
భారతీయులకు శుభవార్త. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం. రూ. 7,500కే వీసా అందిస్తోంది. ఫ్రాన్స్, యుఎస్, యుకె, స్పెయిన్ కాదు, మరేంటి ఆ దేశం! ఏంటి నమ్మబుద్ధి కావడం లేదు కదా. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
వీసా దరఖాస్తు ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, కొన్నిసార్లు అదనపు ఛార్జీలు ఇవన్నీ కలిపి కొంత ఖర్చుతో కూడుకున్నదే. వీసా ఫీజు ఎంత అనేది ఆయా దేశాలను బట్టి మారుతుంది.
ప్రతి ఒక్కరూ ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ పని చేసి మంచి డబ్బు సంపాదించాలని కలలు కంటారు. అయితే, ఖరీదైన వీసాల కారణంగా, ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు, రూ.7,500 కంటే తక్కువకే వీసాను అందించడమే కాకుండా, అక్కడ ఒక ఏడాది దాకా పని చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ దేశం పేరే జర్మనీ. రొమాంటిక్ రైన్ వ్యాలీ నుండి బవేరియాలోని అద్భుత కోటలు, గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది జర్మనీ. జర్మనీ బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగాలు , అధిక జీవన నాణ్యత భారతీయులతో సహా ఈయూ యేతర నివాసితులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది.
స్వయం ఉపాధి పొందుతున్న వారికి, జర్మనీ ఫ్రీబెరుఫ్లర్ వీసా అని కూడా పిలిచే ఫ్రీలాన్స్ వీసాను అందిస్తోంది. ఇది వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా( ఫ్రీలాన్సర్లుగా) పని చేయడానికి వీలు కల్పిస్తుంది. హైక్వాలిటీ లైఫ్ గడపాలనుకునే వారికి, క్రియేటివ్ ప్రొఫెషనల్స్, పర్యాటకులకు గొప్ప అవకాశం అంటూ ఊరిస్తోంది.

ఎవరు అర్హులు
భారతదేశంలోని జర్మన్ మిషన్ల ప్రకారం, జర్మన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18 కింద ఈ క్రింది వర్గాల ఫ్రీలాన్స్ వీసాలు పొందే అర్హత వీరికి ఉంది.
ఇండిపెండెంట్ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు
కళాకారులు, ఉపాధ్యాయులు , విద్యావేత్తలు
న్యాయవాదులు, నోటరీలు
పేటెంట్ ఏజెంట్లు
సర్వేయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు
పశువైద్యులు
వాణిజ్య రసాయన శాస్త్రవేత్తలు
అకౌంటెంట్లు, పన్ను సలహాదారులు
కన్సల్టింగ్ ఆర్థికవేత్తలు, స్వార్న్ అకౌంటెంట్లు, పన్ను ఏజెంట్లు
దంతవైద్యులు, వైద్యేతర నిపుణులు, ఫిజియోథెరపిస్టులు
జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు
అనువాదకులు, పైలట్లు , ఇతర సారూప్య వృత్తులు.
ఫ్రీలాన్స్ వీసా అంటే ఏంటి? అర్హతలు,
పైన పేర్కొన్న వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్న వారు ఫ్రీలాన్స్ వీసాను వినియోగించుకోవచ్చ. వీసా కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ పని రుజువు , అర్హత రుజువుతో సహా కొన్ని అవసరాలను తీర్చాలి. వీసా కోసం చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా కూడా అవసరం.
అదనంగా, దరఖాస్తుదారులు జర్మనీ లేదా యూరప్‌లోని వారి సంబంధిత వృత్తిపరమైన రంగంలో వ్యాపార పరిచయాల ఉన్నవారి వివరాలను, వారి ఫ్రీలాన్స్ జాబ్ వివరాలపై సమగ్ర సమాచార మివ్వాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన పత్రాలు
ఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (6 నెలల కంటే పాతవి కానివి), ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ వర్క్, అర్హత రుజువుతో సహా అనేక దృవీకరణ పత్రాలను సమర్పించాలి. జర్మనీలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థ లేదా ఇతక సంస్థనుంచి డిగ్రీ చదివి ఉండాలి.. 75 యూరోలు లేదా రూ. 7,486 వీసా రుసుము, సుమారుగా. 45 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు, పెన్షన్ లేదా యాజమాన్యంలోని ఆస్తులతో సహా అదనపు పదవీ విరమణ ప్రయోజనాల ధృవపత్రాలు అవసరం.
జర్మన్ ఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు ప్రక్రియలో సాధారణంగా జర్మనీలోకి ప్రవేశించే ముందు స్వదేశం నుండి నేషనల్ డి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. జర్మన్ ఎంబసీ లేదా కాన్సులేట్‌తో అపాయింట్‌మెంట్ తీసుకొని, అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీసా మంజూరైన తరువాత జర్మనీకి వెళ్లిన తరువాత రెండు వారాలలోపు వారి చిరునామాను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత, వారు ఫ్రీలాన్సర్‌గా లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక విదేశీయుల కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది
నివాస అనుమతి
ఫ్రీలాన్స్ వీసా సాధారణంగా ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు చెల్లుతుంది. ఆ తరువాత సంబంధిత నియమాలకు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారి వీసా రెన్యూల్ అవుతుంది. జర్మనీలో వరుసగా ఐదేళ్ల నివాసం తరువాత వారి ఫ్రీలాన్సర్ భాషా ప్రావీణ్యం, ఆర్థిక పరిస్థితి అక్కడి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే శాశ్వత నివాసం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్లు స్థానిక పన్ను కార్యాలయంలో నమోదు చేసుకుని పన్ను నంబర్‌ను పొందాలి.
ఫ్రీలాన్స్ వీసా ప్రయోజనాలు
ఫ్రీలాన్స్ వీసా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు జర్మనీలో స్వతంత్రంగా పనిచేసే అవకాశం, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగానికి ప్రాప్యత మరియు అధిక నాణ్యత గల జీవనంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్రీలాన్స్ వీసాతో, వ్యక్తులు తమ వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని తద్వారా జర్మన్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడవచ్చు. అన్నీ సవ్యంగా ఉండి, అక్కడి భాషలో ప్రావీణ్యం సంపాదించి, ఆర్థిక పరిస్థితులు ప్రమాణాల కనుగుణంగా వుంటే ఫ్రీలాన్స్ వీసా శాశ్వత నివాసానికి ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది, ఇది జర్మనీలో దీర్ఘకాలికంగా స్థిరపడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు.