కొత్త ఏడాది సంబరాల వేళ విషాదం, ప్రేమికురాలి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడు ఆకాష్ మోసం చేశాడంటూ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రికార్డు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
హాత్రాస్‌లోని ఆవాస్ వికాస్ కాలనీలో నివసించే కామిని శర్మ, ప్రియుడు ఆకాష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేను ఎపుడూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. కానీ నాకు చావు మరో ఆప్షన్ మిగలకుండా చేశావ్. బలహీను రాల్నిచేసి ఆడుకున్నావ్...ఎవరి జీవితంతో ఆడుకోవడ్డం మీ ఇంట్లో వాళ్లు ఎపుడూ చెప్పలేదా.. కానీ మానవత్వం అనేది బతికి ఉంటే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది. ఎందుకంటే నేను ఎవర్నీ మోసం చేయలేదు.. నిన్ను చాలా ప్రేమించాను’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. అంతేకాదు అమ్మా నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ తల్లివి. నా సూసైడ్‌కి బిహార్ వాలా ఆకాష్ కారణం అని తన వీడియోలో పేర్కొంది. అలాగే తన అత్తకు కూడా క్షమాపణలు చెప్పింది. నీలాంటి అత్త యూనివర్స్‌లో ఎక్కడా దొరకదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.
Tragic incident in Hathras, UP: Girl records emotional video blaming her Ex-Boyfriend Aakash for forcing her ("You've forced me so much... I AM SORRY MUMMA. You are the BEST Mumma..."), then d!es by suicide. Heartbreaking. 💔
pic.twitter.com/7f29omeO3i— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2025
కామినీ సోమవారం మధ్యాహ్నం విషం సేవించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంత్యక్రియల తర్వాత, కుటుంబ సభ్యులకు కామిని వీడియో గురించి తెలిసింది. దీంతో కామిని తల్లి రష్మి శర్మ కొత్వాలి సదర్‌లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణానికి కారణమైన తన కుమార్తె ప్రియుడు ఆకాష్‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..!


