గల్ఫ్‌ దేశాల నుంచి 52 వేల మంది తరలింపు | Over 52 thousand Indians brought back home from Gulf countries since outbreak of war | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాల నుంచి 52 వేల మంది తరలింపు

Mar 9 2026 5:44 AM | Updated on Mar 9 2026 5:44 AM

Over 52 thousand Indians brought back home from Gulf countries since outbreak of war

గల్ఫ్‌ దేశాల నుంచి 52 వేల మంది తరలింపు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి 52 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పర్యాటకులుగా వెళ్లిన వీరంతా ఆయా దేశాల్లో చిక్కుకున్నారని తెలిపింది. మరింత మందిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామంది. పశి్చమాసియా దేశాల్లో ఉంటున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. 

పశ్చిమాసియా దేశాల్లో పాక్షికంగా గగనతలాలను తెరవడంతో దేశీయ, విదేశీ విమానయాన సంస్థలు నడిపే కమర్షియల్, నాన్‌ షెడ్యూల్డ్‌ విమానాల ద్వారా మన వాళ్లను తరలిస్తున్నామంది. మార్చి 1–7వ తేదీల మధ్య 52 వేల మందిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు కేంద్రం వివరించింది. వీరిలో 32,107 మంది దేశీయ విమానయాన సంస్థలు తీసుకు వచ్చాయని పేర్కొంది. కమర్షియల్‌ విమానాల అందుబాటుకు సంబంధించిన సూచనలు, సలహాలను దగ్గర్లోని భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లల నుంచి తెలుసుకోవచ్చంది. 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్ల ద్వారా కూడా సంప్రదించవచ్చని కేంద్రం వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement