ఆయుష్మాన్ స్కాలర్‌షిప్ 2.0..! | 11 talented and deserving children born through advanced fertility treatments | Sakshi
Sakshi News home page

ఆయుష్మాన్ స్కాలర్‌షిప్ 2.0..!

Nov 16 2025 1:32 PM | Updated on Nov 16 2025 1:38 PM

11 talented and deserving children born through advanced fertility treatments

భారతదేశంలోని ఫర్టిలిటి కేర్ అందించే అగ్రగామి సంస్థలలో ఒకటైన ఒయాసిస్ ఫెర్టిలిటీ, 16 సంవత్సరాల విశ్వసనీయతతో, అధునాతన సంతానోత్పత్తి చికిత్సల ద్వారా జన్మించిన 11 మంది ప్రతిభావంతులైన పిల్లలకు ఒయాసిస్ ఆయుష్మాన్ స్కాలర్‌షిప్‌లను అందించి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ హయత్ ప్లేస్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విద్యా రంగం, కళలు, సంస్కృతి, క్రీడలు  ఆవిష్కరణలు/అసాధారణ విజయం అనే నాలుగు విభాగాల్లో ఈ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఒబ్స్టెట్రిక్స్  గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎల్. జయంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పట్ల యువ విజేతల నిబద్ధతను ప్రశంసించారు.

హైదరాబాద్‌లోని ఒబ్స్టెట్రిక్స్  గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎల్. జయంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, "వంధ్యత్వం రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సమస్య అన్నారు. దంపతులు ఎదుర్కొనే భావోద్వేగపరమైన  వైద్య సమస్యలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. బలమైన వైద్య ప్రమాణాలతో, రోగి-కేంద్రీకృత సంరక్షణను అందించే ఒయాసిస్ ఫెర్టిలిటీ వంటి సంస్థలు అలాంటి దంపతుల పాలిట వరం,గొప్ప భరోసా ఇస్తుందని జయంత్‌ రెడ్డి అన్నారు.

వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా... IVF ఇతర అధునాతన సంతాన సాఫల్యత చికిత్సల ద్వారా జన్మించిన పిల్లల ప్రతిభను, దృఢ సంకల్పాన్ని గౌరవిస్తూ వారికి ఒయాసిస్ ఆయుష్మాన్ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఆ పిల్లల ప్రతిభను సత్కరించింది, అదే సమయంలో సైన్స్ వ్యత్యాసాలను కాదు... అవకాశాలను సృష్టిస్తుందని సమాజానికి చాటింది. గత 16 సంవత్సరాలుగా ఒయాసిస్ ఫెర్టిలిటీ వేలాది మంది దంపతుల తల్లిదండ్రులవ్వాలనే కలను నిజం చేయడంలో సహాయపడింది. 

సంతాన సాఫల్యత చికిత్సలో నిరంతరం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. CAPA–IVM (ఇన్ విట్రో మెచ్యూరేషన్) మరియు అడ్వాన్స్‌డ్ జెనెటిక్ టెస్టింగ్ (PGT-A) వంటి మార్గదర్శక ఆవిష్కరణలకు పేరుగాంచిన ఈ సంస్థ... దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ సంతాన సాఫల్య చికిత్సను అందుబాటులో ఉంచేందుకు, విలువలతో కూడిన చికిత్స అందించేలా వ్యక్తిగతీకరించేందుకు కృషి చేస్తూనే ఉంది.

(చదవండి: డిజిటల్‌ ప్రేమలు... డిస్కనెక్టెడ్‌ మనసులు...)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement