బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేస్తున్నారు: కేటీఆర్ | KTR made harsh comments against Congress | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేస్తున్నారు: కేటీఆర్

Feb 15 2026 2:20 PM | Updated on Feb 15 2026 3:27 PM

KTR made harsh comments against Congress

సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్  వచ్చిన ప్రతిచోటా  కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్. సీపీఐ అలయెన్స్‌లో ఉన్నాయని  సింగరేణిలో కొన్నిచోట్ల  బీజేపీ, సీపీఐ సైతం  కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికే కొన్నిచోట్ల సీపీఐకి మద్ధతిచ్చామన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement