యుద్ధ కల్లోలం.. విమానాశ్రయాలపై దాడులు | Iranian drone attack on Dubai International airport | Sakshi
Sakshi News home page

యుద్ధ కల్లోలం.. విమానాశ్రయాలపై దాడులు

Mar 8 2026 5:41 AM | Updated on Mar 8 2026 6:05 AM

Iranian drone attack on Dubai International airport

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు సంభవించి.. కమ్ముకున్న మంటలు, పొగ

మంటల్లో టెహ్రాన్‌ విమానాశ్రయం 

16 విమానాలు ధ్వంసం: ఇజ్రాయెల్‌ 

దుబాయ్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ దాడులు 

ఇరాక్‌లో సైనిక విమానాశ్రయంపై కూడా 

మీపై దాడులు చేసినందుకు క్షమించండి 

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ అధ్యక్షుని విజ్ఞప్తి 

ఇది ఇరాన్‌ ఓటమి ప్రకటనే: ట్రంప్‌ 

హార్మూజ్‌ వద్ద మీకోసం వెయిటింగ్‌ 

అమెరికా సేనలను కవ్వించిన ఐఆర్‌జీసీ 

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం 

నబిషిట్‌ వద్ద 47 మంది దుర్మరణం

దుబాయ్‌: పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం నానాటికీ పెరుగుతూనే ఉంది. శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా కనీవినీ ఎరగని స్థాయిలో దాడులకు దిగాయి. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారీగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడ్డాయి. దాంతో విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఇరాన్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ విభాగానికి చెందిన 16 విమానాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. హెజ్బొల్లా తదితర గ్రూపుల నుంచి ఆయుధాలు, నిధుల సేకరణకు ఆ విమానాలను ఇరాన్‌ వినియోగిస్తోందని ఆరోపించింది.

విమానాశ్రయ సమీపంలోని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండ్‌ సెంటర్‌ కూడా దాడుల్లో ధ్వంసమైంది. ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రంపైనా బాంబుల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఇరాన్‌వ్యాప్తంగా 400కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. వారం రోజుల్లో ఇరాన్‌లో 3,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా వెల్లడించింది. వాటిలో కీలకమైన కమాండ్‌ సెంటర్లు, సైనిక ప్రధాన కార్యాలయాలు, క్షిపణి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వంటివి ఉన్నట్టు పేర్కొంది.

ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,332కు పెరిగినట్టు ఐరాసలో ఆ దేశంలో రాయబారి ఆమిర్‌ సయీద్‌ ఇరవనీ తెలిపారు. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపై తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. దుబాయ్‌ విమానాశ్రయంపై మరోసారి డ్రోన్‌ దాడి చేసింది. దాంతో రన్‌వేకు అతి సమీపంలో పలుచోట్ల పొగ భారీగా పైకెగసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. బాంబు సైరన్లు మోగడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోని ట్రెయిన్‌ టన్నెళ్లలోకి పరుగులు తీశారు. విమానాశ్రయం నుంచి విమాన సరీ్వసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.

దుబాయ్‌వ్యాప్తంగా పలుచోట్ల భారీ పేలుళ్లు విని్పంచాయి. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోనూ ఓ సైనిక విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి జరిగింది. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తూర్పు ప్రాంత నగరమైన నబిషిట్, పరిసరాల్లో కనీసం 47 మంది వాటికి బలయ్యారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ పేర్కొంది. 40 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 300 దాటినట్టు వెల్లడించింది. హెజ్బొల్లా దాడుల్లో తమ సైనికులు ఐదుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్లో ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. 

ఆ దేశాలపై దాడులు చేయబోం: పెజెష్కియాన్‌ 
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులను ఎదుర్కొనే క్రమంలో గల్ఫ్‌ దేశాలపైనా దాడులకు దిగినందుకు వాటికి ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ క్షమాపణలు తెలిపారు. తమకసలు వాటిపై దండెత్తే ఉద్దేశమే లేదన్నారు. ‘‘ఆ దేశాల నుంచి తమపై దాడులు జరిగితే తప్ప ఇకనుంచి వాటిపై దాడికి దిగబోం. మా నాయకత్వ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసినట్టుగా ఆ దేశానికి లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌ తమ మతిలేని దాడులను పూర్తిగా నిలిపేసేదాకా వాటిని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తూనే ఉంటామని ప్రకటించారు. కానీ ట్రంప్‌ మాత్రం ఇరాన్‌ ఇప్పటికే పూర్తిగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.

పెజెష్కియాన్‌ ప్రకటనే అందుకు నిదర్శనమన్నారు. ‘‘పశ్చిమాసియాను పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలని ప్రయతి్నంచిన ఇరాన్‌ ఇప్పుడు తానే అతి పెద్ద ఓటమి పాలైంది. మా దాడుల తీవ్రత వల్లే గల్ఫ్‌ దేశాలకు క్షమాపణలు చెప్పింది. తద్వారా వాటికి లొంగిపోయింది. ఇరాన్‌ తోటి గల్ఫ్‌ దేశాల చేతుల్లో ఓడటం వేల ఏళ్లలో ఇదే తొలిసారి.

ఇందుకు పశ్చిమాసియా దేశాలన్నీ నాకు ధన్యవాదాలు తెలిపాయి’’అన్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని పశ్చిమాసియాకే గాక ప్రపంచమంతటికీ అమెరికా చేసిన గొప్ప మేలుగా ట్రంప్‌ అభివరి్ణంచడం విశేషం. ఇరాన్‌కు చెందిన 42 యుద్ధ నౌకలను మూడు రోజుల్లోనే ధ్వంసం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆ దేశ ఎయిర్‌ డిఫెన్స్‌తో పాటు సమాచర వ్యవస్థలను పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తాము దాడులు చేయకపోతే ఇరాన్‌ అతి త్వరలో అణుపాటవం సంతరించుకునేదని తెలిపారు. 

సైన్యంపై అదుపు తప్పిందా? 
పెజెష్కియాన్‌ ప్రకటన తుంగలోకి ఇరాన్‌ సైన్యంపై ప్రభుత్వానికి పట్టు తప్పిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయబోమని అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగడం గమనార్హం! బాలిస్టిక్‌ క్షిపణులను నియంత్రించే పారామిలిటరీ విభాగమైన రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అధ్యక్షుని ప్రకటనతో నిమిత్తం లేకుండా గల్ఫ్‌ దేశాలపై క్షిపణి, డ్రోన్‌ దాడులు నిరి్నరోధంగా కొనసాగాయని చెబుతున్నారు. ఈ గందరగోళానికి తెర పడాలంటే సుప్రీం నేతను ఎన్నిక ప్రక్రియను తక్షణం పూర్తి చేయాల్సిందేనని ‘అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’కు ప్రముఖ మత పెద్ద అయతొల్లా నాసర్‌ మకరం షిరాజీ విజ్ఞప్తి చేశారు.  

లెబనాన్‌లో... 
ఇజ్రాయెల్‌ దాడులతో లెబనాన్‌ దద్దరిల్లింది. నబిషిట్‌ వద్ద నరమేధానికి తోడు జౌతార్‌ అల్‌ షర్కియా, అరబ్‌ సలీం, జిబ్‌చిట్‌ తదితర ప్రాంతాలపైనా క్షిపణి, బాంబు దాడులు కొనసాగాయి. అక్కడ ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు కనీసం ఆరుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం.

..అయినా గల్ఫ్‌పై దాడులు 
గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్‌ అధ్యక్షుడు ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగింది! దుబాయ్‌ విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి జరిగింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ కూడా దాడులకు గురయ్యాయి. దోహాలోనూ పేలుళ్లు విని్పంచాయి. కనీసం 86 క్షిపణులు, 148 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు బహ్రెయిన్‌ ప్రకటించింది. హార్మూజ్‌ జలసంధి గుండా సాగే నౌకలకు భద్రత కలి్పస్తామన్న అమెరికా ప్రకటనను ఇరాన్‌ సైనిక విభాగమైన రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ఎద్దేవా చేసింది.

‘అక్కడ అమెరికా సేనలను ఎదుర్కొందుకు మేం వెయిటింగ్‌’అంటూ అగ్ర రాజ్యాన్ని కవ్వించింది. వాటిని ఎక్కడికక్కడ తొక్కిపారేస్తామని ఇరాన్‌ సైన్యం కూడా ఒక ప్రకటనలో హెచ్చరించింది. ‘‘ఇజ్రాయెల్‌తో పాటు అబుదాబి, కువైట్‌ సహా గల్ఫ్‌వ్యాప్తంగా అమెరికా స్థావరాలపైనా మా నావికా దళం భారీగా లక్షిత దాడులు చేసింది. తద్వారా మా యుద్ధ నౌకను ముంచేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం’’అని ప్రకటించింది. ఇరాక్‌లోని కుర్దిస్తాన్‌ ప్రాంతంలో కుర్దు వేర్పాటువాదుల స్థావరాలపైనా దాడులు చేసినట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌ దాడుల తీవ్రత కొనసాగింది. జెరూసలేం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. టెల్‌ అవీవ్‌లో కూడా రోజంతా బాంబుల శబ్దాలు విన్పిస్తూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement