
వాషింగ్టన్: ఉపాది ఆధారిత(ఈబీ) కేటగిరీలో తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ గ్రీన్‌కార్డ్‌దారులకు అమెరికా ప్రభుత్వం స్వల్ప ఊరట అందించింది. తమ జీవితభాగస్వామి, 21 ఏళ్ల వయసులోపు సంతానానికి సైతం గ్రీన్‌కార్డ్ రావాలని ఆశించే భారతీయ గ్రీన్‌కార్డుదారులు సమరి్పంచే దరఖాస్తులకు పరిశీలన గడువును పొడిగించారు. సాధారణంగా ఏప్రిల్ ఒకటో తేదీలోపు తేదీని కటాఫ్ తేదీగా పరిగణిస్తారు.
కానీ ఈసారి జూన్ ఒకటోతేదీని కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. గడువు పొడిగించిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైనాసరే అర్హత గల భారతీయ గ్రీన్‌కార్డ్‌దారులు తమ కుటుంబసభ్యుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. ఉపాధి ఆధారిత(ఈబీ) కేటగిరీ కింద వచ్చే భారతీయ దరఖాస్తులను ఈబీ–2, ఈబీ–3 దరఖాస్తులుగా వ్యవహరిస్తారు. జీవితభాగస్వామి, 21ఏళ్లలోపు పెళ్లికాని తమ సంతానం కోసం ఎఫ్2ఏ కేటగిరీ కింద భారతీయులు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు గడువు తేదీ ఏప్రిల్ ఒకటో తేదీనే ముగుస్తున్నప్పటికీ భారతీయ గ్రీన్‌కార్డ్‌దారులకు మాత్రం జూన్ ఒకటో తేదీదాకా అనుమతిస్తున్నట్లు ‘యూఎస్ వీసా బులెటిన్, సెప్టెంబర్–2025’పేర్కొంది. 2025 ఏడాదికిగాను కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డ్‌లను 2,26,000కు పరిమితం చేశారు. ఉపాధి ఆధారిత(ఈబీ) కేటగిరీలో గ్రీన్‌కార్డ్‌లకు సైతం 1,50,037గా పరిమితి విధించారు. ఇక వీసాల విషయానికొస్తే మొత్తం వీసాల్లో ప్రతిదేశం తమ కోటా కింద 7 శాతం వరకు అంటే దాదాపు 26,323 వరకు వీసాలు పొందొచ్చు.
డిపెండెంట్ వీసా అనేది ప్రతీదేశానికి గరిష్టంగా 2 శాతమే ఇస్తారు. చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ తరహాలో భారత్‌కు సైతం దేశాలవారీ కోటా కిందే వీసాలు దక్కుతున్నాయి. మరోవైపు సెపె్టంబర్ 30వ తేదీలోపు డైవర్సిటీ ఇమిగ్రేషన్ వీసా కోసం దరఖాస్తుచేసుకోవాలని వీసా బులెటిన్‌లో అమెరికా ప్రభుత్వం పేర్కొంది. లాటరీ విధానంలో ప్రతిఏటా 55,000 మందికి ఈ వీసాలను అందజేస్తారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్, నైజీరియాసహా 20 దేశాలకు చెందిన వారికి మాత్రమే ఈ వీసా ఇస్తారు.