‘పాకిస్తాన్‌ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’ | Its Jay Shah vs Pakistan Match Congress MP Sukhjinder Singh | Sakshi
Sakshi News home page

‘పాకిస్తాన్‌ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’

Feb 15 2026 7:07 PM | Updated on Feb 15 2026 7:07 PM

Its Jay Shah vs Pakistan Match Congress MP Sukhjinder Singh

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని  ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్‌ ఎంపీ సుఖిందర్‌ సింగ్‌  రంధావా. పాకిస్తాన్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటూ అభివర్ణించారు. ఇది భారత్‌-పాకిస్తాన్‌ల మ్యాచ్‌ కాదని,  కేవలం జై షా-పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ మాత్రమేనన్నారు. యావత్‌ భారతావని.. పాకిస్తాన్‌తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. 

‘ పాకిస్తాన్‌ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్‌ దుశ్చర్యలు బాగా తెలుసని  ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఇది భారతావని కోరుకునే మ్యాచ్‌ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్‌తో మ్యాచ్‌ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్‌గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్‌ జరుగుతుంది. భారత్‌కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement