని విదేశాంగ శాఖను కోరారు. రెండేళ్ల నరకం... శనివారం వచ్చిన వలసదారుల్లో పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా కురాలా కలాన్ గ్రామానికి చెందిన దల్జీత్ది విషాద గాధ. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో అమెరికాకు వెళ్లాలనుకున్న దల్జీత్ ఏజెంట్ రెండేండ్ల పాటు నరకం చూపారు. గ్రామంలోని ఓ వ్యక్తి దల్జీత్‌కు 2022లో ట్రావెల్ ఏజెంట్‌ను పరిచయం చేయగా.. ఆయనకు రూ.65 లక్షలు చెల్లించారు. అవి తీసుకున్న ఏజెంట్ 2022లో దల్జీత్‌ను మొదట దుబాయ్‌కు పంపారు. 18 నెలలు అక్కడున్న తరువాత.. ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఆ తరువాత అతన్ని అమెరికా పంపుతానని చెప్పి.. దక్షిణాఫ్రికాకు పంపించారు. అక్కడ నాలుగున్నర నెలలున్నారు. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 26న డంకీ మార్గం ద్వారా అమెరికా వెళ్లేందుకు ముంబై నుంచి బ్రెజిల్‌కు పంపించారు. బ్రెజిల్లో దాదాపు నెల రోజుల పాటు గడిపిన తర్వాత మూడు రోజులపాటు కాలినడక, ట్యాక్సీ, వివిధ మార్గాల ద్వారా పనామా దాటించారు. చివరకు మెక్సికోకు చేరుకున్న దల్జీత్ అక్కడా నెలరోజులపాటు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ట్రావెల్ ఏజెంట్ దల్జీత్‌ను ఇబ్బందులకు గురి చేశారు. అమెరికాకు పంపాలంటే.. వారి కుటుంబానికున్న నాలుగున్నర ఎకరాల భూమి యాజమాన్యాన్ని తనకు బదలాయించాలని ఒత్తిడి తెచ్చారు. బదిలీ చేసిన తరువాత జనవరి 27న దల్జీత్‌ను యూఎస్‌లోకి పంపించేశారు. అక్కడ అధికారులు అరెస్టు చేసి, డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. బయటకు కూడా రానివ్వకుండా గదిలో బంధించారు. ఆహారంగా నీళ్లబాటిల్, చిప్స్ ప్యాకెట్, ఆపిల్ ఇచ్చారు. రెండో విమానంలో తిరిగి భారత్‌కు పంపించారు. -
Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే..
కాఠ్మాండు: నేపాల్ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్‌లోని బాగమతి ప్రాంతంలో అరెస్టు చేశారు. వీరు ఆన్లైన్లో అక్రమంగా బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. నేపాల్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వీరు కాఠ్మాండుకు 10 కిలోమీటర్ల దూరంలోని బుద్ధనిలకంఠ ప్రాంతంలోని రెండస్తుల భవనంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక రహస్య సమాచారం మేరకు ఒక భవనంపై దాడి చేసి, 23 మంది భారతీయ పౌరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 81 వేల రూపాయలు, 88 మొబైల్ పోన్లు, 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని యాంటీ గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం నేపాల్ పోలీసులు కోట్ల రూపాయల విలువైన ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను చేధించారు.అలాగే పది మంది భారతీయులతో సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. లలిత్‌పూర్‌లోని సనేపా ప్రాంతంలో రెండు ఇళ్లపై ప్రత్యేక పోలీసు బృందం దాడి చేసి, ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మంది భారతీయ పౌరులు, 14 మంది నేపాలీ జాతీయులను అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని నేపాల్ పోలీసులు తెలిపారు. నిందితులు రెండు అద్దె ఇళ్లలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్ సంగమం స్టేషన్ మూసివేత -
టెక్నాలజీ ఊబిలో భారతీయులు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్‌తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్‌టాప్‌లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్‌టాప్ పక్కనబెడితే స్మార్ట్‌ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్‌కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్‌మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్‌ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్‌లు హేతువులుగా మారాయి. వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్‌లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్టూవన్హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది. సగం మంది డివైజ్‌లను వదల్లేక పోతున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్‌లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు. యువతలో పెరిగిన మానసిక సమస్యలు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి. ఆత్మహత్య భయాలూ ఎక్కువే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్వరలో అమెరికా నుంచి వచ్చే జాబితాలో ఎంతమంది..?
న్యూఢిల్లీ:అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక కీలక ప్రకటన చేసింది. త్వరలో మరో 487 మంది భారతీయ పౌరులను దేశం నుంచి తరలించాలన్న ఆదేశాలున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయాన్ని తమకు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని మిస్రీ చెప్పారు.అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అయితే భారతీయులను మిలిటరీ విమానంలో అవమానించే తరహాలో తీసుకురావడంపై దేశంలో రాజకీయ దుమారం రేపింది. కాగా, బుధవారం అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన సైనిక విమానంలో 105 మంది వలసదారులున్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు.అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. -
భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు..మస్క్ టీమ్ సభ్యుడు రాజీనామా
వాషింగ్టన్:ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వం వహిస్తున్న అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్ నుంచి ఓ ఇంజినీర్ రాజీనామా చేశాడు. 25 ఏళ్ల మార్కో ఇలెజ్ అనే ఇంజినీర్ భారతీయులపై సోషల్‌మీడియాలో గతంలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో దుమారం రేగింది. ముఖ్యంగా భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇలెజ్ తన పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇలెజ్ రాజీనామాపై అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అతడు గతంలో ‘నార్మలైజ్ ఇండియా హేట్’ అనే పోస్టుతో పాటు ఇండియా నుంచి వచ్చిన హెచ్-1బీ వీసాదారులను ఉద్దేశించి ‘గోయింగ్ బ్యాక్ డోంట్ వర్రీ’ అనే వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీవోజీఈ ట్రెజరీ డిపార్ట్మెంట్కు ఇలెజ్ రాజీనామా చేశాడు. ఈ పోస్టు ఖాలీ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే నోటిపై చేసింది. ఇలెజ్ డీవోజీఈ కంటే ముందు ఎక్స్(ట్విటర్)లోనూ ఇలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గమనార్హం.కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి సైనిక విమానాల్లో పంపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సన్నిహితుడైన ఇంజినీర్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. -
ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు
-
కరిగిపోయిన అమెరికా కల
చండీగఢ్/హోషియార్పూర్(పంజాబ్): ప్రమాదకరరీతిలో సముద్రంలో పడవ ప్రయాణం, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడక, మెక్సికో సరిహద్దులోని చీకటి గదుల్లో బస.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకు ఎలాగైనా చేరుకునేందుకు భారతీయ అక్రమ వలసదారుల పడిన కష్టాలెన్నో. రహస్యంగా సరిహద్దు దాటించే ఏజెంట్లకు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి అమెరికాకు ఎలాగోలా చేరుకుంటే తిరిగి పోలీసులకు దొరికిపోయి సంకెళ్లతో స్వదేశానికి వచ్చిన కొందరు అక్రమ వలసదారులు తమ కన్నీటి కష్టాలను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. తమ అమెరికా కల ఎలా చెదిరిపోయిందో వివరించారు. తీవ్రమైన నేరస్తుల్లా చేతులకు, కాళ్లకు బేడీలు వేసి సైనిక విమానంలో అమెరికా భారత్‌కు పంపింది. ఒకే ఒక టాయిలెట్ ఉన్న సైనిక విమానంలో వందమందికి పైగా అక్రమ వలసదారులను కుక్కి ఏకంగా 24 గంటల పాటు ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తయితే అసలు తాము వచ్చేది స్వదేశానికి అన్న విషయం అమృత్సర్ విమానాశ్రయంలో అడుగుపెట్టేదాకా వారికి తెలియకపోవడం మరో విషాదం. అమెరికా నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న సైనిక విమానంలో 105 మంది వలసదారులన్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. వీరిలో ఒకొక్కరిదీ ఒక్కో గాథ. అందరిదే ఒకటే వ్యథ. చీకటి గదిలో ఉంచారు ‘‘నన్ను డంకీ మార్గం గుండా తీసుకెళ్లారు. మేం వెళ్తుండగా మార్గమధ్యంలో రూ.35 వేల విలువైన దుస్తులు చోరీ అయ్యాయి. మమ్మల్ని మొదట ఇటలీకి, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారు. 15 గంటల పాటు పడవ ప్రయాణం. తర్వాత దాదాపు 45 కిలో మీటర్లు నడిచాం. దాదాపు 18 కొండలు దాటాం. అంతెత్తు నుంచి జారిపడ్డామంటే బతికే అవకాశమే లేదు. మార్గమధ్యంలో కొన్ని మృతదేహాలను కూడా చూశాం. అమెరికాలోకి ప్రవేశించడానికి సరిహద్దు దాటకముందే మెక్సికోలో నన్ను అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు చీకటి గదిలో ఉంచారు. వేలాది మంది పంజాబీలు, వాళ్ల కుటుంబాలు, వాళ్ల పిల్లలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. మేం వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డాం. ఇంకెవరూ ఇలా తప్పుడు మార్గాల్లో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించకండి’’ అని పంజాబ్‌లోని జలంధర్ జిల్లా దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ సలహా ఇచ్చారు. కపుర్తలాలోని తర్ఫ్ బెహ్బల్ బహదూర్ గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్‌ను అతని కుటుంబం ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ అమెరికాకు పంపింది. ఫతేగఢ్ సాహిబ్‌లో జస్వీందర్ సింగ్‌ను విదేశాలకు పంపేందుకు అతని కుటుంబం రూ.50 లక్షలు అప్పు చేసింది. పంజాబ్‌లో ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే జలంధర్, హోషియార్పూర్, కపుర్తలా, నవాన్షహర్ జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కథలే ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఇక్కడి నుంచి ఏటా పెద్ద సంఖ్యలో స్థానికులు డాలర్లవేటలో పడి విదేశాలకు అక్రమ మార్గాల్లో వలసలు వెళ్తున్నారు. ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తూ అమెరికా వెళ్తున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంకెళ్లతో ప్రయాణం ‘‘చట్టబద్ధంగానే అమెరికా పంపిస్తానని చెప్పి ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. అందుకు రూ.30 లక్షలు తీసుకున్నాడు. గతేడాది జూలైలో విమానంలో బ్రెజిల్‌కు వెళ్లాను. అక్కడి నుంచి అమెరికాకు కూడా విమానంలోనే పంపిస్తామని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఆరు నెలలపాటు బ్రెజిల్లో ఉన్న తరువాత.. అక్రమంగా సరిహద్దు దాటించి పంపేందుకు ప్రయత్నించారు. అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ 11 రోజుల పాటు కస్టడీలో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించారు. భారత్‌కు పంపించేస్తున్నట్లు నాకు తెలియదు. ఏదో క్యాంప్‌కు తీసుకెళ్తున్నా రని అనుకున్నాం. అమృత్సర్ విమానాశ్రయం వచ్చాక సంకెళ్లను తీసేశారు. బహిష్కరణతో కుంగిపోయా. అమెరికా వెళ్లడానికి అప్పు చేశా ను. కుటుంబానికి మంచి భవిష్యత్ ఇవ్వా లని కలలు కన్నా. ఇప్పుడవన్నీ చెదిరిపోయాయి’’ అని గురుదాస్ పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన జస్పాల్ వాపోయారు.సముద్రంలో, అడవిలో ప్రాణాలు పోయాయి ‘‘గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లా. తొలుత యూరప్‌కు, ఆ తర్వాత మెక్సికోకు తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్ హామీ ఇచ్చాడు. రూ.42 లక్షలు చెల్లించాను. కానీ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, ఆ తర్వాత మెక్సికో దేశాల గుండా తీసుకెళ్లారు. పర్వత మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లాం. మెక్సికో సరిహద్దు వైపు లోతైన సముద్రంలోకి ఒక చిన్న పడవలో పంపారు. నాలుగు గంటల సముద్ర ప్రయాణం. మా పడవ బోల్తా పడింది. మాతో వచ్చిన వలసదారుల్లో ఒకరు నీటిలో పడి జలసమాధి అయ్యారు. మరొకరు పనామా అడవి గుండా వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డా. దారిలో కొన్నిసార్లే అన్నం దొరికేది. మంచి భవిష్యత్తుపై ఆశతో అధిక వడ్డీకి అప్పు చేసి ఏజెంట్‌కు చెల్లించాం. కానీ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశారు. అమెరికా బహిష్కరించడంతో చివరకు భారీ అప్పుతో సొంతూరకు వచ్చిపడ్డాం’’ అని హోషియార్ పూర్ జిల్లాలోని తహ్లీ గ్రామవాసి హర్విందర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
అవమానించినా మొద్దునిద్రేనా?
న్యూఢిల్లీ: అమెరికాలోని భారతీయ అక్రమ వలసదార్లకు బేడీలు వేసి స్వదేశానికి తరలించిన ఘటనపై గురువారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. భారతీయులను అమెరికా ప్రభుత్వం ఘోరంగా అవమానించినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. మోదీ సర్కారు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను నాలుగుసార్లు వేయాల్సి వచి్చంది. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చించాల్సి ఉంది. కానీ, భారతీయులకు జరిగిన అవమానంపై చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. సభాపతి అంగీకరించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత అవమానం జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని దుయ్యబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ నాలుగు సార్లు వాయిదా పడిన పరిస్థితిలో మార్పు రాలేదు. సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లోక్‌సభలో ఒక ప్రకటన చదివి వినిపించారు. స్వదేశానికి తరలించే భారతీయులను అవమానించకుండా అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. జైశంకర్ ప్రకటన తర్వాత కూడా విపక్షాల నిరసన కొనసాగింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. మనవాళ్ల పట్ల అమెరికా అధికారులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే మోదీ సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఎంపీలు చేతులకు సంకెళ్లు ధరించారు. ‘ఖైదీలు కాదు... మనుషులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌ను, భారతీయులను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురాలేరా? అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై మోదీ ప్రభుత్వం సమగ్రమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. భారతీయులను గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురావడానికి మన విమానాలు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఆవేదన వెల్లడిస్తున్న భారతీయ వలసదారుడి వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ బాధితుడి ఆవేదన వినాలని ప్రధాని మోదీకి సూచించారు. భారతీయులకు కావాల్సింది గౌరవం, మానవత్వం తప్ప సంకెళ్లు కాదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికైనా నోరు విప్పాలని ప్రియాంక అన్నారు. మనవాళ్లను మనం ఎందుకు తీసుకురాలేకపోయామని అన్నారు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ భారతీయులకు ఈ పరిస్థితి ఎందుకు వచి్చందో చెప్పాలని నిలదీశారు. మన దేశం నుంచి ఎవరినైనా పంపించాల్సి వస్తే ఇలాగే బేడీలు వేసి పంపిస్తారా? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, శివసేన (ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, శశి థరూర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ తదితరులు మోదీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. -
అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం ప్రకటన
-
US Returns: ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.. సినిమాను తలపించే కథ!
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే (Donald Trump) అక్రమ వలస దారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం(USA).. పలువురు భారతీయుల్ని వెనక్కి పంపుతోంది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎవరినీ ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విధంగానే పలువుర్ని తిరిగి తమ స్వదేశాలకు పంపుతున్నారు. ఇందులో భారతీయులు కూడా అధికంగానే ఉన్నారు. దీనిలో భాగంగా నిన్న (బుధవారం) ఓ విమానంలో 104 మంది వరకూ భారత్‌కు తిరిగి వచ్చారు. ఇందులో పంజాబ్ వారే అత్యధికంగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క గాథ.అమెరికా వెళితే జీవితం సెటిల్ అయిపోతుందనే భావనతో చాలామంది లక్షల్లో డబ్బులు చెల్లించి అక్రమంగా అక్కడకు వెళ్లిన వారు.. అక్కడ ప్రభుత్వం తాజా చర్యలతో ఉసురుమంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో కొంతమందిని జాతీయ మీడియా పలకరించగా, ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతున్నారు. తాము అక్రమంగా(illegal immigrants) వెళ్లామా.. లేదా అన్న సంగతిని అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో వారు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ చేతులు దులుపుకున్న వైనమే మనకు వారి మాటల్లో కనిపిస్తోంది.పంజాబ్‌లోని వీర్పల్ గ్రామం నుంచి అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన సుఖ్జీత్ కౌర్ అనే 26 ఏళ్ల యువతి.. తన కాబోయే వాడిని పెళ్లి చేసుకోవడానికి దొడ్డిదారిన అమెరికాకు వెళ్లింది. అయితే ఆమె పెళ్లి జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఆమెను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. సుఖ్జీత్ తన చదువును పంజాబ్‌లోనే పూర్తి చేసుకున్నప్పటికీ తన భర్త కాబోయే వాడు అమెరికాలో ఉండటంతో అక్కడకు అక్రమంగా ప్రవేశించింది. ఒక ఏజెంట్‌కు లక్షల్లో డబ్బులు చెల్లించి అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె పెళ్లి కాకుండానే అమెరికాను వీడి స్వదేశానికి చేరుకుంది. సుఖ్జీత్ కౌర్ తండ్రి ఇటలీలో నివసిస్తుండగా, తల్లి, సోదరుడు పంజాబ్‌లోనే ఉంటున్నారు.అమృత్సర్ నివాసి అయిన అజయ్దీప్ సింగ్‌ది మరో కథ. 15 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలస దారుల్నివెనక్కి పంపుతుందనే సమాచారం ఉన్నా అతను మాత్రం యూఎస్‌కు అక్రమంగా వలస వెళ్లాడు.. అయితే అజయ్దీప్ సింగ్ కూడా తిరిగి భారత్‌కు పంపబడ్డ జాబితాలో ఉండటంతో అతను తాత చరణ్‌జీత్ సింగ్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. తన మనవడ్ని వెనక్కి పంపడం కచ్చితంగా తప్పేనని అంటున్నాడు. ఈరోజుల్లోఅమెరికాకు వెళ్లాలని యువత అనుకోవడం తప్పా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అమెరికాకు వెళ్లాలనే యువత ఆలోచనల్లో తప్పేందముని అక్రమ వలస విధానాన్ని కూడా సమర్థించుఉంటున్నాడు.అమృత్‌సర్‌కు చెందిన దలీర్సింగ్ది మరో గాథ.. అతనొక బస్సు డ్రైవర్. అమెరికాకు వెళ్లి లక్షల్లో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఎలాగోలా రూ. 30 లక్షలు కూడబెట్టి ఒక ఏజెంట్‌ను పట్టుకుని అక్రమంగా యూఎస్‌కు వెళ్లిపోయాడు. అది కూడా నెలక్రితమే అతను అమెరికాకు చేరుకున్నాడు. అయితే 15 రోజుల క్రితం వరకూ ఫోన్ కాల్లో కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్న దలీర్ సింగ్.. ఆ తర్వాత నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు. అయితే అతన్ని తిరిగి ఇండియాకు పంపుతున్నట్లు అమెరికా పోలీసుల నుంచి కాల్ రావడంతో దలీర్ సింగ్ గురించి తెలిసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అక్షదీప్.. ఇతను కూడా అమెరికాకు అక్రమంగా వెళ్లి అడ్డంగా బుక్కైపోయాడు. అమెరికాలో చదువుల కోసం అతను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అక్షదీప్ దుబాయ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ ట్రక్ డ్రైవర్‌గా పని ేచేస్తున్నాడు అక్షదీప్,.అయితే అతను తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్నాడు. అందుకు తండ్రి స్వర్ణ్ సింగ్ సాయం కోరాడు. అందుకు తండ్రి సరే అన్నాడు. దానిలో భాగంగా తండ్రి స్వర్ణ్సింగ్ కు ఉన్న మూడు ఎకరాల భూమిని తాకట్టు పెట్టాడు. అయితే సుమారు రూ. 50 లక్షల నుంచి ూరూ. 60 లక్షల వరకూ ఖర్చు పెట్టాడు కుమారుడు అమెరికా పయనం కోసం. అయితే అమెరికాకు వెళ్లిన వాడు వెళ్లినట్లు తిరిగి వచ్చేశాడు అక్షదీప్ సింగ్.దీనిపై తండ్రి స్వర్ణ్ సింగ్ మాట్లాడుతూ.. కొడుకు క్షేమంగాతిరిగి ాభారత్కు వచ్చాడని, అదే సంతోషమని అంటున్నాడు. డబ్బులు అనేవి వస్తుంటాయి.. పోతుంటాయి అని, ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు.అక్రమ వలస దారులతో భారత్‌లో దిగిన తొలి విమానంఅవును.. సంకెళ్లు, గొలుసులతో బంధించే తీసుకొచ్చారు -
‘అవును.. సంకెళ్లు, గొలుసులతో బంధించే తీసుకొచ్చారు!’
న్యూఢిల్లీ: అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపే విషయంలో ట్రంప్ కఠిన వైఖరిని వీడడం లేదు. భారత్‌తో ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నా.. ఈ విషయంలో మినహాయింపు లేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు కూడా. ఈ క్రమంలో బుధవారం తొలిబ్యాచ్ భారత్‌కు చేరుకోగా.. వాళ్ల పట్ల యూఎస్ ఎంబసీ వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. అమెరికా నుంచి భారత్‌కు చేరుకునేంత వరకు.. తమ కాళ్లు చేతులకు బంధించే ఉంచారని వాపోయారు వాళ్లు. ‘‘అమెరికాలో మమ్మల్ని ఓ క్యాంప్‌లో ఉంచారు. అక్కడి నుంచి మమ్మల్ని మరో క్యాంప్‌నకు తరలిస్తారని భావించాం. కానీ, అలా జరగలేదు. ఓ పోలీస్ అధికారి వచ్చి ఇండియాకు తిరిగి పంపించేస్తున్నామని చెప్పారు. అయితే విమానం ఎక్కాక చేతులకు సంకెళ్లు వేసి.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. అమృత్‌సర్‌లో దిగేంత వరకు మమ్మల్ని అలాగే ఉంచారు’’ అని పంజాబ్‌కు ెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.అయితే.. అలాంటిదేం జరగలేదని, అదంతా తప్పుడు ప్రచారం ఇంతకు ముందు కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోను కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా అబద్ధంగా తేల్చేసింది. అది గ్వాటెమాలకు సంబంధించిన అక్రమ వలసదారుల చిత్రమని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా వలసదారుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులను అవమానకరరీతిలో వెనక్కి పంపించారని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగఢేను ఇలాగే అవమానిస్తే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా స్పందించని, దీంతో అమెరికా ప్రభుత్వం దిగివచ్చి విచారం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.ట్రంప్ అధికారం చేపట్టాక.. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిచేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తరలింపు కోసం ఎలాంటి సౌకర్యాలు లేని యుద్ధవిమానాలను ఉపయోగించడం, పైగా వాళ్లకు బేడీలు వేసి మరీ లాక్కెళ్తూ అమానుషంగా ప్రవర్తిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథజస్పాల్తో పాటు మరికొందరు భారతీయులు జనవరి 24వ తేదీన మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న టైంలో పట్టుబడ్డారట. ఓ ఏంజెట్ చేసిన మోసం వల్లే తాను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని జస్పాల్ కంటతడి పెట్టాడు. హర్విందర్ అనే యువకుడు మాట్లాడుతూ.. తనను ఏజెంట్ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, ఇలా.. అంతటా తిప్పి మెక్సికోకు చేర్చాడని, అయితే అక్కడి నుంచి అమెరికా వెళ్లే క్రమంలో తమ బోటు ప్రమాదానికి గురైందని వివరించాడు. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా.. తనతోపాటు కొందరు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌కే చెందిన మరో వ్యక్తి.. తన బట్టలను ఎవరో దొంలించారని చెబుతున్నాడు. కొండలు దాటి, కిలో మీటర్లు ప్రయాణించి అమెరికాలోకి ప్రవేశించేందుకు వాళ్లు చేసిన ‘డంకీ’ కష్టాల గురించి వాళ్లంతా మీడియాకు వివరించారు. దారి పొడవునా శవాలను దాటుకుంటూ.. అత్యంత కష్టతరమైన పరిస్థితుల నడుమ తాము ప్రయాణించామని చెబుతున్నారు వాళ్లు. వాళ్లను కదిలిస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఆర్థిక సమస్యలతోనే తాము దొడ్డిదారిన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించామని చెబుతున్నారు.డంకీ అంటే మరోదేశంలోకి అక్రమంగా చొరబడడంఇక.. తొలి బ్యాచ్‌లో 104 అక్రమ వలసదారులు రాగా.. 33 మంది హర్యానా, గుజరాత్ 33, పంజాబ్ 30 మందిని, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, ఛండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు. అలాగే 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. నాగేళ్ల పిల్లాడు, ఐదు..ఏడేళ్ల వయసున్న అమ్మాయిలూ ఉన్నారు. ఇక.. అమృత్‌సర్‌లో దిగిన వలసదారులతో పంజాబ్ మంత్రి కుల్దీప్ మాట్లాడారు. ఎలాంటి కేసులు ఉండబోవని, గుర్తింపులను ధృవీకరించుకున్నాక స్వస్థలాలకు పంపిస్తామని వాళ్లకు ఆయన భరోసా ఇచ్చారు. -
బంగారం డిమాండ్ @ రూ.5.15 లక్షల కోట్లు
ముంబై: పసిడి కొనుగోళ్లు, పెట్టుబడులు 2024లో పండుగలా సాగాయి. గత ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 802.8 టన్నులకు చేరుకుంది. పరిమాణం పరంగా 2023 సంవత్సంతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, విలువ పరంగా చూస్తే ఏకంగా 31 శాతం వృద్ధి కనిపించింది. 2023లో 761 టన్నుల బంగారం కోసం భారతీయులు రూ.3,92,000 కోట్లను ఖర్చు చేయగా, 2024లో 802.8 టన్నుల కోసం ఏకంగా రూ.5,15,390 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ గణాంకాలతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్లూజీసీ) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2025లో బంగారం డిమాండ్ భారత్‌లో 700–800 టన్నుల మధ్య ఉండొచ్చు. వివాహ సంబంధిత కొనుగోళ్లతో బంగారం ఆభరణాలకు డిమాండ్ కొనసాగుతుంది. దీంతో ధరల పరంగా కొంత స్థిరత్వం ఉండొచ్చు’’అని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు. తగ్గిన ఆభరణాల డిమాండ్ → 2024లో బంగారం ఆభరణాల డిమాండ్ 2 శాతం తక్కువగా 563.4 టన్నులకు పరిమితమైంది. 2023లో ఆభరణాల డిమాండ్ 575.8 టన్నులుగా ఉంది. → గతేడాది జూలైలో బంగారం దిగుమతుల సుంకాన్ని తగ్గించడంతోపాటు, ఇతర మార్కెట్లతో పోలి్చతే భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయడం సానుకూలించినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. → పండుగల సీజన్‌కు కీలకమైన 2024 చివరి మూడు నెలల కాలంలో పసిడి డిమాండ్ 265.8 టన్నులుగా ఉంది. 2023 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 266.2 టన్నులతో పోల్చితే మార్పు అతి స్వల్పమే. పెట్టుబడులకు ఆకర్షణీయం → అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా పేరొందిన పసిడి.. 2024లో పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది. 2024లో బంగారంపై పెట్టుబడులు 29 శాతం పెరిగి 239.4 టన్నులకు చేరాయి. 2013 తర్వాత తిరిగి ఇదే గరిష్ట స్థాయి. → 2023లో బంగారం పెట్టుబడుల డిమాండ్ 185.2 టన్నులుగా ఉంది. → బంగారం ఈటీఎఫ్‌ల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. దీంతో పెట్టుబడి పరంగా పసిడికి డిమాండ్ ఇక ముందూ బలంగానే కొనసాగనుంది.జోరుగా ఆర్బీఐ కొనుగోళ్లు → 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. 2023లో 16 టన్నుల కొనుగోలుతో పోలి్చతే నాలుగు రెట్లు అధికంగా గతేడాది సొంతం చేసుకుంది. → బంగారం రీసైక్లింగ్ పరిమాణం 2% తక్కువగా 114.3 టన్నులుగా నమోదైంది. 2023లో రీసైక్లింగ్ పరిమాణం 117.1 టన్నులుగా ఉంది. → బంగారం దిగుమతులు గతేడాది 4 శాతం తక్కువగా 712.1 టన్నులకు పరిమితమయ్యాయి. 2023లో దిగుమతుల పరిమాణం 744 టన్నులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన డిమాండ్ → 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 4,974 టన్నులుగా నమోదైంది. 2023లో డిమాండ్ 4,945.9 టన్నులతో పోల్చితే ఒక శాతం పెరిగింది. → మూడు, నాలుగో త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్‌లు రేట్ల కోత ఆరంభించడం, అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా ఉన్నాయి. → సెంట్రల్ బ్యాంక్‌లు 1,044.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2023లో కొనుగోళ్లు 1,050.8 టన్నులుగా ఉన్నా యి. → పెట్టుబడులకు డిమాండ్ 25% పెరిగి 1,179.5 టన్నులకు చేరింది. 2023లో పసిడి పెట్టుబడుల డిమాండ్ 945.5 టన్నులుగా ఉంది. → బంగారం కాయిన్లు, బార్లకు డిమాండ్ 2023 స్థాయిలోనే 1,186 టన్నులుగా నమోదైంది. → 2024 మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 11 శాతం క్షీణించి 1,877.1 టన్నులకు పరిమితమైంది. 2023లో ఇది 2,110.3 టన్నులుగా ఉంది. → 2025లోనూ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల డిమాండ్ బలంగానే కొనసాగొచ్చని డబ్ల్యూజీసీ అంచనా. -
అమెరికా విమానంలో.. ఆ రాష్ట్రాల వారే ఎక్కువ..!
అమృత్సర్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల్లో భాగంగా అమెరికా పంపించిన ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చిన వలసదారుల్లో ఎవరెవరున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం(ఫిబ్రవరి5) మధ్యాహ్నం 1.45గంటలకు అమృత్‌సర్‌లోని గురురామ్దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.విమానంలో మొత్తం 205 మంది భారతీయలను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. అయితే విమానంలో 104 మంది మంది భారతీయులే ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్,హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు.విమానంలో వచ్చిన వారిలో 4 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉండడం గమనార్హం. అమెరికా నుంచి అందరు భారతీయులకు స్వాగతం పలికామని, మన దేశానికి చెందిన వారిని ఇలా పంపించి వేయడం దురదృష్టకరమని పంజాబ్ డీజీపీ వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత అక్రమ వలసదారుల ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి -
అక్రమ వలసదారులతో భారత్‌లో దిగిన తొలి విమానం
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు విమానంలో 205 మంది లేరు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీళ్లతో పాటు అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా వచ్చారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్‌సర్‌లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం. భారత్ ఇప్పుడు వీళ్లనేం నేరస్థులుగా చూడదు. అయితే.. వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని చెబుతున్నారు.గడువు ముగిసినా, ఎటువంటి అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి వాళ్ల వాళ్ల దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్(Trump) ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి బ్యాచ్ కింద.. వీళ్లను అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. వీళ్లలో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో భారత అక్రమ వలసదారులు(Indian Illegal Immigrants).. ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే!. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు ట్రంప్ ఈ చర్యను భారత్ గతంలోనే స్వాగతించింది. అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో ఏమూల ఉన్నా అక్రమ వలసదారులను తాము వెనక్కి పిలిపించుకుంటామని విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Sankar) స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వకుండా.. ఇలా వెనక్కి పంపించేయడం సరికాదని అంటున్నారాయన. ఈ విషయంపై జై శంకర్‌తో ఆయన చర్చించనున్నట్లు తెలిపారు. -
వలసదార్లకు దిన దిన గండం
అమెరికా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల్లాగే భారతీయులకూ ఓ కలల ప్రపంచం. ఆ డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. ఇలా ఎలాగోలా చట్టవిరుద్ధంగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి అవమానాలు పడుతున్నారు?డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వలసదారులు అమెరికాలో అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలేవీ రికార్డుల్లో ఉండవు. రికార్డులో ఉండాలంటే.. వీసాలు, వర్క్ పర్మిట్లు కావాలి. ఉదాహరణకు అమెరికన్లు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలన్నమాట. దక్షిణ కాలిఫోర్నియాలోని పొలాల్లో పని ఇందులో ఒకటి. ఎక్కువ సమయం, శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వేరే పని దొరక్క దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇలాంటి పనులు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుక్షణం భయం.. భయం ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌కు అక్రమంగా వలస వచ్చిన ఒక భారతీయుడు ఉదయం 6 గంటలకే గ్యాస్‌స్టేషన్‌లో పనిలో నిమగ్నమవుతాడు. రాత్రిదాకా ఒళ్లు హూనమయ్యేలా పనిచేసి బయటి తిండి తిని తన బంధువుల ఇంట్లో బేస్మెంట్లో నిద్రపోతాడు. ఇందులో కష్టమేముందని దూరం నుంచి చూసిన వాళ్లకు అనిపించొచ్చు. కానీ పని చేసినంత సేపు ఇలాంటి వారి జీవితాల్లో అంతకుమించిన నరకయాతన ఉంటుంది. రిజిస్టర్డ్ వర్క్‌ప్లేస్‌లో పనిచేయలేరు. ఎలాంటి అధికారిక శిక్షణ పొందే అర్హత ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటికీ రాదు. డ్రైవింగ్ చేయలేరు. సైకిల్ తొక్కుతూ వెళ్లాల్సిందే. అది కూడా అక్కడి అధికారులకు అనుమానం వస్తే పట్టుబడతానేమోనని భయం వెంటాడుతుంది. నిరంతరం మనసులో ఏదో భయం. ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందోనన్న ఆందోళన. వస్తువులు పోయినా, ఎవరితోనైనా గొడవ జరిగినా, తననెవరైనా కొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ వెళ్లలేరు. పట్టుబడితే వారికే రిస్క్. అందుకే ఏం జరిగినా భరించాల్సిందే. ఇంత శ్రమ ఎందుకూ అంటే.. స్వదేశంలో మధ్య తరగతి జీవితం గడుపుతున్న తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే తపన. కుటుంబాన్ని అమెరికాకు తీసుకురావాలి. అందుకు సరిపడా సంపాదించాలి. లీగల్ రెసిడెంట్‌గా అనుమతి పొందేందుకు లాయర్‌కు పెట్టుకునేంత సంపాదించాలి. ఇలా ఎన్నో ఆశలు. అమెరికన్ అధికారుల నుంచి తప్పించుకోవడం కత్తిమీద సాము. అలాంటిది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి రోజూ ఏదో ఒక విధంగా తప్పించుకోవడం వారికి సర్వసాధారణమైపోతుంది. తోటి భారతీయుల సాయంతో.. అక్రమ వలసదారుల జీవితాల్లో అక్కడి తమలాంటి వాళ్ల సమూహం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అక్రమ వలసదారులు కనీసం సిమ్ కార్డు పొందలేరు. బంధువులు ఇచ్చిన సిమ్ కార్డులను ఉపయోగించి స్వదేశంలోని కుటుంబంతో మాట్లాడతారు. బ్యాంకు ఖాతా పొందే అవకాశమే లేదు. సెప్టెంబర్ 11న 9/11 వైమానిక దాడుల తర్వాత అమెరికాలో అన్ని నిబంధనలు కఠినం చేశారు. అందులోభాగంగా బ్యాంకింగ్ నియమాలూ మారాయి. అందుకే స్థానిక యజమానులు అక్రమ వలసదారులకు పనికి వేతనాన్ని కేవలం నగదు రూపంలోనే చెల్లిస్తారు. అదనపు ఆదాయం కోసం, తెలిసినవారి తోటల్లో పనిచేయడం, ఇళ్ల గోడలకు పెయింటింగ్ వేయడం, ఇతర పనులలో సహాయం చేస్తూ ఇంకాస్త డబ్బు సంపాదిస్తారు. అక్రమవలసదారులు అనారోగ్య సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సాధారణంగా అమెరికా ఆసుపత్రులు చట్టవిరుద్ధమైన నివాసితులకు చికిత్సను నిరాకరించవు. కానీ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల ఆస్పత్రుల వద్ద వైద్యం కాస్త కష్టంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా అక్కడి చట్టబద్ధ భారతీయ వైద్యులను వీళ్లంతా ఆశ్రయిస్తారు. చవకగా వైద్య చికిత్సలు పొందుతారు. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డు సంపాదించిన భారతీయుల సహాయంతో ఆన్లైన్ ద్వారా స్వదేశానికి డబ్బులు పంపుతున్నారు. జీవితాలనే పణంగా పెట్టి... చాలా మంది డాక్టర్లు, నర్సులు, లాయర్లు ఇక్కడికి వచ్చి కూలీలుగా పనిచేసి డాక్యుమెంట్లు తయారు చేయించుకున్నారు. ఇలా రకరకాల పనులు చేసి.. డబ్బు సంపాదించి అనుమతి పొందిన వారు చాలా మంది తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకొచ్చారు. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు డాక్యుమెంటేషన్ అడగవు. దీంతో ఇప్పటివరకు వారి పిల్లలను తీసుకురావడం సులభమైంది. కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకంచేయడం తెల్సిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు. డాక్యుమెంట్లు లేకుండా ఎట్లా వెళ్తున్నారు? కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి కొన్ని అక్రమ విధానాలను అవలంభిస్తున్నారు. పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు. ఆ వీసా గడువు ముగిసినా భారత్‌కు తిరిగిరారు. తప్పించుకు తిరుగుతారు. ఇక భూమార్గంలో వేర్వేరు దేశాలు దాటి వస్తూ చిట్టచివరకు అమెరికా గడ్డపై కాలుమోపుతారు. ‘డంకీ’రూట్‌గా దీనికి పేరు. సరిహద్దులు దాటించేసే ఏజెన్సీలకు దాదాపు 1 లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన విద్యార్హతలు, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకొందరు తొలుత అమెరికా పొరుగున్న ఉన్న కెనడాకు వచ్చి అక్కడ 76 రోజుల విజిటర్ వీసా సంపాదించి అలా అమెరికాకు వచ్చి ఇక అక్కడే తిష్టవేస్తారు. వలసదారులు సాల్వడార్, నికరాగ్వాల గుండా కూడా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా వేర్వేరు అక్రమ విధానాలను అవలంభించి ఇప్పటిదాకా 7,25,000 మంది అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా వచ్చిన అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం
అమెరికాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో అప్పుడప్పుడు చోటుచేసుకునే కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తుంటాయి. గత సంవత్సరం అంటే 2024లో అమెరికాలోని పలు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాదిలో 80కి పైగా అమెరికన్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు నమోదుకాగా, పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు.ఇటువంటి కాల్పుల ఘటనల కారణంగానే తమ పిల్లలను అమెరికాలో చదువుకునేందుకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. 2025లో భారతదేశం నుండి వేలాది మంది విద్యార్థులు అమెరికన్ కళాశాలలు(American colleges), విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రల్లో ప్రశాంతమైన వాతావరణం(Calm atmosphere) ఉంది. అక్కడ విద్యార్థులు చదువుకునేందుకు పలు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలోని 10 రాష్ట్రాలివే..అమెరికాలోని 10 సురక్షితమైన రాష్ట్రాలువ్యోమింగ్నార్త్ డకోటాసౌత్ డకోటాహవాయీవెర్మోంట్మెయిన్అలాస్కావెస్ట్ వర్జీనియారోడ్ ఐలాండ్న్యూ హాంప్షైర్అమెరికాలోని అత్యంత సురక్షితమైన ఈ రాష్ట్రాల జాబితాను ఇక్కడ జరిగిన కాల్పుల సంఘటనల ఆధారంగా తయారు చేశారు. 1966 నుండి 2024 వరకు పాఠశాలల్లో కాల్పుల సంఘటనలు అతి తక్కువగా జరిగిన రాష్ట్రాలను ఈ జాబితాలో చేర్చారు. 1966- 2024 మధ్య వ్యోమింగ్‌లో రెండు పాఠశాలల్లో మాత్రమే కాల్పులు జరిగాయి. నార్త్ డకోటా(North Dakota), సౌత్ డకోటాలలో మూడు సంఘటనలు, హవాయిలో నాలుగు, వెర్మోంట్లో ఐదు, మెయిన్, అలాస్కాలో ఏడు, వెస్ట్ వర్జీనియాలో ఎనిమిది, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్‌షైర్‌లో ఇప్పటివరకు ఎనిమిది సంఘటనలు నమోదయ్యాయి.అమెరికాలోని ఈ రాష్ట్రాలు అత్యంత సురక్షితమైనవిగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో తక్కువ నేరాల రేట్లు, తక్కువ జనాభా, పటిష్టమైన భద్రతా విధానాలు ఉన్నాయి. వెర్మోంట్, న్యూ హాంప్‌షైర్ వంటి రాష్ట్రాలు కమ్యూనిటీ పోలీసింగ్‌తో పాటు ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. ఇది ప్రజలకు మరింత భద్రతా భావాన్ని అందిస్తుంది. ఈ రాష్ట్రాల్లో పెద్ద నగరాలు తక్కువగా ఉండటం వల్ల నేరాల సంఖ్య కూడా తక్కువే. పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రల్లో నేరాలను అరికట్టడంతో ముందుంది.ఇది కూడా చదవండి: బోర్డింగ్ స్కూల్‌పై దాడి.. రష్యా- ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు -
Iran: ముగ్గురు భారతీయులు అదృశ్యం
ఇరాన్లో ముగ్గురు భారత పౌరులు అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వెళ్లారు. తరువాత అదృశ్యమయ్యారు. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ సమస్యను ఇరాన్ ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ ఉదంతంలో మరింత సమాచారం కోసం ఇరాన్లో అదృశ్యమైన భారత పౌరుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం గతఏడాది డిసెంబర్ నెలలో ముగ్గురు భారతీయ పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకున్నాక వారికి వారి కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. దీనిపై దర్యాప్తు కోసం భారత్.. ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.ఈ విషయాన్ని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు టెహ్రాన్‌లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశామని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం దీనిపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం -
అమెరికా అంత ఈజీ కాదా..!
-
Illegal Immigrants: ఎవరేమన్నా.. ఐ డోంట్ కేర్!
వాషింగ్టన్: అక్రమ వలసవాదుల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారం రోజుల్లోనే సుమారు మూడున్నర వేల మందిని అరెస్ట్ చేసి వెనక్కి పంపించారు(డిపోర్టేషన్). అందులో ఈ రెండ్రోజుల్లోనే రెండు వేలమందిపై చర్యలు తీసుకోవడం గమనార్హం. దీంతో.. సరైన పత్రాల్లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. అయితే..అయితే.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే క్రమంలో అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంటోంది. పలు నగరాల్లో ఇళ్లలోకి, ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతోపాటు చేతులకు బేడీలు వేసి అమానవీయంగా సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పైగా ఆ విమానంలో తాగునీరు లాంటి కనీస వసతులు కూడా కల్పించడం లేదనే ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఖండిస్తున్నాయి.మరోవైపు.. ఎఫ్ 1 వీసాల ఆధారంగా వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వణికిపోతున్నారు. యూనివర్సిటీలతో, తమ కోర్సులతో సంబంధం లేకుండా.. ఖర్చుల కోసం పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఏదిఏమైనా.. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ చర్యలు ముందుకు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. సరైన పత్రాల్లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్దఎత్తున విమానాల ద్వారా స్వదేశాలకు తిప్పి పంపే చర్యలు కొనసాగుతాయన్నారు. అయితే.. ఆ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ట్రంప్ దారికి తెచ్చుకుంటుండడం గమనార్హం.సరిహద్దున ఉన్న మెక్సికోతోపాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్‌సాల్వడార్ వంటి దేశాలుఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే..ఇప్పుడు వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. -
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : విదేశీయుల ప్రవేశానికి అమెరికా (USA) కొత్త నిబంధనలు విధించింది. విదేశీయులకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసింది. అమెరికా వచ్చే వారికి రిటన్ ఎయిర్ టికెట్ తప్పని సరి చేసింది. ఈ నింబధనల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (U.S. Department of Homeland Security) జారీచేసింది. కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డీహెచ్ఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ ఆదేశాలతో రిటన్ టికెట్ లేని కారణంగా నిన్న ఒక్కరోజే వందమంది భారతీయుల్ని వెనక్కి పంపింది. నిబంధనల మేరకు కనీసం 3వేల డాలర్లు లేని మరో వంద మంది భారతీయుల్ని (Indians) డీహెచ్ఎస్ అనుమతించలేదు.అంతకుముందు, 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్తన కార్యచరణ ప్రకటించారు. తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది.అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. చదవండి: ట్రంప్ దూకుడు.. వారి గుండెల్లో రైళ్లుజాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది. -
నెలలు నిండకముందే సిజేరియన్లు.. ఆస్పత్రులకు భారతీయ దంపతుల క్యూ
-
‘ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
వాషింగ్టన్: అక్రమ వలస దారుల విషయంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సమర్థించారు. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలస దారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే అందుకు స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ స్థానిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని తిరిగి భారత్‌కు తీసుకువెళ్లేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’ అని అన్నారు. పత్రాలు లేని వలసదారుల (Undocumented immigrants)ల విషయంలో భారత్ వైఖరి స్థిరంగా ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు తెలిపారు.భారత్ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఇది మంచిది కాదని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో ఉపయోగపడడంతో పాటు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టే అక్రమ వలస దారుల విషయంలో మా వైఖరి స్పష్టం ఉందని చెప్పారు. #FPLIVE: External Affairs Minister (EAM) S. Jaishankar, has clarified India's stance, saying that New Delhi is open to the "legitimate return" of Indian nationals living 'illegally' abroad, including in the US. https://t.co/JWyTTCKgXV— Firstpost (@firstpost) January 23, 2025 కాగా, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరుఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే సమయంలో ట్రంప్‌నకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను జై శంకర్‌ను ట్రంప్‌కు అందించారు. -
Trump 2.0: మనపై ప్రభావమెంత?
రెండోసారి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్వేతసౌధంలోకి ఆయన పునరాగమనం అక్కడి భారతీయులకు పలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా మోసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. అమెరికాలో భారత సంతతికి చెందినవారు 45 లక్షలకు పైగా ఉన్నారు. సంఖ్యాపరంగా తక్కువగా అనిపిస్తున్నా కొన్నేళ్లుగా వాళ్లు ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులుగా మారారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాజకీయ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. అధ్యక్షునిగా ట్రంప్ తొలి హయాం భారత అమెరికన్లకు కాస్త తీపి, కాస్త చేదుగానే గడిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ సాన్నిహిత్యం అందరినీ ఆకర్షించింది. ‘హౌడీ మోడీ’ పేరిట 2019లో హూస్టన్‌లో ట్రంప్ అట్టహాసం చేస్తే, అంతకుమించి అన్నట్టుగా మరుసటేడే మోదీ అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ పేరుతో భారీ సభ నిర్వహించారు. దానికి తరలివచ్చిన లక్ష పైచిలుకు జన సందోహాన్ని చూసి ఆశ్చర్యానందాల్లో మునిగిపోవడం అధ్యక్షుని వతయింది. ఆసియాలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడం వంటి ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలు ఇరు దేశాలను మరింత సన్నిహితం చేశాయి. వరక్త వ్యాపారాలూ ఇతోధికంగా పుంజుకున్నాయి. భారత్–అమెరికా సంబంధాలు మొత్తమ్మీద మరింత బలోపేతమే అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 భారత్‌కు, అమెరికాలోని మనవారికి ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక ఆందోళనలు ట్రంప్ తొలి హయాంలో జాతి విద్వేష, విద్వేష నేర ఘటనలు పెరిగాయి. వాటిలో తరచూ దక్షిణాసియా మూలాలున్న వారినే లక్ష్యంగా చేసుకునే ఆందోళనకర ట్రెండుకు తెర లేచింది. దీని ప్రభావం భారతీయ అమెరికన్లపైనా బాగానే పడింది. దానికి తోడు ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదానికి ఈసారి మరింత ప్రాధాన్యమిస్తానని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. తమపట్ల వివక్షకు తావులేని వాతావరణాన్ని కోరుకుంటున్న భారతీయ అమెరికన్లలో ఈ ప్రకటన మరింత గుబులు రేపుతోంది. ఈ ఆందోళనలను తొలగించేందుకు రిపబ్లికన్ పార్టీలోని భారత మూలాలున్న నేతలు ఏ మేరకు కృషి చేస్తారన్నది కీలకం కానుంది. వర్తకం.. ఆచితూచి ట్రంప్ తొలి హయాంలో వర్తకానికి పెద్దపీటే వేసినా కొన్నిసార్లు వివాదాలూ తప్పలేదు. ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయోత్పత్తుల వంటివాటిపై టారిఫ్‌లు గొడవకు దారితీశాయి. రిటైల్ నుంచి టెక్ స్టార్టప్‌ల దాకా రెండు ఆర్థిక వ్యవస్థల్లోనూ కీలకంగా మారిన భారత అమెరికన్ వ్యాపారవేత్తలకు ట్రంప్ తొలి హయాంలో మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు వంటి ట్రంప్ సర్కారు నిర్ణయాలు వ్యాపార విస్తృతికి దోహదపడినా మొత్తమ్మీద టారిఫ్‌ల విషయంలో కొనసాగిన అనిశ్చితి ఎప్పటికప్పుడు వారికి సవాలుగానే నిలుస్తూ వచ్చింది. వాటిపై సంప్రదింపులు కూడా పెద్దగా ఫలితమివ్వలేదు. ఈసారి వాటిని చక్కదిద్దుకోవడానికి ట్రంప్ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. → విధానాలు ఇరు దేశాలకూ లాభసాటిగా ఉండేలా మెరుగు పరిచేందుకు ద్వైపాక్షిక వర్తకంతో ప్రత్యక్ష భాగస్వామ్యమున్న భారతీయ అమెరికన్ వ్యాపార దిగ్గజాలు ప్రయత్నించవచ్చు. → ఫార్మా, జౌళి, టెక్నాలజీ వంటి రంగాల్లో టారిఫ్‌లు తగ్గడమో, లేదంటే సరళంగా మారడమో ఖాయంగా కనిపిస్తోంది. → పన్ను ప్రోత్సాహకాలపై నియంత్రణల ఎత్తివేతతో పాటు చిన్న వ్యాపారాలకు ఇతోధికంగా వృద్ధి అవకాశాల కల్పన దిశగా అడుగులు పడవచ్చు. → ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలకు సవాలుగా పరిణమించే ఆస్కారమూ లేకపోలేదు.వలసలపై ఉత్కంఠే అమెరికాలో భారతీయుల విజయగాథకు హెచ్–1బీ వీసా విధానమే దశాబ్దాలుగా మూలస్తంభంగా నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఐటీ, వైద్య తదితర రంగాల్లో మన నిపుణులు అగ్ర రాజ్యంలో తిరుగులేని రీతిలో జెండా పాతారు. అంత కీలకమైన హెచ్–1బీ వీసా విధానం ట్రంప్ తొలి హయాంలో ఒడిదుడుకులకు లోనైంది. మితిమీరిన వడపోతలు, కఠినమైన అర్హత ప్రమాణాల వంటివి అమెరికా కలలుకనే భారతీయ ఔత్సాహికుల్లో, వారి కుటుంబాల్లో తీవ్ర అనిశి్చతికి దారితీశాయి. → ఈ సవాళ్లు ట్రంప్ 2.0లో మరింత పెరిగే సూచనలే కన్పిస్తుండటం ఆందోళనకరం. → గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుతెన్నుల్లోనే గడుపుతున్న భారత అమెరికన్లు మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పేలా లేదు. → జీవిత భాగస్వామి ప్రధానంగా హెచ్–4 వర్క్ వీసా పర్మిట్లపై ఆధారపడే కుటుంబాల పరిస్థితి మరింత డోలాయమానంగా తయారైంది. ఆ వీసాలకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తామని ట్రంప్ గతంలో చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ భయపెడుతోంది. అదే జరిగితే భారత మహిళలకు కోలుకోలేని దెబ్బే అవుతుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత, వృత్తిగత ఎదుగుదలకు కీలకమైన అవకాశం వారి చేజారుతుంది. → వీసా పర్మిట్ల గందరగోళంతో నిపుణులైన భారతీయులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా వ్యాపార సంస్థలు కూడా బాగా ప్రభావితమవుతాయి. → వర్క్ వీసాలపై పరిమితులు కీలక రంగాల్లో మానవ వనరుల కొరతకు దారితీస్తాయి.రూటు మారిన రాజకీయం భారత అమెరికన్లు మొదటినుంచీ డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉంటూ వచ్చారు. వలసలు, వైవిధ్యం, సామాజిక న్యాయం తదితర విధానాల్లో ఆ పార్టీ ప్రగతిశీల వైఖరే అందుకు ప్రధాన కారణం. కానీ వలస సంస్కరణలపై బైడెన్ సర్కారు నిర్లిప్తత, అంతూపొంతూ లేని గ్రీన్‌కార్డుల వెయిటింగ్ లిస్టు వంటివి ఆ పార్టీపై వారిలో అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కుటుంబ విలువలు, విద్య తదితరాల్లో అచ్చం తమను పోలి ఉండే రిపబ్లికన్ పార్టీ వైఖరి, దాని సరళీకృత ఆర్థిక విధానాలు సంప్రదాయ భారతీయులను కొంతకాలంగా అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేతలు మరింతగా వారి ఆదరణను చూరగొంటున్నారు. ముఖ్యంగా దూకుడుకు మారుపేరైన ట్రంప్ రిపబ్లికన్ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ ఈ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భారత అమెరికన్ సమాజం నానాటికీ ఆ పార్టివైపు మొగ్గుతోంది. ట్రంప్ 2.0 విధానాలను బట్టి ఇది మరింత ఊపందుకున్నా ఆశ్చర్యం లేదు. -
రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దంలో రష్యా తరఫున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోవడంతో పాటు, ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో చిక్కుకుని యుద్ధంలో పోరాడుతున్న భారతీయ పౌరులందరినీ స్వదేశానికి రప్పించడం కోసం తాము రష్యన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.రష్యా తరఫున యుద్ధంలో 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ.. 96 మంది సైన్యం నుంచి విడుదలయ్యారని పేర్కొంది. కొందరు స్వదేశానికి తిరిగివచ్చారని.. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారని జైశ్వాల్ తెలిపారు. వారిలో 16 మంది ఆచూకీ లేదని స్పష్టం చేశారు.తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.ఇదీ చదవండి: ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు -
భారత్‌కు తిరిగిరాకుండానే హెచ్1బీ రెన్యూవల్!
వాషింగ్టన్: ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్–1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు తమ వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది. చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్–1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే రెన్యూవల్‌కు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్–1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యువల్ సుసాధ్యమైంది. ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్–1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే. ఎందుకంటే ఏటా హెచ్–1బీ వీసాదారుల్లో భారతీయులే గణనీయమైన స్థాయిలో ఉన్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్–1బీ వీసాలు మంజూరైతే అందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. 2022 ఏడాదిలో ఏకంగా 77 శాతం వీసాలను మనవాళ్లే ఒడిసిపట్టారు. వీసా రెన్యూవల్ స్టాంపింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చుపెట్టి విమాన టికెట్లు కొనుగోలు చేసి భారత్‌కు తిరిగి రావడం, వీసా అపాయిమెంట్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ సమస్యలు, దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు చాలా రోజులు వేచి ఉండటం, తిరిగి మళ్లీ లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు తిరిగిరావడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. స్వదేశంలో రెన్యూవల్ అమలైతే ఈ బాధలన్నీ తీరతాయని అక్కడి హెచ్–1వీ వీసాలున్న భారతీయులు ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచనప్రాయంగా తెలిపింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాలకు పూర్తి మద్దతు తెలిపిన తరుణంలో అమెరికా గడ్డ మీదనే వీసా రెన్యూవల్ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుండటం గమనార్హం. హెచ్–1బీతోపాటు విద్యార్థి వీసా కోటాలోనూ భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఏడాది అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏకంగా 3,31,000 మంది భారతీయులు విద్యార్థి వీసాలు పొందారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్తుల్లో భారతీయుల సంఖ్యే అధికం. 2008/09 విద్యాసంవత్సరం నుంచి చూస్తే ఇంతమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే తొలిసారి. -
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు అమెరికా కొత్త పల్లవి అందుకుంది. అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయుల కోసం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇతర దేశాల నుంచి అమెరికాకు టూరిస్టుల రాక భారీగా తగ్గడం.. అదే సందర్భంలో భారత్ నుంచి పర్యాటకుల సందడి పెరుగుతుండటం అగ్రరాజ్యానికి ఆశాకిరణంగా మారింది. ఫలితంగా అక్కడి పర్యాటక పరిశ్రమ మన సంప్రదాయాలను పుణికిపుచ్చుకుని ‘రండి.. రండి.. రండి’ అంటూ భారతీయులకు చక్కటి అతిథి మర్యాదలు చేస్తోంది.సాక్షి, అమరావతి: అమెరికా పర్యాటక పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. కోవిడ్ మునుపటి స్థాయిని అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. నిరంతర ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్లు విశ్రాంతి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. తూర్పు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది. ఈ ఖాళీని భారతీయ పర్యాటకులతో భర్తీ చేయాలని అమెరికా భావిస్తోంది. అగ్రరాజ్యానికి ఆతిథ్య పరిశ్రమ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఇందుకే అమెరికా హోటళ్లు భారతీయ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఆతిథి మర్యాదలు చేస్తున్నాయి.భారతీయ టీవీ చానళ్ల మోతఅమెరికా పర్యాటక పరిశ్రమలో ఆదాయాన్ని పునరుద్ధరించడానికి హోటళ్లు, ట్రావెల్ కంపెనీలు భారతీయ పర్యాటకులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్య హోటళ్లు ‘చాయ్.. సమోసా’లను ప్రవేశపెట్టాయి. దీనికితోడు లాంజ్‌లు, గెస్ట్ రూమ్స్‌లో భారతీయ టీవీ చానళ్ల ప్రసారాల మోత మోగిస్తున్నాయి. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (ఎన్టీటీవో) డేటా ప్రకారం గతేడాది తొలి పది నెలల్లో సుమారు 20 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు.ఇది కోవిడ్ పూర్వపు స్థాయి కంటే 48 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా వ్యాపార సందర్శనల కోసం జారీ చేసిన వీసాలలో 50 శాతం, హాలిడే వీసాలు 43.50 శాతం వృద్ధి చెందాయి. విస్తరిస్తున్న భారతీయ మధ్యతరగతి జనాభా, అధిక ప్రయాణ బడ్జెట్లు, పెరిగిన విమాన సామర్థ్యం భారతీయుల్లో అంతర్జాతీయ ప్రయాణ ఒరవడిని చూపిస్తున్నాయి. చైనా, జపాన్ నుంచి తగ్గుదలఆర్థిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య అమెరికాలో భారీగా తగ్గింది. ఇందులో చైనా నుంచి 44.50 శాతం, జపాన్ నుంచి 50.8 శాతం, దక్షిణ కొరియా నుంచి 23.90 శాతం క్షీణత నమోదైంది. వీరి స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నట్టు ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. యూరోపియన్ పర్యాటకులు అమెరికాకు మళ్లీ తిరిగి వస్తున్నారు. అయితే యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశీయుల సందర్శన 2019 ముందుతో పోలిస్తే తక్కువగా ఉంది. గతేడాది భారతీయ ప్రయాణికులు చేసిన యూఎస్ బుకింగ్‌లు 50 శాతంపైనే పెరిగాయి. ఇది 2019 కోవిడ్ మహమ్మారి స్థాయితో పోలిస్తే మూడు రెట్లు వృద్ధిని సూచిస్తోంది. ఓఏజీ ఏవియేషన్ డేటా ప్రకారం 2019తో పోలిస్తే గతేడాది భారత్–యూఎస్ మధ్య షెడ్యూల్డ్ విమాన సామర్థ్యం 42.3 శాతం పెరిగింది. -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4.5 మిలియన్ల మందికి ఓసీఐరాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం తీసుకున్న భారతీయులు ఇక్కడి పౌరసత్వం కోల్పోతారు. ఇలా పౌరసత్వం కోల్పోయిన వారు బంధువుల, స్నేహితుల కోసం భారత్‌కు రావాలంటే పాస్‌పోర్ట్ పొందాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్‌తో పనిలేకుండా భారత్‌కు వచ్చి వెళ్లే వారి కోసం 2006లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు(ఓసీఐ)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్డు పొందిన వారు వీసా లేకుండానే భారత్‌కు రాకపోకలు సాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా ఓసీఐ కలిగి ఉన్నారు. వీరిలో యూఎస్‌లో 16.8, యూకేలో 9.34, ఆస్ట్రేలియాలో 4.94 లక్షల మంది చొప్పున ఉన్నారు. -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్‌బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గుచూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. -
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్.. సోషల్ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్ఫ్లుయెన్సర్.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో చీప్ లేబర్ అంటూ భారతీయులను, ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌ను కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్ వివాదాస్పద పోస్టులు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదానికి శ్రీరామ్ కృష్ణన్ ద్రోహం చేస్తున్నాడని, గ్రీన్‌కార్డుల విషయంలో అతని వైఖరి భారత్‌లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని.. తద్వారా అమెరికాలోని STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) గ్రాడ్యుయేట్స్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతోందామె. అదే టైంలో..హెచ్1బీ వీసాల విషయంలోభారతీయులపై వివక్షాపూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, ఉషా వాన్స్లాంటి వాళ్లు అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు. ‘‘నేను ఓటేసింది అమెరికాను మరోసారి గొప్పగా తయారు చేస్తారని. అందుకోసం హెచ్1బీ వీసాలను తగ్గిస్తారని.అంతేగానీ పెంచుకుంటూ పోతారని కాదు. భారత్‌లో అంత మేధోసంపత్తి ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా.అమెరికాకు వలస రావడం దేనికి?. అంత హైస్కిల్ సొసైటీ అయితే.. ఇలా చెత్తకుప్పలా ఎందుకు తగలడుతుంది?( తాను పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ..)..@VivekGRamaswamy knows that the Great Replacement is real. So does @JDVance. It’s not racist against Indians to want the original MAGA policies I voted for. I voted for a reduction in H1B visas. Not an extension. And I would happily say it to their face because there’s nothing… https://t.co/vO2e33USE1 pic.twitter.com/EH4hpJxiNH— Laura Loomer (@LauraLoomer) December 24, 2024మీకు భారతీయుల్లాంటి చీప్ లేబర్ కావాలనే కదా వీసా పాలసీలను మార్చేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే.. నేనూ రేసిస్ట్ అనే విషయాన్ని అంగీకరిస్తా. మీలాంటి ఆక్రమణదారులు నిజమైన ట్రంప్ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటారు. కానీ, ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను. అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే(Make America Great Again) ఉద్దేశమూ లేదు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు’’ అని తీవ్ర స్థాయిలో సందేశాలు ఉంచారు. ఇంతకు ముందు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్ ఈ తరహాలోనే జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని..టెక్ బిలియనీర్లు మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో ఎక్కువసేపు గడుపుతూ.. తమ చెక్ బుక్‌లను విసిరేస్తున్నారు. అలాంటివాళ్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు. తద్వారా.. భారత్, చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలు రప్పించుకోవచ్చనేది వాళ్ల ఆలోచన అయి ఉండొచ్చు అంటూ ఆ పోస్టులోనే ఆమె ప్రస్తావించారు.Quite the change of tune. Wonder if he got “the call”. pic.twitter.com/o1Gp8dNYyo— Laura Loomer (@LauraLoomer) December 28, 2024కాంట్రవర్సీలకు జేజేమ్మ!31ఏళ్ల వయసున్న లారా ఎలిజబెత్ లూమర్.. పోలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జర్నలిస్ట్ కూడా. మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే. గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసి ఓడారామె. ఆపై కొన్ని క్యాంపెయిన్లను ముందుండి నడిపించారు. తాను ఇస్లాం వ్యతిరేకినంటూ బహిరంగంగా ప్రకటించి.. ఆ మతంపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు.. తన ద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్స్ యాప్స్, ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి.కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే.. రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. అధ్యక్ష రేసు బైడెన్ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ట్రంప్‌ను ప్రొత్సహించి లూమర్ను ప్రచారకర్తగా నియమించారు. ఆ టైంలో ట్రంప్‌తో ఆమెకు అఫైర్ ఉన్నట్లు కథనాలు రాగా.. ఆమె వాటిని ఖండించారు. ఒకరకంగా చూసుకుంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వొచ్చు. అలాంటి లూమర్ ఇప్పుడు.. ట్రంప్ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది. మస్క్ సొంత ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగానే ఆమె తీవ్ర పదజాలంతో సందేశాలు పోస్ట్ చేస్తుండడం గమనార్హం. ‘‘ఎలాన్ మస్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయెన్సీ(DOGE) బాధ్యతలు అప్పగించడం సుద్ధ దండగ. అతనొక స్వార్థపరుడు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్(MAGA) పేరుతో ఇమ్మిగ్రేషన్ పాలసీలలో తలదూర్చాలనుకుంటున్నాడు. తద్వారా అమెరికన్ వర్కర్లకు హాని చేయాలనుకుంటున్నాడు. వివేక్ రామస్వామి చేస్తున్న క్యాంపెయిన్ ఎందుకూ పనికి రానిది. రిపబ్లికన్లు అతిత్వరలో వీళ్లను తరిమికొట్టడం ఖాయం. మస్క్, రామస్వామిలు ట్రంప్‌కు దూరం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని విమర్శించిందామె. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆమెపై వెటకారంగా ఓ పోస్ట్ చేసి వదిలేశాడు..@VivekGRamaswamyThe technocratic state is more dangerous than the administrative state.Your silence on the censorship of those who wanted to put a limit on the power of big tech is deafening.DOGE can’t be allowed to be utilized as a vanity project to enrich Silicon Valley. https://t.co/81EYNTLkqx— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే.. మస్క్ తేలికగా తీసుకుంటున్నా లూమర్ మాత్రం తన విమర్శల దాడిని ఆపడం లేదు. మస్క్ పచ్చి స్వార్థపరుడని, చైనా చేతిలో పావు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో మస్క్ ఎక్కువసేపు గడుపుతున్నాడని.. తనకు లాభం వచ్చే పనులు ట్రంప్‌తో చేయించుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడని, తన స్నేహితుడు జీ జిన్‌పింగ్(చైనా అధ్యక్షుడు) కోసమే ఆరాటపడుతున్నాడంటూ తిట్టిపోసింది.ఎగిరిపోయిన బ్లూ టిక్.. మరో చర్చతప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు పోస్ట్ చేస్తోందన్న కారణాలతో.. గతంలో లారా లూమర్(Laura Loomer) ట్విటర్ అకౌంట్‌పైనా నిషేధం విధించారు. అయితే ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలుచేసిన కొన్నాళ్లకే..ఫ్రీ స్పీచ్ పేరిట చాలా మంది అకౌంట్లు పునరుద్ధరణ అయ్యాయి. అందులో ట్రంప్ అకౌంట్ కూడా ఉందన్నది తెలిసిందే. I mean right after @elonmusk called me a troll today, my account verification was taken away, my subscriptions were deactivated and I was banned from being able to buy premium even though I was already paying for premium.Clearly retaliation. https://t.co/fVskKH9Trg— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే తాజాగా లారా ఎలిజబెత్ లూమర్ హెచ్1బీ వీసాల వ్యవహారంతో ఎలాన్ మస్క్‌నే టార్గెట్ చేయడంపై.. ఆమెపై ఎక్స్(పూర్వపు ట్విటర్) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అకౌంట్ నుంచి బ్లూ టిక్ ఎగిరిపోవడంతో పాటు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. ట్విటర్(ఇప్పుడు ఎక్స్) కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్.. ఇప్పుడు తోక ముడిచారా? అని ఆమె ప్రశ్నించారు. -
కెనడాలో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం!
కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (LMIA) మద్దతుతో ఉద్యోగ ఆఫర్‌కు సంబంధించినఎక్స్ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తోంది. జాబ్ ఆఫర్పేరుతో జరుగుతున్న మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను త్వరలో తొలగించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.ఇది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (CRS) కట్-ఆఫ్ స్కోర్‌ను చేరుకోవడానికి , అక్కడ శాశ్వత నివాసం పొందే అసలైన లబ్ధిదారులను ప్రభావితం చేయనుందని నిపుణులు భావిస్తున్నారు.తాత్కాలిక విదేశీ వర్కర్ (TFW) ప్రోగ్రామ్‌లో సంస్కరణల్లో భాగంగా ఇది మొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం "అర్హత కలిగిన కెనడియన్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన పూర్తి తీవ్రమైన కార్మికుల కొరతను నివారించేం పరిష్కారంగా" భావించింది. అంటే సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన, అర్హులైన ఉద్యోగులను అందుబాటులో లేనపుడు అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. కెనడాలోని సంస్థలు ఒక విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలనుకుంటే, వారు ముందుగా LMIA దరఖాస్తును పూర్తి చేయాలి. ఫెడరల్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఉద్యోగం చేయడానికి కెనడియన్లు లేదా ఇతర శాశ్వత నివాసితులు లేరని కూడా వారు ధృవీకరించాల్సి ఉంటుంది.అలా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎల్ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ సందర్భంగా జాబ్ ఆఫర్ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశంకల్పిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగు తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. కొంతమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా LMIAలను వలసదారులకు లేదా శాశ్వత నివాసం పొందడానికి వారి CRS స్కోర్‌ను పెంచుకుంటోందన్న పలు నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. -
అమెరికాలో వలసదారులు
అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడేందుకు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమెరికా కలను సాకారం చేసుకునేందుకు పలు రకాల వీసాల కోసం అప్లే చేస్తారు. అయితే చాలా మందికి వీసాలు దొరక్క.. అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసలు పెరగడం అక్కడ తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అమెరికన్ జనాభాలో 14.3 శాతం మంది వలసదారులే. ప్రస్తుతం అమెరికాలో 1 కోటి 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉంటున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్, ప్యూ రీసర్చ్ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా మెక్సికో నుంచి వస్తున్నారు. తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 2040 నాటికి అమెరికాలో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటిపోతుందని అంచనా.కరేబియన్, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, సబ్ సహారా, ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగాయని పరిశోధకులు తెలిపారు. అమెరికా అక్రమ వలసదారుల్లో వెనుజులా, బ్రిజిల్, కెనడా, మాజీ సోవియట్ దేశాలు, చైనా, డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డిపోర్టేషన్ పై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిహద్దులను బలంగా, శక్తిమంతంగా మార్చడంపై దృష్టి సారిస్తానని ట్రంప్ సృష్టం చేశారు.అయితే వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారుల జనాభా అమెరికాలోనే ఉంది.మరి వలసదారులు అమెరికాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఇమ్మిగ్రెంట్స్ లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి? వలసదారుల్ని భారీ సంఖ్యలో వెనక్కి పంపించడం సాద్యమేనా.. ? అక్రమ వలసదారుల్ని సామూహికంగా అమెరికా నుంచి తిప్పి పంపించటం ట్రంప్‌కు అంత ఈజీయేనా? వంటి విషయాలను తరువాత కథనంలో తెలుసుకుందాం..!- సింహబలుడు హనుమంతు -
భారతీయులకు బైడెన్ గుడ్‌న్యూస్.. ఇకపై హెచ్1బీ వీసా ఈజీ!
-
హెచ్–1బీ వీసా సులభతరం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద వేగంగా ఉపాధి పొందాలనుకునే భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. వేగంగా ఉపాధి కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్–1బీ వీసా నిబంధనల్లో కీలకమార్పులు చేసింది. దీంతో హెచ్–1బీ వీసా పొందడం మునపటితో పోలిస్తే అత్యంత సులభంకానుంది. అమెరికా కంపెనీలు తమ ఉద్యోగాల కోసం విదేశీయులను ఎంపికచేసుకునే ప్రక్రియను సులభతరంచేయడం ఇందుకు మరో కారణం. నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీ, అనుమతి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిబంధనల సడలింపు ప్రక్రియ వంటి నిర్ణయాలు 2025 జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎఫ్–1 విద్యార్థి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులు ఇకపై సులువుగా తమ వీసాను హెచ్–1బీ వీసాగా మార్చుకోవచ్చు. దీంతో వీరికి అక్కడి కంపెనీలు వేగంగా ఉద్యోగాలు కల్పించేందుకు వీలవుతుంది. థిరిటికల్, టెక్నికల్ నిపుణులుగా వీరికి ఉద్యోగాచ్చేందుకు అక్కడి సంస్థలకు అవకాశం చిక్కుతుంది. అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్లుగా, ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా అమెరికన్ సంస్థలను తీర్చిదిద్దే లక్ష్యంతో వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం ప్రకటించింది. అమెరికా సంస్థలు కార్మిక కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 20వ తేదీన నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిరోజుల ముందు బైడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వేగ వంతం చేయనుంది. ‘‘హెచ్–1బీ వీసా విధానం ద్వారా అమెరికా సంస్థలు అత్యంత నైపుణ్యమైన ఉద్యోగులకు నియమించుకునే అవకాశాలను విస్తృతంచేశాం. దీంతో అంతర్జాతీయ మేధతో అన్ని రంగాల్లో అమెరికా ఎంతో ప్రయోజనం పొందనుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి అలెజాండ్రో ఎన్.మయోర్కాస్ చెప్పారు. ‘‘1990లో హెచ్–1బీ విధానం మొదలెట్టాక అమెరికా దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఈ పద్దతిని నవీకరించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు’’అని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం.జడ్డూ హెచ్–1బీ విధానాన్ని మెచ్చుకున్నారు.భారతీయులకు ఏ రకంగా ఉపయోగం?యూఎస్సీఐఎస్ ద్వారా హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం ఏటా లాటరీ విధానం ద్వారా కేవలం 65,000 వరకు హెచ్–1బీ వీసాలనే జారీచేసేది. అడ్వాన్స్డ్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న సందర్భాల్లో మరో 20వేల హెచ్– 1బీ వీసాలనే ఇచ్చేది. ఈ కోటా పరిమితి అనేది ఇన్నాళ్లూ లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు లేదు. దీంతో ఈ నిబంధనలోని లొసుగును దుర్వినియోగం చేస్తూ చాలా మంది ‘రీసెర్చ్’మాటున వీసాలు సాధించారని, దీంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్య అభ్యర్థులకు లాటరీ ద్వారా వీసా పొందే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు ఉండేవి. దీంతో వీటికి చెక్ పెడుతూ ఇకపై లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు తొలిసారిగా కోటా పరిమితిని విధి స్తూ, కోటాను నిర్వచిస్తూ నిబంధనల్లో మా ర్పులు తెచ్చారు. దీంతో నాన్‌ప్రాఫిట్, గవర్న మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి పోటీ తగ్గి ఆ మేరకు భారతీయులకు లాటరీలో అధిక ప్రా ధాన్యత, లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నా రు. ప్రతి ఏటా హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటున్నారు. -
అమెరికా చర్రితలో అతిపెద్ద బహిష్కరణ!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికాలోని సుమారు 18,000 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది.యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) గణాంకాల ప్రకారం.. 10.45 లక్షల మంది చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లు, ఇందులో 17,940 మంది ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా సిద్దమైనట్లు సమాచారం. ట్రంప్ పదవి చేపట్టిన తరువాత వీరందరినీ వారి దేశాలకు పంపించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.సరైన పత్రాలు లేకుండా అమెరికాలో.. చట్టపరమైన హోదాను పొందటం పెద్ద సవాలు. ఇలాంటి వారే చట్టపరమైన చర్యలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి కేసుల నుంచి బయటపడటానికి సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.చాలామంది ఐసీఈ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడే బ్యూరోక్రాటిక్ చిక్కుల్లో చిక్కుకుంటున్నట్లు సమాచారం. గత మూడేళ్ళలో సగటున 90,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడినట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినవారే అని సమాచారం.ఇదీ చదవండి: బ్యాంకులో ఉద్యోగం.. రోజూ ఒకటే సూట్: మస్క్ తల్లి ట్వీట్తాను పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సరైన పత్రాలు లేని వలసదారుల బహిష్కరణ ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ప్రక్రియను చేపడతామని ట్రంప్ ప్రతిజ్ఞ చేసినందున.. అక్రమ వలసదారుల బహిష్కరణ అనివార్యమనే తెలుస్తోంది. -
భారతీయుల దుబాయ్ విహారానికి బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రముఖ పర్యాటక నగరమైన దుబాయ్‌లో విహరించాలనుకునే భారతీయులకు ఎదురుదెబ్బ తగులుతోంది. హాలీడే ట్రిప్పులు, కుటుంబ సభ్యులతో వెకేషన్ కోసం దుబాయ్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి నిరాశే మిగులుతోంది. ఒకప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే దుబాయ్ వీసా మంజూరయ్యేది. కానీ, ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన దుబాయ్ ఇర్ముగ్రేషన్ నిబంధనలు భారతీయ పర్యాటకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని వారాలుగా వీసాల తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు వీసా దరఖాస్తుల్లో 99 శాతం ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు 94–95 శాతానికి పడిపోయింది. ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కఠిన పర్యాటక వీసా నిబంధనలను అమలు చేస్తోంది. దుబాయ్‌లో పర్యటించాలనుకునేవారు తమ వీసా దరఖాస్తుతో పాటు ఏ హోటల్లో బస చేస్తారో.. ఆ హోటల్ బుకింగ్ డాక్యుమెంట్స్, విమాన రిటర్న్ టికెట్లను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హోటల్లో కాకుండా బంధువుల ఇంట్లో ఉండాలనుకుంటే.. సంబంధిత నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడీ, కాంటాక్ట్ వివరాలు తప్పనిసరి చేసింది. ఈ పత్రాలన్నీ ముందుగా జత చేస్తేనే వీసాకు ఆమోదం లభిస్తుంది. అలాగే అదనంగా దుబాయ్‌లో ఉండటానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. హోటల్లో బస చేయాలనుకుంటే కనీస బ్యాలెన్స్ రూ.50 వేలు చూపిస్తూ చివరి మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, పాన్‌కార్డును సమర్పించాలి. వీటిలో ఏది లేకున్నా వీసా మంజూరుకు అవరోధం ఏర్పడినట్టే. తాజాగా ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉన్నా.. వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ట్రావెల్ ఏజెన్సీలు వాపోతున్నాయి.ఆర్థి కంగానూ నష్టమే.. వీసా దరఖాస్తుల తిరస్కరణ పర్యాటకులపై తీవ్ర ఆర్థి క భారాన్ని మోపుతోంది. వీసా దరఖాస్తు రుసుమును కోల్పోవడంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న విమాన, హోటల్ టికెట్ల కోసం చెల్లించిన డబ్బును కూడా నష్టపోతున్నారు. అలాగే ఒక కుటుంబ సభ్యుడి వీసా తిరస్కరణకు గురైతే.. కుటుంబంలోని మిగిలిన సభ్యులు కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తోంది. సెలవులు సీజన్ రాబోతుండటంతో పాటు డిసెంబర్, జనవరిలో దుబాయ్‌లో షాపింగ్ ఫెస్ట్ జరగబోతున్న సమయంలో పెద్ద ఎత్తున వీసాలు తిరస్కరణకు గురవుతుండటం భారతీయ పర్యాటకులతో పాటు ట్రావెల్ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. వారి సంఖ్యను కాస్త తగ్గించేందుకే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. -
సిరియా నుంచి బయటపడిన 75 మంది భారతీయులు
-
కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ
వాషింగ్టన్:కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు యత్నించిన వారిలో 23 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం.అక్రమ చొరబాట్ల సమస్య అమెరికా,కెనడాల మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సమస్యగా మారిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్సీబీపీ) లెక్కల ప్రకారం 2022లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు 1లక్షా9వేల535 మంది యత్నించగా ఇందులో 16 శాతం మంది భారతీయులే.2023-24లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కెనడా నుంచి అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఏకంగా 47వేలకు చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ చొరబాట్లపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
అమెరికా విద్యలో భారత్ హవా
సాక్షి, అమరావతి: అమెరికా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకుంది. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో భారత్ వాటా 29 శాతంగా ఉన్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఓపెన్ డోర్స్ 2024 నివేదిక వెల్లడించింది. గత విద్యా సంవత్సరం 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు రూ.4.22 లక్షల కోట్లు సమకూరగా ఇందులో భారత్ వాటా 20 శాతంగా ఉంది.డ్రాగన్‌ను దాటేశాం..!అమెరికా వర్సిటీలు, కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో చైనాను భారత్ అధిగవిుంచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2022–23లో 27.4 శాతం ఉండగా 2023–24లో 24.6 శాతానికి పడిపోయింది. 15 ఏళ్లలో ఇదే తక్కువ. గత విద్యా సంవత్సరం అమెరికాలో 11.26 లక్షల మంది అంతర్జాతీయ విద్య అభ్యసిస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా పేర్కొంది. ఇందులో అగ్రస్థానంలో భారతీయ విద్యార్థులు (3.31 లక్షలు) ఉండగా 2.77 లక్షలతో చైనా విద్యార్థులు, 43,149 మందితో సౌత్ కొరియా విద్యార్థులు తరువాత స్థానాల్లో నిలిచారు. 64.5 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో పబ్లిక్ వర్సిటీలను ఎంచుకుంటున్నారు. 35.5 శాతం మంది స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్, పరిశోధనల కోసం ప్రైవేట్ వర్సిటీలకు వెళ్తున్నారు. ఈ ఏడాది 3 శాతం పెరుగుదల..ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు మూడు శాతం పెరిగినట్లు స్నాప్‌చాట్ నివేదిక చెబుతోంది. యూఎస్‌లోని చాలా విద్యా సంస్థలు గ్రాడ్యుయేట్ విద్యలో ప్రవేశాలను పెంచుకునేందుకు భారత్, చైనా, ఘనా, నైజీరియాలపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. 2022–23లో అమెరికాకు చెందిన 2.80 లక్షల మంది విద్యార్థులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించారు. ఇటలీ, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్ వారి ప్రధాన గమ్యస్థానాలుగా (45 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ (25 శాతం)లో ఎక్కువగా చేరికలున్నాయి. స్టెమ్ కోర్సులపై దృష్టి..భారతీయ విద్యార్థులకు అమెరికాలో అత్యంత ప్రాధాన్య విద్యా గమ్యస్థానాలుగా కాలిఫోరి్నయా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్ నిలిచాయి. అంతర్జాతీయ విద్యార్థులలో 56 శాతం మంది స్టెమ్ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ ప్రవేశాల్లో 2 శాతం, ఫైన్, అప్లైడ్ ఆర్ట్స్‌లో 5 శాతం పెరుగుదల నమోదైంది. గ్లోబల్ డెస్టినేషన్..2014 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల గ్లోబల్ డెస్టినేషన్‌గా అమెరికా కొనసాగుతోంది. కెనడా, యూకే తరువాత వరుసలో ఉన్నాయి. యూకేలో మొత్తం విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యార్థులు 27 శాతం, కెనడాలో 38 శాతం, ఆస్ట్రేలియాలో 31 శాతం ఉన్నారు. మరోవైపు భారత్‌ను అధ్యయన కేంద్రంగా ఎంచుకున్న అమెరికా విద్యార్థుల్లో 300 శాతం పెరుగుదల కనిపించింది. 2022–23లో భారత్‌లో చదువుతున్న అమెరికన్ల సంఖ్య 300 నుంచి 1,300కి పెరిగింది. -
ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగి ఉన్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్ 2.O ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికాలో విదేశీయుల విద్యకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? మరి అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? అమలు చేస్తాడా? లేదా ? అందరి మదిలో ఇదే ప్రశ్న.. మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు.ఇమ్మిగ్రేషన్ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ఒక కారణం.గ్రీన్ కార్డు నిబంధనలు : మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనుంది.అమెరికా పౌరసత్వం ఎవరికి వస్తుంది..? ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది.అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి. కాగా ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి. -
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
-
పదేళ్లలో భారత్‌ను విడిచిపెట్టినవారు ఇంతమందా?.. కారణం ఇదేనా..
2014 తర్వాత.. ఈ పదేళ్లలో దేశాన్ని విడిచిపెట్టిన వారి సంఖ్యలో 67శాతం పెరుగుదల నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి రోజులను గుర్తు చేసుకుందాం. పాలన చేపట్టిన కొన్నాళ్లకే మోదీ ఓ పథకాన్ని తీసుకొచ్చారు.. అదే మేక్ ఇన్ ఇండియా..! భారత్‌ను ప్రపంచంలో టాప్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే సీన్ కట్ చేస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇండియన్స్ భారీగా భారత్‌ను విడిచి వెళ్తున్నారని.. పెట్టుబడులు కూడా ఇతర దేశాల్లో ఎక్కువగా పెడుతున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చాలా మంది భారతీయులు.. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఇండియాలో కాకుండా విదేశాలలో అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఇటీవల భారత పౌరసత్వం విడిచిపెట్టిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. 2022లో 2 లక్షల 25 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. వీరంతా ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లారు. అక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీరిని ఎక్కువగా ఆకర్షించింది.విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కారణాలుమరోవైపు భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతుండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో పన్ను వసూలు ఎక్కువ. దీని కారణంగా ఇండియాలో వ్యాపారం చేయడం కష్టంతో పాటు నష్టంతో కూడుకున్న విషయమని చాలామంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అటు వైద్య సేవలు, విద్య, భద్రత లాంటి అంశాల కోసం జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇక కొన్ని దేశాలు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొన్ని యూరప్ దేశాలు, కరేబియన్ దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వం లేదా రెసిడెన్సీ ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. దీంతో మార్కెట్ రిస్క్ ఎందుకని.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడితే బెటర్ అని చాలామంది భారతీయులు భావిస్తున్నారు...!భారతీయులు ఇతర దేశాల్లో పెట్టుబడులు భారీగా పెడుతుండడానికి పదేళ్ల నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు, దేశీయ పెట్టుబడిదారులకు భయాన్ని కలిగించాయి. ఉదాహరణకు.. డీమానిటైజేషన్.. అంటే నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయన్నది నిపుణుల మాట. 2016లో నోట్ల రద్దు తర్వాత బడా వ్యాపారులు తమ పెట్టుబడులను ఇండియాలో ఉపసంహరించుకున్నారు. అటు నోట్ల రద్దు తర్వాత, చిన్న వ్యాపారాలు MSME సంస్థలు భారీ నష్టాల పాలయ్యాయి. ఆ తర్వాత దేశీయ పెట్టుబడులు క్రమంగా తగ్గాయి.వ్యాపారుల కష్టాలను పెంచిన జీఎస్టీమరోవైపు 2017లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కూడా వ్యాపారుల కష్టాలను పెంచింది. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపార ఖర్చులు పెరిగాయి. దీంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం తగ్గిపోయింది. ఇక 2014 తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇండియాలో తగినంత అవకాశాలు లేకపోవడంతో యువత ఎక్కువగా విదేశాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు అక్కడే పెట్టుబడులు కూడా పెట్టుకుంటున్నారు. 2014 నుంచి 2020 వరకు దేశీయ ఉపాధి రేటు కేవలం 3-4శాతం మాత్రమే ఉంది.ఇదీ చదవండి: ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..పెట్టుబడిదారులకు శాపంగా పన్నులుదేశంలో పెరిగిన పన్నులు పెట్టుబడిదారులకు శాపంగా మారాయి. ఫ్లిప్‌కార్ట్ లాంటి భారతీయ కంపెనీలు కూడా విదేశాలలో పెట్టుబడులు పెంచడం ప్రారంభించాయి. అటు భారత్ రూపాయి విలువ అంతర్జాతీయంగా తగ్గిపోవడం కూడా పెట్టుబడిదారులపై ప్రభావం చూపింది. రూపాయి విలువ 2014లో డాలర్‌కి 60 రూపాయల వద్ద ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. ఇలా మేకిన్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్, పన్నులు, నోట్ల రద్దు, జీఎస్టీ, రూపాయి బలహీనత లాంటి అంశాలు భారత్ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశాల్లో భారతీయ పెట్టుబడులు పెరిగాయి. -
భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?
భారతీయలు, అమెరికన్ల ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ స్పష్టంగా ఇలా ఉంటాయని మాత్రం తెలియదు. అయితే ఇక్కడొక అమెరికా మహిళ ఆ విషయంలో ఇరు దేశాల ప్రజలకు ఎంత వ్యత్యాసం ఉందనేది చేసి చూపించింది. అది చూస్తే వామ్మో ఇంత తేడానా అని ఆశ్యర్యపోతారు. భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లకు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వాళ్లకు వినోధభరితంగానూ, ఆశ్యర్యానికి గురి చేసే విధంగానూ ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయతను బట్టి భాష, సంప్రదాయాల్లో చాలా వైరుధ్యాలు అడగడుగున కనిపిస్తుంటాయి. ఇక భారతీయులు, అమెరికన్ల ఆహారపు అలవాట్లు, ఫ్లోర్‌ని తుడిచే విధానంతో సహా ఉండే వ్యత్యాసాల గురించి సవివరంగా తెలిపేలా వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ మహిళ పేరు క్రిస్టెన్ ఫిషర్. అమెరికా పౌరురాలు. 2017లో భారత్‌కు వచ్చి న్యూఢిల్లీ నివసిస్తున్నప్పుడు తనకెదురైనా అనుభవాన్ని ఇలా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఆ వీడియోలో ముందుగా వంటకాల దగ్గర నుంచి మొదలుపెట్టింది. యూఎస్‌లో ఉప్పు మిరియాలను మసాలాగా ఉపయోగిస్తే..భారత్‌లో ఎండు మిర్చి కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాల, జీరా పొడి, నల్లమిరియాలు వంటివి ఉపయోగిస్తారు. ఇక భోజనం చేసే సమయాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. యూఎస్‌లో డిన్నర్ టైం సాయంత్రం 5 గంటలకే ప్రారంభం కాగా, అదే భారత్‌లో రాత్రి పదిగంటల సమయంలో మొదలవ్వుతుంది. ఇక కాఫీ, టీలు తాగే విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. అమెరికన్లు పెద్ద కప్పులలో కాఫీ తాగేందుకు ఇష్టపడగా, భారతీయులు చిన్న కప్పులలో చాయ్‌ని సిప్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక తినే విషయంలో కూడా తీరు వేరుగా ఉంటుంది ఇరు దేశాల ప్రజలకు. అమెరికన్లు ఫోర్క్‌ని ఉపయోగించగా, భారతీయులు చేతితో తినేందుకు ఇష్టపడతారని. అలాగే పిల్లలను అమెరికన్లు ఉయ్యాలలోనూ లేదా సెపరేట్ బెడ్‌పై పడుకోపెట్టగా..భారతీయుల మాత్రం తమ పక్కనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే ఇల్లుని తుడిచే విధానంలో భారతీయులు కాళ్లపై కూర్చొని క్లీన్ చేయగా వాళ్లు క్లీనింగ్ స్టిక్‌తో శుభ్రపరుస్తారంటూ.. చాలా అందంగా వివరించింది క్రిస్టెన్ వీడియోలో. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..) -
USA: అమెరికాలో భారతీయులే రిచ్
అమెరికాలో కుటుంబ సగటు ఆదాయం అధికంగా ఉన్నది భారతీయులకే. ఎంత ఎక్కువంటే అమెరికన్ల ఆదాయం కంటే అది రెట్టింపు. మనవాళ్లు సంపన్నులే కాదు, మనవాళ్ల నెలవారీ ఆదాయాలు కూడా అమెరికన్లకంటే ఎక్కువ ఉండటం విశేషం. 2019 నుంచి 2023 మధ్య సగటు భారతీయ కుటుంబ ఆదాయం 24 శాతం పెరిగితే, అమెరికన్ల ఆదాయం 18 శాతమే పెరిగింది. -
అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు దొంగిలిస్తున్నారు’.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్
వాషింగ్టన్ : రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయులు.. అమెరికన్ల ఉద్యోగాల్ని దోచేసుకుంటున్నారంటూ ప్రచారం చేశారు.మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (నవంబర్5) ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌లు ఎన్నికల ప్రచారంలో పోటీ పోటీగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.అయితే ట్రంప్ అందుకు భిన్నంగా తన ఎన్నికల ప్రచారంలో భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో హీటెక్కిస్తున్నారు. అందుకు తన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)మీడియాను వినియోగిస్తున్నారు.తాజాగా మాగా మీడియా, ట్రంప్‌కు మద్దతు పలికిన పలు ఆర్థిక వేత్తలతో ట్రంప్ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో గతేడాది అమెరికన్లు 8లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదే సమయంలో విదేశీయులు 10లక్షల ఉద్యోగాలు పొందారు. అమెరికా లేబర్ మార్కెట్ విదేశీ కార్మికులు, ప్రభుత్వ బ్యూరోక్రాట్లకు తాత్కాలిక ఏజెన్సీగా మారుతుందని మాగా మీడియా ఈవెంట్లో ట్రంప్ మద్దతు దారుడు, ఆర్ధిక వేత్త ఈజే ఆంటోనీ ఆరోపించారు. మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులపై అమెరికన్లో విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫిన్‌టెక్ ఎగ్జిక్యూటివ్ షీల్ మొహ్నోట్ మాట్లాడుతూ.. టెక్సాస్‌లో భారతీయులు సేవలందిస్తున్న ఓ బ్యాంక్‌పై విమర్శలు గుప్పించారు. వారందరూ వచ్చే ఏడాది భారతదేశానికి తిరిగి వెళతారు. అందరినీ తిరిగి ఇంటికి పంపాలి. మేము వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, వారందరినీ తిరిగి గుజరాత్‌కు పంపుతాము అంటూ విమర్శిస్తూ షేర్ చేసిన పలు స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయి. -
అందరి చూపు షిల్లాంగ్ వైపే
న్యూఢిల్లీ: జలపాతాలు, ప్రకృతి రమణీయతలకు నెలవై ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’గా ఖ్యాతిగడించిన మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్‌లో వచ్చే ఏడాది పర్యటించేందుకు భారతీయులు తెగ ఉవి్వళ్లూరుతున్నారని ప్రఖ్యాత ట్రావెల్ యాప్ స్కైస్కానర్ తన నివేదికలో వెల్లడించింది. వచ్చే ఏడాదికి సంబంధించిన ‘ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్’ను బుధవారం విడుదలచేసింది. తరచూ పర్యటనకు వెళ్లే భారతీయుల్లో 66 శాతం మంది 2025 సంవత్సరంలో మరింతగా పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పర్యాటకం అనగానే విదేశీయానం చేసే భారతీయులు స్వదేశంలో షిల్లాంగ్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. అజర్బైజాన్ దేశంలోని బాకూ నగరం, మలేసియాలోని లాంగ్కావీ నగరాలను పక్కకునెట్టి షిల్లాంగ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం, ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయడానికి అనువైన పచ్చటి కొండలతో అలరారే షిల్లాంగ్‌లో పర్యటించాలని ఎక్కువ మంది భారతీయులు భావిస్తున్నారు. దీంతోపాటే నార్వేలోని ట్రోంసో, ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్, సౌదీ అరేబియాలోని అల్–ఉలాలనూ పర్యటనల కోసం భారతీయులు ఎక్కువగా సెర్చ్‌చేశారు. తమ పర్యాటక ఖర్చులకు తగ్గ ఆనందం లభిస్తుందన్న ‘బెస్ట్ వాల్యూ డెస్టినేషన్ కేటగిరీ’లో కజక్‌స్థాన్‌లోని అల్మటీ తొలిస్థానంలో నిలిచింది. ఇండోనేసియాలోని జకార్తా, మలేసియాలోని సింగపూర్, కౌలాలంపూర్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలకు విమానచార్జీలు గత ఏడాదికాలంలో భారీగా తగ్గడమూ ఇందుకు మరో కారణం. ఖర్చులే కీలకం ఏ దేశాల్లో పర్యటించాలనే విషయంలో హోటల్ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటామని 65 శాతం మంది చెప్పగా విమానచార్జీలను లెక్కిస్తామని 62 శాతం మంది చెప్పారు. అక్కడి ఆహారం, చిరుతిళ్ల ఖర్చులు సైతం బేరేజు వేసుకుంటామని 54శాతం మంది పేర్కొన్నారు. విమాన ఖర్చులకే ఎక్కువ ఖర్చవుతోందని 86 శాతం మంది చెప్పగా, ఇతర ఖర్చులే ఎక్కువగా ఉంటాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదితో పోలిస్తే 2025లో ఖచి్చతంగా పర్యటించాలన్న బలమైన కాంక్ష ఎక్కువ మందిలో ఉండటం విశేషం. వచ్చేసారి ఎక్కడికి వెళ్లాలనే తుది నిర్ణయంలో ఖర్చులదే అత్యంత కీలక పాత్ర అని స్కైస్కానర్కు సంబంధించిన పర్యాటక నిపుణుడు మోహిత్ జోషి వ్యాఖ్యానించారు. అబూధాబిలో డిసెంబర్లో జరగబోయే ఫార్ములా1 రేసింగ్ వంటి క్రీడలు చూసేందుకు భారతీయులు విపరీతంగా విమానాల్లో వెళ్తున్నారని నివేదిక పేర్కొంది. పాలపుంత వెలుగుల్లోనూ.. జెడ్ జనరేషన్ యువతలో 62 శాతం మంది ఖాళీ సమయాలను విదేశాల్లో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా 57 శాతం మంది తాము ఆడిన వీడియోగేమ్‌లో తరచూ చూసిన ప్రపంచ ప్రఖ్యాత స్థలాలను వెళ్లిరావాలని కోరుకుంటున్నారు. రాత్రిళ్లు వినీలాకాశంలో పాలపుంత అందాలను కళ్లారా చూసేందుకూ ఆయా ప్రదేశాలకు వెళ్లేలని అనుకుంటున్నట్లు 53 శాతం మంది చెప్పారు. ఖగోళ వింతలను కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడుతున్నట్లు 56 శాతం మంది చెప్పారు. ధృవకాంతులను చూసేందుకు విదేశీయానం చేయాలనుకుంటున్నట్లు 44 శాతం మంది చెప్పారు. -
భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం?
భారతదేశంలోని ప్రజలు ఒక ఏడాదిలో వివిధ రుతువులలోని వాతావరణాలను చవిచూస్తారు. చలి, వేడి, వర్షం మొదలైనవి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. అటువంటప్పుడు భారతీయులు ఏ సీజన్లో అత్యధిక సంతోషంతో ఉంటారనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.వాతావరణం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. సూర్యకాంతి, వర్షం, వేడి, చలి, ఇవన్నీ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే వేసవిలో అధిక వేడి అందరికీ చికాకు కలిగిస్తుంది.వాతావరణం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సూర్యరశ్మి, ఉష్ణోగ్రత మొదలైనవి మన మానసిక స్థితి, శక్తి స్థాయిలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. శీతాకాలంలో పగలు తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి కూడా తక్కువగానే ఉంటుంది. ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) తరహా సమస్యలను కలిగిస్తుంది. మరోవైపు శీతాకాలం పండుగ సీజన్ కూడా కావడంతో జనం కొంతమేరకు సంతోషంతో ఉంటారు.వేసవి కాలంలో అత్యధిక సూర్యకాంతి కారణంగా జనం త్వరగా అలసిపోతారు. చికాకుగా అనిపిస్తుంటుంది. అయితే వేసవి సెలవులు రావడం, దీనికితోడు ప్రయాణాల సీజన్ కావడంతో జనం సంతోషంతో ఉంటారు. వర్షాకాలంలో ఏర్పడే పచ్చని ప్రకృతి మన మనసును ప్రశాంతపరుస్తుంది. భారతదేశంలో వాతావరణం- సంతోషం మధ్య సంబంధాన్ని తేల్చిచెప్పడం చాలా క్లిష్టమైనదని నిపుణులు అంటుంటారు. ప్రజల ఆనందం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది.మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాలలోని వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. అయితే దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండలు మండిపోతుంటాయి. కాగా భారతీయ సంస్కృతిలో వాతావరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పలు పండుగలు, ఆచారాలు సీజన్‌తో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు హోలీ పండుగ వసంతకాలంలో జరుపుకుంటారు. దీపావళిని శరదృతువులో జరుపుకుంటారు. వాతావరణం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరికి శీతాకాలం, మరికొందరికి వేసవి కాలం అంటే ఇష్టం ఉంటుంది. ఇది కూడా చదవండి: మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్ -
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
కెనడా, భారత్ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?
Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించి వివాదానికి తెరలేపారు. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడా చేర్చడంతో వివాదం మరింత ముదిరింది. కెనడా చర్యలకు నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుంచి తమ రాయబారి, దౌత్యాధికారులను కూడా వెనక్కి రప్పించింది భారత్. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కెనడాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కెనడా ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న సిక్కులు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కెనడాలోని భారతీయులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. కాగా, తాజా పరిస్థితులు తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగాల కోసం కెనడా వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు.మనోళ్లే ముందు2021 అధికారిక లెక్కల ప్రకారం.. కెనడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. వీరిలో భారత సంతతికి(పీఐఓ) చెందిన వారు 18 లక్షలు, ఎన్నారైలు 10 లక్షల మంది ఉన్నారు. కెనడా పౌరుల్లో 7.3 లక్షల మంది హిందువులు, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా (45 శాతం) ఉన్నారు. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. తాత్కాలిక ఉపాధి పొందుతున్న విదేశీ కార్మికుల్లోనూ మనోళ్లే (22 శాతం) ముందున్నారు. శాశ్వత నివాసం ప్రకటించిన పీఆర్ పథకం కింద అత్యధికంగా 27 శాతం మంది భారతీయులు లబ్ది పొందారు. గత 20 ఏళ్లలో కెనడాలోని భారతీయుల సంఖ్య రెండింతలు పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఆ నగరాల్లోనే ఎక్కువకెనడా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017లో 44.3 శాతం మంది, 2018లో 49.2, 2019లో 55.8, 2020లో 58.4, 2021లో 61.1 శాతం మంది ఇండియన్స్ కెనడా పౌరసత్వం దక్కించుకున్నారు. వాంకోవర్, టొరంటో, ఒట్టావా, వినీపెగ్, కాల్గారి, మాంట్రియల్ నగరాల్లో భారతీయులు అధికంగా నివసిస్తున్నారు. కెనడాలో ఉన్న భారతీయుల్లో 50 శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో మేనేజ్మెంట్ స్థాయి జాబుల్లో ఉన్నవారు కేవలం 19 శాతం మాత్రమే. కెనడాలోని వలస భారతీయుల్లో పన్నులు చెల్లిస్తున్నవారు 42 వేల మంది వరకు ఉన్నారు.చదవండి: ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు.. భారత ఇంజనీర్ ఘనతవాణిజ్యంపై ప్రభావంభారత్, కెనడా దేశాల మధ్య 2023-24 మధ్య కాలంలో 8.9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా భారత్ ఎగుమతులు 4.4 బిలియన్ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కెనడా నుంచి భారత్‌కు ఎక్కువగా పప్పులు ఎగుమతి అవుతుంటాయి. తాజాగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో బయ్యర్లు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు పెంచారు. భారత్ నుంచి ఆభరణాలు, విలువైన రాళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతుంటాయి. కాఫీ చెయిన్ టిమ్ హార్టన్, ఫ్రోజోన్ ఫుడ్ కంపెనీ మెక్కెయిన్ సహా ఇండియాలో 600 పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. -
జీవన్ భద్రాణి పశ్యంతు
మన పూర్వులు పిల్లలకి జీవితం మీద ఆశని కలిగించి ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా సానుకూల దృక్పథం పెం΄÷ందే విధంగా మనసులని మలచేవారు. అందుకే ఒకప్పుడు ఆత్మహత్యల వంటివి అంతగా కనపడేవి కావు. ఎక్కడో ఒకటి జరిగితే అదేదో వింత అన్నట్టు అందరూ కంగారు పడేవారు. ఇప్పుడు అవి అతి సామాన్యమై ΄ోయాయి. అది చాలా మామూలు విషయంగా పరిగణించి పెద్దగా పట్టించుకోవటం కూడా లేదు. ప్రతిస్పందించే సున్నితత్వాన్ని కూడా కోల్పోయాం. ‘‘బ్రతికి యుండిన సుఖములు బడయ వచ్చు’’ అన్నది భారతీయుల విశ్వాసం. ఇటువంటి భావాలని అతి సామాన్యమైన మాటలలో అందరి మనస్సులలో నాటుకునేట్టు చేశారు. బ్రతుకుని అంతం చేసుకోవాలనే ఆలోచనే రాకుండా వాతావరణాన్ని ఉంచేవారు. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చావో రేవో అన్నంత తీవ్రంగా తీసుకునే వారు కాదు. ‘‘కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా?’’ అని తేలిక చేసేవారు, మనం అందరం మనుషులం అని గుర్తు చేస్తూ. ఈనాడు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది చిన్నతనంలో కడుపునిండా తిండి కూడా లేనివారు అని వారి జీవితచరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ‘‘బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అని చెప్పి సాంత్వన కలిగించే వారు. పైగా, ఆ రోజుల్లో అనుకున్నది సాధించక ΄ోవటం, పరాజయాల పాలు కావటం జరిగి, తాత్కాలికంగా నిరాశ కలిగినా వెంటనే తేరుకుని రెట్టించిన ఉత్సాహంతో లేదా కసితో అనుకున్న దానిని సాధించటానికి ప్రయత్నం చేసేవారు. తాము విఫలం కావటానికి కారణం ఏమిటి? అని విశ్లేషించుకునేవారు. ఇది కార్యసాధకుల లక్షణం. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, పూల పానుపూ కాదు. ఈ ఆలోచనా విధానం నేటి యువతరంలోను, మధ్యవయస్కులలోనూ మృగ్యం అయింది. తక్షణం అనుకున్న ఫలితం రావాలి, తన ప్రయత్నంతో సంబంధం లేకుండా. అపజయాన్ని, ఓటమిని అసలు ఎదుర్కో లేరు. కొంచెం కూడా ఆగలేరు. నిర్ధారణ చేసుకునే ఓపిక కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో ΄÷రపాటు పడే అవకాశం కూడా ఉంది. మనం చూస్తూనే ఉంటాం. మొదటి వంద స్థానాల్లో ఉండవలసిన అభ్యర్థి ఉత్తీర్ణుడు కాలేదని ప్రకటన రాగానే తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్న మరునాడు ఆ ప్రకటన తప్పు అని సరి చేసుకోటం తెలుసు కదా! మనసుని ఆ మాత్రం అదుపులో ఉంచలేక ΄ోవటం వల్ల వచ్చిన ప్రమాదం అది. ప్రాణాలు అర్పించి సాధించారు, బలిదానం చేశారు అంటూ ΄÷గిడితే వారికి ఒరిగేది ఏముంది? మిగిలిన వారు అనుభవించ వచ్చు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. సమయం పట్టవచ్చు. మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్పే మాట ఏమంటే, ప్రాణత్యాగం చేయదల్చుకున్న వారిని ఒక్క క్షణం ఆపగలిగితే చాలు నట. క్షణికావేశం చల్లారుతుంది అంటారు. ఆ పనిని ఎవరు చేయగలరు? అసలు ఎవరికైనా తెలియాలి కదా! అందుకే ఎవరికి వారే తమను తాము సముదాయించుకుని, పరిస్థితులతో ΄ోరాడి గెలవాలి. కలిగిన మేలు అనుభవించటానికి బ్రతికి ఉండాలి కదా!ఈ బతుకుని అంతం చేసుకోవాలనే భావన ఎవరికీ రాదా? సీతమ్మకి, హనుమకి, రామచంద్రమూర్తికి, దుర్యోధనుడి వంటి వారికే వచ్చింది. కాని విచక్షణ వారిని ఆపని చేయకుండా కాపాడింది. సీతమ్మ కనపడలేదని హనుమ ఏ విధంగా శరీరం వదలాలి అని ఆలోచిస్తూ సీతారామలక్ష్మణులకి, సుగ్రీవాదులకి నమస్కారం చేయగానే అశోకవనం కనపడింది. దైవాన్ని, పెద్దలని స్మరిస్తే మార్గం కనపడుతుంది. సీత కూడా జుట్టుతో చెట్టు కొమ్మకి ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉండగా త్రిజట మాటలు, హనుమ దర్శనం కలిగాయి. తొందర పడితే? రాముడు కూడా సీత లేకుండా ఉండలేనని అనుకుని, అరణ్యవాసం చేయలేదనే చెడ్డపేరు వస్తుందని ఆగాడు. ఆవేశ పడకుండా కొద్దిగా ఆలోచిస్తే మంచి జరిగి తీరుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
రూ.కోట్లలో లాటరీ గెలుపొందిన భారతీయులు (ఫొటోలు)
-
చదువుకు.. చలో దుబాయ్
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటి. ఆకాశహర్మ్యాలతో మెట్రోపాలిటన్ సంస్కృతికి అద్దం పట్టేలా నైట్ లైఫ్. అబ్బురపరిచే షాపింగ్ ఫెస్టివల్స్. ఒంటెలపై సఫారి. వీటితోనే ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంతకాలం టూరిస్ట్ స్పాట్‌గా వెలుగొందిన దుబాయ్ ఇప్పుడు అంతర్జాతీయ ఉన్నత విద్యకు గమ్యస్థానంగా మారుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో దుబాయ్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పయనమవుతున్నారు. 60కి పైగా విదేశీ వర్సిటీలు, కాలేజీల క్యాంపస్‌లకు దుబాయ్ నిలయంగా ఉంది. ఇప్పటికే యూఎస్, యూకేకు చెందిన వర్సిటీలు సైతం దుబాయ్‌లో క్యాంపస్‌లను నెలకొల్పగా.. మరిన్ని సంస్థలు సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. భారతీయ సంస్కృతితో ముడిపడి..భారతీయులకు అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలో ప్రపంచస్థాయి గమ్యస్థానంగా దుబాయ్ మారుతోంది. గత ఏడాది 2.43 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం అక్కడికి వెళ్లారు. భారత్‌కు దుబాయ్ మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండటం ఎక్కువగా విద్యార్థులకు కలిసివస్తోంది. ప్రధాన భారతీయ నగరాల నుంచి నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులో ఉండటం మరో అంశం. దుబాయ్ కృత్రిమ మేధస్సు, సుస్థిరత, నిర్మాణం, పర్యాటక రంగంలో వినూత్న ప్రాజెక్టులు రూపొందిస్తోంది. ఈ తరుణంలో దుబాయ్ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మానవ వనరులు ఎంతో కీలకం.అందుకే అకడమిక్–పరిశ్రమల మధ్య భాగస్వామ్యం పెంచుతూ తరగతి గదికి మించిన విజ్ఞానాన్ని అందించేందుకు దుబాయ్ అవకాశాలు కల్పిస్తోంది. చాలామంది విద్యార్థులు తమ చదువు సమయంలో దుబాయ్‌లో ఉపాధి సైతం పొందుతున్నారు. దుబాయ్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 95 దేశాలకుపైగా విద్యార్థులు ప్రాతినిధ్యం వహించే అధ్యయన గమ్యస్థానంగా పేరొందింది. అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. దుబాయ్‌లో భాష, ఆచారాలు, వంటకాలు, సంస్కృతితో భారతీయుల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నందున అక్కడకు వెళ్లేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారుగోల్డెన్ వీసాతో..దుబాయ్ వృద్ధికి గోల్డెన్ వీసా కీలకంగా మారింది. యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసా విదేశీ ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు, ఎంట్రపెన్యూర్స్, ప్రత్యేక ప్రతిభావంతులు, పరిశోధకులు, అత్యుత్తమ విద్యార్థులు, సైన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్యం, విద్య, కళల వంటి రంగాలలో అసాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.ఈ వీసాను సాధారణంగా 5–10 సంవత్సరాలకు జారీ చేస్తారు. మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. గోల్డెన్ వీసా హోల్డర్లను జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా యూఏఈలో నివసించడానికి, పని చేయడానికి చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు దుబాయ్‌లో పోస్ట్–స్టడీ ఉపాధి వీసాలు లేవు. అయితే.. అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసిన తర్వాత అక్కడే ఉండేందుకు గోల్డెన్ వీసా కాకుండా ఉపాధి వీసా, ఉద్యోగార్థుల వీసా, ఫ్రీలాన్స్ వీసా, ఇన్వెస్టర్ వీసా, ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ద్వారా రెసిడెన్సీ వీసాలను తీసుకొచ్చారు. భద్రతలోనూ ఇదే టాప్భద్రతా ప్రమాణాలు, వ్యక్తులకు సురక్షితమైన దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. అబుదాబి, దుబాయ్‌లలో నేరాల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది సురక్షితమైన విద్యార్థి వాతావరణానికి దోహదం చేస్తుంది. గతేడాది అబుదాబి 11.5 క్రైమ్ ఇండెక్స్, 88.5 సేఫ్టీ ఇండెక్స్‌తో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ పొందింది. దుబాయ్ నేరాల సూచిక 16.5, భద్రతా సూచిక 83.5గా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు హాయిగా విద్యపై దృష్టి పెట్టొచ్చు.జాబ్ ఓరియంటెడ్ కోర్సులుదుబాయ్లోని చాలా విశ్వవిద్యాలయాలు వ్యాపార రంగంలోని మానవ వనరుల కొరతను అధిగమించేందుకు జాబ్ ఓరియంటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. మనస్తత్వ శాస్త్రం, వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్‌తోపాటు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్, బయో మెడికల్ సైన్సెస్‌పై భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ వంటి ప్రోగ్రామ్‌లు సైతం అక్కడ క్రమంగా విస్తరిస్తున్నాయి.అంతర్జాతీయంగా పేరొంచిన పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ హెల్త్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటర్ సైన్స్–ఇంజనీరింగ్, ఐటీ వంటివి ఉన్నాయి. ఉద్యోగాలను సృష్టించే ఎంట్రపెన్యూరల్ వాతావరణాన్ని ప్రఖ్యాత ప్రపంచ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లతో దుబాయ్‌లో చదువుకునేందుకు అవకాశాలు పెరిగాయి. దుబాయ్‌లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అనేక స్కాలర్షిప్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అకాడెమిక్ ఎక్స్‌లెన్స్ స్కాలర్షిప్లు, మల్టీ కల్చరల్ స్టూడెంట్ స్కాలర్షిప్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ట్యూషన్ స్కాలర్షిప్లు పొందొచ్చు. -
భారతీయుల తీరుపై నితిన్ కామత్...
భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరైన జరోధా సీఈఓ 'నితిన్ కామత్' ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లిష్టమైన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు. బెంగళూరు జరిగిన టెక్‌స్పార్క్స్ 2024 ఈవెంట్లో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ.. భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు? అని ప్రశ్నించారు.ధనవంతుల విషయంలో భారతీయులకు, అమెరికన్లకు మధ్య వ్యత్యసాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. యుఎస్‌లో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించి.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తే, అలాంటి విషయాలను న్యూస్ పేపర్ కవర్ పేజీ మీద ముద్రిస్తారు. అక్కడ ఇదంతా సర్వ సాధారణం.కానీ.. భారతదేశంలో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అంటే.. ఏదో తప్పుడు దారిలో డబ్బు సంపాదిస్తున్నారని చాలామంది భావిస్తారు. ఆ తరువాత వాళ్ళను ద్వేషించడం మొదలుపెడతారు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారీ సమాజం, భారత్ మాత్రం పెట్టుబడిదారీ సమాజంగా నటిస్తున్న సోషలిస్టు సమాజం అని అన్నారు. ఇప్పటికీ చాలామంది ప్రజల గుండెల్లో సోషలిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు పేదరికాన్ని గౌరవ చిహ్నంగా ధరిస్తారని ఒకరు అన్నారు. భారతదేశంలో, ధనికులు తగిన పన్నులు చెల్లించకుండా, మోసాలకు పాల్పడుతున్నారని, పేద.. మధ్యతరగతి వర్గాలను దోపిడీ చేయడం ద్వారా ధనవంతులు అవుతున్నారని మరొకరు అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Shradha Sharma (@shradhasharmayss) -
భవిష్యత్తు ప్రణాళిక బహు క్లిష్టం
సాక్షి, హైదరాబాద్: సంస్థలు, కుటుంబాలు, వ్యక్తులు.. ఎవరైనా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కీలకం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్తు ప్రణాళిక క్లిష్టంగా మారుతోంది. భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, స్తబ్ధతలో కూరుకుపోతున్నామనే భా వనలో మెజారిటీ ప్రజలున్నారు. 69 శాతం మంది భారతీయులు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని తేలింది. ఊహించని మార్పులను ఎదుర్కొంటున్నట్టుగా 91 శాతం మంది అంగీకరించారు. పరిస్థితుల ›ప్రభావంతో ఆత్మవిశ్వాసం, నమ్మకం సన్నగిల్లుతుండడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధంగా లేమని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తులుగా.. సరైన వేళకు.. సరైన నిర్ణయాలు తీసుకో లేకపోతున్నామని మధనపడుతున్నట్లు 57 శాతం పేర్కొన్నారు. ఇదీ అధ్యయనం.. హెచ్ఎస్బీసీ సంస్థ ఆధ్వర్యంలో.. భారత్, హాంకాంగ్, సింగపూర్, యూఏఈ, యూకే, యూఎస్‌లలోని వివిధ రంగాలు, మార్కెట్లకు చెందిన దాదాపు 18వేల మంది వ్యక్తులు (దాదాపు 4 వేల బిజినెస్ లీడర్లు)పై జరిపిన గ్లోబల్ స్టడీ ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలపై హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ (వెల్త్ అండ్ పర్సనల్ బ్యాంకింగ్) సందీప్ బాత్రా స్పందిస్తూ.. దైనందిన జీవనంలో సమస్యలు ఎదురైనపుడు వాటిని ఎదుర్కొనేందుకు.. ఏదో ఒక రూపంలో సహాయపడాలని హెచ్ఎస్బీసీ భావిస్తోందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, ఇతర రంగాల్లో ప్రజలకు తగిన సలహాలు, సూచనలిచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జీవితంలో క్లిష్టమైన సవాళ్లు ఎదురైనపుడు అంతర్జాతీయ నెట్వర్క్ సహాయంతో అనిశి్చతిని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. నివేదికలో ఏముందంటే.. » వేగంగా మార్పులు సంభవిస్తున్న యుగంలో తామున్నట్టు 91 శాతం మంది భారతీయుల భావన » భవిష్యత్ ప్రణాళికల రచనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 69 శాతం మంది ఉన్నారు. » తీసుకున్న నిర్ణయాల అమలుకు సిద్ధంగా లేమని భావిస్తున్నవారు, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనుకున్నవారు 62 శాతం మంది ఉన్నారు. » తగిన సమయంలో అవకాశాలు కోల్పోయినందుకు, తగిన నిర్ణయం తీసుకోలేకపోయినందుకు చింతిస్తున్నవారు 57 శాతం మంది ఉన్నారు. » తాము తీసుకున్న నిర్ణయాలు చివరకు సరైనవి కావనే భావనలో 46 శాతం మంది ఉన్నారు. » సరైన నిర్ణయాలు తీసుకోలేక.. వాటిని వీలైనంత వాయిదా వేస్తున్న వారు 42 శాతం మంది ఉన్నారు. » నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 33 శాతం మంది ఉన్నారు.భారత్‌కు యూఎస్ తోడుఈ అధ్యయనానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. భారత్‌లో మాదిరిగానే యూఎస్ఏలోనూ 47 శాతం మంది అ మెరికన్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారు.» అమెరికన్లలో 33 శాతం మంది తాము తీసుకున్న పాత నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. » ఐదేళ్లలో.. ఇతరులతో సంబంధం లేకుండా వేరుగా ఉన్నామనే భావనలో 43 శాతం అమెరికన్ మహిళలున్నారు. అదే పురుషుల విషయానికొస్తే 26 శాతంగా ఉంది.» యూఎస్‌లో బిజినెస్ లీడర్లు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోల్చితే భవిష్యత్ ప్రణాళికలు మరింతగా సవాళ్లతో కూడుకున్నవనే భావనలో 51 శాతం మంది ఉన్నారు. -
విస్తరిస్తున్న విదేశీ టూరిజం
విదేశీ పర్యటనలపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఖర్చు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ‘కొన్నిసార్లు మేం దేశీయ పర్యటన కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి మరో రూ.10 వేలకుపైగా ఖర్చు చేసి విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు. ఇక్కడ ఖర్చులతో పోలిస్తే విదేశాల్లో తక్కువే’ అని విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి హేమ అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరుల్లో వృద్ధి, విమాన ప్రయాణాల కనెక్టివిటీ పెరగడంతో మధ్య తరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలోని 31శాతం మంది మధ్య తరగతి ప్రజలున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని అంచనా. ఈ క్రమంలోనే 2027 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌లను అధిగమించి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద విదేశీ (అవుట్‌బౌండ్) టూరిజం మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి భారత పర్యాటకుల మార్కెట్ విలువ రూ.7.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2019లో రూ.3 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు మరో మూడేళ్లలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్‌గా మారుతుందని భావిస్తున్నారు. – సాక్షి, అమరావతిమధ్యప్రాచ్య దేశాల్లో మనోళ్ల సందడిభారతీయుల్ని మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల పర్యాటక రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ పర్యాటకుల్లో దాదాపు సగం విదేశీ పర్యటనలు ఇక్కడే చేస్తున్నారు. ఆ తర్వాత ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ హాలిడే మేకర్లలో అతిపెద్ద వనరుగా భారత్ మారింది. గోవా, కేరళ వంటి భారతీయ రిసార్ట్ గమ్యస్థానాల ధరలతో సమానంగానే వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి సమీప దేశాల్లో ధరలు కూడా ఉంటున్నాయని టూరిజం ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తిరిగే ఖర్చుకు మరికొంత వెచ్చించగలిగితే విదేశాలకు వెళ్లవచ్చనే అభిప్రాయం భారతీయ పర్యాటకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జపాన్ సైతం భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఈ–వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో దుబాయ్ సైతం భారతీయ సందర్శకులను అకట్టుకునేందుకు బహుళ ప్రవేశ పర్యాటక వీసాను రూపొందించింది. దక్షిణాఫ్రికా సరళీకృత వీసాను తీసుకొస్తోంది. మలేíÙయా, కెన్యా, థాయ్‌లాండ్, ఇరాన్ సహా ఇతర దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అవసరం లేని పర్యటనలు అందిస్తున్నాయి.231 శాతం పెరుగుదలఅమెరికన్లు 63 రోజులు, బ్రిటిషర్లు 90 రోజులతో పోలిస్తే భారతీయులు కేవలం 30 రోజుల ముందుగానే పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. భారతీయులకు సమీప దేశాల ప్రయాణాలకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది ఎక్కువ మంది వియత్నాం ప్రయాణించినట్టు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అక్కడ 2019తో పోలిస్తే భారతీయ సందర్శకుల సంఖ్య 231 శాతం పెరిగింది. ఇతర ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేíÙయా రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.విదేశాలకు పెరుగుతున్న విమానాలు ఆ్రస్టేలియా, చైనా, జపాన్ వంటి ప్రధాన పోటీదారులను అధిగమించి భారతదేశం ప్రయాణ రంగంలో వేగంగా ముందంజ వేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిలో చెప్పుకోదగ్గ పురోగతితో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. దేశీయ విమాన ట్రాఫిక్‌లో ఏటా 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ వృద్ధి రేటు చైనాలో 7.1 శాతం, జపాన్ 4 శాతం, ఆ్రస్టేలియాలో 2.6 శాతం ఉండగా.. భారత్ ఈ దేశాలను అధిగమించడం విశేషం. ఈ వృద్ధితో విమానయాన రంగంలో బ్రెజిల్, ఇండోనేíÙయాను భారత్ వెనక్కి నెట్టింది. ఏటా విమాన సీట్ల సంఖ్యలో 6.9 శాతం వార్షిక వృద్ధి రేటు కనిపిస్తోంది. యూఎన్ టూరిజం ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది త్రైమాసికంలో అంతర్జాతీయ ప్రయాణాలు ప్రీ–పాండమిక్ స్థాయిలో 97 శాతానికి చేరింది. భారతీయ విదేశీ టూరిజంలో ఉన్నంత వృద్ధి వేగం మరెక్కడా లేదు. వాస్తవానికి గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. తాజాగా మరో 1,200కి పైగా విమానాల కోసం ఆయా సంస్థలు ఆర్డర్లు పెట్టడం విమాన ప్రయాణాల డిమాండ్‌ను సూచిస్తోంది.టమాటా పండుగకూ వెళ్లొస్తున్నారు టీవీలు, సినిమాల్లో చూపించే విదేశీ నగరాలను చూసేందుకు భారతీయుల్లో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు 2011 తర్వాత స్పెయిన్‌ను సందర్శించే భారతీయులు 40 శాతం పెరిగారు. అక్కడ జరిగే ‘లా టొమాటినా పండుగ’ ( టమాటాలు విసురుకోవడం) ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం కావడంతో ఆ పండుగను చూసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
ఈ బద్ధకం వదిలేద్దాం!
ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట. ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది. ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ. తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ మాట. అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం. మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి. లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం. రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి! -
యాభై ఏళ్ల భారత విజయగాథ
1970ల వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 1.9 శాతానికి తగ్గిపోయింది. కానీ అనంతరం స్థిరమైన పనితీరు నమోదవుతూ వచ్చింది. ఇప్పుడది 3.5 శాతం. ప్రపంచ సగటు కంటే దేశ ఆర్థిక వ్యవస్థ రెండింతలు వృద్ధి చెందుతోంది. అన్నింటిమీదా నియంత్రణలున్న వామపక్ష విధానాల నుండి దూరం జరిగి కొత్త ఆర్థిక విధానం ప్రారంభం కావడమే దీనికి కారణం. భారతీయులు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా ఉంది. ఆదాయపు నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధిక వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుంది.అప్పుడు అలా కనిపించక పోయివుండొచ్చు, కానీ 50 ఏళ్ల క్రితం భారతదేశం పెద్ద మలుపును చేరుకుంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఉపద్రవం ఏర్పడ్డాయి. ఒక సంవత్సరం తర్వాత దాని నిర్ణయాత్మక చర్య ఏమిటంటే, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం. కాకపోతే రెండేళ్ల లోపే అది తారుమారైపోయింది. దేశాన్ని ప్రభావితం చేసిన ఒక ముఖ్య ఘటనను ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. అదేమిటంటే, ఇందిరా గాంధీ హయాంలో అమలైన సంపూర్ణ వామపక్ష దశ నుండి దూరం జరుగుతూ ఆర్థిక విధానంలో కొత్త దిశ ప్రారంభం కావడమే. అంతవరకు ఆర్థిక వ్యవస్థగా భారత దీర్ఘకాలిక పనితీరు నామమాత్రంగానే ఉండింది. కాలక్రమేణా కొత్త ‘భారత విజయ గాథ’ పుట్టుకొచ్చింది.1970ల మధ్యకాలం వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. వరుస యుద్ధాలు, దిగుబడిలేని పంటలు, క్షామం, వేదనాభరితమైన రూపాయి క్షీణతతో పాటు రెండు చమురు షాక్‌ల రూపంలో దాదాపు 15 ఏళ్ల సంక్షో భాలను ఎదుర్కొన్న తర్వాత మార్పు మొదలైంది. నెహ్రూ హయాంలోని ప్రారంభ ఆశావాదం తర్వాత జరిగిన ఈ సంఘటనలు చాలా వరకు జాతి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి.ఆర్థిక వ్యవస్థ స్థిరీకరించబడిన తర్వాత, అర్ధ శతాబ్దపు స్థిరమైన పనితీరు నమోదైంది. తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం కలిగిన దేశాలతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా మన వృద్ధి రేటు అధిగమించింది. పర్యవసానంగా దేశం మునుపెన్నడూ ఆస్వాదించని అంతర్జాతీయ స్థాయిని నేడు కలిగి ఉంది. అయినప్పటికీ, కొన సాగుతున్న పేలవమైన సామాజిక ఆర్థిక కొలమానాలు, పెరుగుతున్న అసమానత కారణంగా మన వృద్ధి రేటు ‘ఆశాజనకమైన’ రికార్డుగా అయితే లేదు.ఆర్థిక పరివర్తనకు ముందు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా క్షీణిస్తూ ఉండేది. 1960లో 2.7 శాతం నుండి 1975లో 1.9 శాతానికి మన వృద్ధి క్షీణత మందగించింది. 2013లో కూడా, ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 1960 నాటి కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు 2024లో ఇది 3.5 శాతం. పైగా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు కంటే రెండింతలు వృద్ధి చెందుతున్నందున, ప్రపంచ వృద్ధికి భారత్ మూడవ అతిపెద్ద దోహదకారిగా ఉంటోంది.తలసరి ఆదాయం కూడా అదేవిధంగా మెరుగుపడింది. 1960లో ప్రపంచ సగటులో 8.4 శాతంగా ఉన్న దేశ తలసరి ఆదాయం 1974లో 6.4 శాతానికి తగ్గింది. 2011లో ఈ సంఖ్యలు 13.5 శాతా నికి, 2023లో 18.1 శాతానికి మెరుగుపడ్డాయి. దాదాపు ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్ల పెరుగుదల! అయినప్పటికీ చాలా దేశాల్లోని ప్రజలు మనకంటే మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. ఆఫ్రికా బయటి దేశాల్లో, మన పొరుగు దక్షిణాసియా దేశాల్లో తలసరి ఆదాయం ఇంత తక్కువగా ఉన్నవి పెద్దగా లేవు. అంటే, మనం ప్రయాణించవలసింది ఇంకా ఎంతో ఉంది.భారతదేశ కథను మార్చేది దాని జనాభా పరిమాణమే. తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కానీ 140 కోట్లసార్లు గుణిస్తే అది భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ అతిపెద్దదిగా చేస్తుంది. ఇప్పటికే, భారత్ మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు రెండవ అతిపెద్ద మార్కెట్. విమానయానం, కార్లకు మూడవ లేదా నాల్గవ అతిపెద్ద మార్కెట్. ఈ ఉత్పత్తులు, సేవా మార్కెట్లలో వృద్ధికి, పెరుగు తున్న మధ్యతరగతి కారణమవుతోంది. ఇది ‘డాలర్–బిలియనీర్ల’ పెరుగుదలకు దారితీసింది (200 బిలియనీర్లు. ప్రపంచంలో మూడో స్థానం). మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారత స్టాక్ మార్కెట్ నాల్గవ స్థానంలో ఉంది.1970ల మధ్యకాలం వరకు, దాదాపు సగం మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసించారు. నేడు, అధికారికంగా 10 శాతం కంటే తక్కువ మంది పేదలు ఉన్నారు. భారత్‌ను ఇప్పుడు పేద ప్రజల దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న శక్తిగా అంతర్జాతీయంగా ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ, వియత్నాం వంటి దేశాలు ‘అధిక అభివృద్ధి’ హోదాను పొందగా, భారత్ తన మానవాభివృద్ధిలో ‘మధ్యస్థ అభివృద్ధి’ దేశంగా మాత్రమే కొనసాగుతోంది. మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ‘అధిక అభివృద్ధి’ విభాగంలో చేరే అవకాశం లేదు. దీనికి మించి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో కూడిన ‘అత్యున్నత అభివృద్ధి’ విభాగం ఉంది. ఇందులోకి చేరాలన్నది ప్రస్తుతం దేశ ఆకాంక్ష.దేశంలో పాఠశాల విద్య సగటు సంవత్సరాలు 2010లో ఉన్న 4.4 ఏళ్ల నుండి ఇప్పుడు 6.57 ఏళ్లకు మెరుగైనాయి. 1,000 జనాభాకు ఒక వైద్యుడు ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నిష్పత్తి కంటే ఇది ఎక్కువ. దేశ ప్రజల ఆయుర్దాయం 70 సంవత్సరాల పరిమితిని కూడా దాటేసింది. అధిక ఆదాయాలు వైవిధ్యమైన, సమృద్ధికరమైన ఆహారంలో ప్రతిబింబిస్తాయి. పాల వినియోగం 10 రెట్లు పెరిగింది. చేపల వినియోగం కూడా అలాగే ఉంది. గుడ్ల వినియోగం 20 రెట్లు పెరిగింది. వీటన్నింటి కంటే ముఖ్యమైనది మనస్తత్వంలో మార్పు. 1970ల మధ్య వరకూ భారత్ సామ్యవాద భావజాలానికి కట్టుబడి ఉంది. అనేక పరిశ్రమలను పెద్ద ఎత్తున జాతీయం చేయడమే కాకుండా, కాగితం నుండి ఉక్కు వరకు, చక్కెర నుండి సిమెంట్ వరకు, ఆఖరికి స్నానం సబ్బుల నుండి కార్ల వరకు ప్రతిదానిపై ధర, ఉత్పత్తి నియంత్రణ ఉండేది! దీని అనివార్య ఫలితం ఏమిటంటే కొరత, బ్లాక్ మార్కెట్లు. పారిశ్రామిక వివాదాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికసంఘాల పక్షం వహించడం పరిపాటిగా ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఐసీయూలో ఉన్నాయి. పైగా వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వాలు ఇప్పుడు కార్మిక చట్టాలను మార్చాలనుకుంటున్నాయి. పన్ను రేట్లు సహేతుకంగా మారాయి.భారతీయులు ఇప్పుడు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. 1974లో షేర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ విలువ రూ. 12 కోట్లు (నేటి డబ్బులో దాదాపు రూ. 350 కోట్లు). దీనితో పోల్చితే, గత రెండేళ్లలో అనేక కంపెనీలు రూ. 15,000 –21,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూలు జారీ చేశాయి (ఎల్ఐసీ, అదానీ, వోడాఫోన్ మొదలైనవి). ఒక దశాబ్దం క్రితం వరకు, మ్యూచు వల్ ఫండ్ కంపెనీలు బ్యాంకు డిపాజిట్లలో ఎనిమిదో వంతు కంటే తక్కువ మొత్తాలను నిర్వహించాయి; ఆ షేర్ రెండింతలు పెరిగి ఇప్పుడు పావు వంతు కంటే ఎక్కువకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం తన జీడీపీకి గత పదేళ్లలో చేసిన దానికంటే, మరింత ఎక్కువ జోడిస్తుంది.భారత్ సాధించిన ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా తక్కువేమీ లేదు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే వినియోగ సరుకుల ఉత్పత్తి ఏమాత్రం పెరగలేదు. నిల్వ ఉండని సరుకుల ఉత్పత్తి వార్షిక సగటు కేవలం 2.8 శాతమే పెరిగింది. దీనివల్ల స్పష్టంగానే, వినియోగ దారులు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. ఆదాయ నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఇది మారినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధికంగా వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది.టి.ఎన్. నైనన్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఉసురు తీస్తున్న అమెరికా డ్రీమ్స్
అమెరికా. ఊహల స్వర్గం. ముఖ్యంగా భారత యువతకైతే ఎలాగైనా చేరి తీరాలనుకునే కలల తీరం. ఇందుకోసం చాలామంది ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. చదువు, నైపుణ్యం వంటి అర్హతలు లేకున్నా అక్రమంగానైనా అగ్రరాజ్యం చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కరడుగట్టిన మాఫియా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కి సర్వం కోల్పోతున్నారు. ధనం, మానంతో పాటు కొన్నిసార్లు నిస్సహాయంగా ప్రాణాలూ పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి, అయినవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. అయినా అత్యంత ప్రమాదకరమైన ‘డంకీ’ మార్గాల్లో అమెరికా బాట పడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది... – సాక్షి, నేషనల్ డెస్క్ ఇటీవల వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా డంకీ గుర్తుందా? అక్రమంగా ఇంగ్లండ్ చేరేందుకు కొందరు చేసే ప్రయత్నమే దాని ఇతివృత్తం. ఇలా అక్రమ దారుల్లో దేశాలు దాటడాన్ని ‘డంకీ మార్గం’గా పిలుస్తారు. ఇదో పంజాబీ పదం. ఇలా అమెరికా చేరేందుకు ప్రయతి్నస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆ క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటూ, మనుషులను అక్రమంగా చేరవేసే మాఫియా చేతుల్లో నానారకాలుగా చిత్రవధకు గురవుతున్నట్టు స్కై న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది.ఈ విధంగా మానప్రాణాలను రిసు్కలో పెట్టుకుంటున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టు తన నివేదికలో పేర్కొంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2022 నాటికే అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల సంఖ్య ఏకంగా 7.25 లక్షలు దాటేసింది. ఈ జాబితాలో మెక్సికో, ఎల్ సాల్వెడార్ తర్వాత మనోళ్లు మూడో స్థానంలో ఉన్నారు. 2023లో రికార్డు స్థాయిలో ఏకంగా 96,917 మంది భారతీయులను అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా నిర్బంధించడమో, బలవంతంగా వెనక్కు పంపడమో జరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాకు రూటు ఇలా.. అమెరికాలో అక్రమంగా ప్రవేశించదలచే భారతీయులు తొలుత పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి సెంట్రల్ అమెరికా దేశాలకు చేరతారు. మాఫియా ప్రపంచంలో వీటికి అమెరికాకు గేట్‌వేలుగా పేరు. ఈ దేశాల వీసా తేలిగ్గా లభిస్తుంది. పైగా అక్కడి నుంచి తొలుత మెక్సికోకు, ఆపై అమెరికాకు చేరడం సులువు. ఆయా దేశాల నుంచి వీళ్లను అమెరికా చేర్చేందుకు ఒక నమ్మకమైన గైడ్‌ను అక్రమ రవాణా మాఫియాయే ఏర్పాటు చేస్తుంది. అతన్ని కొయొటోగా పిలుస్తారు. అయితే అత్యంత కష్టతరం, ప్రమాదకరం అయిన మార్గాల గుండా సాగే ఈ ప్రయాణం అక్షరాలా ప్రాణాంతకమే! దీనికి కొన్నిసార్లు ఒక్రటెండేళ్ల సమయం కూడా పడుతుంది! భారతీయులపై నానారకాల అకృత్యాలు జరిగేది కూడా ఈ దశలోనే. అమెరికాలోకి సరిహద్దు దాటించేందుకు ఏటా మూడు సీజన్లుంటాయి. నేను సీజన్‌కు సగటున 500 మందిని పంపుతుంటా. – స్కై న్యూస్‌తో ఒక ఏజెంట్ ‘అమెరికా వెళ్లేందుకు నా సేవింగ్స్ అన్నీ ఊడ్చి మరీ మాఫియాకు రూ.40 లక్షలు చెల్లించా. కానీ నన్ను కఠ్మాండూ తీసుకెళ్లి బంధించారు. మావాళ్ల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. – సుభాష్ కుమార్ (26)ఆ సరిహద్దు.. ప్రత్యక్ష నరకంకిందా మీదా పడి అమెరికా సరిహద్దు దాకా చేరేవారిది మరో రకం దైన్యం. ముఖ్యంగా మెక్సికో బోర్డర్ వద్ద చిక్కుపడేవారైతే అక్షరాలా నరకం చవిచూస్తున్నారు. ఆ ప్రాంతమంతా మెక్సికన్ మాఫియా నియంత్రణలో ఉంటుంది. దాంతో బాలికలు, మహిళలపై ఇష్టారాజ్యంగా లైంగిక దాడులు, అత్యాచారం జరుగుతున్నాయి. వాళ్లను బలవంతంగా వేశ్యా వృత్తిలోకి కూడా దించుతున్నారు. అక్కడ సగటున ప్రతి ముగ్గురిలో ఒకరిపై లైంగిక దాడి జరుగుతున్నట్టు అంచనా. సర్వం తెగనమ్ముకుని..తమ పిల్లలను ఎలాగైనా అమెరికా పంపడమే లక్ష్యంగా సర్వం తెగనమ్ముకుంటున్న వారికి కొదవ లేదు. మాఫియా అడిగినంత ఇచ్చుకునేందుకు ఇల్లు, పొలం, నగా నట్రా వంటివన్నీ తాకట్టు పెట్టడమో, అమ్మడమో చేస్తున్నారు. అలా ఆస్తులన్నీ అమ్మించి అమెరికా బాట పట్టిన మలీ్కత్సింగ్ అనే 30 ఏళ్ల టెక్నాలజీ గ్రాడ్యుయేట్ దోహా, అల్మాటీ, ఇస్తాంబుల్, పనామా సిటీ గుండా చివరికి ఎల్ సాల్వడార్ చేరుకున్నాడు. అక్కడ మాఫియా చేతిలో దుర్మరణం పాలయ్యాడు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. సాహిల్ అనే మరో 19 ఏళ్ల యువకుడు పనామా నుంచి బయల్దేరి మార్గమధ్యంలోనే గల్లంతయ్యాడు. అప్పట్నుంచీ అతని ఆచూకీ కోసం తండ్రి శివకుమార్ (45) చేయని ప్రయత్నమంటూ లేదు.ఇదీ పరిస్థితి⇒ డంకీ రూటు సెంట్రల్ అమెరికా దేశాల మాఫియాకు కొన్నేళ్లుగా ఆకర్షణీయమైన వ్యాపారంగా మారింది. ⇒ అమెరికా చేర్చేందుకు 50 వేల నుంచి లక్ష డాలర్ల దాకా (రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షలు) వసూలుచేస్తున్నాయి. ⇒ వీళ్లకు ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఏజెంట్లున్నారు. ⇒ వీరి వల్లో పడేవాళ్లలో ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల యువత సంఖ్యే అధికం. ⇒ ఆశావహులు ముందుగా విమాన మార్గంలో పనామా తదితర దేశాలకు చేరతారు. ⇒ అక్కడినుంచి వీళ్ల జుట్టు పూర్తిగా మాఫియా ముఠాల చేతికి చిక్కుతుంది. ⇒ దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు, జలమార్గాలను దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది. ⇒ అలా అమెరికా చేరేదాకా ప్రయాణమంతా ‘వాళ్ల దయ, వీళ్ల ప్రాప్తం’ అన్నట్టుగా ఉంటుంది. ⇒ చాలాసార్లు ఫేక్ బోర్డింగ్ పాసులు, వీసాలు చేతిలో పెట్టి ‘ఇదే అమెరికా’ అంటూ నమ్మించి మార్గమధ్యంలోనే వదిలేస్తుంటారు. ⇒ ఇలాంటి వాళ్లంతా పోలీసులకో, క్రిమినల్ గ్యాంగులకో చిక్కుతారు. అంతిమంగా వాళ్లకు చిప్ప కూడు, చిత్రహింసలే గతవుతాయి. -
లావోస్‌లో సైబర్ బానిసలు..
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్‌కు చేరుకొని, సైబర్ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్‌కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్‌లో బొకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటైన సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్‌లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచ్చులోకి యువత ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్ నేరగాళ్లు లావోస్‌కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్‌పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్‌లలో, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. జాబ్ ఆఫర్ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు ఉద్యోగాల కోసం లావోస్ వెళ్లి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్‌కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో లావోస్‌లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్ రప్పించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుండడంపై లావోస్ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
స్వీడన్‌ను వీడి స్వదేశానికి
స్వీడన్.. ఐరోపాలో ఐదో పెద్ద దేశం. అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి. అయినప్పటికీ చాలామంది భారతీయులు స్వీడన్‌ను వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య 2024లో జనవరి–జూన్ మధ్య ఏకంగా 171% పెరగడం విశేషం! 1998 తర్వాత ఇంత భారీగా భారతీయులు స్వీడన్ వీడి రావడం ఇదే తొలిసారి. ఇందుకు కారణాలను తెలుపుతూ స్వీడన్లో ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వీడన్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ అంకుర్ త్యాగి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సామాజిక అనైక్యత... స్వీడన్లో సాంస్కృతిక, భాషా అవరోధాల వల్ల స్థానికులతో భారతీయులు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు. స్వదే శంలో ఉండగా బాగా అలవాటైన బలమైన సామాజిక బంధాలను కోల్పోతున్నారు. స్వీడిష్ సమాజంలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారు. ఒంటరితనం, స్నేహితుల లేమివ వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు తోడుగా, కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తిరిగి వచ్చేస్తున్నారు. కఠినమైన స్వీడిష్ వాతావరణం, అధిక జీవన వ్యయం కూడా ముఖ్యమైన సమస్యలే. సాంస్కృతిక సవాళ్లు... స్వీడన్లో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అర్హతలు, పని అనుభవం ఉన్నా స్వీడిష్ భాషా నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. సరీ్వస్ అపార్ట్మెంట్ల కొరతతో వసతి కూడా సమస్యగా మారుతోంది. వీటికి తోడు భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో అక్కడ అవకాశాలు అపారంగా పెరుగుతుండటమూ మనవాళ్లు స్వదేశీ బాట పట్టేందుకు ప్రధాన కారణమని త్యాగి పేర్కొన్నారు. నిపుణులకు భారత్‌లో మెరుగైన అవకాశాలు, మంచి వేతనాలు, ఉత్తేజకరమైన కెరీర్ ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. కొవిడ్ తర్వాత... కొవిడ్ మహమ్మారి అనంతరం పలు రంగాల్లో ఎక్కడి నుంచైనా పని చేయడానికి వీలుండటం కూడా మనవాళ్లు స్వీడన్ వీడేందుకు కారణంగా మారుతోంది. భారత్‌కు తిరిగి వచ్చి ఇక్కడినుంచే పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ దేశానికి వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో జని్మంచిన స్వీడిష్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి స్వీడిష్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద ప్రస్తుతం 10,000 స్వీడిష్ క్రౌన్లు (సుమారు 960 డాలర్లు), వారు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను అందిస్తోంది. ఇది కూడా ఓ కారణమై ఉంటుందని, అయితే దేనిని అంచనా వేయాలన్నా ఏడాదిపాటు వలసలను అధ్యయనం చేయాలని స్వీడన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ, సెక్రటరీ జనరల్ రాబిన్ సుఖియా చెబుతున్నారు.గత ఆర్నెల్లలో 2,461 మంది వెళ్లారు! నిజానికి స్వీడన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. 2024లో ఇప్పటిదాకా స్వీడన్‌కు వలస వెళ్లినవారిలో ఉక్రేనియన్ల తరువాత ఎక్కువమంది భారతీయులే. గత జనవరి నుంచి జూన్ దాకా 2,461 మంది మనవాళ్లు స్వీడన్ బాటపట్టారు. అయితే గత ఆరేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2020, 2021 కోవిడ్ సంవత్సరాలను మినహాయిస్తే 2017–2024 మధ్య ఒక ఏడాదిలో ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు స్వీడన్ వెళ్లడం ఇదే తొలిసారి. – న్యూఢిల్లీ -
ఓవరాల్ టీమ్ చాంప్ భారత్
అమ్మాన్ (జోర్డాన్): ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత మహిళల జట్టు ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు చేరాయి. 69 కేజీల విభాగం ఫైనల్లో కాజల్ 9–2తో ఒలెక్సాండ్రా రిబాక్ (ఉక్రెయిన్)పై గెలిచి బంగారు పతకం సాధించింది. 46 కేజీల విభాగం ఫైనల్లో శ్రుతిక శివాజీ పాటిల్ 0–13తో యు కత్సుమె (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. 40 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో రాజ్‌బాలా 11–5తో మొనాకా ఉమెకావా (జపాన్)పై, 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో ముస్కాన్ 12–2తో ఇసాబెల్లా గొంజాలెస్ (అమెరికా)పై విజయం సాధించారు. 61 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో రజి్నత 2–6తో హినై హర్బనోవా (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మొత్తం 10 వెయిట్ కేటగిరీల్లో పోటీలు జరగ్గా... తొమ్మిది కేటగిరీల్లో భారత రెజ్లర్లు పోటీపడ్డారు. ఐదు స్వర్ణాలు (25 పాయింట్ల చొప్పున), ఒక రజతం (20 పాయింట్లు), రెండు కాంస్యాలు (15 పాయింట్ల చొప్పున) సొంతం చేసుకున్నారు. మరో కేటగిరీలో నాలుగో స్థానం (10 పాయింట్లు) లభించింది. ఓవరాల్‌గా 185 పాయింట్లతో భారత్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. 146 పాయింట్లతో జపాన్ రన్నరప్‌గా నిలువగా... 79 పాయింట్లతో కజకిస్తాన్ మూడో స్థానం పొందింది. -
నేపాల్‌లో ఘోర ప్రమాదం
కఠ్మాండు: నేపాల్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన 27 మంది చనిపోగా, మరో 16 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో రిజస్టరయిన ఈ బస్సు సెంట్రల్ నేపాల్‌లోని మార్స్‌యాంగడీ నదిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా భుసాల్ గ్రామానికి చెందిన 104 మంది యాత్రికులు మూడు బస్సుల్లో నేపాల్‌కు వచ్చారు. మొత్తం 10 రోజుల యాత్రలో పొఖారాలో రెండు రోజులు గడిపారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం మూడు బస్సుల్లో కఠ్మాండు వైపు తిరుగు పయనమ య్యారు. ఇందులో ఒక బస్సు ఉదయం 11.30 గంటల సమయంలో తనహున్ జిల్లా ఐనా పహరా వద్ద హైవేపై అదుపుతప్పి 150 మీటర్ల లోతున్న మార్స్‌యాంగడీ నదిలో పడిపోయింది. ఈ బస్సులో డ్రైవర్, హెల్పర్ సహా మొత్తం 43 మంది ఉన్నారు. పరవళ్లు తొక్కుతున్న నదిలో నుంచి 16 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులైన 11 మంది ఆస్పత్రిలో చనిపోయారు. మరో 16 మందికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బస్సు నుజ్జునుజ్జయింది. మూడు బస్సుల్లో ఉన్న వారంతా కుటుంబసభ్యులు, బంధువులేనని పోలీసులు తెలిపారు. విషయం తెల్సిన వెంటనే ఘటనా ప్రాంతానికి యూపీ ప్రభుత్వం మహారాజ్‌గంజ్ సబ్ కలెక్టర్‌ను పంపించింది. రక్షణ, సహాయక చర్యలను ఈయన సమన్వయం చేస్తారని తెలిపింది. బాధితులను సాధ్యమైనంత త్వరగా నేపాల్ నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తెలిపారు. #WATCH | Nepal: An Indian passenger bus with 40 people onboard has plunged into the Marsyangdi river in Tanahun district. The bus was en route to Kathmandu from Pokhara. Search and rescue operations underway by the Nepal Army at the incident site.(Video Source: News Agency… pic.twitter.com/txxO43O4CV— ANI (@ANI) August 23, 2024 -
భారత్‌తో సహా 34 దేశాలు.. శ్రీలంక సంచలన నిర్ణయం
సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రీలంక కూడా చేరింది.శ్రీలంక ప్రభుత్వం 2024 అక్టోబర్ 1 నుంచి ఇండియా, యూకే, అమెరికా వంటి 35 దేశాల పౌరులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. అంటే ఈ దేశ పౌరులు శ్రీలంకకు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. ఈ విషయాన్ని శ్రీలంక టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో వెల్లడించారు.భారతదేశం, యుకె, చైనా, యుఎస్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, బెలారస్, ఇరాన్, స్వీడన్, దక్షిణ కొరియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, న్యూజిలాండ్ దేశాల ప్రజలు వీసాతో పనిలేకుండానే శ్రీలంకను సందర్శించవచ్చు.శ్రీలంక ప్రభుత్వం వీసా రహిత సందర్శన అవకాశాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే అందిస్తుంది. దీనికి శ్రీలంక క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. శ్రీలంక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగానే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్ ఏదంటే..
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు గంటల కొద్దీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్‌లలో కాలం గడిపేస్తున్నారు. సోషల్ మీడియా యూజర్లకు ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. అయితే ఇందులో ఎవరి అభిరుచులు వారివనే చెప్పాలి. కొందరు ఫేస్బుక్ ఎక్కువ ఉపయోగిస్తే.. మరికొందరు ఎక్స్ ఉపయోగిస్తారు. ఇలా ఎవరికి నచ్చిన యాప్స్ వారు ఉపయోగించుకుంటున్నారు.భారతదేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు వినోదం కోసం ఎక్కువ వేటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వే (మే-జులై) వెల్లడైంది. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.►ఇన్స్టాగ్రామ్: 60.5 శాతం►ఫేస్బుక్: 52.1 శాతం►ఎక్స్ (ట్విటర్): 25.3 శాతం►జోష్: 5.7 శాతం►మోజ్: 5.7 శాతం►యూట్యూబ్: 61 శాతం►నెట్‌ఫ్లిక్స్: 40.2 శాతం►డిస్నీ ప్లస్ హాట్ స్టార్: 38.9 శాతం►ప్రైమ్ వీడియో: 37.1 శాతం►ఎంఎక్స్ ప్లేయర్: 14.9 శాతం►స్పాటిఫై: 31.8శాతం►అమెజాన్ మ్యూజిక్: 18.1 శాతం►జియో సావన్: 12.7 శాతం►గానా: 9.2 శాతం►గూగుల్ ప్లే మ్యూజిక్: 8.4 శాతం -
బంగ్లా బాధితులు కన్నీరుమున్నీరు, అండగా సోనూసూద్, వీడియో వైరల్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చి హింసాత్మకం మారిపోయింది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత తీవ్రంగా తలెత్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళ, రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. మరోవైపు పౌరులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వారిపై దాడులు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి ఒక మహిళ ఆవేదన ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీంతో తన వంతు సాయానికి ఎపుడూ ముందుండే నటుడు సోనూ సూద్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న హిందువులను భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేస్తానంటూ ఆమెకు మద్దతు ప్రకటించారు. దీంతో మరోసారి రియల్ హీరో అంటూ సోనూసూద్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.‘‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన మహిళ ఆ వీడియోలో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గామారడంతో సోనూ సూద్ స్పందించారు. ”బంగ్లాదేశ్ నుంచి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు. అంతేకాదు ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత కూడా.. జై హింద్” అంటూ ఆయన ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన హిందూవులను కాపాడటానికి దేశంలో ప్రముఖలతో పాటు ప్రతిఒక్కరు స్పందించాలని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. We should do our best to bring back all our fellow Indians from Bangladesh, so they get a good life here. This is not just the responsibility of our Government which is doing its best but also all of us.Jai Hind 🇮🇳 https://t.co/OuL550ui5H— sonu sood (@SonuSood) August 6, 2024 -
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. ఇజ్రాయిల్‌లోని భారతీయులకు అలర్ట్
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై శత్రుదేశాలు దాడికి దిగే అవకాశం కనిపిస్తోంది. హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హిజ్బుల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడు ఇజ్రాయెల్‌పై యుద్దానికి దండెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.కాగా గత మంగళవారం బీరుట్లో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. గత వారం గోలన్ హైట్స్‌లో జరిగిన ఘోరమైన రాకెట్ కాల్పులకు ప్రతిస్పందనగా ఈ చర్యకు పాల్పడినట్లు టెల్ అవీవ్ పేర్కొంది. అనంతరం హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇక హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకూర్ సైతం గత నెలలో లెబనాన్‌లో జరిగిన సమ్మెలో మరణించాడు.అయితే హమాస్, హిజ్బుల్లా నాయకుల తాజా హత్యలతో సిరియా, లెబనాన్, ఇరాక్, యెమెన్లలో ఇరాన్ మద్దతిచ్చే గ్రూప్స్‌లో ఉద్రిక్తతలను పెంచింది. దీంతో ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న భారత్ వంటి ఇతర దేశాల పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ పశ్చిమాసియా హెచ్చరించిందిఇజ్రాయెల్లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. స్థానికంగా ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో భద్రతా ప్రోటోకాల్ పాటించాలని తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేవరకు లెబనాన్‌కు వెళ్లవద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. లెబనాన్‌ను విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు సూచించింది. ఈ క్రమంలోనే ఎయిరిండియా ఇజ్రాయెల్ రాజధాని టెల్ ఆవీవ్‌కు ఆగస్ట్ 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసింది. -
Healthy Snacking Report 2024: మనోళ్లు కొంటున్నది... పోషకాలున్న స్నాక్సే!
న్యూఢిల్లీ: మార్కెట్లో స్నాక్స్ కొనేటప్పుడు ప్యాక్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా చదువుతున్నారా? అయితే ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నట్టే. ఆహారపదార్థాలు, ప్రత్యేకించి స్నాక్స్ కొనేటప్పుడు దానిలో వాడిన పదార్థాలేంటి? అందులో ఏమాత్రం పోషక విలువలున్నాయని 73శాతం మంది భారతీయులు చదువుతున్నారని హెల్తీ స్నాకింగ్ రిపోర్ట్–2024 సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 6వేల మందిపై సర్వే నిర్వహించి నివేదికను ఆది వారం విడుదల చేసింది. వీరిలో 93 శాతం మంది ఆరో గ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారని తెలిపింది. ఆహార కల్తీకి సంబంధించి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు, స్వీట్స్, ఇతర స్నాక్స్ ప్యాకెట్స్ కొనుగోలుదారులపై సర్వే నిర్వహించింది. ప్రతి 10 మందిలో 9 మంది సంప్రదాయ చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని చూస్తున్నారని తెలిపింది. డ్రైఫ్రూట్స్, నట్స్, తృణధాన్యాలతో చేసిన సహజమైన ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతు న్నారని తెలిపింది. డ్రై ఫ్రూట్స్, తామర గింజలతో చేసిన పేలాల (మఖనా)ను హెల్తీ స్నాక్‌గా గుర్తించారు. పోషకాలు అత్యధికంగా ఉన్న వీటిని కొనడానికి 67శాతం మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే వెల్లడించింది. -
భారతీయులకు శుభవార్త.. సౌదీ వెళ్లడానికి కొత్త ఎంట్రీ వీసాలు
సౌదీ అరేబియా పర్యాటకాన్ని పెంచే దిశగా భారతీయ పౌరుల కోసం కొత్త వీసా ఎంపికలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో స్టాప్ఓవర్ వీసాలు, ఈవీసాలు, వీసా ఆన్ అరైవల్ వంటివి ఉన్నాయి. 2024 చివరి నాటికి సౌదీ అరేబియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలని ఈ కొత్త వీసాలను ప్రవేశపెట్టడం జరిగింది.భారతీయులు ఇప్పుడు స్టాప్ఓవర్ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 96 గంటలు చెల్లుతుంది. ఈ వీసాను సౌదియా ఎయిర్‌లైన్ వెబ్సైట్ ద్వారా 90 రోజులు ముందుగానే పొందవచ్చు. దీనికోసం నామినల్ ఫీజు వంటివి చెల్లించాల్సి ఉంటుంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లేదా స్కెంజెన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఈవీసా పొందటానికి అర్హులు. ఈ దేశాలలో శాశ్వత నివాసితులు లేదా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన తేదీ కంటే కనీసం మూడు నెలల చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవీసా అధికారిక పోర్టల్ ద్వారా దీనిని పొందవచ్చు.ఈవీసా కోసం అవసరమైన ప్రమాణాలు ఉన్నవారు.. వీసా ఆన్ అరైవల్ కూడా పొందవచ్చు. యూఎస్, యూకే, స్కెంజెన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలు కలిగిన వారికి మాత్రమే కాకుండా ఈ దేశాలలో శాశ్వత నివాసితులకు వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. దీని కోసం సౌదీ విమానాశ్రయాల్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు లేదా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.సౌదీ అరేబియా భారతీయ పౌరుల కోసం అందిస్తున్న ఈ వీసాల కోసం.. ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్లలోని 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరిన్ని నగరాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. సౌదీ విజన్ 2030లో భాగంగా 2030నాటికి 75 లక్షల మంది ప్రయాణికులను సౌదీ అరేబియా ఆహ్వానించనుంది. -
భారతీయుల్లో సగంమంది అన్‌ఫిట్టే! 60 ఏళ్లు పైబడినవారు బెటర్!
మన దేశంలో దాదాపు సగంమంది ఫిజికల్‌గా ఫిట్‌గా లేరట. భారతీయుల్లో 50 శాతం మంది శారీర శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2022లో భారతదేశంలోని దాదాపు 50శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం, పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2022 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం పురుషుల కంటే సగటున 14శాతం ఎక్కువ. 42 శాతంగా పురుషులతో పోలిస్తే, తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57శాతంగా ఉంది.అంతేకాదు 2000 సంవత్సరంలో 22శాతం భారతీయులు శారీరంగా దృఢంగా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీపురుషులిరువురిలోనూ శారీరక శ్రమ పెరగడం గమనార్హం.కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు పైబడిన వారు) ఫిజికల్లీ అన్ ఫిట్‌గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులువెల్లడించారు. -
Kenya: భారతీయులకు అలర్ట్
న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్ ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్‌ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించింది.ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.— India in Kenya (@IndiainKenya) June 25, 2024ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్ భవనం బయట నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్‌గ్యాస్ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఏమిటీ బిల్లు..కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి. -
అందం అంటే..?
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట! భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి. భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు. చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే. భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు. నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు. – డా.ఎన్.అనంతలక్ష్మి